Monday, December 17, 2018

అన్నీ నీవే

అన్నీ నీవే నాకు, ఓ ప్రభు నీవు వస్తే అన్ని నీవే నా దంటూ ఏమీ లేదు. కలలలో నీవే. లోకం లో అందరికన్నా ఎక్కువ ప్రేమించేది నీవే. కనుక నిన్నెలా మరువను. లోకంలో అందరూ వెక్కిరించారు నన్ను. నీ నీడలో ముఖం దాచుకున్నాను నేను. లోకం లో అందరూ మోసం చేసారు నన్ను. దరిచేరుచుకుని ఆదరించావు నీవు. అపనింద వేశారు అంతా నన్ను. ఆసరా నిచ్చావు నీవు. మెతుకు వెతుకుతున్న నాకు పెన్నిధి వైనావు నీవు.
నిద్ర సర్పమై కబళించే నన్ను వెలుగువై చైతన్య పరిచావు నీవు. అందరిలో ఏకాకినైన నాకు ఏకాంత తత్వ సారమై కమ్ము కున్నావు నీవు. అనంత శాంతి వి నీవు, అమృత భాండము నీవు. నిన్ను చూచాను, అనుభవం చేశాను, అతీంద్రియ సుఖం ఏమని వర్ణించను, మూగవానికి తిన్న మధుర ఆస్వాదన తెలుప మాటలు కరువైన  రీతి, సర్వ శక్తి , ప్రేమ సాగరుడవైన నీ కరుణ వర్ణించ జాలను నేను.  

Friday, October 12, 2018

నిత్యమూ అవిరళమూ

అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పలేదు?
అంటే మొత్తం సృష్టా, లేకపోతే జడ, జంగమ సృష్టా, దేవతల సృష్టా, రాక్షసుల సృష్టా......అసలేంటి.....అని
ఏ సృష్టో తెలిస్తే జవాబు స్పష్టం గా ఉంటుందని.....
చరాచర జగత్తు
జగత్తు....విడి విడి గా నా లేక మొత్తంగా నా
టైము తో సంబంధం ఉందా లేదా అని
కలియుగ సృష్టా లేక సత్య యుగ సృష్టా అని
మొత్తం మీద
బిందువు బిందువు కలిస్తే సాగరం అయినట్లు ఒక్కొరి సృష్టి కలిపి మొత్తం సృష్టి అవుతుంది
అలాగే సమిష్టి సృష్టి ప్రభావం ఒక్కరి మీద కూడా పడుతుంది
అనగా స్రృష్టి కారకుడు ఒక్కడే
ఎవరికి వారు ఒక్కరే మరి అలాగే అందరికి కలిపి కూడా ఒకరే. ఏ ఒకరు అందరి మీదా ప్రభావం చూపిస్తారో ఆయనే భగవంతుడు
నా ద్రృష్టి కారకుడు ఒక్కడే
నే చెప్పేదీ అదే
అవును అనకుండా ఏదేదో అడిగావు.
ఎందుకు అని అనలేము అది నిత్యము అవిరళం అని

--
in godly service
  

Wednesday, October 10, 2018

దసరా

https://www.youtube.com/watch?v=kpiG85UBtHs

దసరా శరన్నవ రాత్రులు అప్పుడు రావణ దహనం చేస్తారు. రాముడి వేషం కట్టిన వ్యక్తి ఒక అగ్ని బాణం వేసి రావణాసురుడి బొమ్మను కాలుస్తారు. ఈ ఆనవాయితీ ఎప్పటి నుంచి వస్తున్నది. బహుశ త్రేతా యుగం తరవాత నుంచి అనవచ్చు. మరి దసరా అమ్మవారికి ఎందుకు పూజలు చేస్తారు. అమ్మవారు రాక్షసులను చంపింది మరియు రాముడు రావణుని చంపింది ఒకే సమయమా??? కాని ఇక్కడ కొంచం అర్ధం చేసుకోవలసిన విషయం ఒకటి ఉంది. ఒక సారి రావణాసురుడిని తగల బెట్టేశాక మళ్ళి మళ్ళి పై ఏటికి ఇంకా పెద్ద రావణ బొమ్మలు  ఎందుకు చేస్తున్నారో ఆలోచించాలి.  అంటే రావణాసురుడు చావలేదు. ఏ ఏటికి ఆ ఏడు పెరుగుతూ నే ఉన్నాడు. ఇందులో గుహ్య రహస్యం ఒకటి ఉంది. అదేమిటంటే పదితలల రావణుడు ఎవరు? తల అంటే మతం. పది తలలు అంటే పది మతాలు. ఒకే ఒక మతం పై నడిస్తే రామ రాజ్యం . రాముడికి ఒకే ముఖం. ఒకే మతం ఒకే మాట ఒకే భార్య. అందుకే రామ రాజ్యం అంటే సుఖానికి మారు పేరు. రావణ రాజ్యం అంటే అనేక మతాలు అనేక రాజ్యాలు అనేక భాషలు అనేకం లో సుఖం లేదు. ఇప్పుడు లోకమంతా దుఖమే ఉంది. ఇది దుఃఖ ప్రపంచం.రావణాసురుడి పది ముఖాలు అంటే మానవులలో పది వికారాలు. పురుషులలో 5, స్త్రీలలో 5 కలిసి 10. కామం క్రోధం, లోభం, మొహం, అహంకారం. ఈ పది వికారాలు లేని మనుషులు ఇప్పుడు లేరు. అందరూ రావణులే. పెర్సేంటేజ్ లో అందరిలోనూ ఈ వికారాలు ఉన్నాయి. ఇప్పుడు రావణ రాజ్యం ఉంది,  కాదు అని ఎవరూ అనలేరు.
నిరాకార రాముడు మరియు సాకార రాముడు.:- పరమపిత పరమాత్మ నిరాకార రాముడు(ఈయన పేరే శివుడు ఆత్మా రాముడు అని అంటారు, ఈయన జనన మరణ చక్రం లో రారు.). ఈ సృష్టి ఒక నాటకం అంటారు. ఈ నాటకం లో హీరో సాకార రాముడు. ఈ  మనుషులలో హీరో పాత్ర ధారి అయిన సాకార రాముడి లో ఆ శివుడు ప్రవేశించి మనచే మాయ రావణాసురుడితో యుద్ధం చేయిస్తున్నారు. (ఈ సాకార రాముడికి జన్మ మరణం చుబించారు). ఎవరో వేరే వారితో యుద్ధం కాదు. మనలోనే ఉన్న కామాది వికారాలతో యుద్ధం. దీనిని ఒక రూపకం లో కధలాగా చెప్పుకుంటున్నాము. నిజానికి కధ చెప్పుకుని ఆనందించి అది సినిమా ఐపోయాక ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్లి పోయినట్లు ఎదో ఒక రోజు దసరా చేసేసుకుని మళ్ళి మన మన వ్యవహారాల్లో మునిగి పోవడం కాదు. అందుకే దాని వల్ల ఏమి లాభం లేకుండా పోతున్నది. కేవలం ఖర్చు తప్పితే ఒరిగేది ఏమీ లేదు. చేయ వలసినది మనలోని రావణ సంహారం.
సాకార రాముడే హనుమంతుడు:- కోతులను సేనగా చెప్పారు. కోతులు అంటే కోతి బుధి ఇప్పుడు ప్రతివారి బుద్ధీ కోతి బుద్దే అయి ఉంది. కోతులకు రాజు మహా కోతి -హనుమంతుడు. ఎవరైతే తమ మాన్ అనగా  దురభిమానాన్ని హననం చేసారో వారే హనుమంతుడు. ప్రస్తుతం మన హీరో సామాన్యుని వలె మనలాగే ఉన్నారు, కోతి బుద్ధి తో కాని ఆయన స్వభావంతో ఎవరికీ చిక్కరు. అడవిలో /వనం లో పెద్ద కోతి ఎవరికీ సులభంగా పట్టు బడదు. అలాగే ప్రస్తుతం ఈ లోకం ఒక పెద్ద అడివి అందులో మనం అంతా కోతులలా ఉన్నాం. మన కోతులలో పెద్ద కోతి ఈయనను కూడా ఎవరూ కంట్రోల్ చేయలేరు. అయన అందరి అహంకారం తొలగించి పిదప తన అహంకారం వదిలిపెడతారు. ఈ హనుమంతుడు రామ భక్తుడు, ఏ రామ భక్తుడు . ఆ నిరాకార రాముని భక్తుడు. ఆ నిరాకార రాముడు (శివుడు) ఈయన ఎప్పుడు ఈ లో కం లో వస్తారంటే కలియుగ అంతం లో అనగా ప్రస్తుత సమయం లో వస్తారు. ఎందుకు వస్తారు ప్రతివారి లోని రావణాసురుడిని సంహరించడానికి. ప్రతివారిలో రావణుడు చనిపోతే మిగిలేది ఎవరు వారిలోని దైవత్వం. కోతులలో పెద్ద కోతి హనుమంతుడు ఎవరి భక్తుడు? ఈ నిరాకార రాముని భక్తుడు. మొదటి నంబర్ లో ఈయన తన రాముడిని ధ్యానిస్తూ తనలోని రావణుని సంహరిస్తాడు. కనుక ఇక్కడ ధర్మ సుక్ష్మం ఏమిటంటే నిరాకార రాముడికి తనకంటూ శరీరం లేదు. జనన మరణ చక్రం లో రారు. కనుక దేహం లేదు. విదేహి.
కానీ విదేహి ఎలా మనతో మాట్లాడాలి. ఆయనకు ముఖం కావాలి మాట్లాడడానికి కనుక మనుషులకు హీరో సాకార రాముని శరీరం లో ప్రవేశించి ఇతని ముఖం ద్వారా మనకు డైరెక్షన్ ఇస్తారు. డైరెక్టర్ తెర వెనక ఉన్నట్లు ఈ యన హీరో శరీరం లో ఉండి మనకు డైరెక్షన్ ఇస్తారు. హీరో ను మొదట మారుస్తారు. హీరో తనలోని వికారాలను హననం చేసి పిదప మిగతా అందరికి గురువై అందరికి రావణుని హననం చేయడంలో సహకరిస్తారు. అందుకే అయన మనందరికీ రాజు.

శివ శక్తులు.:- ఒకరే రాముడు. సాకార్+ నిరాకార్ మిగతా అన్దరూ సీతలే. సీత అనండి శివ శక్తి అనండి. వీరు తమలోని కామ క్రోధ లోభ మోహ అహంకారాలు అనే అసురులను సంహరిస్తారు దీని గుర్తుగానే దసరాల్లో శక్తి పూజ జరుగుతుంది. 

dasara


దసరా శరన్నవ రాత్రులు అప్పుడు రావణ దహనం చేస్తారు. రాముడి వేషం కట్టిన వ్యక్తి ఒక అగ్ని బాణం వేసి రావణాసురుడి బొమ్మను కాలుస్తారు. ఈ ఆనవాయితీ ఎప్పటి నుంచి వస్తున్నది. బహుశ త్రేతా యుగం తరవాత నుంచి అనవచ్చు. మరి దసరా అమ్మవారికి ఎందుకు పూజలు చేస్తారు. అమ్మవారు రాక్షసులను చంపింది మరియు రాముడు రావణుని చంపింది ఒకే సమయమా??? కాని ఇక్కడ కొంచం అర్ధం చేసుకోవలసిన విషయం ఒకటి ఉంది. ఒక సారి రావణాసురుడిని తగల బెట్టేశాక మళ్ళి మళ్ళి పై ఏటికి ఇంకా పెద్ద రావణ బొమ్మలు  ఎందుకు చేస్తున్నారో ఆలోచించాలి.  అంటే రావణాసురుడు చావలేదు. ఏ ఏటికి ఆ ఏడు పెరుగుతూ నే ఉన్నాడు. ఇందులో గుహ్య రహస్యం ఒకటి ఉంది. అదేమిటంటే పదితలల రావణుడు ఎవరు? తల అంటే మతం. పది తలలు అంటే పది మతాలు. ఒకే ఒక మతం పై నడిస్తే రామ రాజ్యం . రాముడికి ఒకే ముఖం. ఒకే మతం ఒకే మాట ఒకే భార్య. అందుకే రామ రాజ్యం అంటే సుఖానికి మారు పేరు. రావణ రాజ్యం అంటే అనేక మతాలు అనేక రాజ్యాలు అనేక భాషలు అనేకం లో సుఖం లేదు. ఇప్పుడు లోకమంతా దుఖమే ఉంది. ఇది దుఃఖ ప్రపంచం.రావణాసురుడి పది ముఖాలు అంటే మానవులలో పది వికారాలు. పురుషులలో 5, స్త్రీలలో 5 కలిసి 10. కామం క్రోధం, లోభం, మొహం, అహంకారం. ఈ పది వికారాలు లేని మనుషులు ఇప్పుడు లేరు. అందరూ రావణులే. పెర్సేంటేజ్ లో అందరిలోనూ ఈ వికారాలు ఉన్నాయి. ఇప్పుడు రావణ రాజ్యం ఉంది,  కాదు అని ఎవరూ అనలేరు.

నిరాకార రాముడు మరియు సాకార రాముడు.:- పరమపిత పరమాత్మ నిరాకార రాముడు(ఈయన పేరే శివుడు ఆత్మా రాముడు అని అంటారు, ఈయన జనన మరణ చక్రం లో రారు.). ఈ సృష్టి ఒక నాటకం అంటారు. ఈ నాటకం లో హీరో సాకార రాముడు. ఈ  మనుషులలో హీరో పాత్ర ధారి అయిన సాకార రాముడి లో ఆ శివుడు ప్రవేశించి మనచే మాయ రావణాసురుడితో యుద్ధం చేయిస్తున్నారు. (ఈ సాకార రాముడికి జన్మ మరణం చుబించారు). ఎవరో వేరే వారితో యుద్ధం కాదు. మనలోనే ఉన్న కామాది వికారాలతో యుద్ధం. దీనిని ఒక రూపకం లో కధలాగా చెప్పుకుంటున్నాము. నిజానికి కధ చెప్పుకుని ఆనందించి అది సినిమా ఐపోయాక ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్లి పోయినట్లు ఎదో ఒక రోజు దసరా చేసేసుకుని మళ్ళి మన మన వ్యవహారాల్లో మునిగి పోవడం కాదు. అందుకే దాని వల్ల ఏమి లాభం లేకుండా పోతున్నది. కేవలం ఖర్చు తప్పితే ఒరిగేది ఏమీ లేదు. చేయ వలసినది మనలోని రావణ సంహారం.

సాకార రాముడే హనుమంతుడు:- కోతులను సేనగా చెప్పారు. కోతులు అంటే కోతి బుధి ఇప్పుడు ప్రతివారి బుద్ధీ కోతి బుద్దే అయి ఉంది. కోతులకు రాజు మహా కోతి -హనుమంతుడు. ఎవరైతే తమ మాన్ అనగా  దురభిమానాన్ని హననం చేసారో వారే హనుమంతుడు. ప్రస్తుతం మన హీరో సామాన్యుని వలె మనలాగే ఉన్నారు, కోతి బుద్ధి తో కాని ఆయన స్వభావంతో ఎవరికీ చిక్కరు. అడవిలో /వనం లో పెద్ద కోతి ఎవరికీ సులభంగా పట్టు బడదు. అలాగే ప్రస్తుతం ఈ లోకం ఒక పెద్ద అడివి అందులో మనం అంతా కోతులలా ఉన్నాం. మన కోతులలో పెద్ద కోతి ఈయనను కూడా ఎవరూ కంట్రోల్ చేయలేరు. అయన అందరి అహంకారం తొలగించి పిదప తన అహంకారం వదిలిపెడతారు. ఈ హనుమంతుడు రామ భక్తుడు, ఏ రామ భక్తుడు . ఆ నిరాకార రాముని భక్తుడు. ఆ నిరాకార రాముడు (శివుడు) ఈయన ఎప్పుడు ఈ లో కం లో వస్తారంటే కలియుగ అంతం లో అనగా ప్రస్తుత సమయం లో వస్తారు. ఎందుకు వస్తారు ప్రతివారి లోని రావణాసురుడిని సంహరించడానికి. ప్రతివారిలో రావణుడు చనిపోతే మిగిలేది ఎవరు వారిలోని దైవత్వం. కోతులలో పెద్ద కోతి హనుమంతుడు ఎవరి భక్తుడు? ఈ నిరాకార రాముని భక్తుడు. మొదటి నంబర్ లో ఈయన తన రాముడిని ధ్యానిస్తూ తనలోని రావణుని సంహరిస్తాడు. కనుక ఇక్కడ ధర్మ సుక్ష్మం ఏమిటంటే నిరాకార రాముడికి తనకంటూ శరీరం లేదు. జనన మరణ చక్రం లో రారు. కనుక దేహం లేదు. విదేహి.

కానీ విదేహి ఎలా మనతో మాట్లాడాలి. ఆయనకు ముఖం కావాలి మాట్లాడడానికి కనుక మనుషులకు హీరో సాకార రాముని శరీరం లో ప్రవేశించి ఇతని ముఖం ద్వారా మనకు డైరెక్షన్ ఇస్తారు. డైరెక్టర్ తెర వెనక ఉన్నట్లు ఈ యన హీరో శరీరం లో ఉండి మనకు డైరెక్షన్ ఇస్తారు. హీరో ను మొదట మారుస్తారు. హీరో తనలోని వికారాలను హననం చేసి పిదప మిగతా అందరికి గురువై అందరికి రావణుని హననం చేయడంలో సహకరిస్తారు. అందుకే అయన మనందరికీ రాజు.

