Friday, April 8, 2016

ఉగాది శుభాకాంక్షలు

Image result for nature pictures flowers


బ్లాగర్లందరికి హార్దిక ఉగాది శుభాకంక్షలు మీ బ్లాగింగ్ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగాలని కోరుకుంటూ.....

Monday, April 4, 2016

స్వర్గం నరకం

స్వర్గం నరకం
సృష్టి రూపి నాటకరంగం లో నాలుగు యుగాలూ నాలుగు సీన్లు. సత్య యుగం లేదా కృత యుగం మరియు త్రేతా యుగం  ఈ రెండు యుగాలూ స్వర్గం ద్వాపర యుగం మరియు కలియుగం ఈ రెండూ నరకం.
స్వర్గం అనేమాటకు అర్ధం స్వ అంటే ఆత్మ, గ అంటే వెళ్ళడం అంటే ఆత్మిక స్థితి లోకి వెళ్ళడం. అంటే నేను ఆత్మను అని స్వరూప నిష్ఠుడు అవ్వడం. ఆత్మ అంటే వెలిగే చుక్క స్టార్ అది శరీరంలో భృకుటిని చేరి ఉంటుంది. శరీరము ఒక యత్రం ఒక కారు అయితే దానిని నడిపేది ఆత్మ  డ్రైవర్. ఇప్పుడు అంటే కలియుగంలో మనం శరీరమే మనము అనుకుంటున్నాము కానీ వాస్తవానికి మనము వేరు మన శరీరము వేరు. ఈ ఆత్మ జ్ఞానం కలవారిని దేవతలు అంటారు. మనము మాటి మాటికి దేహం అనుకుంటున్నాము కనుక మనము దేవతలము కాము.
ఒక కల్పం అంటే 5000 సంవత్సరాలు. ఒక కల్పంలో 4 యుగాలు. 4 యుగాలూ 1250 సంవత్సరాలు నిడివితో ఉంటాయి. అంటే సత్యయుగం 1250, త్రేతా - 1250, ద్వాపర్- 1250 మరియు కలియుగం -1250 సం. నిడివి కలవి.
సత్య యుగంలో మనిషి పరిపూర్ణుడుగా ఉంటాడు, 16 కళల సంపూర్ణుడు. అక్కడ ప్రకృతి సత్వ ప్రధానంగా ఉంటుంది. ఏ లోటూ ఉండదు. సంపూర్ణ ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య, ఆనందాలు కలిగి ఉంటాడు. దుఃఖం అనేది ఉండదు. శరీరం స్వర్ణ సమానంగా ఉంటుంది. 8 జన్మలు తీసుకుంటారు. ఈ యుగాన్ని స్వర్ణ యుగం అంటారు.
ఒకే ధర్మం ఒకే భాష, ఒకే పాలక రాజు ఉంటారు. ఒకటే రాజ్యం. మనుషులు సాత్వికంగా ఉండడం వల్ల దేవతలు అని పిలవబడతారు.
త్రేతా యుగంలో కూడా అన్ని సుఖాలూ ఉంటాయి కానీ సత్యయుగం కన్నా కొంచెం తక్కు వ. త్రేతా యుగం లో 14 కళల వారిగా ఉంటారు. జన్మలు 12 ఉంటాయి. ఈ యుగాన్ని రజత యుగం (వెండి) అంటారు. మనుషులు సత్వసామాన్యంగా ఉంటారు కనుక ఇక్కడ క్షత్రియులు అంటారు.
ద్వాపర యుగం అంటే ద్వా అంటే రెండు కనుక ఇప్పటి నుంచి రెండవ ధర్మం ప్రవేశిస్తుంది. అద్వైతం ద్వైతం అవుతుంది. పాలకులు ఇద్దరు ఆదిగా ఉంటారు...రాజ్యాలు వేరు అవుతాయి. నరకం ఆరంభం. దుఖం ఆరంభం.
8 కళలు ఉంటాయి. 21 జన్మలు ఉంటాయి.  సత్యత్రేతా యుగాలలో సంపూర్ణ ఆయుష్షు కలిగిన దేవతలు ఉంటే ద్వాపర కలియుగాలలో అల్పాయుష్కులైన మానవులు ఉంటారు. ద్వాపర యుగం  తామ్ర (రాగి) యుగం. ఇక్కడ మనుషులు రజోప్రధానంగా ఉంటారు (కోపం) కనుక వైశ్యులు అని పిలవబడతారు.
కలియుగం ఇక్కడ అనేక ధర్మాలు మొదట రాజులు ఉన్నా కలియుగాంతానికి ప్రజలపై ప్రజా రాజ్యం ఉంటుంది. రాజులనే వారే ఉండరు. నామమాత్రపు రాజులు. అనేక భాషలు, అనేక దేశాలు యుద్దాలు...కలహాలు క్లేశాలు కనుక కలియుగం అని పేరు. ఇది లోహ (ఇనుప) యుగం. అశాంతి దుఃఖం అపవిత్రత కామ క్రోధ లోభ మోహ అహంకారాలు పెచ్చరిల్లుతాయి. ఇక్కడ సున్నా(0) కళలు, 42 జన్మలు.. అంటే జన్మలు పెరుగుతూ ఆయుష్షు తగ్గుతూ వస్తుంది. ఇక్కడ మనుషులు తమోప్రధానంగా ఉంటారు కనుక శూద్రులు అని పిలవబడతారు.
ప్రస్తుతం మనం కలియుగం లో ఉన్నాము అని ప్రతీ వారూ ఒప్పుకోవలసినదే. కొంత మంది అతి ధనవంతులకు ఇదే స్వర్గం లా అని పించ వచ్చు కానీ వారికి కూడా మానసిక శారీరక రుగ్మతలు దుఃఖం అనేవి ఉన్నాయి.
ప్రతీవారూ శాంతిని సుఖాన్నీ కోరుకుంటారు.  ఇది చక్రం సృష్టి చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు కలియుగం అంతం అయ్యే సమయం వచ్చింది. కలియుగం అతిలోకి పోతుంది. అతి అయ్యి అంతం అవుతుంది. తిరిగి సత్యయుగం రాబోతున్నది.




