Friday, October 30, 2020

 ACD- 364

మట్టిలో పాతిపెడతారు. ఈ దేహాన్ని మట్టి అంటారు అనగా ఎన్నైతే వేరే ధర్మాలు ఉన్నాయో, భారత్ ను విడిచి భారత దేశం సనాతన దేవీ దేవతా ధర్మం పరంపర వదిలి పెట్టి, వారు అందరూ దేహ అభిమానం అనే మట్టి లో కప్ప బడతారు, పాతిపెడతారు . పూర్తిగా దేహాభిమానం విడువ లేరు, ఎందుకంటే మట్టి సాంగత్యం అనుకుంటారు ఒక్క భారతీయ పరంపర ఎటువంటిదంటే దానిలో యోగాగ్ని లో తపింపచేస్తారు. మరియు దేహాభిమానం మొత్తం కాలిపోతుంది. కాలిన తరువాత ఏమి మిగులుతుంది. బూడిద మిగులు తుంది. ఎముకలు కూడా బూడిద అయిపోతాయి. దానిని కూడా తీసుకు వెళ్లి నది లో లేక తీర్థం లో తీసుకు వెళ్లి అర్పణ చేసేస్తారు. దానిని పూలు అంటారు. అనగా ఆత్మ యోగాగ్నిలో తన అన్ని పాప కర్మలూ భస్మం చేసేసిన తరువాత దుఃఖ దాయి ముళ్ళు నుంచి ఏమౌతుంది, చైతన్య పువ్వు అయిపోతుంది.  కనుక భారతీయ పరంపరలో ఇప్పటికీ కూడా ఈ క్రియా కర్మల  మహిమ ఉంది, ఈ సంస్కారాలు క్రియా కర్మల రూపం లో జరుపుతూ వస్తారు, శరీరం విడిచిన తరువాత దేహాన్ని కాల్చిన తరువాత 4 వ రోజు వరకు ఆ బూడిదను తీసుకు వెళ్లి నదిలో కలిపేస్తారు.  అనగా ఎన్ని ఐతే కర్మ కాండలు ఉన్నాయో, జన్మించిన దగ్గర నుంచి మృత్యు పర్యంతం వరకు భారతీయ పరంపరలో మహిమ ఉంది. కాని విదేశీయులు ఏమి అనుకుంటారు అంటే ఇది అంధ శ్రద్ధ అంధ విశ్వాసం అని , కానీ దీని అసలు అర్ధం తెలియదు. వాస్తవానికి భగవంతుడు ఈ సృష్టి పైకి వచ్చినప్పుడు సత్యమైన కర్మకాండలు చేయడం మనకు నేర్పిస్తారు. ఆ కర్మకాండ ల యొక్క రహస్యం చెపుతారు. ఈ కర్మ కాండలు అసలు రీతి లో గుర్తులు  ఏ సమయానివి అని, ఇప్పటివి అనగా కలియుగం అంతిమ సమయం లోవి. ఎప్పుడు పరమపిత తండ్రి వస్తారో, కలియుగి తమో ప్రధాన దుఃఖ దాయి మనుష్య సృష్టిని సుఖ దాయి సత్య యుగం లాగా పరివర్తన చేయడానికి, అప్పుడు సమస్త సృష్టి కి కొత్త సంస్కారం అవుతుంది. అక్కడ శరీరం కాలుస్తారు, మరి ఇక్కడ భగవంతుడు తండ్రి వచ్చి దేహ అభిమానాన్ని కాలుస్తారు. ఆత్మిక స్థితి లో స్థితు లవడం నేర్పిస్తారు. ఈ ఆత్మ భానం లో స్థితులు అవ్వడం ఇదే వాస్తవానికి దేహాభిమానాన్ని కాల్చడం.  ఆత్మ యోక్క స్మృతి, తోడుగా పరమాత్మస్వరూపం  యొక్క స్మృతి కూడా, ఈ ఆత్మ స్వరూపాన్ని ప్రజ్వలితం చేయడం మరియు పరమాత్మ తండ్రి తో దాని కలయిక చేయించడం దీనిలోనే అన్ని సమస్యలకూ సమాధానం దాగి ఉంది. 5 వికారాలు వచ్చేదే దేహాభిమానం వల్ల. కామ, క్రోధ, లోభ మోహ, అహంకారాలు, ఇవే దుఃఖ కారాణాలు ఇవ్వి దేహాభిమానం లో ఇమిడి ఉన్నాయి. వీటిని నష్టం చేయడానికి పరమాత్మ మూల మంత్రం చెపుతున్నారు. మనని మనం ఆత్మ అనుకుంటూ, బిందు, బిందు ఆత్మలకు తండ్రి సుప్రీం సోల్ జ్యోతి బిందు శివ ఉన్నారో , అయన పెద్ద రూపం శివ లింగం తాయారు చేశారో, ఆ జ్యోతిర్లింగాన్ని తలుచుకో. బిందువు,(బొట్టు) లేదా తిలకం భ్రుకుటి కి మధ్యలో పెట్టుకునే విషయం కాదు, గీతా శ్లోకం లో చెప్పినట్లు మనిషి అంతిమ సమయం లో ప్రాణం వదిలేటప్పుడు ఆ సమయం లో అతను ఏమి చేయాలి? భ్రువోర్మధ్యే ప్రాణ మావేశ్య సమ్యక్ భ్రుకుటి మధ్యలో ప్రాణము ను సమ్యక్ రూపం తో ధ్యానం