Sunday, December 20, 2020
Wednesday, December 2, 2020
Monday, November 30, 2020
Wednesday, November 25, 2020
Tuesday, November 24, 2020
Tuesday, November 17, 2020
Sunday, November 15, 2020
విసిడి 310*****
వాళ్ళందరూ
దేహధారులు, దేహధారి గురువులు. ఇప్పుడు మీతో ఎవరు ఉన్నారు, ఇతను విచిత్రమైన తండ్రి.
తండ్రి ఇది నా శరీరం కాదు అని చెపుతున్నారు. ఇది మీ దాదా శరీరం. ఇతను పూర్తి 84
జన్మలు తీసుకున్నాడు. ఇతని యొక్క అనేక జన్మల చివరిలో నేను ప్రవేశిస్తాను.
మిమ్మల్ని సుఖదామం తీసుకు వెళ్ళడానికి. వీరిని గౌముఖం అని కూడా అంటారు. ఎవరిని?
బ్రహ్మను. ఇప్పుడు గౌముఖం చూడడానికి ఎంతెంత దూరాల నుంచి వస్తారు. ఇక్కడ కూడా
గౌముఖం ఉంది. ఎక్కడ? మౌంట్ అబులో ఎక్కడైతే వాణి చెప్పారో (నడిచిందో) అక్కడా గౌముఖం
ఉంది, గంగోత్రి దగ్గర కొండ పైకి ఎక్కుతారో అక్కడ కూడా గౌముముఖం ఉంది. ఇప్పుడు మరి
కొండ పైన తప్పకుండ నీళ్ళు ఉంటాయి. గౌముఖం స్మృతి చిహ్నం ఎక్కడ తయారు చేశారు. కొండల
పైన. కొండ అంటే ఉన్నత స్టేజ్. ఆత్మ ఉన్నత స్టేజి లో ఉంటుందో అప్పుడు తప్పకుండ
దానిని నుంచి జ్ఞాన జలం వస్తుంది. నీచ స్టేజి లో ఉంటే జ్ఞాన మనన చింతన మంథనం
జరగదు. బావిలో కూడా నీరు ప్రతిరోజూ కొండల నుంచి వస్తుంది కదా. అది అంతం కాదు.
నీళ్ళు వస్తూనే ఉంటాయి. ఎక్కడ నించి అయిన ధార వస్తే గంగా జలం వచ్చింది అంటారు.
అక్కడకి వెళ్లి స్నానం చేస్తారు. గంగా జలం అనుకుంటారు. కానీ అవన్నీ అబద్ధాలు.
పతితుల నుంచి పావనం గా ఈ నీళ్ళ నుంచి ఏమీ కారు. మరి దేని వల్ల అవుతారు. నీళ్ళను మంథనం, చేస్తే, చిలికితే ఏమీ వెన్న
రాదు. మంథనం అని సాగర మంథనం అని ప్రఖ్యాతి ఉంది. సాగరాన్ని మధిస్తే రత్నాలు
వస్తాయి. అనగా భగవంతుడు తండ్రి ఏదైతే చెపుతారో, దానిని మంథన చేస్తే అమృతం
వస్తుంది. తద్వారా ఆత్మ పావనం అవుతుంది. మనుషులు ఏమి చెప్పినా అది వారు విన్నదే
మళ్ళి వినిపిస్తారు, చెపుతారు. కొత్త విషయాలు ఏమి చెప్పరు. మరి తండ్రి ఏమి
చెప్పినా కొత్త విషయాలే చెపుతారు. అందుకే తండ్రి చెపుతున్నారు పతిత పావనుడిని నేను
అని. ఓ అత్మలూ నన్ను ఒక్కడిని మాత్రమే స్మృతి చేయండి. ఏమిటి? ఈ నదులను, కాలువలను
స్మృతి చేయకండి. ఎవరిని తలుచుకోండి స్మృతి చేయండి? నన్ను ఒక్కడినే స్మృతి చేయండి.
గౌముఖం గురించి కూడా ఏమి చెప్పారు? ఈ బ్రహ్మ గౌముఖం బ్రహ్మను తలుచుకో మన్నారా?
బ్రహ్మను కూడా తలుచుకోకండి. ఎందుకంటే బ్రహ్మ అయినా మళ్ళి పురుష శరీరమే, పురుష
శరీరాన్ని గౌ ముఖం అని అంటారా ఏమి. ఆ బ్రహ్మ ఆత్మయే, శరీరం విడిచాక ఒక బ్రాహ్మణి
లో ప్రవేశిస్తాడు. అప్పుడు అసలైన గౌ ముఖం అవుతాడు. అందుకని తండ్రి ఏమి
చెపుతున్నారంటే నన్ను ఒక్కడినే స్మృతి చేయండి మామేకం శరణం వ్రజ, దేహము, దేహ
సంబధీకులు అన్ని విడిచి మిమ్మల్ని ఆత్మ అని నిశ్చయం చేసుకుని నన్ను తలుచుకోండి.
అప్పుడు మీ జన్మ జన్మాంతరాల పాపాలు భస్మం అయిపోతాయి. తండ్రి మిమ్మల్ని జన్మ
జన్మాంతరాల పాపాల నుంచి విముక్తి చేస్తారు. ఈ సమయం లో లోకంలో పాపమే పాపం చేస్తూ
ఉంటారు. పాపం చేస్తే కర్మ భోగం వచ్చే జన్మలో అనుభవిస్తారు. 63 జన్మల లెక్కాచారం
ఉంది. కొద్ది కొద్దిగా కళలు చంద్రుడికి తగ్గినట్లు తక్కువ ఐపోతూ ఉంటాయి. ఇదైతే అనంత
మైన పగలు రాత్రి, ఏది? సంగమ యుగం లో మొత్తం సృష్టి లో ఇప్పుడు అనంత మైన పగలు మరియు
రాత్రి, అందులోనూ ప్రత్యేకంగా, భారత్ పైన రాహు దశ కూర్చుంది. రాహు గ్రహణం
పట్టుకుంది. అంటే రావణ గ్రహణం. మరి తండ్రేమో బృహస్పతి. అయన ద్వారా మీరు 16 కళల
సంపుర్ణులు గా అవుతారు. మీరు ఒకప్పుడు 16 కళల సంపుర్ణులు గ ఉండేవారు, ఇప్పుడు ఒక్క
కళ కూడా లేదు. మళ్ళి మీరు సతో ప్రధానం గా అవుతున్నారు. ఇది కూడా మీకు తెలుసు మనిషి
84 జన్మలు తీసుకుంటాడు అని. ఆత్మ పరమాత్మ బహు కాలం వేరుగా ఉన్నారు అని తండ్రి
చెపుతున్నారు. సద్గురువు దళారీ గా లభించి సుందర మేళ(ఆత్మలతో పరమాత్మ కలయిక)
జరిపించారు. మీరు అందరికన్నా ముందుగా అయన నుంచి దూరమై పార్ట్ వేయడానికి వచ్చారు.
అందుకే గానం చేస్తారు ఆత్మ పరమాత్మ బహు కాలం వేరుగా ఉన్నారు అని. ఇది మీ పాటే.
కాబట్టి చుడండి ఇది మీ కలయిక ఎంత సుందరమైనదో. మీరు నల్ల వాళ్ళ (వికారీ) నుంచి
సుందరం (నిర్వికారి, శుద్ధిగా, స్వచ్ఛం) గా తయారు అవుతున్నారు. అందుకే కృష్ణుడిని కూడా శ్యామ సుందరుడు అంటారు.
ఎందుకు అంటారు? అలాని కాదు అయన ఈ జన్మలో నల్ల వాడు వచ్చే జన్మలో తెల్లగా అవుతాడు
అని, కనుక రెండు శరీరాలకు శ్యామ సుందరుడు అని పేరు వచ్చింది అని కాదు. అతను ఈ
జన్మలో నే నల్ల వాడు ఈ జన్మలోనే తెల్లవాడు అవుతాడు. అందుకే మీ పేరు శ్యామ
సుందరుడు. ఒకే శరీరానికి పేరు శ్యామ సుందరుడు అని. మొదట శ్యామ తరవాత సుందర. అందుకే
మీ చిత్రాలు నల్లవి చేశారు. కామ చిత పై కూర్చుంటే గుర్తు నలుపు చూపారు. కాని
మనుషుల బుద్ధికి ఇది ఏమీ తెలియదు. ఒకరిని నలుపు ఇంకొకరిని తెలుపు అంటారు. ఇప్పుడు
మీరు తెల్లగా అవడానికి పురుషార్ధం చేస్తున్నారు. సతో ప్రధానం అవడానికి పురుషార్ధం
చేస్తేనే అవుతారు కదా. ఇందులో కష్టం ఏమి లేదు. ఇతనూ తెల్లని వాడే, తండ్రి కుర్చుని
చెపుతున్నారు, ఈ జ్ఞానం ఎవరు చెప్పలేరు, గీత వినిపిస్తారు, అది భక్తిమార్గ
పుస్తకం. ఏది ఆ గీతను కేవలం చదివి వినిపిస్తారు, కానీ దాని అసలు అర్ధం ఏమిటి అనేది
వారు చెప్పలేరు. భక్తిమర్గానికి అనేక మైన
సామాగ్రి, అనేక శాస్త్రాలు. కొంత మంది ఒకటి చదివితే ఇంకొంతమంది ఇంకోటి
చదువుతారు. రామ మందిరం లో రాముని కూడా నలుపు చేశారు, గీత లో కూడా విభు అని ఉంది.
విభు అంటే సర్వ వ్యాపి అని కాదు, ఆ అర్ధం అనేసుకున్నారు. గీత లో స్పష్టం గా ఉంది
ఎక్కడ సూర్య చంద్ర నక్షత్రాల వెలుగు ప్రసరించదో అక్కడ నేను ఉండే వాడను అని, మరి
సర్వ వ్యాపకుడు ఎలా అయ్యారు? భక్తి మార్గం కోసం ఎంతో సామాగ్రి తాయారు చేసేశారు.
రామ మందిరం లో రాముడిని కూడా నల్లగా చేసేశారు.
నల్లగా ఎందుకు చేశారు అని ఆలోచించాలి. కాళీ కలకత్తా వాలి కూడా చుడండి ఎలా
ఉందో. మా మా (అమ్మా అమ్మా) అంటూ హైరానా పడిపోతారు. అందరికన్నా నల్లగా ఆమె ఉంది.
ఎవరు? కాళీ కలకత్తా వాలి. మరియు ఎంతో భయానకం గా కూడా చూపిస్తారు. మళ్ళి ఆమెను మాతా
అని కూడా అంటారు. మాత భయానకంగా ఉంటుందా ఏమి? మీవి ఈ జ్ఞాన బాణాలు, జ్ఞాన కటారులు, వాళ్ళేమో(భక్తులు)
ఆయుధాలు చూపించేశారు. కరవాలం తో శిరస్సు ఖండిస్తారు కదా. కనుక ఇది మీది జ్ఞాన
కటారి. జ్ఞాన కటారి తో మీరు దేహఅభిమానాన్ని వేరు చేస్తారు. మరియు శిరస్సు అనే
ఆత్మను వేరు చేస్తారు. కనుక ఆ స్మృతి చిహ్నాలు అన్ని ఇచ్చారు. నిజానికి కాళి కి
బలి అయ్యేవారు. ఇప్పుడు అది బందు చేశారు. వీళ్ళను అదంఖోర్ నరభక్షకులు అనేవారు.
మనిషి మాంసం తినేవారు. మొదట్లో సింధు ప్రాంతం లో దేవి మందిరం ఉండేది కాదు,
ఎప్పుడైతే బాంబులు పేల్చారో, అప్పుడు ఓ బ్రాహ్మణుడు వచ్చాడు, కాళీ నాకు చెప్పింది
నా గుడి కట్టక పొతే, ఇంకా బాంబులు పేలతాయి అని అన్నాడు, అంటే కుప్పలు తెప్పలు గా
డబ్బులు పోగు అయ్యాయి, మరియు మందిరం తాయారు ఐపోయింది. ఇప్పుడు చుడండి ఎన్ని
మందిరాలు తాయారు అయిపోయాయో, ఎన్ని చోట్ల గుళ్ళు తాయారు అయ్యాయో, ఇప్పుడు తండ్రి ఈ
విషయాల నుంచి విడిపిస్తున్నారు, అంతేకాదు ఎవరి గ్లాని కూడా చేయరు. కేవలం నన్ను
స్మృతి చేయండి అంటారు. అంటే ఏంటి? ఈ నల్ల ఆమె, తెల్ల ఆమె ను స్మృతి చేయకండి,
ఎవరిని తలుచుకోండి కేవలం నన్ను మాత్రమే తలచండి. మామేకం స్మృతి చేయండి. కనుక తండ్రి
ఈ డ్రామా ను వివరిస్తున్నారు. ఈ సృష్టి చక్రం ఎలా తాయారు అయ్యింది అని. మీరు ఏదైతే
చుచారో అది మళ్ళి జరుగుతుంది. ఏ మన్నారు, డ్రామా తాయారు అవుతుంది, మనం స్థిరమైన
నిశ్చయ బుద్ధి వారు గా తాయారు కావాలి, మాయ మనని కదిలించ లేక పోవాలి. అప్పుడు
అమరులు అంటారు. అంతేకానీ ఇది శరీరంతో మరణించడం బతకడం అనే విషయం కాదు. తండ్రి ఈ కళ్ళతో
ఏది చూడ వద్దు అంటున్నారు. సివిల్ నేత్రం
తో చుడండి. క్రిమినల్ దృష్టి తో చూడకండి. ఈ పురాతన సృష్టిని చూడకండి. ఈ పాత
ప్రపంచం మొత్తం ఖలాస్ సమాప్తం అయిపోతుంది. మధురమైన పిల్లలు మొదట రాజ్య భాగ్యం 21
జన్మలకి తీసుకుంటాము, అక్కడ వేరే ఎవరి రాజ్యం ఉండదు. దుఃఖం నామ రూపాలే ఉండవు.
అక్కడ చాలా సుఖం గ ధనవంతులు గా ఉంటారు. ఇక్కడ ఎంత దుఃఖం ఉందో, ఆకలి చావులు
చస్తున్నారు, అక్కడ మొత్తం విశ్వం పై మీరు రాజ్యం చేస్తారు. అక్కడ చాల చిన్న
మొక్క, పూల తోట. తరవాత వృద్ధి అవుతూ అవుతూ చివరకి ఎంత పెద్దది అయిపోతుందో. మరియు
వికారాల ప్రవృత్తి వల్ల ముళ్ళ అడవి అయిపోతుంది. దీనిలో ఆది మధ్య అంతాలలో దుఃఖం పొందుతారు.
Friday, November 13, 2020
VCD-310 రిజిస్టర్ న.39, 19-8-84 ఉదయం క్లాస్. ఎవరి
స్మృతి లో కూర్చున్నారు? ఇది ప్రియాతి ప్రియమైన సంబంధం ఒక్కరితో. ఇది అన్ని
దుఖాలనుంచి విముక్తిని ఇచ్చేది. తండ్రి పిల్లలను చూస్తూ ఉంటారు, అప్పుడు పాపాలు
కట్ ఐపోతూ ఉంటాయి. ఆత్మ సతోప్రధానత వైపు పోతూ ఉంది. అంతులేని దుఖాలు ఉన్నాయి కదా.
అందుకే దుఃఖ హర్త సుఖ కర్త అని పాడతారు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని అన్ని దుఖాల
నుంచి విడిపించడానికి వచ్చారు. స్వర్గం లో దుఃఖం మచ్చుకైనా ఉండవు. అటువంటి
తండ్రిని స్మృతి చేయడం చాలా అవసరం. తండ్రికి పిల్లల పట్ల ప్రేమ ఉంటుంది. పిల్లలకు
తండ్రి మీద ప్రేమ ఉంటుంది. ఐతే మీకు తెలుసు తండ్రికి ఏ ఏ పిల్లల మీద ప్రేమ ఉంది
అని. పిల్లలకి మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోండి, దేహం అనుకోవద్దు అని బోధించారు. మీరు
కూడా పిల్లలే, సృష్టి లో అందరూ పిల్లలే, మరి ఎంత మంది వరుసవారి గా ఉన్నారు తండ్రి
దగ్గరికి వస్తారు. ఎవరైతే బాగా నడుస్తూ
తిరుగుతూ (కూడా) తండ్రిని స్మృతి చేస్తారో వారికే చెబుతున్నారు. అది కూడా ఎందుకు
చెబుతున్నారు? ఎందుకంటే మీ యొక్క పాపాల కుండ నిండి పోయి ఉంది ఈ స్మృతి యాత్ర
ద్వారానే మీరు పాపాత్మ నుంచి పుణ్యాత్మ అవుతారు, ఆత్మ పుణ్యాత్మ అవుతుంది. ఇది
పురాతన శరీరం అని కూడా మీకు తెలుసు. దుఃఖం అత్మకే ఉంటుంది. దుఃఖం పేరు
చెపుతున్నారు అంటే దుఃఖ ధామం లో ఉన్నాము అని, సుఖ ధామం లో కష్టం కొంచం కూడా ఉండదు.
ఇప్పుడు చాలా తక్కువ సమయం ఉంది కనుక తండ్రిని తలుచుకునే పూర్తి పురుషార్ధం చేయాలి. ఎంత స్మృతి లో ఉంటారో అంత
సత్వ ప్రధానం గా అవుతారు. పురుషార్ధం చేసి ఎటువంటి స్థితి తయారు చేసుకోవాలి అంటే
అంతిమ సమయం లో తండ్రి తప్ప ఇంకెవరూ గుర్తుకు రాకూడదు. ఒక గీతం కూడా ఉంది “అంత కాల్
జో స్త్రీ సిమిరే” అంటే అంతిమ సమయం లో ఎవరు స్త్రీ ని తలుచుకుంటారో” అని ఇది అంతిమ
సమయం కదా. పురాతన లోకం దుఃఖ ధామం యొక్క అంతం, ఇప్పుడు పిల్లలు మీరు సుఖ ధామం కోసం
పురుషార్ధం చేస్తారు. మీరు శూద్రుల నుంచి బ్రాహ్మణులు అవుతారు. మనుషులు అందరూ
శూద్రులు, ఇప్పుడు మీరంతా బ్రాహ్మణులు అయ్యారు. ఇది గుర్తు ఉండాలి కదా. శూద్రులకు దుఃఖం ఉంది, ఇప్పుడు మీరు దుఃఖం
నుంచి బయట పడి మళ్ళి శిఖరానికి ఎక్కారు, కనుక ఈ తండ్రిని తలుచుకోవాలి. మోస్ట్
బిలవేడ్ తండ్రి ఈయన కన్న ఉన్నత మైన మధురమైన వస్తువు ఏది లేదు ఈ లోకం లో. ఆత్మ ఆ
పరమ పిత పరమాత్మనే తలుచుకుంటుంది కదా. అందరు అత్మలకూ అయన తండ్రి. అయన కన్నా
మదురమైన వారు వేరే ఎవరూ ఉండలేరు. ఇంత మంది
అనేక మైన పిల్లలు గురుకు వస్తూ ఉంటారు , ఈ సృష్టి అంతా ఎలా తిరుగుతుందో అంతా అర్ధ
సహితం గా ఉంది. ఎవరైనా ఏదైనా డ్రామా చూసి వస్తుంటే డ్రామా గుర్తుందా అని అడిగితె
అప్పుడు డ్రామా అంతా బుడ్డిలోకి వచ్చేస్తుంది. మొదటి నుంచి చివరి వరకు, ఐతే వర్ణన
చేసి చెప్పడానికి టైం పడుతుంది. బాబా అనంత మైన తండ్రి. తండ్రి గుర్తుకు వస్తూనే 21
జన్మల సుఖ ప్రాప్తి గుర్తుకు వస్తుంది. సెకెండు లో తండ్రి నుంచి ఈ వారసత్వం
వస్తుంది. సత్యయుగ త్రేతా యుగాలు దృష్టి లోకి వస్తాయి. పిల్లాడు పుట్టాడు అనగానే
తండ్రి కి తెలిసి పోతుంది వారసుడు వచ్చాడు అని. మొత్తం ఆస్తి అంతా గుర్తుకు
వచ్చేస్తుంది. అలాగే మీరు కూడా రక రకాల పిల్లలు రక రకాల వారసత్వం లభిస్తుంది.