శివ శక్తులు.:- ఒకరే రాముడు. సాకార్+ నిరాకార్ మిగతా అన్దరూ సీతలే. సీత అనండి శివ శక్తి అనండి. వీరు తమలోని కామ క్రోధ లోభ మోహ అహంకారాలు అనే అసురులను సంహరిస్తారు దీని గుర్తుగానే దసరాల్లో శక్తి పూజ జరుగుతుంది.https://www.youtube.com/watch?v=kpiG85UBtHs 

--
in godly service
ramana mata  

Sunday, September 16, 2018

గీతా భగవంతుడు మహాదేవ శివ శంకర్ భోలేనాథ్



       గీతా గర్భంలో ధార్మిక రాజనైతిక, సామాజిక మరియు వ్యక్తిగత జీవన సమాధానాలు నిక్షిప్తమై ఉన్నాయి. మనుష్య వ్యాఖ్యలు సముద్ర మంధనం లోని హాలాహల విష సమానంగా వ్యభిచారం ఇంకా భ్రష్టాచారం తో నిండి కేవలం లోక  పతన కారణ మాత్రమే అయినది. ఏవిధంగా పాలతో నిండిన కుండలో అంశమాత్రం విషం చేరితే ఆ కుండ మొత్తం విషకుంభం అవుతుందో సరిగా అలాగే గీత అసలు పాలు నిండి ఉన్న కుండ అoదులో అనేక వేరు 2 మానవ వ్యాఖ్యల విషం నిండిపోయింది. ఎందువనంటే మానవ మాతృలు స్వయమే విషయ వికారాలకు తోలు బొమ్మలు. మరియు పరమపిత పరమాత్మ యొక్క పరమార్ధ భావంతో రచించిన శ్రీమద్భగవద్గీత  మనుషులద్వారా చేయబడిన అర్ధ వివరణ భగవానువాచ గీత మహావాక్యాల గౌరవాన్ని భంగం చేశాయి. ఎందుకంటే ప్రతీ మనిషీ స్వార్ధపరుడే. (సుర నర ముని సబకీ యహ రీతి, స్వారధ లాగి కరై సబ ప్రీతి.తులసీ.రా.సురులు నరులు అందరిదీ ఇదే స్వభావం, స్వార్ధం కోసమే ప్రేమిస్తారు అని.)(స్వ శరీర రూపీ రధం) గీతా రూపీ సాధనం ఎంత పవిత్రమైనప్పటికీ వికారులైన సాధకుల స్వార్దం తో నిండిన సాధన తో ఈ పవిత్ర గీత ను తమ వ్యాఖ్యల ద్వారా  సమాజాన్ని అభిశాపితం అయినది . దే జరిగింది. ఇప్పుడు కూడా జరుగుతోంది. కనుక సమస్త మానవ సమాజం వికారాల పతనం అనే కూపంలోకి పోతున్నది. ఈ వ్యాఖ్యలే  అతి పెద్ద అధర్మం. మరి ఈ అధర్మాన్ని సమాప్తం చేయడానికే పరమపిత అవతరిస్తారు.
తన పరిచయం ఇవ్వడానికి అంటే గీతకు యదార్ధ అర్ధం అర్ధం చేయించడానికి పరమపిత ఈ సృష్టిలోకి వస్తారు. వస్తారు అంటే మాలాగ, మీలాగా స్థూలగర్భంలో పండి(ఉడికి) జన్మ తీసుకుంటారా? లేదoటే భ్రష్టేంద్రియాలతో వికారీ కృత్యంతో ఉత్పన్నం అవుతారా? ఈ విషయాన్నే స్పష్టం చేస్తూ గీతలో ఎన్నోసార్లు వచ్చింది. (గీ.4-9)పరమపిత పరమాత్మ యొక్క జన్మ మరియు కర్మ(రెండూ) దివ్యమే అని. అంటే పరమపిత పరమాత్మ అజన్మ. అయితే మరి అజన్మ పరమపిత ఈసృష్టిలో అవతరించడం ఎలా సంభవం అవుతుoది ? దీని గురించి కూడా గీతలో పరమపితను తెలుసుకోవాడానికి  చూడడానికి ప్రవేశించేoదుకు యోగ్యుడుఅని ఉంది . ఒకవేళ నిరాకార ఆత్మలతండ్రి జ్యోతిర్బిందువులా అణువు, అణువు కన్నా అణువు కనుక మరి ఆయన తప్పకుండా ఒక నిశ్చితమయిన=పర్మనెంట్. అనగా  మనుష శరీరధారిలోనే ప్రవేశించవలసి ఉంటుంది.  మరియు o తత్త్వాలతో తయారైన ఎవరో ఒక శరీరంలోనే రావాల్సి ఉంటుంది.  ఒకవేళ అజన్మ పరమపితకు ఒకవేళ ఈ రకంగా అవతరించవలసి వస్తే అది కేవలo ప్రవేశించడం వల్లనే సాధ్యం. (పరమపిత కు తన కంటూ శరీరం లేదు కనుక నిశ్చితమైన=ముకరర్. శరీరధారి లోనే ప్రవేశించ వలసి వస్తుంది.) అందువలననే ఆయనను ప్రవేశచేoదుకు యోగ్యుడు(ప్రవిష్టుంచ, గీ.11-54) అని కూడా అన్నారు. వారు ఒక మనిషి శరీరంలో (ఆదమ్/ఏడమ్/ఆదిదేవుడైనడు శంకరుడు/ ఆదినాధుడు అని పిలువబడే మనుష్య ఆత్మలో) ప్రవేశించవలసి ఉంటుంది.
అనగా అజన్మ పరమపిత ఈ సృష్టిపైకి వచ్చి జనన-మరణ చక్రంలో వచ్చే ఒకానొక విశేష మనిషి శరీరాన్ని ఆధారం చేసుకుని నిస్సందేహంగా ఆయనలో ప్రవేశించి తన ఆధీనంలో వారిని ఉంచుకుని పార్టు చేస్తారు. పరమపిత ఈ వ్యక్తిద్వారానే అనగా పరంబ్రహ్మ అంటే త్రిమూర్తి శివుని అవ్యక్తమూర్తి(9-4)ద్వారా రచిoపబడిన కొత్త బ్రాహ్మణ సో దేవత అనే సృష్టిస్థాపన, పాత బ్రాహ్మణ సృష్టి వినాశనం మరియు కొత్త బ్రాహ్మణ సృష్టి పాలన అనే కర్తవ్యాలు చేస్తారు. (వారి ద్వారానే) మరియు ఈ సాకార స్వరూపం సగుణుడైన (వారి) మనస్సులో ఇమిడి పోవడాన్నే మన్మనాభవ అని అంటారు. ఇతనే మొత్తం మనుష్య సృష్టికి కేంద్రబిందువు. ఇతనే గీత యోగ్యురాలా కాదా అని నిరూపిస్తారు. ఈ విషయం ఆధారంగానే గీత వ్యాఖ్య ఖండితమైనదా లేదా అనే విషయం ఆధారపడి ఉంది. అనగా గీతలో వచ్చిన సమస్త దోషాలకు ప్రరంభo ఈ నిజాన్ని అర్ధంచేసు కోకపోవడం కారణంగా వచ్చినవే. ఏవిధంగానంటే....