Sunday, April 3, 2016

గీతా మకరందం


అ)ఆత్మ కు చావు లేదు అని అంటాము కానీ తీరా మనదాకా వచ్చే సరికి మరిచిపోతాము. అయితే భగవానువాచ ఆత్మను చనిపోయేది మరియు చంపునది అని తలచేవాడు అజ్ఞాని అని...
1)య ఏనం వేత్తి హన్తారం యశ్చైనం మన్యతే హతమ్,     (2,19)
ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే
సం.వ్యాఖ్యః----యో మనుష్యః చిన్తయతి అస్య ఆత్మన్ యథా మృత్యుః ఉపగమ్యతి అథవా మృత్యుం దదాతి సః అజ్ఞానీ ఏవ, యతః అస్య ఆత్మన్ న మరతి వా మారిష్యతి.
ఆత్మను చనిపోయేదానిగానూ, చంపుదానుగానూ తెలిసిన వాడు (అనుకొనువాడు) అజ్ఞాని, ఏలననగా ఆత్మ ఎవ్వరినీ చంపదు మరియు ఎవరిచేతనూ చంపబడదు.
ఆ)ఎన్నో కోరుకుంటాము తీరకపోతే చింతపడతాము. మనసును నియంత్రించుకునేవానికి అన్నీ సమకూరుతాయి అని భగవానులు చెబుతున్నారు. 
2)అపూర్యమాణమచల ప్రతిష్ఠం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్    (2,70)
తద్వత్ కామా యం ప్రవిశంతి సర్వే స శాంతిమాప్నోతి న కామకామీ
సం.వ్యాఖ్యః--- నద్యాః వినా  ప్రకంపితం తం అచల ప్రతిష్ఠితం సముద్రం ప్రవిశంతి, తావదేవ కామాః ప్రయోజనాః స్వయమేవ ప్రవిశంతి తం, యో అచల ప్రతిష్ఠితః, సః శాంతిమాప్నోతి నతు కామీ పురుషః.
నదులు సముద్రుని స్థాన భ్రంశము కానీయకయే స్వాభావికముగా ప్రవేశించి నట్లు స్థిర చిత్తుని స్వయముగానే అన్ని భోగములూ వరించును అతడు శాంతిని పొందును అంతేకానీ కామనల పై పరితపించు కామిని కాదు. భోగి శాంతిని పొందజాలడు.

Featured Post

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్.

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్. ఒక సంక్షిప్త పరిచయం ఇక్కడ కింద తేదీలు పుట సంఖ్యలు ఇచ్చినవి గురువు గారి ప్రవచనా...