డివిడి నంబరు-336, విసిడి నంబర్.2066;; ఆడియో- 2552;; పన్వెల్ మి.మ. మురళి-తారిఖు-25-౦4-66;; తారిఖు-16-8-15.
ఓం శాంతి, ఈ రోజు
ఉదయం క్లాసు, 25-4-1966, సోమవారం రికార్డ్ నడిచింది భోలే నాథ్ సే నిరాలా కోయి ఔర్
నహీం. తండ్రి కుర్చుని తన పిల్లలకు చెపుతున్నారు. ఇప్పుడు పిల్లలకు ఇది చక్కగా
తెలుసు అనంత మైన తండ్రి ఆయననే అంటారు పాడైన దానిని బాగుచేసే వారు అని. ఎవరు పాడైన
దానిని బాగు చేసే వారు? అనంత మైన తండ్రులు కూడా ఇద్దరు, ఒకరు మనుష్యాత్మలకు
తండ్రి, మనుష్య సృష్టి కి తండ్రి. మరి ఇంకొకరు ఆత్మలకు తండ్రి. మరి చెడిపోయిన
దానిని బాగుచేసే వారు ఎవరు? అత్మలయోక్క తండ్రి. ఎందుకనగా అనంతమైన ఆత్మల యొక్క
తండ్రి అయన జనన మరణ చక్రం లో రారు. కనుక చెడిపోవడం జాగర్త పడడం అనే విషయమే రాదు.
మిగతా అందరు ఆత్మలు అందరూ జనన మరణ చక్రం లో వస్తారు. మరియు జనన మరణ చక్రం లో వస్తూ
వస్తు సుఖం భోగిస్తూ భోగిస్తూ కిందకు పడిపోతూ ఉంటారు. జీవితం పాడైపోతూ వస్తుంది.
కనుక ఏమి చెపుతున్నారు అంటే ఎవరైతే అనంత మైన తండ్రి ఉన్నారో బిందు బిందు ఆత్మలు
వాటికి గుర్తుగా భ్రుకుటి కి మధ్యలో బిందువు పెట్టుకుంటారు, స్మృతిలో స్థిరంగా
ఉండడం కోసం తిలకం పెట్టుకుంటారు. ఆ జనన మరణ చక్రం లో వచ్చే ఆత్మలు వాటి యొక్క
చెడిపోయిన దానిని బాగుచేసే వారు ఆత్మలకు తండ్రి. కృష్ణుడు కాదు, ఎందుకంటే కృష్ణుడు
ఐతే 16 కళల సంపుర్ణుడు కూడా అవుతాడు, మరియు కళలు తగ్గుతూ తగ్గుతూ కళా హీన చంద్రుడు
కూడా అయిపోతాడు, పేరే ఉంది కృష్ణ చంద్రుడు అని, రామ చంద్రుడు అని, కనుక చంద్రుడితో
పోలిక చెపుతారు, అతని కళలు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. పొతే కృష్ణుడిని చాల వరకు
చిన్న పిల్లవాని రూపం లో పూజ చేస్తారు. కనుక రాముడిని తండ్రి అంటారు. ఈ విషయం
పిల్లలకి బుద్ధిలో చక్కగా రావాలి, పగలు రాత్రి ధ్యానంపెట్టాలి, సదా గీతా భగవంతుడు
కృష్ణుడు కాదు అని, ఎందుకంటే గీత లోనే అనేక శ్లోకాలు వచ్చాయి, వాటిలో భగవంతుడిని
అవ్యక్త నిరాకారుడు అని చెప్పాయి. మరియు భగవంతుడు నరుని నారాయణుని గా తయారు చేసే
వారు. నారాయణుని 16 కళల సంపుర్ణులు గా చూపిస్తారు. సత్యయుగం లో నారాయణుని రాజ్యం
ఉంది అంటారు. హే కృష్ణ నారాయణ వాసుదేవ అని గానం చేస్తారు. కనుక కృష్ణునికి
నారాయణుని పదవి లభిస్తుంది పెద్ద అయినప్పుడు. నరుని నుంచి నారాయణుడు అవుతాడు.
నరుని నారాయణునిగా తయారు చేసే వారు ఎవరు? స్వయం ఐతే కాక పోవచ్చు, కనుక నరుని
నారాయణుని గా చేసే వారు భగవంతుడు. కానీ ఆయన కలాతీత కళ్యాణ కల్పాంత కారి అని మహిమ
చేయ బడ్డాడు. ఆయన కళలో బంధించబడడు. కళల కన్నా అతీతుడు. ఎలాగైతే సూర్యుడు కళల కన్న
అతీతుడో, అలాగే భగవంతుడు కూడా కళల కు అతీతుడు. ఎవరైతే కళలకు అతీతుడో ఆయనే గీతా
జ్ఞానం ఇచ్చి 16 కళల సంపుర్ణునిగా చేస్తారు. కనుక
గీతా జ్ఞానం ఇచ్చేవారు ఏమి 16 కళల సంపుర్ణుడు కాజాలడు. కళల నుంచి అతీతుడో, ఆయనే
గీతా భగవంతుడు కాగలడు. మరియు శాస్త్రాలు వ్రాసేవారు అనేక మనుష్యులు. భగవంతుడైతే
ఒక్కరే. ఆ ఒక్కరే సర్వులకు సద్గతి దాత అని గానం చేయబడ్డారు. ఈ సృష్టి పైకి వచ్చి
నప్పుడు అందరికి సద్గతి చేస్తారు. నిజానికి శివబాబా రచయిత. మరియు కృష్ణుడు అయన
యొక్క సుందరాతి సుందరమైన రచన. అందుకే శాస్త్రాలలో వ్రాశారు కూడా శివబాబా కృష్ణుడిని
ఒడిలోకి తీసుకున్నారు అని, పిల్లవాని రూపం లో. కనుక సత్యయుగం 16 కళల సంపూర్ణము అని
గానం చేయబడిందో, దానిలో ఈ మనుష్య సృష్టి యొక్క మొట్ట మొదటి ఆకు 16 కళల సంపుర్ణుడు
కృష్ణుడు. అతను మొట్ట మొదటి (షా జాదా) రాజకుమారుడు. ఆయననే మహిమ చేస్తారు “హే కృష్ణ
నారాయణ వాసుదేవ” అని. వసు అని ధనసంపత్తిని అంటారు. వసుదేవుడు జ్ఞాన ధన సంపత్తి
ఇచ్చే అయన పేరు. మరియు అయన కుమారుని పేరు
వాసుదేవుడు. ఎలాగైతే బ్రహ్మ పుత్రుల పేరు బ్రాహ్మణులో, విష్ణువు యొక్క ఫాలోవర్స్
పేరు వైష్ణవులు. శివుని యొక్క ఫాలోవర్స్ పేరు శైవులు. ఒక్క అక్షరం పెరుగుతుంది
ఫాలోవర్స్ అనే అర్ధం లో. పిల్లవాడు తండ్రిని ఫాలోచేస్తాడు. కనుక శివుడు రచయిత మరియు కృష్ణుడు ఈ
సృష్టికి మొదటి రచన. మొదటి ఆకు. చుడండి ఇప్పుడు మనం తిన్నగా ఎవరి మహిమ
చేస్తున్నామో. మరియు ఏమి చెపుతారు అంటే శ్రీ కృష్ణుడు గీత వినిపించారు అని.