 “పరమపిత పరమాత్మ  సర్వవ్యాపియా లేక ఏకవ్యాపియా
అవతారమంటే అర్ధం (15-6) పైనుంచి కిందకు రావడం అంటే పరమపిత పరమాత్మ పైన ఎక్కడనుంచో ఈ మనుష్య సృష్టిలోకి వస్తారని అర్ధం. దీని ద్వారా ఏమి స్పష్టమౌతుందంటే పరమపిత ఈ లోకంలో ఉండరు అని. అలాంటప్పుడు ఆయన సర్వవ్యాపకుడు ఎలా అయ్యారు. గీతలో(15-6) ఎక్కడైతే సూర్య చంద్ర, అగ్నులకాంతి, ప్రకాశిందో ఆ పరంధామం లో ఉంటాను అని చెప్పారు. పరమపిత పరంధామ వాసి అయినప్పుడు సర్వవ్యాపకుడు ఎలా అయ్యారు? కానీ గీత యొక్క అన్ని మనుష్య వ్యాఖ్యలూ పరమపితను సర్వవ్యాపకుడుగా చాటిస్తున్నాయి.ఇప్పుడు దీనికి కారణం ఏమిటి?
గీతలోనివే కొన్ని శ్లోకాలకు తెలియని అఙ్ఞనం వల్ల అనైతిక అర్ధాలు తీసుకుని పరమపిత సర్వవ్యాపకడు అనే అర్ధం చేయబడింది. ఈశ్లోకాలల్లో అన్నిటికన్నాఎకువ తప్పు విభూతి యోగంలోని అర్ధం తెలుసుకోవడంలో  జరిగింది. ఎలాగంటే ఈ అధ్యాయంలో (10- 21 నుంచి 38 వరకూ) నదులలో గంగను నేను, పశువులలో సింహాన్ని నేను, సూర్యుల్లో విష్ణువును నేను, మొ... ఇవి చదివినప్పుడు ఏమనిపిస్తుందంటే పరమపిత రకరకాల యోనుల్లోని శ్రేణుల్లో తన ఉనికిని చూపుతున్నట్లు ఉంటుంది. కానీ అలా అర్ధం చేసుకోవడం తప్పు. ఈ తప్పేమిటో గంభీరంగా ఆలోచిస్తే..
1)    మొట మొదట విభూతి అనే మాటకు అర్ధం తెలుసుకుందాం విభూతికి సంస్కృత అర్ధం వి అంటే విశేషమైన భూతి అంటే జన్మ. అంటే  జన్మతీసుకునే వాని అర్ధం. జన్మయే విశేషమైనది అయితే అది తప్పకుండా అజన్మ అయిన పరమపిత పరమాత్మకి వర్తించే విషయం. అజన్మ అయినా కూడా పరకాయ ప్రవేశం చేసి దివ్య అలౌకిక జన్మ తీసుకుంటారు అని అర్ధం. మరి మిగిలిన వారందరి జన్మా కూడా సాధారణ శారీరక ప్రక్రియ ద్వారా జరుగుతుంది. కనుక ఇందులోని విశేషత ఏమిటి? విశేషత ఏమీలేకపోతే మరి విభూతి ఎందుకు అయ్యింది. అప్పుడు విభూతి సర్వవ్యాపి ఎలా అవుతుంది?
2)    రెండోవిషయం... భిన్న-భిన్న విభూతులు భగవంతుని రూపం అన్నారు కానీ  పరమపిత పరమాత్మ కాదు. ఎలాగంటే పరమాత్మని నదుల్లో గంగ అన్నారు అంటే మిగతా నదులు పరమాత్మ అని ఒప్పుకోలేదు. ఆదిత్యుల్లో విష్ణువు అన్నారు అంటే దానర్ధం మిగతా దేవతలు పరమాత్మ రూపం కాదు. శస్త్రధారుల్లో రాముడు పరమాత్మ ఐతే మిగతా శస్త్రధారులందరూ కూడా పరమాత్మ కాదు. ఇదే విధంగా ఎవరైతే సర్వశ్రేష్ఠులో వారే పరమాత్మ రూపం అని ఒప్పుకున్నారు. ఇక్కడ అయితే పరమాత్మ సర్వవ్యాపి అనే  విషయం నిరూపణ కాదు. అయినా కానీ పరమాత్మ అనేక వ్యాపి అనే నిరూపిస్తున్నారు. అది తప్పుఅయినపటేకి. అందుకే గీత (10-41) లో ఎవరైనా ఐశ్వర్యవంతుడు, శక్తిమంతుడు, శ్రేష్ఠుడు బుద్ధిమంతుడు ఉంటే అతడు నా అనగా పరమపిత పరమాత్మ తేజస్సు యొక్క అంశతో పుట్టాడని తెలుసుకోఅని ఉంది. తేజస్సుయొక్క అంశముతో పుట్టాడమoటే అర్ధం ఏమిటి? ఏవిధంగా ఎవరైనా సుందరుడు, బలిష్టుడు, బుద్ధిమంతుడు అయిన వ్యక్తికి తనతో సమానమైన పుతృడు కలిగితే అప్పుడు ఇతడికి (అంతా) తండ్రి నించి(పోలిక) వచ్చింది అంటారు. అదే వ్యక్తికి అనేక మంది సంతానం ఉన్నప్పటికీ అతని బాధ్యతలు ఎవరైతే తీసుకుని అతని కలలు నిజం చేసి అతడిని గౌరవాన్వితుడిని చేసే పుతృణ్ణే తన కొడుకు అని చెప్పుకుంటాడు, కానీ అందువల్ల తండ్రీ కొడుకూ ఒకటే అంటామా? తండ్రికీ కొడుకుకూ తమ తమ వ్యక్తిత్వం  ఉండవా(ఉంటాయి కదా).
    సరిగ్గా అలాగే ఈ విభూతుల యొక్క అర్దం కూడా ఏవ్యక్తి అయినా నిరాకార పరమపిత పరమాత్మ సాకార వ్యక్తిత్వంతో మన్మనాభవ స్థితి పొందినప్పుడు అతనికి పరమపిత పరమాత్మ యొక్క యోగం రూపి తేజస్సు యొక్క ప్రభావం పురుషార్ధం అనుసారoగా వరసక్రమంగా ప్రాప్తిస్తుంది. తద్వారా శ్రేష్ఠoగా, ఉన్నతoగా, మరియు మహాత్మగా  బుజవు అవుతారు . ఈ ఆధ్యాత్మిక ప్రత్యక్షతారూపి జన్మ విశేషజన్మ అనగా విభూతి అని చెప్పబడుతుంది. విభూతులన్నీ పరమపిత పరమాత్మ యొక్క ఆత్మరూపి పిల్లలు. కానీ  ఆ మనుష్యాత్మలందరినీ పరమాత్మ అనుకోవడం మూర్ఖత్వంతో కూడిన తప్పిదం.
మరొక ఉదాహరణతో ఈ విషయ గాంభీర్యాన్ని అర్ధం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సూర్యుడు తన శక్తిని, నిరoతరo విశ్వ కల్యాణం కోసం వెలుగు, వేడిమి రూపంలో ఎలా అందిస్తూ ఉంటాడో అలా ఈ సౌరశక్తితో మనం బేటరీని దాని సామర్ధ్యం అనుసారం చార్జి చేసి మన వినియోగంలోకి తెచ్చుకుంటాము. అంతమాత్రం చేత ఎవరైనా బేటరీని సూర్యుడంటే అతడిని ఏమనాలి? తప్పకుండా మూర్ఖుడనే అనాలి. విభూతులను అర్ధం చేసుకోవడంలో ఇదే తప్పు జరిగింది. ఎందరో ఆత్మ రూపి బేటరీలు తమ యధాశక్తి, నాలుగుయుగాల అంతిమంలో సాకారంలో వచ్చిన నిరాకార పరమపిత పరమాత్మ రూపి చైతన్య జ్ఞాన శక్తి (జ్ఞాన సూర్యుడి) తో మన్మనాభవ అయ్యి తమలో కూడా నంబరువారు  పురుషార్ధం (తపస్సు) అనుసారం నింపుకుంటారు. ఎవరైతే అత్యధిక యోగశక్తి తమలో నింపుకుంటారో వారినే ఇక్కడ విభూతులు అంటారు. ఈ భావాన్నే స్పష్టంగా అర్ధం చేయిoచేoదుకు  సంపూర్ణ ఙ్ఞాన అర్జన చేసే అర్జనుడితో భగవంతుడు ఏమి అంటున్నారంటే (10- 42) నా అనేక విభూతులను గురించి తెలుసు కోవడం వలన ఏంలాభం నేను నా ఒకేఒక్కఅంశద్వారా స్థితుడనై ఈ సంపూర్ణ జగత్తును నిలిపి ఉంచాను అనగా ఆ జ్యోతిర్బిందు శివలింగ శరీరధారి ఆత్మ ఒకరే, అతని(ఆత్మ+శరీరం) ద్వారా సమస్త జడ, జంగమ జగత్తునూ స్థిరం చేసి ఆ పరమపిత తన పరంధామంలో స్థితుడై ఉన్నారు. (ఈ) సాకారునిలో వచ్చిన పరమపిత పరమాత్ముని ఈ స్వరూపాన్ని తలుచుకోవడం, యోగం అని పిలవబడే స్మృతి అనే శక్తియే నిజానికి అన్ని ఆత్మలలో వ్యాప్తం అవుతుంది. (అందరిలో ఇతని స్మృతి శక్తియే వ్యాప్తం అవుతుంది). అందరిలో సమస్త జడ జంగమ జగత్తులో పరమపిత పరమాత్మ యొక్క ఆరూపం సాకార స్వరూపం అందరిలో వ్యాపించి సమ్మిళతమై ఉంటుంది. ఈ కారణంగానే గీతలో (10- 20) పరమాత్మ అందరి(భూతకోటి సమస్తం యొక్క) హృదయం లో స్థితుడై ఉన్నారు అని ఉంది. కానీ ఈ విషయాన్ని కూడా పూర్తి అనర్ధ (నిరర్ధక) రీతిలో గ్రహించారు పరమపిత పరమాత్మను సర్వవ్యాపకుడు అనేశారు. ఇదే అతి పెద్ద అబద్ధం.
ఈ విభూతి యోగపు విషయంతో మనుష్యుడు సర్వవ్యాపి అనే విషాన్నే పుట్టిస్తాడు. ఇది సర్వఙ్ఞుడైన పరమపిత పరమాత్మునికి ముందే తెలుసు కనుకనే విభూతియోగం పేరు కల 10 వ అధ్యాయం కన్నా ముందే 9 వ అధ్యాయంలోనే పరమాత్ముని సర్వవ్యాపకత అనే విషయాన్ని ముందే ఖండించేశారు. oదు లో ఏం చెప్పారంటే (9-4)
అన్నిభూతాలూ(ప్రాణులూ) పరమాత్మునిలోనే ఉన్నాయి కానీ పరమాత్మ ఆయా ప్రాణులలో లేరు అని. దీని ద్వారా ఏం తెలుస్తుందంటే అన్ని  విభూతుల సమేతంగా అన్ని ప్రాణుల అన్నింటిలో పరమాత్మ వ్యాప్తుడు కాడు అని. ఈ ఙ్ఞానాన్నే అన్ని విద్యలలో విద్యల గోపనీయతలో రాజా (రాజయోగం) అన్నారు. బహుశా అందుకనే 9 వ అధ్యాయం పేరే రాజవిద్యా, రాజగుహ్యం అన్నారు. అంతేకాదు పరమపిత యొక్క సర్వవ్యాపకత అనే విషయం ఖండించే ఈ ఙ్ఞానాన్ని (9-2) గీతలో ధర్మానుకూలం సహజం ఇంకా అవినాశీ అన్నారు. ప్రత్యక్షావగమంఅంటూ ఈ ఙ్ఞానాన్ని స్వయం పరమపిత పరమాత్మ యొక్క ప్రత్యక్ష స్వరూపం ద్వారానే తెలుసుకోవలసి ఉంటుందని ఋజువు చేశారు.
అందువలన ఈ విషయం పై శ్రద్ధ పెట్టక పరమపితను సర్వవ్యాపి అనేవారికి పరమపిత ఎన్నటికీ ప్రత్యక్షరూపంతో ప్రాప్తించరు. పైగా వారు ఇంకా అధోగతిలోకి పోతారు అని కూడా స్పష్టంగా చెప్పారు. అంటే పరమపితను సర్వవ్యాపి అనుకోవడమే సమస్త ప్రపంచం దుర్గతి పొందటానికి కారణము అని మౌలికంగా స్పష్టమైనది. ఇదే అతి పెద్ద అధర్మం.
పరమాత్మ ఏకవ్యాపి స్వరూపం ఎవరు?
పరమపిత సర్వవ్యాపి కాదు.  ఈ విషయం అయితే స్పష్టమైంది కానీ మరి ఏకవ్యాపి స్వరూపమేది? ఇది కూడా తెలుసుకోవాలి. మామూలుగా ఐతే లోకమంతా భగవంతుడి రూపంలో గీతాఙ్ఞానదాత అయినా శ్రీ కృష్ణుడంటుంది. అందుకని ఏకవ్యాపి స్వరూపం ఎవరూ అనే ప్రశ్న విచిత్రంగా అనిపిస్తుంది. కానీ నిజానికి శ్రీకృష్ణుడు పరమాత్మ స్వరూపమేనా? కృష్ణుడు గీతాఙ్ఞానం కంతటికీ ఇచ్చాడా?  పరమపిత సర్వవ్యాపి అనే అజ్ఞానం లాగే క్రిష్ణుడుని గీతా జ్ఞానదాత అనుకోవడం కూడా పెద్దతప్పైతే కాదు కదా? రండి ఈవిషయం కూడా అర్ధం చేసుకునే ప్రయత్నం చేద్దాం.
నేటికి 5000 సంవత్సరాలకు పూర్వం ద్వాపరయుగంలో కృష్ణుడు మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడికి గీతాజ్ఞానం ఇచ్చాడు అంటారు. అయితే ఎందుకు,? ఈ ప్రశ్నకు జవాబు ఇస్తు గీతలో అన్నారు ఎప్పుడెప్పుడు సద్ధర్మానికి గ్లాని జరుగుతుందో అధర్మం అతి అవుతుందో అప్పుడు సాధుసంతులను రక్షించడానికీ, దురాచారులను వినాశనం చేయడానికి మరియు సంపూర్ణ సద్ధర్మ స్థాపన చేయడానికి నేను వస్తాను అన్నారు. కానీ నిజంగా అధర్మం, దురాచారం వినాశనమయ్యిందా? సంపూర్ణ సత్య సనాతన ధర్మ స్థాపన అయ్యిందా? సాధుసంతుల రక్షణ జరిగిందా? నేడు(చూస్తే) ఇది ఎంతో పేద్ద ప్రశ్న. జవాబు ఇవ్వడానికి మొత్తం హిందూపరివారం అని చెప్పుకునే వారు అందరు కూడా అసమర్ధులు. ఎందుకంటే అధర్మపరులు, దురాచారులకు నేటి కలియుగంలో పలుకుబడి చాల ఎక్కువగాఉంది. నిజంగా చెప్పులoటే  అధర్మం యొక్క అతి కలియుగం అంతిమంలో అవుతుంది. అంతేకానీ ద్వాపరయుగం లో కాదు.అనగా పరమపిత పరమాత్మ యొక్క వాస్తవిక అవతరణ ప్రత్యక్ష రూపంలో కలియుగ అంతంలోనే జరుగుతుంది. అంతే కాకుండా ఇంకాకొన్ని విషయాలకు సమాధానం స్పష్టమైన రూపంలో దొరకడంలేదు. మొదటి విషయం ఏమిటంటే శాస్త్రాల్లో సత్యయుగం త్రేతాయుగం నుంచీ కళలు దిగజారుతూ ద్వాపరయుగం అంతానికి కేవలం 8 కన్నా తక్కువ కళలు మిగుల్తాయి. మరి అలాంటప్పుడు ద్వాపరయుగంలో 16 కళల సంపూర్ణుడు శ్రీకృష్ణుణ్ణి ఎలా చూపించారు?
ఇంకొక విషయం ఎక్కడైతే గీతలో ఒకవైపు విశ్వంలో రెండురకాల సృష్టిఉంటుంది...(16-6) ఒకటి దేవతల సృష్టి, రెండు రాక్షసుల సృష్టి అని. అక్కడే ఇంకొక మాట కూడా వచ్చింది, నా యొక్క ఏకమాత్ర అధ్యక్షతలోనే(నా కారణంగానే) ప్రకృతి సమస్త జగత్తును విపరివర్తతేఅనగా విపరీత దిశలో పరివర్తన చేస్తుంది అని. దీని యొక్క సరళమైన అర్ధము లోకము యొక్క కాలచక్రము సత్యయుగం, త్రేతాయుగాలనుంచి ద్వాపర కలి యుగాలకు దిగేవైపుకు అనగా దేవతల సృష్టినుంచి అసురుల సృష్టివైపుకు ప్రకృతి యొక్క గుణాల ఆధారంగా తిరుగుతుంది, ....కానీ పరమపిత అధ్యక్షతలో ప్రకృతి ఏవిధంగా విపరీత దిశలో పరివర్తతితమై పైకి లేస్తుందంటే కొత్త యుగము సత్యయుగం యొక్క ఆరంభం జరుగుతుంది. అనగా దైవి సృష్టి నిర్మాణo  కోసమే పరమపిత పరమాత్మ హెవెన్.లీ గాడ్ ఫాదర్ఈ సృష్టిలోకి వస్తారు. ఈ పరమపిత పరమాత్ముని అధ్యక్షతననే (ఏకవ్యాపి స్వరూపుని) అధ్యక్షతననే ప్రకృతి యొక్క విపరివర్తనా స్వరూపం ఉంటుంది. ఒకవేళ పరమపిత ఏకవ్యాపి స్వరూపం శ్రీకృష్ణుడు ఐతే మరి ఆయన ద్వాపరయుగం అంతంలో గీతా జ్ఞానాన్ని ఇచ్చినట్లైతే మరి తరవాత పరిణామం ఏమి జరిగింది? ఇంకా  అధికంగా దొంగ సన్యాసులు, అహంకారులు, దురభిమానులు కామీ, క్రోధీ, మరియు అజ్ఞానులు ఆసురీసంపత్తితో నిండి ఉన్నపాపులు అధర్మీయులతో కూడిన కలియుగము వచ్చింది. ఇది జగత్. విపరివర్తతే...అవ్వలేదు.(విపరివర్తన= ఎక్కేకళలు) అనగా దీని అర్ధము ఇక్కడ ఏమి స్పష్టమౌతుందంటే ద్వాపరయుగం అంతంలో గీతా జ్ఞానం ఇవ్వబడలేదు అని. అంతేకాక పరమపిత పరమాత్మ యొక్క ఏకవ్యాపి స్వరూపం శ్రీకృష్ణుడు కాదు అని. కాని సత్యం ఏమిటంటే ఇటువంటి భ్రాంతుల కారణంగా ఆసురీ సృష్టి నిర్మాణం మాత్రం అవశ్యం జరిగింది. అది ఈనాడు మనమందరం చూస్తూనే ఉన్నాం. గీతలో(3-3) పరమపిత పరమాత్మ యొక్క ఏకవ్యాపి స్వరూపం  చే సమస్త లోకానికీ యోగము యొక్క రెండు నిష్ఠలు లేదా ప్రణాళికలు చెప్పబడ్డాయి. ఒకటి జ్ఞానులకు జ్ఞానయోగము (సాంఖ్య యోగం), రెండు కర్మచేసే యోగులకు కర్మయోగము.
జ్ఞానయోగం అంటే అర్ధము పూర్తిగా కర్మలను త్యాగము చేసి మ ఆత్మను నిరాకారీ, నిర్గుణ స్థితిలో స్థిరం చేసి పరమపిత పరమాత్మ యొక్క మనసులాగా నిస్సంకల్ప అవస్థలో స్వయమును లీనము చేయడం. మరి కర్మయోగం యొక్క అర్ధము మన కర్మలను పరమపిత పరమాత్మ యొక్క స్మృతిలో ఉంటూ వాటియొక్క కర్మ ఫలాన్ని బుద్ధితో త్యాగం చేయడం. శ్రీకృష్ణుని జీవితంలో ఎక్కడా కూడా ఈ నిష్ఠల యొక్క అనుభవం(మనకు) అవ్వదు. అంతేకాక ఆయన యోగములో తల్లీనమై ఉండే ఉదాహరణ శాస్త్రాల్లో ఎక్కడా కూడా దొరకదు. అంతేకాక కర్మయోగి స్వరూపంలో నిష్కర్మ స్థితి పొందినటువంటి  స్మృతి చిహ్నం లేదు. (జ్ఞాపికలు లేవు ). కానీ శాస్త్రాల్లో ఈ రెండు నిష్ఠలను కూడా ప్రాప్తించుకున్న స్వరూపం చెప్పబడింది. ఆ రూపమే మహాదేవ శంకరుడు. సమస్త కర్మలనూ త్యాగం చేసి తమ దేహాభిమానాన్ని బూడిద చేశారు.(భస్మాన్ని పూసుకున్నాడు) స్వయాన్ని ప్రకృతి నుంచి భిన్నంగా అనుకుంటూ నిర్గుణ, నిరాకార, నిరంజనుడు ఐన పరమపిత జ్యోతిర్బిందు శివునితో ఏకరూపం అయ్యే అభ్యాసం చేస్తూ ఉన్న శంకరుని (అన్నింటికన్నా ఉన్నతమైన కైలాసపర్వత సానువుల పై ఆసీనులైన ఆయన అందరికీ తెలుసు, ఆయనను అందరూ ఒప్పకూన్నారు.) అంతేకాక కర్మయోగి దృష్టికోణం లో చూసినా కూడా అనేక ఉదాహరణలు దొరుకుతాయి. సాగరమంథన సమయంలో గ్లాని రూపి అజ్ఞానమనే(మొత్తం లోకాన్ని అలజడిలోకి తీసుకు వచ్చిన) హాలాహల విషం పుట్టినప్పుడు, దానిని తాగే సామర్ధ్యము వేరెవ్వరిలోనూ లేకుండినది. విష్ణువు లో కానీ, బ్రహ్మ లో కానీ లేకుండినది. కేవలం మహాదేవ శంకరుడే తన కర్తవ్యము అనుకుని విషపానం చేశారు. ఆ విషం యొక్క అనిశ్చయరూపి మృత్యువు అనే ఫలాన్ని కూడా ఆయన పొందలేదు. ఎందుకంటే ఆయన కర్మయోగులయ్యే నిష్కర్మ స్థితి ముందే పొంది ఉన్నారు కనుక. గీతలో (18-17)ఎవరిలో అయితే నేను అనే భావం ఉండదో, ఎవరి బుద్ధి కర్మలలో లిప్తమై ఉండదో, అతను సమస్త లోకాన్నీ నాశనం చేసినప్పటికీ ఎవ్వరినీ చంపరు, మరియు ఆయన పై oదరిని చంపిన దోషమూ అంటదు. దీనివల్ల ఈ రెండు యోగనిష్ఠలలో మహాదేవ శంకరుని కన్నా శ్రేష్ఠులు సిద్ధహస్తులూ ఇంకెవరూ లేరు అని ఋజువు అవుతుంది.  వాస్తవంగా మహాదేవ శంకరులు మాత్రమే యోగీరాజు, యోగేశ్వర్ అని చెప్పవలెను. కానీ కృష్ణుని యొక్క భక్తుల అంధశ్రద్ధ మూలంగా ఏ చరిత్ర ప్రమాణమూ లేకపోయినా కృష్ణుణ్ణి కూడా యోగేశ్వరుడు అనేశారు. అంతే కాకుండా గీత(8-3) అంతకాలేచ మామేవ... అంతిమ సమయంలో పరమాత్మను తలుచు కునేవారికి ఆయననే ప్రాప్తమవుతారు                                                 
 దీనికి గుర్తుగానే మానవ జీవితంలో చనిపోయిన తరవాత శరీరానికి అంతిమ క్రియ చేయడానికి మోక్షధామము లేక స్మశానమునకు తీసుకువెళ్ళేటప్పుడు అక్కడ కూడా శివాలయాల్లో యోగేశ్వర్ మహాదేవుడు శంకరుని యొక్క ప్రతిమే ఉంటుంది, కృష్ణుని ప్రతిమ కాదు.
