ఆధ్యత్మిక విశ్వ విద్యాలయం మరియు త్రిమూర్తి
శివ అనగా ఎవరు?
ఆధ్యాత్మిక
అనే పదం లో రెండు పదాలు ఉన్నాయి. అధి అనగా లోపల ఆత్మ అనగా ఆత్మ. అంటే
ఆధ్యాత్మ పదానికి అర్థం ఆత్మలో ఏమి ఉంది అని తెలుసుకోవడం. మొదట ఆత్మ అంటే ఏమిటో తెలుసుకుందాం.
ఆత్మ ఒక చైతన్య శక్తి. జ్యోతిర్బిందువు అనగా వెలిగే చుక్క. అది ఎక్కడ ఉంది
భ్రుకుటి లో ఉంది. దీనికి గుర్తుగానే నేటికీ భారతీయులు భ్రుకుటి మధ్యలో బొట్టు
పెట్టుకుంటారు. మనిషి పూర్తి శరీరం ఒక యంత్రం. దానిని నడిపే శక్తి ఆత్మ. మనిషి
ప్రతీ సందర్భంలోనూ నాది, నేను అంటూ
ఉంటాడు. నా శరీరం నా చేయి నా కాలు అంటాడు కాని నేను శరీరం నేను చేయి అనడు. కనుక
శరీరం వేరు ఆత్మ వేరు అని తెలుస్తుంది. ఈ విషయం శాస్త్రాలలో ఉంది అణో రణీయాం సం
మనుస్మరేత్యః........ అనే గీతా శ్లోకం లో భగవంతుడు మనకు ఆత్మరూపం అణువు కన్నా
అణువు అని వచించారు. భగవానువాచ మనకు శ్రీమతం. శ్రీమతం అంటే శ్రేష్ఠమైన మతం లేక
వాక్కు. అది పాటించి తీరాలి. అది ఒక శాసనం. మిగతా వారి వాక్కులు పాటించినా
పాటించకున్నా మనకు నష్టం లేదు. అందుకే శ్రీమత్ భగవత్ గీత అన్నారు.
కానీ ఈ రోజు ఆ శ్రేష్ఠమతం మనం పాటించడం లేదు.
అందుకే మనకు ఇన్ని దుఃఖాలు. మొత్తం ప్రపంచమే దుఃఖ మయంగా ఉంది. ఇప్పటి మన యుగం పేరే
కలియుగం అనగా కలహాలు, కష్టాలు, దుఃఖాల యుగం. ద్వాపర యుగంలో కృష్ణుడు వచ్చి
శ్రీమత్ భగవత్ గీత ను చెప్పి వెళ్ళిపోయారు అంటే మరి ఇప్పటి మాట ఏమిటి, ఇప్పుడు మనకు గతి ఏమిటి ఇలా దుఃఖంలో కొట్టు
మిట్టాడ వలసిందేనా, ఆ సంస్కృత గీత
చదివినా కూడా ఇంకా ఎందుకు లోకం పతనావస్తలోకే పోతువుంది? లేక ఎవరో ఒకరిని గురువును చేసేసుకుని ఈ
దుఃఖాలనుంచి విముక్తి పొంద గలుగు తామా? ఎంతోమంది గురువులు ఎంతో మంది బాబాలు వారిని ఆశ్రయించిన జనాలు వారికి పడుతున్న గతిని మనం రోజూ పేపర్లలో టివీల్లో ఇతర ప్రచార మాధ్యమాల్లో చూస్తూ వింటూనే ఉన్నాం. దీనికి ఈ విష వలయానికి
విరుగుడు ఏది? శాంతి ఎక్కడ దొరుకుతుంది? మనిషి విడిగానూ, సంఘం సమిష్టిగానూ
ఈ రావణ రాజ్యం నుంచి విముక్తి ఎప్పుడు పొందుతాడు?
పై ప్రశ్నలకు సమాధానమే గీతా భగవానువాచ యదా యదా
హి ధర్మస్య......తదాత్మానం సృజామ్యంహం.
అవశ్యం అయన లోకం పరివర్తన చేయడానికి వస్తారు.
ఎప్పుడు వస్తారు? ద్వాపర యుగం లో కాదు ద్వాపర యుగం లో వస్తే అయన చెప్పిన
శ్రేష్ఠాతి శ్రేష్ఠ గీత ద్వారా కృతయుగం లేదా సత్య యుగం రావాలి కాని కలియుగం రాదు.
కనుక అయన వచ్చే సమయం కూడా కలియుగం అంతం సత్య యుగం ఆరంభం మధ్య కాలం సంగమం , సంగమ
యుగంలో ఆయన వచ్చి పాత నరకాన్ని కలియుగాన్ని కొత్త సత్యయుగం స్వర్గం గ పరివర్తన
చేస్తారు.