చేయాలి, ఎందుకంటే దేని వాసం (నివాసం) ఎక్కడ ఉందో ఏది దాని ఇల్లో అది అక్కడ తొందరగా లభిస్తుంది. కనుక ఈ ప్రాక్టీసు చాలా సులువు, సహజం. శరీరం విడిచే టైం కి ఈ ప్రాక్టిస్ చేయలేము, మొదటి నుంచి చేయాలి, ఈ మనసు ఏకాగ్రం చేసే విధి , ఎందుకంటే మనసు బుద్ధి నే ఆత్మ అంటారు, మనిషి శరీరం విడిచి నప్పుడు మనసు బుద్ధి ఇక్కడ ఉండిపోయింది ఆత్మ వెళ్లి పోయింది అని అనరు, లేదు అన్ని కర్మేంద్రియాలూ ఉన్నాయి శరీరం లోనే ఉన్నాయి కానీ ఏది వెళ్లి పోయింది? ఏ శక్తి వెళ్లి పోయింది మనసు బుద్ధి దేనిలో నైతే అన్ని సంస్కారాలు ఇమిడి ఉన్నాయో 63 జన్మల మంచి మరి చెడు (సంస్కారాలు) ఆ మనసు బుద్ధి రూపి ఆత్మ వెళ్లి పోయింది. ఆ కళ్ళ జ్యోతి ఏ భ్రుకుటి మధ్యలో ఉంటుందో అది వెళ్లి పోయింది. కళ్ళు బటన్ లాగా అయిపోతాయి. ఎలాగంటే వాటిలో వెలుగే లేదు అన్నట్లు. ఆ వెలుగు వెళ్లి పోయింది. ఆ వెలుగే మనసు బుద్ధి రూపి ఆత్మ. దాని యొక్క కాన్సంట్రేషన్ యోక్క్ అభ్యాసం ముందు నుంచి చేయాల్సి ఉంటుంది. ఎవరికైతే ఈ అభ్యాసం పటిష్టం గా అయిపోతుందో రాబోయే చంపుకునే లోకం లో (కొట్లాటల లోకం) ఇప్పటికి నిరంతరం గా టెన్షన్ పెరుగుతూనే వస్తున్నది. ఆ టెన్షన్ లో మన అటెన్షన్ పెంచుకోవడానికి పరమాత్మ తండ్రి వచ్చి ఈ పధ్ధతి చెపుతున్నారు ఏమని ఆత్మిక స్థితి లో స్థితులై ఉండండి అని. దీని వల్ల అఖండ శాంతి లభిస్తుంది అని. అఖండ విశ్వాసం కలుగుతుంది. విల్ పవర్ వస్తుంది, స్థితులు, పరిస్థితులు, సమస్యలు, ఎదుర్కునే శక్తి లభిస్తుంది. కాన్సంట్రేషన్ వల్ల ఎంత శక్తి కలుగుతుందంటే , మొత్తం లోకం ఒక వైపు అయినా, మరియు ఒక్క ఆత్మ ఆత్మిక స్థితి లో స్తితుడైన వాడు అయన యొక్క మహిమ గీత లో వర్ణించ బడింది స్వరూప నిష్టుడు అని ,అతను ఒక వైపు అయిపోతాడు, మొత్తం లోకాన్ని ఎదుర్కునే శక్తి అతనిలో జనిస్తుంది. కానీ ఎలా ? అర్జునుడు భగవంతుని తో అడిగాడు, భగవాన్ ఈ మనసు కంట్రోల్ లో రావట్లేదు ఈ మనసు ఎలాంటి గుర్రం అంటే దీనిని కళ్ళెం తో నియంత్రితం చేయలేము, భగవంతుడు అన్నాడు, దానికోసం రెండు పద్ధతులు-“ అభ్యసేనతు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే”....మళ్ళి మళ్ళి ఆత్మిక స్థితి అభ్యాసం చేయి, అనేక జన్మలు తీసుకున్నావు, అనేక ఆత్మల సాంగత్యం చేశావు, వారితో కలిసి అనేక రకాల కర్మలు చేశావు, రంగులో రంగరించుకున్నారు,  ఆ విషయాలు గుర్తుకు ఐతే వస్తాయి, రక రకాల పురుషులూ , రక రకాల వాయుమండలం, (వాతావరణం) రక రకాల సీన్ సీనరీలు, స్వప్నం లో కూడా వస్తాయి, సంకల్పం లో కూడా వస్తాయి, కానీ ఏమి చేయాలి? వాటి అన్నింటినించి బుద్ధి యోగం తొలగించి ఆత్మిక స్థితి లో స్థితులు అవ్వాలి. నేను జ్యోతి బిందు (నక్షత్ర) సితార ఆత్మ ను. పరమాత్మకి  తండ్రి పిల్లవాడిని. మాటి మాటికి అభ్యాసం చేయడం వల్ల అంతం లో మనసు బుద్ధి రూపి ఆత్మ ఏకాగ్రం స్థితం అవుతుంది.  మరి మనసు బుద్ధి ఏకాగ్రం అవడం వల్ల పరమాత్మ తండ్రిని త్వరగా గుర్తించ గలుగు తుంది. రెండవ పధ్ధతి వైరాగ్యే ణ చ గృహ్యతే ....