జపాను గల గల గంట

Tuesday, July 26, 2016

How to Crochet a Puff Stitch Flower

DROPS Crochet Tutorial: How to crochet beads into work

పాహి పాహి పరమేశ్వర
Photoచిన్నారి క్రిష్ణయ్య బాల గణేశునితో కలిసి శ్రావణంలో శివయ్య ను కొలవడానికి వెళ్తున్నారు. శివారాధన శాంతి దాయకం సర్వ ప్రాప్తి దాయకం. జయ జయ మహాదేవా శంభో సదాశివా ఆశ్రిత మందారా శుచి శిఖర సంచారా......
నీలకంధరా దేవా దీన బాంధవా రావా నన్ను గావరా.......


సంస్కృత పాఠం -10


మహానదీ ప్రతరణం, మహాపురుష నిగ్రహం,
మహాజన విరోధం చ, దూరతః పరివర్జయేత్.
మహా ప్రవాహములను నిరాధారుడై దాట ప్రయత్నించ రాదు, మహాపురుషులను అదుపు చేయరాదు
మహాత్ములతో విరోధము పూనరాదు. ఇవి వినాశకరములు సుమా.

ఏక వచనం                                                            
సుతా హసతి - కుమార్తె నవ్వుచున్నది.                          
రమా గాయతి - రమ పాడుచున్నది.                        
బాలా లిఖతి - బాలిక వ్రాయుచున్నది.
గంగా వహతి - గంగ ప్రవహించుచున్నది.
సీతా పిబతి - సీత త్రాగుచున్నది.
అజా చరతి - ఆడమేక మేస్తున్నది.
సన్ధ్యా భవతి - సంధ్యవేళ అవుతున్నది.
సా నయతి - ఆమె తీసుకు పోతున్నది.
ఇయమ్ ఇచ్ఛతి - ఈమె కోరుచున్నది.
పుష్పం వికసతి - పుష్పం వికసిస్తున్నది.
ఫలం పతతి - పండు పడుచున్నది.
నయనం స్ఫురతి - కన్ను అదురుచున్నది.
మిత్రం యచ్ఛతి - మిత్రుడు ఇస్తున్నాడు.
జలం స్రవతి - నీరు కారుతున్నది.
తత్ పతతి - అది పడుతున్నది.
 బహువచనంః------------------------
చిత్రకారాః లిఖంతి --- చిత్రకారులు చిత్రిస్తున్నారు
భారవాహాః వహంతి ---- కూలీలు మోస్తున్నారు
చోరాః ధావన్తి --- దొంగలు పరుగెత్తు తున్నారు.
మూర్ఖాః నిన్దన్తి -- మూర్ఖులు నిన్దిస్తున్నారు.
రజకాః క్షాళయన్తి -- చాకలివారు ఉతుకుతున్నారు.
తక్షకాః తక్షన్తి -- వడ్రంగులు చెక్కుతున్నారు.
గాయకాః గాయన్తి -- గాయకులు పాడుతున్నారు.
నటాః నృత్యన్తి -- నటులు నృత్యం చేస్తున్నారు.
పాచకాః పచన్తి -- వంటవారు వండుతున్నారు.    ..........................ఇంకా ఉంది.........

Sunday, July 24, 2016

సంస్కృతం వదతు - 9

పాఠకులకు సూచన .... ఇంకా ఇంకా తెలుసుకోగోరిన వారు పత్రాలయ ద్వారా సంస్కృతం అని సంస్కృత పాఠాలు నేర్పబడతాయి. సులభంగా రోజువారీ సంభాషణలు నేర్చుకోవచ్చు ప్రతులకు
23-23-30                                        లేదా                     4-2-72,
శివరావు వీధి                                                                బడీచౌడీ,
సత్యనారాయణపురం                                                    సుల్తాన్ బజార్
విజయవాడ 520 011                                                   హైదరాబాద్---500 195
ఫో. 0866 2534345                                                     ఫో. 040 24750111
కానీ సంప్రదించవచ్చు........
సంస్కృతభారతి వారి సౌజన్యం......

