జపాను గల గల గంట

Thursday, March 31, 2016

అడుక్కోవడం కంటే ఛావడం మేలు

శివబాబా మహావాక్యం
మాంగ్ నే సే మరనా భలా అంటే అడుక్కోవడం కంటే ఛావడం మేలు అని అర్ధం
భగవంతుడు ఎప్పుడూ అడుక్కోమని చేప్పలేదు. ఉంఛ వృత్తి అని పేరు కూడా పెట్టేశారు. కాని స్వాభిమానం ఉన్నవారు ఎన్నటికీ అడుక్కోరు. మరి అమ్మ కూడా అడగందే పెట్టదు కదా. అమ్మను నాన్నను అడగడం అడుక్కోవడం ఒకటే ఎలా అవుతుంది. కానీ ఈ రోజుల్లో ప్రతీ వారూ ఊరికే వస్తే కిరసనాయిలు కూడా తాగేస్తారు. వాళ్ళకు అడుక్కోవడంలో తన పర భేదం లేదు. ఓ వొందుంటే కొట్టండి మళ్ళీ సాయత్రం నాకు మనిఆర్డర్ వస్తుంది ఇచ్చేస్తాను అంటారు. అరే సాయంత్రం దాకా ఆగవోయి నీకే వచ్చేస్తాయి కదా మరి ఇంకోర్ని అడగడం ఎందుకు
వృత్తిగా అడుక్కునే వాడికి అసలు పెట్టకూడదని బాబా చెప్పేరు. ఎందుకంటే వాళ్ళు శ్రమ పడడానికి అస్సలు ఇష్టపడరు. ఎంతోమంది వృద్ధులయ్యాక కూడా ఇతరులపై ఆధార పడకుండా ఏదో ఒక పని తమ జానెడు పొట్ట నింపుకోవడానికి చేస్తారు. నేను అలాంటి ఎంతోమందిని చూశాను రిటైర్ అయ్యాక కూడా ఉద్యోగం చేసేవారిని లేకపోతే ఏదో ఒక సమాజసేవ చేసేవారిని. అన్నింటికన్నా మిన్న దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం, అంటే ఓపిక ఒంట్లో శక్తి ఉండగానే నాలుగు రాళ్ళు వృద్ధాప్యంలో గడవడం కోసం దాచుకునేవారు .  అలా సంపాదించుకుని రిటైరయ్యాక కూడా సమయాన్ని సద్వనియోగం చేసే వారు కూడా ఉన్నారు. అలాంటి వారితో పోలిస్తే ఈ అడుక్కునే వారు ఏ విధంగా భూమికి భారమో తెలుస్తుంది.
అలాగే తల్లి తండ్రులు కూడా జీవితాంతం సంపాదించినది ఉట్టిపుణ్యానికి పిల్లలకి ధారపోయకూడదు. తమ ఉనికికే ఎసరుపెట్టే పిల్లలు ఎంతమంది తల్లి తండ్రుల ఆస్తులు కాజేసి కాజేసే అనాలి మరి, దురుద్దేశంతో వాళ్ళ ఆస్తులను తమ పేర చేసుకోవడాన్ని ఏమనాలి మరి, తరవాత వాళ్ళను గాలికి వదిలేయడమో లేక ఏ వృద్ధాశ్రమంలో జేర్చడమో లేక రోడ్డున పారేయడమో చేస్తున్నారు కదా...
మనవాళ్ళకి మహా పిచ్చి దానం ధర్మం అంటుంటారు. అపాత్ర దానాలు పాపం పెంచుతాయి కాని పుణ్యంకాదు. మనం ఇచ్చిన డబ్భు వాడు ఏ తాగుడుకో జూదానికో మరోటికో ఉపయోగిస్తే ఆ పాపంలో మనకి కూడా భాగం వస్తుంది. అందుకే పుణ్యానికి పోతే పాపం ఎదురైంది అనేది.
దానం చేస్తే అది మరింత ధర్మం అభివృద్ది చెందే చోట చేయాలి, అడుక్కునేవాళ్ళను ప్రోత్సహించకూడదు. మనం మనచేత్తోనే ఆ సహాయమేదో చేయాలి కాని ఏదో సంస్థ ఉంది అది చేస్తుంది అనుకోవడం అంత మంచిది కాదు కదా....