ఇప్పుడు శ్రీ కృష్ణుని పేరు వేయడం వల్ల భారత్ నిరుపేద అయిపోయాడు. ఎందుకనగా శ్రీ
కృష్ణుడు సాకారుడు. భగవంతుడైతే నిరాకారుడు. ఆ నిరాకార భగవంతుడు ఎలాగైతే ఆత్మ
నిరాకారమో అణోరణీయాం సం, అలా భగవంతుడు కూడా నిరాకారుడు. తేడా కేవలం ఏమిటంటే ఆత్మలు
జనన మరణ చక్రం లో వస్తాయి. 84 చక్రం లో వచ్చి 84 జన్మలు కూడా తీసుకుంటాయి. కానీ
భగవంతుడు 84 జన్మల చక్రం లో రానందున త్రికాల దర్శి కూడా. ఆయనకు మన అనేక జన్మలు
తెలుసు. గీత లో కూడా చెప్పారు ఓ అర్జునా నీకు నీ జన్మలు తెలియవు, నేను నీకు
చెపుతాను. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే సాకార శ్రీ కృష్ణుని పేరు వేయడం వల్ల భారత్
నిరుపేద ఎలా అయ్యాడు, భిక్షగాడు ఎలా అయ్యాడు, విదేశీయులని భిక్షం అడుగుతూ ఉన్నాడు.
దీని కారణం భగవంతుడు తండ్రి కి బదులు ఏ గీతా మాత ఉన్నారో, ఆ గీతా మాతలో కృష్ణుడు
పిల్లవాని పేరు వేసేశారు. ఆ కృష్ణుడు పిల్లవాడు గీతా జ్ఞానం తీసుకుని నారాయణ పదవి
పొందాడు, నరుని నుంచి నారాయణుడు అయ్యాడు. భగవంతుడు నిరాకారుడు, ఆ నిరాకార భగవంతుని
దేశ విదేశాలలో నిరాకారుడు అని ఒప్పుకుంటారు. ఒకవేళ గీత లో నిరాకార పరమ పిత శివుని
పేరు ఉండి ఉన్నట్లయితే అప్పుడు మొత్తం ప్రపంచం లో ఉన్న అందరు విధర్మి విదేశీయులు
అందరూ గీత ను ఒప్పుకునే వారు, పైగా తమ ధర్మ గ్రంధాల కన్న మిన్న గ నమ్మేవారు.
భగవంతుడు స్వర్గ రచయిత. ఉన్న ధర్మపితలు అందరిలో ఇబ్రహీం, బుద్ధ, క్రీస్తు, గురు
నానక్, ఎవరూ స్వర్గం రచించరు. 2500 ఏళ్ళ చరిత్ర చెపుతున్నది, వాళ్లు వచ్చిన తరవాత
కూడా ఈ సృష్టి పతనం అనే గోతిలో కి పోతూ వచ్చింది. ఇంకా (ఇంకా) రౌరవ నరకం అవుతూ
వచ్చింది. ఒక్క భగవంతుడు మాత్రమె సదా స్వ స్థితి లో ఉంటారు , ఆత్మిక స్థితి లో.
కనుక ఎవరైతే సదా స్వ స్థితి లో ఉంటారో ఆయనే స్వర్గం రచిస్తారు. స్వర్గం అంటేనే
అర్ధం స్వ అనగా ఆత్మ గ అనగా వెళ్ళుట, ఎక్కడకి వెళ్ళాడు? ఆత్మిక స్థితి కి
వెళ్ళాడు. ఎవ్వరైతే దేవతలు ఉన్నారో వాళ్ళంతా స్వ స్థితి లో ఉంటారు. దేహాభి
మానులుగా ఉండరు. దేహ ఇంద్రియాల భ్రాంతి వాళ్లకు ఉండదు. వాళ్ళు దేహ సుఖాలు
భోగించరు. వాళ్ళు అతీంద్రియ సుఖం భోగించేవారు. ఒకవేళ ఇంద్రియ సుఖాలు భోగించినా
కూడా శ్రేష్ట ఇంద్రియాల సుఖం భోగించడం వల్ల ఆ దేవతలను ఎప్పటికీ కూడా
శ్రేష్టాచారులు అంటారు. మనుష్యులు భ్రష్ట ఇంద్రియాలతో సుఖం భోగిస్తాడు. అందుకే
మనుష్యులను భ్రష్టాచారులు అంటారు. రాక్షసుల మాటే విడిచి పెట్టండి. కనుక చుడండి
అటువంటి స్వర్గ సుఖం ఇచ్చే భగవంతుడు వేరే వేరే ధర్మ పితల లాగే నిరాకారుడే, వేరే
ధర్మ పితలు ఎవరైతే వస్తారో, క్రీస్తు ముఖం గమనించండి జాగ్రత్తగా, మహాత్మా బుద్ధుని
ముఖం పరిశీలించండి జాగ్రత్తగా, గురు నానక్ ముఖం ధ్యానంగా పరిశీలించండి, వారి యొక్క కళ్ళ యొక్క నిరాకారీ స్టేజ్ చుడండి,
ఆ ధర్మ పితలందరూ, తమ తమ ధర్మ ఫాలోవర్స్ యొక్క బీజాలు, వాళ్ళ ద్వారా ఆ ధర్మాల ఆరంభం
అవుతుంది, అలాగే మొత్తం సృష్టికి తండ్రి ఎవరో, అందరూ మనుష్యత్మలకు తండ్రి ఎవరో,
అయన కూడా ఈ సృష్టి పైకి వచ్చి నప్పుడు, ఏ ఒక్క సాధారణ తనువులో వస్తారో, ఎలాగైతే
గీత లో “ఏ సాధారణ శరీరం లో వచ్చిన భగవంతుడిని నన్ను మూఢమతులు గుర్తించలేరు” అని
చెప్పారు, కనుక ఏ సాధారణ తనువులో వస్తారో, అయన కూడా ఇతర మనుష్యుల వలెనే సాధారణం గా
మొదట పురుషార్ధి గా ఉంటారు, నిరాకారీ స్టేజ్ వారి వలె మొదట ఉండరు, భగవంతుని నియమం
“నేను వస్తే, పిల్లలను వరసవారి గా నాతో సమానంగా చేసి వెళతాను” అని, కనుక ఎలాగైతే
వేరే వేరే ధర్మ పితలు నిరాకారీ స్టేజ్ వాళ్ళో, అలాగానే ఆ ధర్మ పితలకు కూడా తండ్రి,
ఎవరైతే తండ్రులకు కూడా తండ్రి యో, ఆయనను ఖచ్చితంగా నిరాకారీ స్టేజి లో చిత్రాలలో
చూబించారు. మనమందరమూ కూడా శంకరుని చిత్రం చూసి ఉంటాము, ముఖం చూసి ఉంటాము, ముఖం
చూస్తూనే నిరాకారీ స్టేజ్ స్పష్ట రూపం తో ఒలుకుతూ ఉంటుంది. కనుక ఆ నిరాకారుడు,
సాకారుని లో వచ్చి, ఆయనను తనతో సమానం గా చేస్తారు, అప్పుడు ఆయన పేరు దేవ దేవ
మహాదేవ శంకర్ అని పేరు వస్తుంది. దీనికన్నా ముందు అయన ఒక సాధారణ పురుషార్ది.
