Saturday, June 8, 2024








ఈ మురళి డెంటల్ జిల్లా బిల్లా అనే ఊరిలో చెప్పారు. శివ గీత సత్య గీత . ప్రస్తుతం శివ పరమాత్మ ఈ సృష్టిలో ఒక సాధారణ వ్యక్తిలో ప్రవేశించి ఉన్నారు.  కొత్త ప్రపంచం స్థాపన చేస్తున్నారు. ఈ పాత ప్రపంచం వినాశనం కాబోతున్నది. 

భగవంతుడు మనకు అంటే కులం మతం రంగు దేశం భాష బీద గొప్ప తేడా లేకుండా అందరికీ  తండ్రి. తండ్రి వచ్చి ఇప్పుడు అనేక జన్మలకు సరిపడా వారసత్వం ఇవ్వడానికి వచ్చారు. అందరూ  ఒప్పుకునేది ఒక్కరే భగవంతుడు అని. మనం అందరం ఆయనకు పిల్లలం అని. మరి అయన గురించి ఎవరికీ ఎందుకు తెలియదు. తెలిస్తే ఇన్ని భేదాలు ఎందుకు ఈ గొడవలు ఎందుకు. తండ్రి (భగవంతుడు) లేని అనాధలే వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుంటారు. తండ్రి ఉన్న పిల్లలు కొట్టుకోరు. 

అయన గురించి ఎవరికీ తెలియదు. ఎందుకంటే అయన అందరికన్నా ఆది పురుషుడు. అందుకే తన గురించి పరిచయం ఆయనే ఇస్తారు స్వయమేవాత్మనా ఆత్మానం ... అనే గీత శ్లోకం ఇందుకు రుజువు. అహం ఆదిర్హి  దేవానాం ఋషీణాం చ సర్వశః అనే గీత శ్లోకం కూడా ఇదే రుజువు చేస్తుంది. 

ఇప్పటివరకు అయన తెలియరో అప్పటివరకూ అయన ఆస్తికి వారసులు కాలేరు. కనుక భేదాలు వీడి నిరహంకారులై ఆ సత్యం శివమ్ సుందరం ఐన పరమాత్మను తెలుసుకుందాం. మరి ఎక్కువ సమయం లేదు. త్వరలోనే కొత్త ప్రపంచం తయారై పోతుంది. అందులో ప్రవేశించాలి కదా అందరూ  ఆహ్వానితులే ఐతే ఒకటే అర్హత పరమాత్మ  ఎవరిలో ప్రవేశించి ఈ దివ్య కార్యం చేస్తున్నారో ఆయనను తెలుసుకోవాలి ఆయనకు వారసులు కావాలి. దానికై మేము ఇచ్చే ఉచిత రాజయోగ శిక్షణ ఏడు  రోజుల సప్తపది తెలుసుకోవాలి. 

ఓం నమః శివాయ. 
 

Featured Post

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్.

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్. ఒక సంక్షిప్త పరిచయం ఇక్కడ కింద తేదీలు పుట సంఖ్యలు ఇచ్చినవి గురువు గారి ప్రవచనా...