Thursday, December 26, 2019

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం లో భాగవతం

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం లో భాగవతం
మేము ఓక ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులం, మాలో అన్నదమ్ములం, అక్కచెల్లెళ్ళం కలిసి షుమారు 20,000 పై చిలుకు ఉన్నాం అందులోనూ కన్యలు మాతల సంఖ్య 80%. మేము దేశ విదేశాల లోని వివిధ ప్రాంతాలనుంచి మూల మూలల నుంచి వచ్చాం. మా మధ్య రక్త సంబంధం లేకపోవచ్చు, కానీ ఒకే విశ్వ పిత సంబంధం కారణం గా మా మధ్య తెగని బంధం ఏర్పడింది. మాలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్ఖ్ అని లేరు, మా అందరికీ ఒకే బాబా ఆయనే తల్లి తండ్రి ఒకే శరీరం లో అర్ధనారీశ్వరుడుగా. వినడానికీ విశ్వసించడానికి విచిత్రం అయినా నిజం నిరూపించు కోవడానికి అవసరం ఏమిటి. మీరే స్వయంగా వచ్చి ప్రేమతో తెలుసుకుంటే తెలుస్తుంది. మేము అవిచ్ఛిన్న మైన ఆశక్తి కి ఏకతా అనే తాటితో కట్టుబడి ఉన్నాం. పరమపిత పరమాత్మ శివుడు కంపిల్ గ్రామంలో (యూ.పీ.)జగత్పిత జగదంబ రూపంలో ప్రవేశించడంతోనే ఈ అసంభవ కార్యం సంభవమైనది. నిజానికి ఇది ఒక అద్భుతం ఇప్పటి భారతదేశపు పటంలో ఏమాత్రం విలువలేని ఓ కుగ్రామంలో ఎలా దేశపు మూల మూలల నుంచి ఈ దార్శనిక సిద్ధాంతానికి కట్టుబడి ఈ చిన్న గ్రామంలో ఒకటి అయ్యి నిలుచున్నాము. ఈ కుగ్రామంలో ప్రజలకు కనీసం పొట్టనింపుకోవడానికి రెండుపూటల రెండు రొట్టెలకు కూడా గతిలేదు. మేము మిమ్మల్ని కూడా మా కుటుంబ సభ్యులుగా భావించి మీతో ఈ రహస్యాలు పంచుకుందాం అనుకుంటున్నాము.
నిజానికి మేము బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం, మౌంట్ అబూ రాజస్థాన్ ఇంకా ఆ సంస్థ అనేక విభాగాల లో చెప్పబడే జ్ఞానం తో ప్రభావితులమై వారితో కలిసి ఉండేవారం. కానీ ఆశ్చర్యం ఏమంటే పరమపిత శివపరమాత్మ దాదా లేఖరాజ్. బ్రహ్మ మాధ్యమంగా మౌంట్.అబూ లో 1951 నుంచీ 1969 వరకూ చెప్పిన మహావాక్యాలు వీటినే జ్ఞాన మురళీలు అంటారు మరియు 1969 నుంచీ ఇప్పటివరకూ బ్రహ్మకుమారీ గుల్జార్. మోహిని గారి ద్వారా చెప్పిన చెప్పబడుతున్న అవ్యక్తవాణి ల గహన అధ్యయనం లేక మనన చింతనం ఆధారంగా ఎన్నో రహస్యాలు జిగ్జ్ఞాసులనుంచి దాచి ఉంచుతున్నారు. ఆ రహస్యాల ప్రమాణం మూల ఈశ్వరీయ మహావాక్యాల నుంచి తొలగించారు అని తెలుస్తున్నది. జ్ఞాన మురళీలు మరియు అవ్యక్తవాణీల లో ఎక్కడైనా రాముని, శంకరుని, ప్రజాపిత యొక్క విషయం వస్తే ఆ మహావాక్యాలు బ్రహ్మకుమారీ విశ్వవిద్యాలయం, మౌంట్.అబూ ద్వారా ప్రింటు చేయబడినవి నేడు పునః ముద్రితమౌతున్న(రివైజ్)మురళీలలో ఏ కోశానా వెతికినా కనిపించడం లేదు. తొలగించ బడిన ఈ వాక్యాలు శ్రీమత్.భగవద్గీతశ్లోకాల లో రచయిత మరియు రచన రహస్యాలు నేటికీ రహస్యాలై అగుపిస్తాయి. ఇవ్వే మమ్మల్ని ఐతిహాసిక గ్రామం కంపిల్. వైపు ఆకర్షించాయి.
మౌంట్ అబూలో దాదాలేఖరాజ్. బ్రహ్మద్వారా చెప్పిన మహావాక్యాల రహస్య సారం కంపిల్.లో ఉన్న ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం ఉనికి వెలికి తీసింది. మొత్తం లోకంలో ఫరూఖాబాద్. మహాత్మ్యాన్ని చాటిచెప్పింది. ఈ రహస్యాలే మమ్మల్ని జగత్పిత జగదంబ లను క్రమశః మా మాతాపిత ప్రజాపిత, బ్రహ్మ అని తెలుసుకునేలా చేశాయి మరియు మమ్మల్ని ఈశ్వరీయ సేవకు అంకితమయ్యేలా సమర్పితమయ్యేలా చేశాయి. ఈ విధంగా మేము దేశం నలుమూలల నుంచి వచ్చినా అపరిచితులమైనా విభిన్నప్రాంతాల, భాషలవారమైనా ఒకే మనసు, ఒకే వచనం, ఒకే కర్మ కలవారమై అది ఒకే తండ్రి మాటపై ఆధారపడి మాతాపితల ఛత్రఛాయ లో ఒక దివ్య ఈశ్వరీయ కుటుంబం అనే సుత్రం లో కట్టుబడి ఉన్నాం. ఇది కేవలం ఒక విశ్వవిద్యాలయమేకాదు, ఒక ఇల్లుకూడ. ఈ కుటుంబం కేవలం భారత్ లోనే కాదు. విశ్వమంతా వ్యాపించింది. మా లక్ష్యం జాతి, మత, భేదభావాలకు అతీతంగా వసుధైవ కుటుంబం స్థాపన చేయడంలో పరమాత్ముడి సాకార మాధ్యమానికి (బాబాకి) భుజాలమై ఉండడం అంటే సహాయకారులం సదా అవడం. ఇది ఒక సత్సంగం, ఈ కుటుంబం కేవలం ఒకే సత్యమైనవాడు, శివకరుడు, ఒకే శివబాబా సాంగత్యంలో ఒకేబాబా సాంగత్యంలో రంగరించ బడి ఉన్నాం. ఈ కుటుంబం విశ్వంలో విడదీయరాని అతిపెద్ద కుటుంబం వసుధైవకుటుంబంగా ఉద్భూతం కాబోతున్నది. ఈ మా కుటుంబం మాత్రమే ఈశ్వరుని ఙ్ఞానం ద్వారా ఈ కలియుగీ రావణ రాజ్యాన్ని రామరాజ్యంగా మార్చే శక్తి కలవారం. ఆఁ ఐతే స్వర్గీయ స్థితి రావడానికి తప్పక ప్రతీవ్యక్తి మహాభారీ మహాభారత యుద్ధంలో పాల్గోవాల్సిందే. పాండవుల జీవనమే తెలుపుతుంది –అన్ని రోజులూ మనవి కావని.-  