ఆర్యా మహాదేవి - పార్వతీ దేవి.
బంధు వర్గం  --- ఇంతకు మునుపు కొన్ని సంబంధాలు చూచాము అవి + మరి కొన్ని
అగ్రజః -- అన్న
అగ్రజా -- అక్క
అపత్యం -- సంతానం
అవరజః -- తమ్ముడు
అవరజా -- చెల్లెలు
జామాతా -- అల్లుడు
తనయః -- కుమారుడు
దుహితా -- కుమార్తె
దేవరః -- మరిది
దౌహిత్రః -- కూతురు కొడుకు
దౌహిత్రీ -- కూతురు కూతురు
ననాన్దా -- ఆడబిడ్డ
పితా -- తండ్రి
పితామహః -- తండ్రి తండ్రి తాతా
పితామహీ -- తండ్రి తల్లి నాయనమ్మ, బామ్మ
పితృవ్యః -- పిన(పెద) తండ్రి
పితృవ్యా -- పిన(పెద) తల్లి
పైతృష్వసేయః -- మేనత్త కొడుకు
పైతృష్వసేయా -- మేనత్తకూతురు
ప్రజావతీ -- వదిన
ప్రపౌత్రః -- కొడుకు కొడుకు మనుమడు
ప్రపౌత్రీ -- కొడుకు కూతురు
భగినీ -- తోడబుట్టినది
భర్తా -- భర్త
భాగినేయః -- మేనల్లుడు
భావః -- తోడబుట్టినామె మగడు
భ్రాతా -- తోడబుట్టిన వాడు.
కొన్ని వర్తమానకాల ధాతువులు(క్రియలు... వాక్యములు)
బాలః పఠతి -- బాలుడు చదువుచున్నాడు
శిష్యః నమతి -- శిష్యుడు నమస్కరించుచున్నాడు
అగ్రజః వదతి -- అన్న మాట్లాడుతున్నాడు
జనకః పశ్యతి -- తండ్రి చూచు చున్నాడు
పితృవ్యః పృచ్ఛతి-- చిన్నాన్న అడుగుచున్నాడు
పుత్రః గచ్ఛతి -- కొడుకు వెళుతున్నాడు
అశ్వః ధావతి -- గుఱ్ఱము పరుగెత్తుచున్నది
వృక్షః ఫలతి -- చెట్టు పండుచున్నది.
సేవకః తిష్ఠతి -- సేవకుడు నిలుచున్నాడు.
భిక్షుకః అటతి -- భిక్షుకుడు తిరుగు చున్నాడు
సః నిన్దతి -- అతడు నిన్దిస్తున్నాడు
అయం హసతి -- ఇతడు నవ్వుచున్నాడు
అమ్బా పచతి -- అమ్మ వండుతున్నది.
అనుజా క్రీడతి -- చెల్లెలు ఆడుచున్నది.
అగ్రజా ఖాదతి -- అక్క తింటున్నది.