(ఎందుకంటే) రక రకాలుగా స్మృతి చేస్తారు. ఒకే లాంటి స్మృతి ఐతే లేదు. అనంత మైన
తండ్రి కి వారసులు. సత్యయుగం లో ఒకే వారసుడు ఉంటాడు. మొత్తం ఆస్తికి ఒక్కడే కొడుకు
వారసుడు . అనంత మైన తండ్రి లభించారు, అనంత మైన వారసత్వం లభించింది సెకెండు లో
ఏమాత్రం ఆలస్యం లేదు, మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోండి, మేల్ లేదా ఫిమేల్ అనుకోవద్దు.
ఆత్మ అంటే అబ్బాయి కదా. పిల్లలు అంటారు
మాకు అంతా గుర్తుకు వచ్చింది అని ఆత్మలు అందరూ భాయి భాయి అని ఎవరు వచ్చినా
చెపుతారు అన్ని ధర్మాల వారు భాయి భాయి అని. కానీ ఎలా భాయి భాయి అయ్యారో వారికి అర్ధం
కాదు. ఇప్పుడు మీకు తెలుసు మనం బాబా కి మోస్ట్ బిలవేడ్ పిల్లలం అని. ఎందుకంటే
ప్రాక్టికల్ గ బాబా ఉన్నారు. ప్రాక్టికల్ అంటే శరీరం తో తండ్రి నుంచి పూర్తి అనంత
మైన వారసత్వం తీసుకుంటాం. ఐతే ఎలా తీసుకుంటారు? అది కూడా మీకు పిల్లలకు సెకెండ్ లో
గుర్తుకు వస్తుంది. మనం సతో ప్రధానం గా ఉండేవాళ్ళం తమో ప్రధానం అయిపోయాం, ఇప్పుడు
మళ్ళి సత్వ ప్రధానం గా అవ్వాలి, మీకు తెలుసు మనం బాబా నుంచి సుఖం అనే వారసత్వం
తీసుకోవాలి. తండ్రి మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోండి అని చెపుతున్నారు. దేహం వినాశి
ఆత్మ శరీరం విదిచి వెళ్లి పోతుంది తిరిగి వెళ్లి గర్భం లో వేరే శరీరం
తీసుకుంటుంది, తోలుబొమ్మ తాయారు అయినప్పుడు ఆత్మ అందులో ప్రవేశిస్తుంది. లోక
ఉదాహరణ ఎందుకు ఇచ్చారు? కాని ఆ ఏ తోలు బొమ్మ తాయారు అవుతుందో ఆత్మ ప్రవేశిస్తుందో
అది రావణాసురుని వశం లో ఉంది కనుకనే వికారాల వశం అయి రావణ జైలు లో కి వెళుతోంది .
మరప్పుడు సత్య యుగం లో నైతే రావణుడు ఉండనే ఉండడు. తోలు బొమ్మలు అక్కడ కూడా తాయారు
అవుతాయి, దుఃఖ విషయమే లేదు, ముసలితనం వచ్చాక తెలుస్తుంది ఇప్పుడు మనం ఈ శరీరం
విడిచి వెళ్లి తల్లి గర్భం లో ప్రవేశిస్తాము అని, అక్కడ భయం అనేదే ఉండదు. ఇక్కడ
చుడండి ఎంత భయపడ తారో. అక్కడ నిర్భయం గా ఉంటారు. తండ్రి మిమ్మల్ని అపార సుఖాలలోకి
తీసుకు వెళతారు. సత్య యుగం లో అపార సుఖాలు ఉన్నాయి, కలియుగం లో అపార దుఖాలు
ఉన్నాయి. అందుకే దీనిని దుఃఖ ధామం అంటారు. తండ్రి ఐతే ఏమాత్రం కష్టం ఇవ్వరు.
గృహస్త వ్యవహారం లో ఉంటే ఉందండి, పిల్లల్ని చూసుకోండి, కేవలం తండ్రిని తలుచుకోండి.
ఈ గురువులు గోసాయి లను అందరిని విడవండి. నేను అందరు గురువులకన్న పెద్ద గురువును
కదా. నేను తప్ప మరెవరు పతిత పావనులు లేరు. బ్రహ్మ విష్ణు శంకరులను పతిత పావనులు
అంటారా? లేదు. దేవతలను కూడా అనలేము. నేను తప్ప. ఎందుకు అనలేము. ఎందుకంటే బ్రహ్మ
విష్ణు శంకరులకు కూడా సుక్ష్మ శరీరం ఉంది. పతితులను పావనం చేయడానికి ఈ సృష్టి పైకి
రావాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు (పిల్లలు) గంగను పతిత పావని అంటారా? అనరు. గంగను
కూడా అనరు, దేవతలను కూడా అనరు నన్ను తప్ప. ఈ నీళ్ళ నదులు సదా ఉండనే ఉన్నాయి, ఈ గంగా బ్రహ్మ పుత్ర ఎప్పటి నుంచో వస్తూనే
ఉన్నాయి. వీటిల్లో స్నానాలు చేస్తూనే ఉన్నారు. వానలు పడితే వరదలు వస్తాయి. ఇది
కూడా దుఃఖం ఐపోయింది. అంతులేని దుఃఖం.
Thursday, November 12, 2020
Sunday, November 8, 2020
Wednesday, November 4, 2020
Tuesday, November 3, 2020
Saturday, October 31, 2020
Friday, October 30, 2020
ACD 364
ACD- 364
మట్టిలో పాతిపెడతారు. ఈ దేహాన్ని మట్టి అంటారు అనగా ఎన్నైతే వేరే ధర్మాలు ఉన్నాయో, భారత్ ను విడిచి భారత దేశం సనాతన దేవీ దేవతా ధర్మం పరంపర వదిలి పెట్టి, వారు అందరూ దేహ అభిమానం అనే మట్టి లో కప్ప బడతారు, పాతిపెడతారు . పూర్తిగా దేహాభిమానం విడువ లేరు, ఎందుకంటే మట్టి సాంగత్యం అనుకుంటారు ఒక్క భారతీయ పరంపర ఎటువంటిదంటే దానిలో యోగాగ్ని లో తపింపచేస్తారు. మరియు దేహాభిమానం మొత్తం కాలిపోతుంది. కాలిన తరువాత ఏమి మిగులుతుంది. బూడిద మిగులు తుంది. ఎముకలు కూడా బూడిద అయిపోతాయి. దానిని కూడా తీసుకు వెళ్లి నది లో లేక తీర్థం లో తీసుకు వెళ్లి అర్పణ చేసేస్తారు. దానిని పూలు అంటారు. అనగా ఆత్మ యోగాగ్నిలో తన అన్ని పాప కర్మలూ భస్మం చేసేసిన తరువాత దుఃఖ దాయి ముళ్ళు నుంచి ఏమౌతుంది, చైతన్య పువ్వు అయిపోతుంది. కనుక భారతీయ పరంపరలో ఇప్పటికీ కూడా ఈ క్రియా కర్మల మహిమ ఉంది, ఈ సంస్కారాలు క్రియా కర్మల రూపం లో జరుపుతూ వస్తారు, శరీరం విడిచిన తరువాత దేహాన్ని కాల్చిన తరువాత 4 వ రోజు వరకు ఆ బూడిదను తీసుకు వెళ్లి నదిలో కలిపేస్తారు. అనగా ఎన్ని ఐతే కర్మ కాండలు ఉన్నాయో, జన్మించిన దగ్గర నుంచి మృత్యు పర్యంతం వరకు భారతీయ పరంపరలో మహిమ ఉంది. కాని విదేశీయులు ఏమి అనుకుంటారు అంటే ఇది అంధ శ్రద్ధ అంధ విశ్వాసం అని , కానీ దీని అసలు అర్ధం తెలియదు. వాస్తవానికి భగవంతుడు ఈ సృష్టి పైకి వచ్చినప్పుడు సత్యమైన కర్మకాండలు చేయడం మనకు నేర్పిస్తారు. ఆ కర్మకాండ ల యొక్క రహస్యం చెపుతారు. ఈ కర్మ కాండలు అసలు రీతి లో గుర్తులు ఏ సమయానివి అని, ఇప్పటివి అనగా కలియుగం అంతిమ సమయం లోవి. ఎప్పుడు పరమపిత తండ్రి వస్తారో, కలియుగి తమో ప్రధాన దుఃఖ దాయి మనుష్య సృష్టిని సుఖ దాయి సత్య యుగం లాగా పరివర్తన చేయడానికి, అప్పుడు సమస్త సృష్టి కి కొత్త సంస్కారం అవుతుంది. అక్కడ శరీరం కాలుస్తారు, మరి ఇక్కడ భగవంతుడు తండ్రి వచ్చి దేహ అభిమానాన్ని కాలుస్తారు. ఆత్మిక స్థితి లో స్థితు లవడం నేర్పిస్తారు. ఈ ఆత్మ భానం లో స్థితులు అవ్వడం ఇదే వాస్తవానికి దేహాభిమానాన్ని కాల్చడం. ఆత్మ యోక్క స్మృతి, తోడుగా పరమాత్మస్వరూపం యొక్క స్మృతి కూడా, ఈ ఆత్మ స్వరూపాన్ని ప్రజ్వలితం చేయడం మరియు పరమాత్మ తండ్రి తో దాని కలయిక చేయించడం దీనిలోనే అన్ని సమస్యలకూ సమాధానం దాగి ఉంది. 5 వికారాలు వచ్చేదే దేహాభిమానం వల్ల. కామ, క్రోధ, లోభ మోహ, అహంకారాలు, ఇవే దుఃఖ కారాణాలు ఇవ్వి దేహాభిమానం లో ఇమిడి ఉన్నాయి. వీటిని నష్టం చేయడానికి పరమాత్మ మూల మంత్రం చెపుతున్నారు. మనని మనం ఆత్మ అనుకుంటూ, బిందు, బిందు ఆత్మలకు తండ్రి సుప్రీం సోల్ జ్యోతి బిందు శివ ఉన్నారో , అయన పెద్ద రూపం శివ లింగం తాయారు చేశారో, ఆ జ్యోతిర్లింగాన్ని తలుచుకో. బిందువు,(బొట్టు) లేదా తిలకం భ్రుకుటి కి మధ్యలో పెట్టుకునే విషయం కాదు, గీతా శ్లోకం లో చెప్పినట్లు మనిషి అంతిమ సమయం లో ప్రాణం వదిలేటప్పుడు ఆ సమయం లో అతను ఏమి చేయాలి? భ్రువోర్మధ్యే ప్రాణ మావేశ్య సమ్యక్ భ్రుకుటి మధ్యలో ప్రాణము ను సమ్యక్ రూపం తో ధ్యానం చేయాలి, ఎందుకంటే దేని వాసం (నివాసం) ఎక్కడ ఉందో ఏది దాని ఇల్లో అది అక్కడ తొందరగా లభిస్తుంది. కనుక ఈ ప్రాక్టీసు చాలా సులువు, సహజం. శరీరం విడిచే టైం కి ఈ ప్రాక్టిస్ చేయలేము, మొదటి నుంచి చేయాలి, ఈ మనసు ఏకాగ్రం చేసే విధి , ఎందుకంటే మనసు బుద్ధి నే ఆత్మ అంటారు, మనిషి శరీరం విడిచి నప్పుడు మనసు బుద్ధి ఇక్కడ ఉండిపోయింది ఆత్మ వెళ్లి పోయింది అని అనరు, లేదు అన్ని కర్మేంద్రియాలూ ఉన్నాయి శరీరం లోనే ఉన్నాయి కానీ ఏది వెళ్లి పోయింది? ఏ శక్తి వెళ్లి పోయింది మనసు బుద్ధి దేనిలో నైతే అన్ని సంస్కారాలు ఇమిడి ఉన్నాయో 63 జన్మల మంచి మరి చెడు (సంస్కారాలు) ఆ మనసు బుద్ధి రూపి ఆత్మ వెళ్లి పోయింది. ఆ కళ్ళ జ్యోతి ఏ భ్రుకుటి మధ్యలో ఉంటుందో అది వెళ్లి పోయింది. కళ్ళు బటన్ లాగా అయిపోతాయి. ఎలాగంటే వాటిలో వెలుగే లేదు అన్నట్లు. ఆ వెలుగు వెళ్లి పోయింది. ఆ వెలుగే మనసు బుద్ధి రూపి ఆత్మ. దాని యొక్క కాన్సంట్రేషన్ యోక్క్ అభ్యాసం ముందు నుంచి చేయాల్సి ఉంటుంది. ఎవరికైతే ఈ అభ్యాసం పటిష్టం గా అయిపోతుందో రాబోయే చంపుకునే లోకం లో (కొట్లాటల లోకం) ఇప్పటికి నిరంతరం గా టెన్షన్ పెరుగుతూనే వస్తున్నది. ఆ టెన్షన్ లో మన అటెన్షన్ పెంచుకోవడానికి పరమాత్మ తండ్రి వచ్చి ఈ పధ్ధతి చెపుతున్నారు ఏమని ఆత్మిక స్థితి లో స్థితులై ఉండండి అని. దీని వల్ల అఖండ శాంతి లభిస్తుంది అని. అఖండ విశ్వాసం కలుగుతుంది. విల్ పవర్ వస్తుంది, స్థితులు, పరిస్థితులు, సమస్యలు, ఎదుర్కునే శక్తి లభిస్తుంది. కాన్సంట్రేషన్ వల్ల ఎంత శక్తి కలుగుతుందంటే , మొత్తం లోకం ఒక వైపు అయినా, మరియు ఒక్క ఆత్మ ఆత్మిక స్థితి లో స్తితుడైన వాడు అయన యొక్క మహిమ గీత లో వర్ణించ బడింది స్వరూప నిష్టుడు అని ,అతను ఒక వైపు అయిపోతాడు, మొత్తం లోకాన్ని ఎదుర్కునే శక్తి అతనిలో జనిస్తుంది. కానీ ఎలా ? అర్జునుడు భగవంతుని తో అడిగాడు, భగవాన్ ఈ మనసు కంట్రోల్ లో రావట్లేదు ఈ మనసు ఎలాంటి గుర్రం అంటే దీనిని కళ్ళెం తో నియంత్రితం చేయలేము, భగవంతుడు అన్నాడు, దానికోసం రెండు పద్ధతులు-“ అభ్యసేనతు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే”....మళ్ళి మళ్ళి ఆత్మిక స్థితి అభ్యాసం చేయి, అనేక జన్మలు తీసుకున్నావు, అనేక ఆత్మల సాంగత్యం చేశావు, వారితో కలిసి అనేక రకాల కర్మలు చేశావు, రంగులో రంగరించుకున్నారు, ఆ విషయాలు గుర్తుకు ఐతే వస్తాయి, రక రకాల పురుషులూ , రక రకాల వాయుమండలం, (వాతావరణం) రక రకాల సీన్ సీనరీలు, స్వప్నం లో కూడా వస్తాయి, సంకల్పం లో కూడా వస్తాయి, కానీ ఏమి చేయాలి? వాటి అన్నింటినించి బుద్ధి యోగం తొలగించి ఆత్మిక స్థితి లో స్థితులు అవ్వాలి. నేను జ్యోతి బిందు (నక్షత్ర) సితార ఆత్మ ను. పరమాత్మకి తండ్రి పిల్లవాడిని. మాటి మాటికి అభ్యాసం చేయడం వల్ల అంతం లో మనసు బుద్ధి రూపి ఆత్మ ఏకాగ్రం స్థితం అవుతుంది. మరి మనసు బుద్ధి ఏకాగ్రం అవడం వల్ల పరమాత్మ తండ్రిని త్వరగా గుర్తించ గలుగు తుంది. రెండవ పధ్ధతి వైరాగ్యే ణ చ గృహ్యతే ....ఎప్పటి వరకు ఈ దేహము, దేహ సంబంధీకుల నుంచి పూర్తి వైరాగ్యం కలగదో అప్పటి వరకు ఆత్మ కు స్థిర భావాన్ని పట్టుకో లేదు. మరి ఈ విషయం శక్తి రామ్ శర్మ లో అందరూ అనుభవం చేశారు ఏమని అంటే శరీరం విడిచే కొన్ని రోజుల ముందు నుంచి ఆ ఆత్మ అంటూ వచ్చింది ఇప్పుడు నా బుద్ధి ఎక్కడికి వెళ్ళడం లేదు అని, నేను మరియు నా పరమ పిత పరమాత్మ శివ , ఎవరి పైన ఏ ఆసక్తి లేదు. కనుక అటువంటి ఆత్మ శరీరం విడిచి నప్పుడు అంత మతే సో గతి అవుతుందా కాదా? తప్ప కుండా అవుతుంది. అంత మతే మతే అనగా బుద్ధి, అంతిమ సమయం లో బుద్ధి ఎక్కడకి వెళ్తుందో అక్కడికే దాని గతి అవుతుంది. అనగా ఈ సృష్టిలో ఎక్కడైనా కాని కలియుగం అంతం లో అటమిక్ ఎనర్జీ తాయారు అయి ఉందో ఈ సృష్టి ని సమాప్తం చేయడానికి, మరియు కొత్త సృష్టిని తయారు చేయడానికి పరమాత్మ తండ్రి ఈ సృష్టి పైకి వచ్చేశారో, ఆ పరమాత్మ తండ్రి వద్దకు ఆ అమాయకపు ఆత్మ తప్పకుండా చేరుతుంది. ఎందుకంటే అంత మతే సో గతి. ఏ దేహ దారి పైనా ఎటువంటి మోహము లేదు, అప్పుడు ఆత్మకు గతి ఎక్కడకు వెళ్తుంది? ఎక్కడ మోహం ఉందో ఎక్కడ ఎటాచమెంట్ ఉందో అక్కడికే వెళ్తుంది. మరియు ఎక్కడికి వెళ్తుందో, ఎవరి దగ్గరికి వెళ్తుందో .....అతని కార్యం లో నే సహయోగి అవుతుంది. శరీర కర్మ భోగం అది ప్రతివ్వరికి అనుభవించక తప్పదు. చాలా కఠిన మైన కర్మ భోగం అనుభవించాల్సి ఉంటుంది. ఎందుకంటే అనేక జన్మలు తీసుకున్నారు. వాటి లెక్కాచారం తీర్చుకోవాల్సే ఉంటుంది. లెక్కాచారం తీరిపోయాక అలాకాదు ఈ జన్మలో జబ్బులు వచ్చే జన్మలో వెళ్ళే తీరాలి అని కాదు, ఒకవేళ ఆ వికర్మలు భస్మం అయ్యాయి అంటే ఆ లెక్కాచారం కూడా భస్మం అయిపోతుంది. ఆత్మకు శరీరం కూడా అటువంటిది లభిస్తుంది, ఏ ఆరోగ్య కర శరీరం తో ఆరోగ్య కర రూపం లో ఉండి ఆ ఆత్మ పురుషార్ధం చేయగలదు. పురుష అర్ధం అనగా పురుషార్ధం, పురీమ్ శేతే....