Monday, February 29, 2016

ఏంతో పిచ్చ పిచ్చ గా నచ్చే భాష

ఏంతో పిచ్చ పిచ్చ గా నచ్చే భాష నా కాదు మన భాష తెలుగు భాష అదేంటో వేరే ఎన్ని భాషలు వచ్చినా తెలుగు అక్షరాలు చుస్తే వెంటనే చదివేయ్యలని అనిపిస్తున్ది. మరి చిన్నప్పటి  నించి ఉగ్గుపాలతో అమ్మ నేర్పడం వల్లనో లేక వస పోసినందు వల్లనో ... చిన్నప్పటి ని తలుచు కుంటే ఎంత హాయి మళ్ళీ  రానిది ఆ సుఖం. పంచుకోవడం నేర్పిన అందరికి వందనం టెక్ నాలజీ  పెరిగి మన రాత లో రాసుకునేలా చేసిన వారందరికీ కృతజ్ఞ తలు పంచుకుంటే తీరేవి ఇలా పంచుకోవచ్చని తెలిసినప్పటి ఆనందం ఎంతో.
తరవాత బ్లాగులు యెంత చెప్పినా తరగని గని బ్లాగుల బాగోతం ఒకటేమిటి కాలి గోటి  నించి కొత్త వార్తల దాక అన్ని విషయాలూ బ్లాగుల్లో భరతాలాడినవే ఓహో మన తెలుగు వారు వివరించని విషయం ఉందా తెలుగు వారి నాలెడ్జ్ నభోన్తరాలు దాటినవే కద. ఏ విషయ మైనా అవుపోసన  పట్టేస్తాడు కదా తెలుగోడు
వేయేల దేశ భాషలందు తెలుగు లెస్స. దేశ మందు తెలుగు వారు లెస్స పైన లెస్స. 

No comments:

Post a Comment

బ్లాగ్ సందర్శించినందుకు ధన్యవాదాలు. త్వరలో మా స్పందన తెలుపగలము.

Featured Post

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్.

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్. ఒక సంక్షిప్త పరిచయం ఇక్కడ కింద తేదీలు పుట సంఖ్యలు ఇచ్చినవి గురువు గారి ప్రవచనా...