పరమపిత ఏకవ్యాపి స్వరూపంలో పరకాయ ప్రవేశం చేసినపుడు ఆ సాకార స్వరూపుడు కూడా తనను తాను ఎలా నిరాకార స్టేజి తయారు చేసుకుంటారంటే తానే పరమపిత పరమాత్ముని సగుణరూపడైన భగవంతుడైపోతారు మరియు  నిర్గుణ పరమపితను తన సగుణ రూపం ద్వారా ప్రపooలో ప్రత్యక్షం చేస్తారు. ఈ విషయమై గీత(5-16) లో ఎవరు జ్ఞానం వల్ల తన అజ్ఞానం నష్టం చేసుకుంటారో అతను, జ్ఞాన ప్రకాశపు భండాగారం అయిన శివపరమేశ్వరుణ్ణి సూర్యునివలె ప్రకాశింపచేయును....అని ఉంది. జ్ఞానేనతు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః, తేషాం ఆదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం”. మరి అజ్ఞానం ఎలా వస్తుంది? ఈ విషయమై గీత(3-39) లోచెప్పారు...ఏవిధంగా అగ్ని పొగతో కమ్ముకుని ఉంటుందో అదే విధంగా ఆత్మలోని జ్ఞానం కామ-క్రోధ మనే అజ్ఞానంతో కమ్ముకుని పొంతుoది ఆ అజ్ఞానం ఆత్మ మరియు పరమపిత సంబంధిత జ్ఞానాన్ని పరమపిత ఏకవ్యాపి స్వరూప విశేష జ్ఞానాన్ని, ఈ జ్ఞాన, విజ్ఞానాలు రెండింటినీ (మనసు, బుద్ధి స్మృతి నుంచి) నష్టం చేసేస్తుంది. కనుకనే గీతలో(3-41) కామవికార రూపి అజ్ఞానాన్ని నష్టం చేయమని ప్రేరేపించింది. మరి శాస్త్రాల్లో ఆరూపం ఎవరిది, కామవికారం, కామదేవుణ్ణి భస్మం చేసినట్లు ఎవరిని చూపారు?  ఆయనయే మహాదేవుడైన శంకరుడు అంతేకానీ కృష్ణుడు కాదు. అనగా మహాదేవుడు శంకరుడే పరమపిత యొక్క సాకారీ ఏకవ్యాపి స్వరూపుడు. ఆయన తనలోని కామ వికార రూపి అజ్ఞానాన్ని తనలోని జ్ఞానయోగమనే మూడవనేత్రం తెరిచి భస్మం చేస్తారు. ఈ పవిత్రమైన నిష్కాముడైన శంకరుని స్వరూపం ద్వారా నిర్గుణ పరమపిత సగుణ రూపంలో ప్రత్యక్షం అవుతారు. ఎందుకంటే నియమం ఏమిటంటే ఎవరు ఎంత నిరాకారులౌతారో అతను అంతే నిర్వికారీ సృష్టిని నిర్మాణం చేయగలుగుతారు. పరమపిత పరమాత్మ స్వరూపం శంకరుని ద్వారానే (జగద్విపరివర్తతే రూపంలో) దైవి సృష్టి నిర్మాణం అవుతుంది. కామవికారం విషయంలో కృష్ణుడికి ఇటువంటి మహిమ లేదు. మరియు అతడు నిరాకారి స్థితిలో స్థితుడైన జ్ఞాపికలు కూడా ఏమీ లేవు. కనుకనే శ్రీకృష్ణుడు ఏవిధంగానూ నిర్గుణ పరమపిత యొక్క సగుణ రూపం కాలేడు. అంతేకాదు కృష్ణుడు కొత్త సత్య యుగ ప్రపంచం స్థాపనకు నిమిత్తం కాలేడు.
యోగం యొక్క అర్ధం మన్మనాభవ, అంటే ఏమిటో స్పష్టీకరణ ముందే తెలుసుకున్నారు. ఇప్పుడు పరమపిత ఏ సాకార మనుష్యుని తనువులో పరకాయ ప్రవేశం చేస్తారో ఆ స్వరూపం గురించి తెలుసుకుందాం. గీతలో (15-1) ఈ సృష్టి అనే వృక్షం తలకిందులుగా ఉన్న అశ్వత్థ వృక్షం వంటిది. దీని బీజం మరియు వేళ్లు ఊర్ధ్వం అనగా పై వైపుకు ఉంటే మరి విస్తారం(కొమ్మలు.. రెమ్మలు ..ఆది2) కింది వైపుకు అంటే (నీచం) అధానికి ఉన్నాయి. దీని అర్ధమేమిటంటే బీజము, మూలము(వేర్లు) స్వరూపుడైన నిరాకార శివ పరమాత్మ ఊర్ధ్వం పరంధామంలో స్థితుడై, అధః- క్రింది లోకాన్ని విస్తరిస్తారు. (?) అని కాదు. పరమపిత నిరాకారుడు, నిర్గుణుడు మరియు నిరంజనుడు మరి- ఈ సాకార సమస్త లోకం ప్రకృతియొక్క మూడు గుణాలు (సత, రజ, తమ) లలో బంధించబడి ఉంది. బీజం ఎలా ఉంటే వృక్షం అలాగే పుడుతుంది. ఫలాలు కూడా అటువంటివే వస్తాయి. కనుక త్రిగుణ మయి  సృష్టి రూపి వృక్షం యొక్క బీజం ఈ మూడు గుణాలలోకీ వచ్చేవాడు కాదా? ఈ విషయాన్నే గీత లో(7-12) మూడు గుణాల ఉత్పత్తి  నా వల్లనే జరిగింది అని ఉంది. కాని వాటిల్లో నేను లేను కానీ అవి అన్ని నాలోనే ఉన్నాయి అన్నారు. ఇక్కడ స్పష్టంగా ఏమని చెప్పారు? నాతో, నాలో మరి నేను అనే పదాలు ఏ అర్ధంలో చెప్పారు ? నిరాకార శివ పరమపిత మరియు యోగిరాజు సాకార స్వరూపంలో శంకరుని ఏకవ్యాపి స్వరూపం ప్రవృత్తిలో(జోడీలో) రెండు శక్తులు. నానుంచి ప్రకృతి ఉత్పత్తి మరియు నాలో ప్రకృతి ఉండడం ఈ రెండు(విషయాలూ) కూడా రెండు శక్తులు సాకారంలో నిరాకారుని ప్రవృత్తి(జోడీ) కి అనువర్తిస్తుంది. అక్కడే పరమపిత శివుని అస్తిత్వాన్ని నిర్గుణుడు అని చెప్పడానికి కోసo నేను వాటిలో లేను అని ఈ రకంగా స్పష్టం కూడా చేశారు. వాస్తవంగా ఈ అర్ధం అర్ధంచేసుకోవడం కొంచం (జటిలం)కష్టంమే ఎందుకంటే ఆత్మను తెలుసుకోవడం పరమపిత శివుణ్ణి తెలుసుకోవడం దీనినే జ్ఞానం అంటారు. కాని పరమపిత శివుని విశేషంగా ఒక సాకార రూపంలో (ఎవరు అని) తెలుసుకోవడం దీనినే కేవల జ్ఞానం మాత్రమే కాదు విశేష జ్ఞానం (విజ్ఞానం, సైన్స్)అంటారు. ఎందుకంటే దానిలో విశేషంగా యుక్తిః- అనగా యోగం, కలయిక అవ్వాల్సి ఉంటుంది. అక్కడ పండితుల దృష్టికోణం జ్ఞానం, యోగం అనేవి భిన్నం కావు (ఒకటే ఆయనను తెలుసుకోవడమే జ్ఞానం, కలవడమే యోగం- రెండూ ఒకటే) అక్కడే విశేష జ్ఞానం తో పాటు విశేష యోగం  ఇమిడి ఉంది. బహుశా అందుకే 7 వ అధ్యాయం పేరు జ్ఞాన, విజ్ఞాన యోగం అని పేరు పెట్టారు. ఇప్పుడు దీని ద్వారా ఏమి స్పష్టమౌతుందంటే సాకార శంకరునిలో నిరాకార శివ జ్యోతిర్బిందువు యొక్క ప్రవృత్తియే వాస్తవంగా ఈ  సృష్టి అనే వృక్షానికి బీజస్వరూప మూల కారణం. ఇప్పుడు ఈ బీజ స్వరూప మూలకారణం గురించి గీతలో (9-4)ఒక పదం వచ్చింది, అదే అవ్యక్త మూర్తినాఅని. మూర్తి అంటేనే సాకార స్వరూపం ఆ పదానికి ముందు అవ్యక్తఅనే విశేషణం ఆ సాకారుని స్పష్టం చేస్తుంది. ఆ సాకారుడు తన పురుషార్ధం(తపస్సు) తో నిరంతర ఆత్మిక స్థితి రూపి సంపన్నత పొంది పరమపితతో సమానంగా సగుణ రూపంలో అంటే వ్యక్తంలో ఉంటూకూడా అవ్యక్త రూపంలో ప్రత్యక్షం అవుతాడు. అవ్యక్తమూర్తి ద్వారా సమస్త లోకం విస్తారాన్ని పొందింది. దాని అంశ ఈ అవ్యక్తమూర్తిలో ఉండనే ఉంది. కానీ అవ్యక్తమూర్తి లో ప్రవేశించిన పరమపిత శివుని నివాసం మాత్రం మొత్తం వృక్షంలో లేదు.(ఏకవ్యాపియై శివుడు) ఇక్కడే పరమపిత యొక్క పరా మరియు అపరా ప్రకృతి భేదం స్పష్టం అవుతుంది. పరమపిత యొక్క ఏకవ్యాపి సాకార మనిషి రూపం, హీరో పార్ట్ ధారి పరమాత్మయొక్క అపరా ప్రకృతి అనగా భౌతిక రూపంతో తెలుసుకుని, ఒప్పుకునే  నిమ్నజాతి (తక్కువ స్థితిగల) ప్రకృతి పంచ తత్త్వాలతో తయారైన శరీరం జడప్రకృతి. మరియు ఆ సాకార స్వరూపుడు తన అజ్ఞానం నష్టం చేసుకుని నిర్గుణ పరమపిత శివుని సగుణ రూపంలో ప్రత్యక్షం చేసే వానిగా తయారవుతారు. అప్పుడు ఆయన అవ్యక్త మూర్తి రూపంలో పరమపిత యొక్క పరాప్రకృతి అని పిలవబడతారు. (గీత-7-6)సమస్త సృష్టి లోకం రెండు రకాల ప్రకృతులతోనే ఉత్పన్నమయ్యింది. ఈ పరాప్రకృతి గురించి గీతలో (14-3)పరంబ్రహ్మ స్వరూప పరమపిత శివుని యొక్క యోనిరూపి మాత (త్వమేవ మాతా...) ఆమెలో (అతనిలో, శివుడు) బీజం వేస్తారు మరియు సమస్త జడ చైతన్య సృష్టి  ఉత్పత్తి చేస్తారు. ఇప్పుడు ఒకవేళ అపరా ప్రకృతి పరా ప్రకృతి ఈ రెండూ విషయాలూ తీసుకున్నట్లయితే శ్రీకృష్ణుని ఏ జ్ఞాపికలూ(యాద్.గార్ లూ) శాస్త్రాల్లో లేవు, కానీ పంచ మహా భూతాలూ ఇంకా మనసు బుద్ధి అహంకారం అష్టయుక్త సమస్త దశ ఇంద్రియాలూ మరియు వాటి పంచ  విషయాలూ సహా అపరా ప్రకృతి రూపంలో శంకరుని జ్ఞాపిక ఉంది. మరియు ఈ మొత్తం 23 భేదాలతో  ఉన్నతoగా, మరియు భిన్నoగా ఏదైతే శంకరుని పరమపిత తో కలిసి ఏకాత్మ అయినట్లు ఒక మూల రూపం ఉంది. ఆ పరా ప్రకృతి యొక్క లింగరూపం లో జ్ఞాపిక ఉంది. గోపేశ్వరంలో ఈ లింగరూపాన్ని స్వయం శ్రీకృష్ణుడు పూజచేస్తున్నట్లు చూబించారు. దీని ద్వారా సమస్త సృష్టి కీ మూలకారణమైన పరమపిత యొక్క సాకార పరమాత్మ స్వరూపం శంకరుని యొక్క ఏకవ్యాపి రూపం అంతేకాక కృష్ణుడు కూడా ఆయన ఉపాసకుడే అని తెలుస్తుంది. గీతలో(15-16) రెండు రకాల పురుషులు ఉన్నారు అన్నారు. ఒకరు క్షరం మరొకరు అక్షరం సాకారంలో పాత్ర చేసే సమస్త ఆత్మలూ త్రిగుణాలు అనే మాయలో క్షరితం అవుతూ ఉంటాయి. వాటన్నిoటినీ(ఆ ఆత్మలందర్నీ) క్షర అంటారు. పరమపిత శివుడు త్రిగుణాలకూ అతీతుడు సదా నిరంజన నిర్గుణుడు. ఆయన జ్ఞానం కూడా క్షరితం కాదు. మరియు ఆయన అన్నిoటికన్నా పైన పరంధామంలో ఉన్నారు. ఆయననే అక్షరుడుఅంటాము. కానీ ఈ క్షర, అక్షరాల కన్న ఉత్తముడు(గీ.15-17) ఒకరు ఉన్నారు అని గీతలో అన్నారు. ఆయనే పురుషోత్తముడు. ఎందుకు శ్రేష్ఠుడంటే, క్షరిత ప్రపంచంలో ఉంటూ, అక్షర స్థితిలో స్థితుడై క్షర, అక్షరాలు ఇద్దరికీ మాధ్యమంగా అవుతాడు. ఈ లోకంలో దళారీ అయ్యి, పరమపిత శివునితో కలిపే పని చేస్తారు. ఈ పురుషోత్తముడు లేకుండా అక్షర పరమపిత ఏమీ చేయలేరు. క్షర ఆత్మలూ ఏమీ చేయలేవు. కనుకనే ఈ క్షరలోకం(మృత్యులోకం) అక్షరలోకం(పరంధామం-బ్రహ్మలోకం) మరియు అవ్యయ పురుషోత్తముని(అమర)లోకం అనే స్థితి, ఈ ముల్లోకాలూ పురుషోత్తమ (స్వరూపుడు) తన అధీనంలోకి తీసుకుంటాడు. ఈ పురుషోత్తముడే సమస్త మనుష్యాత్మలలో పరముడు, శ్రేష్ఠుడు అయిన కారణంగా (గీత-15-17) పరమాత్మ అని పిలవబడతాడు. ఈ పరమాత్మ స్వరూపం కృష్ణుడు కాదు. ఎందుకంటే పురుషోత్తముడైన పరమాత్మను గీతలో(15-17) అవ్యయ ఈశ్వరుడుఅనే శబ్దంతో సంబోధించారు. అవ్యయుడు అంటేనే అవినాశి. శ్రీకృష్ణుని ఎప్పుడూ అవినాశి అని పిలవరు. గీతలో ఏ అవినాశీ(వ్యక్తి)ద్వారా ఈ సమస్త సృష్టి  విస్తృతమైనదో ఆ అవ్యయ పురుషుడు అనగా పురుషోత్తమ పరమాత్మను వినాశనం చేసే సామర్ధ్యం ఎవరిలోనూ లేదు”(గీత-2-17- అవినాశీ తూ తద్విద్ది యేన...) అని ఉన్నది. కానీ శాస్త్రాల్లో ఒక బోయవాని బాణం తగలడం వల్ల కృష్ణుని మృత్యువు సంభవించింది అని ఉన్నది. అనగా ( కృష్ణుడు) క్షర మయ్యే ఆత్మల శ్రేణిలో ఉన్నాడు. అతడు అవ్యయ పరమాత్మ కాడు.
ఈ పురుషోత్తమ పరమాత్మ స్వరూపం వాస్తవానికి శంకరుడే ఈయన మృత్యువుకు అతీతుడు అయ్యారు(మృత్యుంజయుడు). గీత(5-19) లో కూడా ఎవరి మనసు సమస్థితి లో స్థిరమో, అతడు ఇక్కడే మృత్యులోక రూపి ప్రపంచాన్ని గెలిచాడుఅని ఎవరైతే మృత్యువును జయించారో అతడే ఇతరులకు అమరత్వం కూడా  (దేవత్వం) ప్రదానం చేయగలడు. ఎవరు లోకాన్ని వినాశనం చేయగలడో అతనికి సృజించే సామర్థ్యం కూడా ఉంటుంది. అని ఉంది. కనుకనే పరమాత్మ ద్వారానే సృష్టి పుట్టుక ఇంకా ప్రళయం సంభవం.(గీత-9-7). గీతలో కూడా పాత కల్పం అంతంలో సమస్త భూతాలూ అనగా క్షర ఆత్మలు అవ్యయ పరమాత్మ జ్యోతిర్లింగ స్థితిని పొందుతాయి. (సర్వభూతాని కౌంతేయ) మరియు కొత్త కల్పం ఆదిలో తమ-తమ స్వభావం (ప్రకారం) అనుసారం అవి మళ్ళీ సృష్టి కోసం కొత్త శుద్ధ రూపంలో పరంబ్రహ్మ పరమాత్మను వదిలి పెడతాయి. అంతంలో సమస్త సృష్టి  శ్రీకృష్ణునితో సహా ఈ పరమపిత పరమాత్మ ఏకవ్యాపి పరమేశ్వర శివ శంకర స్వరూపంతో మన్మనాభవ అయి తమ-తమ స్థితి పొందుతారు. దీనికి గుర్తుగానే గుళ్ళలో బంధనంతో ఉన్న అనేక సాలిగ్రామాల మధ్యలో (ఏ బంధం లేని) నిర్బంధ శివలింగం చూపిoచారు (గీత 8-20). కల్పాంతంలో సమస్త లోకం నశించాక కూడా ఆ అవ్యయ పరమాత్మ స్వరూపం శివ శంకరుని నాశనం జరగదు మరియు కల్పం ఆదిలో అందరి ఉత్పత్తికి మూల కారణం (ఆయనే) అయినందువల్ల ఆయన జన్మ కూడా ఎవరికీ తెలియదు.
అందుకే గీత(10-3) లో స్పష్టంగా అజన్మ, అనాది, మహేశ్వరుడైన  నన్ను తెలుసుకున్న, అర్ధం చేసుకున్న వాడు అన్ని పాపాలనుంచి ముక్తుడు అవుతాడుఅని ఉన్నది. ఇక్కడ కూడా పాపాలు తొలగించే వాడు ముక్తిదాత అని కృష్ణుణ్ణి కాదు పైగా మహా ఈశ అంటే మహేశ అనగా పరమాత్మ స్వరూపం మహాదేవ శంకరునే అన్నారు. (మహేశుడని శంకరుని అంటారు కానీ కృష్ణుని కాదు). వేదాల్లో భగవంతుడుఅని అనన్య(విశేష) రూపంతో కేవలం భగవాన్ రుద్రుని కి ప్రయోగించబడింది. యజుర్వేద రుద్రశ్లోకం భగవంతుడి రూపంలో రుదృని వందనంతో ప్రారంభం అవుతుంది. దాని(వేదం) ప్రకారం ఓం నమో భగవతే రుద్రాయఅంటే అర్ధం రుద్రుడు ఎవరైతే భగవంతుడో ఆయనకు నమస్కారం అని(ఈశ్వరుని పరమ మూర్తికి నమః) మిగతా అందరు దేవతలూ ఎవరికైతే భగవంతుడనే ఉపాధి దొరికిందో, వారికి ఆ ఉపాధి పురాణాల వల్ల లభించింది, అంతే కాని వేదాల వల్ల కాదు. వాస్తవంగా తరవాతి గ్రంధాలలో పురాణాలలో నారదుడు, వ్యాసుణ్ణి కూడా భగవంతుడు అనే ఉపాధితో అలంకృతులను చేశారు. కనుక తరువాతి గ్రంధాలలో వాడుక భాషలో ఈ ఉపాధి అందరికీ ప్రయోగించడం మొదలు పెట్టేశారు.
భగవంతుడు అని విష్ణువును ఉల్లేఖించే మంత్రాలు ఎలాగంటే ఓం నమో భగవతే వాసుదేవాయమొదలైనవి పౌరాణికాలే కాని వైదికాలు కావు. వేదాల్లో కేవలం భగవాన్ రుద్రుడే (శివుడే) భగవంతుడు. అంతేకాక భగవద్గీత వేదాల, ఉపనిషత్తుల సారము అది మనకు సరిపడినంత సూచన ఇచ్చింది ఏమంటే భగవాన్ రుద్రుడే గీతా జ్ఞాన దాత అని. ఈ జ్ఞాన యజ్ఞం ఆరంభమే అవినాశీ రుద్ర జ్ఞాన యజ్ఞంతో అవ్వాలి.
గీతలో వచ్చిన కృష్ణ శబ్దం మహిమ నిజానికి పరమపిత పరమాత్మ శివునిదే. ఇప్పుడు కృష్ణుడు పరమాత్మ స్వరూపం గీతా జ్ఞాన దాత కాకపోతే, గీతలో అక్కడక్కడా కృష్ణుడనే పేరు ఎందుకు తీసుకున్నారు అనే ప్రశ్న ఉదయిస్తుంది. గీత సాధారణమైనది కాదు అని మనకు తెలుసు పైగా అది పరమపిత పరమాత్మ రచించిన పాట లేదా కవిత్వం. కవితను కవి ఏవిధంగా అలంకారలతో అలంకరిస్తాడో, ఏయే భావాలు నింపుతాడో అవి సాధారణంగా ఉండవు(విశేషంగా ఉంటాయి). అలాగే పరమపిత ద్వారా రచించబడిన ఈ కవిత్వంలో కూడా ఎన్నో అలాంటి భావనలు అలంకారాల రూపంలో చెప్పారు. కృష్ణుడనే పేరు వచ్చిన చోట నిజానికి అది గుణ వాచక పదం. కృష్ణ అనే పదానికి నల్లని(వాడు) అని కానీ ఆకర్షించే వాడు అని కానీ అర్ధాలు వస్తాయి. ఈ రెండు అర్ధాలూ కేవలం పరమపిత పరమాత్మ స్వరూపం మహాదేవుడు శంకరునికి మాత్రమే వర్తిస్తాయి. త్రిగుణమయీ ప్రకృతి మధ్యలో కలియుగ అంతిమ సమయం వరకూ కూడా సాకారంలో ఉన్నందువల్ల నల్లని స్వరూపం అయ్యింది. సమస్త లోకాన్నీ, ప్రాణులన్నింటినీ, దేవతలైనా, అసురులైనా ఏవర్గానికి చెందినా అందరికీ ఇష్టుడని (ఆయనను) ఒప్పుకుంటారు.
మహాదేవుడు శంకరుడిని శాస్త్రాలలో సమస్త సన్యాసుల జీవితాలనూ ఆకర్షించేవాడు ప్రేరక శ్రోత(మూలం) అని నమ్ముతారు. కనుక సమస్త (శివ)కుటుంబం, భార్య పార్వతి, పుతృలు గణేశుడు, కార్తికేయుడు , భక్తుడు నంది ఇంకా ఇతర రుద్ర గణాలూ సహితంగా గృహస్థ ధర్మ పాలకుని రూపంలో కూడా సర్వ శ్రేష్ఠంగా ఆకర్షించే వాడని నమ్ముతారు.
సన్యాసులకు కృష్ణునిపై ఆసక్తి ఉన్నట్లు కనిపించదు అలాగే ఏ రాక్షసులూ కృష్ణుడికి ఆకర్షితులైనట్లు శాస్త్రాల్లో కనిపించదు. అందుకే కృష్ణ శబ్దం గుణ వాచకమనే గ్రహించాలి.
ఈ కృష్ణ శబ్దం తీసుకుని అర్జునుని భ్రమ:- గీత-11 వ అధ్యాయంలో వేరొక ఉదాహరణ కూడా అర్ధం చేసుకునే ప్రయత్నం చేద్దాం. పరమపిత పరమాత్మ విశ్వరూప సందర్శనం చేసుకుంటూ అర్జునుడు భయపడి నప్పుడు అతడు ఆ విరాట స్వరూపుడు ఎవరో తెలుసు కోలేక పోయాడు. ఈ సందర్భంలోనే అతడు భయభీత స్వరంతో చేతులు జోడించి పరమపిత పరమాత్మ స్తుతి చేస్తూ ఆయనను తెలుసుకునే జిఙ్ఞాసతో ఈ విధంగా అడుగుతున్నాడు భయంకర రూపంతో ప్రవృతమైన మీరు ఎవరు? నేను తెలుసుకోలేక పోతున్నాను. దయచేసి మీ పరిచయం ఇవ్వండిఅని అంటాడు.

