Sunday, November 15, 2020

 విసిడి 310*****

వాళ్ళందరూ దేహధారులు, దేహధారి గురువులు. ఇప్పుడు మీతో ఎవరు ఉన్నారు, ఇతను విచిత్రమైన తండ్రి. తండ్రి ఇది నా శరీరం కాదు అని చెపుతున్నారు. ఇది మీ దాదా శరీరం. ఇతను పూర్తి 84 జన్మలు తీసుకున్నాడు. ఇతని యొక్క అనేక జన్మల చివరిలో నేను ప్రవేశిస్తాను. మిమ్మల్ని సుఖదామం తీసుకు వెళ్ళడానికి. వీరిని గౌముఖం అని కూడా అంటారు. ఎవరిని? బ్రహ్మను. ఇప్పుడు గౌముఖం చూడడానికి ఎంతెంత దూరాల నుంచి వస్తారు. ఇక్కడ కూడా గౌముఖం ఉంది. ఎక్కడ? మౌంట్ అబులో ఎక్కడైతే వాణి చెప్పారో (నడిచిందో) అక్కడా గౌముఖం ఉంది, గంగోత్రి దగ్గర కొండ పైకి ఎక్కుతారో అక్కడ కూడా గౌముముఖం ఉంది. ఇప్పుడు మరి కొండ పైన తప్పకుండ నీళ్ళు ఉంటాయి. గౌముఖం స్మృతి చిహ్నం ఎక్కడ తయారు చేశారు. కొండల పైన. కొండ అంటే ఉన్నత స్టేజ్. ఆత్మ ఉన్నత స్టేజి లో ఉంటుందో అప్పుడు తప్పకుండ దానిని నుంచి జ్ఞాన జలం వస్తుంది. నీచ స్టేజి లో ఉంటే జ్ఞాన మనన చింతన మంథనం జరగదు. బావిలో కూడా నీరు ప్రతిరోజూ కొండల నుంచి వస్తుంది కదా. అది అంతం కాదు. నీళ్ళు వస్తూనే ఉంటాయి. ఎక్కడ నించి అయిన ధార వస్తే గంగా జలం వచ్చింది అంటారు. అక్కడకి వెళ్లి స్నానం చేస్తారు. గంగా జలం అనుకుంటారు. కానీ అవన్నీ అబద్ధాలు. పతితుల నుంచి పావనం గా ఈ నీళ్ళ నుంచి ఏమీ కారు. మరి దేని వల్ల అవుతారు.  నీళ్ళను మంథనం, చేస్తే, చిలికితే ఏమీ వెన్న రాదు. మంథనం అని సాగర మంథనం అని ప్రఖ్యాతి ఉంది. సాగరాన్ని మధిస్తే రత్నాలు వస్తాయి. అనగా భగవంతుడు తండ్రి ఏదైతే చెపుతారో, దానిని మంథన చేస్తే అమృతం వస్తుంది. తద్వారా ఆత్మ పావనం అవుతుంది. మనుషులు ఏమి చెప్పినా అది వారు విన్నదే మళ్ళి వినిపిస్తారు, చెపుతారు. కొత్త విషయాలు ఏమి చెప్పరు. మరి తండ్రి ఏమి చెప్పినా కొత్త విషయాలే చెపుతారు. అందుకే తండ్రి చెపుతున్నారు పతిత పావనుడిని నేను అని. ఓ అత్మలూ నన్ను ఒక్కడిని మాత్రమే స్మృతి చేయండి. ఏమిటి? ఈ నదులను, కాలువలను స్మృతి చేయకండి. ఎవరిని తలుచుకోండి స్మృతి చేయండి? నన్ను ఒక్కడినే స్మృతి చేయండి. గౌముఖం గురించి కూడా ఏమి చెప్పారు? ఈ బ్రహ్మ గౌముఖం బ్రహ్మను తలుచుకో మన్నారా? బ్రహ్మను కూడా తలుచుకోకండి. ఎందుకంటే బ్రహ్మ అయినా మళ్ళి పురుష శరీరమే, పురుష శరీరాన్ని గౌ ముఖం అని అంటారా ఏమి. ఆ బ్రహ్మ ఆత్మయే, శరీరం విడిచాక ఒక బ్రాహ్మణి లో ప్రవేశిస్తాడు. అప్పుడు అసలైన గౌ ముఖం అవుతాడు. అందుకని తండ్రి ఏమి చెపుతున్నారంటే నన్ను ఒక్కడినే స్మృతి చేయండి మామేకం శరణం వ్రజ, దేహము, దేహ సంబధీకులు అన్ని విడిచి మిమ్మల్ని ఆత్మ అని నిశ్చయం చేసుకుని నన్ను తలుచుకోండి. అప్పుడు మీ జన్మ జన్మాంతరాల పాపాలు భస్మం అయిపోతాయి. తండ్రి మిమ్మల్ని జన్మ జన్మాంతరాల పాపాల నుంచి విముక్తి చేస్తారు. ఈ సమయం లో లోకంలో పాపమే పాపం చేస్తూ ఉంటారు. పాపం చేస్తే కర్మ భోగం వచ్చే జన్మలో అనుభవిస్తారు. 