చంచల మనస్సు ఇతరులచే ప్రభావితం అవుతూ ఉంటుంది, కేవలం వినడం ఇతరులకు వినిపించడం ఇది భక్తి మార్గం పాటించడం జ్ఞాన మార్గం. అది రావణాసురుడి పని, ఇది రాముని పని. పది ముఖాలు పది మార్గాలు చుపిస్తాయి. పది దేవుళ్ళను కొలవమంటాయి.
శరీరం ఐదు తత్వాలతో తయారయింది. శరీరం పై దృష్టి తత్వాలపై దృష్టి, శరీరాన్ని ఆధారంచేసుకునేది ఆత్మ . సుక్ష్మ మైన ఆత్మపై దృష్టి బుద్ధి సూక్ష్మం అవడానికి దోహద పడుతుంది. మనస్సు కేంద్రీకృతం అవ్వడానికి ధ్యానం ఉపాయం. ధ్యానం ఎలా చేయాలనేది కేవలం భగవంతుడే చెప్పగలరు. దానినే రాజయోగం అని భగవద్గీతలో చెప్పారు. మరి ఇతరుల ద్వారా రాజయోగం నేర్పబడదు, దేహ యోగం మాత్రమే వారు నేర్పగలరు. అందుకే భగవానుడు నేనే రాజయోగం నేర్పిస్తాను అని చెప్పారు.
No comments:
Post a Comment
బ్లాగ్ సందర్శించినందుకు ధన్యవాదాలు. త్వరలో మా స్పందన తెలుపగలము.