ఇక్కడ మనకు ఆశ్చర్యం కలిగే విషయం ఏమంటే ఎవరినైతే అప్పటివరకూ మొత్తం గీతా అధ్యాయాలన్నింటిలో కృష్ణుడు, విష్ణువు అనే పేరుతో పిలుస్తూ తన జిజ్ఞాసను శాంత పరుచుకునే ప్రయాస చేస్తూన్న అర్జునునికే తనకు వాస్తవికత బోధపడుతూ అర్ధం అవుతున్నది పరమాత్మ స్వరూపం శ్రీకృష్ణుడు కాదు మరెవరో అని తెలుస్తున్నది. లేకపోతే ఈ ప్రశ్న అడగడంలో ఆంతర్యం ఏమిటి? మరియు అర్జునుని ఈ జిజ్ఞాసను శాంతింపజేస్తూ పరమాత్ముడు ఏమంటున్నారంటే (గీత. 11-32) కాలోస్మిఅని. అనగా నేను కాలుడిని అని. మనకందరికైతే కాలుడికే కాలుడు మహాకాలుడని, మహాకాలుడే ఈ మహాదేవుడు శంకరుని ఉగ్ర రూపమని తెలుసు. అంటే ఇక్కడ కూడా గీతా జ్ఞాన దాత పరమపిత శివుని ఏకవ్యాపక స్వరూపం మహాదేవుడు శంకరుడనే కృష్ణుడు కాదని మనకు స్పష్టం అవుతుంది.
కృష్ణ శబ్దంతో మరొక తర్కం అర్ధం చేసుకునే ప్రయత్నం చేద్దాం
పరమాత్మ తన కాల స్వరూప పరిచయం ఇచ్చినపుడు అర్జునుడు తన తప్పు తెలుసుకుని హే కృష్ణా, హే యాదవా, హే సఖాఅంటూ నేను నిన్ను ఏ తిరస్కార పూర్వక పలుకులు పలికానో ఆ పలుకుల  కోసం జగత్తుకు అతీతుడవైన ఓ పరమ పితా పరమాత్మా మిమ్మల్ని నేను క్షమా ప్రార్ధన చేస్తున్నానుఅంటాడు. అవ్యయ పరమాత్మ స్వరూపుడు మహాదేవుడు శంకరుని క్షర పురుషుడు శ్రీకృష్ణునిగా తలచి సంబోధించి తిరస్కార పూర్వక కృత్యం చేసిన ఆత్మగ్లాని వల్ల అర్జునుడు ఈ క్షమా యాచన చేస్తున్నాడు. కానీ బుద్ధిమాన్ నర్ అర్జున్ అని పిలవబడే అర్జునుడు తిరిగి 17 వ అధ్యాయంలో ప్రధమ శ్లోకంలో కృష్ణ శబ్దంతో (తిరిగి) సంబోధించాడు. అందువల్ల మనకు ఏమి సిద్ధిస్తుంది? కృష్ణ శబ్దం నామవాచకం కాదు పైగా సమస్త లోకాన్నీ ఆకర్షించువాడు అనే గుణ వాచకం అని బోధపడుతుంది. సమస్త లోకమునూ ఆకర్షించుట అనే గుణమును అభివ్యక్తీకరించే పరమాత్మ స్వరూపుడు మహాదేవ శంకరుని సంబోధించాడు అని తెలుస్తుంది. లేకపోతే అర్జునుడు క్షమాయాచనకు అర్ధమేమిటి?
చిత్రంతో పాటు చరిత్ర విషయంలో కూడా కృష్ణునికి మహాదేవ శంకరునికి మధ్యన చాలా అంతరం ఉంది. ద్వైతవాది భక్తి మార్గంలో శ్రీకృష్ణుని చరిత్ర నియమాల ఉల్లంఘన మర్యాద ఉల్లంఘన చేస్తున్నట్లు చూపారు. ఆయన బాల్య, కిశోర అవస్థల్లో అధికాధిక ఉల్లంఘనలు చేసినట్లు చూపారు. ఈ రూపంలో సదా అనుశాసన హీనత క్రమశిక్షణా రాహిత్యం స్పష్టంగా కనిపిస్తుంది. దొంగవలె (పాల) కుండలు పగల గొట్టడం, వెన్న దొంగిలించడం అది తన సఖులతో కలిసి తినడం, గోపికల పనులకు ఆటంకాలు కలిగించడం, నీళ్ళతో నిండిన కడవలు పగలగొట్టడం వాళ్ళ ఇళ్ళల్లో కట్టేసిన గో లేగదూడల కట్లు విప్పేయడం వంటి చేష్టలు శాస్త్రాల్లో అతని చేష్టలు భరించలేక సమస్త గోకులం విసుగుచెంది అనేక సార్లు యశోదకు నందునకు మొరపెట్టుకోవడం చూపారు.
(మరొక వైపు గీతలో 12-15) ఎవరైతే లోకులను విసిగించరో, తాము విసుగు చెందరో అట్టివారు పరమపిత పరమాత్మకు ప్రియులు అన్నారు. కానీ శాస్త్రాల్లో కృష్ణ చరిత్ర అందుకు సానుకూలంగా లేదు. పోనీ కృష్ణుని పిల్లచేష్టలు అనుకుని వదిలేద్దామా అన్నా, అతని యువావస్థలో కూడా అతని ఈ రకమైన మహిమ శాస్త్రాల్లో ఏమీ తక్కువగా లేదు. అర్ధ వాచక గోపికల వస్త్రాలు వారు స్నానం చేస్తున్నప్పుడు దొంగిలించడం అనేక పత్నులను చేసుకోవడం ఇత్యాదులు. మరి గీతలో మాత్రం (3-21) శ్రేష్ఠ పురుషుల కర్మలను అందరూ అనుసరిస్తారుఅని ఉంది. శాస్త్రాల్లో ఏ రూపంలో కృష్ణుని చరిత్ర మహిమ వర్ణించారో ఆ చరిత్ర సామాన్యులు అనుసరించదగినదిగా ఉన్నదా ? ఎన్నటికీ లేదు. కాని సమస్య ఏమిటంటే గీతా జ్ఞాన దాత శ్రీకృష్ణుడు అనుకోవడం వల్ల  జనులు ఈ చరిత్రే అనుకరించడం వల్ల నేడు సమస్త మానవ సమాజం దుర్గతి (ప్రదూషితం) అవడం జరిగిపోయింది. (ఇంకా తెలియడం కోసం ఖండిత గీత వల్ల ఉత్పన్న మైన సమస్యలు వాటికి సమాధానం విభాగం చూడండి).
నిర్గుణ నిరంజన పరమపిత శివుని సర్వవ్యాపకుడు అనడం ఇంకా సగుణ రూపంలో కృష్ణుడను కోవడమే శ్రీమద్భగవద్గీత లో చేసిన అతి పెద్ద తప్పిదం. ఈ తప్పిదం వల్లనే ఈ రోజు మొత్తం  సృష్టిని అమానవీయ అసుర రూపంలో నిలబెట్టింది.
శివ శంకరులలో తేడా మరియు అన్ని ధర్మాలలో ఏకవ్యాపక శివలింగ స్వరూపునికి మాన్యత
పరమాత్మ సగుణ రూపం మహాదేవ శంకరుడే ఏకవ్యాపక రూపం అని తెలుసుకున్నాం. కానీ నిర్గుణ నిరంజన పరమపిత యొక్క ఏకవ్యాపక స్వరూపం అని విశ్వవిఖ్యాతమయే పేరు(మాత్రం) శివుడు”. శివుడు అంటేనే అర్దం సదా శుభం లేక కల్యాణకారి అని. మరియు పరమపిత శివుడు తన సాకార ఆధారం శంకరుని కన్న భిన్నమే అయి ఉన్నాడు. ఈ శివుడు సదా శంకరుని కన్న పెద్ద, అధికుడు, పూజనీయుడు అని భావించబడ్డారు. కనుకనే ఆయన పేరు ముందుగా చెబుతారు. పరమపిత పరమాత్మ అని ఎలాగ అంటారో అలాగే శివ-శంకరుడు అని. అంతేకానీ శంకర-శివుడు అనరు. శివుని ప్రవేశం తరువాత సాకార స్వరూపుడు శంకరుడు సహజ రాజయోగం అభ్యాసం ద్వారా తన దేహభ్రాంతి ఏవిధంగా మరిచి నిరాకార స్థితి తయారు చేసుకుంటాడంటే పారదర్శి రూపంలో(అంతిమ సమయంలో) చివరకు సదా శుభంకర శివుడని(సమస్త లోకానికీ) అనుభవం అవుతుంది. (సాకారుడు తన పురుషార్ధం ఎంత తీక్ష్ణంగా చేస్తారంటే చివరకు ఆ శివుడే ఈయన అన్నంతగా నిరాకార స్థితి పొందుతారు. ఈ కారణంగానే శివుడు శంకరులలో భేదం చేయలేకపోయారు. ఇద్దరూ ఒకటే అనేసుకున్నారు. ఈ శివ-శంకరుల ఏకాత్మ అయిన స్వరూపమే లింగమనే గుర్తు(యాద్.గార్-జ్ఞాపిక) గా ప్రఖ్యాతమైనది. ఈ శారీరక లింగం మధ్యలో బొట్టు(బిందువు) చూపించుతారు, అది నిర్గుణ పరమపిత శివుని నిరంతరం స్మృతి (యాద్) చేయడానికి గుర్తు. కనుక దీనిని (లింగాన్ని) శివలింగం అంటారు అంతేకాని శంకరలింగం అనరు. ఈ నిరాకార స్టేజి శివలింగమే సమస్త ధర్మాలలో మాన్యత పొంది పూజనీయమైనది.
నిజానికి ఏకవ్యాపి పరమపిత పరమాత్మ శివ-శంకరుని అవ్యక్త, అమూర్త, జ్యోతిర్బిందు స్వరూపాన్నే స్వీకరించడం జరిగింది. ఆయన (శివుని) వాస్తవిక స్వరూపం అణువుకన్న అణూత్తమం, ఈ కళ్ళకు కనిపించదు అందుకే నిరాకారం అంటారు. వైదిక పరంపరలో పూజాసౌలభ్యం కోసం సులభంగా పూజ చేయడం కోసం అతి సూక్ష్మ జ్యోతిర్బిందు శివుని పెద్ద ఆకారం శివలింగం సాకారంలో నిరాకారి స్వరూపం తయారు చేశారు. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తుల నించి గ్రహించి నేటికీ మందిరాలు, గుళ్ళలో కూడా ఆ శివలింగ ఆకారాన్ని, అమూర్తి(ఆయనది ఏ ప్రాణి లాంటి మూర్తి కాకుండా) శివుని మహిమ అన్నిటికన్న అధిక గాయనం ఉంది. ఎందుకంటే ఇదే ఆయనకు సత్యమైన స్వరూపం కనుక. సింధు నదీ లోయల్లో అన్నిటి కన్న పెద్ద సంఖ్యలో లింగ మూర్తులే లభించాయి. మహాభారతంలో కూడా సృష్టి ఆదిలో(ఆదిపర్వం-1 వ అధ్యాయం) ఏమీ లేనపుడు పేద్ద గుడ్డు రూపంలో ప్రకటితమైనట్లు విషయం వచ్చింది. ఆ గుడ్డే అందరికీ బీజం.
ఋగ్వేదంలో (1.164.46) లో ఏకో సత్ విప్రః, బహుదా వదంతిఅని వచ్చింది. దీనర్ధం ఒకరే సత్యం(ఈశ్వరుడు) ఆయనను జ్ఞానీ జనులు విభిన్నమైన పేర్లతో పిలుస్తారుఅని ఉంది. సమస్త మానవ సంస్కృతి ఆది నిర్మాత పరమపిత పరమాత్మ ఏకవ్యాపకుడు శివ-శంకర స్వరూపం శివలింగాన్ని నేటికీ విశ్వంలో అన్ని ధర్మావలంబీకులూ ఒప్పుకుంటారు. యహుదీయులు(యూదులు-jews) ఆయనను యహోవా పేరుతో అగ్నిని నమ్ముతారు. మూసా కు ఆయన సాక్షాత్కారం అయ్యింది. యూదుల చిహ్నం Y”, ఇది నిజానికి శివలింగ స్వరూపమే. ఎందుకంటే ఈ చిహ్నం(ఆంగ్లంలో బ్లేడ్, ఛాలైస్ అంటారు) చషకం(గ్లాసు-కప్పు) Ú రెండవది ఫలకం Ùఈ రెండూ చిహ్నాలూ కలవడం ద్వారా Yతయారైనది. ఈ చషకం, ఫలకం వేరే యేమో కాదు, నిజానికి శివలింగంలో చూపబడింది. జలాధారి పరంబ్రహ్మ అనగా శివునియొక్క మహద్బ్రహ్మ అనగా యోనిరూప మాత దానిపై స్థితమైన శివలింగం బీజం ఆరోపణ చేసే తండ్రి రూపంలో ఉన్నది. సాకార స్వరూపుడు శంకరుడు శివ సమాన సంపూర్ణుడు అయినప్పుడు ఆయనకూడా అగ్నివలే పవిత్రంగానూ ప్రకాశమయంగానూ అవుతారు.ఆయన శక్తి ఏనాటికీ క్రిందివైపుకు కాకుండా అగ్నిలాగా ఎల్లప్పటికీ పైవైపుకే అగ్రసరం అవుతుంది. అగ్నిలాగే ఉత్పత్తి, భరణ (పోషణం) ప్రళయం మూడు సామర్ధ్యాలూ పరమపిత పరమాత్మ శివ-శంకరుని ఏకవ్యాపి స్వరూపంలో ఉంటాయి. ఈ కారణంవల్లనే యూదులు యహోవా అనగా అగ్నికి పూజ చేస్తారు. హిందూ శాస్త్రాల మాన్యత ననుసరించి శతపథ బ్రాహ్మణం 3-1-3,5,2,4, 13 ప్రకారం అగ్నియే రుదృడు, రుద్రుడు ఎవరో ఆయనయే అగ్ని అని ఈ విధంగా మరుద్గణాల ద్వారా అగ్నిస్తుతి చేయబడింది. శుక్ల యజుర్వేదం లో కూడా (45) అగ్నికి భవ, సర్వ, ఈశాన, ఉగ్ర, పశుపతి ఆదిగా రుద్రుని పైనే ఇతర పేర్లు ఇవ్వబడినవి. అధర్వ వేదం లో కూడా రుద్రుడిని అగ్ని అని నమస్కారం చేయబడింది ఈ ప్రకారంగా రుద్ర శివ శంకరుడే అగ్ని మరియు ఈయనయే యూదులకు కూడా పూజనీయుడు.
బైబిలు ప్రకారం పరమేశ్వరుడు జ్యోతి స్వరూపుడు. భారత దేశంలో కూడా శివలింగాన్ని జ్యోతిర్లింగం అంటారు. అంతేకాదు బయిబిలులో పరమేశ్వరుని సత్య స్వరూపుడని సత్యానికి ఈశ్వరుడనిచెప్పబడింది. గాడ్ ఈజ్ ట్రూత్. హిందూ శాస్త్రాల్లో కేవలం పరమపిత పరమాత్మ శివుని స్వరూపాన్ని మాత్రమే సత్యం, శివం, సుందరం అని చెపుతారు. అనగా క్రైస్తవులు జీసస్ క్రీస్తును ఏ శిలువపై ఎక్కించారో ఆ V చిహ్నాన్ని పవిత్రంగా భావిస్తారు. ఈ చిహ్నం నిజానికి ఒక పడిన కర్ర, ఒక నిలిచిన కర్రలతో తయారు చేసిన శిలువ. ఈ పడిన, నిలబెట్టిన చిహ్నాలు మాతా పితల (గుర్తులే) కంబైన్డ్ స్వరూపమే. వైదిక సంప్రదాయం ప్రకారం యజ్ఞాది క్రతు రచన చేసేటప్పుడు అగ్నిని పుట్టించడానికి రెండు కర్రలు రాపిడి చేసే వారు. వాటిల్లో ఒకటి పడిన కర్ర ఆధారం మాత, మరి నిలబెట్టిన కర్ర దేనిద్వరా ఘర్షణ చేస్తారో అగ్ని ఉత్పన్నం చేస్తారో ఆ ఆధేయం పిత అని పిలుస్తారు. ఇది మాతా-పితల కలయక శివ-శంకర స్వరూప శివలింగము యొక్క గుర్తే అయి ఉన్నది.
గురు నానక్ సిక్కుల గురువు, ఓం నిరంకార్ సత్ గురు అకాల్ బహునామ్, అకాల్ మూర్త్ అంటూ ఆ నిరాకార స్వరూపాన్నే సంకేతించారు. నిజానికి పరమపిత-పరమాత్మ సత్యం, శివం, సుందరం ఆయనే సద్గురువు. అకాలమూర్త్ అంటే అర్ధం ఏ మూర్తి అనగా సాకార స్వరూపంలో ఉంటూకూడా మృత్యువును జయించాడో ఆయన. హిందూ శాస్త్రాల ప్రకారం అకాలుడని కేవలం శంకరుడినే మహాకాలుడని నమ్ముతారు. బహునామ్అని సంజ్ఞ ఎవరికి బహురూపాలున్నాయో ఆయనయే అని చెప్పగలుగుతాం. ఎవరు అరూపుడో ఆయనకు పేర్లు ఎలా ఇవ్వగలం. ఎందుకంటే పేరు చేసే పనిని బట్టి ఇస్తారు. (పని ఆధారంగా పేరు ఇవ్వ బడుతుంది) మరి పని (క్రియ) సాకార శరీరం తోనే సాధ్యం. హిందూ శాస్త్రాల్లో శివ-శంకరునికి 11 రుద్ర స్వరూపాల్లో ఒకటి బహురూపుడు అని కూడా చెప్పబడింది. అన్ని విధాలుగా గురునానక్ చేత కూడా పరమపిత పరమాత్మ శివ-శంకరునే నిరాకార స్వరూపుని స్తుతి చేయబడింది. అని ఋజువు అవుతుంది. అంటే గురు నానక్ కూడా సర్వధా శివ-శంకరునే స్తుతించాడని తెలుస్తుంది. జపాన్ లో బౌద్ధీయులు కొందరు ఈ రోజుల్లో కూడా గుండ్రని నున్నని మెరుస్తున్న రాతి గుండును దృష్టి సముఖానికి ఉంచుకుని తమ చిత్తం స్థిరం చేసుకుంటారు. శంకరుడు కూడా యోగారూఢుడైనప్పుడు ఆయన ముందు శివలింగం విగ్రహ రూపం చూబిపిస్తారు. ఈయననే జపనీయులు, బౌద్ధీయులు అనుసరిస్తున్నారు. రాత్రిలో చ్యవనుడు అంటే అవతరించే ఆ పరమపిత-పరమాత్మ యొక్క  ఏక వ్యాపి శివ-శంకర స్వరూపానికే హిందువుల్లో మహాశివరాత్రి అని గాయనం ఉంది. ముస్లిముల ధర్మ పుస్తకం ఖురాన్ షరీఫ్ లో కూడా మరియు ఓ దేవదూతా, నీకేం తెలుసు రాత్రి వచ్చేదేమిటో, ఆయన వెలిగే నక్షత్రం అని నేటికీ ముసల్మానులు హజ్ యాత్రకు వెళ్ళినప్పుడు కాబాలో గుండ్రని నల్ల రాయి (సంగ్ ఎ అస్వద్) ని చుంబిస్తారు. ముద్దుపెట్టుకోకుండా హజ్ యాత్ర పూర్తయినట్లు భావించరు. ఎక్కడ రాతిని పూజించడం నిషిద్ధమో అక్కడే ఈ విధంగా గుండ్రని రాతిని ముద్దుపెట్టుకోవడమనే ప్రధ ఆశ్చర్యపరిచే విషయమే కదా. నిజానికి ఆ రాయి కూడా లింగానికే గుర్తు. అసవద్ అనే పదానికి సంస్కృత పదం అశ్వేతం. అశ్వేతం అనగా శ్వేతం కానిది అంటే నలుపు. ఏ ఖుదా అనేమాట ముసల్మానులు అంటారో ఆయన వెలిగే నక్షత్రం అన్నప్పుడు తెలుపుకు బదులు నల్లని రాతిని ముద్దుపెట్టుకోవడం వెనుక కారణం ఏమిటి? ఈ నల్ల రాయి నిజానికి పరమపిత శివుని సాకార స్వరూపం లింగానికి గుర్తు. ఎవరైతే ఈ చీకటి వ్యవహారాలు చేసే కలియుగ రూపి సృష్టి మధ్యలో తన పాత్ర వహిస్తున్నారో ఆయనకు గుర్తు. ఎప్పటి వరకూ ఈ సాకార స్వరూపుని (జీవించి ఉన్న ఆయన్ను) సాంగత్యం చేయరో అప్పటి వరకూ పరమపిత-పరమాత్మ శివుని (ఖుదా) ప్రాప్తి బరకత్ ఔర్ ఆలా నసీబ్ న హోగా. (సాకారుని సాంగత్యం చేయనంత వరకూ ఖూదా దొరకరు-ప్రాప్తించరు). దీనికి గుర్తుగానే సంగ్ ఎ అస్వద్ నల్లని శివలింగ రూపి రాతిని చుంబిస్తారు. లేకపోతే నిర్గుణ ఖుదాకు తమ ప్రేమను ఎలా వ్యక్తీకరిస్తారు? సాకారుని ద్వారానే కదా ఇది సంభవం. మరోవైపు ముసల్మానులలో చంద్రుడు + ఒక నక్షత్రం చిహ్నానికి చాలా మహత్తు ఇస్తారు. Z నిజానికిది వేరే ఏదో కాదు పరమపిత శివుని పరమాత్మ స్వరూపం శివ-శంకరునికి గుర్తే ఆ గుర్తులో ఆయన సాకార స్వరూపం అవ్యక్తం కనుక అదృశ్యము(కనపడదు) కాని ఆయన ఉన్నాడు(ప్రత్యక్షతకు) అనేందుకు ప్రమాణంగా ఆయన నుదుటిపై విరాజిల్లుతున్న అర్ధ చంద్రుని, ఆయన లో ప్రవేశించి ఉన్న జ్యోతిర్బిందువు శివునికి మాత్రమే విలువ ఇస్తున్నారు. ఈ విధంగా అన్ని ధర్మాలలో పరమపిత-పరమాత్మ శివ-శంకరుని ఏకవ్యాప్త అవ్యక్త స్వరూపానికే గాయనం(మహిమ) పూజ తమ-తమ ప్రధను అనుసరించి చేస్తున్నారు. ఇప్పుడు మనకొక ప్రశ్న ఉదయిస్తుంది అన్ని మతాలూ, ధర్మాలలో ఒకే సాకారునిలో నిరాకారుని పరమాత్మ స్వరూపం శివలింగం గురించే చెప్పబడితే న్ని ధర్మాల, మతాల అవసరం ఏమిటి? లేక్కలేనన్ని తీర్థస్థానాల ప్రయోజనం ఏమిటి? అని ఈ విషయాలను కొంచం గంభీరం గా అర్ధం చెసుకోవడం అనివార్యం.
