అన్ని నీవనుచు అంతరంగమున తిన్నగా వెతికి తెలుసుకుంటినయ్య.
రాత్రి ఒంటిగంట అయ్యిందో ఏమో అదే జలదరింపు వొళ్ళంతా కదులుతున్న భావన మంచం మీద పడుకునే ఉన్నా తెలుస్తోంది మూడు రోజులుగా ఇలా జరుగుతోంది. అది మళ్ళి జరగబోతోంది. నాకు తెలుసు కొంచం ధైర్యం గానే ఉన్నా ఇంతలో ఆ దృశ్యం ఎంత అందమైన దృశ్యం ఆ రూపం అపురూపం ఆ అందం అలౌకికం ఆ ముఖం ఎంత అందమో అంత అలౌకికం బంగారు చాయ ఆ రూపం ఎక్కడా కనపడదు. ఎంత అందమో అంత అలంకరితం. ఆ అలంకారాలు ఆమె కి సహజం గానే ఉన్నాయి కమలం మీద కుర్చుని ఉంది ఆ దరహాసం అద్భుతం ఎంత కోమలం ఆ చూపు అపార ప్రేమ పారావారం. ఓ చేయి అభయ హస్తం. మరో చేతితో ఆ బంగారు కాసులేమిటి ధారా ప్రవాహం గా కురుస్తూనే ఉన్నాయి. అది ఓ పేద్ద కుప్పగా ఆమె ముందు పడుతున్నది. చూస్తూ ఉండగానే ఆమె వెంకటేశ్వర విగ్రహం గ మారిపోయింది. మెలుకువ వచ్చేసింది. కాని దివ్యానుభూతి ఆ సాక్షాత్కారం పరమానందం. మరి ఇంక పడుకో లేక పోయాను.
మళ్ళి తెల్లారి ఆఫీసుకు పోవాలి పడుకోక పొతే నీరసం వస్తుందేమో కానీ అలా లేదు. ఎంతో ఉత్తేజం గా ఉంది. పొద్దున్న ఐదుకి లేచి ముఖం కడుక్కుని కాఫీ తాయారు చేయడానికి వెళ్లాను. ఈ లోపు ఇంట్లో వాళ్ళు అంతా లేచి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. గబగబా తెమిలి వంట టిఫిను అన్ని పూర్తి చేసి రెడి కావాలి. 6 కి పేపర్ వేసాడు. బావ తీసుకుని మామగారికి ఇచ్చాడు. అయన అలా టీవీ చూస్తూ పేపర్ చదువు కుంటున్నారు. ఈ లోపు మా అయన కి కాఫీ అందించి గబగబా పని మొదలు పెట్టాను. రేపటి నుంచి మూడు రోజులు ఆఫీసుకి దసరా సెలవలు.
నిన్ననే మా కోర్స్ మొదలు కోర్స్ వింటున్న కొద్ది వినాలి అనిపిస్తుంది. పగలు రాత్రి అని లేదు ఎప్పుడు టైం దొరికితే అప్పుడే వదిన ముందు కూచుని చెప్పించు కుంటున్నాం నేను మా అయన. ఓం శాంతి కోర్స్. వింటే కాని దాని రుచి తెలియదు. చిన్నప్పటి నుంచి దేవుడు అంటే నాకు చాల ఇష్టం. అందులో కృష్ణుడు అంటే ఇంకా ఇంకా ఇష్టం. ఎందుకో ఎప్పుడు కృష్ణుడితో ఆడిపాడాలి అనిపిస్తుంది. స్కూల్లో కల్చరల్ ప్రోగ్రాం లు వెయ్యాలి అందులో కృష్ణుడి పాత్ర వెయ్యాలి అంటే ఎంతో ప్రీతి. అలాంటిది ఇప్పుడు ఈ కోర్స్ లో కృష్ణుడి గురించి చెపుతుంటే మైమరచి వింటున్నాం.
లేఖరాజ్ అనే అయన వజ్రాల వ్యాపారి అయన గొప్ప కృష్ణ భక్తుడు 1936 ప్రాంతం లో పాకిస్తాన్ హైదరాబాద్ లో ఆయనకి గొప్ప మహల్ ఉండేది కలకత్తా లో పెద్ద బ్రాంచి ఉండేది. ఆ రోజుల్లోనే కోట్ల వ్యాపారం. గొప్ప గొప్ప రాజుల ఇళ్ళకి వెళ్లి జనానా కి వజ్రాల నగలు అమ్మే వాడు. ఒడ్డు పొడుగు తెల్లగా అందంగా ఉండేవాడు. అయన మాటలకి పడిపోయి రాణులు రాకుమార్తెలు రాణి వాసం దగ్గర సులువుగా నగలు అమ్మేసే వాడు.
కొన్ని రోజులుగా ఈ దృశ్యాలు కనిపిస్తున్నాయ్. త్రిమూర్తులు కనిపిస్తున్నారు. అందులో తనే బ్రహ్మ జాగా లో తెల్ల వస్త్రాలు వేసుకుని కనిపిస్తున్నాడు. విష్ణు శంకరులు ఆ దివ్య రూపాలు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నాయి. లక్ష్మి నారాయణులు. చక్రం అది మామూలు చక్రం కాదు ఏవో రాతలు కనిపిస్తున్నాయి. స్వస్తిక్ ఒకటి ఆ చక్రాని నాలుగు భాగాలు చేస్తోంది. ఇంతలో ఏమిటి ఆ లోకం ఎంతో సుందరం గ ఉంది. అందరూ అందమైన జంటలు చేతులు తిరుగుతున్నారు చిన్న పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళు కూడా జంటలు గ ఉన్నారు. అరె అందరూ కవలలు లాగా ఉన్నారే. ప్రకృతి ఎంతో రమణీయం గా ఉంది.
ఇంతలో ఆర్త నాదాలు, ఎంత భయంకరమైన యుద్ధం బాంబులు వేస్తున్నారు కత్తులతో పోడుచుకుంటున్నారు. స్త్రీలను చెరపడుతున్నారు. ఏడుపులు పెద్ద పెద్ద అంతస్తులు కూలిపోతున్నాయి, విరిగిన గోడల కింద మనుషులు చచ్చి పోతున్నారు. విషవాయువులు పీల్చి గొంతు పట్టుకుని చచ్చి పోతున్నారు, దాదా లేఖరాజ్ కళ్ళ నుంచి కన్నీళ్లు ధారగా వస్తున్నాయి....
No comments:
Post a Comment
బ్లాగ్ సందర్శించినందుకు ధన్యవాదాలు. త్వరలో మా స్పందన తెలుపగలము.