Monday, March 28, 2016

పనియే పూజ అంటారు

పనియే పూజ అంటారు
ఎవరు చేయ వలసిన పని వారు నిష్ఠతో చేస్తే అది పూజ తో సమానం అని కొందరి అభిప్రాయం. ఈ రోజుల్లో అనేక రకాల పనులు ఎందరి ద్వారా నో నిర్వహింప బడుతున్నాయి. ప్రతీవారూ కొద్దో గొప్పో తమ పని సక్రమంగా నిర్వహిస్తున్నామనే అనుకుంటున్నారు. ఎవరినైనా సరే అడిగితే తాము సరిగానే చేస్తున్నామని, తాము చేసే పనికి ఋజువులతో సహా సమర్ధించు కుంటారు. మేము తప్పు చేస్తున్నామని ఎవరైనా అంటారా , అనరు ససేమిరా అనరు.
ఇతరులకు తమకు శుభం కలగ చేసేదే పని అనుకుంటే ఒక పని ఒకరికి శుభం వేరొకరికి అశుభం అవ్వ వచ్చునే.
అదంతా ఎందుకు ఈశ్వరుడు గీతలో కర్మ అకర్మ వికర్మ లను గురించి కర్మ యోగంలో చెప్పనే చెప్పారు. అంత లోతుగా అధ్యయనం చేసే ఓపిక ఎవరీకీ లేదిప్పుడు.
ఓ గుమాస్తా ఒంచిన తల ఎత్తకుండా పని చేసుకు పోతే అది పూజా కాదా,
ఓ గాడిద కూడా ఎంతో పని చేసుకు పోతోంది అది పాపం ఎంత పని చేస్తుందో ...అంటే మరి బాగోదు కదా..
ఏ ఆఫీసరేనా కానీ ఒకరికి తల వంచి పని చేయవలసినదే కదా.... పోనీ ఓ సుప్రీమ్ జడ్జి ని తీసుకుందాం ఓ ఉరి శిక్ష పడ్డ వ్యక్తికి ప్రెసిడెంటు క్షమాభిక్ష పెట్టేస్తే ఆ జడ్జి విలువ ఏమి మిగిలింది... ఆ మాత్రానికి ప్రెసిడెంటు మాత్రం  సుప్రీమ్ అథారిటీ యా అంటే అదీ కాదు... ఆయన నిర్ణయాలకు ఎంత విలువో రబ్బర్ స్టాంప్ అనే ఆయన ఉపాధికి తెలుసు.
అందుకే వర్క ఈజ్ వర్షిప్ అనే మాటకు అర్ధం ఏమిటో కొంచెం తెలియాలి.


Friday, March 25, 2016

సుభాషితాలు
1)గతే శోకో న కర్తవ్యో భవిష్యన్నచిన్తయేత్,
వర్తమానేషు కార్యేషు వర్తన్తే వీక్షకాః    
గతించిన దాని గూర్చి శోకించరు, భవిష్యత్తు గూర్చి ఆలోచించరు, వర్తమానంలో చేయవలసిన కర్తవ్యమునందే బుద్ధినుంచు వారు జ్ఞానులు.
2) దుర్జన దూషిత మనసః స్వజనేష్వపి నాస్తి విశ్వాసః,
బాలః పాయస దగ్ధో, దధ్యపి ఫూత్కృత్య భక్షయతి.
దుర్జనుల వల్లదూషితమైన మనసు స్వజనులను కూడ నమ్మదు, ఎలాగైతే వేడి పాయసంతో మూతి కాలిన పిల్లవాడు పెరుగును కూడా ఊదుకుని తింటాడో అలా.