Saturday, July 23, 2016

వదత సంస్కృతం - 8

వదత సంస్కృతం - 8
అగ్రజః - అన్న
అగ్రజా - అక్క
అనుజః - తమ్ముడు
అనుజా - చెల్లెలు
జనకః - తండ్రి
జననీ - తల్లి
పితామహః - తాత (తండ్రి తండ్రి)          పితామహీ - నాయనమ్మ
మాతామహః - తాత (తల్లి తండ్రి)         మాతామహీ--అమ్మమ్మ
పుత్రః -పుత్రుడు, కుమారుడు
పుత్రీ - పుత్రిక , కుమార్తె
పౌత్రః - కుమారుని కుమారుడు మనుమడు,  పౌత్రీ -- కుమారుని కూతురు మనుమరాలు
దౌహిత్రః - కుమార్తె కుమారుడు మనుమడు , దౌహిత్రీ -- కూతురు కూతురు మనుమరాలు.
భోజనం సిద్ధమ్ -- భోజనము తయారుగా ఉంది.
పరివేషయతు -- వడ్డించు
కిం ఆవశ్యకం-- ఏమి కావాలి
అన్నం ఆవశ్యకం -- అన్నం కావాలి
రోటికాం ఆవశ్యకం కిం -- రొట్టి కావాలా
న నావశ్యకం - వద్దు అక్కరలేదు.
కించిత్ అధికం సూపః ఆవశ్యకం కిం -- ఇంకా కొంచెం పులుసు కావాలా
మాస్తు -- వద్దు,     పర్యాప్తం -- చాలు. 
 


Friday, July 22, 2016

వదత సంస్కృతం - 7

వదత సంస్కృతం -7
అహం - నేను                       ఏషః - ఇతడు                      కుతః - ఎక్కడ నుండి
మమ - నా యొక్క               ఏషా - ఈమె                    భవాన్ కుతః ఆగచ్ఛతి ? - నీవు ఎక్కడ నుంచి వస్తున్నావు
త్వం - నీవు                                                                 అహం దేవాలయ తః ఆగచ్ఛామి
తవ - నీ యొక్క                                                         నేను దేవాలయం నుంచి వస్తున్నాను.
సః - అతడు   -----------------కః - ఎవరు                       అహం విద్యాలయతః ఆగచ్ఛామి
తస్య - అతని యొక్క--------కస్య - ఎవరి యొక్క           నేను విద్యాలయం నుండి వస్తున్నాను.
సా - ఆమె        ------------- కా - ఎవతె                     అలాగే గృహతః - ఇంటి నుంచి, కార్యాలయతః - ఆఫీసు నుంచి
తస్యాః - ఆమెయొక్క--------కస్యాః - ఎవతె యొక్క         దిల్లీ తః - దిల్లీ నుంచి, కర్నూల్ తః - కర్నూల్ నుంచి మొ.
తే - నీకు, నీకొరకుWednesday, July 20, 2016

సంస్కృతం వదామః - 6

భవాన్(పు.లిం)  కధం అస్తి -- మీరు ఎలా ఉన్నారు ?
ఆం, అహం 1.కుశలః, అస్మి -- ఆ నేను బాగున్నాను.
భవతీ(స్త్రీ.లిం)కధం అస్తి  -- మీరు ఎలా ఉన్నారు ?
ఆం, అహం 2. కుశలినీ   అస్మి -- అవును, నేను బాగున్నాను.
గృహే సర్వం కుశలం కిమ్ -- ఇంట్లో అంతా కుశలమేనా ?
ఆం, సర్వం 3. కుశలం -- అవును, (ఆ) ఇంట్లో అంతా కుశలమే.
భవతః భగినీ కుశలినీ అస్తి కిం ? -- మీ చెల్లెలు బాగున్నదా ?
ఆం, మమ భగినీ అపి కుశలినీ అస్తి -- ఆ మా చెల్లెలు కూడా బాగున్నది.
భవతః భ్రాతా కుశలః కిం ? -- మీ సోదరుడు బాగున్నాడా ?
ఆం, సః కుశలః ఏవ -- ఆ అతడు కుశలమే.
ఇక్కడ కుశలం అనే పదం విశేషణంగా వాడబడింది. విశేషణం విశేష్యము  యొక్క లింగ వచనములతో ఏకీభవించ వలెను.
ఉదాహరణకు సర్వం అనే పదం నపుంసక లింగం ఏక వచనం కనుక కుశలం అనే పదం కూడా నపుంసక లింగం ఏకవచనం లో వచ్చినది.
అలాగే భగినీ స్త్రీ లింగం ఏకవచనం కనుక కుశలినీ స్త్రీ లింగం ఏకవచనం వచ్చినది.
అలాగే భ్రాత పుం. లింగం ఏకవచనం కనుక కుశలః అని వచ్చినది.


