Sunday, January 20, 2019

బుద్ధి హజార్ నియామత్ అంటే?

ఇంద్రియాణి  పరాణ్యాహు : ఇన్ద్రియేభ్య:  పరం మన: 
మనసస్తు  పరాబుద్ధి యో బుద్ధి: పరసస్తు స:
 కర్మేంద్రియాల కన్నా జ్ఞానేంద్రియాలు శ్రేష్ఠమైనవి జ్ఞానేంద్రియాలకన్నా మనసు ప్రబలమైనది. మనసు కన్నా బుద్ధి ప్రబలమైనది బుద్ధి కన్నా అతడు అనగా పరమాత్ముడు ప్రబలమైన వారు. బుద్ధి ఈశ్వరుని ప్రసాదం అంటారు. బుద్ధి హజార్  నియామత్ అని హిందీ లో అంటారు. అంటే ఒక్క బుద్ధి సక్రమంగా ఉంటే ఎన్నైనా సాధించ వచ్చు అని అర్ధం. 
రాజయోగం విషయం లో ఏమి చెపుతారంటే ఎంత సూక్ష్మము ను ధ్యానిస్తామో అంత  బుద్ధి సూక్ష్మం అవుతుందని చెపుతారు. ఏకాగ్రంగా మరే  విషయము తలచకుండా ఒక్క బిందువు పై ఏకాగ్రం చేస్తే బుద్ధి అతి సూక్ష్మం అవుతుంది. ఎంత విత్తనం చిన్నదిగా ఉంటుందో వృక్షము అంత  విస్తారాన్ని పొందుతుందని వివరిస్తారు. ఉదాహరణకు మర్రి విత్తనం అతి సూక్ష్మం ఐనది మరి మర్రి చెట్టు ఎంత విస్తారంగా ఉంటుందో మనకు తెలుసు. 
ఆలా అది జడ వృక్షము ఐతే మరి ఆత్మ అతి సూక్ష్మము కనుక మరి అది ఏ విస్తారాన్ని పొందుతుంది. దానిలో అనేక జన్మల రహస్యాలు తెలుస్తాయి. చిన్న చిప్ లో ఎంతో  డేటా ఉన్నట్లు. అంటే ఎంతెంత సూక్ష్మ జ్యోతిర్బిందువుతో యోగం చేస్తామో అంతంత మన అనేక జన్మల రహస్యాలు మనకు స్ఫురిస్తాయి. ఐతే ఇందులో సద్గురువుకు అనివార్యమైన పాత్ర ఉంది. సద్గురువు లేకుండా అసలు యోగం అనేదే అర్ధం లేనిది అవుతుంది. సత్ గురువు అనే మాటే సత్య ప్రాధాన్యత స్పష్టం చేస్తుంది. 
ప్రస్తుతం ఈ లోకం లో ఎవరూ  సత్యమైన వారు లేరు. ఐతే అసలు సత్యం అంటే భగవంతుడు అయన గుప్త రూపం లో తన కర్తవ్యమ్ చేస్తున్నారు. గుప్తంగా ఎందుకంటే ప్రస్తుతం రావణ  రాజ్యం కనుక అందరూ రావణ  సేన కనుక కర్ర విరగ కుండా పాము చావకుండా కార్యం సాధించడానికి అయన గుప్తం గ ఉన్నారు. మనం ఒక్కొక్కరిగా రావణ సంకెల నుంచి రామ ఆశ్రయం లోకి రావాల్సిఉంది. 
ఓం శాంతి. 

Thursday, January 3, 2019

ఆధ్యత్మిక విశ్వ విద్యాలయం మరియు త్రిమూర్తి శివ అనగా ఎవరు?