Saturday, March 19, 2016

ఒక మంచి మాట

ఒక మంచి మాట
ఎన్ని పుస్తకాలు వ్రాసినా గ్రంధాలు శాస్త్రాలు పురాణాలు వేదాలు కురాన్ బైబిల్ దంపద మొ. కావ్యాలు కధలు చదివినా ఏమి మిగలదు కేవలం మనం ఎంత ధారణ చేశామో అదే మనతో వస్తుంది.
ధారణ అంటే పాయింట్లు గురుతు పెట్టు కోవడం కాదు లాయర్లు డాక్టర్లు ఇంజేనిర్లు అందరు కూడా సంబంధిత పాయింట్లు గురుతు పెట్టుకుంటారు ఎవరు ఎంత గురుతు పెట్టు కుంటారో అంత సంపాదిస్తారు కాని అవ్వి అన్ని మనతో రావు కేవలం గుణాలు చదివిన చదువులో ఎంత ధారణ చేస్తామో అత్మసార్ చేసుకుంటామో అవే మన ఆత్మ తో వస్తాయి.
సుఖము శాంతి ఆనందము పవిత్రత ప్రేమ జ్ఞానం ఇవ్వే ఆత్మ అసలు గుణాలు ఆ భగవంతుడి నుంచి మనకు సంప్రాప్తం అయ్యేవి
ఒక బాబా మురళి చుడండి.


ఓం నమః శివాయ 

యాహూ లో ఓం శాంతి గ్రూప్

కింద లింక్ యాహూ గ్రూప్ అడ్రస్ ధ్యానం మెడిటేషన్ అంటే ఇష్టం ఉన్నట్లయితే తప్పక విజిట్ చేయండి. 


https://in.groups.yahoo.com/omshanthi Tuesday, March 15, 2016

సాధారణ జనాల కోసం బాబా మురళి 2

ఓం శాంతి సాధారణ జనాల కోసం బాబా మురళి 2ఇంద్రియాల ద్వారా సుఖం  పొందడం వల్ల  ఆత్మిక శక్తి క్షీణి స్తూ వస్తుంది అనేకుల సాంగత్యం వల్ల  ఆత్మిక శక్తి పోగొట్టు కున్నాము తిరిగి పొందడానికి ఒకే ఒక పరమాత్మ సాంగత్యం వల్లనే సాధ్యం , మార్గం .
భగవానువాచ "మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుని నన్ను తలుచుకోండి" "అపనే కో ఆత్మా  సమఝ్ మామేకం  యాద్ కరో "సర్వ ధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ" 

Friday, March 11, 2016

పై వీడియో లో బాబా సాధారణ జనాల కోసం క్లాసు చేసారు దీనిని ఒక సారి తప్పక వినమని మనవి
ఇంకా రాజ యోగం కోసం మరి ఎన్నో క్లాసులు చేశారు  అవి హిందీ లో నే ఉన్నాయి కాని సాధారణ భాష లోనే ఉన్నందు వల్ల  సులువు గానే అర్ధం అవుతాయి . 