మరి ఆయన శ్రీమతం ఎలా ఇస్తారు? దానికి సమాధానం కూడా గీతలోనే ఉంది....అవజానాంతి మాం
మూఢాః మానుషీం తనుమాశ్రితం.... అంటే నేను ఒక వృద్ధమానవ శరీరం లో వస్తాను జ్ఞానులు
నన్ను గుర్తుపడతారు, మూఢులు నన్ను
గుర్తు పట్టరు అని.
పరమాత్మ మనకు తండ్రి. అత్మలందరికీ తండ్రి. ఆత్మ
ఎలాగ ఒక చుక్క రూపం లో ఉందొ అలాగే పరమాత్మ కూడా ఓకే చుక్క లాగే ఉన్నారు. ఇద్దరి
రూపం ఒకటే. ఉదాహరణకు, ఏనుగు తండ్రి
ఏనుగు లాగే ఉంటాడో, చీమ తండ్రి చీమ
లాగే ఉంటాడో, అలాగే ఆత్మలకు
తండ్రి ఆత్మ లాగే ఉంటారు. మరి ఆత్మలకు పరమాత్మ కూ తేడా ఏమిటంటే, ఆత్మలు జనన మరణ చక్రం లో వస్తారు, పరమాత్మ రారు. అనగా మనిషి కి పుట్టడం చనిపోవడం
ఉంది కాని పరమాత్మ కు లేవు. ఆయనను ఆజన్మ అభోక్త అకర్త అంటారు. ఆత్మ శరీరం లేకుండా
ఏ కర్మా చేయలేదు. ఆత్మకు కర్మలు చేయడానికి 5 తత్వాలతో తయారైన శరీరం కావలి. అలాగే
పరమాత్మ కూడా శరీరం లేకుండా జ్ఞానం ఇవ్వలేరు. అయన శ్రీమతం ఇవ్వాలంటే ఆయనకు కూడా శరీరం
ఆధారం కావలి. ఇంతకు ముందు తెలిపినట్లు అయన ఒక వృద్ధ మనవ శరీరం ఆధారం చేసుకుని అతని
ముఖం ఉపయోగించి మనకు శ్రీమతం ఇస్తారు. అయన మనలాగా గర్భం తో జన్మ తీసుకోరు.
ఎందుకంటే అయనకు జనన మరణాలు లేవు. మరి ఎలా మనకు జ్ఞానం ఇవ్వాలి. ఆయనది దివ్య జన్మ
అనగా దివ్య ప్రవేశం చేస్తారు. శ్రిమద్భగవత్ గీత లో ప్రవేష్టుం చ పరంతప అనే పదం
చెప్పారు, జన్మ కర్మ చ మే
దివ్యం అనే శ్లోకం లో కూడా చెప్పారు..... పై శ్లోకాల ద్వారా మనకు రుజువు అవుతుంది
అయన ప్రవేశించే యోగ్యుడు, మరియు అయన జన్మ
దివ్యము అని. దివ్యం అంటే తప్పకుండ మనలాంటి జన్మ కాదు అని తెలుస్తుంది. ప్రవేష్టుం
అనే పదం ద్వారా ప్రవేశించి తీసుకునే జన్మ అని కూడా తెలుస్తుంది.
ఇప్పుడు మన కర్తవ్యమ్ ఆయనను తెలుసుకోవడం, ఎవరి ఆధారం తీసుకున్నారు? ఎవరి ద్వారా శ్రిమతం ఇస్తున్నారు?