ఎప్పటి వరకు ఈ దేహము, దేహ సంబంధీకుల నుంచి పూర్తి వైరాగ్యం కలగదో అప్పటి వరకు ఆత్మ కు స్థిర భావాన్ని పట్టుకో లేదు. మరి ఈ విషయం శక్తి రామ్ శర్మ లో అందరూ అనుభవం చేశారు ఏమని అంటే శరీరం విడిచే కొన్ని రోజుల ముందు నుంచి ఆ ఆత్మ అంటూ వచ్చింది ఇప్పుడు నా బుద్ధి ఎక్కడికి వెళ్ళడం లేదు అని, నేను మరియు నా పరమ పిత పరమాత్మ శివ , ఎవరి పైన ఏ ఆసక్తి లేదు. కనుక అటువంటి ఆత్మ శరీరం విడిచి నప్పుడు అంత మతే సో గతి అవుతుందా కాదా? తప్ప కుండా అవుతుంది. అంత మతే మతే అనగా బుద్ధి, అంతిమ సమయం లో బుద్ధి ఎక్కడకి వెళ్తుందో అక్కడికే దాని గతి అవుతుంది. అనగా ఈ సృష్టిలో ఎక్కడైనా కాని కలియుగం అంతం లో అటమిక్ ఎనర్జీ తాయారు అయి ఉందో ఈ సృష్టి ని సమాప్తం చేయడానికి, మరియు కొత్త సృష్టిని తయారు చేయడానికి పరమాత్మ తండ్రి ఈ సృష్టి పైకి వచ్చేశారో, ఆ పరమాత్మ తండ్రి వద్దకు ఆ అమాయకపు ఆత్మ తప్పకుండా చేరుతుంది. ఎందుకంటే అంత మతే సో గతి. ఏ దేహ దారి పైనా ఎటువంటి మోహము లేదు, అప్పుడు ఆత్మకు గతి ఎక్కడకు వెళ్తుంది? ఎక్కడ మోహం ఉందో ఎక్కడ ఎటాచమెంట్ ఉందో అక్కడికే వెళ్తుంది. మరియు ఎక్కడికి వెళ్తుందో, ఎవరి దగ్గరికి వెళ్తుందో  .....అతని కార్యం లో నే సహయోగి అవుతుంది. శరీర కర్మ భోగం అది ప్రతివ్వరికి అనుభవించక తప్పదు. చాలా కఠిన మైన కర్మ భోగం అనుభవించాల్సి ఉంటుంది. ఎందుకంటే అనేక జన్మలు తీసుకున్నారు. వాటి లెక్కాచారం తీర్చుకోవాల్సే ఉంటుంది. లెక్కాచారం తీరిపోయాక అలాకాదు ఈ జన్మలో జబ్బులు వచ్చే జన్మలో వెళ్ళే తీరాలి అని కాదు, ఒకవేళ ఆ వికర్మలు భస్మం అయ్యాయి అంటే ఆ లెక్కాచారం కూడా భస్మం అయిపోతుంది. ఆత్మకు శరీరం కూడా అటువంటిది లభిస్తుంది, ఏ ఆరోగ్య కర శరీరం తో ఆరోగ్య కర రూపం లో ఉండి ఆ ఆత్మ పురుషార్ధం చేయగలదు. పురుష అర్ధం అనగా పురుషార్ధం, పురీమ్ శేతే....పురీ అనగా నగరి మరియు శేతే అనగా శయనించే, ఈ శరీరమే పురము, మరియు ఇందులో ఆత్మ విశ్రమించేది. సుఖ శాంతులలో విశ్రమించేది. అదే జీవితం. ఒక వేళ ఆత్మ ఈ శరీరం లో ఉంటూ దుఃఖము అశాంతి భోగిస్తే కనుక దానిని విశ్రమించడం అనరు. ఇప్పుడు పరమాత్మ తండ్రి అదే సృష్టి  స్థాపన చేయడానికి వచ్చారు, సత్య త్రేతా యుగాల రామ కృష్ణుల ఆ సృష్టి దానిలో సుఖం ఉంటుంది దుఃఖం ఉండదు. కానీ దానికోసం అంత మతే సో గతే ఆ ప్రాక్టీసు ఇప్పటి నుంచే చేయాలి. మనం మన మెంటాలిటీ ఆ విధం గా తయారు చేసుకోవాలి ఎవరైనా మనకి ఎటువంటి మాట అయినా చెప్పనీ, మనం డిస్టర్బ్ అవ్వ కూడదు. అదే గీత లో చెప్పారు యస్మాన్ నో ద్విజతే లోకో, లోకాన్ నో ద్విజతే చ యః, ఉద్వేగాన్ని పొందకూడదు. అనగా ఎవరి ద్వారా నైనా ఉద్వేగాన్ని పొందరో అశాంతి పొందరో, మరి ఎవరికీ కూడా అశాంతి ఇవ్వరో అతనే స్వరూప నిష్ఠుడు. అశాంతి ఇస్తే స్వయం కూడా అశాంతి పొందుతాడు. ఇతరులకు సుఖ శాంతులు ఇవ్వడానికి నిమిత్తం అవుతాడో స్వయం కూడా సుఖ శాంతులలో రమణి, ఆనందిస్తాడు  స్తాడు. కనుక అటువంటి స్థితి ఎలా తాయారు చేసుకోవాలి? ఈ ఆత్మిక స్థితి ఏ ఉపాయము. దీని అభ్యాసం చేయాలి. ఈ ఉపాయాన్ని పొందడం ద్వారా ఆత్మ యొక్క అటువంటి స్థితి తయారు అవుతుంది ఎలా అంటే ఎవరైనా మన గురించి విరోధం గా చెపుతున్నాడు, మనం వింటూ కూడా వినం. ఒక చెవితో విన్నాడు మరొక చెవితో విడిచి పెట్టాడు. అంటే ఎలాగంటే ఎవరైనా మనకు దుఃఖం ఇవ్వాలి అనుకున్నా కానీ మనం ఆ దుఖాన్ని ఇచ్చినా తీసుకోము.  