63 జన్మల లెక్కాచారం ఉంది. కొద్ది కొద్దిగా కళలు చంద్రుడికి తగ్గినట్లు తక్కువ ఐపోతూ ఉంటాయి. ఇదైతే అనంత మైన పగలు రాత్రి, ఏది? సంగమ యుగం లో మొత్తం సృష్టి లో ఇప్పుడు అనంత మైన పగలు మరియు రాత్రి, అందులోనూ ప్రత్యేకంగా, భారత్ పైన రాహు దశ కూర్చుంది. రాహు గ్రహణం పట్టుకుంది. అంటే రావణ గ్రహణం. మరి తండ్రేమో బృహస్పతి. అయన ద్వారా మీరు 16 కళల సంపుర్ణులు గా అవుతారు. మీరు ఒకప్పుడు 16 కళల సంపుర్ణులు గ ఉండేవారు, ఇప్పుడు ఒక్క కళ కూడా లేదు. మళ్ళి మీరు సతో ప్రధానం గా అవుతున్నారు. ఇది కూడా మీకు తెలుసు మనిషి 84 జన్మలు తీసుకుంటాడు అని. ఆత్మ పరమాత్మ బహు కాలం వేరుగా ఉన్నారు అని తండ్రి చెపుతున్నారు. సద్గురువు దళారీ గా లభించి సుందర మేళ(ఆత్మలతో పరమాత్మ కలయిక) జరిపించారు. మీరు అందరికన్నా ముందుగా అయన నుంచి దూరమై పార్ట్ వేయడానికి వచ్చారు. అందుకే గానం చేస్తారు ఆత్మ పరమాత్మ బహు కాలం వేరుగా ఉన్నారు అని. ఇది మీ పాటే. కాబట్టి చుడండి ఇది మీ కలయిక ఎంత సుందరమైనదో. మీరు నల్ల వాళ్ళ (వికారీ) నుంచి సుందరం (నిర్వికారి, శుద్ధిగా, స్వచ్ఛం) గా తయారు అవుతున్నారు.  అందుకే కృష్ణుడిని కూడా శ్యామ సుందరుడు అంటారు. ఎందుకు అంటారు? అలాని కాదు అయన ఈ జన్మలో నల్ల వాడు వచ్చే జన్మలో తెల్లగా అవుతాడు అని, కనుక రెండు శరీరాలకు శ్యామ సుందరుడు అని పేరు వచ్చింది అని కాదు. అతను ఈ జన్మలో నే నల్ల వాడు ఈ జన్మలోనే తెల్లవాడు అవుతాడు. అందుకే మీ పేరు శ్యామ సుందరుడు. ఒకే శరీరానికి పేరు శ్యామ సుందరుడు అని. మొదట శ్యామ తరవాత సుందర. అందుకే మీ చిత్రాలు నల్లవి చేశారు. కామ చిత పై కూర్చుంటే గుర్తు నలుపు చూపారు. కాని మనుషుల బుద్ధికి ఇది ఏమీ తెలియదు. ఒకరిని నలుపు ఇంకొకరిని తెలుపు అంటారు. ఇప్పుడు మీరు తెల్లగా అవడానికి పురుషార్ధం చేస్తున్నారు. సతో ప్రధానం అవడానికి పురుషార్ధం చేస్తేనే అవుతారు కదా. ఇందులో కష్టం ఏమి లేదు. ఇతనూ తెల్లని వాడే, తండ్రి కుర్చుని చెపుతున్నారు, ఈ జ్ఞానం ఎవరు చెప్పలేరు, గీత వినిపిస్తారు, అది భక్తిమార్గ పుస్తకం. ఏది ఆ గీతను కేవలం చదివి వినిపిస్తారు, కానీ దాని అసలు అర్ధం ఏమిటి అనేది వారు చెప్పలేరు.  భక్తిమర్గానికి అనేక మైన సామాగ్రి,  అనేక శాస్త్రాలు.  కొంత మంది ఒకటి చదివితే ఇంకొంతమంది ఇంకోటి చదువుతారు. రామ మందిరం లో రాముని కూడా నలుపు చేశారు, గీత లో కూడా విభు అని ఉంది. విభు అంటే సర్వ వ్యాపి అని కాదు, ఆ అర్ధం అనేసుకున్నారు. గీత లో స్పష్టం గా ఉంది ఎక్కడ సూర్య చంద్ర నక్షత్రాల వెలుగు ప్రసరించదో అక్కడ నేను ఉండే వాడను అని, మరి సర్వ వ్యాపకుడు ఎలా అయ్యారు? భక్తి మార్గం కోసం ఎంతో సామాగ్రి తాయారు చేసేశారు. రామ మందిరం లో రాముడిని కూడా నల్లగా చేసేశారు.  