Friday, November 13, 2020

 

VCD-310 రిజిస్టర్ న.39, 19-8-84 ఉదయం క్లాస్. ఎవరి స్మృతి లో కూర్చున్నారు? ఇది ప్రియాతి ప్రియమైన సంబంధం ఒక్కరితో. ఇది అన్ని దుఖాలనుంచి విముక్తిని ఇచ్చేది. తండ్రి పిల్లలను చూస్తూ ఉంటారు, అప్పుడు పాపాలు కట్ ఐపోతూ ఉంటాయి. ఆత్మ సతోప్రధానత వైపు పోతూ ఉంది. అంతులేని దుఖాలు ఉన్నాయి కదా. అందుకే దుఃఖ హర్త సుఖ కర్త అని పాడతారు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని అన్ని దుఖాల నుంచి విడిపించడానికి వచ్చారు. స్వర్గం లో దుఃఖం మచ్చుకైనా ఉండవు. అటువంటి తండ్రిని స్మృతి చేయడం చాలా అవసరం. తండ్రికి పిల్లల పట్ల ప్రేమ ఉంటుంది. పిల్లలకు తండ్రి మీద ప్రేమ ఉంటుంది. ఐతే మీకు తెలుసు తండ్రికి ఏ ఏ పిల్లల మీద ప్రేమ ఉంది అని. పిల్లలకి మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోండి, దేహం అనుకోవద్దు అని బోధించారు. మీరు కూడా పిల్లలే, సృష్టి లో అందరూ పిల్లలే, మరి ఎంత మంది వరుసవారి గా ఉన్నారు తండ్రి దగ్గరికి వస్తారు. ఎవరైతే బాగా  నడుస్తూ తిరుగుతూ (కూడా) తండ్రిని స్మృతి చేస్తారో వారికే చెబుతున్నారు. అది కూడా ఎందుకు చెబుతున్నారు? ఎందుకంటే మీ యొక్క పాపాల కుండ నిండి పోయి ఉంది ఈ స్మృతి యాత్ర ద్వారానే మీరు పాపాత్మ నుంచి పుణ్యాత్మ అవుతారు, ఆత్మ పుణ్యాత్మ అవుతుంది. ఇది పురాతన శరీరం అని కూడా మీకు తెలుసు. దుఃఖం అత్మకే ఉంటుంది. దుఃఖం పేరు చెపుతున్నారు అంటే దుఃఖ ధామం లో ఉన్నాము అని, సుఖ ధామం లో కష్టం కొంచం కూడా ఉండదు. ఇప్పుడు చాలా తక్కువ సమయం ఉంది కనుక తండ్రిని తలుచుకునే పూర్తి  పురుషార్ధం చేయాలి. ఎంత స్మృతి లో ఉంటారో అంత సత్వ ప్రధానం గా అవుతారు. పురుషార్ధం చేసి ఎటువంటి స్థితి తయారు చేసుకోవాలి అంటే అంతిమ సమయం లో తండ్రి తప్ప ఇంకెవరూ గుర్తుకు రాకూడదు. ఒక గీతం కూడా ఉంది “అంత కాల్ జో స్త్రీ సిమిరే” అంటే అంతిమ సమయం లో ఎవరు స్త్రీ ని తలుచుకుంటారో” అని ఇది అంతిమ సమయం కదా. పురాతన లోకం దుఃఖ ధామం యొక్క అంతం, ఇప్పుడు పిల్లలు మీరు సుఖ ధామం కోసం పురుషార్ధం చేస్తారు. మీరు శూద్రుల నుంచి బ్రాహ్మణులు అవుతారు. మనుషులు అందరూ శూద్రులు, ఇప్పుడు మీరంతా బ్రాహ్మణులు అయ్యారు. ఇది గుర్తు ఉండాలి కదా.  శూద్రులకు దుఃఖం ఉంది, ఇప్పుడు మీరు దుఃఖం నుంచి బయట పడి మళ్ళి శిఖరానికి ఎక్కారు, కనుక ఈ తండ్రిని తలుచుకోవాలి. మోస్ట్ బిలవేడ్ తండ్రి ఈయన కన్న ఉన్నత మైన మధురమైన వస్తువు ఏది లేదు ఈ లోకం లో. ఆత్మ ఆ పరమ పిత పరమాత్మనే తలుచుకుంటుంది కదా. అందరు అత్మలకూ అయన తండ్రి. అయన కన్నా మదురమైన వారు వేరే ఎవరూ ఉండలేరు.  ఇంత మంది అనేక మైన పిల్లలు గురుకు వస్తూ ఉంటారు , ఈ సృష్టి అంతా ఎలా తిరుగుతుందో అంతా అర్ధ సహితం గా ఉంది. ఎవరైనా ఏదైనా డ్రామా చూసి వస్తుంటే డ్రామా గుర్తుందా అని అడిగితె అప్పుడు డ్రామా అంతా బుడ్డిలోకి వచ్చేస్తుంది. మొదటి నుంచి చివరి వరకు, ఐతే వర్ణన చేసి చెప్పడానికి టైం పడుతుంది. బాబా అనంత మైన తండ్రి. తండ్రి గుర్తుకు వస్తూనే 21 జన్మల సుఖ ప్రాప్తి గుర్తుకు వస్తుంది. సెకెండు లో తండ్రి నుంచి ఈ వారసత్వం వస్తుంది. సత్యయుగ త్రేతా యుగాలు దృష్టి లోకి వస్తాయి. పిల్లాడు పుట్టాడు అనగానే తండ్రి కి తెలిసి పోతుంది వారసుడు వచ్చాడు అని. మొత్తం ఆస్తి అంతా గుర్తుకు వచ్చేస్తుంది. అలాగే మీరు కూడా రక రకాల పిల్లలు రక రకాల వారసత్వం లభిస్తుంది. (ఎందుకంటే) రక రకాలుగా స్మృతి చేస్తారు. ఒకే లాంటి స్మృతి ఐతే లేదు. అనంత మైన తండ్రి కి వారసులు. సత్యయుగం లో ఒకే వారసుడు ఉంటాడు. మొత్తం ఆస్తికి ఒక్కడే కొడుకు వారసుడు . అనంత మైన తండ్రి లభించారు, అనంత మైన వారసత్వం లభించింది సెకెండు లో ఏమాత్రం ఆలస్యం లేదు, మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోండి, మేల్ లేదా ఫిమేల్ అనుకోవద్దు. ఆత్మ అంటే అబ్బాయి కదా.  