ఎవరైనా మనను వేడి వేడి కళ్ళతో చూస్తాడు, మనం అతని భావాన్ని గుర్తించాము (పరిశీలించాము) ఇతను ఇలా ఎందుకు చూస్తున్నాడు. ఇది పూర్వ జన్మలో మన ఏ లెక్కాచారం ఉంది అది తీసుకుంటున్నాడు. కనుక ప్రతిఫలం గా మనం మన కళ్ళు వేడి (కోపం)చేయం. మన లెక్కాచారం పూర్తి అయిపోతుంది. అతని లెక్కాచారం కూడా పూర్తి అయిపోతుంది. అటువంటి భావం పెట్టుకోవాల్సి వస్తుంది. చెడు వినద్దు, చెడు చూడవద్దు, చెడు చెప్పవద్దు, మరైతే ఇప్పుడైతే ఎటువంటి స్టేజి ఉండాలి అంటే చెడు ఆలోచించ వద్దు అని. ప్రతీ ఆత్మ కోసం శుభ సంకల్పం చేయాలి. ఎందుకంటే ముందు మనసులో సంకల్పం లో విషయం వస్తుంది, తరవాత వాచా లో వస్తుంది, తరవాత కర్మణా లో వస్తుంది. మనసులో వస్తే ఏమీ వికర్మ కాదు, పాపం తాయారు కాదు కాని వాచా లో లేదా కర్మేన్ద్రియాలలో ఒకవేళ అటువంటి విషయం వస్తే దేని ద్వారా ఇతరులకు దుఃఖం కలుగుతుందో దాని ద్వారా పాపం అయిపోతుంది. దాని నుంచి రక్షించ బడాలి అంటే కేవలం ఒకే ఓక పెద్ద ఉపాయం షార్ట్ కట్ మార్గం  నిస్సంకల్పి స్టేజ్ నేను ఆత్మ జ్యోతి బిందు నేను ఆత్మ స్టార్. ఈ స్టార్ యొక్క వెలుగు ఈ కళ్ళ ద్వారా వస్తున్నది. ఈ స్థితి లో స్థిరం అయిపోవాలి. మనం ఎంత మంచి లో మంచి ఆలోచించినా, కానీ మన పూర్వ జన్మ లేక్కాచారాలు చెడుగా ఉంటే మంచి లో మంచి ఆలోచించినా కూడా మనకు ప్రతిఫలం గా శ్రేష్టత లభించదు ఎప్పటివరకు పూర్వ జన్మ లెక్కాచారం పూర్తి కాదో అప్పటి వరకు. ఎంత మనం చెడు లో చెడు ఆలోచించినా మనం ఎవరి అకల్యాణం కోరుకుంటామో ఒకవేళ అతని పుణ్య కర్మ ఉంటే కనుక మనం ఎంత ఆలోచించినా కూడా అతని అకల్యాణం కాదు. అంటే కేవలం మనం చేసే కర్మ పైనే లేదు, అందుకనే అంటారు తాయారు చేసే ఉంది తయారు అవుతున్నాది, ఇకపై తాయారు అయ్యేది ఏమి లేదు అని. ఎవరైనా జీవితాంతం కల్యాణం కోరుకుంటారు  మరి ఆ వ్యకి ప్రతిఫలం గా అతనిపై విరుద్ధం గానే చెపుతాడు మొత్తం జీవితం అంతా అప్పుడు అది పూర్వ జన్మ లెక్కాచారం అనక పొతే ఏమి అనాలి? అందుకే ఎప్పుడు అలజడి లోకి రాకూడదు. ప్రతి అతి కి అంతం ఉంటుంది. ఏ రకమైన అతి అయినా. ఆ అతి అంత మవడానికే గుర్తు. ఇప్పుడు మెంటల్ టెన్షన్ రోజు రోజుకీ పెరుగుతోంది. అంతులేని ధన సంపత్తి సంపాదించి పెట్టుకున్నారు, ఆరోగ్యం కోసం అనేక మైన మందులు పెట్టి ఉన్నాయి, చాలా పొడవు సంబంధాలు కుటుంబం లో పెట్టుకున్నారు. సంబంధాలు సుఖం ఇవ్వడానికే, పుచ్చుకోవదానికే పెట్టుకుంటారు. ఐతే ఈ రోజు సంబంధాల పైన మనుషుల విశ్వాసాలు తొలగి పోతున్నాయి. దాని ఫలితం గానే చిన్న చిన్న కుటుంబాలు అయిపోతున్నాయి. ముందు అసంఖ్యం గ పెద్ద పెద్ద కుటుంబాలు ఉండేవి, ఒక్కో కుటుంబం లో వందేసి మంది ఉండేవారు, ఒకే పొయ్యి మీద వంట జరిగేది. ఇప్పుడు కూడా అటువంటి కుటుంబాలు ఉన్నాయి, కానీ ప్రాయః లోపం ఐపోయాయి. ఎలా అంటే గీత లో చెప్పారు. ఈ దేవి దేవతా ధర్మం ప్రాయః లోపం ఐపోయింది అని. పూర్తిగా లోపం అయ్యింది అని కాదు ఇప్పటికి భారత దేశం లో అక్కడక్కడా