నల్లగా ఎందుకు చేశారు అని ఆలోచించాలి. కాళీ కలకత్తా వాలి కూడా చుడండి ఎలా ఉందో. మా మా (అమ్మా అమ్మా) అంటూ హైరానా పడిపోతారు. అందరికన్నా నల్లగా ఆమె ఉంది. ఎవరు? కాళీ కలకత్తా వాలి. మరియు ఎంతో భయానకం గా కూడా చూపిస్తారు. మళ్ళి ఆమెను మాతా అని కూడా అంటారు. మాత భయానకంగా ఉంటుందా ఏమి? మీవి ఈ జ్ఞాన బాణాలు, జ్ఞాన కటారులు, వాళ్ళేమో(భక్తులు) ఆయుధాలు చూపించేశారు. కరవాలం తో శిరస్సు ఖండిస్తారు కదా. కనుక ఇది మీది జ్ఞాన కటారి. జ్ఞాన కటారి తో మీరు దేహఅభిమానాన్ని వేరు చేస్తారు. మరియు శిరస్సు అనే ఆత్మను వేరు చేస్తారు. కనుక ఆ స్మృతి చిహ్నాలు అన్ని ఇచ్చారు. నిజానికి కాళి కి బలి అయ్యేవారు. ఇప్పుడు అది బందు చేశారు. వీళ్ళను అదంఖోర్ నరభక్షకులు అనేవారు. మనిషి మాంసం తినేవారు. మొదట్లో సింధు ప్రాంతం లో దేవి మందిరం ఉండేది కాదు, ఎప్పుడైతే బాంబులు పేల్చారో, అప్పుడు ఓ బ్రాహ్మణుడు వచ్చాడు, కాళీ నాకు చెప్పింది నా గుడి కట్టక పొతే, ఇంకా బాంబులు పేలతాయి అని అన్నాడు, అంటే కుప్పలు తెప్పలు గా డబ్బులు పోగు అయ్యాయి, మరియు మందిరం తాయారు ఐపోయింది. ఇప్పుడు చుడండి ఎన్ని మందిరాలు తాయారు అయిపోయాయో, ఎన్ని చోట్ల గుళ్ళు తాయారు అయ్యాయో, ఇప్పుడు తండ్రి ఈ విషయాల నుంచి విడిపిస్తున్నారు, అంతేకాదు ఎవరి గ్లాని కూడా చేయరు. కేవలం నన్ను స్మృతి చేయండి అంటారు. అంటే ఏంటి? ఈ నల్ల ఆమె, తెల్ల ఆమె ను స్మృతి చేయకండి, ఎవరిని తలుచుకోండి కేవలం నన్ను మాత్రమే తలచండి. మామేకం స్మృతి చేయండి. కనుక తండ్రి ఈ డ్రామా ను వివరిస్తున్నారు. ఈ సృష్టి చక్రం ఎలా తాయారు అయ్యింది అని. మీరు ఏదైతే చుచారో అది మళ్ళి జరుగుతుంది. ఏ మన్నారు, డ్రామా తాయారు అవుతుంది, మనం స్థిరమైన నిశ్చయ బుద్ధి వారు గా తాయారు కావాలి, మాయ మనని కదిలించ లేక పోవాలి. అప్పుడు అమరులు అంటారు. అంతేకానీ ఇది శరీరంతో  మరణించడం బతకడం అనే విషయం కాదు. తండ్రి ఈ కళ్ళతో ఏది చూడ వద్దు అంటున్నారు. సివిల్  నేత్రం తో చుడండి. క్రిమినల్ దృష్టి తో చూడకండి. ఈ పురాతన సృష్టిని చూడకండి. ఈ పాత ప్రపంచం మొత్తం ఖలాస్ సమాప్తం అయిపోతుంది. మధురమైన పిల్లలు మొదట రాజ్య భాగ్యం 21 జన్మలకి తీసుకుంటాము, అక్కడ వేరే ఎవరి రాజ్యం ఉండదు. దుఃఖం నామ రూపాలే ఉండవు. అక్కడ చాలా సుఖం గ ధనవంతులు గా ఉంటారు. ఇక్కడ ఎంత దుఃఖం ఉందో, ఆకలి చావులు చస్తున్నారు, అక్కడ మొత్తం విశ్వం పై మీరు రాజ్యం చేస్తారు. అక్కడ చాల చిన్న మొక్క, పూల తోట. తరవాత వృద్ధి అవుతూ అవుతూ చివరకి ఎంత పెద్దది అయిపోతుందో. మరియు వికారాల ప్రవృత్తి వల్ల ముళ్ళ అడవి అయిపోతుంది.  దీనిలో ఆది మధ్య అంతాలలో దుఃఖం పొందుతారు.