  

Tuesday, December 24, 2019

నాలుగు పేపర్లు

అక్కడ ఆత్మల లోకం ఈ జ్ఞానం లో నలుగు సబ్జక్ట్లు . జ్ఞానము, యోగం, ధారణ మరియు సేవ. జ్ఞానం అంటే తెలియడం. ఏమి తెలియడం నేను ఆత్మ నా తండ్రి పరమ పిత పరమాత్మ శివబాబా ఎవరు అని తెలియడం.  అయన ఏ సాధారణ మానవునిలో ప్రవేశించి ఉన్నారో తెలిసిన తరవాత అయనను స్మృతి చేయడం యోగం, అయన తెలిపే ధర్మం పాటించడం ధారణ మరి సేవ అంటే ఈ జ్ఞానం అర్ధం చేసుకుని ఇతరులకు అర్ధం చేయించడం సేవ. స్మ్రుతి చేసే వారే స్వర్గం లోకి వెళతారు. పదవి కూడా పొందుతారు. స్మ్రుతి చేయడానికి కూడా జ్ఞానం కావాలి ఒక్కరినే తలుచుకోవాలి గీత లో కూడా మామేకం అని మాట వచ్చింది. పురుషార్ధం చేయవలసినవి  జ్ఞాన యోగ ధారణా సేవ అనే నలుగు పేపర్లు . పతితులు పావనం అవ్వాలి అనేక దేహ దారుల సాంగత్యం లో పతితులు ఆయారు ఇప్పుడు ఒక్కరి సాంగత్యం లో పావనం అవ్వాలి.
ప్రయత్నాలు ఎన్నో చేసారు కాని ఎవరూ దేవత కాలేదు. ఆత్మల కనెక్షన్ కేవలం పరమాత్మ తోటే. మనని మనం ఆత్మ అనుకుని పరమాత్మను తలుచు కోవాలి. చైతన్యం ఆత్మ కదా జడ శరీరం ఏమి చేయదు. చైతన్యం అంటే మాట్లాడేది నడిచేది. గుహ్య మైనది జ్ఞానం .స్వర్గం లో కూడా దేహాభిమానం ఉంటుంది. దేహం పేరు పడుతుంది కదా. లక్ష్మి నారాయణుడు, రాధ కృష్ణులు అలా.  కనుక ఈ కష్టం చేయమంటారు. ఏమిటి ఆ కష్టం మనని ఆత్మ అని ప్రాక్టికల్ గ అనుకోవడం  సుఖ ధామం వెళ్ళడానికి ఆత్మ అభిమాని కావాలి కష్టం చేయ కుండ ఏది రాదు. కష్టమే లేక పొతే అన్దరూ విశ్వ మాలిక్ అయిపోవచ్చు. కాని ఒక్కరే విశ్వ నాధుడు అయ్యారు. అయన పరివారం కూడా భూమిపై నక్షత్రాలు భోమ్మీద విశేష ప్రజ్ఞ కల మహిమాన్వితులు పూజించబడే దేవతలు.  జ్ఞానం అర్ధం చేసుకున్న వారికి సులువు. కేవలం విని వదలడం కాదు పాటించాలి. మననం చేయాలి. మాయ అపోజిషన్ చాలా ఉంది. కొంత మంది తలరాత చాల బాగుంది వారు జ్ఞానం యోగ పురుషార్ధం లో లీనం అయ్యారు. లేని వారు దేహ సంపాదనలో మునిగి పోయారు. 
వారు భక్తులు కేవల దర్శనం కోరు కుంటారు. భక్తి లో కష్టం ఉంటె జ్ఞానం లో కూడా ఉంది. తరవాత వచ్చే వారు పురుషార్ధం చేయరు అని కాదు. చివరలో వచ్చినా పురుషార్ధం చేసి ముందుకు వెళ్లి ఫస్ట్ రావచ్చు. మేము పొట్ట సంపాదన వదిలి ఈశ్వరీయ సంపాదనలో ఉంటాము. ఇక్క డ ఆత్మ ఐ కురుచుటాము. ఇది ఆత్మ తపస్సు దేహ తపస్సు కాదు ఉల్టా నిల్చో, ఆసనం వెయ్యి ఇవ్వి కాదు... ఆత్మ తపస్సు ఇక్కడ అక్కడ దైహిక తపస్సు. 
మీరు పవిత్ర్ ఋషులు. ఋషులు అని తపస్వులను అంటారు. ఘోర తపస్సు చేసాడు విశ్వామిత్రుడు అంటారు పెద్ద రాజు కదా. ఇక్కడ ఎక్కడకో వెళ్ళ వలసిన పని లేదు. ఒక్క సెకెండ్ లో దేహం దేహ సంబంధాలు మరిచి ఆత్మ అనుకో....బీతి కో బీతి దేఖో ఏ దునియా న జీతీ దేఖో....... జరిగి పోయింది జరిగి పోయింది. ఈ లోకం చచ్చి పోయింది. అంటే మనకు ఈ లోకం తో పని లేదు..... మన పని ఎవరు ఎలాంటి వారైనా వారికి సహాయం చేయడమే, డబ్బులు ఇవ్వలేక పోవచ్చు  కాని  శాంతి ప్రేమ ఆనందం సుఖం ఇవ్వగలం.   

పంచుకోవాలని ఉంది

ఈ రోజు కొంచం నాక్కూడా ఏదో మీ తో పంచుకోవాలని ఉంది. అందరి సహృదయుల మధ్య మరిచి పోయిన సాహిత్య పిపాస పెంచుకోవాలని ఉంది. చదువరులు లేక ఒంటరి నైన నన్ను మీతో కలుపుకుని ఊహల పల్లకి ఎక్కించిన మిమ్మల్ని కొలుచుకోవాలని ఉంది. (సాంగత్య మహిమ సుమీ)
మహామహుల మధ్య ఏదో ఓ మూల కుర్చుని మీ భావాల మిఠాయి పాకం భోషాణం లో నన్ను నేను మున్చుకోవాలని ఉంది హై బాబోయి హింత క(పి)విత్వం నాకే తన్నుకు వచ్చేస్తోందేమి టని మనసు అద్దం లో నా మొహం చూసుకోవాలని ఉంది.
విషయానికి వస్తే....ఈ రోజు మా గురుగారు చెప్పేరు హిందీ లో "బీతి కో బీతీ సమఝో ఏ దునియా నా జీతీ సమఝో"बीती को बीती समझो, इस दुनिया को न जीती समझो".... అంటే జరిగి పోయింది జరిగి పోయిందనుకో , ఈ లోకం అసలు బతికే లేదనుకో" అని తెలుగులో చెప్పుకోవచ్చు....... ఎందుకో ఈ మాటలు బాగా లోతుగా అనిపించాయి. ఎవరో అన్న మాటలు పట్టుకుని దీర్ఘాలు తీస్తాం కాని జరిగి పోయింది చింతించడం మానేస్తే, అసలు ఈ లోకమే లేదు నేను నా దేవుడు తప్ప అనుకుంటే అంత హాయి లేదేమో.....

