Monday, January 21, 2019

స్వానుభవం

రూమ్ అంతా లేత ఎరుపు రంగు పరుచుకుని ఉంది. గదిలో ఓక గోడకు తెల్లటి గురు పీఠం. పీఠానికి ఒక వైపు కిటికీ గది అంత 10*15 స్క్వేర్. ఉండవచ్చు. పీఠానికి ఇరువైపులా అందమైన మట్టి స్తంభాలు. వాటిపైన పూల కుండీలు. గదికి రెండు ద్వారాలు. కిటికీ లకు ద్వారాలకు తెల్ల పరదాలు సెల్ఫ్ డిజైన్ వి ఉన్నాయి. గదిలో ఓ పది మంది దాక వరుసలో కుర్చుని ఉన్నారు. గురువుగారు ఇంకా రాలేదు. ఎంతో శాంతి వాతావరణం ఉంది అక్కడ వెళ్ళిన వాళ్ళందరూ అర్ధ నిమీలిత నేత్రాలతో ధ్యానం చేస్తున్నారు. ఐదు నిముషాల్లో గురువుగారు వచ్చేసారు. వెళ్లి గురుపీఠం పై కూర్చున్నారు. అందరికీ దృష్టి ఇస్తున్నారు. ఆ దృష్టి తీసుకుంటున్న కొంతమంది ఆనందం తో బాష్పాలు రాలుస్తున్నారు. మరో గంట తరవాత గురువుగారు ఒక యోగిని ఇచ్చిన గ్లాసుడు పండురసం గటగటా తాగేసి ఆమెకు ఇచ్చేసారు. ఆమె ఆ గ్లాసు తీసుకుని వెళ్ళింది. అయన తన పీఠం పైన పక్కగా ఉన్న అట్ట తీసుకుని దానికి ఉన్న సందేశం చదవ సాగరు. సందేశం చదివి అర్ధం వివరించారు. ఇప్పటి వరకు మీరు ఎంతో విన్నారు. ఆ జ్ఞానం ఉంది, జ్ఞానం యొక్క నషా ఉంది, మీలో నిశ్చయం కూడా ఉంది. కాని ఇప్పుడు ఇంకొంచం ఎక్కువ కావాలి. ఆ ఎక్కువ ఏమిటంటే మతిలో గుర్తు ఉన్నది అంతా స్వరూపం లోకి రావాలి. జ్ఞానం ఒక్కటి బుద్ధిలో ఉంటే సరిపోదు అది ధారణ లో ఉండాలి. లేక పొతే రావణాసురుడి లాగా ఎన్ని శాస్త్రాలు చదివిన పండితుడైనా ఆచరణ లేక పొతే రాక్షసుడే అవుతాడు. జ్ఞానం స్వరూపం లో రావడం అంటే ఉదాహరణ కు ఓక వ్యక్తి సామాన్య వేషం లో ఉన్నా అతడు బాగా చదువుకున్న వాడు లేదా మంచి హోదా లో ఉన్న వాడు, ఒక షాహుకారు కొడుకు ఐతే అతనిలో ఆ హుందాతనం అతని నడవడికలో కనపడుతుంది. ఓహో ఇతను సామాన్యుడు కాదు విశేషత కల వ్యక్తి అని అతని గుణం కల వ్యక్తి అని తెలుస్తుంది. ఇలా ఇలా 2 ఘంటలు ఏక ధాటిగా అయన చెప్పుకు పోతున్నారు. కూర్చున్న వాళ్లకు ఆకలి దప్పులు లేవు. ఓం శాంతి అని అయన ముగించారు. అరె అప్పుడే అయిపోయిందా అని కూర్చున్న వారిలో కదలికలు. అయన చుట్టూ మూగిపోయారు ఒక తండ్రి చుట్టూ పిల్లలు చేరినట్లు. అయన అంతసేపు క్లాస్ చేసినా ఎటువంటి అలసటా లేకుండా ఎంతో ఓపికగా అందరిని పేరు పేరునా పలకరిస్తున్నారు. ప్రతివారిలో తమకు ప్రాణం కన్నా మిన్న అయిన వారిని కలుస్తున్న భావన. ఇటువంటి ప్రేమ మళ్ళి దొరకదు అన్నట్లు ఉన్నారు. వారి ఆనందానికి హద్దులు లేవు. మళ్ళి ఈన క్లాసు వేరే ఊరిలో. మళ్ళి అక్కడ కూడా ఇలాగె పిల్లల నడుమ సంగమం. శాంతికి 25 ఏళ్ల క్రితం ఎంత అనుభవం అయిందో అలాగే ఉంది. మొదట బాబా ను కలిసినప్పుడు ఎటువంటి అలౌకిక ఆనందమో అదే ఆనందం. వీసమెత్తు కూడా తగ్గలేదు. బాబా అప్పుడు 50 ఏళ్ళు ఇప్పుడు 75 అప్పుడూ అయన ఉత్సాహంగానే ఉన్నారు ఇప్పుడూ అదే ఉత్సాహం. తనకన్నా ముందు ఆయనను తెలుసుకున్న వారు అన్నారు అయన ఎప్పటికి 25 ఏళ్ల ఉత్సాహం తోనే ఉంటారు అని. ఆత్మిక శక్తి అంటే అదేనేమో. దేహం దేహ సంబంధాలు ఆయనను అడ్డుకోలేవు. అయన ప్రేమకు పరిమితి లేదు. తన పర భేదం లేదు. కలిసిన ప్రతివారు దివ్యానుభూతి పొందిన వారే. ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవం చెపుతుంటే మిగతా వారు మైమరచి పోయేవారు. గీతలో “కధయంతశ్చమాన్నిత్యం తుష్యంతిచ రమంతిచ.....”

చెప్పినట్లు జ్ఞానులు అయన మహిమ లు ఒకరికి ఒకరు చెప్పుకుంటూ పరమానందం పొందుతున్నారు.   

No comments:

Post a Comment

బ్లాగ్ సందర్శించినందుకు ధన్యవాదాలు. త్వరలో మా స్పందన తెలుపగలము.

Featured Post

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్.

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్. ఒక సంక్షిప్త పరిచయం ఇక్కడ కింద తేదీలు పుట సంఖ్యలు ఇచ్చినవి గురువు గారి ప్రవచనా...