Thursday, December 26, 2019

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం లో భాగవతం

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం లో భాగవతం
మేము ఓక ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులం, మాలో అన్నదమ్ములం, అక్కచెల్లెళ్ళం కలిసి షుమారు 20,000 పై చిలుకు ఉన్నాం అందులోనూ కన్యలు మాతల సంఖ్య 80%. మేము దేశ విదేశాల లోని వివిధ ప్రాంతాలనుంచి మూల మూలల నుంచి వచ్చాం. మా మధ్య రక్త సంబంధం లేకపోవచ్చు, కానీ ఒకే విశ్వ పిత సంబంధం కారణం గా మా మధ్య తెగని బంధం ఏర్పడింది. మాలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్ఖ్ అని లేరు, మా అందరికీ ఒకే బాబా ఆయనే తల్లి తండ్రి ఒకే శరీరం లో అర్ధనారీశ్వరుడుగా. వినడానికీ విశ్వసించడానికి విచిత్రం అయినా నిజం నిరూపించు కోవడానికి అవసరం ఏమిటి. మీరే స్వయంగా వచ్చి ప్రేమతో తెలుసుకుంటే తెలుస్తుంది. మేము అవిచ్ఛిన్న మైన ఆశక్తి కి ఏకతా అనే తాటితో కట్టుబడి ఉన్నాం. పరమపిత పరమాత్మ శివుడు కంపిల్ గ్రామంలో (యూ.పీ.)జగత్పిత జగదంబ రూపంలో ప్రవేశించడంతోనే ఈ అసంభవ కార్యం సంభవమైనది. నిజానికి ఇది ఒక అద్భుతం ఇప్పటి భారతదేశపు పటంలో ఏమాత్రం విలువలేని ఓ కుగ్రామంలో ఎలా దేశపు మూల మూలల నుంచి ఈ దార్శనిక సిద్ధాంతానికి కట్టుబడి ఈ చిన్న గ్రామంలో ఒకటి అయ్యి నిలుచున్నాము. ఈ కుగ్రామంలో ప్రజలకు కనీసం పొట్టనింపుకోవడానికి రెండుపూటల రెండు రొట్టెలకు కూడా గతిలేదు. మేము మిమ్మల్ని కూడా మా కుటుంబ సభ్యులుగా భావించి మీతో ఈ రహస్యాలు పంచుకుందాం అనుకుంటున్నాము.
నిజానికి మేము బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం, మౌంట్ అబూ రాజస్థాన్ ఇంకా ఆ సంస్థ అనేక విభాగాల లో చెప్పబడే జ్ఞానం తో ప్రభావితులమై వారితో కలిసి ఉండేవారం. కానీ ఆశ్చర్యం ఏమంటే పరమపిత శివపరమాత్మ దాదా లేఖరాజ్. బ్రహ్మ మాధ్యమంగా మౌంట్.అబూ లో 1951 నుంచీ 1969 వరకూ చెప్పిన మహావాక్యాలు వీటినే జ్ఞాన మురళీలు అంటారు మరియు 1969 నుంచీ ఇప్పటివరకూ బ్రహ్మకుమారీ గుల్జార్. మోహిని గారి ద్వారా చెప్పిన చెప్పబడుతున్న అవ్యక్తవాణి ల గహన అధ్యయనం లేక మనన చింతనం ఆధారంగా ఎన్నో రహస్యాలు జిగ్జ్ఞాసులనుంచి దాచి ఉంచుతున్నారు. ఆ రహస్యాల ప్రమాణం మూల ఈశ్వరీయ మహావాక్యాల నుంచి తొలగించారు అని తెలుస్తున్నది. జ్ఞాన మురళీలు మరియు అవ్యక్తవాణీల లో ఎక్కడైనా రాముని, శంకరుని, ప్రజాపిత యొక్క విషయం వస్తే ఆ మహావాక్యాలు బ్రహ్మకుమారీ విశ్వవిద్యాలయం, మౌంట్.