https://youtu.be/8bioBb8ZgMkకళ్ళు లేని
వాడికి కళ్ళు ఇవ్వండి ప్రభు అని భక్తితో పాడతారు ,మూడో నేత్రం పొందడానికి ప్రార్ధన చేస్తారు కాని ఆ
కంటి గురించి వారికి తెలియదు. ఆత్మను పరమాత్మను తమ అనేక జన్మల రహస్యం వారికి
తెలియదు భక్తీ లో పాడ తారు కాని రహస్యం తెలియదు ఆ నేత్రం అడుగు తారు కాని
పొందలేరు. ఆ పరమాత్మను ఈ కళ్ళతో చూడ లేరు. భక్తులు మూడో నేత్రం అడుగుతారు కాని
తెలియదు. అది భగవంతుడు స్వయం ఇవ్వ వలసినదే. ఎవరి దగ్గర ఆ మూడో నేత్రం ఉందో ఆయనే
ఇవ్వగలరు వేరే వారు ఇవ్వ లేరు. ఎవరైనా తమ దగ్గర ఉన్నది ఇవ్వ గలరు కానే లేనిది ఎలా
ఇవ్వ గలరు. మన శాస్త్రాల్లో మూడో నేత్రం ఎవరికీ ఉంది శంకరుడికి కాని శంకరుడిని
భగవంతుడు అనలేము. ఒకవేళ భగవంతుడైతే అయన
ఎవరి ధ్యానం లో కురుచున్నారు భగవంతుడు శివుడు. శివుని ధ్యానం లో శంకరుడు
కూర్చున్నాడు. శంకరునిలో శివుడు ప్రవేశించి నపుడు ఆయన ధ్యానం లో అయన కూర్చున్నాడు.శివుడు
వేరు శంకరుడు వేరు. శివ లింగం రూపం లో
శంకరుడిని విగ్రహం రూపంలో చుబించారు. శివ రాత్రి అంటారు శంకర రాత్రి అనరు.శివ
లింగం అంటారు శంకర లింగం అనరు. భగవంతుడు కాళ్ళు లేక పోయినా నడుస్తారు, చెవులు లేక
పోయిన వింటారు, కళ్ళు లేక పోయినా చూస్తారు...అని మహిమ చేస్తారు .. ఎలా చేస్తారు?
అంటే అరె అయన భగవంతుడు ఏమైనా చేస్తారు అంటారు. భగవంతుడు తన ప్రకృతి నియమాలను తానె
ఉల్లంఘిస్తారా లేదు అయన ప్రవేశించి అవన్నీ చేస్తారు. గీత లో ప్రవేష్టుం అని
చెప్పారు ప్రవేశిస్తారు.
No comments:
Post a Comment
బ్లాగ్ సందర్శించినందుకు ధన్యవాదాలు. త్వరలో మా స్పందన తెలుపగలము.