Friday, October 12, 2018
నిత్యమూ అవిరళమూ
Wednesday, October 10, 2018
దసరా
dasara
దసరా శరన్నవ రాత్రులు అప్పుడు రావణ దహనం చేస్తారు. రాముడి వేషం కట్టిన వ్యక్తి ఒక అగ్ని బాణం వేసి రావణాసురుడి బొమ్మను కాలుస్తారు. ఈ ఆనవాయితీ ఎప్పటి నుంచి వస్తున్నది. బహుశ త్రేతా యుగం తరవాత నుంచి అనవచ్చు. మరి దసరా అమ్మవారికి ఎందుకు పూజలు చేస్తారు. అమ్మవారు రాక్షసులను చంపింది మరియు రాముడు రావణుని చంపింది ఒకే సమయమా??? కాని ఇక్కడ కొంచం అర్ధం చేసుకోవలసిన విషయం ఒకటి ఉంది. ఒక సారి రావణాసురుడిని తగల బెట్టేశాక మళ్ళి మళ్ళి పై ఏటికి ఇంకా పెద్ద రావణ బొమ్మలు ఎందుకు చేస్తున్నారో ఆలోచించాలి. అంటే రావణాసురుడు చావలేదు. ఏ ఏటికి ఆ ఏడు పెరుగుతూ నే ఉన్నాడు. ఇందులో గుహ్య రహస్యం ఒకటి ఉంది. అదేమిటంటే పదితలల రావణుడు ఎవరు? తల అంటే మతం. పది తలలు అంటే పది మతాలు. ఒకే ఒక మతం పై నడిస్తే రామ రాజ్యం . రాముడికి ఒకే ముఖం. ఒకే మతం ఒకే మాట ఒకే భార్య. అందుకే రామ రాజ్యం అంటే సుఖానికి మారు పేరు. రావణ రాజ్యం అంటే అనేక మతాలు అనేక రాజ్యాలు అనేక భాషలు అనేకం లో సుఖం లేదు. ఇప్పుడు లోకమంతా దుఖమే ఉంది. ఇది దుఃఖ ప్రపంచం.రావణాసురుడి పది ముఖాలు అంటే మానవులలో పది వికారాలు. పురుషులలో 5, స్త్రీలలో 5 కలిసి 10. కామం క్రోధం, లోభం, మొహం, అహంకారం. ఈ పది వికారాలు లేని మనుషులు ఇప్పుడు లేరు. అందరూ రావణులే. పెర్సేంటేజ్ లో అందరిలోనూ ఈ వికారాలు ఉన్నాయి. ఇప్పుడు రావణ రాజ్యం ఉంది, కాదు అని ఎవరూ అనలేరు.
నిరాకార రాముడు మరియు సాకార రాముడు.:- పరమపిత పరమాత్మ నిరాకార రాముడు(ఈయన పేరే శివుడు ఆత్మా రాముడు అని అంటారు, ఈయన జనన మరణ చక్రం లో రారు.). ఈ సృష్టి ఒక నాటకం అంటారు. ఈ నాటకం లో హీరో సాకార రాముడు. ఈ మనుషులలో హీరో పాత్ర ధారి అయిన సాకార రాముడి లో ఆ శివుడు ప్రవేశించి మనచే మాయ రావణాసురుడితో యుద్ధం చేయిస్తున్నారు. (ఈ సాకార రాముడికి జన్మ మరణం చుబించారు). ఎవరో వేరే వారితో యుద్ధం కాదు. మనలోనే ఉన్న కామాది వికారాలతో యుద్ధం. దీనిని ఒక రూపకం లో కధలాగా చెప్పుకుంటున్నాము. నిజానికి కధ చెప్పుకుని ఆనందించి అది సినిమా ఐపోయాక ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్లి పోయినట్లు ఎదో ఒక రోజు దసరా చేసేసుకుని మళ్ళి మన మన వ్యవహారాల్లో మునిగి పోవడం కాదు. అందుకే దాని వల్ల ఏమి లాభం లేకుండా పోతున్నది. కేవలం ఖర్చు తప్పితే ఒరిగేది ఏమీ లేదు. చేయ వలసినది మనలోని రావణ సంహారం.