అబూ ద్వారా ప్రింటు చేయబడినవి నేడు పునః ముద్రితమౌతున్న(రివైజ్)మురళీలలో ఏ కోశానా వెతికినా కనిపించడం లేదు. తొలగించ బడిన ఈ వాక్యాలు శ్రీమత్.భగవద్గీతశ్లోకాల లో రచయిత మరియు రచన రహస్యాలు నేటికీ రహస్యాలై అగుపిస్తాయి. ఇవ్వే మమ్మల్ని ఐతిహాసిక గ్రామం కంపిల్. వైపు ఆకర్షించాయి.
మౌంట్ అబూలో దాదాలేఖరాజ్. బ్రహ్మద్వారా చెప్పిన మహావాక్యాల రహస్య సారం కంపిల్.లో ఉన్న ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం ఉనికి వెలికి తీసింది. మొత్తం లోకంలో ఫరూఖాబాద్. మహాత్మ్యాన్ని చాటిచెప్పింది. ఈ రహస్యాలే మమ్మల్ని జగత్పిత జగదంబ లను క్రమశః మా మాతాపిత ప్రజాపిత, బ్రహ్మ అని తెలుసుకునేలా చేశాయి మరియు మమ్మల్ని ఈశ్వరీయ సేవకు అంకితమయ్యేలా సమర్పితమయ్యేలా చేశాయి. ఈ విధంగా మేము దేశం నలుమూలల నుంచి వచ్చినా అపరిచితులమైనా విభిన్నప్రాంతాల, భాషలవారమైనా ఒకే మనసు, ఒకే వచనం, ఒకే కర్మ కలవారమై అది ఒకే తండ్రి మాటపై ఆధారపడి మాతాపితల ఛత్రఛాయ లో ఒక దివ్య ఈశ్వరీయ కుటుంబం అనే సుత్రం లో కట్టుబడి ఉన్నాం. ఇది కేవలం ఒక విశ్వవిద్యాలయమేకాదు, ఒక ఇల్లుకూడ. ఈ కుటుంబం కేవలం భారత్ లోనే కాదు. విశ్వమంతా వ్యాపించింది. మా లక్ష్యం జాతి, మత, భేదభావాలకు అతీతంగా వసుధైవ కుటుంబం స్థాపన చేయడంలో పరమాత్ముడి సాకార మాధ్యమానికి (బాబాకి) భుజాలమై ఉండడం అంటే సహాయకారులం సదా అవడం. ఇది ఒక సత్సంగం, ఈ కుటుంబం కేవలం ఒకే సత్యమైనవాడు, శివకరుడు, ఒకే శివబాబా సాంగత్యంలో ఒకేబాబా సాంగత్యంలో రంగరించ బడి ఉన్నాం. ఈ కుటుంబం విశ్వంలో విడదీయరాని అతిపెద్ద కుటుంబం వసుధైవకుటుంబంగా ఉద్భూతం కాబోతున్నది. ఈ మా కుటుంబం మాత్రమే ఈశ్వరుని ఙ్ఞానం ద్వారా ఈ కలియుగీ రావణ రాజ్యాన్ని రామరాజ్యంగా మార్చే శక్తి కలవారం. ఆఁ ఐతే స్వర్గీయ స్థితి రావడానికి తప్పక ప్రతీవ్యక్తి మహాభారీ మహాభారత యుద్ధంలో పాల్గోవాల్సిందే. పాండవుల జీవనమే తెలుపుతుంది –అన్ని రోజులూ మనవి కావని.-  

  

No comments:

Post a Comment

బ్లాగ్ సందర్శించినందుకు ధన్యవాదాలు. త్వరలో మా స్పందన తెలుపగలము.

Featured Post

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్.

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్. ఒక సంక్షిప్త పరిచయం ఇక్కడ కింద తేదీలు పుట సంఖ్యలు ఇచ్చినవి గురువు గారి ప్రవచనా...