ధర్మం అంటే ధారణ. నిజానికి ఏ సంస్కృతీ సభ్యతానైనా మనసులో ధారణ చేయడమే ధర్మం అయిపోతుంది. ఒకవేళ ఏదైనా సంస్కృతి సభ్యతలపై భిన్నాభిప్రాయం ఉంటే (విరోధ భావం ఉంటే) అపుడది మన ధర్మం కాలేదు. దీనివల్ల సనాతన ధర్మంలో ఏదో ఒక లోపం ఉంది, దాని వల్లనే అనేక సంస్కృతులు జన్మ తీసుకోవలసి వచ్చింది అని తెలుస్తుంది. ఈ లోపం లేదా భిన్నాభిప్రాయం ప్రస్తుతపు సాకార కృష్ణుని గీత వల్లనే పుట్టింది. గీతలో కృష్ణుని పేరు వేయడం వల్లనే పరమపిత-పరమాత్మ శివ-శంకరుని ఏక వ్యాపక స్వరూపం సమస్త  సృష్టిలో గుప్తమైపోయింది. గీతలో ఉల్లేఖించిన పరమాత్మ నిరాకార-నిర్వికార-నిరహంకార స్వరూపం శ్రీకృష్ణుడని ఎన్నటికీ ఋజువు కాదు. అలా గీతాభగవంతుడు కృష్ణుడని వల్ల నిరాకార ఉపాసకుల భావనలు సడలిపోయాయి ఇదే ఆయా మతాల భిన్నాభిప్రాయాలకు ముఖ్య కారణం. ఈ అభిప్రాయ భేదాల వల్లనే సృష్టి ఆదికాలంలో పరమపిత-పరమాత్మ నుంచి మన్మనాభవగా అయ్యి తమ ఆత్మలో యధాశక్తి నింపుకున్న తేజస్సు అనుసారం వారు తమ వేరే-వేరే మతం తయారు చేసి పడేశారు. ఎంతోమంది ముహమ్మదు లాంటి నిరాకార వాదులు ఎంత ఉగ్ర వాదులు అయ్యారంటే సాకారునిలో నిరాకారుని పరిచయం గురుతు పట్టలేక సమస్తమైన సాకార చిత్రాలనూ విరగగొట్టడం మొదలు పెట్టేశారు. అసలైన సాకారం ఎవరో గుర్తించలేక ఎన్నో విగ్రహాలను ఖండించారు. ఆ పరమాత్మ స్వరూపాన్ని కొన్ని- కొన్ని స్మృతులు జ్ఞాపకాలు తమ-తమ మతాలలో తమ-తమ భాషలో ప్రత్యక్షం చేయడానికి ప్రయాస పడ్డారు. అది మనం పైన చర్చించుకున్నాం. ఎవరు తమ మతానికి ధర్మానికి పునాది వేశారో వారి పేరు మీదనే ఆయా ధర్మాల పేర్లు వచ్చేశాయి. ఉదాహరణకు క్రీస్తు పేరు మీద క్రష్టియన్ ధర్మం, పైగంబర్ ముహమ్మద్ పేరుతో ముస్లిం ధర్మం, ఇలా-ఇలా ఇత్యాదులు. వాళ్ళ  తేజస్సుకు ఎవరైతే ఆకర్షితులైనరో వారు వారి  మతాలు స్వీకరించారు. ఇప్పుడీమతాల వాళ్ళు పరస్పరం కొట్టుకుంటున్నారు. కారణం ఏమిటి? శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణుని పేరు వేయడం వల్ల ఈ అనర్ధం జరిగింది. శ్రీమద్భగవద్గీతలో (15-2) త్రిగుణాలతో ప్రవృతులైన విషయ-వికారీ మనుష్యులచే అంకురితమైన అన్య బౌద్ధీ, క్రీష్టియన్, ముస్లిం ఆది ధర్మాల శాఖలు పైకీ కిందికీ వ్యాపించి ఉన్నాయి మరియు వారి అనేక  కర్మకాండలలో బంధించే అనేక పరంపరల ఆచారాల రూపి వేళ్ళు కింది వైపుకు విస్తరించి ఉన్నాయి... అని చెప్పబడింది. ఇక్కడ మానవుల సృష్షి వృక్షంలో అన్ని ధర్మాల శాఖలూ ఊర్ధ్వగామి (పైకి) పరమపిత- పరమాత్మ అస్తిత్వ రూపి శివలింగమును బయటపెడుతూ సృష్టి వృక్షపు ముఖ్య కాండము మరియు కిందికి విషయవికారీ మానవధారణలతో దూషితమై పరమాత్మ అస్తిత్వమునే ఖండిస్తూ రెండు వైపులకీ పైకీ, కిందికీ కూడా విస్తరించి ఉన్నాయి. అని అర్ధం అవుతుంది. కనుకనే విస్తారం చెందిన సృష్టి  వృక్షంలో సారమనే బీజరూపుడు ఆత్మ ఆదంను వెతికి పట్టుకోవాలి. ఆయనే సమస్త చరాచరములన్నింటికీ మూల కారణము. ఆ బీజం శాస్త్ర ప్రసిద్ధమైన రావి ఆకుపై వేలు చప్పరిస్తున్న శ్రీకృష్ణుడు కాదు,  పరమపిత శివుని సాకార స్వరూపమైన శంకరుడే. ఆయన గుర్తులే ప్రతీ మతంలో సృష్టికి ఆది కారణమని, ఆది పురుషుడని, నమ్ముతున్నాయి. హిందువులలో ఆదిదేవుడు, ముసల్మానులలో ఆదమ్, క్రిష్టియన్లలో ఏడమ్, జైనీయులలో ఆదినాథ్. ఇత్యాదిగా ఆశ్చర్యం కలిగేలా ఒకేలాంటి పేర్లతో ఉల్లేఖించ బడింది.
నిజానికి అన్ని మతాల ధర్మస్థాపకులూ విశేషించి నిర్గుణ నిరాకారుని నమ్మేటటువoటి ఒక రకమైన సన్యాసులు. వీరంతా నిరాకార వాదులే కానీ నిరాకారమంటే అసలు అర్ధం వారికి తెలియనే తెలియదు. ఈ విషయం అర్ధం కావాలంటే మహాభారతం లోని అన్నిటి కన్న మహత్వ పూర్ణమైన ఒక ఉదాహరణ అర్ధం చేసుకోవడం ఆవశ్యకం. అది అర్జునుని రధంలో విరాజిల్లిన భగవంతుని తెలుసుకోవడం. కఠోపనిషత్తులో ఈ శరీరమే రధము, ఈశరీరాధిపతి ఆత్మ రధి, ఆత్మ నిర్ణయ శక్తియే సారధి, సంకల్ప శక్తి మనసు కళ్ళెం, ఇంద్రియరూపి గుర్రాలు జోడించబడినవిఅని ఉంది. వాస్తవంగా మహాభారత ప్రసిద్ధ అర్జునుని రధం కూడా ఈ శ్లోకంలో లాగానే సాధారణ మనుష్య శరీరం. ఈ మనిషి శరీరంలో అతని ఆత్మ, అర్జున పార్ట్.ధారి ఉండనే ఉన్నాడు. కానీ బుద్ధిమంతులకే బుద్ధిమంతుడు త్రికాలదర్శి పరమపిత శివుడు ఈ సృష్టి పైకి వచ్చినప్పుడు ఈ అర్జునుని రధంలోనే ప్రవేశిస్తారు. అర్జునుడు కూడా తన సమస్త ఇంద్రియాలకూ స్వామి అయినా కూడా తన మనస్సనే కళ్ళాన్ని పరమపిత శివునికి అప్పగించి ఆయనను తన శరీరంలో(రధంలో) బుద్ధిరూపి సారధి స్థానాన్ని ఇస్తాడు. ఈ అవ్యభిచారీ సమర్పణ కేవలం జ్ఞాని అయిన అర్జునుడు తప్ప వేరెవరూ ఇవ్వడానికి సమర్ధులు కారు. అందువల్లనే పరమపిత-పరమాత్మ యొక్క నిశ్చిత (పర్మనెంట్) రధపు ఆత్మకే ఈశ్వరీయ జ్ఞానం ద్వారా సద్భాగ్యము అర్జించునట్టి అర్జునుడు అని గాయనం. గీతలో (9-29) కూడా ఎవరైతే నన్ను, సంపూర్ణ శ్రద్ధతో తలుచుకుంటారో అతను నాలో, నేను అతనిలో ఉన్నాను- అన్నారు. గీతలోనే(18-64) ఇంకొక చోటకూడా అర్జునుని తన ప్రియమైన వాడు అని కూడా అన్నారు. ఈ అర్జునుడే మళ్ళీ జ్ఞాన, యోగాల మిశ్ర పురుషార్ధం చేయుచున్న శంకరుడు అని కూడా పిలువ బడుతున్నాడు. మరియు శంకరుడు అవుతూ శివ సమాన స్థితిని కూడా తన పురుషార్ధం(తపస్సు) తో ప్రాప్తి చేసుకుంటాడు కూడా. ఈయన గుర్తే శివలింగం అని మాన్యత నిస్తారు. ఈయనలో ఏకవ్యాపక స్వరూపం పరిచయం చేస్తూ గీత(7-30) లో నన్ను అధిభూత, అధిదైవ మరియు అధియజ్ఞ, సహితంగా ఎవరు తెలుసుకుంటారో అతడు నిజానికి నాతో యోగ యుక్తుడై తెలుసుకుంటాడుఅని చెప్పారు.
అధిభుత మంటేనే క్షర భావం మరియు అధి దైవం అంటే పురుషశరీర రూపి పురి(ఊరు) లో శయనం(విశ్రాంతి) తీసుకునే ఆత్మ. వినాశి, పతన శీలము అయిన భావనతో నిండిఉన్న అర్జునుని సాకార రధము(అర్జునుడి కలియుగంలో అంతిమ 84 వ జన్మపు తామసీ పతిత శరీరం) సహితంగా పరమపిత-పరమాత్మను తెలుసుకోవడమే అధిభూత సహితంగా తెలుసుకోవడం మరియు ఎప్పుడైతే అర్జునుడి ఆత్మ జ్ఞానం మరియు  యోగం  యొక్క పురుషార్ధీ రూపి శంకరుడుగా అయి (గీత-6-21) ఆత్మలోనే ఆనందంగా ఉంటాడో అప్పుడు ఈ భౌతిక భావం నుంచి పైకి వెళ్ళే అవస్థలో స్థితుడైన శంకర సహిత పరమపిత శివుని తెలుసుకోవడమే అధిదైవ సహితంగా తెలుసుకోవడం.
గీతలో అధియజ్ఞం యొక్క అర్ధం పరమపిత పరమాత్మ నేనే అహమేవఅంటూ స్వయమునే(తననే) అధియజ్ఞం అన్నారు. నిజానికి యజ్ఞ రచయిత, యజ్ఞ పిత, మరియు దాని(యజ్ఞము యొక్క) రక్షకుడు = యజ్ఞ పతిని కలిపి అధియజ్ఞం అంటారు. గీతలో(3-15)ఒకవైపు బ్రహ్మద్వారా నిహిత కర్మలనే యజ్ఞ ఉత్పత్తి అన్నారో మరొక వైపు (గీత 3-10) ప్రజాపతి ద్వారా యజ్ఞ స్థాపనను కూడా స్పష్టం చేశారు. ఈ రెండింటి ద్వారా మనకు ఏమి బోధపడుతుందంటే ప్రజాపతియే పరంబ్రహ్మ స్వరూపమని. యజ్ఞ సహితంగా ప్రజలకు జన్మనిస్తూ ప్రజాపిత బ్రహ్మ, హిరణ్యగర్భ, పరంబ్రహ్మ యజ్ఞపిత కూడా(ఆయనయే మాతా-పితా అని సిద్ధం అవుతుంది) (3-15) కానీ పరంబ్రహ్మ ను అక్షరం నుంచి ఉత్పన్నమైనట్లు చెప్పారు. అంటే ప్రజాపిత బ్రహ్మ రూపి అర్జునునిలో పరమపిత శివుడు ప్రవేశించి అవినాశి అశ్వమేధ రుద్ర గీతా జ్ఞాన యజ్ఞం స్థాపన కొరకై కర్మ చేస్తారు. ఈ రుద్ర స్వరూపుడే అధియజ్ఞము. ఇది ఒక్క అర్జునుని ద్వారానే జరుగుతుంది(గీ.8-4). కనుక స్పష్టంగా ఏం చెప్పారంటే అధి యజ్ఞ అత్ర దేహేఈ ప్రజాపితా బ్రహ్మ రూపి అర్జునుని శరీరంలో నేను” (పరమపిత శివుడు) ఉన్నాను, అని , మరే ఇతర శరీరంలో కాదు, పైగా కేవలం ఈ శరీరంలోనే, ఇతనిని దేహ భృతాంవర, దేహధారులలో శ్రేష్ఠుడు అని ఉల్లేఖించబడింది.
ఇంత స్పష్టంగా చెప్పిన తరవాత కూడా వికారీ మనుషులు ఈ విషయాన్ని మూర్ఖంగా గ్రహించి సమస్త మానవ శరీరాలలో అధియజ్ఞుని నివాసం అని నమ్ముతూ, పరమపిత- పరమాత్మను సర్వవ్యాపిని చేసేశారు. పతిత మనుష్య శరీరం(అధిభూతం)సహా ఆత్మిక స్థితి యొక్క ఉన్నత స్థాయిలో స్థితుడై ఆకారి శంకర్(అధిభూత+అధిదైవ+అధియజ్ఞ) సహితంగా ఆయనకన్న అతీతుడు పరంబ్రహ్మ ప్రజాపిత బ్రహ్మ రూపి అర్జునునిలో ప్రవేష్టుడై నిరాకార పరమపిత శివుడు అధియజ్ఞ సహితంగా పరమపిత-పరమాత్మను తెలుసుకోవాలి. మరియు ఇవన్నీఅధిభూత+అధిదైవ+అధియజ్ఞ కూడా ఒక్క అర్జునునిలోనే వ్యాప్తము అనగా పరమపిత-పరమాత్మ ఏక వ్యాపకుడు, సర్వవ్యాపకుడు కాదు. ఈ ఒక్క సాకార స్వరూపమే(గీ-13-14) పురుషార్ధం చేసిసాకారంలో ఉంటూ నిరాకారస్థితిలో స్థితుడౌతారు, ఇంద్రీయాలు ఉన్నా వాటి భ్రాంతి ఉండదు. భోగిస్తూ కూడా నిర్లేపంగా ఉంటాడు. ఈ కారణంగానే అధిదైవం=శంకరుని శివునితో కలిపేస్తారు.  మరియు ఇద్దరినీ శివ-శంకరులను ఒకటే అని నమ్ముతారు. కానీ మనుషులు అందరు ఆత్మలనూ పరమపిత-పరమాత్మ అనుకుని సర్వవ్యాపిని చేసేశారు.
ఒకటి శ్రీకృష్ణుని గీతా భగవంతుడని తప్పుచేశారు. పైనించి అందరు మఠాధీశులు, పీఠాధీశులు ధర్మగురువులు తమని తాము శివోహం అంటూ కూర్చున్నారు. దైవీ సృష్టి తేలేకపోయారు. ఆసురీ సృష్టిని నిరోధించలేక పోయారు. అలాంటప్పుడు ఎవరికైనా నమ్మకం ఎలా నిలబడగలుగు తుంది. నిజానికి ఆస్తికకత్వం నుంచి నాస్తికత వైపు పోవడమే దైవీ సృష్టి నుంచి ఆసురీ సృష్టి వైపుకు పోవడం అంటే. గీతా జ్ఞాన దాత శ్రీకృష్ణుడు మరియు పరమాత్మ సర్వవ్యాపి లాంటి వ్యర్ధ అనర్గల  మాటల వలననే సాకారంలో నిరాకారుని పరమపిత-పరమాత్మ యొక్క ఏకవ్యాపి సత్య స్వరూపం శివ-శంకరుడు అసే స్పష్టీకరణ దొరకజాలదు. ఎవరికి పరమాత్మ పరిచయమే లేదో వారు నాస్తికులే అయ్యారు కదా. దీనివల్లనే మొత్తం నిరాకారవాదులు తిన్నగా నిర్గుణుణ్ణే సాకార చిత్రమే లేకుండా స్మృతి చేయడం మొదలు పెట్టేశారు. మరి చిత్రంలో విచిత్రుడిని యోగం చేసేవారు కూడా తప్పు చిత్రం మైన శ్రీకృష్ణుడిని ఆధారం చేసుకున్నారు. ఈ రెండు రకాల వాళ్ళూ కూడా నిజానికి నాస్తికులే.
నిర్గుణ రూపంలో స్మృతి చేయడం కన్నా సగుణ రూపంలో స్మృతి చేయడమే ఉత్తమం
గీత(12-5) లో దేహధారులకు నిరాకార స్థితి పొందడం దుఃఖ భరితం మరియు(12-2) లో సగుణ రూపంలో స్మృతి చేయడం శ్రేష్ఠ యోగంఅని చెప్పబడింది. సగుణ రూపంలో స్మృతి చేయడం సులువు కూడా. అందువల్ల నిరంతరాయంగా కూడా చేయవచ్చు. ఇంకా గీత(18-48) లో ఏ కర్మ సహజమో అది దోషయుక్తమైనా చేయాలి, ఎందుకంటే దోషం అన్ని  అసహజపు, కఠిన కార్యాలలో కూడా ఉంది- అని ఉన్నది. అంటే సగుణ రూపంలో సహజతా పూర్వకంగా సులువుగా స్మృతి చేయడం మానరాదు అని చెప్పారు. గీతానుసారంగా(16-7) ఆసురీ స్వభావంకల పురుషులు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనేది తెలియ వారు పవిత్రంగానూ ఉండలేరు, శ్రేష్ఠ ఆచరణా చేయలేరు. మరియు సత్యాన్ని కూడా తెలుసుకో లేరు- అని ఉంది. దీనివల్ల ఏమి తెలుస్తుందంటే 16 కళలలో బంధించబడిన తప్పు సాకార చిత్రం శ్రీకృష్ణుడు రూపి క్షరిత చంద్రునితో యోగం చేయడం వల్ల కానీ, లేక కేవలo కళాతీతుడు నిర్గుణుని రూపంలో యోగం చేసినా ఎవరూ చరిత్ర వంతులు కాలేరు. పైగా ఇంకా అధికంగా క్రూరంగా, నిర్దయులుగా మరియు కఠోరులుగా అయిపోతారు. గీత(16-4) లో కఠోరత అనేది అసురుల లక్షణం. ఎవరు కఠోరులై తేలికైన మార్గం విడిచి దుఃఖ దాయి మార్గాన్ని ఎంచుకుని నడుస్తారో వాళ్ళు ప్రసన్నులు కానే కారు. (ప్రసన్నంగా ఉండనేలేరు) ఎప్పుడు (గీ-2-65) ప్రసన్నంగా ఉండలేరో దుఃఖం నుంచి ముక్తులు (కాలేరు) అయ్యి శ్రీఘ్రంగా స్థిర బుద్ధులు కాలేరు. అంతే కాక అప్రసన్న ఆత్మ(గీ-18-55) పరమపిత-పరమాత్మ స్వరూపాన్ని కూడా ఎప్పటికీ యదార్ధరూపం స్వరూపాన్ని కూడా తెలుసు కోలేరు. చివరికి ఏమీ పొందారు? ఏమీలేదు.
దుఃఖము సమస్యలకు కారణము మరియు నివారణ
పరమపిత-పరమాత్మశివ-శంకరుని సత్యస్వరూపం శివలింగం గాన్ని తెలుసుకోని కారణంగానే సమాజంలో నానా రకాల దుఃఖాలు పుట్టాయి. వాటి నివారణ దొరకనందుననే దుర్గతి జరిగింది. సర్వ ప్రధమంగా గీతలో (16-8, 16-11)చెప్పినాకూడా కామాన్ని మహా శతృవు అని భావించడం లేదు. కామవాసనే సృష్టి కారణ రూపం కామహైతుకంఅని అనుకుంటున్నారు. కామోపభోగ పరమా అంటే కామవాసననే భోగమే పరమ పురుషార్ధం అనుకుని అబలల పై అత్యాచారాలు చేయడం మొదలు పెట్టారు. అంతే కాదు మానవత్వానికి మసి పూస్తూ తండ్రి కూతురిని, సోదరుడు సోదరిని, గురువు శిష్యురాలినీ, ప్రదూషితం చేస్తున్నారు. అన్ని రకాలుగా స్త్రీలు ప్రదూషితం ఔతూ వస్తున్నారు. సమాజం పూర్తిగా జంతువుల్లా (గీ-1-41) వర్ణసంకర ప్రజలతో నిండుతూ వస్తోంది. ఈ వర్ణసంకరం  ప్రజలే తేళ్ళు మండ్రగబ్బలు లాగ మొత్తం సమాజాన్నీ స్వార్ధం= స్వ+రధం(శరీర సుఖాల) కోసం (1-42) దుఃఖ మిచ్చే కార్యం చేస్తున్నారు. వాళ్ళల్లో లోభం ఎంత పెరిగిందంటే ధనమూ, సంపత్తి ఆహార వ్యవహారాలు, వస్తు వైభవాలూ అన్నీ  దోచేస్తున్నారు.ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారు. బీదలు ఇంకా బీదలుగా అవుతున్నారు. పంచభౌతిక నిర్మిత విజ్ఞానం యొక్క శక్తితో అనేక రకాల అనైతిక ప్రకృతి విహీన ప్రయోగాలు చేస్తూ ప్రకృతిని కూడా సంపూర్ణంగా దూషితం చేస్తున్నారు. నీరూ-గాలీ-మట్టి-అన్నం అన్నీ విషతుల్యం అయిపోయాయి. తమ కోరికలు తృప్తి పరుచుకుంటూ-తృప్తిపరుచుకుంటూ, కామేషు, క్రోధేషులు  అయిపోతున్నారు. క్రోధ రూపం ఎంత పెరిగి పోతుందంటే తమ కోరికకు విరుద్ధంగా చేసేవాళ్ళను (గీ-16-14) అందర్నీ తమ విరోధులుగా భావించి హత్యలు చేస్తున్నారు. అతి అహంకారంతో పూర్తిగా నాస్తికులు అయిపోతున్నారు. మరియు ఈ అజ్ఞానత వల్ల ప్రేరితులై ఏటంబాంబులు- పరమాణు బాంబులు తయారు చేసి(గీ-16-9) సమస్త లోకాన్నీ నష్టం చేయడానికి సన్నద్ధులైపోయారు. ఈవిషయం గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఖండిత గీత వల్ల ఉత్పన్నమైన సమస్యలు మరియు వానికి సమాధానం విభాగం చదవండి”.