పిల్లలు అంటారు మాకు అంతా గుర్తుకు వచ్చింది అని ఆత్మలు అందరూ భాయి భాయి అని ఎవరు వచ్చినా చెపుతారు అన్ని ధర్మాల వారు భాయి భాయి అని. కానీ ఎలా భాయి భాయి అయ్యారో వారికి అర్ధం కాదు. ఇప్పుడు మీకు తెలుసు మనం బాబా కి మోస్ట్ బిలవేడ్ పిల్లలం అని. ఎందుకంటే ప్రాక్టికల్ గ బాబా ఉన్నారు. ప్రాక్టికల్ అంటే శరీరం తో తండ్రి నుంచి పూర్తి అనంత మైన వారసత్వం తీసుకుంటాం. ఐతే ఎలా తీసుకుంటారు? అది కూడా మీకు పిల్లలకు సెకెండ్ లో గుర్తుకు వస్తుంది. మనం సతో ప్రధానం గా ఉండేవాళ్ళం తమో ప్రధానం అయిపోయాం, ఇప్పుడు మళ్ళి సత్వ ప్రధానం గా అవ్వాలి, మీకు తెలుసు మనం బాబా నుంచి సుఖం అనే వారసత్వం తీసుకోవాలి. తండ్రి మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోండి అని చెపుతున్నారు. దేహం వినాశి ఆత్మ శరీరం విదిచి వెళ్లి పోతుంది తిరిగి వెళ్లి గర్భం లో వేరే శరీరం తీసుకుంటుంది, తోలుబొమ్మ తాయారు అయినప్పుడు ఆత్మ అందులో ప్రవేశిస్తుంది. లోక ఉదాహరణ ఎందుకు ఇచ్చారు? కాని ఆ ఏ తోలు బొమ్మ తాయారు అవుతుందో ఆత్మ ప్రవేశిస్తుందో అది రావణాసురుని వశం లో ఉంది కనుకనే వికారాల వశం అయి రావణ జైలు లో కి వెళుతోంది . మరప్పుడు సత్య యుగం లో నైతే రావణుడు ఉండనే ఉండడు. తోలు బొమ్మలు అక్కడ కూడా తాయారు అవుతాయి, దుఃఖ విషయమే లేదు, ముసలితనం వచ్చాక తెలుస్తుంది ఇప్పుడు మనం ఈ శరీరం విడిచి వెళ్లి తల్లి గర్భం లో ప్రవేశిస్తాము అని, అక్కడ భయం అనేదే ఉండదు. ఇక్కడ చుడండి ఎంత భయపడ తారో. అక్కడ నిర్భయం గా ఉంటారు. తండ్రి మిమ్మల్ని అపార సుఖాలలోకి తీసుకు వెళతారు. సత్య యుగం లో అపార సుఖాలు ఉన్నాయి, కలియుగం లో అపార దుఖాలు ఉన్నాయి. అందుకే దీనిని దుఃఖ ధామం అంటారు. తండ్రి ఐతే ఏమాత్రం కష్టం ఇవ్వరు. గృహస్త వ్యవహారం లో ఉంటే ఉందండి, పిల్లల్ని చూసుకోండి, కేవలం తండ్రిని తలుచుకోండి. ఈ గురువులు గోసాయి లను అందరిని విడవండి. నేను అందరు గురువులకన్న పెద్ద గురువును కదా. నేను తప్ప మరెవరు పతిత పావనులు లేరు. బ్రహ్మ విష్ణు శంకరులను పతిత పావనులు అంటారా? లేదు. దేవతలను కూడా అనలేము. నేను తప్ప. ఎందుకు అనలేము. ఎందుకంటే బ్రహ్మ విష్ణు శంకరులకు కూడా సుక్ష్మ శరీరం ఉంది. పతితులను పావనం చేయడానికి ఈ సృష్టి పైకి రావాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు (పిల్లలు) గంగను పతిత పావని అంటారా? అనరు. గంగను కూడా అనరు, దేవతలను కూడా అనరు నన్ను తప్ప. ఈ నీళ్ళ నదులు సదా ఉండనే ఉన్నాయి,  ఈ గంగా బ్రహ్మ పుత్ర ఎప్పటి నుంచో వస్తూనే ఉన్నాయి. వీటిల్లో స్నానాలు చేస్తూనే ఉన్నారు. వానలు పడితే వరదలు వస్తాయి. ఇది కూడా దుఃఖం ఐపోయింది. అంతులేని దుఃఖం.

No comments:

Post a Comment

బ్లాగ్ సందర్శించినందుకు ధన్యవాదాలు. త్వరలో మా స్పందన తెలుపగలము.

Featured Post

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్.

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్. ఒక సంక్షిప్త పరిచయం ఇక్కడ కింద తేదీలు పుట సంఖ్యలు ఇచ్చినవి గురువు గారి ప్రవచనా...