Tuesday, November 19, 2019

సందేశం

सर्वेषाम कृते नमस्कारा:
भवन्त: सम्मुखे एकम भगवत: सन्देश: प्रस्तौमि कृपया अवधारणं करोतु. शिव: निराकार:| तस्य लोक: परमधाम:| स: परमपिता अस्माकं, वयं सर्वे तस्य पुत्रा:| वयमपि बिंदु रूप आत्मा: एव| अस्माकं धामं अपि परमधामं एव. तत्तु अस्माकं गृहं. वयं सर्वे अत्र भूमौ अभिनयं कर्तुं अगतवन्त:| 5000 वर्षा: अतीता:| चतुर युगा: गता:| अधुना शिवबाबा अस्माकं गृहं नेतुम आगतवान| समस्त भूमण्डले स्वर्गं स्थापयति| एष कलियुगीय नारकीय लोकं विध्वंसं प्राप्नोति| अतएव अनेके देशे बोम्ब्स (bombs) इत्यादि घोर शस्त्रान एकत्र कारितं मनुष्येण|  भगवानुवाच “हे, वत्सो, आगच्छन्तु, मत्. परिचयं प्रप्नोतु, माम विधि पूर्वकं स्मरतु, तेन भवंत: सर्वे अनेक जन्मना: पाप विमोचनं भवति, आत्मशुद्धि अनन्तरं भवंत: सर्वे अस्माकं गृहं आगंतुम शक्नोति, पश्चात मत्. द्वारा स्थापितं स्वर्गं प्रविष्ठुम अर्हतां प्राप्नुवन्ति. अहं अनेक जन्म राज भाग्यं दातुं आगच्छामि| एक: सामान्य मनुष्ये प्रविश्य भवन्तं सर्वे पुत्र रूपेण स्विकुर्य दिव्य राज योग पाठं पठामि.”
अत: अधुना अस्माकं कर्तव्यं अस्ति तं ज्ञातुं. क: स: यस्मिन शिव: प्रविष्टवान? शिव: यस्मिन शारीर आश्रयं स्वीकृतवान स: एव प्रजापिता ब्रह्मा. यदा वयं प्रजापिता ब्राह्मण: दत्त संतान: भवन्ति तस्य वारसत्वं प्रप्तुम अर्हा: भवितुम शक्नुवन्ति. कं वारसत्वं....ज्ञानं, सम्पूर्ण आयु, अर्योग्यं, ऐश्वर्यं, आनन्दं, सुखं, शांति, 21 जन्मानं स्वर्गे (द्वे युगे सतयुग, त्रेता युगे –स्वर्गे) पश्चात् 63 जन्मानं कृते (द्वे युगे द्वापर, कलियुगे- नरके). प्रजापिता ब्रह्मा अपि शिवस्यैव पुत्र:| स: अपि अधुना वारसत्वं शिवे एव प्राप्नोति. किन्तु प्रजापिता ब्रह्मा अस्माकं शरीरस्य पिता, शिव तु आत्मन: पिता. यदा द्वे मिलिते एव अस्माकं सम्पूर्ण पिता भवति. वयं तं भाजितुं नार्हा:|
तस्य भक्ति मार्गीय चित्रं उपरी दत्तं , किन्तु यदार्ध रूपं तु यदा भवन्त: ॐ शांति मार्गे प्रवेशं कुर्वन्ति तदा प्राप्नुवन्ति. सर्वे जना: सुखिनो भवन्तु.
(टिप्पणी:--- यदि दोष: दृष्ट: क्षम्यताम)
    ఈశ్వరుడు రమ్మని పిలుస్తున్నారు పిల్లలూ మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుని నన్ను తెలుసుకుని నన్ను తలుచుకుంటే మీ అనేక జన్మల పాపాలు నశించి మన పరంధామం చేరుకుంటారు. పాపాలు నశించడానికి మూడే మార్గాలు. 1. నన్ను తలుచుకోవడం అంటే సహజ రాజ యోగం ద్వారా అనేక జన్మల పాపలు యోగాగ్నిలో భస్మం చేసుకోవడం 2. గత జన్మలలో మరియు ఈ జన్మలో చేసిన పాపల ఫలితం గ రోగాలు బాధల ద్వారా పాపాలు నశింప చేసుకోవడం 3. ధర్మ రాజు శిక్షల ద్వారా పాపాలు నశింప చేసుకోవడం. 
ఏది సులువు ఒక్క పైసా ఖర్చు లేకుండా నేనెవరో తెలుసుకుని మిమ్మల్ని మీరు ఆత్మ అనుకొంటూ నన్ను స్మృతి చేయడం (ఇదే సహజ రాజ యోగం) ద్వారా పాపాలు యోగాగ్నిలో భస్మం చేసుకోవడం సులువు కదా. నేను మీకు తండ్రిని నా వారసత్వం అయిన అనేక జన్మల స్వర్గ సుఖం ఇవ్వడానికే ఇప్పుడు వచ్చాను. కర్మ బ్రహ్మణులుగా  మిమ్మల్ని ప్రజాపిత బ్రహ్మ పుత్రులుగా చేస్తున్నాను. బ్రాహ్మణుల నుంచి దేవతలుగా నన్ను తలుచుకోవడం ద్వారా అవుతారు. ఈ భూమి ఇప్పుడు నరకం దాన్ని నేను స్వర్గం గ చేసి మీకు వారసత్వం గ ఇస్తాను. ఐతే దానికి మొదటి మెట్టు మిమ్మల్ని మీరు ఆత్మ అనగా వెలిగే చుక్క ఈ మీ భ్రుకుటి లో స్థితులై ఉండాలి. పిదప నన్ను ఏ సాధారణ మానవునిలో ప్రవేశించి ప్రజాపిత బ్రహ్మ ద్వారా మిమ్మల్ని దత్తత తీసుకున్నానో తెలుసుకుని ఆ రధం ద్వారా నన్ను తలుచు కోవడమే రహస్య యోగం. ఎంత సులువు. అంతే తద్వారా నా వారసత్వం అనేక జన్మల శాంతి సుఖం పొందండి. 