 


Friday, November 13, 2020

 

VCD-310 రిజిస్టర్ న.39, 19-8-84 ఉదయం క్లాస్. ఎవరి స్మృతి లో కూర్చున్నారు? ఇది ప్రియాతి ప్రియమైన సంబంధం ఒక్కరితో. ఇది అన్ని దుఖాలనుంచి విముక్తిని ఇచ్చేది. తండ్రి పిల్లలను చూస్తూ ఉంటారు, అప్పుడు పాపాలు కట్ ఐపోతూ ఉంటాయి. ఆత్మ సతోప్రధానత వైపు పోతూ ఉంది. అంతులేని దుఖాలు ఉన్నాయి కదా. అందుకే దుఃఖ హర్త సుఖ కర్త అని పాడతారు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని అన్ని దుఖాల నుంచి విడిపించడానికి వచ్చారు. స్వర్గం లో దుఃఖం మచ్చుకైనా ఉండవు. అటువంటి తండ్రిని స్మృతి చేయడం చాలా అవసరం. తండ్రికి పిల్లల పట్ల ప్రేమ ఉంటుంది. పిల్లలకు తండ్రి మీద ప్రేమ ఉంటుంది. ఐతే మీకు తెలుసు తండ్రికి ఏ ఏ పిల్లల మీద ప్రేమ ఉంది అని. పిల్లలకి మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోండి, దేహం అనుకోవద్దు అని బోధించారు. మీరు కూడా పిల్లలే, సృష్టి లో అందరూ పిల్లలే, మరి ఎంత మంది వరుసవారి గా ఉన్నారు తండ్రి దగ్గరికి వస్తారు. ఎవరైతే బాగా  నడుస్తూ తిరుగుతూ (కూడా) తండ్రిని స్మృతి చేస్తారో వారికే చెబుతున్నారు. అది కూడా ఎందుకు చెబుతున్నారు? ఎందుకంటే మీ యొక్క పాపాల కుండ నిండి పోయి ఉంది ఈ స్మృతి యాత్ర ద్వారానే మీరు పాపాత్మ నుంచి పుణ్యాత్మ అవుతారు, ఆత్మ పుణ్యాత్మ అవుతుంది. ఇది పురాతన శరీరం అని కూడా మీకు తెలుసు. దుఃఖం అత్మకే ఉంటుంది. దుఃఖం పేరు చెపుతున్నారు అంటే దుఃఖ ధామం లో ఉన్నాము అని, సుఖ ధామం లో కష్టం కొంచం కూడా ఉండదు. ఇప్పుడు చాలా తక్కువ సమయం ఉంది కనుక తండ్రిని తలుచుకునే పూర్తి  పురుషార్ధం చేయాలి. ఎంత స్మృతి లో ఉంటారో అంత సత్వ ప్రధానం గా అవుతారు. పురుషార్ధం చేసి ఎటువంటి స్థితి తయారు చేసుకోవాలి అంటే అంతిమ సమయం లో తండ్రి తప్ప ఇంకెవరూ గుర్తుకు రాకూడదు. ఒక గీతం కూడా ఉంది “అంత కాల్ జో స్త్రీ సిమిరే” అంటే అంతిమ సమయం లో ఎవరు స్త్రీ ని తలుచుకుంటారో” అని ఇది అంతిమ సమయం కదా. పురాతన లోకం దుఃఖ ధామం యొక్క అంతం, ఇప్పుడు పిల్లలు మీరు సుఖ ధామం కోసం పురుషార్ధం చేస్తారు. మీరు శూద్రుల నుంచి బ్రాహ్మణులు అవుతారు. మనుషులు అందరూ శూద్రులు, ఇప్పుడు మీరంతా బ్రాహ్మణులు అయ్యారు. ఇది గుర్తు ఉండాలి కదా.  