పురీ అనగా నగరి మరియు శేతే అనగా శయనించే, ఈ శరీరమే పురము, మరియు ఇందులో ఆత్మ విశ్రమించేది. సుఖ శాంతులలో విశ్రమించేది. అదే జీవితం. ఒక వేళ ఆత్మ ఈ శరీరం లో ఉంటూ దుఃఖము అశాంతి భోగిస్తే కనుక దానిని విశ్రమించడం అనరు. ఇప్పుడు పరమాత్మ తండ్రి అదే సృష్టి స్థాపన చేయడానికి వచ్చారు, సత్య త్రేతా యుగాల రామ కృష్ణుల ఆ సృష్టి దానిలో సుఖం ఉంటుంది దుఃఖం ఉండదు. కానీ దానికోసం అంత మతే సో గతే ఆ ప్రాక్టీసు ఇప్పటి నుంచే చేయాలి. మనం మన మెంటాలిటీ ఆ విధం గా తయారు చేసుకోవాలి ఎవరైనా మనకి ఎటువంటి మాట అయినా చెప్పనీ, మనం డిస్టర్బ్ అవ్వ కూడదు. అదే గీత లో చెప్పారు యస్మాన్ నో ద్విజతే లోకో, లోకాన్ నో ద్విజతే చ యః, ఉద్వేగాన్ని పొందకూడదు. అనగా ఎవరి ద్వారా నైనా ఉద్వేగాన్ని పొందరో అశాంతి పొందరో, మరి ఎవరికీ కూడా అశాంతి ఇవ్వరో అతనే స్వరూప నిష్ఠుడు. అశాంతి ఇస్తే స్వయం కూడా అశాంతి పొందుతాడు. ఇతరులకు సుఖ శాంతులు ఇవ్వడానికి నిమిత్తం అవుతాడో స్వయం కూడా సుఖ శాంతులలో రమణి, ఆనందిస్తాడు స్తాడు. కనుక అటువంటి స్థితి ఎలా తాయారు చేసుకోవాలి? ఈ ఆత్మిక స్థితి ఏ ఉపాయము. దీని అభ్యాసం చేయాలి. ఈ ఉపాయాన్ని పొందడం ద్వారా ఆత్మ యొక్క అటువంటి స్థితి తయారు అవుతుంది ఎలా అంటే ఎవరైనా మన గురించి విరోధం గా చెపుతున్నాడు, మనం వింటూ కూడా వినం. ఒక చెవితో విన్నాడు మరొక చెవితో విడిచి పెట్టాడు. అంటే ఎలాగంటే ఎవరైనా మనకు దుఃఖం ఇవ్వాలి అనుకున్నా కానీ మనం ఆ దుఖాన్ని ఇచ్చినా తీసుకోము. ఎవరైనా మనను వేడి వేడి కళ్ళతో చూస్తాడు, మనం అతని భావాన్ని గుర్తించాము (పరిశీలించాము) ఇతను ఇలా ఎందుకు చూస్తున్నాడు. ఇది పూర్వ జన్మలో మన ఏ లెక్కాచారం ఉంది అది తీసుకుంటున్నాడు. కనుక ప్రతిఫలం గా మనం మన కళ్ళు వేడి (కోపం)చేయం. మన లెక్కాచారం పూర్తి అయిపోతుంది. అతని లెక్కాచారం కూడా పూర్తి అయిపోతుంది. అటువంటి భావం పెట్టుకోవాల్సి వస్తుంది. చెడు వినద్దు, చెడు చూడవద్దు, చెడు చెప్పవద్దు, మరైతే ఇప్పుడైతే ఎటువంటి స్టేజి ఉండాలి అంటే చెడు ఆలోచించ వద్దు అని. ప్రతీ ఆత్మ కోసం శుభ సంకల్పం చేయాలి. ఎందుకంటే ముందు మనసులో సంకల్పం లో విషయం వస్తుంది, తరవాత వాచా లో వస్తుంది, తరవాత కర్మణా లో వస్తుంది. మనసులో వస్తే ఏమీ వికర్మ కాదు, పాపం తాయారు కాదు కాని వాచా లో లేదా కర్మేన్ద్రియాలలో ఒకవేళ అటువంటి విషయం వస్తే దేని ద్వారా ఇతరులకు దుఃఖం కలుగుతుందో దాని ద్వారా పాపం అయిపోతుంది. దాని నుంచి రక్షించ బడాలి అంటే కేవలం ఒకే ఓక పెద్ద ఉపాయం షార్ట్ కట్ మార్గం నిస్సంకల్పి స్టేజ్ నేను ఆత్మ జ్యోతి బిందు నేను ఆత్మ స్టార్. ఈ స్టార్ యొక్క వెలుగు ఈ కళ్ళ ద్వారా వస్తున్నది. ఈ స్థితి లో స్థిరం అయిపోవాలి. మనం ఎంత మంచి లో మంచి ఆలోచించినా, కానీ మన పూర్వ జన్మ లేక్కాచారాలు చెడుగా ఉంటే మంచి లో మంచి ఆలోచించినా కూడా మనకు ప్రతిఫలం గా శ్రేష్టత లభించదు ఎప్పటివరకు పూర్వ జన్మ లెక్కాచారం పూర్తి కాదో అప్పటి వరకు. ఎంత మనం చెడు లో చెడు ఆలోచించినా మనం ఎవరి అకల్యాణం కోరుకుంటామో ఒకవేళ అతని పుణ్య కర్మ ఉంటే కనుక మనం ఎంత ఆలోచించినా కూడా అతని అకల్యాణం కాదు. అంటే కేవలం మనం చేసే కర్మ పైనే లేదు, అందుకనే అంటారు తాయారు చేసే ఉంది తయారు అవుతున్నాది, ఇకపై తాయారు అయ్యేది ఏమి లేదు అని. ఎవరైనా జీవితాంతం కల్యాణం కోరుకుంటారు మరి ఆ వ్యకి ప్రతిఫలం గా అతనిపై విరుద్ధం గానే చెపుతాడు మొత్తం జీవితం అంతా అప్పుడు అది పూర్వ జన్మ లెక్కాచారం అనక పొతే ఏమి అనాలి? అందుకే ఎప్పుడు అలజడి లోకి రాకూడదు. ప్రతి అతి కి అంతం ఉంటుంది. ఏ రకమైన అతి అయినా. ఆ అతి అంత మవడానికే గుర్తు. ఇప్పుడు మెంటల్ టెన్షన్ రోజు రోజుకీ పెరుగుతోంది. అంతులేని ధన సంపత్తి సంపాదించి పెట్టుకున్నారు, ఆరోగ్యం కోసం అనేక మైన మందులు పెట్టి ఉన్నాయి, చాలా పొడవు సంబంధాలు కుటుంబం లో పెట్టుకున్నారు. సంబంధాలు సుఖం ఇవ్వడానికే, పుచ్చుకోవదానికే పెట్టుకుంటారు. ఐతే ఈ రోజు సంబంధాల పైన మనుషుల విశ్వాసాలు తొలగి పోతున్నాయి. దాని ఫలితం గానే చిన్న చిన్న కుటుంబాలు అయిపోతున్నాయి. ముందు అసంఖ్యం గ పెద్ద పెద్ద కుటుంబాలు ఉండేవి, ఒక్కో కుటుంబం లో వందేసి మంది ఉండేవారు, ఒకే పొయ్యి మీద వంట జరిగేది. ఇప్పుడు కూడా అటువంటి కుటుంబాలు ఉన్నాయి, కానీ ప్రాయః లోపం ఐపోయాయి. ఎలా అంటే గీత లో చెప్పారు. ఈ దేవి దేవతా ధర్మం ప్రాయః లోపం ఐపోయింది అని. పూర్తిగా లోపం అయ్యింది అని కాదు ఇప్పటికి భారత దేశం లో అక్కడక్కడా అటువంటి అరుదైన కుటుంబాలు ఉన్నాయి. ఒకే యజమాని, అనేక మంది కుమారులు, కుమార్తెలు మనుమలు ముని మనుమలు వారి కోడళ్ళు మరి ఎవరికీ కూడా ఆ ధైర్యం ఉండదు ఆ యజమాని కి ఎదురు నిలిచి వెళ్ళడానికి. ఒకే ధర్మం, ఒకే భాష, ఒకే మతం(మాట) పై ఒకే కులం ఎటువంటి ప్రకార మైన ఏ వ్యభిచారము ఉండే వీలు లేదు, ఒకరిద్దరిలో అనైతిక సంబంధం ఉండే అవకాశం లేదు, ఎంత సుఖ శాంతి తో ఉండేది, పవిత్రత ద్వారానే యునిటి తాయారు అవుతుంది. మరి ప్యురిటి ఎప్పుడు వస్తుంది, ప్యురిటి వచ్చేదే కాన్సెంట్రేషన్ ద్వారా, లోకంలో పెద్ద పెద్ద శరీర బలం వాళ్ళు కుర్చుని ఉన్నారు, వాళ్ళ శరీరం ఎంతో ఆరోగ్యం గా ఉంది, వస్తాదులకే వస్తాదు. శరీర బలం ఉంది. పెద్ద పెద్ద ధనవంతులు కుర్చుని ఉన్నారు, చాలా సంపన్నులు, మల్టి మిలియనేర్లు, ధన బలం అతి గా ఉన్న వాళ్ళు, మరియు జన బలం వాళ్ళ పెద్ద పెద్ద కుటుంబం వాళ్ళు, పెద్ద పెద్ద సంబంధీకులు పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న వాళ్ళు, ఎంతో మంది పెద్ద రద్దీ, జనాలు వాళ్ళను ఒప్పుకునే వాళ్ళు. అనగా జన బలం కూడా చాలా విస్తారం గా వ్యాపించి ఉంది.తనువు బలం ఉంది, ధన బలం ఉంది, జన బలం కూడా ఉంది. అన్నీ ఉన్నా కూడా ఇంకా చాలా దుఖితులు గ ఉన్నారు, అశాంతిగా ఉన్నారు, ఎందుకు, ఎందుకంటే మనో బలం అన్నిటికన్నా పెద్ద విషయం ఆత్మ శక్తి అది విక్షీణం అయిపోయింది. ఈ రోజు మనిషి బ్యాంకు లో డబ్బు దాస్తున్నాడు, దాని రాశులు తాయారు చేస్తున్నాడు, పోగు చేస్తున్నాడు, తనువు బలం కుడగట్టుకుంటున్నాడు. మరియు జన బలం తయారు చేసుకుంటున్నాడు. కానీ మనో బలం కోసం ఏ ప్రయాసా చేయడం లేదు. మనో బలం ఎలా ఉంది? ఉదయం నుంచి సాయంత్రం వరకు మనసు నాలుగు వైపులా తిరుగుతూ నే ఉంటుంది. ఎప్పుడైతే ఉదయం నుంచి సాయంత్రం వరకు మనసు తిరుగుతూ ఉంటే రాత్రి పడుకున్నప్పుడు కూడా, మనసు స్వప్నం లో మనసు బుద్ధి నాలుగు వైపులా తిరుగుతూ ఉంటుంది. 24 ఘంటలూ మనసు చెల్లా చెదరు అయిపోతుంటే రిజల్ట్ ఏమి వస్తుంది. మనో బలం క్షీణం అయిపోతుందా, ఆత్మిక బలం క్షీణం అయిపోతుందా విల్ పవర్ తగ్గుతుందా లేక పెరుగుతుందా? తగ్గుతుంది. ఒకవేళ విల్ పవర్ తగ్గి పొతే ఎంత తనువు బలం ఉన్నా, జన బలం ఉన్నా ఎంత ధన బలం ఉన్నా కూడా అంతా వ్యర్ధం. ఎవరి దగ్గరైనా మనో బలం ఉంటే బాబర్ వద్ద మనో బలం ఉండేది. విక్టోరియ యొక్క మంత్రి వద్ద మనో బలం ఉండేది అతను మహారాణి విక్టోరియా మంత్రి అయి కూర్చున్నాడు. బాబర్ సిపాయి నుంచి ఎదిగి ఏమి అయ్యాడు, భారత దేశపు సామ్రాట్ అయ్యి కూర్చున్నాడు. కనుక ఒక వేళ మనో బలం కూడగట్టుకుంటే అప్పుడు అన్ని కుడగట్టుకోవచ్చు. ఒక వేళ మనస్సు పవర్ క్షీణం చేసుకుంటే ఎంత మనం సమయం వెచ్చించినా, తనువు బలం, జన బలం, ధన బలం చేర్చుకోవడానికి అంతా వ్యర్ధం అయిపోతుంది. చివరలో ఏమి రిజల్ట్ వస్తుందంటే హార్ట్ ఫెల్ అయిపోయింది. యోగులైన వారు, స్వరూప నిష్టులైన వారు, ఆత్మిక స్థితి లో స్థితులు అవడానికి ప్రయత్నం చేస్తారో, వాళ్ళకు ఎప్పుడూ హార్ట్ ఫెల్ కాజాలదు. వారి హార్ట్ చాల పటిష్టం గ అవుతుంది. ఎందుకంటే శ్వాస ప్రస్వాస ప్రక్రియ చాలా నెమ్మదిగా అవుతుంది. ఏకాగ్రత వల్ల. అటమిక్ విస్ఫోటనం కూడా జరుగుతుంది, ఎందుకంటే గత 50, 60 ఏళ్ళల్లో వీటిని కనిపెట్టారు, అంతకన్నా ముందు ఆవిష్కరించలేదు. కొత్త లోకం తయారు చేసే ఆయన ఈ సృష్టి పైకి వచ్చేస్తారు, అప్పుడు పాత ప్రపంచం వినాశనం చేసే సామాను తయారు చేసే వారు కూడా తాయారు అవుతారు. ఈ స్థాపన మరియు ఈ వినాశనం ఈ రెండూ తోడు తోడు గా నడుస్తాయి. కొత్త కూటమి యొక్క అటువంటి కూటమి దానిలో ధర్మ సత్తా, రాజ్య సత్తా ఒక్కరి చేతిలో ఉంటుంది. ఏక ధర్మం, ఏక రాజ్యం ఏక భాష , ఏక మతం ఏక కులం సుఖ శాంతి ఉంటుందా ఉండదా, తప్పకుండా సుఖ శాంతి సృష్టి తాయారు అవుతుంది. ఇప్పుడు భారత దేశం లో పరిస్థితి ఏమిటి? భారత్ లో చిన్న దేశం లో ఎన్ని భాషలు వృద్ధి చెందుతున్నాయో, మరియు ఆ భాషలను తీసుకుని ఎన్ని జగడాలు వ్యాపిస్తున్నాయో, అన్ని వేరే ఏ దేశం లోను వ్యాపించలేదు, రాష్ట్రవాదం, చిన్న దేశం లో ఉన్నన్ని రాష్ట్ర వాద జగడాలు జరుగుతున్నాయో, అన్ని మరే దేశం లోనూ లేవు, ధర్మం ఈ భారత దేశం లోనే ఎన్ని ప్రపంచం లోని అన్ని ధర్మాలూ దూరి కూర్చున్నాయి. ఒక భారత దేశ రాజధాని డిల్లి ఏ అటువంటి నగరం ప్రపంచం లో దీని లో ఎక్కువ లో ఎక్కువ పెర్సెంటేజ్ లో లోకం లోని అన్ని ధర్మాల వారు దూరి కూర్చున్నారు. వారి వారి ఆధిపత్యం చేసి కూర్చున్నాయి. ధర్మం ఆధారం పై అశాంతి వ్యపిస్తుందా, లేక శాంతి వ్యపిస్తుందా, ప్రతి వారూ తమ తమ ధారణలు స్థాపన చేయాలని కోరుతున్నారు, ధర్మం అనగా ధారణ, అప్పుడు ఆ ధారణలు ఎంత సత్యం, ఎంత అసత్యం అది పరమాత్మే ఈ సృష్టిలో ప్రత్యక్షం అయినప్పుడు అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఉన్నతోన్నతుడు అయిన తండ్రి ఎవరు? ఆయనకు మొత్తం సృష్టి నమస్కారం చేస్తుంది, మొత్తం సృష్టి (నమ్ముతుంది, ) విశ్వసిస్తుంది, ఆది లో తప్పక ఆ అది మానవుడు ఉండిఉండాలి అతను ప్రతీ ధర్మం లోను విశ్వసించ బడే వాడు. అతను తప్పక ఒకరే ఉండాలి. ముసల్మానులలో అతనిని ఆదం మరియు హవ్వా అంటారు, ఇంగ్లిషు వాళ్ళు ఆది పురుషుడిని ఆడమ్ ఈవ్ అంటారు, జైనియులలో వారిని ఆది నాథ్ ఆది నాథిని అంటారు, మరియు భారత్ లో “త్వమాది దేవః పురుషః పురాణః “ ఆది దేవ శంకరుని రూపం లో నమ్ముతారు. శంకరుడు పార్వతి వారు సృష్టికి ఆది పురుషుడు. ఎవరు ఆది యో ఆయనయే అంతం చేసే వారు. ఆది ఏ అంతం. స్మృతి చిహ్నం గా ఏమి అంటారు? హర్ హర్ బం బం అంటారు. రెండు కార్యాలూ చేస్తాడు. కొత్త సృష్టి ఆది చేయడానికి పాపాల హరణం చేస్తారు. ఆత్మిక స్థితి యొక్క అభ్యాసం నేర్పించి. మరియు బాంబుల విస్ఫోటం గావించి సమస్త సృష్టి వినాశనం చేస్తారు. ఎందుకంటే ఈ లోకం బాగుపడేది కాదు. కొత్త సృష్టి లో కొంచం మందే ఉంటారు. మరి ఈనాడు ఈ పాత సృష్టి లో లెక్కలేనంత మంది ఉన్నారు. ఒక్కొక్క చుక్కతో సాగరం నిండుతుంది అంటారు. గుప్పెడు మంది ఆత్మలు ఆ అది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క పునాది వేసేవి, ప్రతీ ధర్మం లో ఆ ఆత్మలను నమ్ముతారు, మాల రూపం లో. అన్ని ధర్మాలలో మాల జపిస్తారు. మాలలో మణులు అంటే ఆత్మలకు గుర్తు. ఆ ఆత్మ రూపి మణులు ప్రతి ధర్మం లో స్మరించ బడతారు. ఎందుకు స్మరిస్తారు? తప్పకుండా ఆ ఆత్మ రూపి మణులు, పురుషార్ధం చేసి ఆత్మల అటువంటి కూటమి తాయారు చేశారు , ఆ కూటమి సమస్త విశ్వానికి మాన్యత పొందింది. ఏ ధర్మానికి చెందిన వారైనా, స్నేహం అనే సూత్రం లో జ్ఞానం అనే సూత్రం లో ఆ మణులు అన్ని బంధించబడి ఉన్నారు. ప్రస్తుతం ఈ కార్యం జరుగుతున్నది. ఆత్మలు జ్ఞానం ఆధారం గా ఆ నిరాకార జ్యోతి బిందు పరమాత్మ ఈ సాకార సృష్టి లో సాకారుడై అవుతారో, గీతా జ్ఞానం వినిపిస్తారో, ఆయనను గుర్తించ గలము. ఇప్పుడు కూడా ఇంకా సమయం చాలా తక్కువ ఉంది. లాస్ట్ చాన్స్ . ఇప్పుడు రాజనీతి లో దమ్ము లేదు. రాజనీతి (ఒక్కసారి)పూర్తి గా అస్థిరం ఐపోయింది. ధర్మ గురువులలో మనుషుల నమ్మకం సడలి పోయింది. కానీ ప్రతి మనుష్య అత్మకూ జన్మ తీసుకుంటూనే ఈశ్వరుని ద్వారా వరదానం లభిస్తుంది ఏ వరదానం? వరదానం అనండి దానం అనండి ప్రాప్తి అనండి ఆ ప్రాప్తి యే బుద్ధి. ప్రతీ మనిషి ఆత్మకు తమ తమ బుద్ధి లభించింది నిర్ణయం తీసుకోవడానికి, రైట్ ఏది, రాంగ్ ఏది అని, పరమాత్మ తండ్రి నుండి జన్మతః మనకు లభించిన వస్తువు వరదానం దానికి మొదట మనం విలువ ఇవ్వాలి. మనం ఏ విషయం అయినా గ్రహించే ముందు మన బుద్ధి తో నిర్ణయం చేయాలి సమాజం ఏ వైపుకు వెళ్తోంది, రాజ్యం ఏవైపు వెళ్తోంది, రాజనీతి ఏ వైపు వెళ్తోంది అది చూడ కూడదు. తమ బుద్ధి తో నిర్ణయం తీసుకుని తరువాత నిశ్చయం తీసుకోవాలి ఏమి చేయాలి ఏమి చేయకూడదు అని తుండే తుండే మతిర్భిన్న ....