భగవంతుడి రచన ఈ సుందర పృధివీ మాతను సరిగా చూచుకోని కారణంగా సంపూర్ణ రీతిలో (గీ-16-21) రౌరవ నరకం చేసి ఈ నరకం నుంచి బయట పడి కొత్త ఇల్లు తయారు చేసేందుకు ఇతర గ్రహాల భ్రమణం చేస్తున్నారు. ఇలాంటి మూర్ఖ మనుషులు, మహా మూర్ఖులు, అజ్ఞాని అసురులు- రాక్షసులు అని అనకపోతే ఏమనాలి ? దీనిని కలియుగ అంతమనే అనాలి. ఇది అధర్మపు అతి కాదా? హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్. చరిత్ర పునరావృతం అవుతుంది. అన్నట్లు 5000 సం. పూర్వం జరిగిన మహాభారీ మహాభారత గృహ యుద్ధం తిరిగి మళ్ళీ వచ్చింది. ఒకవైపు తూర్పు దేశాల్లో పాత ఆచార వ్యవహారాలు, పరంపరల ముసుగులో ధర్మంపేరుతో గృహయుద్ధం రాజుకుంటుండగా మరొకవైపు పడమటి దేశాలు తమ బుద్ధి బలంతో సైన్సు మద్దత్తుతో అహంకారంలో మదించిపోయి తమలో తామే ఒకళ్ళనొకళ్ళు అస్తిత్వం లేకుండా చేయడానికి వార్నింగులిచ్చుకుంటున్నాయి. మరి అక్కడే (గీ-4-8) తమ వాగ్దానం అనుసరించి అర్జనుడు, అర్జనుని వంటి అన్ నోన్ వారియర్స్, గుప్త పాండవ యోధులు దైవీ సంపద వాళ్ళను రక్షించేందుకు, ఈ పైన చెప్పిన అన్ని దుఃఖాలు సమస్యలు ఇచ్చే ఆసురీ సంపదవాళ్ళను నాశనం చేసేందుకు మరియు ఒక ధర్మం, ఒకేరాజు, ఒకే దేశం, ఒకభాష కు సమర్పితులైన దైవీ సృష్టి నిర్మించడానికి పరమపిత-పరమాత్మ శివుడు ఈ రెండు యుగాలు అనగా కలియుగ అంతం, సత్యయుగ ఆది కాలాల మధ్య పురుషోత్తమ సంగమం లో భారత పావన భూమిలో అర్జున రూపి రధం పై అవతరితులయ్యారు. గుప్తరూపంలో తన కార్యం చేస్తున్నారు.
ఇప్పుడు ఈ కొత్త ప్రపంచం లోకి వెళ్ళడానికి, మనం పతితుల నుంచి పావనమై సమస్త పాపాలనుంచి ముక్తులమవ్వాలి. మరి ఈ విషయమై గీతలో (18-66) సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ-అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షఇష్యామి మా శుచ....అన్ని ధర్మాలూ, హిందూ, ముస్లిం, సిఖ్, క్రిష్టియన్ ఆది... దేహ ధర్మాలన్నీ త్యాగం చేసి ఆ అవతరించిన ఏకవ్యాపి స్వరూపం సాకారంలో నిరాకార శివ-శంకరుని శరణు పొందాలి. పరమపిత-పరమాత్మ శివ-శంకరుని ఏకవ్యాపి స్వరూపం ద్వారా గీతాజ్ఞానం ఇస్తున్నారు. ఇది అదే సత్యమైనగీత సర్వశాస్త్రమయి అని పిలవబడింది.ఈ గీత పరమ పవిత్రం సమస్త  సృష్టి కీ ముక్తి, జీవన్ముక్తి ప్రసాదించేది. అన్ని మతాల వాళ్ళనూ ఉద్ధరించేది సమస్త ధర్మాలకూ మాత-పిత అని చెప్పబడుతుంది. ఇప్పుడు ఈ నరకం, హెల్, దోజక్, కలియుగం ఆసురీ లోకం సమాప్తమైపోయి కొత్త సత్యయుగీ లోకం, జన్నత్, స్వర్గం, పారడైజ్, వస్తోంది. వసుధైవ కుటుంబకం స్థాపన అవుతున్నది.
సమస్త దైవీ సంపదవాళ్ళకూ ఈశ్వరీయ సందేశం
పరమపిత-పరమాత్మ శివ భగవానువాచ ప్రియమైన పిల్లలూ 5000 సం. పూర్వం మహాభారత సమయంలో నేనే అవినాశీ జ్ఞానం చెప్పాను. దాని గుర్తుగా శ్రీమద్భగవద్గీతా శాస్త్రం మహిమాన్వతమైనది. కానీ భారత వాసుల అతి పెద్ద తప్పిదం సర్వశాస్త్రమయి శిరోమణి శ్రీమద్భగవద్గీతలో జ్ఞాన సాగరుడు గీతాజ్ఞాన దాత, దివ్యచక్షువిధాత, పతిత పావనుడు జనన మరణ రహితుడను సదా ముక్తుడను, అన్ని మతాలవారికీ ముక్తి జీవన్ముక్తి దాతను పరమపిత-పరమాత్మ నైన నన్ను శివుడను, నాపేరు బదులుగా 84 జన్మలు తీసుకునే సర్వగుణ సంపన్నుడు, 16 కళల సంపూర్ణుడు సతోప్రధాన సత్యయుగ ఆది రాజ కుమారుడు16 కళల సంపుర్ణ దేవత(కళాతీతుడైన భగవంతుడు కాడు) శ్రీకృష్ణచంద్రుని (అతను గీతా మాత ద్వారా ఈ కృష్ణ పదవిని పొందాడు) అతని పేరు వ్రాసేసి భగవద్గీతనే ఖండితం చేసేశారు. ఈ కారణం వల్లే భారతీయులు నాతో యోగభ్రష్టులై, ధర్మ భ్రష్ట, కర్మ భ్రష్ట, పతిత దీవాళా కోరులై దుఃఖితులయ్యారు.
ఒకవేళ భారతీయ విద్వాంసులు ఆచార్యులు పండితులు ఈ తప్పిదం చేయకుండా ఉండి ఉంటే లోకంలో అన్ని మతాల వారూ శ్రీమద్భగవద్గీత ను నిర్వాణధామానికి తీసుకు వెళ్ళే పండా, లిబరేటర్, గైడ్, అయిన నన్ను పరమప్రియ పరమపిత శివుని మహావాక్యాలుగా గ్రహించి ఎంత ప్రేమ, శ్రద్ధలతో తమ ధర్మశాస్త్రంగా భావించి చదివేవారు మరియు భారత దేశాన్ని పరమపిత నైన నా జన్మభూమిగా , గాడ్స్ బర్త ప్లేస్ , అని ఈ భూమిని సర్వోత్తమ తీర్థ స్థానంగా ఒప్పుకునే వారు.
గీత మరియు మహాభారతంలో వచ్చిన కొన్ని తప్పుగా అర్ధం చేసుకున్న విషయాలు.
కౌరవులు యాదవులు పాండవులు ఇవి ఏ వ్యక్తి యొక్క స్థూల వంశపు పేర్లు కావు. అవి గుణవాచకాలు.(విశేషణాలు)...కనుక మహాభారత కావ్యం (మహాభారతం అనుక్రమణికా పర్వం ప్రధమాధ్యాయం 110-111) లో వీటిని వృక్షము మరియు దాని అంగాల రూపంలో చూపించారు. ఉదా:-దుర్యోధనుడు-క్రోధమయమైతే, యుధిష్టిరుడు ధర్మమయ వృక్షంగా తెలిపారు.
మహాభారత యుద్ధం హింస, రక్తపాతమైన యుద్ధంగా ప్రసిద్ధమైనది అది నిజానికి కౌరవులు యాదవుల రూపి చెడు వికారీ గుణాల(కామ, క్రోధ, లోభ, మోహ అహంకారాల వంటి వాటి) పై జ్ఞానం ఇంకా యోగం ద్వారా అహింసకరూపంలో మాయావియుద్ధం చేసి గెలిచే విషయము. ఈనాటి సాధువులు-సన్యాసులు-మహాత్ములు హింసను వ్యతిరేకిస్తే  మరి పరమాత్మ ఎలా హింసను చేస్తారు. మౌలికంగా ఇది ఆంతరిక, మానసిక ద్వంద్వ యుద్ధం. మనుష్యసృష్టి రూపి వృక్షం యొక్క బీజం ఆదమ్ నుంచి పుట్టి విశాల వటవృక్షమై చివరకు సమాప్తమైపోతుంది. అదే మహాభారీ మహాభారత యుద్ధ రూపంలో ప్రఖ్యాతి పొందుతుంది.
మహర్షి వ్యాసుని ద్వారా రచితమైన మహాభారత గ్రంధం గురించి ఇతిహాస కారులకు భిన్న2 అభిప్రాయాలూ  ఉన్నాయి. భగవంతుడు గీత ఉచ్చరించడం వ్యాసుడు సంకలితం చేయడం ఈ తథ్యం ఇతిహాసకారులు వివాదాస్పదంగా ఉందన్నారు.
ఒకవైపు శ్రీకృష్ణుడు గీతాభగవంతుడన్న చోటే తల్లిగర్భంలో జన్మ తీసు కునేవాడూ, సందీపుడనే గురువు దగ్గర విద్యను అభ్యసించిన వాడూ, మృత్యువును పొందినవాడూ, అయితే మరొకవైపు అతడే అగర్భ, అజన్మ, త్రికాలదర్శి, సర్వజ్ఞుడు, గీతాజ్ఞనదాత పరమాత్మ శివ స్వరూపం ఎలా అవ్వగలడు?
మహాభారతం మొదట 8800 శ్లోకాలతో (మహాభారతం అనుక్రమణికాపర్వం, ప్రధమ అధ్యాయం 81) చిన్న గ్రంధంగా ఉండేది. కాని దానిలో తరవాత ఎన్నో అనేక శ్లోకాలను కలుపుకుని చివరకు 1 లక్ష శ్లోకాలుగా తయారు చేశారు.  దీనిని బట్టి కాలాంతరంలో మహాభారతం యొక్క సత్యత శుద్ధత మునుపటిలా లేకపోయిందని తెలుస్తుంది. ఇదే విషయం గీత కు కూడా వర్తిస్తుంది. బాలి ద్వీపం నుంచి ఒక గీత దొరికింది దానిలో కేవలం 70 శ్లోకాలే ఉన్నాయి. దీనిని అన్నిటి కన్నా ప్రాచీన గీత అని ఒప్పుకున్నారు. ప్రస్తుతపు మహాభారతం లాగే బహుశా 70 నుంచి 700 ల శ్లోకాలకు గీత తయారు చేశారు. ఒకవేళ ఈ గీత ప్రాచీనత సంపూర్ణ రీతిలో ప్రామాణికం కాక పోయినా తక్కువ అంచనా వేయలేం.
ఎక్కడైతే గీతలో సంభవామి యుగే యుగే అన్న దానికి భగవంతుని అవతారాల ప్రసంగం వస్తుందో అక్కడ వాస్తవానికి రెండు యుగాలు కలియుగం సత్యయుగాల మధ్యలో(భగవంతుడు) వచ్చిన విషయం. లేకపోతే మరి పాపీ కలియుగం తీసుకురావడానికా భగవంతుడు ద్వాపరయుగం అంతంలో వచ్చినది? మరొక విషయం ప్రాచీన 70 శ్లోకాల గీత విషయం తీసుకుంటే సంభవామి యుగే 2 శ్లోకం అందులో లేనే లేదు. బహుశా అది తరువాత జోడించి ఉండవచ్చు.
గీతలో ఎక్కడైతే కృష్ణుడు లేక విష్ణువు విరాట రూపం ఒప్పుకున్నారో, అక్కడ నిజానికి ఆయన రుద్ర శివుని యొక్క విరాట రూపమే. దీని ప్రమాణం మహాభారత ద్రోణ పర్వంలో నారాయణాస్త్రమోక్ష పర్వం (అధ్యాయం 201, 56వ శ్లోకం నుంచి 100 వ శ్లోకం వరకూ)  లో తెలుస్తుంది. అక్కడ నారాయణుని రుద్రుని భక్తునిగా చెప్పారు. కృష్ణుణ్ణి కూడా రుద్రుని నుంచి ఉత్పన్నమైనట్లు చెప్పారు. (శ్లోకం.95). ఇందులో నారాయణునికి రుద్ర శివుని విశ్వరూప దర్శనం అవుతుంది. ఈ కారణంగానే విశ్వేశ్వరుడుఅని ఉల్లేఖించారు, బహుశా ఈ కారణంవల్లనే గీతలో కూడా విశ్వరూప దర్శనయోగం అనే పేరు పెట్టారు. ఎక్కడైతే గీతలో వాస్తవంగా యుద్ధం చేసేది విరాటరూపుడు అని ఒప్పుకున్నారో (గీత-11-33) మరియు అర్జునుని కేవలం నిమిత్తం అన్నారో దీని స్పష్టీకరణ ద్రోణ పర్వం నారాయణాస్త్రమోక్ష పర్వం(అధ్యాయం 202, 4 వ శ్లోకం నుంచి 148) లో అర్జునుడు యుద్ధ సమయంలో ఒకానొక తేజస్వి పురుషుని ద్వారా అందరూ చంపబడుతున్నట్లు చూస్తాడు, అక్కడే వ్యాసుడుని అడగగా ఆయనే శివ రుద్ర రూపునే జ్ఞానం పొందుతాడు.
ఎక్కడైతే ఆదిదేవ శబ్దం అధికంగా కృష్ణ భక్తులు విష్ణువుకు లేక నారాయణునికి వర్తిస్తారో, అక్కడే మహాభారత ద్రోణపర్వ, నారాయణాస్త్రమోక్ష పర్వంలో (అధ్యాయం 201, శ్లో.72) లో నారాయణుడు రుద్రుని విశ్వరూప స్తుతి చేస్తూ వరేణ్య , ఆదిదేవఅంటూ సంబోధించాడు. గీతలో కూడా అర్జునుడికి విరాటరూపం జ్ఞానం లభించినప్పుడు ఆయన కూడా త్వమాదిదేవః, పురుషః, పురాణః”(గీ.11-38) అంటూ గీతా జ్ఞానదాత పరమపిత పరమాత్మ శివ-శంకరునికి వందనం చేస్తాడు.
అన్నిటికన్నా ఆశ్చర్య కర విషయం ఏమంటే మహాభారతం లో ఎప్పుడేప్పుడు కృష్ణుడు ఎవరితోనైనా సంభాషించి నప్పుడు అతనిని కృష్ణ ఉవాచ వాసుదేవ బభాషే, కేశవ కధయతి అనే పేర్లతో ఉల్లేఖిస్తే గీత విషయంలో మాత్రము కృష్ణ ఉవాచ అనకుండా శ్రీభగవానువాచ అన్నారు. అంతేకాదు భక్తుడు నారాయణుడు మరియు శివ-రుద్రుల మధ్యలో సంభాషణలలో కూడా రుదృని సంభాషణను శ్రీభగవానువాచఅని చెప్పడం జరిగింది. దీనివల్ల ఏమి స్పష్టమౌతుందంటే మహర్షి వ్యాసుడు ఎప్పుడెప్పుడు భగవానువాచ అన్నప్పుడల్లా ఆయన బుద్ధిలో స్పష్టంగా పరమాత్మ శివ-రుద్రుడే ఉన్నారు, అంతేకానీ ఉపాసకుడైన కృష్ణుడు లేక నారాయణుడు కాదు.
*****************************************************
క్రమానుసారం ఉల్లేఖితమైన గీతా శ్లోకాల శబ్దార్ధాలు
మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు...శ్లో.9-34, 18-65
నీవు, మన్మనాః- నా పై మనసుపెట్టేవాడవు, మద్యాజీ- ఈశ్వరీయ సేవ రూపీ కర్మ చేసే వాడవు, మద్భక్తః మరియు నన్ను భజించేవాడవు- భవ అగుము. మాం- నా ప్రతి, నమస్కురు- శ్రద్ధతో తలవంచుము.
ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రీయేభ్యః పరం మనః శ్లో.3-42
ఆహుః- ఏమని చెబుతారంటే, ఇంద్రియాణి పరాణి- ఇంద్రియములు ప్రబలమైనవి. మనః- మనసు, ఇంద్రీయేభ్యః- ఇంద్రియముల కన్న, పరమ్- పెద్దది, బుద్ధిః మనసః తు పరా- బుద్ధి మనసు కన్నా పెద్దది, తు- కానీ, యః- ఎవరైతే, బుద్ధేః- బుద్ధికన్నా, పరతః- పెద్దవాడో ఆయన పరమాత్మయే.(బుద్ధి మంతులకే బుద్ధి మంతుడు పరమాత్మ)
సాంఖ్యయోగౌ పృధక్ బాలాః ప్రవదంతి న పండితాః శ్లో.5-4
సాంఖ్యయోగౌ- కేవలo జ్ఞానము మరియు కర్మయోగం ఈరెండూ, పృధక్- వేరు వేరు అని, బాలాః- బాలబుద్ధి అనగా కచ్చాబుద్ధి వారు, ప్రవదంతి- చెబుతారు, న పండితాః- పండితులు అనరు. ఏకం అపి- (ఆ సాంఖ్య మరియు యోగాలలో) ఒక దానినైనా, సమ్యక్- బాగుగా, ఆస్థిత- ఆసరాగా తీసుకునే వారు, ఉభయోః ఫలం- రెండింటి ఫలమూ, విందతే- పొందుతారు.
న హి తే భగవన్ వ్యక్తిమ్ విదుః దేవాః న దానవాః -శ్లో.10-14
హి- ఎందుకంటే, భగవన్- ఓ భగవానుడా, తే- మీయొక్క, వ్యక్తిం-వ్యక్త సాకారీ భావం ఐన శంకరుని, న దేవాః- దేవతలు కానీ, న దానవాః- అసురులు కానీ, న విదుః- తెలియలుసుకోలేరు.
స్వయమేన ఆత్మనా ఆత్మానం వేత్థత్వం పురుషోత్తమ శ్లో.10-15
త్వం- మీరు, స్వయం ఏవహి- స్వయమే, ఆత్మనా- ఆత్మచే(మీచే) ఆత్మానం- మీద్వారా మీరే తమ రూపాన్ని, వేత్థ- తెలిసిన వారు, (భగవంతుడు తప్ప భగవంతుని పరిచయం ఎవరూ ఇవ్వలేరు)
జన్మ కర్మ చ మే దివ్యం యో వేత్తి తత్వతః   శ్లో.4-9
అర్జున- ఓ సద్భాగ్యం అర్జన చేసే అర్జనుడా, ఏవం- ఈ విధంగా, మే- నా యొక్క, దివ్యం- దివ్యమైన, జన్మ- జన్మ(విశిష్ట పరకాయ ప్రవేశం), చ- మరియు, కర్మ- దివ్య కార్యములను, యః- ఎవరేతే, తత్వతః- సత్య రూపంలో, వేత్తి- తెలుసుకుంటారో, సః- అతడు, దేహం- శరీరమును, త్యక్త్వా- విడిచి( ఈ కలియుగీ దుఖీ ప్రపంచంలో శరీరం విడిచి), పునర్జన్మ-(ఈనరకంలో) మళ్ళీ జన్మ, న ఏతి- తీసుకోరు, మామ్ ఏతి- నన్ను పొందుతారు(అవ్యక్త మూర్తి శివలింగాన్ని పొందుతారు.
జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప   శ్లో.11-54
తు- కానీ, పరంతప- (కామాది శతృవులను తపింపచేసే) అర్జున-ఓ అర్జునా, అనన్యయా- అవ్యభిచారి, భక్త్యా- భక్తిచే, అహం-నేను, ఏవం విధిః-ఈ విధంగా సంపూర్ణ రూపంలో, జ్ఞాతుం- తెలుసు కొనుటకు, ద్రష్టుం-మూడవనేత్రంతో సాక్షాత్కారం చేసుకొనుటకు, చ- మరియు, తత్వేన- (తత్వపూర్వకంగా) పంచ తత్వాలతో తయారైన శరీరం లోతుల లోకి గహనంగా, ప్రవేష్టుం- ప్రవేశించుటకు, చ- కూడా, శక్యః- శక్తి కలవాడను(యోగ్యుడను).
అజః అపి సన్ అవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్
ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామి ఆత్మమాయయా  శ్లో.4-6
అవ్యయాత్మా- అక్షయం అంటే ఏ ఆత్మ శక్తి ఎన్నటికీ క్షీణించదో ఆ నేను పరమపిత శివుని, అజః- జన్మలేనివానిగా, సన్- అయిఉన్ననూ, అపి- కూడా, మరియు, భూతానాం- ప్రాణుల, ఈశ్వరః- శ్రేష్ఠశాసన కర్తను, సన్ అపి- అయినా కూడా, స్వాం- నా, ప్రకృతిం- ప్రకృష్ట జ్ఞానయుక్త రచన పరంబ్రహ్మ యొక్క, (శరీరం) అధిష్టాయ- ఆధారం చేసుకుని, ఆత్మ మాయయా- ఆత్మ శక్తి చే, సంభవామి- దివ్యజన్మ తీసుకుంటాను.
*************************************************
(यहाँ पर और श्लोक अभी लिखने हैं. नोट्स में हैं टाइप करना बाकि है)