సంస్కృతం వదామః -5

ఆవశ్యకం న ఆసీత్ --అవసరం లేదు
మహాన్ ఆనందః --- చాలా సంతోషం
ప్రయత్నం కరోమి --- ప్రయత్నిస్తాను.
న శక్యతే భోః -- చేయలేను
తథా న వదతు -- అలా చెప్పకు
కదా దదాతి -- ఎప్పుడు ఇస్తావు
అహం కిం కరోమి -- నే నేమి చేయను?
కతి జనాః సన్తి -- ఎంత మంది ఉన్నారు.
పునః ఆగచ్ఛతు -- మళ్ళీ రా
అవశ్యం ఆగచ్ఛామి -- తప్పక వస్తాను.

Tuesday, July 19, 2016

సందేశం

ఒక 
సందేశం స్వయం సద్గురువు ద్వారా 

సంస్కృతం వదామః - 4

వాదనే అంటే గంటలు
ఏక వాదనే ఒంటి గంటకు ద్వి వాదనే రెండు గంటలకు మొ.
పావు గంట -- పాదం , ఊన --- తక్కువ ...... పాదోన -- పావు తక్కువ
పాదోన ఏక వాదనే -- పావు తక్కువ ఒకటి
పాదోన పంచ వాదనే --- పావు తక్కువ ఐదు
పాదోన అష్ట వాదనే -- పావు తక్కువ ఎనిమిది
....... అధిక --- ఎక్కువ
పాద అధిక దశ వాదనే -- పదిం పావు
పాదాధిక నవ వాదనే --- తొమ్మిదిం పావు
పాదాధిక సప్త వాదనే -- ఏడుంపావు
 -----సార్ధ ...... అరగంట
సార్థ ఏకాదశ వాదనే -- పదకొండున్నర
సార్ధ ద్వాదశ వాదనే -- పన్నెండున్నర
అహం ప్రాతః సమయే త్రి వాదనే ఉత్తిష్ఠామి - నేను పొద్దున్నే మూడు గంటలకు లేస్తాను
అహం ప్రాతః సమయే ధ్యానం కరోమి -- నేను ప్రాతః సమయం లో ధ్యానం చేస్తాను.
అహం ప్రాతః సమయే చతుర్వాదనే స్నానం కరోమి -- నేను ఉదయం 4 గంటలకు స్నానం చేస్తాను.
అహం మధ్యాన్నే సార్ధ ఏక వాదనే భోజనం కరోమి -- నేను మధ్యాహ్నం ఒంటి గంటన్నర కు భోజనం చేస్తాను.
Sunday, July 17, 2016

సంస్కృతం వదామః -- సంస్కృతంలో మాట్లాడదాం-3

ఏతత్ -- ఇది                                      ఖాదతి -- తినును
తత్ -- అది                                         పిబతి -- తాగును
ఏషః -- ఇతడు                                    పఠతి -- చదువును
సః -- అతడు                                      ఖేలామి లేక క్రీడామి -- ఆడుచున్నాను
ఏషా -- ఈమె                                     పశ్యామి -- చూస్తాను -- చూస్తున్నాను
సా -- ఆమె                                        మిలామః -- కలుద్దాము
ఇదానీమ్ -- ఇప్పుడు                         కూర్దతి -- గెంతును
తదానీమ్ -- అప్పుడు                         శృణోతి -- వినును
సదా -- ఎల్లప్పుడు                              గాయతి -- పాడును
కదా -- ఎప్పుడు                                 విరాజతి -- విలసిల్లును
అధునా -- ఇప్పుడు                          
ఆపణం -- దుకాణం