అయన సర్వ వ్యాపకుడు కాదు. ఒక వేళ అందరిలో
ఉన్నాడు అని అంటే మరి భగవంతుడి కోసం ఎందుకు వెతుకుతున్నారు, గీతలో సంభవామి అంటే వస్తాను అని ఎందుకు అన్నారు, వస్తాను అంటే ఇక్కడ లేను అనే కదా అర్థం. అలాగే, అసహాయులై ఎక్కడ ఉన్నావు భగవంతుడా అని వెతికే
భక్తుడిలో ఉంటె మరి వెతకడం ఎందుకు. అలాగే దుష్కర్మలు ఇతరులను స్వార్ధం కోసం చంపడం, స్త్రీలను మానభంగం చేసే వారిలో అయన ఎలా ఉంటారు? అలాగే రాయి రాప్పలో కూడా ఉండరు అవి జడం అయన పరమ
చైతన్యం. కనుక అయన సర్వ వ్యాపకుడు కాదు. మరి కాదు అంటే ఒకరి లో వస్తాను అంటే ఆ
వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి కదా. అయన అతి సుక్ష్మ మైన వారు, ఒక సినిమాకు డైరెక్టర్ లాగా తేర వెనుక ఉండి
నాటకం నడిపించేవారు. గుప్తం గ ఉన్నారు. ఈ జగన్నాటకం లో హీరో పాత్ర ధారి ఇతనినే
ఆడమ్ ఆదాము ఆది దేవుడు, ఆది నాధుడు అని
అన్ని ధర్మాల వారు తమ తండ్రిగా ఒప్పుకున్నారు, ఇతనిలో ఆ పరమ పిత
ప్రవేశించి ఆధారం చేసుకుని ఈయన ముఖం ద్వారా శ్రిమతం ఇస్తున్నారు. ఇందరు మనుషులలో ఈ
హీరో ఎవరు ఎలా తెలుస్తుంది? అనేక జన్మలు
తీసుకుని ఆ మొదటి వ్యక్తి తన జన్మలు మరిచి పోయాడు. అతనే కాదు మనమందరం కూడా మన గత
జన్మలు మరిచి పోయాము. ఉదాహరణకు నెహ్రు విగ్రహం పెడతాము. ఆ నెహ్రు చనిపోయి ఇప్పుడు
వేరొక జన్మ లో ఉన్నాడు. అతను ఇప్పుడు తన గత జన్మను తనే గురుతు పట్టలేడు. తన
విగ్రహాన్ని తనే తెలుసుకోలేడు. ఇది నేనే అని. అలాగే ఒకప్పుడు మనం దేవతలం కానీ
ఇప్పుడు అనేక జన్మల అనంతరం మనం మన ముందు జన్మలను మరిచి పోయాము. కాని భగవంతుడు జనన
మరణ రహితుడు ఆయనకు మరుపు లేదు, జ్ఞాన సాగరుడు.
కనుక ఆయనకు మనం ఎవరమో తెలుసు. మన జన్మ రహస్యాలు కూడా తెలుసు. దీనినే శ్రీమత్ భగవత్
గీత లో కూడా హే అర్జున నీకు నీ జన్మల రహస్యం తెలియదు నాకు తెలుసు అని భగవానువాచ.
కనుక ఆ హిరో పాత్ర దారి ఎవరో భగవంతుడికి తెల్సు. అతనిలో ప్రవేశించి ధరప్రవాహకం గ
జ్ఞానం వినిపిస్తున్నారు. ఆ జ్ఞానం విన్నప్పుడు మనకు ఎటువంటి జ్ఞానం భగవంతుడు తప్ప
వేరే ఎవరు తెలుప లేరు అని తెలుస్తుంది.
భగవంతుడు వేరు దేవతలు వేరు. భగవంతుడు దేవతలకు
తండ్రి. యో యధా మాం ప్రపద్యన్తే తాం తధైవ భజామ్యహం ,..... దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా
యాంతి మామపి.....అనే శ్లోకాల ద్వారా దేవతలను తలచేవారు దేవతలను, నన్ను తలచేవారు
నన్ను పొందుతారు అని భూతాని యాన్తి భూతేజ్యా యాన్తి.... అంటూ భూత ప్రేతాలను పూజ
చేసేవారు భూతాలను, పిత్రూన్ యాన్తి పిత్రున్ అని పెద్దలను తలచేవారు పెద్దలను
చేరుకుంటారని భగవానువాచ. దీనిని బట్టి
భగవంతుడు ఒక్కరే, దేవతలు ౩౩ కోట్ల మంది అని శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. భగవంతుని
పేరు సదా శివుడు, మిగత బ్రహ్మ, విష్ణు, శంకర్, సరస్వతి, లక్ష్మి, పార్వతి, అష్ట
దేవతలు, ఇంద్రాది దేవతలు అయన పిల్లలు. సదా శివుడు జ్యోతి స్వరూపుడు. క్షీణే పుణ్యే
మర్త్య లోకం విశన్తి... అనే శ్లోకం ద్వారా పుణ్య కర్మల ద్వారా దేవతలు అయ్యి తరవాత
ఆ పుణ్యం అనుభవించి కరిగి పోగా తిరిగి మర్త్య లోకానికి వచ్చేస్తారు అనే శ్లోకం
ద్వారా తెలుస్తుంది. అంటే ఒకప్పటి దేవతలే తమ పుణ్యం ఖర్చై పోగా మనుష్యులుగా
ఐపోతారు అని భగవానువాచ.
శివ పరమపిత మిగతా దేవతలందరినీ మనుష్యుల నుంచి
దేవతలుగా మారుస్తారు అని తెలిపారు. సిఖ్ ధర్మం లో అందుకనే ఓక నానుడి ఉంది మానుస్
సే దేవతా కియే కరత న లాగి వార్ అని. వార్ అంటే సమయం భగవంతుడు శివునికి మనుష్యుల
నుంచి దేవతలుగా మార్చడానికి సమయం పట్ట లేదట. .......ఇంకా ఉంది...