Friday, May 13, 2016

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్.


ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్.
ఒక సంక్షిప్త పరిచయం ఇక్కడ కింద తేదీలు పుట సంఖ్యలు ఇచ్చినవి గురువు గారి ప్రవచనాలు చేసినవి. ప్రవచనాలను మురళీలు అంటారు. ఆయన 18 సంవత్సరాలు రోజుకు ఒకటి చొప్పున సన్ముఖంలో కూర్చుని ఉన్న పిల్లలకు ప్రవచించిన మహావాక్యాలు. అవ్వి అన్నీ హిందీలో చెప్పారు. వాటి తెలుగు అనువాదం ఇక్కడ ఇస్తున్నాము. వాస్తవంగా ప్రతిదినం అధ్యయనం చేసేవారికి ఇవ్వి అర్ధం అవుతాయి కానీ సామాన్యంగా అర్ధం అయ్యే పాయింట్లను ఏరి ఇక్కడ ఇతరులకు కూడా అర్ధంకావడం కోసం, వారుకూడా తెలుసుకుని లాభం పొందడంకోసం పొందు పరుస్తున్నాం.
·         1) ఇది ఒక ఇల్లుకు ఇల్లు, మరియు విశ్వవిద్యాలయమూ కూడా. దీనినే గాడ్ ఫాదర్లీ వరల్డ్ యూనివర్సిటీ అని కూడా అంటారు. ఎందుకంటే ప్రపంచంలోని మనుష్యులందరికీ సద్గతి దీని ద్వారా లభిస్తుంది కనుక ఇది అసలైన విశ్వవిద్యాలయం అయినది. ఇల్లుకు ఇల్లుకూడా ఎందుకంటే తల్లితండ్రుల సమ్ముఖంలో కూర్చుని ఉన్నారు. స్పిరిచ్యువల్ ఫాదర్ కూర్చుని ఉన్నారు కనుక విశ్వవిద్యాలయం కూడా అయినది.  (ము.తా.18-8-76. పుట.1.ఆది)
·         2)ఇది అద్భుతమైన విశ్వ విద్యాలయం. చూడడానికి ఇల్లు కూడా, కాని తండ్రియే సత్యమైన శిక్షకుడు. ఇల్లు మరియు విద్యాలయం కనుక అనేకమంది ఇది ఇల్లా లేక విద్యాలయమా అని అర్ధంచేసుకోలేరు. (అ.వా.22-4-84 పుట. 265.ఆది.)
·        3) మానవుని నరుని నుంచి నారాయణునిగా, నారి నుంచి లక్ష్మిగా తయారుచేసే గొప్ప గాడ్లీ యూనివర్సిటీ లేక ఈశ్వరీయ విశ్వ విద్యాలయమిది. విశ్వవిద్యాలయమనే పేరైతే అనేకులు పెట్టుకున్నారు, నిజానికి అవేవీ విశ్వవిద్యాలయాలు కావు. (వాటిల్లో విశ్వంలో వారంతా చదవరు. కానీ ఈ జ్ఞానం విశ్వంలో అందరూ చదువుకుంటారు)  యూనివర్స్ అంటే మొత్తం విశ్వం. గవర్నమెంటు మనని ఈ పేరు పెట్టనివ్వదు. (ఎందుకంటే స్పిరిచ్యువల్ కదా). కానీ స్వయం (ప్రభుత్వం) మాత్రం ఈ పేరు (యూనివర్సీటీ అనే పేరు) పెట్టేస్తుంది. (ప్రభుత్వ యూనివర్సిటీల్లో మొత్తం విశ్వంలో వారంతా చదవరు కదా కానీ పేరు మాత్రం పెట్టుకుంటుంది. కానీ మన ఈ ఈశ్వరీయ విశ్వ విద్యాలయానికి మాత్రం విశ్వవిద్యాలయం అనే పేరు పెట్టనివ్వదు ఎందుకంటే ఆత్మిక జ్ఞానం కదా. ప్రభుత్వం ఆత్మను నమ్మదు. ధర్మ నిరపరేక్ష రాజ్యం కదా. అది ఈ పాయింటు ఉద్దేశ్యం.) ము.తా.5-9-74.పుట.2 మధ్యాది.
·        4) ఈ యూనివర్సిటీకైతే కోట్ల విలువచేసే భవనాన్ని అయితే నిర్మించలేదు. కేవలం ఈ ఇంటిని తయారు చేశారు. (అంటే ప్రభుత్వ యూనివర్సిటీల్లాగా పేద్ద పేద్ద బిల్డింగులు మాకు లేవు కేవలం మామూలు ఇళ్ళ ల్లోనే ఈ సత్సంగం జరుపుకుంటున్నాము.) ము.తా.28-10-73.పుట.3 మధ్యాది.