Monday, September 2, 2019

స్థాపన సులభం, పాలన, వినాశనం కష్టం

త్రిమూర్తుల త్రికర్తవ్యాలు వాటిలో బ్రహ్మ స్థాపన కొంతైనా సులభం, కాని విష్ణువు ద్వారా పాలన శంకరుని ద్వారా వినాశనం చాలా కష్టం. మనం కూడా ఒక ఆలోచన స్థాపన సులభం, కాని ఆ అనుకున్న దానిని కార్య రూపం ఇచ్చి పాలించడం, దానికి అవసరమైయ్యే రక్షణ ఇవ్వడం, ఎదురయ్యే ఆపదలు నివారించి వినాశనం చేయడం అతి కష్టం.

Sunday, June 16, 2019

మూడవ నేత్రం


https://youtu.be/8bioBb8ZgMkకళ్ళు లేని వాడికి కళ్ళు ఇవ్వండి ప్రభు అని భక్తితో పాడతారు ,మూడో  నేత్రం పొందడానికి ప్రార్ధన చేస్తారు కాని ఆ కంటి గురించి వారికి తెలియదు. ఆత్మను పరమాత్మను తమ అనేక జన్మల రహస్యం వారికి తెలియదు భక్తీ లో పాడ తారు కాని రహస్యం తెలియదు ఆ నేత్రం అడుగు తారు కాని పొందలేరు. ఆ పరమాత్మను ఈ కళ్ళతో చూడ లేరు. భక్తులు మూడో నేత్రం అడుగుతారు కాని తెలియదు. అది భగవంతుడు స్వయం ఇవ్వ వలసినదే. ఎవరి దగ్గర ఆ మూడో నేత్రం ఉందో ఆయనే ఇవ్వగలరు వేరే వారు ఇవ్వ లేరు. ఎవరైనా తమ దగ్గర ఉన్నది ఇవ్వ గలరు కానే లేనిది ఎలా ఇవ్వ గలరు. మన శాస్త్రాల్లో మూడో నేత్రం ఎవరికీ ఉంది శంకరుడికి కాని శంకరుడిని భగవంతుడు అనలేము. ఒకవేళ భగవంతుడైతే  అయన ఎవరి ధ్యానం లో కురుచున్నారు భగవంతుడు శివుడు. శివుని ధ్యానం లో శంకరుడు కూర్చున్నాడు. శంకరునిలో శివుడు ప్రవేశించి నపుడు ఆయన ధ్యానం లో అయన కూర్చున్నాడు.శివుడు వేరు శంకరుడు వేరు.  శివ లింగం రూపం లో శంకరుడిని విగ్రహం రూపంలో చుబించారు. శివ రాత్రి అంటారు శంకర రాత్రి అనరు.శివ లింగం అంటారు శంకర లింగం అనరు. భగవంతుడు కాళ్ళు లేక పోయినా నడుస్తారు, చెవులు లేక పోయిన వింటారు, కళ్ళు లేక పోయినా చూస్తారు...అని మహిమ చేస్తారు .. ఎలా చేస్తారు? అంటే అరె అయన భగవంతుడు ఏమైనా చేస్తారు అంటారు. భగవంతుడు తన ప్రకృతి నియమాలను తానె ఉల్లంఘిస్తారా లేదు అయన ప్రవేశించి అవన్నీ చేస్తారు. గీత లో ప్రవేష్టుం అని చెప్పారు ప్రవేశిస్తారు.

VCD35

Friday, May 31, 2019

శివ వారసత్వం

శివ భగవానువాచ .....
నేను మీ ఆత్మలందరికి తండ్రిని మీరు ఎలా వెలిగే చుక్కో  అలానే నేను కూడా వెలిగే చుక్కను అనేక వేల సూర్యుల సమాన మైన కాంతిని అని కాదు. సూర్య కాంతి ఒక్క సూర్య కాంతికే బెంబేలు ఎత్తి పోతున్నారు అనేక వేల సూర్య కాంతి అంటే జ్ఞానం అనే కాంతి. 
నాలో జ్ఞానం అనేక వేల సూర్య కాంతుల సమానం అని అర్జునుడు అన్నాడు. అతడు అలా అనుభవం చేసాడు. నేను జ్ఞాన సూర్యుడిని. ఆ జ్ఞానం నేను మొదట సూర్యునికి ఇచ్చాను. గీత. 4-1 
మిమ్మల్ని మీరు ఆత్మ అనుకొని కేవలం నన్నే తలుచుకుంటే మీ అనేక జన్మల పాపాలు భస్మం అవుతాయి. అనేక జన్మలకు సుఖ శాంతులు వారసత్వం గా లభిస్తాయి. 