కనుకనే స్మృతి లో (ధ్యానం లో) కూర్చున్నట్లు చూపిస్తారు. స్మృతి లో కుర్చునారు
అంటే తన కన్నా ఎవరో ఉన్నత స్థితి లో ఉన్నారు కదా, అయన కూడా భగవంతుని (ధ్యానం)
స్మృతి లో కూర్చున్నారు. కనుక మీరు జడ్జి చేయండి సృష్టిలో ఎంతమందైతే దేవతలు
ఉన్నారో ౩౩ కోట్లు, లేదా త్రి దేవులు, లేదా ఎంతమందైతే ఐదు, ఏడు కోట్ల మనుషులు
ఉన్నారో, ఎంతమంది ఐతే రాక్షసులు ఉన్నారో, వారిలో ఏ ఒక్కరి పేరు, శివునితో
జోడించరు. ఒక్కరే ఆత్మ ఉన్నారు, మనుష్య సృష్టిలో అయన పేరు శివుని తో కలుపుతారు. ఏ
పేరు, శంకరుడు. శివ శంకర భోలే నాధుడు. ఎందుకు శివుని పేరు ముందు ఎందుకు, శంకరుని
పేరు తరవాత ఎందుకు? ఎందుకంటే శివ పిత, మరియు శంకరుడు అయన యొక్క పెద్ద కుమారుడు.
ఎవరినైతే దేవ దేవ మహాదేవుడు అంటారు. త్రిదేవులలో బ్రహ్మ దేవుడు ఒకటి, విష్ణు
దేవుడు, వారి ఇద్దరి కన్నా ఎవరైతే పెద్ద దేవుడో అయన పేరు మహాదేవుడు. అనగా ౩౩ కోట్ల
దేవతలలో ఎవరైతే పెద్దాతిపెద్ద దేవత ఉన్నారో అయన మహా దేవుడు. శివుడు కూడా దేవత్మలు
గా అయ్యేవారు ఉన్నారో ఎవరైతే మనుష్యుల నుంచి దేవతలుగా అవుతారో వాళ్ళల్లో ఎవరైతే
చాలా మంచి పురుషార్ధి ఎవరో, శంకర దేవత, (అయన) దేవాత్మ, ఆయనలోనే ప్రవేశిస్తారు.
మరియు ప్రవేశించిన తరవాత ఇద్దరు అత్మలూ ఒకే సమానం గా ఐపోతారు. కుమారుడు తండ్రి
సమానం గా అయిపోతాడు. కనుకనే శంకరుని పేరు శివునితో కలిపేస్తారు. కాని శంకరుడు
శివుడు కాదు. అయన దేవత. మనిషిని దేవతగా భగవంతుడు వచ్చి తాయారు చేస్తారు. ఎలాగైతే
గీతలో నేను సాధారణ తనువులో వస్తాను అని చెప్పారు. అందుకే మనుషులు నన్ను
గుర్తుపట్టలేక పోతారు. “గుప్త వేషం లో సత్యయుగం రచించడానికి శివ భగవానుడు వచ్చారు,
ఇప్పుడు లెమ్ము లెమ్ము మనిషీ” అని గానం చేస్తారు. ఎందుకు? గీతలో ఐతే గీత మహాభారతం
నుంచి వ్రాయ బడింది అని వ్రాశారు. భాగవతం లో కూడా వ్రాశారు ఏమనంటే, కృష్ణుడు
ద్వాపరయుగం అంతం లో వచ్చారు అని, అరే శాస్త్రాల్లో ద్వాపరంలో 8 కళలు చూపారు,
సత్యయుగం లో 16 కళల సంపూర్ణ మనుషులు ఉంటారు అని చెపుతారు. త్రేతా లో 14 కళల
మనుషులు ఉంటారు దేవతలు అంటారు. మరియు ద్వాపరం లో ద్వైత వాదం మొదలు ఐపోతుంది. ద్వైత
వాదం అంటేనే రెండు రెండు ధర్మాలు, రెండేసి రాజ్యాలు, రెండేసి కులాలు, రెండేసి
జాతులు, ప్రతి విషయం లో ద్వైత వాదం పుడుతుంది. ద్వైత వాదం పుట్టినప్పుడు వాళ్ళల్లో
వాళ్ళకు జగడం పుడుతుంది. మా ధర్మం మంచిది, మా ధర్మం మంచిది అని జగడం ఆడతారు. మా
దేశం మంచిది మా దేశం మంచిది అని. ఈ జగడాలు పెరిగి పెరిగి ద్వాపర యుగం అంతం అవుతూ
అవుతూ కలియుగం వచ్చేస్తుంది. కలహ క్లేశాల యుగం. కనుక చుడండి శాస్త్రాలు రాసే
మనుషులు ఎంత భారీ తప్పు చేశారో. కృష్ణ భగవానుడు ద్వాపరయుగం అంతం లో వచ్చాడు, మరియు
పాపీ కలియుగం స్థాపాన్ చేసి వెళ్ళిపోయాడు అని. అరే భగవంతుడి ఇంత గ్లాని ఎందుకు
చేస్తారు? భగవంతుడైతే పడిపోయిన వారిని లేవదీయడానికి వస్తారు, పతితులను పావనం
చేయడానికి వస్తారు. దుర్గతి పొందిన వారికి సద్గతి నివ్వడానికి వస్తారు. కనుక
ద్వాపర యుగం అంతం లో వచ్చి కలహా క్లేశాల యుగం తాయారు చేసి ఎందుకు వెళతారు?
వాస్తవానికి భగవంతుడు ఏ యుగం లో రావాల్సిన అవసరం వస్తుంది. ఈ సృష్టిలో ఏ తండ్రి
అయిన వస్తాడో, తన పిల్లలకోసం ఇల్లు కడతాడో, కొత్త ఇల్లు ఏమైనా కూల్చి వేస్తాడా?