·        5) నేనైతే స్వయం యజమానిని. ఫరుఖాబాదులో యజమానిని నమ్ముతారు కదా, మీరు యజమాని యొక్క అర్ధాన్ని కూడా గ్రహించారు.(ఇంటికి యజమాని తండ్రియే కదా కనుక ఆత్మిక తండ్రిని స్పిరిచ్యువల్ ఫాదర్ ను మీరు గుర్తుపట్టారు అని చెబుతున్నారు) వారైతే యజమాని, మనం వారి పిల్లలం. అయితే తప్పకుండా వారసత్వం లభించాలి కదా. (వారసత్వం ఏమిటో ఈ ఇంటికి వస్తే ఈ తండ్రిని తెలుసుకుంటే కదా తెలిసేది, అందుకని ఆహ్వానిస్తున్నాం) ము.తా.7-12-73. పుట.2 మధ్యాది.
·6)         త్రిమూర్తి శివ భగవానువాచ---  ఈ శుభవార్త....అనంతమైన తండ్రి జ్ఞాన సాగరుడు, పతిత పావనుడు, సద్గతి దాత గీతా భగవానుడైన శివుడు, ప్రజాపిత బ్రహ్మకుమార్-కుమారీల ద్వారా ఏవిధంగా సంపూర్ణ కలియుగీ వికారి దురాచారీ పతిత ప్రపంచాన్ని పునః సంపూర్ణ సత్యయుగ నిర్వికారీ పావన శ్రేష్ఠాచారీ ప్రపంచముగా తయారు చేస్తూన్నారనే శుభవార్తను వినండి మరియు అర్ధంచేసుకోండి. (ము.తా.25-20-66. పుట.1 మధ్య) 
గమనిక ప్రజాపితా బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అనే పేరును మార్చమని మురళీలలో భగవానువాచ కారణంగా పేరు ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం అని మార్చబడింది. ఆ పాయింటును కింద చూడండి. 
మౌంట్-ఆబూలో చెప్పిన మురళీ తేది.20-3-74 పుట.4 మరియు 19-2-2000 పుట.1 శివబాబా స్పష్టమైన ఆదేశం ఈ విధంగా ఉన్నది--గాడ్ ఫాదర్ ను, స్పిరిచ్యువల్ నాలెడ్జ్ ఫుల్ అనడం జరుగుతుంది. కాబట్టి మీరు స్పిరిచ్యువల్ యూనివర్సిటీ అనే పేరు వ్రాస్తారు. దీనికి ఎవరూ అభ్యంతరం చెప్పరు. కనుక బోర్డుపై నున్న ఆ అక్షరాలను (ప్ర.బ్ర.కు) తొలగించి స్పిరిచ్యువల్ యూనివర్సిటీ అనే వ్రాస్తారు. 
భారత దేశం మరియు అన్య దేశాలలో ఆధ్యాత్మిక కుటుంబానికి చెందిన సభ్యుల ద్వారా అనేక పట్టణాలలో ఆధ్యాత్మిక గీతా మందిరాలు ఇంకా అనేక ఉపనగరాలు, గ్రామాలలో గీతాపాఠశాలలూ నడిపించబడుచున్నవి. అక్కడ ఈశ్వరీయ జ్ఞానం ఇంకా రాజయోగ శిక్షణ ఇవ్వబడుతుంది. 
ఢిల్లీ...09891370007
ఫరూఖాబాద్.....యూ.పీ. 09335683627
కంపిలా......యూ.పీ....09919272681
హైదరాబాద్......బేగంపేట....09394693379, 9390680580
తాడేపల్లిగూడెం.....09293155802
అనంతపురం.....9533731637
పెదపళ్ళ.....ఆలమూరు మం. 9390435564
గొల్లప్రోలు......07842833830
ఎల్కతుర్తి.....కరీంనగర్....07306195840
కర్నూల్......08099162477
కదిరి......09652651510
కాకినాడ......07569677016
కొల్లిపార...గుంటూరు......07306679210
నెల్లూరు....07670979128
తిరుపతి......09390876692
విశాఖపట్టణం.....07670987068
మా వెబ్.సైట్....www.a1spiritual.info   
e-mail a1spiritual1@gmail.com







·          



No comments:

Post a Comment

బ్లాగ్ సందర్శించినందుకు ధన్యవాదాలు. త్వరలో మా స్పందన తెలుపగలము.

Featured Post

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్.

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్. ఒక సంక్షిప్త పరిచయం ఇక్కడ కింద తేదీలు పుట సంఖ్యలు ఇచ్చినవి గురువు గారి ప్రవచనా...