Wednesday, March 13, 2019

Fwd: సుభాషితం





1.  సర్వే యత్ర వినేతార:, సర్వే యత్ర పందడితమానిన:
    సర్వే మహత్త్వ మిచ్చంతి, తత్ బృందమవసీదతి.
తా: ఎచ్చట అన్దరూ పెత్తనంవహించవలెనని అనుకొందురో, ఎక్కడ అందరు తాము  పండితులమే ననుకొందురో, ఏ సంఘమున సర్వులు గొప్పతనమును ఆరోపించుకొందురో ఆ దేశము, ఆ సంఘము చివరకు నశించును. 
{जहां सब अपने हुकुम चलाना चाहतें है, जहाँ सब अपने आपको पण्डित समझने लगते है, और जिस संघटन में हर एक अपने को महान आत्मा समझ बैठे है उस संघटन विनाश को पाये गा| }
2. అకారై రింగితై ర్గత్యా , చేష్టయా భాషణేన చ,
   నేత్రవక్త్రవికారేణ, లక్ష్యతే అంతర్గతం  మన:                హితో.2-50
ఆకారములు , ఇంగితములు , నడకలు, చేతలు, మాటలు, నేత్రవక్త్రవికారములు వీట్లన్నిటవల్లా మనస్సులోని భావాలు వేల్లడవుతుంటాయి
*{अक्सर मनुष्य के हाव, भाव ,कर्म, दृस्टी,बोल, चाल-चलन इन सभी से मालूम पढ़ जाता है कि यह आत्मा किस धर्म और किस वर्ण का है| }  
3. प्रियवाक्यप्रदादानेन, सर्वे तुष्यन्ति जनताव्ह:
   तस्मात त्तदैव वक्तव्यं, वचने का दरिद्रता|
   ప్రియవాక్యప్రదానేన, సర్వే తుష్యన్తి జంతవ:
     తస్మాత్ త్తదేవ వక్తవ్యం, వచనే కా దరిద్రతా.
ప్రేమతో పలుకరించుటవలన సర్వ ప్రాణులును సంతోషమునోన్దుచున్నవి
కాన అందరితోనూ , యల్లవేళలా సత్యమైన, ప్రియమైన మంచి మాటలనే పలుకు చుండుము
మాటలకు కుడా ఎందుకు దరిద్రము ? నాయనా !
{* तुम बच्चे आपसमे बहुत प्यार से रहना है और तुम्हारे बोल हर हालत में सत्य,प्रिय और मीठी होनी चाहिए बोल के शब्दों में कभी दरिद्र नहीं बनना है| }   
4. సుఖస్య దుఃఖస్య  న కోఅపి దాతా, పరో దదాతీతి కుబుద్ధి రేషా,
   అహం కరొమీతి వృధాభిమానః  స్వకర్మసూత్రగ్రధితో హి జంతు:
తా: సుఖదు:ఖములకు దాత ఎవరు కారు. వాటిని ఎవరో కలిగిచుచున్నా రనునది సరియగు ఆలోచన కాదు. తన సుఖ దుఃఖ ములకు పూర్తిగ తానే కర్త నను భావమూ అహంబావమే. ప్రాణిలోకమంతయు స్వకర్మసూత్రముచే బద్ధమై సుఖదు:ఖాదుల ననుబవించుచున్న దనేదే యదార్ధము.
5. సువర్ణపుష్పాం ప్రుధ్వీవిం ,చిన్వంతి పురుషా త్రయ:
    సూరశ్చ కృతవిద్యశ్చ , యశ్చ జానాతి సేవితుమ్
తా: ఈ భూతలమును సువర్ణ పుష్పముగా చేయుచున్నవారు ముగ్గురే ముగ్గురు ఉన్నారు , సూరులు, విద్వాంసులు, సేవాకర్మ నిరతులు. ఈ మూడు తరహాలవారే అట్టి మహాత్ములు.
{इस धरती को सुवर्ण पुष्प जैसा बनाने वाले केवल तीन व्यति ही है , सूर्य वंशी, ज्ञानी आत्मायें और निरन्तर सेवा में तत्पर रहे लोग }
6. హతం గ్యానం క్రియాహీనం, హతా స్త్వజ్ఞానత: క్రియా:
   అపశ్య  న్న౦ధకో దగ్ధ:,  పశ్యన్నపి  చ  పంగుక: 

తా: ఆచరణ లేని జ్ఞానమున్ను , జ్ఞానములేని క్రియలున్ను కుడా నిరుపయోగములై  నశించును. నడువలేని కుంటివాడును, చూడలేని గుడ్డివాడున్ను ఇల్లు తగులబడినచొ  చూచుచునే కుంటివాడును, నడువగలిగియు గుడ్డివాడును నశింతురు గదా.
{* ज्ञान बिना कोई धारण के कुछ काम नहीं आयेगा}
 7. విద్యా వివాదాయ ధనం మదాయ , శక్తి: పరేషాం ఖలు పీడనాయ
     ఖలస్య సాధో ర్విపరీత మేతత్, జ్ఞానాయ దానయ చ రక్షణాయ.  

Monday, January 21, 2019

స్వానుభవం

రూమ్ అంతా లేత ఎరుపు రంగు పరుచుకుని ఉంది. గదిలో ఓక గోడకు తెల్లటి గురు పీఠం. పీఠానికి ఒక వైపు కిటికీ గది అంత 10*15 స్క్వేర్. ఉండవచ్చు. పీఠానికి ఇరువైపులా అందమైన మట్టి స్తంభాలు. వాటిపైన పూల కుండీలు. గదికి రెండు ద్వారాలు. కిటికీ లకు ద్వారాలకు తెల్ల పరదాలు సెల్ఫ్ డిజైన్ వి ఉన్నాయి. గదిలో ఓ పది మంది దాక వరుసలో కుర్చుని ఉన్నారు. గురువుగారు ఇంకా రాలేదు. ఎంతో శాంతి వాతావరణం ఉంది అక్కడ వెళ్ళిన వాళ్ళందరూ అర్ధ నిమీలిత నేత్రాలతో ధ్యానం చేస్తున్నారు. ఐదు నిముషాల్లో గురువుగారు వచ్చేసారు. వెళ్లి గురుపీఠం పై కూర్చున్నారు. అందరికీ దృష్టి ఇస్తున్నారు. ఆ దృష్టి తీసుకుంటున్న కొంతమంది ఆనందం తో బాష్పాలు రాలుస్తున్నారు. మరో గంట తరవాత గురువుగారు ఒక యోగిని ఇచ్చిన గ్లాసుడు పండురసం గటగటా తాగేసి ఆమెకు ఇచ్చేసారు. ఆమె ఆ గ్లాసు తీసుకుని వెళ్ళింది. అయన తన పీఠం పైన పక్కగా ఉన్న అట్ట తీసుకుని దానికి ఉన్న సందేశం చదవ సాగరు. సందేశం చదివి అర్ధం వివరించారు. ఇప్పటి వరకు మీరు ఎంతో విన్నారు. ఆ జ్ఞానం ఉంది, జ్ఞానం యొక్క నషా ఉంది, మీలో నిశ్చయం కూడా ఉంది. కాని ఇప్పుడు ఇంకొంచం ఎక్కువ కావాలి. ఆ ఎక్కువ ఏమిటంటే మతిలో గుర్తు ఉన్నది అంతా స్వరూపం లోకి రావాలి. జ్ఞానం ఒక్కటి బుద్ధిలో ఉంటే సరిపోదు అది ధారణ లో ఉండాలి. లేక పొతే రావణాసురుడి లాగా ఎన్ని శాస్త్రాలు చదివిన పండితుడైనా ఆచరణ లేక పొతే రాక్షసుడే అవుతాడు. జ్ఞానం స్వరూపం లో రావడం అంటే ఉదాహరణ కు ఓక వ్యక్తి సామాన్య వేషం లో ఉన్నా అతడు బాగా చదువుకున్న వాడు లేదా మంచి హోదా లో ఉన్న వాడు, ఒక షాహుకారు కొడుకు ఐతే అతనిలో ఆ హుందాతనం అతని నడవడికలో కనపడుతుంది. ఓహో ఇతను సామాన్యుడు కాదు విశేషత కల వ్యక్తి అని అతని గుణం కల వ్యక్తి అని తెలుస్తుంది. ఇలా ఇలా 2 ఘంటలు ఏక ధాటిగా అయన చెప్పుకు పోతున్నారు. కూర్చున్న వాళ్లకు ఆకలి దప్పులు లేవు. ఓం శాంతి అని అయన ముగించారు. అరె అప్పుడే అయిపోయిందా అని కూర్చున్న వారిలో కదలికలు. అయన చుట్టూ మూగిపోయారు ఒక తండ్రి చుట్టూ పిల్లలు చేరినట్లు. అయన అంతసేపు క్లాస్ చేసినా ఎటువంటి అలసటా లేకుండా ఎంతో ఓపికగా అందరిని పేరు పేరునా పలకరిస్తున్నారు. ప్రతివారిలో తమకు ప్రాణం కన్నా మిన్న అయిన వారిని కలుస్తున్న భావన. ఇటువంటి ప్రేమ మళ్ళి దొరకదు అన్నట్లు ఉన్నారు. వారి ఆనందానికి హద్దులు లేవు. మళ్ళి ఈన క్లాసు వేరే ఊరిలో. మళ్ళి అక్కడ కూడా ఇలాగె పిల్లల నడుమ సంగమం. శాంతికి 25 ఏళ్ల క్రితం ఎంత అనుభవం అయిందో అలాగే ఉంది. మొదట బాబా ను కలిసినప్పుడు ఎటువంటి అలౌకిక ఆనందమో అదే ఆనందం. వీసమెత్తు కూడా తగ్గలేదు. బాబా అప్పుడు 50 ఏళ్ళు ఇప్పుడు 75 అప్పుడూ అయన ఉత్సాహంగానే ఉన్నారు ఇప్పుడూ అదే ఉత్సాహం. తనకన్నా ముందు ఆయనను తెలుసుకున్న వారు అన్నారు అయన ఎప్పటికి 25 ఏళ్ల ఉత్సాహం తోనే ఉంటారు అని. ఆత్మిక శక్తి అంటే అదేనేమో. దేహం దేహ సంబంధాలు ఆయనను అడ్డుకోలేవు. అయన ప్రేమకు పరిమితి లేదు. తన పర భేదం లేదు. కలిసిన ప్రతివారు దివ్యానుభూతి పొందిన వారే. ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవం చెపుతుంటే మిగతా వారు మైమరచి పోయేవారు. గీతలో “కధయంతశ్చమాన్నిత్యం తుష్యంతిచ రమంతిచ.....”