ఇల్లు పూర్తిగా ఎప్పుడైతే శిధిలావస్థకు వస్తుందో అప్పుడే దానిని కూల్చి పిల్లల
కోసం కొత్త ఇల్లు కడతాడు. ఇది కూడా సృష్టి రూపి ఇల్లు. ఈ సృష్టి రూపి ఇంటిని
కొత్తదిగా చేయడానికి భగవంతుడు ఎప్పుడు వస్తారంటే, ఎప్పుడైతే కలియుగ అంతం లో దీనిది
4 వ అవస్థ అయినప్పుడు. సృష్టిలో ప్రతీ వస్తువకు, ప్రతి మనిషికి నాలుగు
అవస్థలు(స్థితులు) తప్పకుండా ఉంటాయి. సత్వ ప్రధానం, సత్వ సామాన్యం, రజో మరియు తమో.
ఎలాగైతే మనిషి జీవనం ఉంటుందో, చిన్నతనం లో ఎంతో బాగుంటుంది, సత్వ ప్రధాన జీవనం, ఏ
వికారమూ ఉండదు. కామవికారం లేదు, క్రోధ వికారం లేదు, లోభం లేదు శిశువుకు, ఎటువంటి
అహంకారమూ లేదు. తరవాత పెద్ద అవుతాడు, కిషోర అవస్థ వస్తుంది, తల్లి తండ్రుల సంరక్షణ
లోనే పెరుగుతాడు. కానీ శిశుకాలం లో ఉన్న స్థితి ఉండదు. ఎంతో కొంత వికృతి యొక్క అంశ
మొదలు అవుతుంది. మూడవ స్థితి వస్తుంది రజో ప్రధానం. ఎలాగంటే ద్వాపరాన్ని రజో
ప్రధానం అంటారు. అటువంటి అవస్థ వచ్చి నప్పుడు వికారాలు బుద్ధి లో తిరుగుతాయి. కామీ
క్రోధీ లోభీ మోహీ ఆహంకారీ అయిపోతాడు. యువకుడి స్టేజి లో ఈ వికారాలు భోగిస్తూ అంతం
లో 4 వ స్థితి వస్తుంది ముసలి తనం. ఇంద్రియాలు శిథిలం ఐపోతాయి. సుఖం భోగించే
యోగ్యత ఉండదు. ఐనాకుడా మనసులో వికారాలు ప్రబలం అవుతాయి. శరీరం ముసలిది అయిపోతుంది,
ఎవరూ దగ్గర ఉండడానికి ఇష్ట పడరు. తామసీ జీవనం అయిపోతుంది. 4 వ స్థితిలో మృత్యువు
అయిపోతుంది. అలాగే ఈ మనుష్య సృష్టి రూపి ఇల్లు సత్యయుగం లో 16 కళల సంపూర్ణం,
సంపూర్తి సుఖి జీవనం. వికారాల పేరు గుర్తులు కూడా లేవు. తరవాత వస్తుంది త్రేతా
యుగం రెండవ స్త్తితి. సత్వ సామాన్య స్థితి,
త్రేతా ఆది వరకు కూడా కళలు చాలా నెమ్మదిగా తగ్గుతూ వస్తాయి. ఎందుకంటే ఇంద్రియాల
శ్రేష్ట సుఖం భోగిస్తారు, జ్ఞానేంద్రియాల సుఖం. 14 కళలై ఉండి పోతాయి. త్రేతా
తరువాత ద్వైత వాది యుగం ఎప్పుడు వస్తుందో అప్పుడు ద్విత వాది ధర్మ పితలు
ప్రవేశించేస్తారు. 2500 ఏళ్ళ కి ముందు ఇబ్రహీం 2750 ఏళ్ళకు ముందు బుద్ధుడు
వచ్చాడు, బుద్ధ ధర్మం, అతనికి ఎంతో మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఎలాగైతే ఇస్లామియులకు
ఉన్నారో 2000 ఏళ్లకు ముందు క్రీస్తు వచ్చాడు, క్రిష్టియన్ ధర్మం, అదేవిధం గా వస్తూ
వస్తూ అనేక ధర్మ పితలు అయ్యారు, మరియు మనుష్య సృష్టికి తమ తమ ధారణలు నేర్పించారు, సృష్టిలో
ఏకత్వం భంగం అయిపోతుంది. అదే రజో ప్రధాన యుగం. అక్కడ సృష్టి లో చక్కగా(సుబ్బరంగా)
వికారాలు వచ్చేస్తాయి. ఒక బ్రహ్మ వైవర్త పురాణం ఉంది అందులో 4 యుగాల ఆయువు
లిఖించబడి ఉంది. 1250 ఏళ్ళు సత్యయుగం, 1250 ఏళ్ళు త్రేతా, 2500 ఏళ్ళు సుఖీ(సుఖమయ)
జీవనం. రామకృష్ణుల వంటి దేవతల రాజ్యం ఉంటుంది. రామ రాజ్యం. కానీ మనుష్యలు వికృత
బుద్ధి తో ఏ శాస్త్రాలు వ్రాశారో, దాంట్లో రామ రాజ్యం లో కూడా అనర్ధం చేసేసారు,
రావణాసురుడు దూరి పోయాడు. అరే రామరాజ్యం గురించి ఎంత గొప్ప వర్ణన చేసారు అందులో
రావణ రాజ్యం ఎక్కడ నుంచి వచ్చింది? రావణాసురుడు అంటేనే రావయతే లోకాన్ ఇతి రావణ.
ఎవడు లోకులను ఏడిపిస్తాడో అతడినే రావణుడు అంటారు. రామ కృష్ణులు దేవాత్మలు, యధా
రాజా తథా ప్రజా, వాళ్ళేమైనా ఏడిపించేవారా? ప్రశ్నే ఉదయించదు. ఎప్పుడైతే ద్వైత వాది
ద్వాపర యుగం మొదలు అవుతుందో, అప్పుడు ఈ మనుష్య రూపం లో ధర్మ పితలు వస్తారు, మానవీయ
ధర్మ పితలు. వారిని భగవంతుడు అనము. ఏ ధర్మ పితా కూడా తమను భగవంతుడు అని స్వీకరించ
లేదు కూడా. గురు నానక్ కూడా సదా పైకి సూచించాడు, భగవంతుడు పై వాడు, ఉన్నత మైన
స్టేజి వాడు. గానం కూడా చేస్తారు “ నీ ధామం ఉన్నతం, నీ కర్తవ్యం ఉన్నతం, మరియు
ఉన్నతమైన నీ కార్యం ఆధారం గా ఉన్నత మైనది నీ నామం.” ఎలాంటి ఉన్నత మైన కర్తవ్యం
చేసి వెళతారంటే సృష్టి లో మరి ఏ ఇతర ధర్మ పితా చేయ లేక పోతారు. ఇబ్రహీం కాదు,
క్రీస్తు కాదు, గురు నానక్ కాదు, ఎవరూ చేయలేరు, శంకరాచార్యులు కూడా కాదు, ఎవరూ
చేయలేరు. ఏమి చేస్తారు? నరకాన్ని స్వర్గం చేసి వెళతారు. ఈ నరక సృష్టి ఉన్నదే తమో
ప్రధాన కలియుగం. కలియుగం అంతం లో భగవంతుడు వచ్చి నప్పుడు రెండు పనులు తప్పక
చేస్తారు. ఒకటి బ్రహ్మ ద్వారా కొత్త సృష్టి స్థాపన, బ్రాహ్మణుల స్థాపన. బ్రహ్మ
ద్వారా బ్రాహ్మణులు పుడతారు. బ్రహ్మ ముఖం నుంచి బ్రాహ్మణులు వచ్చారు అంటారు. ముఖం
లో ఏమైనా మిషిను ఉంటుందా, బ్రాహ్మణులు దూకుతూ, దూకుతూ బయటికి రావడానికి.