అటువంటి అరుదైన కుటుంబాలు ఉన్నాయి. ఒకే యజమాని, అనేక మంది కుమారులు, కుమార్తెలు మనుమలు ముని మనుమలు వారి కోడళ్ళు మరి ఎవరికీ కూడా ఆ ధైర్యం ఉండదు ఆ యజమాని కి ఎదురు నిలిచి వెళ్ళడానికి. ఒకే ధర్మం, ఒకే భాష, ఒకే మతం(మాట) పై ఒకే కులం ఎటువంటి ప్రకార మైన ఏ వ్యభిచారము ఉండే వీలు లేదు, ఒకరిద్దరిలో అనైతిక సంబంధం ఉండే అవకాశం లేదు, ఎంత సుఖ శాంతి తో ఉండేది, పవిత్రత ద్వారానే యునిటి తాయారు అవుతుంది. మరి ప్యురిటి ఎప్పుడు వస్తుంది, ప్యురిటి వచ్చేదే కాన్సెంట్రేషన్ ద్వారా, లోకంలో పెద్ద పెద్ద శరీర బలం వాళ్ళు కుర్చుని ఉన్నారు, వాళ్ళ శరీరం ఎంతో ఆరోగ్యం గా ఉంది,  వస్తాదులకే వస్తాదు. శరీర బలం ఉంది. పెద్ద పెద్ద ధనవంతులు కుర్చుని ఉన్నారు, చాలా సంపన్నులు, మల్టి మిలియనేర్లు, ధన బలం అతి గా ఉన్న వాళ్ళు, మరియు జన బలం వాళ్ళ పెద్ద పెద్ద కుటుంబం వాళ్ళు, పెద్ద పెద్ద సంబంధీకులు పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న వాళ్ళు, ఎంతో మంది పెద్ద రద్దీ, జనాలు  వాళ్ళను ఒప్పుకునే వాళ్ళు. అనగా జన బలం కూడా చాలా విస్తారం గా వ్యాపించి ఉంది.తనువు బలం ఉంది, ధన బలం ఉంది,  జన బలం కూడా ఉంది. అన్నీ ఉన్నా కూడా ఇంకా చాలా దుఖితులు గ ఉన్నారు, అశాంతిగా ఉన్నారు, ఎందుకు, ఎందుకంటే మనో బలం అన్నిటికన్నా పెద్ద విషయం ఆత్మ శక్తి అది విక్షీణం అయిపోయింది. ఈ రోజు మనిషి బ్యాంకు లో డబ్బు దాస్తున్నాడు, దాని రాశులు తాయారు చేస్తున్నాడు, పోగు చేస్తున్నాడు, తనువు బలం కుడగట్టుకుంటున్నాడు. మరియు జన బలం తయారు చేసుకుంటున్నాడు. కానీ మనో బలం కోసం ఏ ప్రయాసా చేయడం లేదు. మనో బలం ఎలా ఉంది? ఉదయం నుంచి సాయంత్రం వరకు మనసు నాలుగు వైపులా తిరుగుతూ నే ఉంటుంది. ఎప్పుడైతే ఉదయం నుంచి సాయంత్రం వరకు మనసు తిరుగుతూ ఉంటే రాత్రి పడుకున్నప్పుడు కూడా, మనసు స్వప్నం లో మనసు బుద్ధి నాలుగు వైపులా తిరుగుతూ ఉంటుంది. 24 ఘంటలూ మనసు చెల్లా చెదరు అయిపోతుంటే రిజల్ట్ ఏమి వస్తుంది. మనో బలం క్షీణం అయిపోతుందా, ఆత్మిక బలం క్షీణం అయిపోతుందా విల్ పవర్ తగ్గుతుందా లేక పెరుగుతుందా? తగ్గుతుంది. ఒకవేళ విల్ పవర్ తగ్గి పొతే ఎంత తనువు బలం ఉన్నా, జన బలం ఉన్నా ఎంత ధన బలం ఉన్నా కూడా అంతా వ్యర్ధం. ఎవరి దగ్గరైనా మనో బలం ఉంటే బాబర్ వద్ద మనో బలం ఉండేది. విక్టోరియ యొక్క మంత్రి వద్ద మనో బలం ఉండేది అతను మహారాణి విక్టోరియా మంత్రి అయి కూర్చున్నాడు. బాబర్ సిపాయి నుంచి ఎదిగి ఏమి అయ్యాడు, భారత దేశపు సామ్రాట్ అయ్యి కూర్చున్నాడు. కనుక ఒక వేళ మనో బలం కూడగట్టుకుంటే అప్పుడు అన్ని కుడగట్టుకోవచ్చు.  ఒక వేళ మనస్సు పవర్ క్షీణం చేసుకుంటే ఎంత మనం సమయం వెచ్చించినా, తనువు బలం, జన బలం, ధన బలం చేర్చుకోవడానికి అంతా వ్యర్ధం అయిపోతుంది. చివరలో ఏమి రిజల్ట్ వస్తుందంటే హార్ట్ ఫెల్ అయిపోయింది. యోగులైన వారు, స్వరూప నిష్టులైన వారు, ఆత్మిక స్థితి లో స్థితులు అవడానికి ప్రయత్నం చేస్తారో, వాళ్ళకు ఎప్పుడూ హార్ట్ ఫెల్ కాజాలదు. వారి హార్ట్ చాల పటిష్టం గ అవుతుంది. ఎందుకంటే శ్వాస ప్రస్వాస ప్రక్రియ చాలా నెమ్మదిగా