ఈ రోజు కొంచం నాక్కూడా ఏదో మీ తో పంచుకోవాలని ఉంది. అందరి సహృదయుల మధ్య మరిచి పోయిన సాహిత్య పిపాస పెంచుకోవాలని ఉంది. చదువరులు లేక ఒంటరి నైన నన్ను మీతో కలుపుకుని ఊహల పల్లకి ఎక్కించిన మిమ్మల్ని కొలుచుకోవాలని ఉంది. (సాంగత్య మహిమ సుమీ)
మహామహుల మధ్య ఏదో ఓ మూల కుర్చుని మీ భావాల మిఠాయి పాకం భోషాణం లో నన్ను నేను మున్చుకోవాలని ఉంది హై బాబోయి హింత క(పి)విత్వం నాకే తన్నుకు వచ్చేస్తోందేమి టని మనసు అద్దం లో నా మొహం చూసుకోవాలని ఉంది.
విషయానికి వస్తే....ఈ రోజు మా గురుగారు చెప్పేరు హిందీ లో "బీతి కో బీతీ సమఝో ఏ దునియా నా జీతీ సమఝో"बीती को बीती समझो, इस दुनिया को न जीती समझो".... అంటే జరిగి పోయింది జరిగి పోయిందనుకో , ఈ లోకం అసలు బతికే లేదనుకో" అని తెలుగులో చెప్పుకోవచ్చు....... ఎందుకో ఈ మాటలు బాగా లోతుగా అనిపించాయి. ఎవరో అన్న మాటలు పట్టుకుని దీర్ఘాలు తీస్తాం కాని జరిగి పోయింది చింతించడం మానేస్తే, అసలు ఈ లోకమే లేదు నేను నా దేవుడు తప్ప అనుకుంటే అంత హాయి లేదేమో.....
No comments:
Post a Comment
బ్లాగ్ సందర్శించినందుకు ధన్యవాదాలు. త్వరలో మా స్పందన తెలుపగలము.