వాస్తవానికి బ్రహ్మ ముఖం నుంచి పరమ పిత పరమాత్మ ఏ జ్ఞానం వినిపించారో, ఆ
జ్ఞానాన్ని ఎవరైతే జీవనం లో ధారణ చేశారో మాన్యతను ఇచ్చారో, ప్రాక్టికల్ గ తమ జీవనం
తాయారు చేసుకున్నారో, వాళ్ళనే బ్రాహ్మణులు అన్నారు. వాళ్ళే సత్య సత్యం గా బ్రహ్మ
సంతానం బ్రాహ్మణులు. బ్రహ్మా వత్సలు. హం. ఈ విషయం తప్పక వుంది బ్రాహ్మణులలో కూడా 9
గోత్రాలు చెప్పబడ్డారు. శాస్త్రాలల్లో కూడా విఖ్యాతం గ ఉంది. ఎలాగైతే లోకం లో 9
ధర్మాలు ఉన్నాయో, అలాగే ఈ బ్రహ్మణులవి కూడా 9 గోత్రాలు ఉన్నాయి. బ్రహ్మ సంతానం
రూపం లో కొంత మంది ఉన్నత గోత్రం బ్రాహ్మణులు, కొంత మంది నీచ గోత్రం బ్రాహ్మణులు.
అలా ఎందుకు? అలా ఎందుకంటే, భగవంతుడు తండ్రి ఈ సృష్టి పైకి వచ్చి నప్పుడు ఏ స్వర్గం
2500 ఏళ్ళు, నరకం 2500 ఏళ్ళు, ఇది 5000 ఏళ్ళ సృష్టి దీనికి ప్రమాణం మహాభారతం లో నే
ఇవ్వ బడింది 5000 ఏళ్ళ క్రితం మహాభారి మహాభారత గృహ యుద్ధం అయ్యింది అని. ఆ గృహ
యుద్ధం సూచనలు నేటికీ భారత దేశం లో ఉన్నాయి. భారత దేశం లో ఎన్ని రాజకీయ పార్టిలు
తమలో తాము జగడం చేస్తున్నారో అన్ని మరే ఇతర దేశం లోను కావు(ఉండవు). భారత దేశం లో
ఎంత జాతి వాదం ఉందో ఇంత జాతి వాదం జాతి వాదం ఆధారంగా తమలో తాము గొడవలు పడడం రక్త
పాతం ఇక్కడ భారత దేశం లో ఐనట్లు మరే దేశం లోను అవదు. స్టేట్ లు ఇంత చిన్న దేశం లో
ఎన్ని స్టేట్లు చేయబడ్డాయి. ఇప్పటికీ కూడా ఆ రాష్ట్రాల్లో పంపకాలు జరుగుతూనే
ఉన్నాయి. ఎంత పంపకాలు అవుతాయో అంత ఎక్కువ జగడాలు పెరుగుతాయా లేక తగ్గుతాయా? ఎక్కువ
అయిపోతాయి. పేద వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. పేదలు ఇంకా పేదరికం లోకి వెళ్లి
పోతున్నారు. ఎందుకంటే ఈ సృష్టి లోకి భగవంతుడు రావాలి, భగవంతుడిని పేదల పెన్నిధి
అని మహిమ చేస్తాం. అయన పేదలనే లేపుతారు. ఒకవేళ షాహుకార్లను లేపినా కేవలం అవసరం
తీరడం కోసం. ఎలాగంటే 1936 లో దాదా లేఖరాజ్ బ్రహ్మ ద్వారా బ్రహ్మ వత్సల స్థాపన
కార్యం ప్రారంభం అయ్యింది. ఈ రోజు ఆ బ్రహ్మ కుమారీలు మొత్తం లోకం లో అంతా
వ్యాపించారు. కానీ ఆ బ్రహ్మ దాదా లేఖరాజ్ షాహుకారా లేక పేదవాడా? కలకత్తా లో
ప్రసిద్ధ వజ్రాల వ్యాపారి. అయన ద్వారా కార్యం ప్రారంభం అయ్యింది. ఎవరైతే ఎంత పెద్ద
షాహుకారో ఈ లోకం లో అతను అంత బాగా కార్యం చేయ గలుగు తారా ఈశ్వరీయ కార్యం , లేదా
తండ్రి వచ్చి పేద వాళ్ళను ఎన్నుకుంటారో ఆ పేద వారు మంచి కార్యం చేయ గలుగు తారా? ఓక
జోతిష్కుడు కూడా చెప్పారు, భగవంతుడు ఈ సృష్టి పైన వచ్చినప్పుడు చాలా చిన్న చిన్న
వ్యక్తుల ద్వారా సమస్త లోకం లో క్రాంతి వ్యాపింప చేస్తారు. భగవంతుడు వచ్చేదే
ముగ్గురు మూర్తుల ద్వారా, బ్రహ్మ ద్వారా కార్యం ఆరంభం అవుతుంది. బ్రాహ్మణ ధర్మం
స్థాపన అవుతుంది. 9 గోత్రాల బ్రాహ్మణులు ఎందుకంటే లోకం లో పెద్ద పెద్ద 9 ధర్మాలే
వ్యాపించి ఉన్నాయి. సనాతన ధర్మం దీనినే హిందూ ధర్మం అంటారు. ఇస్లాం ధర్మం, బౌద్ధ
ధర్మం, క్రిష్టియన్ ధర్మం, శంకరాచార్య ద్వారా సన్యాస ధర్మం, ముస్లిం ధర్మం, సిక్ఖు
ధర్మం, మరియు ఈ అన్ని ధర్మాలతో ప్రభావితం అయ్యి అన్ని ధర్మాలలో కన్వర్ట్ అవుతూ
వచ్చే ఆర్య సమాజం ఆ అన్ని ధర్మాల వాళ్ళకూ ఆహ్వానం ఇచ్చాడు ఎవరైనా వచ్చి హిందూ అవ్వ
వచ్చు అని, మరియు చివరలో ధర్మం పేరుతో వ్యాపించిన అధర్మం అది ధర్మమే కాదు ఎందుకంటే
భగవంతుని నమ్మనే నమ్మరు. రష్యా యొక్క నాస్తిక వాదం. కనుక దానిని విడిచి పెట్టాలి.