(పుర్రెకో బుద్ధి) అనేక మఠాలు, అనేక (మార్గాలు) పంధాలు, అనేక రాజ్యాలు, అనేక ధర్మాలు, అనేక మతమతాన్తరాలు, వాటి అన్నిటిలో మనం నిశ్చయం చేసుకోవాలి రైట్ ఏమిటి అని. ఒక విషయం మాత్రం ఖచ్చితం, పరమాత్మ తండ్రి ఈ సృష్టి పైకి వస్తే మాత్రం సందేశం తప్పక అందరికి చేరుతుంది. ఏ విషయానిది? ఆయన సృష్టిని బాగుపరిచే ఆయన ఈ సృష్టి పైకి వచ్చేశారు అని. ఇప్పుడు అంతిమ సమయం ఈ సృష్టిని రిఫార్మేషన్ చేయడానికి మరి ఎవరికీ శక్తి లేదు, అందరూ అలిసి పోయారు. ఇబ్రహీం వచ్చారు, బుద్ధుడు వచ్చారు, క్రైస్ట్ వచ్చారు, వివేకానంద్ వచ్చాడు, రామకృష్ణుడు వచ్చారు, గాంధీజీ వచ్చారు, మరి అందరూ ఈ సృష్టి దవడలలో, కాలం(మృత్యువు) దవడలలో వెళ్ళిపోయారు, ఈ లోకం కిందికి దిగజారుతూనే ఉన్నది. మనుషుల మధ్యలో స్నేహం సహయోగం, సౌహార్ద్రం, అంతా సమప్తం ఐపోతూనే వస్తున్నది.. ఇప్పుడు తండ్రి వచ్చారు ఆత్మ ఆత్మ భాయి భాయి గా తాయారు చేయడానికి. హిందువులు అవ్వనిండి, ముసల్మానులు అవనిండి సిక్ఖులు అవనిండి క్రిష్టి యన్లు అవనిండి అందరూ ఆత్మలే కదా, ఆత్మ అందరిలో ఉంది. ఆత్మలో సంస్కారాలు వేరే వేరే నిండి ఉండవచ్చు, కానీ అందరూ ఆత్మలే ఆ సుప్రీం ఆత్మ సంతానం. మనుషులైతే గానం చేస్తారు (హిందూ ముస్లిం సిక్ఖ్ ఈసాయి సబ్ ఆపస్ మే భాయి భాయి.) హిందూ ముస్లిం సిక్ఖు క్రిస్టియన్ లు అందరూ అన్న దమ్ములు అని “. కనుక తప్పకుండ అందరూ వాళ్ళల్లో వాళ్ళు భాయి భాయి లు ఐతే తప్పకుండా ఒకే తండ్రి ఈ సృష్టి లో ఉండి ఉండాలి కదా. ఆ తండ్రి కి గుర్తు గానే అన్ని ధర్మాలలో మాన్యత ఉంది ఆడం ఆదాం ఆది నాథ్, ఆది దేవ రూపం లో ఆ రూపమే ధరించి పరమాత్మ ఈ సృష్టి పైకి వస్తారు. అయన యొక్క మూర్తులు, అన్నిటి కన్నాఎక్కువ , కేవలం దేశం లోనే కాదు విదేశాలలో కూడా గ్రీస్ లో, మేసేపోటేమియాలో , సింధు లోయలో, అనేకానేక మైన మూర్తులు, నగ్న మూర్తులు లభించాయి. ఆయనను జైనియులు తీర్థంకరుడు అంటారు. భారత దేశం లో ఆయనను శంకరుడు అంటారు. ఆ నగ్న మూర్తి ఏ విషయానికి (గుర్తు) జ్ఞాపిక అంటే దేహభానం యొక్క స్మృతి ఆయనకు లేదు అని. ఆత్మిక స్మృతి లో స్థితులై ఉన్నారు, దేహం అనే వస్త్రం యొక్క స్మృతే జ్ఞాపకమే ఆయనకు లేదు. అందుకే ఆయనను వస్త్రం ధరించి నట్లు చూపించరు. దేహఅభిమానం తోనే అన్ని దుఖాలు జన్మిస్తాయి. ఇప్పుడు ఆ పరిక్రియ నేర్పించడానికి స్వయం పరమాత్మ ఈ సృష్టి పై దిగి వచ్చారు . కొంచం ప్రయత్నం చేస్తే గుడ్డి వాళ్లైనా, కుంటివాళ్ళుఅయినా, చేయి లేని వాళ్ళు అయినా, ధన వంతులైనా, పేదవారు అయినా, ఏ ధర్మం వారైనా ఏ జాతి వారైనా, పరమాత్మ దర్బారులో అర్ధం చేసుకోవడానికి అందరికి సమన మైన వరదానం లభించింది. అందరూ తెలుసుకో గలరు. ఆ ఈశ్వరియ జ్ఞానం ఒకరికి అర్ధం అవుతుంది, మరొకరికి అర్ధం కాదు అనే విషయమే కాదు. అంతిమ సమయం లో లాస్ట్ అటమిక్ విస్ఫోటం జరుగుతుందో అప్పుడు ఆ సమయం లో సమస్త లోకం ఒప్పుకోవాల్సి యే వస్తుంది. కానీ ముందుగా పురుషార్ధం చేసే వారు వారిపై పరమాత్మ దయ (కృప) విశేషం గా ఉంటుంది. మరియు ఆ పిల్లలు ఆ ఆత్మిక రూపం లో స్తితులయ్యే పిల్లలు వారు రాబోయే రామ కృష్ణుల లోకం లో సుఖం భోగిస్తారు. దానినే స్వరం అంటారు. ఆ స్వర్గం ఏమి పై లోకాల్లో ఏమి ఉండదు. ఈ సృష్టి లోనే ఈ భారత దేశం లోనే స్వర్గం ఉండేది. స్వయం భగవంతుడు తండ్రి వచ్చి నరకాన్ని స్వర్గం చేశారు. రామ రాజ్యానికి ఎంత మహిమ ఉంది. ఆ రామ రాజ్యాన్ని పరమాత్మ తండ్రి సుప్రీం సోల్ జ్యోతి బిందువే వచ్చి స్థాపన చేస్తారు. ఈనాటి లోకం లో ఉంది రావణ రాజ్యం. రావణాసురిడికి ఫది తలలు చూపిస్తారు. అనగా అనేక మతమతాన్తరాలు ఉన్నాయి ఈ సృష్టిలో . ఇప్పుడు ఆ పది తలల అనేక మతమతాంతరాల రావణాసురుని లోకం సమాప్తం అవ్వబోతోంది మరియు ఒక్క రామ రాజ్యం స్థాపన కాబోతున్నది. ఈ సృష్టిలో రామ ఆత్మ ఉన్నది, కృష్ణ ఆత్మ ఉన్నది కానీ ఒక మనుష్య రూపం లో ఎలాగంటే గీతలో చెప్పినట్లు సాధారణ రూపం లో వచ్చిన నన్ను మూఢమతులు గుర్తించలేరు అని. కేవలం రామ కృష్ణ ఆత్మలే కాదు ఇబ్రహీం, బుద్ధ, క్రైస్ట్ గురు నానక్ ఎంత మంది మహా మహా ధర్మ పితలు ఉన్నారో ఆ అందరూ ఈ సృష్టి లో ఉన్నారు. కానీ సాధారణ శరీరం లో ఆ మహా మహా మహులంతా పరమాత్మ తండ్రిని గుర్తించి నప్పుడు ఆ అందరూ పరమాత్మ తండ్రికి సహయోగులు( సహాయ కారులు) అవుతారు. మరియు వారి వారి సుఖ శాంతుల వారసత్వం పరమాత్మ తండ్రి వద్ద నుండి పొందుతారు. ఓం శాంతి.

Thursday, October 29, 2020
Tuesday, October 27, 2020
Sunday, October 25, 2020
ఓం నమః శివాయ ,
డివిడి నంబర్-51 , విసిడి నంబర్-315, కేసెట్ నంబర్-799. విజయవాడ(ఆంధ్రప్రదేశ్)
తారిఖు 3-10-2005 (జనరల్ క్లాస్)
మాతలు కన్యలు
దానిని చాలా త్వరగా గ్రహిస్తారు, బేసిక్ జ్ఞానం రూపం లో కావచ్చు, లేదా అడ్వాన్స్
జ్ఞానం రూపం లో కావచ్చు ఈశ్వరీయ జ్ఞానాన్ని మాతలు కన్యలు గ్రహించడంలో చాలా
తీవ్రంగా వెళ్ళగలుగు తారు. అన్నయ్యలు కొంత బయటి వాతావరణం లో బయటి లోకం వైబ్రేషన్
లో ఉంటారు, కానీ మాతలు కన్యలు ఇంటి నాలుగు గోడల మధ్య ఉంటారు ఇంటి వాతావరణం లో
ఉంటారు బయటి వైబ్రేషన్ వాళ్ళకు అంత సాంగత్యం రంగు అంటుకోదు కనుక వారిపై (జ్ఞానం)
త్వరగా ప్రభావం పడుతుంది. (మాత) మా మరిది ఉన్నారు కదా బాబా అతను అడుగుతాడు మరియు
నేను చూచాను కదా బాబా అతను ఎప్పుడూ శివబాబా నే పిలుస్తాడు, నేను అదే అంటాను నీవు
తెలియకున్నా చెప్పుతున్నావు కానీ నీవు శివబాబా నే పిలుస్తున్నావు అని, అంటే అతను
ఎక్కువ భక్తీ చేస్తాడు అని కాదు, ఎక్కువ మెడిటేషన్ చేస్తాడు అని కాదు ఇప్పుడు
నన్ను పిలిచి చెప్తాడు నాకు చెప్పు బాబా ఏమిటి కలిసి వచ్చావు కదా అయన ఏమి చెప్పారు
అని. ఏమి చెప్పను నాకు ఏమి తెలియదు అందుకే అనుకుంటాను హేదేరాబాద్ నుంచి ఎవరినైనా
పిలవనా తాడేపల్లి గూడెం నుంచి ఎవరైనా అక్కను పిలవనా ఊరికి వెళ్దాము కదా అప్పుడు
అందరికీ కోర్స్ ఇప్పించుదాము అని, అలా అనిపిస్తుంది.)ఇంకొక మాత) ఒక గంట క్లాస్ కి
అయిపోతుంది. బాబా చెపుతున్నారు::- కోర్స్ దేముంది కోర్స్ అనగా అదేమీ విషయం కాదు,
కోర్స్ అనగా ఫోర్స్ నింపడం. ఏమి వినిపించినా మనం బాబా పరిచయం ఇచ్చినా, బాబా
గురించి వారికి ఏదైనా సందేశం ఇచ్చినా, అదే కోర్స్ యొక్క ఫోర్స్. ఆత్మ ఉల్లాసం
ఉత్సాహం లో రావడం వారిపై ముద్ర పడడం వారి దుఃఖం బాధలు దూరం కావడం ఆరంభించడం, ఈ
లోకం నుండి విడుదల ప్రాప్తి కలుగగలదో, ఆ పెద్దమనిషి ఎవరు సృష్టి లో పెద్దాతి పెద్ద
వ్యక్తిత్వం ఎవరినైతే భగవంతుడు అంటామో మనకు ఆయన యొక్క ప్రాప్తి కలుగుతున్నది
ఇంతకన్నా జీవితం లో ఏమి కావాలి. మొదట పరిచయం నిరాకారునిది ఇవ్వాలి ఆత్మ నిరాకారము,
ఆత్మల యొక్క తండ్రి నిరాకారుడు. ఆత్మ జ్యోతి బిందువు, ఐతే ఆత్మల యొక్క తండ్రి అయన
కూడా జ్యోతి బిందువు, ఆత్మ అంటే మన భారతీయ పరంపరలో అణోరణీయాంసం... ఈ రూపం లో
చెప్పబడింది. అణువు కన్నా అణు రూపం అనగా అతి సూక్ష్మం దాని గుర్తుగానే మస్తకం లో
బొట్టు పెట్టుకుంటారు. ఆత్మ ఇక్కడ స్థిరం గా ఉంది అనడానికి తిలకం పెట్టుకుంటారు.
కనుక ఆత్మ పరిచయం, మరియు ఆత్మ ల యొక్క తండ్రి పరమాత్మ శివ జ్యోతి బిందువు యొక్క
పరిచయం అది బేసిక్ నాలెడ్జ్, మరియు దాని తరవాత ఆ శివ జ్యోతి బిందు దేని యొక్క
పెద్ద ఆకారం పెద్ద శివ లింగం తాయారు చేస్తారో, మరియు ఆ శివ లింగం ఎలా ఐతే సాకారునిలో
ప్రవేశించి సాకార కర్మేంద్రియాలు ఉన్నా కూడా ఎలా నిరాకారీ స్టేజి లో ఎలా ఉంటారు
అని అనగా సాకార శరీరం లో ప్రవేశించి సాకార శరీరం లో ఉంటూ నిరాకారీ స్టేజి లో ఎలా
ఉంటారు అని. అంటే చెవులు ఉన్నాయి, చెవులు ఉన్నా కూడా వింటున్నా కూడా ఎలాగైతే వింటూ
వినక పోవడం, అనగా అయన కళంకి ధరుడు అనే రూపం లో వస్తాడు, కనుక లోకం అయన పై కళంకాలు
వేస్తుంది గ్లాని చేస్తుంది కానీ ఆ గ్లానిని లోపల ధారణ చేయక పోవడం. అలా చెవులు
బలంగా(స్థిరం, గట్టిగా) చేసుకోవడం ఇది ఆ నిరాకారుని పని, సాకారునిలో వచ్చినా కూడా,
కళ్ళ తో అన్ని దుష్కర్మ లూ చూస్తాడు, కానీ చూస్తూ కూడా చూడక పోవడం, మరియు దానిని
లోపల ధారణ చేయక పోవడం ఎవరి అవగుణాలను కూడా అయన భగవంతుడు అని చెప్పబడ్డాడు.
నిరాకారుడు ఏ మొదటి ఆత్మ ఈ సృష్టి లో ప్రత్యక్షం అవుతుందో నిరాకారీ స్టేజి లో అయన
పరిచయం, అలాగే ముక్కు ఉంది, నోరు ఉంది లేదా ఏ కర్మేంద్రియాలు ఐనా ఆ ఇంద్రియాలతో
కర్మ చేస్తూ కూడా ఎలాగంటే కర్మ చేస్తూ కూడా చేయనట్లే సమానం, కర్మ చేస్తున్నట్లయితే
దాని యొక్క ఫలాఫలాలు అంటుకుంటాయి. పాపము లేక పుణ్యం తాయారు అవుతుంది, కానీ కర్మ
చేసినా ఆ కర్మ యొక్క ప్రభావం మనసుపై బుద్ధి పై ఏ ప్రభావం ఏమాత్రం పడలేదు, అనగా
ఎలాగంటే ఆ పాపం పుణ్యం తాయారు కానే లేదు, అటువంటి నిరాకారి స్టేజ్ అది స్వయం
భగవంతుడు ప్రవేశించి ఏ శాశ్వత, నియమించబడిన శరీరం లో ప్రవేశించి పాత్ర చేస్తారో ఆ స్టేజి ఆయనది
తాయారు అవుతుంది. ఆయనను మన భారతీయ పరంపరలో శివశంకర భోలే నాథ్. రెండు పేర్లు శివ
మరియు శంకర. రెండు పేర్లు ఎందుకు ఇచ్చారు, ఒకటే ఇవ్వవచ్చు? కానీ కాదు, ఎందుకంటే
ఆత్మలు రెండు, శివ సుప్రీం సోల్ యొక్క పేరు అయన జనన మరణ చక్రం లోనే రారు, మరియు
శంకరుడు, ఆత్మ యొక్క పేరు ఎవరైతే జనన మరణ చక్రం లో నైతే వస్తారు, కాని ఇక్కడ సంగమ
యుగం లో ఎలాంటి పార్ట్ వేస్తారంటే, ఎలాగంటే జనన మరణ చక్రం లో రారు. అతను ఒక్కరే
అటువంటి ప్రత్యెక మైన ఆత్మ అంటే హద్దులేని ఎటువంటి పాత్ర చేస్తాడంటే ఈ సృష్టి లో
ఎలాగంటే అతనికి జనన మరణాలు ఉండనే ఉండవు. అనగా హద్దు లో సృష్టిలో ఎలాగా ఉంటుందంటే
పిల్లవాడు గర్భం లో ఆత్మ అయి వస్తాడు, గర్భం లో తన 9 నెలల పార్ట్ చేస్తాడు, తరవాత
బయటికి వస్తాడు, బయటికి వచ్చినప్పుడు అతని జన్మ అంటారు. అతడు తన తండ్రిని గుర్తిస్తాడు.
పెద్ద అవుతాడు బుద్ధి వికసిస్తుంది అప్పుడు తండ్రినిగుర్తిస్తాడు, తల్లిని ముందే
గుర్తిస్తాడు, అలాగే ఇక్కడ బేహద్దు లో (ఈ
జ్ఞానం లో)కూడా పరమాత్మ తండ్రి వచ్చి బ్రహ్మ ద్వారా ఏ జ్ఞానం ఐతే వినిపిస్తారో, ఆ
జ్ఞానం వినేటువంటి బ్రహ్మ పిల్లలు ఎవరైతే బ్రాహ్మణులు అవుతారో ఎలాగంటే
శాస్త్రాల్లో వ్రాశారు “బ్రహ్మ యొక్క ముఖం నుంచి బ్రాహ్మణులు జన్మించారు అని. అలా
ఏ బ్రాహ్మణుల సృష్టి జరుగుతుందో ఆ బ్రాహ్మణుల సృష్టి లో ఆ బ్రాహ్మణులలో ఏ శ్రేష్ట
బ్రాహ్మణులు అవుతారో వాళ్ళలో ఈ మార్పు ఈ గుణం వచ్చేస్తుంది ఎవరి ద్వారా జన్మ
తీసుకున్నారో వారి గుణం వచ్చేస్తుంది జ్ఞానం వింటూ వింటూ, అనగా వారు కోరుకుంటే ప్రకటిస్
చేసి ఆత్మిక స్థితి లో స్వయాన్ని ధారణ చేసుకో గలరు. ఆత్మలు నిరాకారి గా అవ్వాలి
అంటే ఎలా అవుతారు? ఆ పరమాత్మ ఎవరైతే సదా నిరాకారుడో అయన ఎప్పటికీ సాకారం లో రారు
అనగా గర్భం లో ప్రవేశించరు. అయన ఎప్పటికీ అభోక్త, మనం అత్మలం అందరం భోగులం.
మనుష్యాత్మలం, మరి అయన అయన అభోక్త, ఆ నిరాకార శివ జ్యోతి బిందు. ఆ శివ జ్యోతి
బిందువులా ఈ సృష్టి లో ఏ ఒక్క ఆత్మ లేదు. ఆ శివ జ్యోతి బిందువు పెద్ద ఆకారం ఈ
సృష్టి లో తాయారు చేస్తారు, అవడానికి శివ లింగం శివలింగం అంటే అవ్వడానికి అయన కూడా
జ్యోతి బిందువే శివుడు, కానీ అయన పెద్ద రూపం ధారణ చేస్తారు అంటే ఎవరో ఒక శరీరధారి
లో ప్రవేశిస్తారు మరియు ప్రవేశించి ఎలాంటి పార్ట్ చేస్తారంటే ఎలాగంటే అసలు
ఇంద్రియాలే లేవు అన్నట్లు. అనగా ఆయనకు కర్మల పుణ్య పాపాలు అనగా కర్మేన్ద్రియాలతో
కర్మ చేయగా వాటి ఫలాలు అంటవు. (అంటుకోవు). ఆయనను శంకరుడు అంటారు. శివుని పేరు
ముందు, శంకరుని పేరు తరవాత. శివ శంకర భోలే నాథుడు. శివుడు తండ్రి, శంకరుడు
కుమారుడు. ఎంత మంది దేవతలు ఉన్నారో 33 కోట్ల మంది దేవతలు ఆ 33 కోట్ల దేవతలలో అందరికన్నా
పెద్ద దేవత అని నమ్మారో మహాదేవుడు అంటారో ఆయన శంకరుడు. కనుక అయన దేవత. పరమాత్మ పరమ
పిత కాదు. ఆ పరమపిత శివుడు ఎప్పుడైతే అతనిలో ప్రవేశిస్తారో అప్పుడు అయన పరమపిత
పరమాత్మ అని పిలవ బడతారు. పరమాత్మ పరమపిత కాదు ఏమంటారు పరమ పితా శివ మరియు పరమాత్మ
ఎవరిలోనైతే అయన ప్రవేశిస్తారు. ఎవరిలో ప్రవేశిస్తారో ఆ ఆత్మ ఎలా ఉన్నాడు? పరమాత్మ
ఎలాటి ఆత్మ ఎంత మంది ఐతే జనన మరణ చక్రం లో వచ్చే ఆత్మలు ఉన్నారో వాళ్ళు అందరిలో కి
పరం. ........దగ్గరగా తీసుకోండి, అతని చెవులో కూడా పడుతుంది దూరంగా ఉంటే
వినపడదు....ఇతనికి చెవి మిషను కూడా ఉందా...ఉన్నదా.. ఇప్పుడు ఉన్నదా మిషను
.....చెవి మిషను ఉందా మరి ఇప్పటి దాకా బాబా ఏది చెప్పారో అది మీరు వింటున్నారా
మరి...మాత:-.నరాలు చాలా వీక్ అయ్యాయి. డాక్టర్ కూడా ఏమి చేయలేము అన్నారు.
....బాబా::---ఆక్షన్ ద్వారా తెలుస్తుంది, లిప్ మూమెంట్ ద్వారా అర్ధం చేసు కుంటున్నారు.
...