అవుతుంది. ఏకాగ్రత వల్ల. అటమిక్ విస్ఫోటనం కూడా జరుగుతుంది, ఎందుకంటే గత 50, 60  ఏళ్ళల్లో వీటిని కనిపెట్టారు, అంతకన్నా ముందు ఆవిష్కరించలేదు. కొత్త లోకం తయారు చేసే ఆయన ఈ సృష్టి పైకి వచ్చేస్తారు, అప్పుడు పాత ప్రపంచం వినాశనం చేసే సామాను తయారు చేసే వారు కూడా తాయారు అవుతారు. ఈ స్థాపన మరియు ఈ వినాశనం ఈ రెండూ తోడు తోడు గా నడుస్తాయి. కొత్త కూటమి యొక్క అటువంటి కూటమి దానిలో ధర్మ సత్తా, రాజ్య సత్తా ఒక్కరి చేతిలో ఉంటుంది. ఏక ధర్మం, ఏక రాజ్యం ఏక భాష , ఏక మతం ఏక కులం సుఖ శాంతి ఉంటుందా ఉండదా, తప్పకుండా సుఖ శాంతి సృష్టి తాయారు అవుతుంది. ఇప్పుడు భారత దేశం లో పరిస్థితి ఏమిటి? భారత్ లో చిన్న దేశం లో ఎన్ని భాషలు వృద్ధి చెందుతున్నాయో, మరియు ఆ భాషలను తీసుకుని ఎన్ని జగడాలు వ్యాపిస్తున్నాయో, అన్ని వేరే ఏ దేశం లోను వ్యాపించలేదు,  రాష్ట్రవాదం, చిన్న దేశం లో ఉన్నన్ని రాష్ట్ర వాద జగడాలు జరుగుతున్నాయో, అన్ని మరే దేశం లోనూ లేవు, ధర్మం  ఈ భారత దేశం లోనే ఎన్ని ప్రపంచం లోని అన్ని ధర్మాలూ దూరి కూర్చున్నాయి. ఒక భారత దేశ రాజధాని డిల్లి ఏ అటువంటి నగరం ప్రపంచం లో దీని లో ఎక్కువ లో ఎక్కువ పెర్సెంటేజ్ లో లోకం లోని అన్ని ధర్మాల వారు దూరి కూర్చున్నారు. వారి వారి ఆధిపత్యం చేసి కూర్చున్నాయి. ధర్మం ఆధారం పై అశాంతి వ్యపిస్తుందా, లేక శాంతి వ్యపిస్తుందా, ప్రతి వారూ తమ తమ ధారణలు స్థాపన చేయాలని కోరుతున్నారు, ధర్మం అనగా ధారణ, అప్పుడు ఆ ధారణలు ఎంత సత్యం, ఎంత అసత్యం అది పరమాత్మే ఈ సృష్టిలో ప్రత్యక్షం అయినప్పుడు అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఉన్నతోన్నతుడు అయిన తండ్రి ఎవరు? ఆయనకు మొత్తం సృష్టి నమస్కారం చేస్తుంది, మొత్తం సృష్టి (నమ్ముతుంది, ) విశ్వసిస్తుంది, ఆది లో తప్పక ఆ అది మానవుడు ఉండిఉండాలి అతను ప్రతీ ధర్మం లోను విశ్వసించ బడే వాడు. అతను తప్పక ఒకరే ఉండాలి. ముసల్మానులలో అతనిని ఆదం మరియు హవ్వా అంటారు, ఇంగ్లిషు వాళ్ళు ఆది పురుషుడిని ఆడమ్ ఈవ్ అంటారు, జైనియులలో వారిని ఆది నాథ్ ఆది నాథిని అంటారు, మరియు భారత్ లో “త్వమాది దేవః పురుషః పురాణః “ ఆది దేవ శంకరుని రూపం లో నమ్ముతారు. శంకరుడు పార్వతి వారు సృష్టికి ఆది పురుషుడు. ఎవరు ఆది యో ఆయనయే అంతం చేసే వారు. ఆది ఏ అంతం. స్మృతి చిహ్నం గా ఏమి అంటారు? హర్ హర్ బం బం అంటారు.  రెండు కార్యాలూ చేస్తాడు. కొత్త సృష్టి ఆది చేయడానికి పాపాల హరణం చేస్తారు. ఆత్మిక స్థితి యొక్క అభ్యాసం నేర్పించి. మరియు బాంబుల విస్ఫోటం గావించి సమస్త సృష్టి వినాశనం చేస్తారు.  ఎందుకంటే ఈ లోకం బాగుపడేది కాదు. కొత్త సృష్టి లో కొంచం మందే ఉంటారు. మరి ఈనాడు ఈ పాత సృష్టి లో లెక్కలేనంత మంది ఉన్నారు. ఒక్కొక్క చుక్కతో సాగరం నిండుతుంది అంటారు. గుప్పెడు మంది ఆత్మలు ఆ అది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క పునాది వేసేవి, ప్రతీ ధర్మం లో ఆ ఆత్మలను నమ్ముతారు, మాల రూపం లో. అన్ని ధర్మాలలో మాల జపిస్తారు. మాలలో మణులు అంటే ఆత్మలకు గుర్తు. ఆ ఆత్మ రూపి మణులు ప్రతి ధర్మం లో స్మరించ బడతారు. ఎందుకు స్మరిస్తారు? తప్పకుండా ఆ ఆత్మ రూపి మణులు, పురుషార్ధం చేసి ఆత్మల అటువంటి కూటమి తాయారు చేశారు , ఆ కూటమి సమస్త విశ్వానికి మాన్యత పొందింది. ఏ ధర్మానికి చెందిన వారైనా,  స్నేహం అనే సూత్రం లో జ్ఞానం అనే సూత్రం లో ఆ మణులు అన్ని బంధించబడి ఉన్నారు. ప్రస్తుతం ఈ కార్యం జరుగుతున్నది. ఆత్మలు జ్ఞానం ఆధారం గా ఆ నిరాకార జ్యోతి బిందు పరమాత్మ ఈ సాకార సృష్టి లో సాకారుడై అవుతారో, గీతా జ్ఞానం వినిపిస్తారో, ఆయనను గుర్తించ గలము. ఇప్పుడు కూడా ఇంకా సమయం చాలా తక్కువ ఉంది. లాస్ట్ చాన్స్ . ఇప్పుడు రాజనీతి లో దమ్ము లేదు. రాజనీతి (ఒక్కసారి)పూర్తి గా అస్థిరం ఐపోయింది. ధర్మ గురువులలో మనుషుల నమ్మకం సడలి పోయింది. కానీ ప్రతి మనుష్య అత్మకూ జన్మ తీసుకుంటూనే ఈశ్వరుని ద్వారా వరదానం లభిస్తుంది ఏ వరదానం? వరదానం అనండి దానం అనండి ప్రాప్తి అనండి ఆ ప్రాప్తి యే బుద్ధి. ప్రతీ మనిషి ఆత్మకు తమ తమ బుద్ధి లభించింది నిర్ణయం తీసుకోవడానికి, రైట్ ఏది, రాంగ్ ఏది అని, పరమాత్మ తండ్రి నుండి జన్మతః మనకు లభించిన వస్తువు వరదానం దానికి మొదట మనం విలువ ఇవ్వాలి. మనం ఏ విషయం అయినా గ్రహించే ముందు మన బుద్ధి తో నిర్ణయం చేయాలి సమాజం ఏ వైపుకు వెళ్తోంది, రాజ్యం ఏవైపు వెళ్తోంది, రాజనీతి ఏ వైపు వెళ్తోంది అది చూడ కూడదు. తమ బుద్ధి తో నిర్ణయం తీసుకుని తరువాత నిశ్చయం తీసుకోవాలి ఏమి చేయాలి ఏమి చేయకూడదు అని తుండే తుండే మతిర్భిన్న ....(పుర్రెకో బుద్ధి) అనేక మఠాలు, అనేక (మార్గాలు) పంధాలు, అనేక రాజ్యాలు, అనేక ధర్మాలు, అనేక మతమతాన్తరాలు, వాటి అన్నిటిలో మనం నిశ్చయం చేసుకోవాలి రైట్ ఏమిటి అని. ఒక విషయం మాత్రం ఖచ్చితం, పరమాత్మ తండ్రి ఈ సృష్టి పైకి వస్తే మాత్రం సందేశం తప్పక అందరికి చేరుతుంది. ఏ విషయానిది? ఆయన సృష్టిని బాగుపరిచే ఆయన ఈ సృష్టి పైకి వచ్చేశారు అని. ఇప్పుడు అంతిమ సమయం ఈ సృష్టిని రిఫార్మేషన్ చేయడానికి మరి ఎవరికీ శక్తి లేదు, అందరూ అలిసి పోయారు. ఇబ్రహీం వచ్చారు, బుద్ధుడు వచ్చారు, క్రైస్ట్ వచ్చారు, వివేకానంద్ వచ్చాడు, రామకృష్ణుడు వచ్చారు, గాంధీజీ వచ్చారు, మరి అందరూ ఈ సృష్టి దవడలలో, కాలం(మృత్యువు) దవడలలో వెళ్ళిపోయారు, ఈ లోకం కిందికి దిగజారుతూనే ఉన్నది.  మనుషుల మధ్యలో స్నేహం సహయోగం, సౌహార్ద్రం, అంతా సమప్తం ఐపోతూనే వస్తున్నది.. ఇప్పుడు తండ్రి వచ్చారు ఆత్మ ఆత్మ భాయి భాయి గా తాయారు చేయడానికి. హిందువులు అవ్వనిండి, ముసల్మానులు అవనిండి సిక్ఖులు అవనిండి  క్రిష్టి యన్లు అవనిండి అందరూ ఆత్మలే కదా, ఆత్మ అందరిలో ఉంది. ఆత్మలో సంస్కారాలు వేరే వేరే నిండి ఉండవచ్చు, కానీ అందరూ ఆత్మలే ఆ సుప్రీం ఆత్మ సంతానం. మనుషులైతే గానం చేస్తారు (హిందూ ముస్లిం సిక్ఖ్ ఈసాయి సబ్ ఆపస్ మే భాయి భాయి.) హిందూ ముస్లిం సిక్ఖు క్రిస్టియన్ లు అందరూ అన్న దమ్ములు అని “. కనుక తప్పకుండ అందరూ వాళ్ళల్లో వాళ్ళు భాయి భాయి లు ఐతే తప్పకుండా ఒకే తండ్రి ఈ సృష్టి లో ఉండి ఉండాలి కదా. ఆ తండ్రి కి గుర్తు గానే అన్ని ధర్మాలలో మాన్యత ఉంది ఆడం ఆదాం ఆది నాథ్, ఆది దేవ రూపం లో ఆ రూపమే ధరించి