ఖండితగీత వల్ల తలెత్తిన సమస్యలూ మరియు వాటి పరిష్కారం
మనిషి ఒక సామాజిక ప్రాణి అనగా ఏ ఒక్క మనుష్యుని నడవడికైనా పూర్తి సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. కాని నేడు మనిషి తన శరీరమనే రధం అనగా స్వ+రధం = స్వార్ధం కోసం ఆలోచిస్తూ 2 స్వార్ధీ అయిపోయాడు. తన స్వార్ధం కోసమే మనిషి సమాజాన్ని ఎటువైపుకు తీసుకు వచ్చి నిలబెట్టాడంటే ప్రతీవాళ్ళూ దుఃఖం, రోగాలతో పీడితులైపోయారు.కానీ యుగ-యుగాలనుంచీ వచ్చే భక్తి, వేద-శాస్త్రాల నిరంతర అధ్యయనం పాత సంస్కృతి రీతిరివాజులు యధాతధంగా అనుసరిస్తున్నప్పటికీ సమాజం దుర్గతి వైపుకే పోతున్నది, శోషణ కూడా అవుతున్నది. మరి దీనికి కారణం ఏమిటి?
సమాజ శోషణ మనిషి మహా తప్పిదానికి ఫలం. మరి ఆతప్పు ఏమిటి?
 కృష్ణుణ్ణి గీతా భగవంతుడని నమ్మడం, మరియు భగవంతుని సర్వవ్యాపకుడు అనడం. ఎలా?
భ్రష్టాచారంపరమపిత-పరమాత్మయే వచ్చి ఆధ్యాత్మికత అంటే పరిచయం ఇస్తారు. దాని ద్వారా మన స్వ- అనగా ఆత్మ బోధపడుతుంది. ఇంతకు మునుపు మనని మనం శరీరం అనుకునే వాళ్ళం. ఆత్మ మూలరూపంలో శ్రేష్ఠము, అవినాశిగా ఉంటుంది. మనసులో ఉత్పన్నమయ్యే సంకల్పాలు మరియు భావాలు అభిప్రాయాలు ఒకవేళ ఆత్మ పట్ల ఉన్నట్లైతే వాటిని శ్రేష్ఠం అంటారు. శరీరం గురించి ఉన్నట్లయితే భ్రష్ఠం అని చెబుతారు. ఈ అభిప్రాయాలను అనుసరించి వాటిని ఆచరించగా శ్రేష్ఠాచారం, భ్రష్ఠాచార ఉత్పత్తి జరుగుతుంది. శరీరం కోసం ఉత్పన్నమయ్యే మనసులోని కోరికలు, మరియు లోభమే భ్రష్ఠాచారానికి జన్మనిస్తుంది.
కాని భయంకరమైన కటు సత్యమేమంటే గీతలో కృష్ణుని పేరు వేయడం వల్లనూ, ఈశ్వరుని సర్వవ్యాపకుడు అనడం వల్ల భ్రష్ఠాచారాన్ని విస్తరింపజేయడానికి ప్రోత్సాహం దొరికింది. ఎలాగంటే.....గీతలో కామవికారం మహాశత్రువు అని చెప్పబడింది. కానీ లోకంలో ఎవరూ ఈ విషయం స్వీకరించరు ఎందుకంటే అలా గీతారచయిత అని చెప్పబడిన కృష్ణునికి 8 మంది పట్టపు రాణులు, 16, 108 మంది గోపికలు వారి పిల్లలూ కూడా శాస్త్రాల్లో ప్రసిద్ధం కదా. ఖండిత గీత అంటే కృష్ణుని గీత అనుసరించడం వల్ల మనుషులు భ్రష్టేంద్రియాలను నియంత్రించుకోకుండా కామ విలాసపు భోగం భోగిస్తున్నారు. ఒకవేళ గీతా రచయిత శివ-శంకర భోలేనాధుడు అని ఒప్పుకున్నట్లయితే  సృష్టి కామవికారం మహా శత్రువు అన్న విషయం సులువుగా స్వీకరించేది (అర్ధంచేసుకునేది). ఎందుకంటే శంకరుడు అమోఘవీర్యుడు ఇంకా కామదేవుణ్ణి భస్మం చేసిన రూపం అని ప్రసిద్ధి పొందింది.
గీతలో జనన-మరణ చక్రం లో వచ్చే కృష్ణుని పేరు వేయడం వల్లనూ, ఇంకా కృష్ణుని భగవంతుడు అని నమ్మడం వల్లనూ, పరమాత్ముని కూడా సర్వవ్యాపకుని చేసేశారు. మరియు ప్రతి వ్యక్తి తనను తాను శివోహం అని కూర్చున్నాడు. కానీ మనుషులైతే వికారీలు కదా. పుట్టుక కూడా వికారాలతోనే. మరి వారు తమ వికారీ బుద్ధితో ఉత్పన్న మైన వికారీ మతాన్ని కూడా శివ మతమని (అనుకుంటూ) అనుకరించడం ప్రారంభించారు. వికారీ మరియు భ్రష్టమతం ఆచరణ చేస్తూ 2 మొత్తం సృష్టి లోకం మొత్తం సమాజం భ్రష్టాచారిగా మారిపోయింది.
పెరుగుతున్న జనసంఖ్య”- పెరుగుతున్న జనసంఖ్య భ్రష్టాచారం, అనగా భ్రష్టఇంద్రియాల ఆచరణయే పెరుగుతున్న జనసంఖ్యకు కారణం. గీతలో కృష్ణుని పేరు వేయడంవల్ల వికారీ మనుషులు కృష్ణుణ్ణే తమ ఆదర్శం మరియు ప్రేరక స్రోతగా నమ్మారు. కృష్ణుడైతే శాస్త్రాల్లో  రాసలీలకు ప్రసిద్ధి. అందువల్ల మనుషులు కూడా కామవాసనల రాసలీలలో తమ జీవనయాపనం చేయసాగారు. కామవికారంపై నియంత్రణ లేకపోవడం వల్ల మనుషుల జనసంఖ్య నేడు ఏ స్థితి కి చేరుకుందంటే అనుకున్నా జన సంఖ్యపై నియంత్రణ చేయలేకపోతున్నారు. ఇది ప్రతీదేశపు సామాజిక సమస్య అయ్యింది. కుటుంబ నియంత్రణ లాంటి పధకాలు ద్వారా నిరంతరంగా ప్రయాస చేస్తున్నా ప్రభుత్వం పెరుగుతున్న జనసంఖ్య పై కంట్రోల్ సాధించడంలో విఫలమైనది.
ఒకవేళ మనిషి గీతా భగవంతుడు భగవాన్ శివ-శంకరుడు అని తెలుసుకుని ఒప్పుకుని ఉంటే కామం మహాశతృవని నమ్మి మనిషి పెరిగే జనసంఖ్యకు మూలకారణమైన కామ వికారాన్ని త్యజించేవాడు. శివ-శంకరుని గీతయే అసలైన కుటుంబనియంత్రణ పధకం, ఇది తప్ప వేరే మార్గం లేదు.
స్త్రీ నారీ అనాదరం”—పురుషుడు బుద్ధివాదిగా ఉంటాడు. స్త్రీ భావనావాది గా ఉంటుంది. అనేక యుగాలనుంచి స్త్రీలపై అత్యాచారాలు మరియు శోషణ జరుగుతూ వచ్చాయి. 21 వ శతాబ్దంలోకి వచ్చినా స్త్రీల జీవనంలో ఏమీ విశేష పరివర్తన జరగలేదు. మరైతే ఏ పరివర్తన జరిగిందని మనమనుకుంటున్నామో అది పైకి ప్రదర్శన మాత్రమే. కాని వాస్తవిక సత్యం స్త్రీ జాతి ఇప్పటికీ తనువు-మనసు-ధనంతో అబలగానే ఉంది. పసిపిల్ల వయసు నుంచి వృద్ధ మాత వరకూ స్వయం తనకు తాను ఈ సమాజంలో అసురక్షితమనే అనుభవం చేస్తున్నది. దీనికి కారణం ఖండితగీతయే. గీతలో కృష్ణుని పేరు వేయడం ద్వారా కృష్ణుని చరిత్రయే కంటిముందుకు వస్తుంది. కృష్ణ సమానంగా ఆకర్షక పతి, మరియు కృష్ణుని వంటి పుతృడిని కోరుకుంటూ పిచ్చిదానివలే తన పతి లేక పిల్లలకు కీలుబొమ్మై ఉండిపోతున్నది. తన భర్తను పరమేశ్వరుడని నమ్మి అతని వికారీ మతాన్ని(ఆలోచనలను)ఈశ్వరీయ మతమని భావించి నడవడం మూలంగా మరింత దుర్గతి జరిగింది. ఎవరిని గురువుచేసుకుందో అతడు కూడా పురుషుడే, అతడే నారి నరకద్వార  మని అన్నాడు. తద్వారా ప్రతీ ఒక్క స్త్రీ యొక్క స్వాభిమానాన్నీ తుడిచివేసే హీన ప్రయాస చేయబడింది.
ఒకవేళ గీతా భగవానుడు శివ-శంకరుడు అని నమ్మిఉంటే శంకరునిలో శక్తి (ప్రమాణం) రూపం అర్ధనారీశ్వరుడుఅని మహిమ ఉన్నది. అది నర-నారీ సమానత్వానికి ప్రతీక నారి కూడా సమాన ప్రతిష్ఠ కల సంస్కృతికి అనుకూలమై నిర్భయ జీవనం జీవించే అధికారం ప్రాప్తించేది.
కృష్ణుణ్ణి అనుకరించే పురుషులు అనేకమంది స్త్రీలను ఉంచుకోవడం ప్రారంభించారు. స్త్రీలను భోగవిలాస రూపం అని భావించ సాగారు. ఇది స్త్రీ తిరస్కారం కాదా? ఆమె భావనలు ఉపహాసం చేయడంలేదా? ఒకవేళ మనుషులు గీతా రచయిత శివ-శంకరుని అనుకరించి ఉన్నట్లైతే శంకరుని వలె ఏక పత్నీ జీవనం గడిపేవారు. ఏక నారీ సదా బ్రహ్మచారి.
ఆతంకవాదం   
టెర్రరిజం. ఆతంకవాదం కేవలం పరస్పర భేద-భావం ఇంకా మనస్ఫర్ధల పరిణామమే కాదు కాని ఇది కూడా ఖండిత గీత వల్లనే ఉద్భవించిన ఒక పీడ. గీతలో సాకార కృష్ణుని పేరు వేయడం వల్ల నిరాకార ఉపాసకులు గీతను అవహేళన చేయ సాగారు. పరిహసించ సాగారు. దీనివల్ల అనేక మతాలు, సంస్కృతులు, ధర్మాల నిర్మాణం జరిగింది. అనేక భాషలతో అనేక ప్రాంతాలు, రాష్ట్రాలు, రాజ్యాలు నిర్మిత మయ్యాయి. ఏకత్వం అనే శుద్ధము, పవిత్రము ఐన స్థానాన్ని(భారత దేశాన్ని) అనేకతా రూపి రాహువు పట్టేసింది. ఒక్క అఖండ సంపూర్ణ మహాన్, గొప్పదైన భారత దేశం విభాజితమై అనేక ముక్కలుగా ఖండ-ఖండాలుగా పోయింది. మరియు తమ ధర్మం ప్రాంతం రాజ్యం రాష్ట్రం ఇంకా రాజ్యభాష రాష్ట్ర భాష ప్రాంతీయభాష ను గొప్పది అని నిరూపించుకోవడం అనే ముసుగులో మానవత్వం మరిచిపోయి మనిషి ఎటువంటి భయంకర ఆతంకవాదం జరుపుతున్నాడంటే దోషులు నిర్దోషులందరూ కూడా బాధించబడుతున్నారు. నేడు అన్ని వివాదాలలో అన్నిటి కన్నా గంభీరమైనది విస్ఫోటకమైనది ఐన స్వరూపం ఆతంకవాదానిది.
ఒకవేళ గీతా భగవంతుడు నిరాకార శివ-శంకరుడు అని ఒప్పుకున్నట్లైతే అనేకతకు జన్మయే ఉండేది కాదు. ఎందుకంటే నిరాకారుడు ఇంకా నగ్న శంకరుని మహిమ అన్ని ధర్మాల్లోనూ ఉన్నది. హిందువులలో ఆదిదేవుడుజైనీయులలో ఆదినాధుడుముసల్మానులలో ఆదమ్క్రిష్టియన్లలో ఏడంఇత్యాది రూపాలలో మహిమ ఉంది. ఒకవేళ అలా అయి ఉంటే నేటికీ కూడా అన్ని ధర్మాల వారూ గీతనే సర్వశాస్త్రమయీ శిరోమణి రూపంలో తమ గ్రంధమని ఒప్పుకుని అనుసరించేవారు. కానీ ఖండితగీత తో భారత దేశంతో కలిపి పూర్తి విశ్వం నేడు ఖండ-ఖండాలుగా అయిపోయింది. మరి దీనికి భిన్నంగా అఖండ గీతయే సృష్టికీ వసుధైవ కుటుంబకంఅనే స్వరూపం ఇచ్చిఉండేది.
ఇంతే కాదు ఇంకా కూడా అనేక సమస్యలు ఖండిత గీత వల్ల ఉత్పన్నం అయ్యాయి. ఉదా:-పెరిగే జనసంఖ్య, పేదరికం, నిరుద్యోగం, తద్వారా దొంగతనాలు, దోపిడీలు, వంటి అభద్ర కర్మలు వచ్చాయి. వ్యభిచార వృత్తి వైశ్యాలయరూపు పొంది ప్రత్యక్ష మరియు పరోక్ష రూపంలో మురికి తనం, రోగాలు విస్తరించాయి. ఈ అన్ని సామాజిక సమస్యల నిర్మాణం ఈ కృష్ణుని ఖండిత గీత యొక్క ఒకే ఒక తప్పు వల్ల జరిగా. ఒకవేళ గీతా భగవంతుడు అనగా గీతా రచయిత శివశంకరుని ప్రత్యక్ష ప్రవృత్త స్వరూపాన్ని అర్ధం చేసుకుని ఒప్పుకుని ఆయన చెప్పిన మార్గంలో నడిస్తే మనం మన సద్గతియే కాక సమస్త మానవజాతి మరియు సమస్త విశ్వం యొక్క సద్గతికి కారణం కాగలం. లేకపోతే నియతి(జరిగే వినాశనం) నిశ్చితమే కదా.
భవిష్యవాణిలు
ఈ విభాగంలో ఎవరి భవిష్యవాణిలు చేర్చామంటే నేటివరకూ వారి చాలా భవిష్యవాణిలు నిజమవుతూ వస్తున్నాయి.
కల్కి పురాణం- స్వాతంత్ర్యం తరువాత భారతదేశంలో వైజ్ఞానికులకే వైజ్ఞానికుడైన మహా పురుషుడు ఉదయిస్తాడు. ఆయన ఆత్మా మరియు పరమాత్మ రహస్యాన్ని ప్రకటితం చేస్తాడు. ఆత్మజ్ఞానం ఆయన పెట్టిన భిక్ష అవుతుంది. ఆయన వేష భూషలు సాధారణంగా ఉంటాయి. ఆయన ఆరోగ్యం చిన్న పిల్లల మాదిరిగానూ, యోధులవంటి సాహసం, అశ్వనీ కుమారులవంటి యువకుడుగా, సుందరుడుగా, శాస్త్రాల ప్రకాండ పండితుడుగా, మరియు మానవతావాదిగా ఉంటాడు. ఆయన తండ్రియే అతనిని యోగ సాధన వైపుకు ప్రేరితం చేస్తాడు. 24 ఏళ్ళ వయసులో ఆయన యోగం యొక్క ఉచ్చ భూమికలో ప్రవేశిస్తాడు.
ఏండర్ సన్ (అమెరికా)- అరబు రాష్ట్రాల సహితంగా ముస్లిం బహుళ రాజ్యాల్లో తమలో తామే జరిపే విప్లవం వల్ల భీషణ రక్తపాతం అవుతుంది. ఈ లోపు భారత దేశంలో పుట్టిన మహాపురుషుని ప్రభావం లేక ప్రతిష్ఠ పెరుగుతుంది. ఇతను ఇతిహాసంలో సర్వశ్రేష్ఠ రక్షకుడు అవుతాడు. అతను ఎటువంటి మానవీయ (పరిపాలనా) సంవిధానం తయారుచేస్తాడంటే దాని ద్వారా సమస్త లోకం ఒక భాష, ఒకే సంఘపు రాజ్యం, ఒకే సర్వోచ్చ న్యాయపాలిక, ఒకే ఝండా, రూపురేఖలు ఉంటాయి.
గ్రే రాడ్ క్రాఇసే- (హాలెండ్) భారత దేశంలో ఎలాంటి ఒక మహాపురుషుడు జన్మించాడంటే అతడు విశ్వకల్యాణం కోసం ప్రణాళికలు తయారు చేస్తాడు.
జూల్ బర్డ్- లోకంలో అందరి కన్నా సమర్ధ వ్యక్తి యొక్క అవతరణ జరిగింది ఆయన మొత్తం లోకాన్నే మార్చేస్తాడు. అతని ఆధ్యాత్మిక క్రాంతి మొత్తం విశ్వంలో వ్యాప్తిస్తుంది. ఒకవైపు సంఘర్షణలు, మరొకవైపు ఒక కొత్త ధార్మిక విప్లవం నిలబడుతుంది(ప్రారంభమౌతుంది). అది ఆత్మ-పరమాత్మల యొక్క కొత్త 2 రహస్యాలను ప్రకటిస్తుంది. ఆ మహాపురుషుడు 1962 కన్న ముందు జన్మతీసుకున్నాడు. అతని అనుయాయిలు ఒక సమర్ధ సంస్ధరూపంలో ప్రత్యక్షం అవుతారు. మరియు మెల్లి మెల్లిగా మొత్తం విశ్వంలో తమ ప్రభావం స్థిరం చేసుకుంటారు. అసంభవంగా కనుపించే కార్యాన్ని కూడా సులువుగా పూర్తిచేస్తారు.
ప్రొఫెసర్.కీరో- భారత అభ్యుదయం ఒక సర్వోచ్చ శక్తి రూపంలో జరుగుతుంది. కాని అందుకోసం అతను అతి కఠోరమైన సంఘర్షణ చేయవలసి  ఉంటుంది. చూడడానికి ఈ స్థితి అత్యంత కష్టదాయకంగా ఉంటుంది, కానీ ఈ దేశంలో ఒక దేవదూత వస్తాడు అతను ఎంతో మంది చిన్న, బీద ప్రజలను జేర్చి వాళ్ళలో ఎంత ఆధ్యాత్మిక శక్తిని నింపుతాడంటే వాళ్ళు పెద్ద 2 బుద్ధి జీవుల (దుర) అభిమానం మిధ్యగా నిరూపిస్తారు.
గోపీనాధశాస్త్రి- అవతరించిన మహాపురుషుని ద్వారా ప్రబలమైన అద్భుతమైన ఆలోచనా విప్లవం జరుగుతుంది. దాని ఫల స్వరూపంగా విద్యా విధానం పద్ధతి మారిపోతుంది. మరియు ఎలాంటి విధానం ఆవిష్కరించబడుతుందంటే అది వ్యక్తి యొక్క జీవితం జీవించే కళ ప్రదానం చేస్తుంది. ఐతే ఇప్పటి విద్యావిధానం ప్రణాళిక కేవలం పొట్టనింపుకోవడానికే పరిమితమైనది. బుద్ధిజీవులమని చెప్పుకునే ఆత్మజ్ఞాన హీనులపై లోకులకు అసహ్యం కలుగుతుంది. భూగర్భ విద్య, రసాయనశాస్త్రం, యంత్రవిద్య, ఖనిజధాతు, అయస్కాంత విద్య ఆదిగాగల కొత్త క్షేత్రాలు మరియు విజ్ఞానాల విస్తారం అవుతుంది. వీటి నేతృత్వం భారతదేశపు అటువంటి ఒక ధార్మిక సంఘం తయారు చేస్తుంది. దాని మార్గదర్శకుడు స్వయం భగవంతుడే అవుతాడు. ధార్మిక ఆశ్రమం జన జాగృతికి కేంద్రమై కార్యం చేస్తుంది.
                                         ఓం శాంతి.
త్రిమూర్తి శివ భగవానువాచ- అనంతమైన తండ్రి జ్ఞాన సాగరుడు పతిత పావనుడు సద్గతి దాత గీతా(పతి) భగవానుడు శివుడు (లింగ స్వరూపుడు) ఎలా ప్రజాపితాబ్రహ్మకుమార్. కుమారీల ద్వారా మళ్ళీ కలియుగీయ సంపుర్ణ వికారీ భ్రష్టాచారి (బ్రాహ్మణుల) పతిత ప్రపంచాన్ని సత్యయుగీ సంపూర్ణ నిర్వికారీ పావన శ్రేష్ఠాచారీ దైవీ ప్రపంచంగా తయారు చేస్తున్నారో ఆ శుభసమాచారం వచ్చి వినండి మరియు అర్ధం చేసుకోండి.(ము.25-10-66, పేజి.1 మధ్య.
నోట్. భారతదేశం మరియు ఇతర దేశాలలో ఆధ్యాత్మకుటుంబ సదస్యుల ద్వారా అనేక పట్టణాలలో ఆధ్యాత్మిక గీతా మందిరాలు ఇంకా అనేక గ్రామాలలో జిల్లాలలో, సత్యగీతా పాఠశాలలు నడుస్తున్నాయి. అక్కడ ఈశ్వరీయ జ్ఞానము మరియు రాజయోగ శిక్షణ ఇవ్వ బడుతున్నది. ......

Featured Post

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్.

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్. ఒక సంక్షిప్త పరిచయం ఇక్కడ కింద తేదీలు పుట సంఖ్యలు ఇచ్చినవి గురువు గారి ప్రవచనా...