బాబా::- అచ్చా
సరే... కనుక శివ మరియు శంకర్. ఈ రెండు ఆత్మలు వేరు వేరు. కానీ భక్తి మార్గం లో ఎలా
అనుకుంటారు అంటే, శాస్త్రాలలో ఎలా రాశారు అంటే శివ శంకరుడు ఒక్కరే అని. శివుడు
శంకరుడు ఒక్కరే అని. కానీ ఇది అజ్ఞానత విషయం. శివ వేరే ఆత్మ దాని అర్ధం కళ్యాణ
కారి అని. మరియు శంకరుడు అంటే మొత్తం సృష్టి లో అంతా శమింప చేసే వాడు. (శాంతి)
శాంతి ఉత్పన్నం చేసే వాడు. శాంతి వైబ్రేషన్ వ్యాపింప చేసే వాడు. అతనినే శంకరుడు
అంటారు. శాంతి ఎప్పుడు వస్తుంది ఎప్పుడు మొత్తం సృష్టి సంహారం అవుతుందో అప్పుడు
శాంతే శాంతి అవుతుంది. లోకం లో జనాభా ఎప్పుడు చాలా పెరిగి పోతుందో, అప్పుడు అశాంతి
అవుతుంది. ఈ పెరిగిపోయిన సృష్టి జనాభా 7 వందలు 5 వందల కోట్ల ఆత్మలు మనిషి ఆత్మల
సృష్టి మొత్తం సంహారం అవుతుందో , హర్ హర్ బం బం ఆటం బాంబుల విస్ఫోటనం జరుగుతుందో
శివుని పేరు హర హర అని కూడా ఉంది. హరుడు అనగా పాపాలను హరించే వాడు అని అర్ధం. ఆ
పాపాలను హరించే శివుడు శంకరుని ద్వారా హరుడు అవుతాడు. జ్యోతి బిందు ఎప్పుడు హర
కాలేదు, అనగా పాపాలను హరించలేడు. అయన ప్రవేశించినప్పుడు మహాదేవుని లో శంకరుని లో
అప్పుడు అతనిని హరుడు అంటాము. హర మరియు హరి ఈ ఇద్దరిలో తేడా ఉంది. హరుడు అని
శంకరుని అంటాము. అన్ని పాపాలనూ హరిస్తాడు. హరి అని ఎప్పుడు అంటాము, శంకరుడు మొత్తం
విశ్వానికి పిత జగత్తుకు పిత జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ...సమస్త జగత్తుకు
ఎవరు పితయో ఆ పిత ఈ సృష్టి పైకి వచ్చి ఏ మొదటి కుమారుడికి జన్మ నిస్తారో సత్యయుగి
కొత్త సృష్టి స్థాపన అయినప్పుడు మరియు ఈ కొత్త సృష్టిలో కి వచ్చి మొదటి కుమారుడికి
జన్మ నిస్తాడో అతనికి కృష్ణుడు అని పేరు పడుతుంది. అందుకే శాస్త్రాల్లో హే కృష్ణ
నారాయణ వాసుదేవ అని గానం చేయబడింది. అనగా కృష్ణుడు నారాయణుడు ఒక్కరే వేరు వేరు
కాదు అని. ఆ కృష్ణుడు 16 కళల సంపుర్ణుడు. అతను ఈ సృష్టికి మొదటి ఆకు అవుతాడు.
సృష్టి రూపి వృక్షం, ఆ సృష్టి రూపి వృక్షానికి మొదటి ఆకు కృష్ణుడు, అతనిని 16 కళల
సంపుర్ణుడు అంటారు. 16 కళల సంపుర్ణుడు అని ఏ కృష్ణుడు పిలవబదతాడో అలా ఎందుకు
పిలుస్తారు, ఎందుకంటే సత్యయుగం లో 16 కళలు ఉంటాయి. త్రేతా లో 14 కళలు ఉంటాయి.
మనుష్య సృష్టి లో మరియు ద్వాపరం లో 8 కళలు ఉంటాయి. మరియు కలియుగం లో 4 కళల నుంచి
కిందకు దిగుతూ దిగుతూ కళా శూన్యంగా ఐపోతారు, కళలు అన్నీ సమాప్తం అయిపోతాయి. అనగా ఆత్మ యొక్క శక్తి క్షీణం అయిపోతుంది. కనుక
కృష్ణుడిని 16 కళల సంపుర్ణుడు అని ఎందుకు అంటాము అంటే అతను సత్యయుగం ఆది లో జన్మ
తీసుకుంటాడు. కానీ శాస్త్ర కారులు తప్పుగా శ్రీ కృష్ణుడిని ద్వాపరం లో వేసేశారు.
ఏమని కృష్ణ భగవానుడు ఈ సృష్టి పైకి వచ్చి ద్వాపరం అంతం లో మహాభారతం చేయించాడు
మరియు మహాభారత యుద్ధం లో పంచ పాండవుల విజయం లభించింది అని. మిగతా మొత్తం సేన కౌరవ
సేన, యాదవ సేన అది అప్పోజిషన్ లో ఉన్నది అది మొత్తం నాశనం ఐపోయింది అంటారు. అంటే
దీని అర్ధం ద్వాపర యుగం అంతం లో ఎప్పుడు శ్రీ కృష్ణ భగవానుడు భగవంతుడి రూపం లో
వచ్చినప్పుడు పాపీ కలియుగీ స్థాపన చేశారా? భగవంతుడు వచ్చి పాపీ కలియుగం స్థాపన ఏమి
చేయరు. భగవానుడు వచ్చినప్పుడు పుణ్య సృష్టి తాయారు చేసి వెళతారా లేక పాప ప్రపంచం
తాయారు చేసి వెళతారా? అప్పుడు భగవానుడు వచ్చి నందువల్ల లాభం ఏమిటి? కనుక
శాస్త్రాలలో రాసినది అది మనుషుల ద్వారా రాసినది. భగవంతుడు కుర్చుని శాస్త్రాలు
రాయరు. ఏమిటి, ఎలాగైతే ధర్మ పితలు వచ్చినప్పుడు ఇబ్రహీం ముహమ్మద్ వచ్చి నప్పుడు అతను
ఏమీ కురాన్ షరీఫ్ రాయలేదు. అతను ఐతే డైరెక్ట్ నోటితో చెప్పాడు. క్రీస్తు వచ్చి
బైబిల్ నోటితో చెప్పాడు. బైబిల్ మహావాక్యాలు. అతను ఏమి బైబిల్ రాయలేదు. అలాగే గురు
నానక్ ఐతే డైరెక్ట్ నోటితో చెప్పాడు అతను ఏమి ఆ గురు గ్రంథ సాహిబ్ (గ్రంధం)
రాయలేదు. ఈ ధర్మ పితలు వచ్చిన తరువాత 300 400 ఏళ్ళు అయ్యాక వాళ్ళ జనరేషన్
పెరిగినప్పుడు ఆపుడు ఆ పుస్తాకాలు రాయబడతాయి. అలాగే సనాతన ధర్మ పిత ఎవరో, పరమ పిత
అని ఎవరిని అంటామో, వేరే ధర్మం వాళ్ళు ఆయనను గాడ్ ఫాదర్ అంటారో, ముసల్మానులు అల్లా
మియా అంటారో, అయన కూడా ఈ సృష్టి లోకి వచ్చి నప్పుడు అల్లా వచ్చి అవ్వల్ అంటే ప్రధమ
మైన ధర్మం స్థాపన చేస్తారో, ఆ ధర్మాన్నే అల్లా అవ్వల్ దీన్ అంటారో, దీన్ అనగా
ధర్మం అన్నిటి కన్నా ఉన్నతోన్నత మైన ధర్మం స్థాపన చేసే వారు, ఈ సృష్టి లోకి వచ్చి
నప్పుడు అయన వచ్చి 16 కళల సంపూర్ణ సృష్టికి స్థాపన చేస్తారు. కళా హీన సృష్టి చేయరు
శాస్త్రాలలో శాస్త్రకారులు రాసినట్లు, ఏమని
ద్వాపరం అంతం లో వస్తారు అని మరియు కళా హీన కలియుగ స్థాపన చేస్తారు అనేది పూర్తిగా
తప్పు. సత్యం కేవలం పరమాత్మ ఏ చెపుతారు. గాడ్ ఇజ్ ట్రుథ్ అంటారు. మన హిందూ దేశం లో
కూడా అంటారు సత్యం శివం సుందరం అని. ఏమిటి? అయన మొదటి పేరే సత్యం. ఏది సత్యమో అది
మాత్రమే సుందరం. ఏమిటి ఒకవేళ అసత్యం ఐతే అది సుందరం కానే కాదు. ఏదైతే సత్యమో అదే
కల్యాణ కారి. ఒకవేళ అబద్ధం ఐతే అది కళ్యాణ కారి కానే కాలేదు. సత్యం శివం ఈ రెండు
గుణాలు ఎవరిలో ఉన్నాయో అయన తప్పకుండా సుందరుడు. సత్యముగనూ ఉండాలి మరియు కళ్యాణ
కారి గా కూడా ఉండాలి, అతనే అసలైన సుందరుడు. మన హిందూస్తాన్ లో భగవంతుడిని సత్యం
అని పిలవనే పిలుస్తారు, సత్యమే శివం శివమే సుందరం. సుందరతా అతి ప్యారి (సుందరత్వం
అతి ప్రేమ మయం) అని గీతం కూడా రాశారు. కానీ క్రిష్టియన్లు కూడా గాడ్ ఫాదర్ ను
ట్రుథ్ అని నమ్ముతారు. గాడ్ ఫాదర్ ఇజ్ ట్రుథ్. ఏమిటి సత్యాన్నే భగవంతుడు అని
అంటారు. ఎందుకు, ఎందుకంటే భగవంతుడు బిందువు. ప్రాక్టికల్ గ ఏమి ఓ పెద్ద రూపం లో
నైతే రారు. అయన బిందువు గర్భం తో జన్మ తీసుకోరు. ఆ బిందువు ఈ సృష్టి లో వచ్చి
నప్పుడు సత్యమే (వినిపిస్తుంది.) చెపుతుంది ఒక శరీరం లో ప్రవేశించి. ఏ సత్యం
చెపుతుందో ఆ సత్య జ్ఞానమే వాస్తవానికి శివుని స్వరూపం. శివుడు మరి ఏ ఇతర రూపం లో ఈ
లోకంలో ప్రత్యక్షం కారు ప్రాక్టికల్ రూపం లో
మొట్ట మొదట అయన జ్ఞాన రూపం లో ప్రత్యక్షం అవుతారు. మొదట జ్ఞాన దాత నా లేక
మొదట జ్ఞానమా? అయన ఐతే బిందువు ఈ కళ్ళతో నైతే మనం చూడలేము. సుప్రీం సోల్ శివుడు ఈ
కంటితో చూడలేము మన ఆత్మనే ఈ కళ్ళకు కనబడదు. ఇతరుల ఆత్మను ఈ కళ్ళతో చూడలేము. కనుక
మరి సుప్రీం సోల్ ఆయనను ఎలా చూడగలము. కనుక ముందు జ్ఞానం వస్తుంది. జ్ఞానం అనగా
సత్యత వస్తుంది, జ్ఞానం అనగా వివరం తెలియడం ఏ వస్తువు వివరం సత్యం యొక్క వివరం. ఏ
విషయం యొక్క సత్యం, ఆత్మ ఏమిటి, పరమాత్మ ఏమిటి, ఈ మొత్తం సృష్టి చక్రం ఏమిటి? ఈ
విషయాల గురించి వివరం ఈ వివరంగా తెలియడమే జ్ఞానం. ఈ జ్ఞానం మొదట బేసిక్ రూపం లో
వస్తుంది దీనికి పేరు శాస్త్రాల్లో మురళి అని పెట్టారు. ఏమిటి, భగవంతుడు వచ్చి
విషయ పరిజ్ఞానం బేసిక్ రూపం లో చెప్పారో, దాని పేరే మురళి. మురళి అని పేరు ఎందుకు
పెట్టారు? వీణ అని పేరు పెట్టవచ్చు, భేరి అని పెట్టవచ్చు, ఎందుకు పెట్టలేదు,
ఇందుకు పెట్టలేదు అంటే ఈ లోకం లో ఏ తల్లి తండ్రులైనా చిన్న పిల్లలను పాలన
చేయడానికి మాతను నిమిత్తం చేస్తారు. మాత పిల్లలను చాల ప్రేమగా పాలన చేస్తుంది.
తండ్రి ఇంత ప్రేమగా పిల్లల పాలన చేయ లేడు. తల్లి అంత ప్రేమగా పాలన చేయలేడు. మొత్తం
సృష్టి ఆయననే ఫాలో చేస్తుంది ఏ పరమ పిత ఈ సృష్టి లో కి వచ్చి నప్పుడు ఈ సృష్టిలో
మొట్ట మొదట పెద్ద తల్లి రూపం లో ఈ లోకం లో ప్రత్యక్షం అవుతారు. పెద్ద తల్లి ఆమెకు
శాస్త్రాలలో పేరు పెట్టారు బ్రహ్మ. బ్ర్హ అనగా పెద్ద మా అనగా తల్లి అనగా ఆ సుప్రీం
సోల్ ఈ సృష్టి లో కి వచ్చి నప్పుడు ఏ తనువులో ప్రవేశిస్తారో, ప్రవేశించి ఈ లోకంలో
ప్రత్యక్షం అవుతారో, అది తల్లి రూపం. ఈ సృష్టి పైకి వచ్చి నప్పుడు ఏ వ్యక్తిత్వం
లో ప్రవేశిస్తారో ఆ వ్యక్తిత్వం ఆ ఆత్మే ఎవరైతే సత్య యుగం ఆది లో కృష్ణ
పిల్లావాడు. ఓ కృష్ణా నారాయణా. కృష్ణ పిల్లవాడు పెద్ద అయ్యి నారాయణుడు అవుతాడు.
అతను తన 84 జన్మలు పూర్తి చేసి సాధారణ వృద్ధ మనవ శరీరుడు అవుతాడు. అతని పేరే దాదా
లేఖరాజు పడుతుంది. ఆ దాదా లేఖ రాజు లోనే సుప్రీం సోల్ ప్రవేశించి బ్రహ్మా బడి మా అనగా
పెద్ద తల్లి రూపం లో ప్రత్యక్షం అవుతారు, గ్రామ గ్రామాలలో పట్టణం పట్టణాలలో దేశ
విదేశాలలో బ్రహ్మ కుమారీ ఈశ్వరీయ విశ్వ విద్యాలయాలు తెరువబడతాయి. ఇప్పుడు
ప్రాక్టికల్ గా మీరు వారి అడ్రెస్ లు కూడా తీసుకో గలరు. ఏమిటి, ప్రాక్టికల్ గ
ఇప్పుడు అడ్రెస్ లు తీసుకో గలరు బ్రహ్మ కుమారి విద్యాలయాలు దేశ విదేశాలలో, మరి
భారత దేశం లో నైతే గ్రామ గ్రామాలలో తెరువ బడ్డ్గాయి. కనుక బ్రహ్మ రూపం లో ఆయన
వచ్చి తల్లి పార్ట్ చేశారు. మొట్ట మొదటగా. అనగా పిల్లలకు చాలా ప్రేమగా పాలన
చేస్తారు. ఆ ప్రేమ వాణి మధుర మధురమైన వాణి ఎలాగైతే తల్లి పిల్లలను
నిద్రపుచ్చడానికి జోల పాట పాడుతుందో అన్నం తినిపించేటప్పుడు కూడా ప్రేమగా పాట
పాడుతుంది. అలాగే పరమాత్మ వాణి మధుర మధుర మైన వాణి వృద్ధ తనువు ద్వారా. ఆ మధుర
వాణి కి పేరు మురళి అని ఎందుకు పెట్టారు అంటే అందులో మాధుర్యం నిండి ఉంది.
శాస్త్రాల్లో దాని పేరు మురళి ఇచ్చారు. కదా. ఆ మురళి ఏమో మౌంట్ అబూ లో
నడిపించబడింది ప్రాక్టికల్ గా చూడవచ్చు. మౌంట్ అబూ లో బ్రహ్మ తనువు ద్వారా, దాదా
లేఖ రాజు తనువు ద్వారా అనగా శ్రీ కృష్ణుని 84 వ జన్మ శరీరం లో వచ్చి పరమాత్మ
శివుడు ఏ వాణి నడిపించారో దాని పేరు మురళి మరియు ఆ మురళి ఇప్పటికీ ప్రింటు
చేస్తున్నారు. బ్రహ్మ ఐతే శరీరం విడిచి పెట్టారు. అయన శరీరం విడిచి ఇప్పటికి
దాదాపుగా 32 మరియు 5 , =37 ఏళ్ళు కావస్తున్నవి.
అయన శరీరం విడిచి 37 ఏళ్ళు అవుతున్నవి కాని ఆ మురళీలు ఇప్పటికి బ్రహ్మ
కుమారీ ల వద్ద ప్రింటు అయ్యి అన్ని సెంటర్ లకూ ఇప్పటికీ పంప బడుతున్నాయి. ఏ మురళి
లు పంపుతున్నారో ఆ మురళి లలో నే లిఖించబడింది మురళి 3 రకాలుగా ప్రభావం
చూపిస్తుంది. ఫస్ట్ క్లాస్ మురళి ఏది అంటే బాబా డైరెక్ట్ గా చెపుతారో అది. ఆ శివ
సుప్రీం సోల్ ఒక సాకార తనువు లో వచ్చి డైరెక్ట్ గ మురళి వినిపిస్తారో అది ఫస్ట్
క్లాస్ మురళి. మరియు సెకెండ్ క్లాస్ ఏదంటే డైరెక్ట్ గ వినిపించిన మురళి ని టేప్
రికార్డర్ లో రికార్డ్ చేయ బడుతుంది. అనగా ఎలా చెప్ప బడిందో అలాగే టేప్ రికార్డర్
వినిపిస్తుంది. మరియు గుడ్ సెకెండ్ క్లాస్ ఏదంటే ఇప్పుడు విసిడి లో, డివిడి లో అయన
చిత్రం కూడా చూడడానికి లభిస్తుంది. వైబ్రేషన్ లభించదు, కాని హలనం చలనం యాక్ట్,
అదంతా కనిపిస్తుంది. అప్పుడు ఎక్కువ లోతుగా అర్ధం చేసుకోవచ్చు. అది గుడ్ సెకెండ్
క్లాస్. మరి థర్డ్ క్లాస్ ఏది అంటే భగవంతుడు ఏది చెప్పారో అది మెషిన్ లో ప్రింట్
అవుతుంది. అప్పుడు దానిలో బాబా వాణి యథా తధం గా లభించదు. ఎందుకంటే ప్రింటు చేసే
వారు మొదట దానిని షార్ట్ హ్యాండ్ చేసి ఉంటారు, చెప్పే తప్పుడు ఎవరో షార్ట్ హ్యాండ్
చేసి ఉంటారు. షార్ట్ హ్యాండ్ చేసే తప్పుడు తప్పులు జరగవచ్చు. షార్ట్ హ్యాండ్ చేసిన
తరవాత దానిని సైక్లో స్టైల్ లేదా ప్రింట్ చేసినప్పుడు ఎంతో కొంత తేడా వస్తుంది.
ఎందుకంటే రాసే వాళ్ళ వల్ల కొంత తప్పు, షార్ట్ హ్యాండ్ ను లిపి చేసే టప్పుడు
తప్పులు చేయ వచ్చు. కొంత ప్రింటు చేసే వాడు ఎవరైతే కంపోజ్ చేస్తాడో అతడు తప్పులు
చేస్తాడు. అప్పుడు దాని రూపు మారిపోతుంది. ఎలాగంటే పాలతో నిండిన కుండలో ఆ కుండలో
ఒక చుక్క పాము విషం చుక్క కలిపితే విషపు చుక్క అప్పుడు ఏమౌతుంది కొంత సమయం తరవాత
మొత్తం పాలు కుండ నిండుగా ఉన్నవి అన్ని విషం అయిపోతాయి. అలాగే భగవంతుని వాణి లో
కొంచం మిక్సరిటి ఐతే పొరపాటున అయిన కూడా కొంత సమయం తరవాత అది మొత్తం విష మయం గా
అయిపోతుంది. ఈశ్వరీయ జ్ఞానం ఈశ్వరునిది గా ఉండదు. అందుకే మీరు చెపుతున్నారు మేము
చదువుతాము అని ఆ చదివినది ఎక్యురేట్ కాదు. ఎందుకంటే ప్రింటు లో తప్పులు జరగవచ్చు.