చెప్పినట్లు జ్ఞానులు అయన మహిమ లు ఒకరికి ఒకరు చెప్పుకుంటూ పరమానందం పొందుతున్నారు.   

శంకరాచార్య

వేద శాస్త్రాల జ్ఞానం చిన్నప్పుడే అలవడింది శంకరచార్యునికి అంతే కాని ఇప్పటి సన్యాసుల్లా కాదు పెళ్ళాం చచ్చిపోయాక చూసుకునే వారు ఎవరు లేక దిక్కుమాలిన వైరాగ్యం వచ్చి సన్యాసం చేసి, మళ్ళి చాన్స్ దొరికితే ఏ సిష్యురా లి తోనో వ్యవహారం వెలగబెట్టె దొంగ సన్యాసి కాదు.

Sunday, January 20, 2019

బుద్ధి హజార్ నియామత్ అంటే?

ఇంద్రియాణి  పరాణ్యాహు : ఇన్ద్రియేభ్య:  పరం మన: 
మనసస్తు  పరాబుద్ధి యో బుద్ధి: పరసస్తు స:
 కర్మేంద్రియాల కన్నా జ్ఞానేంద్రియాలు శ్రేష్ఠమైనవి జ్ఞానేంద్రియాలకన్నా మనసు ప్రబలమైనది. మనసు కన్నా బుద్ధి ప్రబలమైనది బుద్ధి కన్నా అతడు అనగా పరమాత్ముడు ప్రబలమైన వారు. బుద్ధి ఈశ్వరుని ప్రసాదం అంటారు. బుద్ధి హజార్  నియామత్ అని హిందీ లో అంటారు. అంటే ఒక్క బుద్ధి సక్రమంగా ఉంటే ఎన్నైనా సాధించ వచ్చు అని అర్ధం. 
రాజయోగం విషయం లో ఏమి చెపుతారంటే ఎంత సూక్ష్మము ను ధ్యానిస్తామో అంత  బుద్ధి సూక్ష్మం అవుతుందని చెపుతారు. ఏకాగ్రంగా మరే  విషయము తలచకుండా ఒక్క బిందువు పై ఏకాగ్రం చేస్తే బుద్ధి అతి సూక్ష్మం అవుతుంది. ఎంత విత్తనం చిన్నదిగా ఉంటుందో వృక్షము అంత  విస్తారాన్ని పొందుతుందని వివరిస్తారు. ఉదాహరణకు మర్రి విత్తనం అతి సూక్ష్మం ఐనది మరి మర్రి చెట్టు ఎంత విస్తారంగా ఉంటుందో మనకు తెలుసు. 
ఆలా అది జడ వృక్షము ఐతే మరి ఆత్మ అతి సూక్ష్మము కనుక మరి అది ఏ విస్తారాన్ని పొందుతుంది. దానిలో అనేక జన్మల రహస్యాలు తెలుస్తాయి. చిన్న చిప్ లో ఎంతో  డేటా ఉన్నట్లు. అంటే ఎంతెంత సూక్ష్మ జ్యోతిర్బిందువుతో యోగం చేస్తామో అంతంత మన అనేక జన్మల రహస్యాలు మనకు స్ఫురిస్తాయి. ఐతే ఇందులో సద్గురువుకు అనివార్యమైన పాత్ర ఉంది. సద్గురువు లేకుండా అసలు యోగం అనేదే అర్ధం లేనిది అవుతుంది. సత్ గురువు అనే మాటే సత్య ప్రాధాన్యత స్పష్టం చేస్తుంది. 
ప్రస్తుతం ఈ లోకం లో ఎవరూ  సత్యమైన వారు లేరు. ఐతే అసలు సత్యం అంటే భగవంతుడు అయన గుప్త రూపం లో తన కర్తవ్యమ్ చేస్తున్నారు. గుప్తంగా ఎందుకంటే ప్రస్తుతం రావణ  రాజ్యం కనుక అందరూ రావణ  సేన కనుక కర్ర విరగ కుండా పాము చావకుండా కార్యం సాధించడానికి అయన గుప్తం గ ఉన్నారు. మనం ఒక్కొక్కరిగా రావణ సంకెల నుంచి రామ ఆశ్రయం లోకి రావాల్సిఉంది. 
ఓం శాంతి. 

Thursday, January 3, 2019

ఆధ్యత్మిక విశ్వ విద్యాలయం మరియు త్రిమూర్తి శివ అనగా ఎవరు?