మిగతా భగవంతుడిని ఏదో ఒక రూపం లో నమ్మే 9 ధర్మాలు ఉన్నాయి. మరియు హిందువులే
కన్వర్ట్ అయ్యి వేరే వేరే ధర్మాలలో కి వెళ్ళిపోతూ వచ్చారు. చరిత్రలో వేరే ధర్మం
వాళ్ళు ఎవరూ కూడా హిందూ అవ్వలేదు. భగవంతుడు వచ్చి నప్పుడు ఆ అన్ని ధర్మాల నుంచి
ఎన్నుకో బడిన శ్రేష్ఠ ఆత్మలను ఏరి ఒక్క బ్రాహ్మణ సూత్రం లో బంధిస్తారు. అందరికీ
ఒకే విధమైన చదువు చదివిస్తారు. కాని తమ పూర్వ జన్మలో కన్వర్షన్ కారణం గా కన్వర్ట్
అయ్యి వేరే ధర్మాలలో ఆ ధర్మ సంస్కారాల వల్ల ఆ ఆత్మలు బ్రహ్మ సంతానం బ్రాహ్మణులు
అవుతారు కాని అయినా కూడా తిరిగి వరసవారి 9 ధర్మాల కారణం గ 9 కేటగరీ లోకి వెళ్లి
పోతారు. ఇప్పుడు ప్రశ్న భగవంతుడు వచ్చి నప్పుడు 9 గోత్రాలకు ప్రేఫెరెంస్ ఇస్తారా,
లేదా మొదటి నంబర్ గోత్రానికి ప్రిఫెరెంస్ ఇస్తారా? అందువల్లనే ముసల్మానులు
ఇప్పటికి అల్లాహ్ అవ్వల్ దీన్ అని గానం చేస్తారు. దీన్ అనగా ధర్మం, అల్లా వచ్చి
మొదటి నంబర్ ధర్మం స్థాపన చేశారు. దీన్ ను స్థాపన చేసారు. ఆ మొదటి నంబర్ ధర్మం అదే
సనాతన ధర్మం. దేవీ దేవతల ధర్మం. ఎందుకంటే భగవంతుడు వచ్చి నరుడి నుంచి నారాయణుడిగా
అయ్యే జ్ఞానం ఇస్తారు, దేవత అయ్యే జ్ఞానం ఇస్తారు. ఈ దేవత అయ్యే జ్ఞానం , ఈ యూనివెర్సిటి
ఈ విశ్వ విద్యాలయం లోకంలో ఎవరూ తెరవలేరు. ఒక్క భగవంతుడే మనిషిని దేవత చేస్తారు.
రాజయోగం నేర్పించి. గీతా జ్ఞానం ద్వారా. మరియు ఎలాగైతే వేరే ధర్మ పితలు వచ్చారో,
వాళ్ళేమైనా పుస్తకాలు వ్రాశారా? ఇబ్రహీం ఏమైనా ఏంజెల్ వ్రాశాడా? బుద్ధుడు ఏమైనా
పుస్తకం వ్రాశాడా? క్రైస్ట్ ఏమైనా బైబిల్ వ్రాశాడా? లేదు, వ్రాయలేదు, వాళ్ళు
డైరెక్ట్ వచ్చి నోటితో చెప్పారు. వర్బల్ గా చెప్పారు. రాత కోతల విషయమే లేదు. అలాగే
ఆ ధర్మ పితలకు కూడా తండ్రి, తండ్రులకే తండ్రి, భగవంతుడు శివుడు ఈ సృష్టి పైకి
వచ్చి నప్పుడు, ముఖం ద్వారా డైరెక్ట్ జ్ఞానం చెపుతారు. కాని ఆయనకు తన నోరు లేదు తన
శరీరమే లేదు. గర్భం తో జన్మ తీసుకొనే తీసుకోరు. అందుకే గీతలో “ప్రవిష్టుం” అనే ఒక
శబ్దం వచ్చింది. నేను ప్రవేశించే యోగ్యుడను. ఎలాగైతే భూత ప్రేత ఆత్మలు కూడా
ప్రవేశించేస్తాయి. కానీ భూత ప్రేతాత్మలకి దివ్య జన్మ ఉండదు. మరి భగవంతునిది దివ్య
జన్మ మహిమ గానం చేయబడింది. ఎలాంటి దివ్య జన్మ, భూత ప్రేతాత్మలు వస్తే ఎవరిలో
ప్రవేశిస్తాయో వారి ముఖ కవళికలు మారి పోతాయి, ఆక్ట్ మారిపోతుంది, కళ్ళ వెలుగు
మారిపోతుంది. ఎందుకు, ఎందుకంటే వాటి అన్నింటికీ తమ సుక్ష్మ శరీరం ఉంటుంది. సుక్ష్మ
శరీరం లో ఎక్కువ శక్తి ఉంటుందా లేక సాకార స్థూల శరీరం లో ఎక్కువ శక్తి ఉంటుందా.
సుక్ష్మ శరీరం లో చాలా శక్తి ఉంటుంది. కనుక ఆ సుక్ష్మ శరీర దారి ఆత్మ ఎవరిలో
ప్రవేశిస్తుందో ఆ దానిని నొక్కి పెట్టేస్తుంది ఆ ఆత్మని, మరి భగవంతుడు ఎవరిలో
ప్రవేశిస్తారో, ఆయనకు తన సుక్ష్మ శరీరం లేనే లేదు, అయన చాలా తేలికైన ఆత్మ, ఏ
నిర్దిష్ట నియమింప బడిన శరీరంలో ప్రవేశిస్తారో, ఆ నిర్దిష్ట శరీర ధారికి కూడా
తెలియదు ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు వెళ్ళారు అని. తరవాత తెలుస్తుంది నేను చెప్పిన
ఈలాంటి జ్ఞానం నా బుద్ధిలో ఇదివరకు ఎప్పుడూ రానేలేదు అని. ఇది తప్పకుండ ఏదో శక్తి
అని. భగవంతుడు ఏ శరీరం లో వస్తారో అతని ముఖ కవళికలు కూడా మారవు. ఆక్ట్ మారదు, భాష
కూడా మారదు. దృష్టి యొక్క ఫోర్స్ కూడా మారదు. సాధారణ తనువులో వస్తే సాధారణ కర్మే
చేస్తారు మనుషుల లాగ. భగవంతుని ప్రవేశత లో మరియు మనుషుల ప్రవేశత లో, ఎవరైతే పాప
కర్మలు చేసిన కారణం గా భూత ప్రేతాలు అవుతారో, వారి ప్రవేశత లో భూమికి ఆకాశానికి
ఉన్నంత తేడా ఉంది. ఆ ధర్మ పితలు వచ్చి ఉపదేశం ఇస్తారు, దాని ద్వారా లోకం నరకం
అవుతుంది, మనుషుల మెంటాలిటి పడిపోతూ వస్తుంది, ఎంతవరకు మెంటాలిటి పడిపోతుందంటే
ఈర్ష్యా ద్వేషాలు పెరిగి పోతాయి అంటే మనుషుల మధ్యలో, ఆటం బాంబులు తయారు చేసి
పెట్టేస్తారు, సృష్టి విధ్వంసం చేయడానికి, బుద్ధి ఆ విధంగా తామసం ఐపోయింది. ఏ
కొమ్మ పై కూర్చున్నామో ఆ కొమ్మనే నరుకుతున్నాము అని ధ్యాస కూడా కలగదు. ఏ లోకంలో
మనం ఉంటున్నామో ఆ లోకాన్నే భస్మం చేయడానికి సామాను తయారు చేసేశారు. మరి ఈ సామాను
వాళ్ళు తమ తెలివితో తయారు చేయరు, వాస్తవానికి 1936, 37 లో భగవంతుడు వచ్చి నప్పుడు,
అప్పటి నుంచే ఈ కార్యం మొదలు అయ్యింది అటామిక్ ఎనర్జీ తాయారు చేయడం. అంతకన్నా
ముందు మనిషి బుద్ధిలో అటామిక్ ఎనర్జీ పేరు గుర్తులే లేవు, ఎందుకంటే భగవంతుడు వచ్చి
నప్పుడు త్రిదేవులతో కలిసి వస్తారు. బ్రహ్మా విష్ణు శంకర్, ముగ్గురు దేవతలూ కూడా
ఒక్కే సారైతే ప్రత్యక్షం కారు. కాని తప్పకుండ ఉంటారు, అందుకే త్రిమూర్తి శివ
అంటారు. ఏక మూర్తి శివుడు కాదు, ఇద్దరు మూర్తి శివుడు కాదు, త్రి మూర్తి శివుడు.