టేప్ రికార్డర్ వినిపించేది అది ఎక్యురేట్ గ ఉంటుంది. మరి ఏ విసిడి లు మన ముందుకు
వస్తాయో లేదా డివిడి లు మన ముందుకు వస్తాయో అవి మరికొంత రిఫైన్ అయినవి. కనుక ఒకవేళ
సంముఖం గ మనకు లభించక పొతే ఎందుకనగా బ్రహ్మ ఐతే శరీరం విడిచేశారు. అయన శరీరం
విడిచి 35, 40 ఏళ్ళు కావస్తున్నాయి, కనుక ఆ సాకార బ్రహ్మ తనువు ఐతే పోయింది. ఐతే
వినేవాళ్ళల్లో ఎవరో కొందరు పూర్వ జన్మలో విని ఉండవచ్చు. ఎందుకంటే పూర్వ జన్మ ఐతే ఈ
నాటికి 69, 70 , ఏళ్ల క్రితం వాళ్ళు 36 లో నేటికి 69, 70 ఏళ్ల క్రితం 36 లో
పరమాత్మ శివుడు దాదా లేఖ రాజ్ లో ప్రవేశించి ఈ విషయం జ్ఞాన విషయం వినిపించడం
ప్రారంభించారు. సక్షాత్కారాలు మొదలు పెట్టారు. అనగా ఈ జ్ఞాన యజ్ఞం 36 సం. లో మొదలు
అయ్యింది ఆ సమయం నించి ఇప్పటి వరకు ఒక వేళ ఎవరిదైనా వయసు 69, లేదా 70 కన్నా తక్కువ
ఐతే పూర్వ జన్మ లో అతను విని ఉండవచ్చు. పూర్వ జన్మ లో విన్నాడు అంటే అతను డైరెక్ట్
తల్లి పాలన పూర్వ జన్మ లో తీసుకున్నాడు అని అర్ధం. ఇప్పుడు తల్లి రూపం లో మధుర మైన
రాగం వినిపించే తల్లి వెళ్లి పోయింది. ఐతే వాస్తవంగా ఇప్పుడు బ్రహ్మ
కుమారిలలో ఏ జ్ఞానం ఐతే నడుస్తోందో బ్రహ్మ
కుమారీ ఆశ్రమం లో ఆ జ్ఞానం వినే ఆత్మలు డైరెక్ట్ భగవంతుని వర్షన్లు(వాక్యాలు)
వినలేరా, భగవంతుడు జ్ఞానం వినిపించి మాత్రమే వెళ్లి పోతారా ఏమి? ఎలాగంటే ధర్మ
పితలు వస్తారు వారి జ్ఞానం వినిపిస్తారు, తమ ధర్మం స్థాపన చేసి వెళ్లి పోతారు.
అలాగే భగవంతుడు కూడా ఆయా రాం గయా రాం( రాముడు వచ్చాడు, రాముడు వెళ్ళాడు= అనగా ఏమి
ప్రత్యేకంగా మార్పు తేలేదు) ఐపోతారా? సృష్టి లో పరివర్తన చేసి వెళ్ళరా? భగవంతుడు
కొత్త లోకం తయారు చేసి వెళ్ళరా? ఎలాగైతే వేరే ధర్మ పితలు వచ్చారు, వచ్చి వెళ్లి
పోయారు. లోకం ఇంకా దిగజారి పోతూ ఉంది. ఐతే భగవంతుడు కూడా అలాగే చేస్తారా? భగవంతుడు
అలాగైతే చేయరు. భగవంతుడు వస్తే తన కార్యం పూర్తి చేసి వెళతారు. భగవంతుడు మాత్రమె
ఎటువంటి పెద్దవ్యక్తి అంటే ఈ పాత లోకాన్ని పాత సృష్టి ని నరకాన్ని స్వర్గం చేసి
వెళతారు. ఇబ్రహీం వచ్చారు అతను కూడా ధర్మ పితయే, అతను ఇస్లాం ధర్మం స్థాపాన
చేశాడు. మహాత్మా బుద్ధుడు వచ్చారు అతను కూడా ధర్మ పిత బుద్ధ ధర్మం స్థాపాన చేశాడు.
క్రీస్తు వచ్చాడు అతను కూడా ధర్మ పిత క్రిస్టియన్ ధర్మం స్థాపన చేశాడు ఎంత పెద్ద
పెద్ద గొప్ప వాళ్ళు వచ్చారు. మరియు లోకంలో వారి పెద్ద జేనేరేషన్ వ్యాపించి ఉంది.
వారికి వారు వచ్చి చదువు చెప్పారు. వాళ్ళు చదువు చెప్పి వెళ్ళారు, మరి లోకంలో
వాళ్ళ జేనేరేషన్ దిగజారడం ప్రారంభించింది. ఐతే భగవంతుడు కూడా అలాగే చేసి వెళతారా?
లేదు. భగవంతుడు ఈ సృష్టి పైన వచ్చినప్పుడు ఎవరికైతే చదువు చెపుతారో ఆ చదువు కునే
ఆత్మలు వరసవారీ గా ఉంటారు. ఎవరైతే సన్ముఖం గా కుర్చుని చదువుకుంటారో, వాళ్ళల్లో
రెండు రకాలు ఉంటారు. ఒక రకం తల్లి ముందు సంముఖం గా కుర్చుని వింటారు. భగవంతుడు
తల్లి రూపం లో వచ్చి నప్పుడు. శాస్త్రాల్లో రాశారు కదా త్వమేవ మాతా చ పితా త్వమేవ
శ్లోకం ఉంది కదా కనుక భక్తి మార్గం లో ఏ గానం చేస్తారో త్వమేవ మాతా భగవంతుడి
గురించే కదా గానం చేస్తారు భగవంతుడు మాతా అవుతారు, భగవంతుడు పితా కూడా అవుతారు.
మాత ఎవరి థ్రూ అవుతారు బ్రహ్మ ద్వారా, కానీ తల్లి ద్వారా అయన కేవలం జ్ఞానం డోస్
ఇస్తారు కానీ తల్లి ద్వారా జ్ఞానం పాలు త్రాగిస్తారు. పిల్లలకు పిల్లల రూపం లో
పాలన ఇస్తారు. తల్లి రూపం లో బేసిక్ నాలేజ్ ఇస్తారు. కాని ఉన్నత మైన చదువు
చదివించరు. తల్లి బేసిక్ చదువు ఇంట్లో కుర్చుని చదివిస్తుంది. కానీ బియ్యే ఏంఏ
చదువు చదివించాలి అంటే పిల్లాడు తల్లి నించి చదువుకుంటాడా. ఉన్నత మైన చదువు చదువు
కోవడానికి వెళ్ళాల్సి వస్తుంది కదా. అడ్వాన్స్ కి. అలాగే పరమాత్మ శివుడు కూడా
కేవలం బ్రహ్మ తనువు లో వచ్చి మురళి చెప్పి వెళ్లి పోరు. అది ఒక మూర్తి యొక్క
కార్యం అయ్యింది. శివుని గురించి అంటారు త్రిమూర్తి శివుడు అని. ఈ సృష్టిలో దేవతలు
33 కోట్లు. 33 కొట్లలో శ్రేష్ఠ దేవతలు అష్ట దేవతలు. అష్ట దేవతలలో కూడా శ్రేష్ఠ
వ్యక్తులు త్రిదేవులు బ్రహ్మ విష్ణు శంకర్. కనుక బ్రహ్మ ద్వారా కార్యం చేసేసి
వెళ్లి పోరు. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ ధర్మం స్థాపాన చేసి, తరవాత ఆ బ్రాహ్మణ సృష్టి
తాయారు అయినప్పుడు ఆ బ్రాహ్మణుల సృష్టి లో ఎన్నిక చేస్తారు. శ్రేష్ట ఆత్మల ఎన్నిక.
ఏమిటి, శ్రేష్ట ఆత్మల ఎంపిక చేస్తారు. చదువు చదివిస్తారు కదా కనుక చదివించే
టీచర్లు ఉంటారు, చదివించే టీచర్లు ఎగ్జాం కూడా తీసుకుంటారు కదా. పిల్లల ఎగ్జాం
తీసుకుంటారు (పరీక్ష) అప్పుడు వాళ్ళ నంబర్ కూడా తాయారు అవుతుంది. క్లాస్ లో నంబరింగ్
ఉంటుంది కదా. కొంత మంది పిల్లలు క్లాస్ లో మొదటి నంబర్ తీసుకుంటారు. క్లాస్ లో
ఫస్ట్ క్లాస్ వస్తారు. కొంత మంది పిల్లలు ఫస్ట్ క్లాస్ వచ్చే లిస్టు లో వస్తారు. కొంత
మంది పిల్లలు ఎలా ఉంటారు అంటే క్లాస్ ఫస్ట్ మొదటి నంబర్ ఐతే తీసుకోరు కానీ ఫస్ట్
క్లాస్ పాస్ అయ్యే వాళ్ళ లిస్టు లో వస్తారు. కొంత మంది ఎలా ఉంటారు అంటే సెకెండ్
క్లాస్ లో పాస్ అయ్యే వాళ్ళ లిస్టు లో వస్తారు వీరి సంఖ్య ఎక్కువ ఉంటుంది. కొంత
మంది ఎలా ఉంటారు అంటే థర్డ్ క్లాస్ లిస్టు లో వస్తారు వీరి సంఖ్య ఇంకా ఎక్కువ
ఉంటుంది. మరి కొంత మంది ఎలా ఉంటారంటే ఫెల్ ఐపోతారు. కనుక ఇది కూడా ఈశ్వరీయ చదువు.
ఈశ్వరుడు ఈ సృష్టి లో వచ్చి జ్ఞానం వినిపించినప్పుడు జ్ఞానం వినిపించాక ఆ జ్ఞానం
లో పరిక్ష కూడా తీసుకుంటాడు. పరీక్షలో బేసిక్ లో వచ్చిన వాళ్ళంతా అందరూ అడ్వాన్స్
లో వెళ్లి పోతారు అని కాదు. ఉన్నత చదువు చదవడం ప్రారంభిస్తారు అని కాదు. లోకం లో
కూడా అలాగే అవుతుంది, ప్రైమరీ చదువు చదివే వారు ఎంత మంది ఉంటారు బి ఏ, ఎం. ఏ.
చదువు చదువుతారు. అందరూ చదువుతారా ఏమి? బేసిక్ చదివే వారు చాలా మంది ఉంటారు.
అడ్వాన్స్ చదివే వారు తక్కువ మంది ఉంటారు, అలాగే ఈశ్వరుడు ఈ సృష్టి లో
వచ్చినప్పుడు బ్రహ్మ ద్వారా ఏ బేసిక్ జ్ఞానం ఇస్తారో బ్రహ్మ కుమారి ఈశ్వరీయ విశ్వ
విద్యాలయం థ్రూ (ద్వారా) అయన వచ్చి వారిలో ఎంపిక చేస్తారు. ఆ ఎన్నికలో ఏ పిల్లలు
పాస్ అవుతారో వారి క్లాస్ మళ్ళి ట్రాన్సఫర్ అవుతుంది. బేసిక్ నాలెడ్జ్ నుంచి ఆ
పిల్లలు అడ్వాన్స్ నాలెడ్జ్ కి వెళతారు. ఉన్నత విద్య. కనుక ఎవరి క్లాస్ ట్రాన్సఫర్
అవుతుందో వారి స్థానమూ మారుతుంది, మరియు టీచర్లు కూడా మారుతారు. లేకపోతే ఆ టిచర్లే
ఉంటారా? టీచర్లు మారతారు కదా కనుక అలాగే ఈ ఈశ్వరీయ జ్ఞానం లో బ్రహ్మ మరియు సరస్వతి
ఎవరు నిమిత్తం అయ్యారో బ్రాహ్మణ ధర్మం స్థాపన చేయడానికి వారైతే వెళ్లి పోయారు.
వారు వెళ్ళిపోయాక తరువాత రెండవ మూర్తి లో మళ్ళి పరమాత్మ శివ ప్రవేశం చేస్తారు. ఆ
రెండవ మూర్తి ఎవరు? ఎలాగైతే మొదటి మూర్తి కృష్ణ ఆత్మ సత్య యుగపు మొదటి ఆకు, హే
కృష్ణ నారాయణ వాసుదేవ, ఆ కృష్ణ ఆత్మయే 16 కళల సంపుర్ణుడు అంతిమ జన్మ లో 84 వ
జన్మలో కలియుగం అంతం లో వచ్చి దాదా లేఖ రాజు బ్రహ్మ అవుతుంది. వృద్ధ బ్రాహ్మణుడు
మరియు అయన లో పరమాత్మ శివుడు ప్రవేశించి అతని పేరు బ్రహ్మ అని పెడతారు. బ్రం అనగా
పెద్ద మా అనగా తల్లి పెద్ద తల్లి అలాగే ఆ బ్రహ్మ శరీరం విడిచినప్పుడు 69, 18
జనవరికి శరీరం విడిచాడు, ఆ తరువాత పరమాత్మ శివుడు రెండవ మూర్తి లో ప్రవేశిస్తారు,
ఆ రెండవ మూర్తి కూడా రామ ఆత్మ, ఆయనే త్రేతా లో రాముడు అని పిలవబడతాడు. ఆ ఆత్మయే జనన
మరణ చక్రం లో వస్తూ వస్తూ అంతిమ జన్మ లో ఎదో సాధారణ వృద్ధ లేదా వటువు బ్రాహ్మణుడు
అవుతాడు. మొదట యోగులలో ఈశ్వరుని రూపం లో గానం చేయబడ్డాడో అతను సనత్ కుమార్,
సృష్టికి ఆది పుత్రుడు. ఏమిటి? బ్రహ్మ ద్వారా మొదట నలుగురు పుత్రులు జన్మించారు, ఆ
నలుగురు పుత్రుల పేర్లు శాస్త్రాల్లో సనత్, సనాతన్ సనందన్, మరియు సనత్ కుమార్..
అని ఇవ్వబడింది. వారిలో అందరికన్నా పెద్ద అని సనత్ కుమారుడు పేరు పొందాడు.
ఎందుకంటే సనత్ కుమార్ జ్ఞానం లో చాలా తీవ్రం గా ఉన్నారు కనుక అతనిని పెద్ద అని
పేరు పొందారు. పెద్ద, చిన్న, ఎందుకంటే అనంత మైన సృష్టి తాయారు కాబోతున్నది. కనుక
ఈశ్వరుని దృష్టిలో జ్ఞానం లో ఎవరు పెద్దో, వారిని పెద్ద అంటారు. ఎందుకంటే భగవంతుడు
జ్ఞానీ తూ ఆత్మలను ఇష్టపడతారు. జ్ఞానీ ఆత్మలు, ఎలాగంటే రామాయణం లో చెప్పారు,
జ్ఞాని ప్రభువుకు విశేష ప్రియమైన వారు అని. జ్ఞానీ ఆత్మలు అంటే ప్రభుకు విశేష మైన
ప్రేమ. భక్తులు అంటే కూడా ఇష్టమే, కానీ జ్ఞానులు ఎవరు అవుతారో వాళ్ళంటే భగవంతునికి
విశేషమైన ప్రియం. ఎందుకంటే భగవంతుడు బుద్ధి మంతులకే బుద్ధి. బుద్ధి జ్ఞాన సంబంధ
విషయం. జ్ఞానం అనగా విషయం తెలుసుకోవడం. తెలుసుకోవడం లో ఎవరు అందరి కన్నా తీవ్రం గ
వెళతారో, అయన, భగవంతుని యొక్క ప్రాక్టికల్ రూపం వేరే ఏదో ఉండదు, భగవంతుడు వచ్చి ఏ
జ్ఞానం ఇస్తారో అదే అయన యొక్క ప్రాక్టికల్ స్వరూపం. భగవంతుడైతే జ్యోతి బిందువు. ఆ
బిందువు ఆకారం శివ లింగం చుబించారు. శివ లింగం గ్రామ గ్రామాలలో పట్టణం పట్టణాలలో
రూపం తయారై ఉంది నిరాకారునికి గుర్తు, అయన జనన మరణ చక్రం లో రారు, జనన మరణ చక్రం
లో ఎవరు వస్తారు అంటే ఎవరిలో నైతే అయన ప్రవేశించగలరో వారు, కనుక ఎవరిలో
ప్రవేశిస్తారో ఆయన ఆ ఆత్మలను ఫస్ట్ క్లాస్ రూపం లో సృష్టి లో ప్రవేశింప చేస్తారు,
ప్రత్యక్షం చేస్తారు. వారు భగవంతుని చదువు చదువుకునే 108 మంది శ్రేష్ఠ ఆత్మలు.
వారు మాల రూపం లో ప్రతీ ధర్మం లో స్మరించ బడతారు. ఇప్పటికీ. నాస్తిక ధర్మం తప్ప
మరి ఏ ధర్మం లో రష్యా ను విడిచి, మాల జపించని వారు అంటూ లేరు. మాల 108 పూసల హారం
అది శ్రేష్ఠ ఆత్మల కి స్మృతిచిహ్నం, వారు ప్రతి ఒక ధర్మం నుంచి ఎన్నుకో బడిన
ఆత్మలు. ఎన్నుకో బడి బ్రహ్మ కుమారీ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం లో బ్రాహ్మణులు
అవుతారు. ఆ బ్రాహ్మణుల నుంచే బేసిక్ జ్ఞానం తీసుకునే వారి నుంచే మళ్ళి ఎన్నుకోబడి
అడ్వాన్స్ జ్ఞానం లో వస్తారు. మరియు ఆ అడ్వాన్స్ లో వచ్చే ఆత్మలు ఆ రెండవ మూర్తి
శంకరుడు అని పిలవబడుతున్నారో, అనగా రామ ఆత్మ యే ఈ కలియుగం అంతిమ జన్మలో ఎప్పుడైతే
ఆటం బాంబులు తాయారు అవుతాయో అప్పుడు, ఆ సమయం లో హర హర బం బం అనే పిలుపు
ప్రాక్టికల్ గా నిరూపించే శంకరుని మూర్తి అని నిరుపించబడతారు. శంకరుని మహాదేవుడు
అని ఎందుకు అంటారు? వేరే దేవతలను మహాదేవుడు అని ఎందుకు అనలేదు. ఎవరు పెద్ద కార్యం
చేస్తారో అతను పెద్ద దేవత అనబడతాడు. పెద్ద పని ఏమిటి, వేరే ధర్మం లో వేరే ధర్మ
పితలు ఆ పెద్ద కార్యం చేయలేదు. ఎంత పెద్ద కార్యం పరమాత్మ శివుడు శంకరుని ద్వారా
చేస్తారు. ఏ కార్యం, అందరూ ధర్మ పితలు వచ్చి తమ తమ ధర్మం స్థాపన కార్యం చేశారు, తమ
తమ ధర్మం ధారణలు వినిపించారు. మరియు తమ ధర్మ స్థాపన కార్యం చేసి వెళ్ళిపోయారు. పాత
పరంపరలను నష్టం చేయలేదు. పాత ధర్మాలు ఏవైతే నడుస్తున్నాయో వాటిని నష్టం చేయలేదు.