ఆధ్యత్మిక విశ్వ విద్యాలయం మరియు త్రిమూర్తి శివ అనగా ఎవరు?
ఆధ్యాత్మిక  అనే పదం లో రెండు పదాలు ఉన్నాయి. అధి అనగా లోపల ఆత్మ అనగా ఆత్మ. అంటే ఆధ్యాత్మ పదానికి అర్థం ఆత్మలో ఏమి ఉంది అని తెలుసుకోవడం. మొదట ఆత్మ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఆత్మ ఒక చైతన్య శక్తి. జ్యోతిర్బిందువు అనగా వెలిగే చుక్క. అది ఎక్కడ ఉంది భ్రుకుటి లో ఉంది. దీనికి గుర్తుగానే నేటికీ భారతీయులు భ్రుకుటి మధ్యలో బొట్టు పెట్టుకుంటారు. మనిషి పూర్తి శరీరం ఒక యంత్రం. దానిని నడిపే శక్తి ఆత్మ. మనిషి ప్రతీ సందర్భంలోనూ నాది, నేను అంటూ ఉంటాడు. నా శరీరం నా చేయి నా కాలు అంటాడు కాని నేను శరీరం నేను చేయి అనడు. కనుక శరీరం వేరు ఆత్మ వేరు అని తెలుస్తుంది. ఈ విషయం శాస్త్రాలలో ఉంది అణో రణీయాం సం మనుస్మరేత్యః........ అనే గీతా శ్లోకం లో భగవంతుడు మనకు ఆత్మరూపం అణువు కన్నా అణువు అని వచించారు. భగవానువాచ మనకు శ్రీమతం. శ్రీమతం అంటే శ్రేష్ఠమైన మతం లేక వాక్కు. అది పాటించి తీరాలి. అది ఒక శాసనం. మిగతా వారి వాక్కులు పాటించినా పాటించకున్నా మనకు నష్టం లేదు. అందుకే శ్రీమత్ భగవత్ గీత అన్నారు.
కానీ ఈ రోజు ఆ శ్రేష్ఠమతం మనం పాటించడం లేదు. అందుకే మనకు ఇన్ని దుఃఖాలు. మొత్తం ప్రపంచమే దుఃఖ మయంగా ఉంది. ఇప్పటి మన యుగం పేరే కలియుగం అనగా కలహాలు, కష్టాలు, దుఃఖాల యుగం. ద్వాపర యుగంలో కృష్ణుడు వచ్చి శ్రీమత్ భగవత్ గీత ను చెప్పి వెళ్ళిపోయారు అంటే మరి ఇప్పటి మాట ఏమిటి, ఇప్పుడు మనకు గతి ఏమిటి ఇలా దుఃఖంలో కొట్టు మిట్టాడ వలసిందేనా, ఆ సంస్కృత గీత చదివినా కూడా ఇంకా ఎందుకు లోకం పతనావస్తలోకే పోతువుంది?  లేక ఎవరో ఒకరిని గురువును చేసేసుకుని ఈ దుఃఖాలనుంచి విముక్తి పొంద గలుగు తామా? ఎంతోమంది గురువులు ఎంతో మంది బాబాలు వారిని ఆశ్రయించిన జనాలు వారికి పడుతున్న గతిని మనం రోజూ పేపర్లలో టివీల్లో ఇతర ప్రచార మాధ్యమాల్లో చూస్తూ వింటూనే ఉన్నాం. దీనికి విష వలయానికి విరుగుడు ఏది?  శాంతి ఎక్కడ దొరుకుతుంది?  మనిషి విడిగానూ, సంఘం సమిష్టిగానూ ఈ రావణ రాజ్యం నుంచి విముక్తి ఎప్పుడు పొందుతాడు?  
పై ప్రశ్నలకు సమాధానమే గీతా భగవానువాచ యదా యదా హి ధర్మస్య......తదాత్మానం సృజామ్యంహం.
అవశ్యం అయన లోకం పరివర్తన చేయడానికి వస్తారు. ఎప్పుడు వస్తారు? ద్వాపర యుగం లో కాదు ద్వాపర యుగం లో వస్తే అయన చెప్పిన శ్రేష్ఠాతి శ్రేష్ఠ గీత ద్వారా కృతయుగం లేదా సత్య యుగం రావాలి కాని కలియుగం రాదు. కనుక అయన వచ్చే సమయం కూడా కలియుగం అంతం సత్య యుగం ఆరంభం మధ్య కాలం సంగమం , సంగమ యుగంలో ఆయన వచ్చి పాత నరకాన్ని కలియుగాన్ని కొత్త సత్యయుగం స్వర్గం గ పరివర్తన చేస్తారు.
మరి ఆయన శ్రీమతం ఎలా ఇస్తారు? దానికి సమాధానం కూడా గీతలోనే ఉంది....అవజానాంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం.... అంటే నేను ఒక వృద్ధమానవ శరీరం లో వస్తాను జ్ఞానులు నన్ను గుర్తుపడతారు, మూఢులు నన్ను గుర్తు పట్టరు అని.
పరమాత్మ మనకు తండ్రి. అత్మలందరికీ తండ్రి. ఆత్మ ఎలాగ ఒక చుక్క రూపం లో ఉందొ అలాగే పరమాత్మ కూడా ఓకే చుక్క లాగే ఉన్నారు. ఇద్దరి రూపం ఒకటే. ఉదాహరణకు, ఏనుగు తండ్రి ఏనుగు లాగే ఉంటాడో, చీమ తండ్రి చీమ లాగే ఉంటాడో, అలాగే ఆత్మలకు తండ్రి ఆత్మ లాగే ఉంటారు. మరి ఆత్మలకు పరమాత్మ కూ తేడా ఏమిటంటే, ఆత్మలు జనన మరణ చక్రం లో వస్తారు, పరమాత్మ రారు. అనగా మనిషి కి పుట్టడం చనిపోవడం ఉంది కాని పరమాత్మ కు లేవు. ఆయనను ఆజన్మ అభోక్త అకర్త అంటారు. ఆత్మ శరీరం లేకుండా ఏ కర్మా చేయలేదు. ఆత్మకు కర్మలు చేయడానికి 5 తత్వాలతో తయారైన శరీరం కావలి. అలాగే పరమాత్మ కూడా శరీరం లేకుండా జ్ఞానం ఇవ్వలేరు. అయన శ్రీమతం ఇవ్వాలంటే ఆయనకు కూడా శరీరం ఆధారం కావలి. ఇంతకు ముందు తెలిపినట్లు అయన ఒక వృద్ధ మనవ శరీరం ఆధారం చేసుకుని అతని ముఖం ఉపయోగించి మనకు శ్రీమతం ఇస్తారు. అయన మనలాగా గర్భం తో జన్మ తీసుకోరు. ఎందుకంటే అయనకు జనన మరణాలు లేవు. మరి ఎలా మనకు జ్ఞానం ఇవ్వాలి. ఆయనది దివ్య జన్మ అనగా దివ్య ప్రవేశం చేస్తారు. శ్రిమద్భగవత్ గీత లో ప్రవేష్టుం చ పరంతప అనే పదం చెప్పారు, జన్మ కర్మ చ మే దివ్యం అనే శ్లోకం లో కూడా చెప్పారు..... పై శ్లోకాల ద్వారా మనకు రుజువు అవుతుంది అయన ప్రవేశించే యోగ్యుడు, మరియు అయన జన్మ దివ్యము అని. దివ్యం అంటే తప్పకుండ మనలాంటి జన్మ కాదు అని తెలుస్తుంది. ప్రవేష్టుం అనే పదం ద్వారా ప్రవేశించి తీసుకునే జన్మ అని కూడా తెలుస్తుంది.