ఇదానీమ్ ఏవ వా ? -- ఇప్పుడేనా
ఆం -- అవును, ఇదానీమ్ ఏవ -- ఇప్పుడే
ప్రాప్తం కిం -- దొరికిందా ?
కస్మిన్ -- ఎందులో .... కస్మిన్ సమయే-- ఏ సమయంలో
సంస్కృతంలో సమయాన్ని వాదనం అంటారు ఉదాహరణకు 9 గంటలు అనడానికి నవ వాదనే అంటారు
అలాగే ఏక వాదనే ఒంటి గంటకి, ద్వి వాదనే -- రెండు గంటలకు,
త్రి వాదనే -- మూడు గంటలకు, చతుర్వాదనే -- నాలుగు గంటలకు.......sanskrit vartavali संस्कृतवार्तावली साप्ताहिकपत्रिका 16/07/2016

వదామః సంస్కృతం -- సంస్కృతం లో మాట్లాడదాం-2

స్వల్పం --కొంచం-- a little
అహం న జానామి -- నాకు తెలియదు
కిమర్ధం న భవతి -- ఎందుకు అవ్వదు
అథ కిం -- కాక మరేమి
నైవ ఖలు -- నిజమా..
ఆగచ్ఛతు -- రండి
ఉపవిశతు -- కూర్చోండి
జ్ఞాతం వా -- తెలియునా, అర్ధం అయ్యిందా.
కథం ఆసీత్ -- ఎలా ఉంది.
కార్యక్రమః కదా -- కార్యక్రమం ఎప్పుడు ఉంది.
అద్య ఏవ కిం -- ఈ రోజేనా
అద్య న శ్వః -- ఈ రోజు కాదు రేపు.
తద్ హ్యః ఏవ సమాప్తం -- అది నిన్ననే ముగిసింది.

ప్ర పర హ్యః -- ఆవల మొన్న         అహం ప్ర పర హ్యః మధురా నగరం అగచ్ఛం -- నేను ఆవల మొన్న మధురా 
                                                  నగరానికి వెళ్ళాను.
పర హ్యః -- మొన్న                      సః పర హ్యః కాళాశాలాం న ఆగతవాన్ -- అతడు మొన్న కళాశాలకు రాలేదు
హ్యః -- నిన్న                               సా హ్యః మాతులస్య గృహం గతవతీ -- ఆమె నిన్న మేనమామ ఇంటికి వెళ్ళినది
అద్య -- ఈరోజు                            అహం అద్య రామం పూజయామి -- నేను ఈ రోజు రాముని పూజిస్తాను.
శ్వః -- రేపు.                                అహం శ్వః రామస్య గృహం గచ్ఛామి -- నేను రేపు రాముని ఇంటికి వెళతాను.
 పర శ్వః -- ఎల్లుండి                     అహం పర శ్వః చిత్రశాలాం గచ్ఛామి -- నేను ఎల్లుండి చిత్రశాలకు వెళతాను
ప్ర పర శ్వః -- ఆవల ఎల్లుండి         అహం ప్ర పర శ్వః దిల్లీం గచ్ఛామి -- నేను ఆవల ఎల్లుండి దిల్లీకి వెళతాను.

Saturday, July 16, 2016

సంస్కృతం వదతు -- సంస్కృతం మాట్లాడండి-1

సంస్కృతం వదతు -- సంస్కృతం మాట్లాడండి
హరిః ఓం -- నమస్కారము
ధన్యవాదః --ధన్యవాదాలు
స్వాగతం -- స్వాగతం
క్షమ్యతాం -- క్షమించండి
చింతా మాస్తు -- చింతించకండి
కృపయా -- దయచేసి
పునః మిలామః -- మళ్ళీ కలుద్దాం
అస్తు -- అలాగే
శ్రీమన్ -- అయ్యా
మాన్యవర్ -- మాన్యా
మాన్యే -- అమ్మా
ఉత్తమమ్ లేక శోభనం -- చాలా మంచిది (బాగు, బాగు)
బహు ఉత్తమమ్ -- అద్భుతం
భవతః నామ కిం -- మీ పేరేమి
భవత్యాః నామ కిం -- (స్త్రీ) మీ పేరేమి
మమ నామ మహేశ్వరి -- నా పేరు మహేశ్వరి....
ఏషః -- ఇతడు. మమ -- నా, మిత్రం -- మిత్రుడు
ఏషా-- ఈమె, సఖీ --- స్నేహితురాలు.
భవాన్ -- మీరు(పుం.) భవతీ -- మీరు(స్త్రీ)