పాత తనం నష్టం కాలేదు, మరి కొత్త ధర్మం స్థాపన ఐపోయింది. అప్పుడు రెండింటిలో ఏమి
జరుగు తుంది, జగడమే అవుతుంది. ఇబ్రహీం వచ్చి ఇస్లాం ధర్మం స్థాపన చేశాడు, సనాతన
ధర్మం భారత్ లో ముందే స్థాపన అయి ఉంది, మహాత్మా బుద్ధుడు వచ్చి బుద్ధ ధర్మం స్థాపన
చేశాడు, క్రీస్తు వచ్చి క్రిష్టియన్ ధర్మం స్థాపన చేశాడు. గురు నానక్ వచ్చి శిక్ఖ్
ధర్మం స్థాపన చేశాడు, ఎంత మంది ధర్మ పితలు వచ్చారో వాళ్ళు వాళ్ళ ధర్మాల ధారణలు స్థాపన
చేశేశారు. మరియొక కొత్త వాదన ఆరంభించారు, పురాతన పురాతన కు రీతులు ఎవరూ నాశనం
చేయలేక పోయారు. ఆ కార్యం శంకరుని ద్వారా పరమాత్మ వచ్చి చేయిస్తారు. అన్ని అధర్మాల
వినాశనం. ధర్మం పేరుతొ వితండ వాదం వ్యాపింపజేసే ఎన్నైతే అధర్మాలు అయిపోయాయో ఆ
అందరు అధర్మియుల వినాశనం మరియు సద్ధర్మంయోక్క స్థాపన బ్రహ్మ ద్వారా పరమాత్మ వచ్చి
చేయిస్తారు. కనుక బ్రహ్మ ద్వారా శ్రేష్ట బ్రాహ్మణులు ఐతే తాయారు అయి ఉన్నారు, కానీ
వారి ప్రత్యక్షత ఎప్పటి దాక అవ్వదంటే, ఎప్పటి వరకు అనేకానేక విధర్మియులు, రావణ
మేఘనాథ కుంభకర్ణు ల వంటి దుష్ట బ్రాహ్మణులు కూడా జన్మిస్తారు తోడు తోడుగా శ్రేష్ట
బ్రాహ్మణుల సంఖ్య తక్కువ ఉంటుంది. బ్రహ్మ ముఖం నుంచి జన్మించే వారు. ముఖ వంశావళి
బ్రాహ్మణులు జన్మిస్తారు, ఎవరైతే బ్రహ్మ ముఖం నుంచి వచ్చిన వాణి బ్రహ్మ ముఖం నుంచి
వెలువడిన జ్ఞానానికి విలువ నిస్తారు. బ్రహ్మ శరీరానికి ఎక్కువ విలువ ఇవ్వరు,
బ్రహ్మ శరీరానికి దేహానికి ఎక్కువ ప్రేమ ఇవ్వరు, బ్రహ్మ కుమారీ కుమారుల దేహాన్ని
ప్రేమించరు, కానీ బ్రహ్మ ముఖం నుంచి వెలువడిన భగవంతుని వాణి కి ఎక్కువ ప్రేమ
ఇస్తారు విలువ ఇస్తారు. ఆ ముఖ వంశావళి
బ్రాహ్మణులు గురు వశిష్ట విశ్వామిత్ర లాంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు. వారినే
సప్త ఋషులు అంటారు. మిగతా అందరూ ఆసురీ బ్రాహ్మణులు తాయారు అవుతారు. అనేకానేక
సంఖ్యలో. ఇప్పుడు ఇది ప్రాక్టికల్ గా ఋజువు కాబోతున్నది. బ్రహ్మ ద్వారా బ్రహ్మ
కుమారీ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం ఏదైతే దేశ
లో గ్రామ గ్రామాలలో, మరియు విదేశాలలో వ్యాపించి ఏదైతే ఉన్నాయో వాటిల్లో మంచి మంచి
శ్రేణి లో ఉన్న బ్రాహ్మణులూ ఉన్నారు కానీ చాల తక్కువ మంది. మరియు చెడ్డ లో చెడ్డ
వారు కూడా ఉన్నారు కాని చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. కనుకనే బ్రహ్మ ద్వారా ఏ మురళి
వినిపించారో ఆ మురళి లోనే బాబా మురళి లోనే చెప్పారు, దుష్టుల్లో దుష్టుల్ని చూడాలి
అంటే ఇక్కడ బ్రాహ్మణులలో చుడండి అని, మరియు మంచి లో మంచి వాళ్ళని చూడాలి అంటే
ఇక్కడ బ్రహ్మ కుమారీ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం లోపల చుడండి అని. అనగా అన్ని రకాల
ఆత్మలు అనగా ఏ ఆత్మలు హిందువుల నుంచి వేరే వేరే ధర్మాలలో కన్వర్ట్ అవుతూ వచ్చారు
వేరే ధర్మాల వాళ్ళు ఎప్పుడు కన్వర్ట్ అయ్యి హిందువులు అవ్వనే లేదు ఆర్య సమజిలు
తప్ప, ఈ ఆర్య సమాజం అంతిమ 100 ఏళ్ళల్లో వ్యాపించింది దీని కన్నా ముందు ఎంత మంది
ధర్మ పితలు వచ్చారో వారంతా హిందువుల నుంచే కన్వర్ట్ చేసి తమ ధర్మం పెంచుకుంటూ
వచ్చారు, వేరే ధర్మం వాళ్ళ సంఖ్య పెరుగుతూ వచ్చింది. మరియు హిందువుల సంఖ్య తక్కువ
అవుతూ వచ్చింది. లోకంలో ఏ ధర్మాలు వెయ్య, రెండు వేల ఏళ్ల లోపు వాళ్ళు వంద, రెండు
వందల వేల కోట్ల సంఖ్య (జనాభా) పెరిగి పోయింది. మరి దేవతలు దేవతా ధర్మం ఆత్మలు
హిందువులు అని పిలవబడే వారు వారి సంఖ్య 33 కోట్లు. సంఖ్య ఎవరిది ఎక్కువ ఉండాలి.
పురాతనం వాళ్ళు, పురాతన ధర్మం వారి సంఖ్య ఎక్కువ ఉండాలా, లేదా కొత్త కొత్తగా
వచ్చిన ధర్మాల వారి సంఖ్య ఎక్కువ ఉండాలా? పురాతన ధర్మం వారి సంఖ్య ఎక్కువ ఉండాలి.
వారి సంఖ్య తక్కువ ఎందుకు అయ్యింది, ఎందంకంటే వేరే వేరే ధర్మాలలో కన్వర్ట్ ఐపోతూ
వచ్చారు. కన్వర్ట్ ఎందుకు అయ్యారు, ఎందుకనే కన్వర్ట్ ఆ ఆత్మలే అవుతారు ఎవరైతే గత
చతుర్యుగి (కల్పం) లో కన్వర్ట్ ఐనవారే మళ్ళి కన్వర్ట్ అవుతున్నారు. పూర్వ కల్పం లో
వేరే ధర్మాల నుంచి పరమాత్మ వేరే ధర్మాలలో శ్రేష్ట ఆత్మలను పరమాత్మ ఆకర్షించి లాగి
బ్రాహ్మణులను చేశారు, ఆ బ్రాహ్మణ ఆత్మలే ఇప్పుడు 9 గోత్రాల బ్రాహ్మణులు గ తాయారు
అయ్యారు. శాస్త్రాల్లో బ్రాహ్మణుల 9 గోత్రాలు ఉన్నాయి అని వ్రాశారు. 9 మంది ఋషులు
ఉన్నారు అని. ఆ 9 ఋషుల పేరు పై బ్రాహ్మణుల 9 గోత్రాలు ఉన్నాయి. కొంత మంది కశ్యప
గోత్ర బ్రాహ్మణులు, కొందరు భారద్వాజ గోత్ర బ్రాహ్మణులు. ఒకరి కన్నా ఒకరు మంచి
బ్రాహ్మణులూ, మరియు ఒకరి కన్నా ఒకరు నీచ గోత్రం బ్రాహ్మణులూ కూడా ఉన్నారు, వారు
ప్రాక్టికల్ గా ఇప్పుడు తయారు అవుతున్నారు. వారిలో రెండు వంశాలు శ్రేష్ఠ మైనవి.
వారి గురించి శాస్త్రాల్లో గానం చేశారు. ఒకరు సూర్య వంశం ఒకరు చంద్ర వంశం. శంకరుడు
మూడవ నేత్రం రూపం లో లోకం లో ప్రసిద్ధి పొందుతారు అయన జ్ఞాన సూర్యుడు, మరియు
బ్రహ్మ శీతల జ్ఞానం ఇస్తారు పిల్లలకి, ఆ శీతల జ్ఞాన ప్రకాశం ఇచ్చే బ్రహ్మ జ్ఞాన
చంద్రమ, చంద్రుని వెలుగులో పురుగు పుట్ర
వంటి ఆత్మలు కూడా పెరుగుతాయి. మరి సూర్యుని వెలుగులో పురుగు పుట్ర వంటి ఆత్మలు
అన్నీ సమాప్తం అయిపోతాయి. కనుక బ్రహ్మ ద్వారా బ్రహ్మ కుమారీ ఆశ్రమం లో ఏ
బ్రాహ్మణులు తాయారు అయ్యారో వారు 2 రకాల బ్రాహ్మణులు తాయారు అయ్యారు. రావణ
కుంభకర్ణ మేఘనాధు ల వంటి బ్రాహ్మణుల సంఖ్య అనేకం మరి గురు వశిష్ట విశ్వామిత్ర వంటి
శ్రేష్ఠ బ్రాహ్మణులు ముఖ వంశావళి బ్రాహ్మణులు ముఖం నుంచి వచ్చిన జ్ఞానం విని తమ
జీవనం లో పరివర్తన తెచ్చుకుంటారు వాళ్ళు తక్కువ సంఖ్య లో ఉన్నారు. యజ్ఞం ఆదిలో
ఉన్నవారు, పూర్తి ఆది లో 36 వ సమ్వత్సరం లో 36 నుంచి 45, 46 వరకూ ఉన్నవారు మరియు ఆ
సమయం (47) లో వెళ్ళిపోయారు, వారు సూర్య వంశీయులు ఆ తరవాత మళ్ళి బ్రహ్మ ముఖం నుంచి
వాణి నడిచిందో ఏది మురళి అనబడిందో బ్రహ్మ కుమారీ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం లో అన్ని
ధర్మాల అత్మలూ బ్రహ్మ ఒడిలో పెరుగుతూ వచ్చారు. చంద్రవంశియులు పెరిగారు, బౌద్ధి,
ఇస్లమియులు సంరక్షణ పొందారు అంటే ప్రతి ధర్మం లోను శ్రేష్ఠ ఆత్మలు ఎన్నుకోబడి వారు
బ్రహ్మ ఒడిలో సంరక్షించ బడ్డారు, వారు ఇప్పటికి బ్రహ్మ కుమారీ ఈశ్వరీయ విశ్వ
విద్యాలయం లో పాలన పొందుతున్నారు. అక్కడ (వర్చస్వము) ఆధిపత్యము బ్రహ్మ కుమారీ
ఈశ్వరీయ విశ్వ విద్యాలయం లో బ్రహ్మ శరీరం విడిచాక ఆ విధర్మియుల ఆధిపత్యమే యే
నడుస్తున్నది. చంద్ర వంశీ శ్రేష్టాత్మల దేమాత్రమూ ఆధిపత్యము నడవడం లేదు. ఆ ఆత్మలు చాలావరకు అసిస్టెంట్ టీచర్
రూపం లో కార్యం చేస్తూ ఉండవచ్చు, కానీ ఇంచార్జ్ రూపం లో చాలా తక్కువ మంది ఆత్మలు
ఉన్నారు. ఒక వేళ ఇంచార్జ్ రూపం లో కార్యం చేస్తున్నా కూడా వారి పై పురాతన పురాతన
సింధి వాళ్ళు ఉన్నారు, వీరినే శాస్త్రాల్లో జరా సంధుడు అని పేరు పెట్టారు. జరా
అంటే పురాతన జరా అంటే జీర్ణ సింధి అనగా సింధీ, ఎందుకంటే ఈ జ్ఞానం ప్రారంభం సత్సంగం
ప్రారంభం సింధు హైదరాబాద్ నుంచి అయ్యింది ఎవరు లోకంలో అందరికన్నా దిగజారిన
బ్రాహ్మణ జాతి వాళ్ళు అని నమ్ముతారో ఎవరు మాంసం చేప గుడ్డు తాగుడు, చేస్తారో
పశ్చిమం వైపు బ్రాహ్మణులు, ఏమి విశ్వసిస్తారు అంటే ఎంత ఎంత తూర్పు వైపు
బ్రాహ్మణులో వారు అంత ఉన్నత కులం వాళ్ళు అంటారు, మరి ఎంత ఎంత పడమర బ్రాహ్మణులో ఎలాగంటే
సింధు హైదరాబాద్ సింధీ బ్రాహ్మణులు అంత నీచ కోటి బ్రాహ్మణులు ఆహార విహారాలు వారివి
అన్ని నీచం గ ఉంటాయి. కనుక అందరికన్నా నీచ వర్గం బ్రాహ్మణులలో మొట్ట మొదట శివ
పరమాత్మ ప్రవేశిస్తారు అయన పేరు పెడతారు దాదా లేఖ రాజు అతను తల్లి రూపం లో పాత్ర
చేస్తారు. కనుకనే శివుని త్రిమూర్తి ... ఆ మూడు ముర్తులవి మూడు శ్రేణులు ఉన్నాయి
అది ఇప్పటికి మన భారత దేశం లో ఝండా రూపం లో ఝండా అది స్మృతి చిహ్నం గా చూప బడింది.
మూడు వస్త్రాల గుర్తు. మూడు శరీర రూపి వస్త్రాలు వారు విశ్వం పై విజయం సాధించి
చూపారు. వాళ్ళు కేవలం గానం చేస్తారు, పిల్లలచేత పాట పాడిస్తారు. దాని అర్ధం
తెలియదు, “విశ్వ విజయి కరకే దిఖలాయే తబ్ హోవే ప్రణ పూర్ణ హమారా ఝండా ఉంచా రహే
హమారా”” విశ్వ విజయం చేసి చూపిస్తాం అప్పుడు మా ప్రతిజ్ఞ పూర్తి అవుతుంది , మా
ఝండా ఉన్నతం గా ఉండాలి”” అని. ఆ బట్ట
వస్త్రం ఝండా ఏమి విశ్వ విజయం సాధించదు. లోకంలో ఎన్నో ఝండాలు ఉన్నాయి , ఏదైనా ఝండా
ఉందా అది విశ్వం పై విజయం సాధించిందా ? కానీ భారత ఝండా గురించి ఈ గానం ఉంది. అనగా
మూడు రంగుల ఝండా పైన ఎరుపు మధ్యలో తెలుపు, కింద ఆకుపచ్చ. పైన ఎరుపు లోకంలో క్రాంతి
చేసిన సూచిక, క్రాంతి వల్లనే శాంతి కలుగుతుంది. అన్ని ధర్మాల ఖండన చేస్తారు. శంకరుని
మూడవ నేత్రం లోకంలో ధర్మం పేరుతొ అధర్మం వ్యాపించి ఉన్నవో వాటి అన్నిటి ఖండన
చేసేస్తారు. మరియు బ్రహ్మ ద్వారా పరమాత్మ శివుడు ఏ ధారణలు స్థాపన చేశారో వాటి
సంవర్ధనం చేస్తారు. అనగా బ్రహ్మ ద్వారా ఏ శ్రేష్ఠ సృష్టి రచించ బడుతుందో దాని
సంవర్ధన, సత్యమైన బ్రాహ్మణుల సంవర్ధనం, మరియు దుష్ట బ్రాహ్మణులూ, దుష్ట సృష్టి
ఉందో, ఆ మొత్తం సృష్టి వినాశనం, చేస్తారు, ధర్మ సంస్థాపనార్ధాయ.... అని గీత లో
శ్లోకం వచ్చింది కదా. వినాశాయచ ద్రుష్క్రుతాం. భగవంతుడు ఎందుకు వస్తారు, ధర్మ
స్థాపన కోసం, మరియు దుష్ట కార్యాలు చేసే అధర్మ పరులు వారి వినాశనం చేయడానికి.
ఈనాడు లోకంలో అటువంటి దేశం ఏది అది వేరే వారిని వేలు చూపి ఆతంకవాదులు అని
చూపుతుంది కానీ వాస్తవంగా చుస్తే లోకంలో ఎన్నైతే చిన్న చిన్న దేశాలు ఉన్నవో వాటిని
అన్నింటిపై ఆక్రమణ చేసి అన్నింటినీ లోబరుచుకుంటూ ఉన్నదో తన కంట్రోల్ లో
తీసుకుంటున్నది. ఆ దేశం ఏది. అమెరికా, అమెరికా లో ఏ ధర్మ ఖండం వారు ఎక్కువ ఉన్నారు
అక్కడ ఆధిపత్యం ఎవరికి ఉంది ఇసాయి, క్రిస్టియన్ ధర్మం, అలాగే మన బ్రహ్మ
కుమారీఈశ్వరీయ విశ్వ విద్యాలయం లో లోకం యొక్క చిన్న రూపం (మాడల్) చూడ వచ్చు.
బ్రహ్మా అనగా కృష్ణుని ఆత్మ, కృష్ణుని మరియు క్రైస్ట్ యొక్క రాశి కలపవచ్చు.
కృష్ణుడి ని గురించి కూడా చెపుతారు పాదం లో ముల్లు గుచ్చుకుంది అని, వేటగాడు బాణం
వేశాడు అప్పుడు అయన శరీరం విడిచాడు అని. మరియు
క్రైస్ట్ యొక్క పాదాల్లో చేతుల్లో మేకులు దిగవేశినట్లు చూపారు, మేకులు కొట్టారు,
అతను శరీరం విడిచాడు. కృష్ణుడి కి కూడా చూపుతారు అతను జన్మ ఒక మాత దగ్గర
తీసుకున్నాడు, మరియు పాలన వేరే చోట జరిగింది అని. అలాగే క్రైస్ట్ కి కూడా
చూపిస్తారు. అతను ఎవరో కుమారీ ద్వారా జన్మ తీసుకున్నాడు అని. మరియు అతని పాలన
తరవాత వేరే చోట జరిగింది అని. కనుక చాలా విషయాలు కృష్ణుని జీవనం లో జరిగినవి
క్రైస్ట్ జీవనం లో జరిగినట్లు కనిపిస్తాయి. ఎలాగైతే క్రిస్టియన్ లలో చాలా ఆడంబరం
కనిపిస్తుంది. అలాగే కృష్ణుని జీవనం లో కూడా చాలా ఆడంబరం చూపించారు. కృష్ణుని
కృష్ణ భక్తులు చాలా ఉన్నతుడిని చేసి చూపారు. ఎంతవరకు చుపారంటే అతను భగవంతుడు అని
నిరూపించారు. గీతా భగవంతుడు సాకారం లో ఏ రూపం అంటే అతను కృష్ణుడు అని. గీత
చదువుతున్నప్పుడు మాత్రం అందులో అనేక మైన శ్లోకాలు చదివే వాళ్ళు చూడవచ్చు ఆ
శ్లోకాల ద్వారా అది నిరాకార వాది రచన అని ఋజువు అవుతుంది. గీత లో అనేక మైన
శ్లోకాలు అది రచించినది నిరాకారి లోకం లో
ఉండే అయన అని ఋజువు అవుతుంది. భగవంతుడు స్వయం గీతలో శ్లోకం లో చెపుతున్నారు “న తత్
భాసయతే సూర్యో న శాశాంకో న పావకః యద్
గత్వా న నివర్తన్తే తత్ ధామ పరమం మమ” అనగా ఏ లోకంలో సూర్యుడు, నక్షత్రాలు,
చంద్రుడు యొక్క ప్రకాశం ప్రవేశించదో, ఎక్కడకు వెళ్లి ఆత్మలు తిరిగి ఈ మృత్యు లోకం
లోకి నరకం లోకి రావో అది నా పరంధామం, శాంతి ధామం అనండి, పరం ధామం అనండి, బ్రహ్మ
లోకం అనండి, సోల్ వరల్డ్ అనండి నేను అక్కడ ఉండే వాడను. కనుక సోల్ వరల్డ్ అంటే
నిరాకారీ ఆత్మలు సోల్ వరల్డ్ లో ఉండే వారు కూడా నిరాకారీ యే కదా. కనుక నిరాకారుడు
భగవంతుడు అని ఋజువు అవుతారు గీత లో. కానీ గీత రాసే వారు ఎవరి పేరు పెట్టేశారు
గీతలో కృష్ణ భగవానువాచ. కృష్ణుని పేరు (రుద్దేశారు)పెట్టేశారు. ఈ కృష్ణుని పేరు ఎవరి
చే (రుద్ద బడింది)పెట్ట బడింది? కృష్ణుని ఫాలోవర్స్ ద్వారా పెట్ట (రుద్ద) బడింది.
బ్రాహ్మణుల లోకం లో కూడా దీని షూటింగ్ అవుతుంది. పరమాత్మ శివుడు ఈ సృష్టి లోకి
వచ్చి నప్పుడు షూటింగ్ చేయిస్తారు సంగమ యుగం లో కలియుగం అంతం మరియు సత్యయుగం ఆది
లో 5000 ఏళ్ళ డ్రామా నాలుగు యుగాల డ్రామా సత్య యుగం త్రేతా ద్వాపర కలియుగాలు ఈ
నాలుగు యుగాల నాలుగు సీన్ ల షూటింగ్ చేయిస్తారు. ఈ నాలుగు యుగాల షూటింగ్ లో
పరమాత్మ మొత్తం 500 కోట్ల మనుష్యాత్మలను జ్ఞానం ఇచ్చి వాళ్ళను బతికిస్తారు
అన్నట్లు. అజ్ఞాని అంటే అజ్ఞాన నిద్రలో నిద్రిస్తున్నట్లు, చనిపోయినట్లు, ఎలాగంటే
ముస్లిములు క్రిస్తియనులు ఖుదా వచ్చి కయమత్ (వినాశనం) జరిగినప్పుడు సమాధుల నించి
ఆత్మలను లేపుతాడు అని నమ్ముతారు. అప్పుడు వాళ్ళు బతుకుతారు అంటారు. ఆత్మ శరీరం
విడిచినప్పుడు సమాధి లోకి వెళ్లి పోతుంది అని క్రిస్టియన్లు ముస్లిం లు నమ్ముతారు.
