Saturday, July 16, 2016

సంస్కృతం వదతు -- సంస్కృతం మాట్లాడండి-1

సంస్కృతం వదతు -- సంస్కృతం మాట్లాడండి
హరిః ఓం -- నమస్కారము
ధన్యవాదః --ధన్యవాదాలు
స్వాగతం -- స్వాగతం
క్షమ్యతాం -- క్షమించండి
చింతా మాస్తు -- చింతించకండి
కృపయా -- దయచేసి
పునః మిలామః -- మళ్ళీ కలుద్దాం
అస్తు -- అలాగే
శ్రీమన్ -- అయ్యా
మాన్యవర్ -- మాన్యా
మాన్యే -- అమ్మా
ఉత్తమమ్ లేక శోభనం -- చాలా మంచిది (బాగు, బాగు)
బహు ఉత్తమమ్ -- అద్భుతం
భవతః నామ కిం -- మీ పేరేమి
భవత్యాః నామ కిం -- (స్త్రీ) మీ పేరేమి
మమ నామ మహేశ్వరి -- నా పేరు మహేశ్వరి....
ఏషః -- ఇతడు. మమ -- నా, మిత్రం -- మిత్రుడు
ఏషా-- ఈమె, సఖీ --- స్నేహితురాలు.
భవాన్ -- మీరు(పుం.) భవతీ -- మీరు(స్త్రీ)

అత్ర -- ఇక్కడ , తత్ర -- అక్కడ, కుత్ర -- ఎక్కడ, అన్యత్ర -- వేరే చోట, సర్వత్ర -- అంతటా, ఉపరి -- పైన,
అధః -- క్రింద  యత్ర -- ఎక్కడ


Tuesday, July 12, 2016

యోగీశ్వరుడు

Photo


శివుని ధ్యానించే శంకరుడు శివశంకరుడు ఐనాడు. అభేదం అయినాడు. నరుడు సాక్షాత్ భగవత్స్వరూపుడైనాడు. ఆ రాజయోగం తిరిగి ఇప్పుడు చెప్పుతున్నారు. రామదాసు కీర్తనలో ఋషులు దేవతలైనారని తన కీర్తనలలో వ్రాశారు. అటువంటి యోగులకు ఈశ్వరుడు స్వామి శంకరుడు. అంటే మొదటగా ఋషినుంచి తానే దేవతగా ఐ ఇతరులకు మార్గదర్శకులై వెలిగారు. ఒక లాయరే లాయరును, ఒక టీచరే మరొక టీచరును ఒక డాక్టరే మరొక డాక్టరును తయారు చేసినట్లు, ఒక యోగి నుంచి దేవ దేవుడైన ఋషి మాత్రమే మరొక ఋషిని దేవతగా మార్చగలరు.
ఇది అతి సుక్ష్మ జ్ఞానం. తెలిసినవారు పాటించిన వారూ అంతతః నిభాయించిన వారు అతి ధన్యులు.

Monday, July 11, 2016

చంచల మనస్సు

చంచల మనస్సు ఇతరులచే ప్రభావితం అవుతూ ఉంటుంది, కేవలం వినడం ఇతరులకు వినిపించడం ఇది భక్తి మార్గం పాటించడం జ్ఞాన మార్గం. అది రావణాసురుడి పని, ఇది రాముని పని. పది ముఖాలు పది మార్గాలు చుపిస్తాయి. పది దేవుళ్ళను కొలవమంటాయి. 
శరీరం ఐదు తత్వాలతో తయారయింది. శరీరం పై దృష్టి తత్వాలపై దృష్టి, శరీరాన్ని ఆధారంచేసుకునేది ఆత్మ . సుక్ష్మ మైన ఆత్మపై దృష్టి బుద్ధి సూక్ష్మం అవడానికి దోహద పడుతుంది. మనస్సు కేంద్రీకృతం అవ్వడానికి ధ్యానం ఉపాయం. ధ్యానం ఎలా చేయాలనేది కేవలం భగవంతుడే చెప్పగలరు. దానినే రాజయోగం అని భగవద్గీతలో చెప్పారు. మరి ఇతరుల ద్వారా రాజయోగం నేర్పబడదు, దేహ యోగం మాత్రమే వారు నేర్పగలరు. అందుకే భగవానుడు నేనే రాజయోగం నేర్పిస్తాను అని చెప్పారు. 

Sunday, July 10, 2016

శివ ధ్యాన ముద్ర


శివ శంకరులు ఏకమైన వేళ నిరాకారుడు సాకారునిలో మమేకమైన వేళ

Wednesday, July 6, 2016

చిన్నారి శివుడు




చిన్నారి శివుడు మీకు అండదండ అగుగాక

Featured Post

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్.

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్. ఒక సంక్షిప్త పరిచయం ఇక్కడ కింద తేదీలు పుట సంఖ్యలు ఇచ్చినవి గురువు గారి ప్రవచనా...