శూద్రులకు దుఃఖం ఉంది, ఇప్పుడు మీరు దుఃఖం నుంచి బయట పడి మళ్ళి శిఖరానికి ఎక్కారు, కనుక ఈ తండ్రిని తలుచుకోవాలి. మోస్ట్ బిలవేడ్ తండ్రి ఈయన కన్న ఉన్నత మైన మధురమైన వస్తువు ఏది లేదు ఈ లోకం లో. ఆత్మ ఆ పరమ పిత పరమాత్మనే తలుచుకుంటుంది కదా. అందరు అత్మలకూ అయన తండ్రి. అయన కన్నా మదురమైన వారు వేరే ఎవరూ ఉండలేరు.  ఇంత మంది అనేక మైన పిల్లలు గురుకు వస్తూ ఉంటారు , ఈ సృష్టి అంతా ఎలా తిరుగుతుందో అంతా అర్ధ సహితం గా ఉంది. ఎవరైనా ఏదైనా డ్రామా చూసి వస్తుంటే డ్రామా గుర్తుందా అని అడిగితె అప్పుడు డ్రామా అంతా బుడ్డిలోకి వచ్చేస్తుంది. మొదటి నుంచి చివరి వరకు, ఐతే వర్ణన చేసి చెప్పడానికి టైం పడుతుంది. బాబా అనంత మైన తండ్రి. తండ్రి గుర్తుకు వస్తూనే 21 జన్మల సుఖ ప్రాప్తి గుర్తుకు వస్తుంది. సెకెండు లో తండ్రి నుంచి ఈ వారసత్వం వస్తుంది. సత్యయుగ త్రేతా యుగాలు దృష్టి లోకి వస్తాయి. పిల్లాడు పుట్టాడు అనగానే తండ్రి కి తెలిసి పోతుంది వారసుడు వచ్చాడు అని. మొత్తం ఆస్తి అంతా గుర్తుకు వచ్చేస్తుంది. అలాగే మీరు కూడా రక రకాల పిల్లలు రక రకాల వారసత్వం లభిస్తుంది. (ఎందుకంటే) రక రకాలుగా స్మృతి చేస్తారు. ఒకే లాంటి స్మృతి ఐతే లేదు. అనంత మైన తండ్రి కి వారసులు. సత్యయుగం లో ఒకే వారసుడు ఉంటాడు. మొత్తం ఆస్తికి ఒక్కడే కొడుకు వారసుడు . అనంత మైన తండ్రి లభించారు, అనంత మైన వారసత్వం లభించింది సెకెండు లో ఏమాత్రం ఆలస్యం లేదు, మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోండి, మేల్ లేదా ఫిమేల్ అనుకోవద్దు. ఆత్మ అంటే అబ్బాయి కదా.  పిల్లలు అంటారు మాకు అంతా గుర్తుకు వచ్చింది అని ఆత్మలు అందరూ భాయి భాయి అని ఎవరు వచ్చినా చెపుతారు అన్ని ధర్మాల వారు భాయి భాయి అని. కానీ ఎలా భాయి భాయి అయ్యారో వారికి అర్ధం కాదు. ఇప్పుడు మీకు తెలుసు మనం బాబా కి మోస్ట్ బిలవేడ్ పిల్లలం అని. ఎందుకంటే ప్రాక్టికల్ గ బాబా ఉన్నారు. ప్రాక్టికల్ అంటే శరీరం తో తండ్రి నుంచి పూర్తి అనంత మైన వారసత్వం తీసుకుంటాం. ఐతే ఎలా తీసుకుంటారు? అది కూడా మీకు పిల్లలకు సెకెండ్ లో గుర్తుకు వస్తుంది. మనం సతో ప్రధానం గా ఉండేవాళ్ళం తమో ప్రధానం అయిపోయాం, ఇప్పుడు మళ్ళి సత్వ ప్రధానం గా అవ్వాలి, మీకు తెలుసు మనం బాబా నుంచి సుఖం