ఇంద్రియాణి పరాణ్యాహు : ఇన్ద్రియేభ్య: పరం మన:
మనసస్తు పరాబుద్ధి యో బుద్ధి: పరసస్తు స:
కర్మేంద్రియాల కన్నా జ్ఞానేంద్రియాలు శ్రేష్ఠమైనవి జ్ఞానేంద్రియాలకన్నా మనసు ప్రబలమైనది. మనసు కన్నా బుద్ధి ప్రబలమైనది బుద్ధి కన్నా అతడు అనగా పరమాత్ముడు ప్రబలమైన వారు. బుద్ధి ఈశ్వరుని ప్రసాదం అంటారు. బుద్ధి హజార్ నియామత్ అని హిందీ లో అంటారు. అంటే ఒక్క బుద్ధి సక్రమంగా ఉంటే ఎన్నైనా సాధించ వచ్చు అని అర్ధం.
రాజయోగం విషయం లో ఏమి చెపుతారంటే ఎంత సూక్ష్మము ను ధ్యానిస్తామో అంత బుద్ధి సూక్ష్మం అవుతుందని చెపుతారు. ఏకాగ్రంగా మరే విషయము తలచకుండా ఒక్క బిందువు పై ఏకాగ్రం చేస్తే బుద్ధి అతి సూక్ష్మం అవుతుంది. ఎంత విత్తనం చిన్నదిగా ఉంటుందో వృక్షము అంత విస్తారాన్ని పొందుతుందని వివరిస్తారు. ఉదాహరణకు మర్రి విత్తనం అతి సూక్ష్మం ఐనది మరి మర్రి చెట్టు ఎంత విస్తారంగా ఉంటుందో మనకు తెలుసు.
ఆలా అది జడ వృక్షము ఐతే మరి ఆత్మ అతి సూక్ష్మము కనుక మరి అది ఏ విస్తారాన్ని పొందుతుంది. దానిలో అనేక జన్మల రహస్యాలు తెలుస్తాయి. చిన్న చిప్ లో ఎంతో డేటా ఉన్నట్లు. అంటే ఎంతెంత సూక్ష్మ జ్యోతిర్బిందువుతో యోగం చేస్తామో అంతంత మన అనేక జన్మల రహస్యాలు మనకు స్ఫురిస్తాయి. ఐతే ఇందులో సద్గురువుకు అనివార్యమైన పాత్ర ఉంది. సద్గురువు లేకుండా అసలు యోగం అనేదే అర్ధం లేనిది అవుతుంది. సత్ గురువు అనే మాటే సత్య ప్రాధాన్యత స్పష్టం చేస్తుంది.
ప్రస్తుతం ఈ లోకం లో ఎవరూ సత్యమైన వారు లేరు. ఐతే అసలు సత్యం అంటే భగవంతుడు అయన గుప్త రూపం లో తన కర్తవ్యమ్ చేస్తున్నారు. గుప్తంగా ఎందుకంటే ప్రస్తుతం రావణ రాజ్యం కనుక అందరూ రావణ సేన కనుక కర్ర విరగ కుండా పాము చావకుండా కార్యం సాధించడానికి అయన గుప్తం గ ఉన్నారు. మనం ఒక్కొక్కరిగా రావణ సంకెల నుంచి రామ ఆశ్రయం లోకి రావాల్సిఉంది.
ఓం శాంతి.
No comments:
Post a Comment
బ్లాగ్ సందర్శించినందుకు ధన్యవాదాలు. త్వరలో మా స్పందన తెలుపగలము.