జపాను గల గల గంట

Wednesday, March 13, 2019

Fwd: సుభాషితం

1.  సర్వే యత్ర వినేతార:, సర్వే యత్ర పందడితమానిన:
    సర్వే మహత్త్వ మిచ్చంతి, తత్ బృందమవసీదతి.
తా: ఎచ్చట అన్దరూ పెత్తనంవహించవలెనని అనుకొందురో, ఎక్కడ అందరు తాము  పండితులమే ననుకొందురో, ఏ సంఘమున సర్వులు గొప్పతనమును ఆరోపించుకొందురో ఆ దేశము, ఆ సంఘము చివరకు నశించును. 
{जहां सब अपने हुकुम चलाना चाहतें है, जहाँ सब अपने आपको पण्डित समझने लगते है, और जिस संघटन में हर एक अपने को महान आत्मा समझ बैठे है उस संघटन विनाश को पाये गा| }
2. అకారై రింగితై ర్గత్యా , చేష్టయా భాషణేన చ,
   నేత్రవక్త్రవికారేణ, లక్ష్యతే అంతర్గతం  మన:                హితో.2-50
ఆకారములు , ఇంగితములు , నడకలు, చేతలు, మాటలు, నేత్రవక్త్రవికారములు వీట్లన్నిటవల్లా మనస్సులోని భావాలు వేల్లడవుతుంటాయి
*{अक्सर मनुष्य के हाव, भाव ,कर्म, दृस्टी,बोल, चाल-चलन इन सभी से मालूम पढ़ जाता है कि यह आत्मा किस धर्म और किस वर्ण का है| }  
3. प्रियवाक्यप्रदादानेन, सर्वे तुष्यन्ति जनताव्ह:
   तस्मात त्तदैव वक्तव्यं, वचने का दरिद्रता|
   ప్రియవాక్యప్రదానేన, సర్వే తుష్యన్తి జంతవ:
     తస్మాత్ త్తదేవ వక్తవ్యం, వచనే కా దరిద్రతా.
ప్రేమతో పలుకరించుటవలన సర్వ ప్రాణులును సంతోషమునోన్దుచున్నవి
కాన అందరితోనూ , యల్లవేళలా సత్యమైన, ప్రియమైన మంచి మాటలనే పలుకు చుండుము
మాటలకు కుడా ఎందుకు దరిద్రము ? నాయనా !
{* तुम बच्चे आपसमे बहुत प्यार से रहना है और तुम्हारे बोल हर हालत में सत्य,प्रिय और मीठी होनी चाहिए बोल के शब्दों में कभी दरिद्र नहीं बनना है| }   
4. సుఖస్య దుఃఖస్య  న కోఅపి దాతా, పరో దదాతీతి కుబుద్ధి రేషా,
   అహం కరొమీతి వృధాభిమానః  స్వకర్మసూత్రగ్రధితో హి జంతు:
తా: సుఖదు:ఖములకు దాత ఎవరు కారు. వాటిని ఎవరో కలిగిచుచున్నా రనునది సరియగు ఆలోచన కాదు. తన సుఖ దుఃఖ ములకు పూర్తిగ తానే కర్త నను భావమూ అహంబావమే. ప్రాణిలోకమంతయు స్వకర్మసూత్రముచే బద్ధమై సుఖదు:ఖాదుల ననుబవించుచున్న దనేదే యదార్ధము.
5. సువర్ణపుష్పాం ప్రుధ్వీవిం ,చిన్వంతి పురుషా త్రయ:
    సూరశ్చ కృతవిద్యశ్చ , యశ్చ జానాతి సేవితుమ్
తా: ఈ భూతలమును సువర్ణ పుష్పముగా చేయుచున్నవారు ముగ్గురే ముగ్గురు ఉన్నారు , సూరులు, విద్వాంసులు, సేవాకర్మ నిరతులు. ఈ మూడు తరహాలవారే అట్టి మహాత్ములు.
{इस धरती को सुवर्ण पुष्प जैसा बनाने वाले केवल तीन व्यति ही है , सूर्य वंशी, ज्ञानी आत्मायें और निरन्तर सेवा में तत्पर रहे लोग }
6. హతం గ్యానం క్రియాహీనం, హతా స్త్వజ్ఞానత: క్రియా:
   అపశ్య  న్న౦ధకో దగ్ధ:,  పశ్యన్నపి  చ  పంగుక: 

తా: ఆచరణ లేని జ్ఞానమున్ను , జ్ఞానములేని క్రియలున్ను కుడా నిరుపయోగములై  నశించును. నడువలేని కుంటివాడును, చూడలేని గుడ్డివాడున్ను ఇల్లు తగులబడినచొ  చూచుచునే కుంటివాడును, నడువగలిగియు గుడ్డివాడును నశింతురు గదా.
{* ज्ञान बिना कोई धारण के कुछ काम नहीं आयेगा}
 7. విద్యా వివాదాయ ధనం మదాయ , శక్తి: పరేషాం ఖలు పీడనాయ
     ఖలస్య సాధో ర్విపరీత మేతత్, జ్ఞానాయ దానయ చ రక్షణాయ.  

No comments:

Post a Comment

బ్లాగ్ సందర్శించినందుకు ధన్యవాదాలు. త్వరలో మా స్పందన తెలుపగలము.