సాకార రాముడే హనుమంతుడు:- కోతులను సేనగా చెప్పారు. కోతులు అంటే కోతి బుధి ఇప్పుడు ప్రతివారి బుద్ధీ కోతి బుద్దే అయి ఉంది. కోతులకు రాజు మహా కోతి -హనుమంతుడు. ఎవరైతే తమ మాన్ అనగా దురభిమానాన్ని హననం చేసారో వారే హనుమంతుడు. ప్రస్తుతం మన హీరో సామాన్యుని వలె మనలాగే ఉన్నారు, కోతి బుద్ధి తో కాని ఆయన స్వభావంతో ఎవరికీ చిక్కరు. అడవిలో /వనం లో పెద్ద కోతి ఎవరికీ సులభంగా పట్టు బడదు. అలాగే ప్రస్తుతం ఈ లోకం ఒక పెద్ద అడివి అందులో మనం అంతా కోతులలా ఉన్నాం. మన కోతులలో పెద్ద కోతి ఈయనను కూడా ఎవరూ కంట్రోల్ చేయలేరు. అయన అందరి అహంకారం తొలగించి పిదప తన అహంకారం వదిలిపెడతారు. ఈ హనుమంతుడు రామ భక్తుడు, ఏ రామ భక్తుడు . ఆ నిరాకార రాముని భక్తుడు. ఆ నిరాకార రాముడు (శివుడు) ఈయన ఎప్పుడు ఈ లో కం లో వస్తారంటే కలియుగ అంతం లో అనగా ప్రస్తుత సమయం లో వస్తారు. ఎందుకు వస్తారు ప్రతివారి లోని రావణాసురుడిని సంహరించడానికి. ప్రతివారిలో రావణుడు చనిపోతే మిగిలేది ఎవరు వారిలోని దైవత్వం. కోతులలో పెద్ద కోతి హనుమంతుడు ఎవరి భక్తుడు? ఈ నిరాకార రాముని భక్తుడు. మొదటి నంబర్ లో ఈయన తన రాముడిని ధ్యానిస్తూ తనలోని రావణుని సంహరిస్తాడు. కనుక ఇక్కడ ధర్మ సుక్ష్మం ఏమిటంటే నిరాకార రాముడికి తనకంటూ శరీరం లేదు. జనన మరణ చక్రం లో రారు. కనుక దేహం లేదు. విదేహి.
కానీ విదేహి ఎలా మనతో మాట్లాడాలి. ఆయనకు ముఖం కావాలి మాట్లాడడానికి కనుక మనుషులకు హీరో సాకార రాముని శరీరం లో ప్రవేశించి ఇతని ముఖం ద్వారా మనకు డైరెక్షన్ ఇస్తారు. డైరెక్టర్ తెర వెనక ఉన్నట్లు ఈ యన హీరో శరీరం లో ఉండి మనకు డైరెక్షన్ ఇస్తారు. హీరో ను మొదట మారుస్తారు. హీరో తనలోని వికారాలను హననం చేసి పిదప మిగతా అందరికి గురువై అందరికి రావణుని హననం చేయడంలో సహకరిస్తారు. అందుకే అయన మనందరికీ రాజు.
శివ శక్తులు.:- ఒకరే రాముడు. సాకార్+ నిరాకార్ మిగతా అన్దరూ సీతలే. సీత అనండి శివ శక్తి అనండి. వీరు తమలోని కామ క్రోధ లోభ మోహ అహంకారాలు అనే అసురులను సంహరిస్తారు దీని గుర్తుగానే దసరాల్లో శక్తి పూజ జరుగుతుంది.https://www.youtube.com/watch?v=kpiG85UBtHs
Featured Post
ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్.
ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్. ఒక సంక్షిప్త పరిచయం ఇక్కడ కింద తేదీలు పుట సంఖ్యలు ఇచ్చినవి గురువు గారి ప్రవచనా...
-
గీతా గర్భంలో ధార్మిక రాజనైతిక , సామాజిక మరియు వ్యక్తిగత జీవన సమాధానాలు నిక్షిప్తమై ఉన్నాయి. మనుష్య వ్యాఖ్యలు సముద్ర మంధనం లో...
-
Select language Hindi English Home Bhagavad Gita Course Hindi Section English Section About us FAQ Latest Financial source The act...
-
సంస్కృత పాఠం - 11 ఏక వచనం బహు వచనం ఏతే నమంతి - వీరు నమస్...