దేవతలలో ఎవరైనా పెద్దాతి పెద్ద దేవతలు ఉన్నారా అంటే వారు ముగ్గురు దేవతలు. కనుక
బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ ధర్మం స్థాపన. ఆ బ్రాహ్మణులు సంపూర్ణ పురుషార్ధం తరువాత
నరుడి నుంచి నారాయణుడు వంటి దేవతలు గా అవుతారు. అందరూ ఐతే కాలేరు. 9 గోత్రాల
బ్రాహ్మణులు కాగలరా? అవ్వగలరా? కాలేరు. ఎవరైతే మొదటి నంబర్ బ్రాహ్మణులో వారే మొదటి
నంబర్ ధర్మం స్థాపనకి భగవంతుడికి సహయోగి పూర్తిగా అవుతారు. వారినే జ్ఞాన సూర్యుని
సంతానం అంటారు. సూర్య వంశి సంతానం. ఆ సూర్య వంశి పిల్లలు చాలా విశేష మైన వారు ఉద్భవిస్తారు.
ఆకాశం లో నక్షత్రాల తో వారిని పోలుస్తారు. ఆకాశం లో ఉన్నతోన్నత స్టేజిలో వెలిగే
నక్షత్రాలు ఎన్ని? 9 లక్షలు, అంటారు. అవ్వి రెండు రకాల నక్షత్రాలు, ఒకళ్ళు పగలు
వెలిగే వాళ్ళు కాదు, కాని తప్పకుండా ఉన్నారు, వాళ్ళు తమ వెలుగును, తమ మానమర్యాదలను
భగవంతుడు తండ్రి మానమర్యాదలలో మర్జ్ చేసేస్తారు. ఆ పరంపర ఈ నాటికీ నడుస్తూ
వస్తున్నది, ఒకరు ఫర్మ్ పెడతారు, లేదా ఏదైనా ఇన్స్టిట్యూట్ పెట్టినా తండ్రి పేరు
ముందు తరవాత అండ్ సన్స్ అని పేరు పెట్టేస్తారు. పిల్లల పేర్లు ఇవ్వరు. ఈ పరంపరలు
భగవంతుని సమయం నుంచి నడుస్తూ వస్తున్నాయి. శ్రేష్ఠ పరంపరలు. పిల్లవాడు ఎవరు అంటే
ఎవరైతే తండ్రిని ఫాలో చేస్తారో అతనే. ఫాలో ఫాదర్ అండ్ మదర్. కనుక భగవంతుడు తండ్రి
ఈ సృష్టి పైకి వచ్చి సూర్యవంశి కుటుంబ వ్యవస్థ స్థాపన చేస్తారు. అయన శిరసు పై అనగా
శివ శంకర్ భోలే నాథ్ శిరసు పై చంద్రుడిని చూపిస్తారు. అర్ధ చంద్రుడు. అసంపుర్ణుడు
అనగా శరీరం ఉండగా ఉండగా అసంపూర్ణ పురుషార్ధం చేస్తూ శరీరం విడిచి వెళ్లి పోయారు.
మరి ఆ ఆత్మ శంకరుని శరీరం లో ప్రవేశిస్తుంది చంద్రుని రూపం లో చూపించ బడతాడు. కానీ
అసంపూర్ణ చంద్రుడు కూడా 16 కళల సంపుర్ణుడు గా అవ్వాలి కదా, కాని అయన సత్యయుగం లో
పిల్లవాని రూపం లో జన్మ తీసుకుంటారు. కనుకనే శాస్త్రాలలో ఆవిధంగా చిత్రం చూపించారు
శంకరుడు కృష్ణుడిని తన ఒడిలో తీసుకున్నారు అని. కనుక బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ ధర్మం
స్థాపన. శంకరుని ద్వారా ఏ మహిమ ఉందో ‘హర హర బం బం’ అని 1936 నించే బాంబుల
(నిర్మాణం) తయారీ మొదలు అయిపోతుంది. ఒక వైపు బ్రాహ్మణుల ప్రపంచం లో జ్ఞాన బాంబులు
మరొక వైపు బయట ప్రపంచం లో ఆటమిక్ బాంబ్. కొత్త ప్రపంచం స్థాపన తో పాటు పాత ప్రపంచం
ధ్వంసం అయ్యేందుకు మసాలా కూడా తాయారు అవుతుంది. మొదటి అటమిక్ విశ్వ యుద్ధం 1944,
45 లో జరిగింది. అవ్వి చిన్న చిన్న బంబిలు, ఇప్పుడైతే పెద్ద పెద్ద బాంబులు
తయారయ్యాయి. మరియు ప్రతీ దేశమూ ఈ పరుగు పోటీ లో ముందుంది. గుప్త రూపం లో తాయారు
చేస్తూ ఉంటారు. ఇదే గీత లో కూడా చెప్పారు ‘దంష్ట్రా కరాలాని’ .... చ తే ముఖాని...
భగవంతుని దవడలు, అవి ఆకాశం లో కూడా ఈదుతున్నాయి, సముద్రం లోపల కూడా ఈదుతున్నాయి.
