పాత విద్యా విధానానికి సనాతన విద్య నేర్చుకోవడానికి ఒక ఉద్యమం రావాలి కదా అదే ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం. ఇది సనాతన ధర్మం ఇష్టపడేవారు అందరూ తప్పక నేర్చుకుంటారు. నేర్చుకుంటున్నారు.
బ్రహ్మచర్యం విలువ తెలిసిన వారు తప్పక ఈ రాజ విద్యలో ప్రవేశిస్తారు. కుటుంబాలలో వాళ్ళు సన్యాసుల కాళ్ళు కడిగి తాగుతారు, నెత్తిన చల్లు కుంటారు ఎందుకు అతను శరీర పవిత్రత పాటిస్తున్నాడు కనుక. అతని మనసులో ఏమి ఆలోచనలు ఉన్నాయో ఎవరికి తెలుసు. ఐతే ఆ సన్యాసులు కూడా 8 , 9 ఏళ్ల కన్యలను దసరా నవరాత్రులలో పుజిస్తారు ఎందుకు. ఎందుకంటే ఆ పసి వాళ్ళు పవిత్రంగా ఉంటారు కాబట్టి. పిల్లలు మహాత్ములు అంటారు. అది కూడా ఇందుకే. మరి అదే కన్య వివాహం అయ్యాక ఒక గొర్రె లా అందరి కాళ్ళు మొక్కుతుంది ఎందుకు ఒకే రాత్రిలో ఇంత తేడ ఎందుకు వచ్చింది ఎందుకంటే పవిత్రత కోల్పోయింది.
గీత లో కామేషు క్రోధేషు రజో గుణ సముద్భవ: పాప్మానం ప్రజహి హ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం అని చెప్పారు జ్ఞాన విజ్ఞానాలను నాశనం చేస్తుంది కామం
త్రివిధం నరకస్యేదం ద్వారం నాశన మాత్మనః కామ క్రోధ స్తదా లోభ తస్మాత్ ఏతత్ త్రయం త్యజేత్.
ఆత్మ నాశనానికి కామ క్రోధ లోభాలు కారణం కనుక అర్జున అవి విడిచి పెట్టు.
మరి అయినా పెళ్లి చేసి ఓ లైసెన్స్ ఇస్తున్నారు కామవికారం కోసం. ఎంతో దిగజారి పోయాం, ఎంత అడుసు లో చిక్కుకున్నామంటే అది మన పతనానికి కారణం అని కూడా మనకు తెలియట్లేదు.
ఎమన్నా అంటే మరి సంతానం ఎలా వృద్ధి చెందుతుంది అంటున్నారు. వీళ్ళకే ఎదో బాధ్యత ఉన్నట్లు. ఏమి సత్యయుగం లో దేవతలకి పిల్లలు లేరా వారు సంతానం కనలేదా. మరి ఆ సృష్టికి పూజ ఎందుకు జరుగుతోంది. ఈ గుహ్య రహస్యం తెలుసుకో వచ్చునే.
మొన్నకాయన అంటున్నారు నాకు ముగ్గురు అమ్మాయిలు మరి 3 ఏళ్ళలో నేను రిటైర్ అవుతాను. వాళ్ళను బ్రహ్మ కుమారి చెయ్యండి కన్యాదానం అన్ని దానాలలోకి గొప్పది అన్నాను నేను అప్పుడు అయన వీళ్ళకి పెళ్ళిళ్ళు చేసేస్తే నా పని అయిపోతుంది. అని. పెద్దమ్మాయి ఇంజనీరు ఈ మద్యనే అయ్యింది ఉద్యోగం వెతుక్కుంటోంది రెండో అమ్మాయి ఇంటరు, మూడు 10 ....నేను బాగా చదివించాను అని.
మరి పెళ్ళిళ్ళు అన్ని సక్సెస్ అవుతున్నాయా. పిల్ల చదువుకోవాలి, ఉద్యోగం చెయ్యాలి, అందం గా ఉండాలి , ఇంటి పని వంట పని బాగా చేయాలి, ఒక టేమిటి ఆమె ఒక కల్ప వృక్షం కావాలి. ఇంత చేసి అణిగి మణిగి కూడా ఉండాలి,
పెళ్లి చేసి పిల్ల బాధలు పడుతోంది అనుకోని వారు ఉన్నారా. మేము ఉన్నాము అనే వారు అబధం చెపుతున్నారు.
ఈ కలి యుగం లో ఎవరూ సుఖంగా లేరు.
ఐతే బ్రహ్మ చర్యం వల్ల లాభం ఏమిటి...... నెక్స్ట్ ఎపిసోడ్ లో
No comments:
Post a Comment
బ్లాగ్ సందర్శించినందుకు ధన్యవాదాలు. త్వరలో మా స్పందన తెలుపగలము.