అర్ధం కావట్లేదు ప్రతి రోజు ఇలాగే తన గదిలోకి వెళ్లి కూర్చున్నాడు. నాన్న చాల ఆందోళనగా ఉన్నారు అనుకుంది నిర్మలశాంత . ఏంటి నాన్న ఎందుకు ఆందోళన గ ఉన్నారు. ఏమి లేదమ్మా నేను గురువుగారి దగ్గరకి వెళ్ళాలి అంటూ తన గురువును చూడబోయాడు. గురువుకు తనకు కనిపించే దృశ్యాల గురించి చెప్పి వీటి అర్ధం ఏమిటి అని అడిగాడు. అయన కొంచం సేపు అలోచించి నిన్ను కృష్ణుడు అనుగ్రహించాడు అందుకే ఈ సాక్షాత్కారాలు అవుతున్నాయి అన్నారు. ఈ జవాబు లేఖరజుకు తృప్తినివ్వలేదు. అలాగే తన 12 మంది గురువులను ఒక్కక్కరుగా అడిగి నిరాశ పడ్డాడు. కాశికి వెళ్లి పండితులను అడిగాడు వాళ్ళు జవాబు చెప్పలేక పోయారు. అలాగే తన మేడ వసారాలో కుర్చుని ఆలోచిస్తున్నాడు. ఇంతలో గబుక్కున వాలు కుర్చీలో లేచి కుర్చుని అరె ఇంతవరకు నాకు ఈ ఆలోచన రాలేదెందుకు అని అనుకున్నాడు. భార్య యశోదతో నేను ఈ రోజే కలకత్తాకు వెళ్ళాలి రెడీ చేయి అని చెప్పి బయటకు వెళ్ళాడు.
కలకత్తా లో తన బ్రాంచి లో మేనేజర్ కాదు బావగారు అక్క రాధ భర్త ఆయనంత పండితుడు బుద్ధి కుశలుడు ఉండగా వేరే ఎవరినో అడగడం ఏమిటి అని అనుకున్నాడు. సేవక్.రామ్ చాలా మంచి వ్యక్తిత్వం. హిరా దుకాణాల వరుసలో ఓ చిన్న దుకాణం అన్ని దుకాణాల మధ్య ఓ సాధారణ దుకాణం ఏ హంగు ఆర్భాటం లేవు. పక్కన ఉన్న దుకాణాల మెరుపులకి లొంగి అందరూ వాటికే ఆ వెలుగుల మధ్య నగలు కొనడానికే వెళ్ళే వాళ్ళు. ఈయన చిన్న దుకాణం లో నికార్సైన సరుకు అమ్మినా అంతగా వచ్చే వారు కాదు. కానీ సేవక్.రామ్ రైటు వ్యక్తి ముక్కుసూటి మనిషి. అది చూచే తన అక్కనిచ్చి పెళ్లి చేసాడు లేఖరాజు. వాళ్ళకి పిల్లలు లేరు. బావ ఇంకో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. గీత. అక్క రాధ ఆమెను కూడా ఓ చేల్లెలులాగే చూసుకుంటుంది. ఆమె కూడా అందరితో కలిసిపోయింది. కొంచం గలగలా మాట్లాడుతుంది. లేఖరాజు అంటే ప్రత్యేకమైన అభిమానం. లేఖరాజు కు కూడా అంతే.
అక్కా నాకు కొన్ని రోజులుగా కొన్ని దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఏమిటో అర్ధం తెలుసుకోవాలి అని ఉంది అని చెప్పాడు. రాధ తో పటు గీత కూడా అక్కడే ఉంది. గీత సరే ఆయనకి చెబుతా తప్పకుండ అయన నీకు జవాబు చెప్తారు అంది. రాధ కొంచం ఉండు ఇప్పుడు అయన పనిలో ఉన్నారు తరవాత చెపుదాం అన్నది.
సాయంత్రం భర్తకు చాయ్ ఇచ్చేందుకు వెళ్ళింది రాధ అప్పుడే గీత కూడా వెళ్లి అక్కడ కూర్చుంది. ఎదో ఉంది అనుకున్నాడు సేవక్.రామ్ ఏమిటో చెప్పు అన్నాడు గీతను చూస్తూ. గీత వెంటనే చెప్పడం మొదలు పెట్టింది. గీత లో అలౌకిక శక్తి అనుభవం అవుతోంది. ఆమె లేఖరాజు ఏ దృశ్యాలు చుచాడో ఎలా చెప్పాడో అలాగే చెప్పసాగింది. రాధ కూడా ఆమెను సంభ్రమం తో చూస్తున్నది. సేవక్.రామ్ ఆమెను చూస్తున్నాడు ఆమె చెప్పేది వింటున్నాడు. అయన చెప్పడం మొదలు పెట్టాడు. అతనిని చూస్తున్న భార్యలు ఇద్దరు ఓ అలౌకిక అనుభూతి పొందుతున్నారు. అయన చెప్పే మాటలలో ఓ ఆకర్షణ. అయన సాక్షాత్కారాల అర్ధాలు చెపుతున్నారు.
లేఖరజుకు త్రిమూర్తుల సాక్షాత్కారం అయ్యింది వారిలో బ్రహ్మ స్థానం లో తనే తెల్ల వస్త్రాలు వేసుకుని కుర్చుని ఉన్నాడు. అంటే దాని అర్ధం అతను బ్రహ్మ పదవిలో ఉండి కొత్త సృష్టి స్థాపన చేయాలి. ఇంకా అతను స్వర్గం చూసాడు. అందులో అందరూ జంటలు జంటలు గ తిరగడం చూశాడు. వాళ్ళు కవలలు గ ఉండడం చూసాడు. అంటే రాబోయే స్వర్గం ఎలా ఉంటుందో చూసాడు. అంతే కాక అతను బాంబుల ద్వారా భూకంపాల ద్వారా మతకలహాల ద్వారా ప్రకృతి విపత్తుల ద్వారా ఈ ప్రస్తుత కలియుగపు సృష్టి వినాశనం చూసాడు. అని ఈ విధంగా ఆ సక్షాత్కారాలకు అర్ధం చెప్పాడు. ఇది విన్న రాధ గీత లిద్దరూ అలౌకిక అనుభూతి చెందారు.
No comments:
Post a Comment
బ్లాగ్ సందర్శించినందుకు ధన్యవాదాలు. త్వరలో మా స్పందన తెలుపగలము.