బాంబులు సముద్రం లోనూ ఉన్నాయి, ఆకాశం లో కూడా ఈదుతున్నాయి. ఈ దవడల మధ్యలో సమస్త
ప్రపంచమూ వచ్చేయ బోతున్నది. కానీ ఈ చతుర్థ విశ్వ యుద్ధం తరవాత అవుతుంది. దానిలో
అన్ని విదేశాలూ సముద్రం అడుగునకు మునిగి పోతాయి. నేటికి 2500 ఏళ్లకు ముందు
ఇవ్వన్నీ సముద్రం అడుగునే మునిగి ఉండేవి ఒక్క భారత దేశం మాత్రమే ఈ సృష్టిలో
ఉండేది. 2500 ఏళ్ళల్లో ఈ అమెరికా ఆస్ట్రేలియా ఆఫ్రికా యూరప్ ఈ విదేశీ ధర్మ ఖండాలు
ఉన్నాయో, చైనా బౌద్ధి ధర్మ ఖండం ఇవన్నీ సముద్రం అడుగున మునిగి ఉండేవి. అమెరికా
హిస్టరీ 500 ఏళ్ళ ది లభిస్తోంది. ఆష్ట్రేలియా 300 ఏళ్లకు ముందు ది లభిస్తోంది.
ఇవన్నీ వినాశీ ధర్మఖండాలు. ఎప్పుడైతే అటామిక్ విస్ఫోటనం సమస్త ప్రపంచం లో
జరిగినప్పుడు ఒక వైపు ఆటమిక్ విస్ఫోటనం అవుతూ ఉంటుంది ఒక్కో నగరం లో మరొక వైపు
ఆత్మ రూపీ దీపాలు వెలుగుతూ ఉంటారు. దీనికి గుర్తుగానే దీపావళి జరుపుకుంటారు.
దానికన్నా ముందు రావణుని మృత్యువు రూపం లో దసరా జరుపుకుంటారు. ఇవి భారత దేశం లో
జరుపుకుంటారు. భారత దేశం లోనే ఈ మహాభారి మహాభారత గృహ యుద్ధం జరిగింది 5000 ఏళ్ల కు
ముందు. కానీ పొరపాటున మహాభారత యుద్ధాన్ని ద్వాపర యుగం లో వేసేశారు శాస్త్ర కారులు.
వాస్తవానికి ఈ మనుష్య సృష్టి చరిత్ర కేవలం 2500 ఏళ్ళదే లభిస్తున్నది ప్రూఫ్ ప్రమాణ
సహితంగా. దానికన్నా ముందు ఏ ప్రూఫ్ ప్రమాణం లేదు. ఈ హిస్టరీ అప్పుడే తాయారు చేయ
బడుతుంది ఎప్పుడంటే మనిషి దుఖితుడు అయినప్పుడు. ద్వాపర యుగం నుంచి ద్వైత వాదం
మొదలు అవుతుంది. దుఃఖం పెరిగినప్పుడు మనిషి ఒక్కొక్క రోజు లెక్క పెడతాడా లేదా.
ఒక్కొక్క రోజు గడవడం భారం అయిపోతుంది. ఇబ్రహీం వచ్చాడు, మొహమ్మదు వచ్చారు,
క్రైస్ట్ వచ్చాడు, వీళ్ళ సంవత్సరం ప్రారంభం అయ్యింది. విక్రమాదిత్యుడు వచ్చాడు
విక్రమ సంవత్సరం ప్రారంభం అయ్యింది. హిజ్రీ సంవత్సరం ప్రారంభం అయ్యింది. ఇది 2500
ఏళ్ళ హిస్టరీ దుఃఖ ప్రపంచానిది. ఇది అంధకార ప్రపంచం. అంధకారం లో సత్య మైన మార్గం
ఎవరికీ కనిపించదు. ఆత్మ కల్యాణం ఎలా అవుతుంది అనేది తెలియనే తెలియదు. ఏ కొంచం తెలుస్తుందో, ఏ జ్ఞానం
వృద్ధి అవుతుందో అది భౌతిక వాదం ది అవుతుంది పంచ భూతాల ది. పృధివి జల వాయు అగ్ని
ఆకాశం. ఈ పంచ భూతాలతో తయారైన ఈ శరీరం ఈ జడత్వ మయ ప్రపంచపు జ్ఞానం ఉంది మనుషుల
దగ్గర. కానీ ఈ జడత్వ మయ శరీరం లో ఈ మట్టి శరీరం లో దీనిని నడిపే శక్తి ఏది. దీని
విషయం లో అందరూ అంధకారం లోకి వచ్చేస్తారు. ఇదే గీత లో చెప్పారు ఎవరు జ్ఞానులో వారు
జ్ఞానమనే పగలులో జీవిస్తారు. అజ్ఞానులు అంధకారం లో జీవిస్తారు. భౌతిక ప్రపంచపు
అంధకారం. జ్ఞానుల దినమేదో అది అజ్ఞానులకు రాత్రి.
జ్ఞానుల దినము ఆత్మ ఏమిటి పరమాత్మ ఏమిటి సృష్టి చక్రం ఏమిటి మనుష్యాత్మలు ఈ
చక్రం లో ఎలా చక్రంలా తిరుగు తారు, ఈ విషయాలలో బుద్ధి రమిస్తుంది. ఈ విషయాలలో
బుద్ధి రమించేవారిని బ్రాహ్మణులు అంటారు. బ్రాహ్మణుల కర్మయే జ్ఞానం గ్రహించడం,
జ్ఞానం ఇవ్వడం. మిగతా అందరూ శుద్రులే ఈ లోకం లో. నేటికి 500 ఏళ్ళ క్రితమే తులసి
దాసు వ్రాశారు, ‘భయే వర్ణ సంకర సబై’ అందరూ వర్ణ సంకరం అయిపోయారు శూద్రులు
అయిపోయారు అని. శుద్రులను భగవంతుడు వచ్చి ఈ సమయం లో బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులను
చేస్తున్నారు. ఈ బ్రాహ్మణుల సృష్టి గుప్త రూపం లో రచింప బడుతున్నది ఎలాగంటే
పాండవుల గురించి చెపుతారు పాండవులు గుప్త రూపం లో సంచరించారు అని. గుప్త
పురుషార్ధం అవుతున్నది. ఎవరి గురించి ఎవరైతే ద్వాపర యుగం నుంచి వేరే వేరే ధర్మాలలో
హిందువులు కన్వర్ట్ ఐపోయారో వారి కోసం ప్రత్యేకంగా భగవంతుడు వచ్చి జ్ఞానం ఇస్తారు.
ఎలా ఆయా ధర్మాలలో కన్వర్ట్ అయ్యారో అలాగే వచ్చి ఈ సనాతన ధర్మం లో కి కన్వర్ట్
అవుతారు. ఈశ్వరీయ జ్ఞానాన్ని పట్టుకుంటారు. మరియు ఇప్పుడు పట్టుకుంటున్నారు. ఓం
శాంతి.
No comments:
Post a Comment
బ్లాగ్ సందర్శించినందుకు ధన్యవాదాలు. త్వరలో మా స్పందన తెలుపగలము.