సమాధిలో కి వెళ్లి పోవడం అంటే వాళ్లకి అర్ధం తెలియదు. సమాధి లోకి పోవడం అంటే ఈ
సృష్టి లో ఉన్న ఆత్మలు అందరూ ఆది లో జ్ఞాన యుక్తం గా ఉంటారు, అసలైన జ్ఞానం
వాళ్ళల్లో ఉంటుంది మేము జ్యోతి బిందు ఆత్మ అని ఈ శరీరం మట్టి అని, మట్టి బొమ్మ
అని. ఈ జ్ఞానం వాళ్ళల్లో ఉంటుంది. కాని కలియుగం అంతం లోకి వస్తూ వస్తూ ఈ జ్ఞానం
ఎగిరి పోతుంది. నిజమైన జ్ఞానం అది పోతుంది. ఆత్మలు అందరూ తమని మట్టి శరీరం
అనుకుంటారు, తమని మేము మట్టి బొమ్మలము అనుకుంటారు. అందరూ మేము ఆత్మ అనే విషయం
మరిచి పోతారు. హిందువులు కూడా మరిచి పోతారు బొట్టు పెట్టుకుంటారు, తిలకం
పెట్టుకుంటారు, ఎందుకు పెట్టుకుంటారు ఆత్మ జ్యోతి బిందు ఇక్కడ (భ్రుకుటి) లో
స్థిరం గా ఉంది స్టార్ అని పూర్తిగా మర్చి పోతారు. కేవలం చూపించుకోవడానికి బొట్టు
తిలకం పెట్టుకుంటారు. కాని వాళ్లకు గుర్తు లేదు. ఆ ఆత్మ జ్యోతి బిందు ఆ ఆత్మ లో
ఎలా అన్ని జన్మల సంస్కారాలు నిండి ఉన్నాయి. ఇది వాళ్ళ బుద్ధి లో రాదు. ఆ ఆత్మలో
మనసు బుద్ధి సంస్కారం ఈ మూడు శక్తులు ఇమిడి ఉన్నాయి. ఆత్మ శరీరం విడిచినప్పుడు,
శరీరం విడిచి ఆత్మ వెళ్లి పోయింది ఆ శరీరం లో శవం లో మనసు బుద్ధి ఉండిపోయింది
అనలేము. శరీరం విడిచి ఆత్మ వెళ్లి పోయింది అంటే మనసు బుద్ధి శక్తి ఆత్మ వెళ్లి
పోయింది. మిగతా శరీరం అంతా ఇక్కడే ఉంది. పది జ్ఞానేంద్రియాలు మరియు కర్మేంద్రియాలు
అన్ని ఇక్కడే ఉన్నాయి పూర్తి శరీరం అంతా ఇక్కడే ఉంది. మరి ఏది వెళ్లి పోయింది.
మనసు బుద్ధి యోక్క పవర్ వెళ్లి పోయింది. ఏ మనసు బుద్ధి పవర్ ఉందో అదే ఆత్మ. ఆ మనసు
బుద్ధి పవర్ జ్యోతి బిందు రూపం లో ఇక్కడ ఈ మస్తకం లో నివాసం ఉంటుంది. దాని వెలుగే
ఈ కళ్ళ నుంచి వెలువడుతు ఉంది. మనిషి మృత్యువు ఐతే కళ్ళ వెలుగు వెళ్లి పోతుంది.
అనగా ఆత్మ జ్యోతిర్మయము. ఆ జ్యోతిర్మయ ఆత్మ వెళ్లి పోయింది. కళ్ళు బటన్ ఐపోయాయి.
వాటిలో ఏ మాత్రం వెలుగు లేదు. కనుక ఆ జ్యోతిస్వరూప ఆత్మ జ్యోతి బిందు ఆత్మ అతి
సుక్ష్మ ఆత్మ భ్రుకుటి కి మధ్యలో నివాసం ఉంటున్నది అది ఇప్పుడు తనని దేహం అనుకుంటున్నది.
మరియు ప్రతి మనిషి తనను దేహం అనుకుంటున్నాడు. ఎవరినైనా అడగండి మీరు ఎవరు అని నేను
డాక్టర్ ను అంటారు, మీరు ఎవరు అంటే, మేము వకీలు అంటారు, మీరెవరు అంటే మేము ప్రైం
మినిస్టర్ ను అంటారు, మీరెవరు అంటే మేము చర్మ కారుడిని అంటారు. చెప్పులు కుట్టే
వాడిని, అలాగే చెపుతారు కదా. ఎవరూ కూడా నేను జ్యోతి బిందు ఆత్మను అని చెప్పరు. ఈ
కలియుగం అంతం లో అందరూ ఇలా సమాధిలో వాళ్ళుగా ఐపోతారు. సమాధి అంటే మట్టి. (బొంద)
ఉన్న ఆత్మలు అందరూ ఈ శరీర రూపి మట్టి లో ఇమిడి పోయారు. మట్టి లాగా అయిపోయారు. తమని
దేహం అనుకుంటున్నారు. సమాధి లో కి వెళ్లి పోయారు అంటే ఇది అర్ధం. హిందువులు
అవ్వండి, ముసల్మానులు అవ్వండి, క్రిస్టియన్లు అవ్వండి చివరి జన్మకి వచ్చి అందరూ
సమాధి గ్రస్తులు (బొంద) ఐపోతారు. ఇప్పుడు వినాశనం టైం వచ్చేసింది ఆటం బాంబులు
తాయారుగ ఉన్నాయి హర్ హర్ బం బం టైం వచ్చేసింది. శంకరుని పేరుతొ కూడా బం బం శబ్దం
కలుపుతారు. ఏదో కారణం ఉండాలి కదా. విష్ణువు పేరుతొ ఎందుకు హర హర బం బం కలపలేదు.
బ్రహ్మ పేరుతొ బం బం ఉచ్చారణ చేయరు. ఎందుకంటే విష్ణు బ్రహ్మ లు బాంబుల విస్ఫోటనం
చేయరు. బాంబులు చేయించడం, బాంబుల విస్ఫోటనం చేయించడం ఇది అయన చేతిలో నియంత్రణ
శక్తి ఉంది ఆ పరమాత్మ ఈ సృష్టి లోకి వచ్చి నప్పుడు అదే సమయం లో ఆటం బాంబు అనే
వస్తువు మనిషి బుద్ధి లో వస్తుంది. 36 సం. ఈ జ్ఞానం ప్రారంభం అయ్యింది దాని యొక్క
7, 8 ఏళ్ల తరవాత 20 , 20 మెగా వాట్ల బాంబులు తయారు అయ్యాయి. హిరోషిమా నాగసాకి
నగరాల పై వేయబడ్డాయి. దానికి 5 ఏళ్ళ క్రితం మనిషి బుద్ధి లో అటామిక్ ఎనర్జీ యొక్క
పేరు గుర్తులే లేవు. (అంటేనే తెలియదు). ఎక్కడి నుంచి ఈ జ్ఞానం వచ్చింది? ఆ పరమాత్మ
స్వయం ఈ సృష్టి లోకి వస్తారో అప్పుడు శంకరుని ద్వారా ప్రేరణ ఇచ్చి ఆ వైజ్ఞానికుల
ద్వారా అటమిక్ ఎనర్జీ తయ్యారు చేయిస్తారు. ఆ అటమిక్ ఎనర్జీ తాయారు చేసే వాళ్ళలో
ఇంత శక్తి లేదు ఆ ఎనర్జీ విస్ఫోటనం చేసి మొత్తం సృష్టి ధ్వంసం చేయ గలిగే శక్తి లేదు. ఆ శక్తి కూడా వాళ్ళలో ఎప్పుడు
వస్తుందంటే శంకరుడు తన మూడవ నేత్రం తెరిచి నప్పుడు. మరియు వారిని ఆర్డర్ చేస్తారు,
అనగా ప్రేరణ ఇస్తారు ఈ లోకం పూర్తిగా ధ్వసం చేయండి అని కొత్త లోకం తాయారు ఐపోయింది
అని కొత్త ప్రపంచం సంగటన కూటమి (సమూహం) తాయారు ఐపోయింది అని. అనగా స్వర్గం తాయారు
ఐపోయింది, జన్నత్, పారడైజ్ తాయారు ఐపోయింది. స్వర్గపు కొత్త లోకం తాయారు ఐపోయింది.
ఇప్పుడు ఈ పాత లోకం 500 కోట్ల ఆత్మల లోకం వినాశనం కనుక ఈ వినాశ కార్యం మహాదేవుడు
శంకరుడు తప్ప ఈ సృష్టిలో ఎవరూ చేయ లేరు. లేదా చేయించలేరు. కనుకనే ఆయనను మహాదేవుని
స్టేజ్ లో కూర్చో పెట్టారు ముగ్గురు మూర్తులలో. బ్రహ్మ మూర్తి అయన పైన విష్ణు వు
మూర్తి తెల్ల వస్త్రం అతనికన్నా పైన శంకరునికి గుర్తు ఎరుపు వస్త్రం. ఏమి క్రాంతి
చేస్తారు. ఎన్ని ధర్మాలు ఉన్నాయో ఆ ధర్మాలు అన్నింటిలో ఎటువంటి జ్ఞానం వ్యాపింప
చేస్తారంటే ఆ ధర్మాలన్నీ స్వతహాగానే అన్ని చోట్ల నుంచి సమాప్తం అయిపోతాయి. మరియు
సద్ధర్మ స్థాపన అవుతుంది. ఏ సద్ధర్మ స్థాపన జరుగుతుందో, ఏ కొత్త సమూహం తాయారు
అవుతుందో దాని పాలన కార్యం విష్ణువుకు అప్పగించ బడుతుంది. విష్ణువు నాలుగు భుజాల
వ్యక్తి ఉండరు, నాలుగు భుజాలు అంటే నాలుగు విశేష ఆత్మలు సహయోగి అవుతారు. ఆ నలుగురి
సంస్కారాలు కలిసి ఒకటి ఐపోతారు. ఆయననే విష్ణు భగవానుడు అంటారు. నలుగురు ఎవరు,
రామునితో సీత, మరియు కృష్ణునితో రాధ, ...రాదా కృష్ణులు, రామ సీతలు ఈ నలుగురు భుజాల
రూపం లో సహయోగి ఆత్మలు అంటారు. భుజ అంటే సహయోగి. అంటారు కదా మా అన్నయ్య చనిపోయారు
మా కుడి భుజం తెగిపోయింది అని. కుడి భుజం తెగిపోయింది అంటే అర్ధం ఏమిటి సహయోగి
సమాప్తం ఐపోయాడు. కనుక భుజం యొక్క గుర్తునే శాస్త్రాల్లో లేదా శాస్త్రకారులు లేదా
అజంతా ఎలోర ఎలాఫెంటా గుహలలో చిత్రాలు తాయారు చేశారో నేటికి 2000 ఏళ్ళ క్రితం ఆ
చిత్ర కారులు ఆ చిత్రాలలో భావం నింపారు. భుజాల రూపం లో కార్యం చేసే వారు నలుగురు
విశేష ఆత్మలు ఈ సృష్టి లో సహయోగులు భగవంతుని కార్యం లో సహయోగులు అవుతారు. వారు
సంఘటితం అయినప్పుడు వారిని విష్ణు రూపం అంటారు. విష్ణు భగవాన్. అతను కొత్త సృష్టి
పాలన కర్త. ఈ నాలుగు భుజాలు కలిసి. బ్రహ్మ తో పాటు సరస్వతి, 68, 69 వరకు కార్యం
చేశారు ఈ సృష్టి లో అయన తరవాత ఇప్పుడు శంకరుని ద్వారా, శంకరుడు మరియు అయన సహయోగిని
శక్తి పార్వతి ఈ ఇద్దరు శక్తులు రాముడు సీత ఈ ఇద్దరు కలిసి ఇప్పుడు కూడా యజ్ఞం లో
కార్యం చేస్తున్నారు. అడ్వాన్స్ పార్టీ ద్వారా ఈ కార్యం సంపన్నం అవుతున్నది ఆ
కార్యం సంపన్నం అవుతూనే ఆ అడ్వాన్స్ కూటమి తాయారు కాగానే బ్రాహ్మణుల పాత కూటమి
దేని సత్తా అసురుల చేతి లోకి వెళ్లి పోయింది, కన్వర్టెడ్ బ్రాహ్మణుల చేతిలోకి
వెళ్లి పోయిందో ఆ కన్వర్టెడ్ బ్రాహ్మణులు తక్కువ కళల బ్రాహ్మణులు ద్వాపరయుగం
వస్తూనే వేరే ధర్మాలలో కి కన్వర్ట్ ఐపోతారు భారత్ పేరు పాడు చేస్తారు. వేరే ధర్మ
పితలు...... పేరు ప్రఖ్యాతి చేస్తారు భారత దేశానికి మోసం చేస్తారు. అవడానికి
పవర్ఫుల్ ఆత్మలే ఎందుకంటే భగవంతుని జ్ఞానం వాళ్ళు కూడా విన్నారు పవర్ఫుల్ అయినా
కూడా జ్ఞానం లోతులు అందుకోలేరు ఎంత ఆ జ్ఞాన దాత ఎవరిలో ప్రవేశించి జ్ఞానం ఇచ్చారో
అయన ఆధారం తీసుకున్న ఆ వ్యక్తిని వారు ఆధారం చేసుకుంటారు. పరమాత్మ శివుడు జ్ఞానం
ఇచ్చేవారు, మరి అయన రామ కృష్ణులలో ప్రవేశిస్తారు ఎవరైనా రామకృష్ణుల భక్తుడు
ఐపోయాడు శివునికి ఏ విలువా ఇవ్వక పొతే ఒకరు శివునికి విలువ ఇచ్చే ఆత్మ మరొకరు
రామకృష్ణ దేహ ధారులకు విలువ ఇచ్చే ఆత్మ. ఎవరు శ్రేష్ఠులు అయ్యారు ఎవరు ముఖం ద్వారా
విన్న జ్ఞానానికి విలువ ఇస్తే వాళ్ళు శివునికి విలువ ఇచ్చే వారు. ఎందుకంటే జ్ఞానం
నిరాకారి వస్తువు. మరి ఎవరు సాకారి దేహధారులకు మనుష్య ఆత్మలకు విలువ ఇస్తే .....వాళ్ళు
దేహానికి విలువ ఇచ్చే దేహఅభిమాని మనుషులు. ..కనుక దేహ అభిమానం తో జన్మించే వారు
రాక్షసులు మరియు జ్ఞానం ద్వారా జన్మించే వారు దేవతలు. దేవతలు ఎక్కువ లో ఎక్కువ
స్నాఖ్య కేవలం 33 కోట్లు, భగవంతుని జ్ఞానం వింటారు. మరియు ఈ సృష్టి లోకి వచ్చి
స్వర్గీయ సుఖం అనుభవం చేస్తారు. మిగతా ఇంత ఈ లోకం పెరిగి పోయింది 500, 700 కోట్ల
ఆత్మలు వాళ్ళంతా ఆసురీ సంస్కారం వాళ్ళు. ఇప్పుడు ఈ ఆసురీ లోకం అంత ధ్వంసం అయ్యేదే
ఉంది. అటమిక్ ఎజర్జి తయారయినదే ఇందుకు. కొత్త కూటమి తయారు అవుతూనే ఈ పురాతన సృష్టి
5 , 7 రోజులలో మొత్తం ఆట సమాప్తం అయిపోతుంది. అది చతుర్థ విశ్వ యుద్ధం అవుతుంది.
దానికన్నా ముందు మహాభారీ మహాభారత గృహ యుద్ధం జరగవలసి ఉంది. దాని సూచనలు ఇప్పుడు
భారత దేశం లో కనిపిస్తున్నాయి. దీని పక్క ప్రూఫ్ ఏమిటంటే భారత దేశం లో ఉన్నన్ని
రాజకీయ పార్టీ లు లోకం లో మరే ఇతర దేశం లో ఇన్ని రాజకీయ పార్టీ ల సంఖ్య ఎక్కువ
లేవు. కనుక అందరూ వాళ్ళల్లో వాళ్ళు
కొట్టుకుంటున్నారు. భారత దేశం లో ఎన్ని ధర్మాల వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్నారో
ఇన్ని ఎక్కువ లో ఎక్కువ ధర్మాల సంఖ్య ఎక్కువ ఎక్కువ ధర్మాల వాళ్ళు వేరే దేశాల్లో
లేరు. క్రిస్టియన్ దేశం ఐతే అక్కడ క్రిస్తియన్లే ఎక్కువ ఉంటారు, వేరే ధర్మ ఖండం
వాళ్లు ఉన్నా లేనట్లే (అత్యల్ప సంఖ్య) బౌద్ధ ధర్మ ఖండం ఉంటే అక్కడ బౌద్ధియులే
ఎక్కువ ఉంటారు. టిబెట్ లాగా. వేరే ధర్మం వాళ్ళు ఇంత ఎక్కువ సంఖ్య ఉండరు లోకంలో ఒకే
ఒక రాజధాని ఇక్కడ అన్ని ధర్మాల వాళ్ళు రాజ్యం చేశారు డిల్లి లో. ఇప్పుడు కూడా
చుస్తే డిల్లి ఎలాంటి రాజధాని అంటే అక్కడ ఎక్కువ మందిరాలు ఎన్ని ఉన్నాయో అన్ని ఎక్కువ
చర్చిలు ఉన్నాయి, అన్ని ఎక్కువ మసీదులు కూడా ఉన్నాయి, అన్ని ఎక్కువ గురుద్వారా లు కూడా ఉన్నాయి, అంటే అన్ని ధర్మాల
ఆధిపత్యం అక్కడ ఉంది దిల్లి దాని రాజధాని ఇది రెండవ ధర్మం ప్రూఫు, మూడవ ప్రూఫు
ఎన్ని రాష్ట్రాలు ఈ దేశం లో ఉన్నాయో, మరియు రాష్ట్ర వాదం తో ఎంత ఈ దేశంలో
వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుంటున్నారో అంత వేరే ఏ దేశం లోను కొట్టుకోరు. ఎం.పి
వాళ్ళు వాళ్ళ రాష్ట్రానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు, తమిళ్ నాడు వాళ్ళు తమ
రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వాలి అనుకుంటారు, యు. పి వాళ్ళు యు.పి కి ఎక్కువ
ప్రాధాన్యం ఇవ్వాలి అని కోరుకుంటారు. బంగాల్ వాళ్ళు బంగాల్ కి ప్రాధాన్యం ఇవ్వాలి
అనుకుంటారు. ఆంధ్ర ప్రదేశ్ వాళ్ళు తెలుగు దేశం పార్టీ ఆంద్ర ఏ అన్నింటిలో ముందు
ఉండాలి అనుకుంటారు. అదే అన్ని అనుకుంటారు. ఇలాంటి వాతావరణం తాయారు అవుతోంది.
Featured Post
ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్.
ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్. ఒక సంక్షిప్త పరిచయం ఇక్కడ కింద తేదీలు పుట సంఖ్యలు ఇచ్చినవి గురువు గారి ప్రవచనా...
-
మూడు లోకములు ---- ఆత్మ ఈ సృష్టి పైకి ఎచట నుండి వచ్చింది? కీటకములు, పశువులు పక్షులు అన్నీ ఆత్మలే అన్నిటిలో ఆత్మ ఉన్నది. ఈ చిత్రంలో పృధ్...
-
గీతా గర్భంలో ధార్మిక రాజనైతిక , సామాజిక మరియు వ్యక్తిగత జీవన సమాధానాలు నిక్షిప్తమై ఉన్నాయి. మనుష్య వ్యాఖ్యలు సముద్ర మంధనం లో...
-
సంస్కృత పాఠం - 11 ఏక వచనం బహు వచనం ఏతే నమంతి - వీరు నమస్...