Friday, March 4, 2016

అరోమా తెరపి రొండు

అరోమా తెరపి రొండు
 అరోమా నూనెలు ఇంట్లో నే చాల వరకు తాయారు చేసుకో వచ్చు. ఇంట్లో పూల చెట్లు ఉంటె చాలు కంటికి వొంటికి మనసు కి కూడా ప్రయోజ న మే అలా తీగలకు పూచే మల్లెలు రోజాలు చామంతులు ఇంక దవనం మరువం లాంటి ఆకులు ఏ వై నా  ఒకే పధ్ధతి
అ) నీళ్ళు మరిగించి ఆకులు / పువ్వులు / సువాసన వచ్చే భాగాలూ తీసుకుని వాటిని ఆ నీటిలో వేయాలి దింపి మూత పెట్టాలి కొంత సేపటికి నీటి పైన పలుచగా నూని తేలుతుంది దానిని ఒక దూది తో సేకరించాలి అంతే
( కిందకు పిప్పి చేరుతుంది .  దానిని ఎండలో పెట్టి పొడి చేసి వంటిటి గట్టు గుమ్మం లాంటి చోటులో వేస్తే చీమలు రాకుండా ఉంటాయి . వాటి పేస్టూ చర్మ వ్యాదులలో పై పూత  గా పట్టి వేసుకో వచ్చు.
ఫ్రాన్స్ లో యుద్ధం  లో దెబ్బ తిన్న వీరులకు పాత కాలం లో లావెండర్  పేస్ట్ ను వాపు తగ్గడానికి వాడే వారు. )
ఆ) ఆ నూనె ను ఓకే రంగు సీసా లో సేకరించి పెట్టుకుని కావలసి నప్పుడు వాడు కో వచ్చు.
ఇ) అప్పటి కప్పుడు కూడా వాడ వచ్చు.
Image result for aroma photos

Tuesday, March 1, 2016

Image result for aroma photos

అరోమా తెరపి  గురించి చాల మందికి ఇపుడిపుడే తెలుస్తున్నది పులు ఆకులు వేర్లు ఇలా మొక్కలు, చెట్ల వివిధ భాగాల నుంచి రక రకాల సుగంధ తిలలతో చేసే వైద్యం అరోమా అంటేనే సుగంధం సుగంధ ద్రవ్యాలలో ఎన్నో ఆరోగ్య లక్షణాలు కూడా ఉన్నాయ్ వీటిని మన పూర్వీకులు  అనాదిగా వాడుతూ వస్తూనే ఉన్నారు 
వివిధ దేశాల మాట అటు ఉంచి మన దేశం లోనే వీటి వాడకం ఉంది. తల్లి నుంచి పిల్లల కు వారసత్వం గా వస్తూనే ఉంది కాని అది ఒక తెరపి అని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. 
ఉదాహరణకు మల్లెలు మల్లెలు సన్న జాజులు వీటిని కావ్యాలలోనే వర్నించారు. నాయికలు వివిధ తాపాలతో బాధ పడుతుంటే సఖులు రక రకాల సువాసన నూనెలతొ వారికి సేవలు చేసే వారు. అనేక మంది కవులు కూడా  సైత్యోపచారాలు వర్ణించారు.  
తల నొప్పి వొళ్ళు మంటలు సెగలు గ అని పించడం అరి కాలి మంటలు చర్మ సంబంధ వ్యాధులు 
మానసిక వ్యాధులు, పైత్యం, 
గర్భ సంబంధ వ్యాధులు, శరీర అంతర్ బహిర్ సంబంధ వ్యాధులు అనేకం ఈ తైల ఉపయోగం ద్వారా తగ్గించ వచ్చును. 
ఈ నూనెలను పై పూత గా కాని పట్టి లాగా కాని చల్లని దూది పై వేసి సంబంధ ప్రదేశం లో పెట్టడం వ ల్ల  కానీ స్నానం లేదా ఆవిరి పట్టడం వల్ల  కాని తగ్గించ వచ్చును. 
అంతే  కాక అగరవత్తులు దీపాలు సాంబ్రాణి  పొగలు బల్బు ల ద్వారాగా కూడా ఉపయోగించ వచ్చును. 
ఐతే ఒక్కొక తిలానికి ఒక్కొక్క లాభం ఉన్ది. 
మల్లె లు గులాబీలు సంపెంగలు లావెండర్ చామంతులు మందారాలు విరజాజులు పారిజాతాలు అనేక రకాల పూలు 
గంధం దాసిన చెక్క వంటి బెరడులు సుగంధపాల వట్టి వేళ్ళు ఒకటేమిటి ఎన్నో ఉన్నాయి 
అరోమా తెరపి ఒక అద్భుతం  నాసిక సంబంధ చర్మ సంబంధ అనుభవం 
మనసు బాగుంటే చాలు అంతా సున్దరమే,