అక్కడ ఆత్మల లోకం ఈ జ్ఞానం లో నలుగు సబ్జక్ట్లు . జ్ఞానము, యోగం, ధారణ మరియు సేవ. జ్ఞానం అంటే తెలియడం. ఏమి తెలియడం నేను ఆత్మ నా తండ్రి పరమ పిత పరమాత్మ శివబాబా ఎవరు అని తెలియడం. అయన ఏ సాధారణ మానవునిలో ప్రవేశించి ఉన్నారో తెలిసిన తరవాత అయనను స్మృతి చేయడం యోగం, అయన తెలిపే ధర్మం పాటించడం ధారణ మరి సేవ అంటే ఈ జ్ఞానం అర్ధం చేసుకుని ఇతరులకు అర్ధం చేయించడం సేవ. స్మ్రుతి చేసే వారే స్వర్గం లోకి వెళతారు. పదవి కూడా పొందుతారు. స్మ్రుతి చేయడానికి కూడా జ్ఞానం కావాలి ఒక్కరినే తలుచుకోవాలి గీత లో కూడా మామేకం అని మాట వచ్చింది. పురుషార్ధం చేయవలసినవి జ్ఞాన యోగ ధారణా సేవ అనే నలుగు పేపర్లు . పతితులు పావనం అవ్వాలి అనేక దేహ దారుల సాంగత్యం లో పతితులు ఆయారు ఇప్పుడు ఒక్కరి సాంగత్యం లో పావనం అవ్వాలి.
ప్రయత్నాలు ఎన్నో చేసారు కాని ఎవరూ దేవత కాలేదు. ఆత్మల కనెక్షన్ కేవలం పరమాత్మ తోటే. మనని మనం ఆత్మ అనుకుని పరమాత్మను తలుచు కోవాలి. చైతన్యం ఆత్మ కదా జడ శరీరం ఏమి చేయదు. చైతన్యం అంటే మాట్లాడేది నడిచేది. గుహ్య మైనది జ్ఞానం .స్వర్గం లో కూడా దేహాభిమానం ఉంటుంది. దేహం పేరు పడుతుంది కదా. లక్ష్మి నారాయణుడు, రాధ కృష్ణులు అలా. కనుక ఈ కష్టం చేయమంటారు. ఏమిటి ఆ కష్టం మనని ఆత్మ అని ప్రాక్టికల్ గ అనుకోవడం సుఖ ధామం వెళ్ళడానికి ఆత్మ అభిమాని కావాలి కష్టం చేయ కుండ ఏది రాదు. కష్టమే లేక పొతే అన్దరూ విశ్వ మాలిక్ అయిపోవచ్చు. కాని ఒక్కరే విశ్వ నాధుడు అయ్యారు. అయన పరివారం కూడా భూమిపై నక్షత్రాలు భోమ్మీద విశేష ప్రజ్ఞ కల మహిమాన్వితులు పూజించబడే దేవతలు. జ్ఞానం అర్ధం చేసుకున్న వారికి సులువు. కేవలం విని వదలడం కాదు పాటించాలి. మననం చేయాలి. మాయ అపోజిషన్ చాలా ఉంది. కొంత మంది తలరాత చాల బాగుంది వారు జ్ఞానం యోగ పురుషార్ధం లో లీనం అయ్యారు. లేని వారు దేహ సంపాదనలో మునిగి పోయారు.
వారు భక్తులు కేవల దర్శనం కోరు కుంటారు. భక్తి లో కష్టం ఉంటె జ్ఞానం లో కూడా ఉంది. తరవాత వచ్చే వారు పురుషార్ధం చేయరు అని కాదు. చివరలో వచ్చినా పురుషార్ధం చేసి ముందుకు వెళ్లి ఫస్ట్ రావచ్చు. మేము పొట్ట సంపాదన వదిలి ఈశ్వరీయ సంపాదనలో ఉంటాము. ఇక్క డ ఆత్మ ఐ కురుచుటాము. ఇది ఆత్మ తపస్సు దేహ తపస్సు కాదు ఉల్టా నిల్చో, ఆసనం వెయ్యి ఇవ్వి కాదు... ఆత్మ తపస్సు ఇక్కడ అక్కడ దైహిక తపస్సు.
మీరు పవిత్ర్ ఋషులు. ఋషులు అని తపస్వులను అంటారు. ఘోర తపస్సు చేసాడు విశ్వామిత్రుడు అంటారు పెద్ద రాజు కదా. ఇక్కడ ఎక్కడకో వెళ్ళ వలసిన పని లేదు. ఒక్క సెకెండ్ లో దేహం దేహ సంబంధాలు మరిచి ఆత్మ అనుకో....బీతి కో బీతి దేఖో ఏ దునియా న జీతీ దేఖో....... జరిగి పోయింది జరిగి పోయింది. ఈ లోకం చచ్చి పోయింది. అంటే మనకు ఈ లోకం తో పని లేదు..... మన పని ఎవరు ఎలాంటి వారైనా వారికి సహాయం చేయడమే, డబ్బులు ఇవ్వలేక పోవచ్చు కాని శాంతి ప్రేమ ఆనందం సుఖం ఇవ్వగలం.
No comments:
Post a Comment
బ్లాగ్ సందర్శించినందుకు ధన్యవాదాలు. త్వరలో మా స్పందన తెలుపగలము.