అనే వారసత్వం తీసుకోవాలి. తండ్రి మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోండి అని చెపుతున్నారు. దేహం వినాశి ఆత్మ శరీరం విదిచి వెళ్లి పోతుంది తిరిగి వెళ్లి గర్భం లో వేరే శరీరం తీసుకుంటుంది, తోలుబొమ్మ తాయారు అయినప్పుడు ఆత్మ అందులో ప్రవేశిస్తుంది. లోక ఉదాహరణ ఎందుకు ఇచ్చారు? కాని ఆ ఏ తోలు బొమ్మ తాయారు అవుతుందో ఆత్మ ప్రవేశిస్తుందో అది రావణాసురుని వశం లో ఉంది కనుకనే వికారాల వశం అయి రావణ జైలు లో కి వెళుతోంది . మరప్పుడు సత్య యుగం లో నైతే రావణుడు ఉండనే ఉండడు. తోలు బొమ్మలు అక్కడ కూడా తాయారు అవుతాయి, దుఃఖ విషయమే లేదు, ముసలితనం వచ్చాక తెలుస్తుంది ఇప్పుడు మనం ఈ శరీరం విడిచి వెళ్లి తల్లి గర్భం లో ప్రవేశిస్తాము అని, అక్కడ భయం అనేదే ఉండదు. ఇక్కడ చుడండి ఎంత భయపడ తారో. అక్కడ నిర్భయం గా ఉంటారు. తండ్రి మిమ్మల్ని అపార సుఖాలలోకి తీసుకు వెళతారు. సత్య యుగం లో అపార సుఖాలు ఉన్నాయి, కలియుగం లో అపార దుఖాలు ఉన్నాయి. అందుకే దీనిని దుఃఖ ధామం అంటారు. తండ్రి ఐతే ఏమాత్రం కష్టం ఇవ్వరు. గృహస్త వ్యవహారం లో ఉంటే ఉందండి, పిల్లల్ని చూసుకోండి, కేవలం తండ్రిని తలుచుకోండి. ఈ గురువులు గోసాయి లను అందరిని విడవండి. నేను అందరు గురువులకన్న పెద్ద గురువును కదా. నేను తప్ప మరెవరు పతిత పావనులు లేరు. బ్రహ్మ విష్ణు శంకరులను పతిత పావనులు అంటారా? లేదు. దేవతలను కూడా అనలేము. నేను తప్ప. ఎందుకు అనలేము. ఎందుకంటే బ్రహ్మ విష్ణు శంకరులకు కూడా సుక్ష్మ శరీరం ఉంది. పతితులను పావనం చేయడానికి ఈ సృష్టి పైకి రావాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు (పిల్లలు) గంగను పతిత పావని అంటారా? అనరు. గంగను కూడా అనరు, దేవతలను కూడా అనరు నన్ను తప్ప. ఈ నీళ్ళ నదులు సదా ఉండనే ఉన్నాయి,  ఈ గంగా బ్రహ్మ పుత్ర ఎప్పటి నుంచో వస్తూనే ఉన్నాయి. వీటిల్లో స్నానాలు చేస్తూనే ఉన్నారు. వానలు పడితే వరదలు వస్తాయి. ఇది కూడా దుఃఖం ఐపోయింది. అంతులేని దుఃఖం.

 

vcd- 141

Featured Post

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్.

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్. ఒక సంక్షిప్త పరిచయం ఇక్కడ కింద తేదీలు పుట సంఖ్యలు ఇచ్చినవి గురువు గారి ప్రవచనా...