అత్ర -- ఇక్కడ , తత్ర -- అక్కడ, కుత్ర -- ఎక్కడ, అన్యత్ర -- వేరే చోట, సర్వత్ర -- అంతటా, ఉపరి -- పైన,
అధః -- క్రింద  యత్ర -- ఎక్కడ


Tuesday, July 12, 2016

యోగీశ్వరుడు

Photo


శివుని ధ్యానించే శంకరుడు శివశంకరుడు ఐనాడు. అభేదం అయినాడు. నరుడు సాక్షాత్ భగవత్స్వరూపుడైనాడు. ఆ రాజయోగం తిరిగి ఇప్పుడు చెప్పుతున్నారు. రామదాసు కీర్తనలో ఋషులు దేవతలైనారని తన కీర్తనలలో వ్రాశారు. అటువంటి యోగులకు ఈశ్వరుడు స్వామి శంకరుడు. అంటే మొదటగా ఋషినుంచి తానే దేవతగా ఐ ఇతరులకు మార్గదర్శకులై వెలిగారు. ఒక లాయరే లాయరును, ఒక టీచరే మరొక టీచరును ఒక డాక్టరే మరొక డాక్టరును తయారు చేసినట్లు, ఒక యోగి నుంచి దేవ దేవుడైన ఋషి మాత్రమే మరొక ఋషిని దేవతగా మార్చగలరు.
ఇది అతి సుక్ష్మ జ్ఞానం. తెలిసినవారు పాటించిన వారూ అంతతః నిభాయించిన వారు అతి ధన్యులు.

Monday, July 11, 2016

చంచల మనస్సు

చంచల మనస్సు ఇతరులచే ప్రభావితం అవుతూ ఉంటుంది, కేవలం వినడం ఇతరులకు వినిపించడం ఇది భక్తి మార్గం పాటించడం జ్ఞాన మార్గం. అది రావణాసురుడి పని, ఇది రాముని పని. పది ముఖాలు పది మార్గాలు చుపిస్తాయి. పది దేవుళ్ళను కొలవమంటాయి. 
శరీరం ఐదు తత్వాలతో తయారయింది. శరీరం పై దృష్టి తత్వాలపై దృష్టి, శరీరాన్ని ఆధారంచేసుకునేది ఆత్మ . సుక్ష్మ మైన ఆత్మపై దృష్టి బుద్ధి సూక్ష్మం అవడానికి దోహద పడుతుంది. మనస్సు కేంద్రీకృతం అవ్వడానికి ధ్యానం ఉపాయం. ధ్యానం ఎలా చేయాలనేది కేవలం భగవంతుడే చెప్పగలరు. దానినే రాజయోగం అని భగవద్గీతలో చెప్పారు. మరి ఇతరుల ద్వారా రాజయోగం నేర్పబడదు, దేహ యోగం మాత్రమే వారు నేర్పగలరు. అందుకే భగవానుడు నేనే రాజయోగం నేర్పిస్తాను అని చెప్పారు. 

Sunday, July 10, 2016

శివ ధ్యాన ముద్ర


శివ శంకరులు ఏకమైన వేళ నిరాకారుడు సాకారునిలో మమేకమైన వేళ

Wednesday, July 6, 2016

చిన్నారి శివుడు
చిన్నారి శివుడు మీకు అండదండ అగుగాక