ఇప్పుడు మన కర్తవ్యమ్ ఆయనను తెలుసుకోవడం, ఎవరి ఆధారం తీసుకున్నారు? ఎవరి ద్వారా శ్రిమతం ఇస్తున్నారు?
అయన సర్వ వ్యాపకుడు కాదు. ఒక వేళ అందరిలో ఉన్నాడు అని అంటే మరి భగవంతుడి కోసం ఎందుకు వెతుకుతున్నారు, గీతలో సంభవామి అంటే వస్తాను అని ఎందుకు అన్నారు, వస్తాను అంటే ఇక్కడ లేను అనే కదా అర్థం. అలాగే, అసహాయులై ఎక్కడ ఉన్నావు భగవంతుడా అని వెతికే భక్తుడిలో ఉంటె మరి వెతకడం ఎందుకు. అలాగే దుష్కర్మలు ఇతరులను స్వార్ధం కోసం చంపడం, స్త్రీలను మానభంగం చేసే వారిలో అయన ఎలా ఉంటారు? అలాగే రాయి రాప్పలో కూడా ఉండరు అవి జడం అయన పరమ చైతన్యం. కనుక అయన సర్వ వ్యాపకుడు కాదు. మరి కాదు అంటే ఒకరి లో వస్తాను అంటే ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి కదా. అయన అతి సుక్ష్మ మైన వారు, ఒక సినిమాకు డైరెక్టర్ లాగా తేర వెనుక ఉండి నాటకం నడిపించేవారు. గుప్తం గ ఉన్నారు. ఈ జగన్నాటకం లో హీరో పాత్ర ధారి ఇతనినే ఆడమ్ ఆదాము ఆది దేవుడు, ఆది నాధుడు అని అన్ని ధర్మాల వారు తమ తండ్రిగా ఒప్పుకున్నారు, ఇతనిలో ఆ పరమ పిత ప్రవేశించి ఆధారం చేసుకుని ఈయన ముఖం ద్వారా శ్రిమతం ఇస్తున్నారు. ఇందరు మనుషులలో ఈ హీరో ఎవరు ఎలా తెలుస్తుంది? అనేక జన్మలు తీసుకుని ఆ మొదటి వ్యక్తి తన జన్మలు మరిచి పోయాడు. అతనే కాదు మనమందరం కూడా మన గత జన్మలు మరిచి పోయాము. ఉదాహరణకు నెహ్రు విగ్రహం పెడతాము. ఆ నెహ్రు చనిపోయి ఇప్పుడు వేరొక జన్మ లో ఉన్నాడు. అతను ఇప్పుడు తన గత జన్మను తనే గురుతు పట్టలేడు. తన విగ్రహాన్ని తనే తెలుసుకోలేడు. ఇది నేనే అని. అలాగే ఒకప్పుడు మనం దేవతలం కానీ ఇప్పుడు అనేక జన్మల అనంతరం మనం మన ముందు జన్మలను మరిచి పోయాము. కాని భగవంతుడు జనన మరణ రహితుడు ఆయనకు మరుపు లేదు, జ్ఞాన సాగరుడు. కనుక ఆయనకు మనం ఎవరమో తెలుసు. మన జన్మ రహస్యాలు కూడా తెలుసు. దీనినే శ్రీమత్ భగవత్ గీత లో కూడా హే అర్జున నీకు నీ జన్మల రహస్యం తెలియదు నాకు తెలుసు అని భగవానువాచ. కనుక ఆ హిరో పాత్ర దారి ఎవరో భగవంతుడికి తెల్సు. అతనిలో ప్రవేశించి ధరప్రవాహకం గ జ్ఞానం వినిపిస్తున్నారు. ఆ జ్ఞానం విన్నప్పుడు మనకు ఎటువంటి జ్ఞానం భగవంతుడు తప్ప వేరే ఎవరు తెలుప లేరు అని తెలుస్తుంది.
భగవంతుడు వేరు దేవతలు వేరు. భగవంతుడు దేవతలకు తండ్రి. యో యధా మాం ప్రపద్యన్తే తాం తధైవ భజామ్యహం ,..... దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి.....అనే శ్లోకాల ద్వారా దేవతలను తలచేవారు దేవతలను, నన్ను తలచేవారు నన్ను పొందుతారు అని భూతాని యాన్తి భూతేజ్యా యాన్తి.... అంటూ భూత ప్రేతాలను పూజ చేసేవారు భూతాలను, పిత్రూన్ యాన్తి పిత్రున్ అని పెద్దలను తలచేవారు పెద్దలను చేరుకుంటారని భగవానువాచ.  దీనిని బట్టి భగవంతుడు ఒక్కరే, దేవతలు ౩౩ కోట్ల మంది అని శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. భగవంతుని పేరు సదా శివుడు, మిగత బ్రహ్మ, విష్ణు, శంకర్, సరస్వతి, లక్ష్మి, పార్వతి, అష్ట దేవతలు, ఇంద్రాది దేవతలు అయన పిల్లలు. సదా శివుడు జ్యోతి స్వరూపుడు. క్షీణే పుణ్యే మర్త్య లోకం విశన్తి... అనే శ్లోకం ద్వారా పుణ్య కర్మల ద్వారా దేవతలు అయ్యి తరవాత ఆ పుణ్యం అనుభవించి కరిగి పోగా తిరిగి మర్త్య లోకానికి వచ్చేస్తారు అనే శ్లోకం ద్వారా తెలుస్తుంది. అంటే ఒకప్పటి దేవతలే తమ పుణ్యం ఖర్చై పోగా మనుష్యులుగా ఐపోతారు అని భగవానువాచ.

శివ పరమపిత మిగతా దేవతలందరినీ మనుష్యుల నుంచి దేవతలుగా మారుస్తారు అని తెలిపారు. సిఖ్ ధర్మం లో అందుకనే ఓక నానుడి ఉంది మానుస్ సే దేవతా కియే కరత న లాగి వార్ అని. వార్ అంటే సమయం భగవంతుడు శివునికి మనుష్యుల నుంచి దేవతలుగా మార్చడానికి సమయం పట్ట లేదట.  .......ఇంకా ఉంది...

Featured Post

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్.

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్. ఒక సంక్షిప్త పరిచయం ఇక్కడ కింద తేదీలు పుట సంఖ్యలు ఇచ్చినవి గురువు గారి ప్రవచనా...