పరమాత్మ ఈ సృష్టి పైకి వస్తారు. అయన యొక్క మూర్తులు, అన్నిటి కన్నాఎక్కువ ,  కేవలం దేశం లోనే కాదు విదేశాలలో కూడా గ్రీస్ లో,  మేసేపోటేమియాలో , సింధు లోయలో, అనేకానేక మైన మూర్తులు, నగ్న మూర్తులు లభించాయి. ఆయనను జైనియులు తీర్థంకరుడు అంటారు. భారత దేశం లో ఆయనను శంకరుడు అంటారు. ఆ నగ్న మూర్తి ఏ విషయానికి (గుర్తు) జ్ఞాపిక  అంటే దేహభానం యొక్క స్మృతి ఆయనకు లేదు అని. ఆత్మిక స్మృతి లో స్థితులై ఉన్నారు, దేహం అనే వస్త్రం యొక్క స్మృతే జ్ఞాపకమే ఆయనకు లేదు. అందుకే ఆయనను వస్త్రం ధరించి నట్లు చూపించరు. దేహఅభిమానం తోనే అన్ని దుఖాలు జన్మిస్తాయి. ఇప్పుడు ఆ పరిక్రియ నేర్పించడానికి స్వయం పరమాత్మ ఈ సృష్టి పై దిగి వచ్చారు . కొంచం ప్రయత్నం చేస్తే గుడ్డి వాళ్లైనా, కుంటివాళ్ళుఅయినా, చేయి లేని వాళ్ళు అయినా, ధన వంతులైనా, పేదవారు అయినా, ఏ ధర్మం వారైనా ఏ జాతి వారైనా, పరమాత్మ దర్బారులో అర్ధం చేసుకోవడానికి అందరికి సమన మైన వరదానం లభించింది. అందరూ తెలుసుకో గలరు. ఆ ఈశ్వరియ జ్ఞానం ఒకరికి అర్ధం అవుతుంది, మరొకరికి అర్ధం కాదు అనే విషయమే కాదు. అంతిమ సమయం లో లాస్ట్ అటమిక్ విస్ఫోటం జరుగుతుందో అప్పుడు ఆ సమయం లో సమస్త లోకం ఒప్పుకోవాల్సి యే వస్తుంది. కానీ ముందుగా పురుషార్ధం చేసే వారు వారిపై పరమాత్మ దయ (కృప) విశేషం గా ఉంటుంది. మరియు ఆ పిల్లలు ఆ ఆత్మిక రూపం లో స్తితులయ్యే పిల్లలు వారు రాబోయే రామ కృష్ణుల లోకం లో సుఖం భోగిస్తారు. దానినే స్వరం అంటారు. ఆ స్వర్గం ఏమి పై లోకాల్లో ఏమి ఉండదు. ఈ సృష్టి లోనే ఈ భారత దేశం లోనే స్వర్గం ఉండేది. స్వయం భగవంతుడు తండ్రి వచ్చి నరకాన్ని స్వర్గం చేశారు. రామ రాజ్యానికి ఎంత మహిమ ఉంది. ఆ రామ రాజ్యాన్ని పరమాత్మ తండ్రి సుప్రీం సోల్ జ్యోతి బిందువే వచ్చి స్థాపన చేస్తారు. ఈనాటి లోకం లో ఉంది రావణ రాజ్యం. రావణాసురిడికి  ఫది తలలు చూపిస్తారు. అనగా అనేక మతమతాన్తరాలు ఉన్నాయి ఈ సృష్టిలో . ఇప్పుడు ఆ పది తలల అనేక మతమతాంతరాల రావణాసురుని లోకం సమాప్తం అవ్వబోతోంది మరియు ఒక్క రామ రాజ్యం స్థాపన కాబోతున్నది. ఈ సృష్టిలో రామ ఆత్మ ఉన్నది, కృష్ణ ఆత్మ ఉన్నది కానీ ఒక మనుష్య రూపం లో ఎలాగంటే గీతలో చెప్పినట్లు సాధారణ రూపం లో వచ్చిన నన్ను మూఢమతులు గుర్తించలేరు అని. కేవలం రామ కృష్ణ ఆత్మలే కాదు ఇబ్రహీం, బుద్ధ, క్రైస్ట్ గురు నానక్ ఎంత మంది మహా మహా ధర్మ పితలు ఉన్నారో ఆ అందరూ ఈ సృష్టి లో ఉన్నారు.  కానీ సాధారణ శరీరం లో ఆ మహా మహా మహులంతా పరమాత్మ తండ్రిని గుర్తించి నప్పుడు ఆ అందరూ పరమాత్మ తండ్రికి సహయోగులు( సహాయ కారులు) అవుతారు. మరియు వారి వారి సుఖ శాంతుల వారసత్వం పరమాత్మ తండ్రి వద్ద నుండి పొందుతారు. ఓం శాంతి.

 

 

No comments:

Post a Comment

బ్లాగ్ సందర్శించినందుకు ధన్యవాదాలు. త్వరలో మా స్పందన తెలుపగలము.

Featured Post

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్.

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్. ఒక సంక్షిప్త పరిచయం ఇక్కడ కింద తేదీలు పుట సంఖ్యలు ఇచ్చినవి గురువు గారి ప్రవచనా...