ఆధ్యత్మిక విశ్వ విద్యాలయం మరియు త్రిమూర్తి శివ అనగా ఎవరు?
ఆధ్యాత్మిక  అనే పదం లో రెండు పదాలు ఉన్నాయి. అధి అనగా లోపల ఆత్మ అనగా ఆత్మ. అంటే ఆధ్యాత్మ పదానికి అర్థం ఆత్మలో ఏమి ఉంది అని తెలుసుకోవడం. మొదట ఆత్మ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఆత్మ ఒక చైతన్య శక్తి. జ్యోతిర్బిందువు అనగా వెలిగే చుక్క. అది ఎక్కడ ఉంది భ్రుకుటి లో ఉంది. దీనికి గుర్తుగానే నేటికీ భారతీయులు భ్రుకుటి మధ్యలో బొట్టు పెట్టుకుంటారు. మనిషి పూర్తి శరీరం ఒక యంత్రం. దానిని నడిపే శక్తి ఆత్మ. మనిషి ప్రతీ సందర్భంలోనూ నాది, నేను అంటూ ఉంటాడు. నా శరీరం నా చేయి నా కాలు అంటాడు కాని నేను శరీరం నేను చేయి అనడు. కనుక శరీరం వేరు ఆత్మ వేరు అని తెలుస్తుంది. ఈ విషయం శాస్త్రాలలో ఉంది అణో రణీయాం సం మనుస్మరేత్యః........ అనే గీతా శ్లోకం లో భగవంతుడు మనకు ఆత్మరూపం అణువు కన్నా అణువు అని వచించారు. భగవానువాచ మనకు శ్రీమతం. శ్రీమతం అంటే శ్రేష్ఠమైన మతం లేక వాక్కు. అది పాటించి తీరాలి. అది ఒక శాసనం. మిగతా వారి వాక్కులు పాటించినా పాటించకున్నా మనకు నష్టం లేదు. అందుకే శ్రీమత్ భగవత్ గీత అన్నారు.
కానీ ఈ రోజు ఆ శ్రేష్ఠమతం మనం పాటించడం లేదు. అందుకే మనకు ఇన్ని దుఃఖాలు. మొత్తం ప్రపంచమే దుఃఖ మయంగా ఉంది. ఇప్పటి మన యుగం పేరే కలియుగం అనగా కలహాలు, కష్టాలు, దుఃఖాల యుగం. ద్వాపర యుగంలో కృష్ణుడు వచ్చి శ్రీమత్ భగవత్ గీత ను చెప్పి వెళ్ళిపోయారు అంటే మరి ఇప్పటి మాట ఏమిటి, ఇప్పుడు మనకు గతి ఏమిటి ఇలా దుఃఖంలో కొట్టు మిట్టాడ వలసిందేనా, ఆ సంస్కృత గీత చదివినా కూడా ఇంకా ఎందుకు లోకం పతనావస్తలోకే పోతువుంది?  లేక ఎవరో ఒకరిని గురువును చేసేసుకుని ఈ దుఃఖాలనుంచి విముక్తి పొంద గలుగు తామా? ఎంతోమంది గురువులు ఎంతో మంది బాబాలు వారిని ఆశ్రయించిన జనాలు వారికి పడుతున్న గతిని మనం రోజూ పేపర్లలో టివీల్లో ఇతర ప్రచార మాధ్యమాల్లో చూస్తూ వింటూనే ఉన్నాం. దీనికి విష వలయానికి విరుగుడు ఏది?  శాంతి ఎక్కడ దొరుకుతుంది?  మనిషి విడిగానూ, సంఘం సమిష్టిగానూ ఈ రావణ రాజ్యం నుంచి విముక్తి ఎప్పుడు పొందుతాడు?  
పై ప్రశ్నలకు సమాధానమే గీతా భగవానువాచ యదా యదా హి ధర్మస్య......తదాత్మానం సృజామ్యంహం.
అవశ్యం అయన లోకం పరివర్తన చేయడానికి వస్తారు. ఎప్పుడు వస్తారు? ద్వాపర యుగం లో కాదు ద్వాపర యుగం లో వస్తే అయన చెప్పిన శ్రేష్ఠాతి శ్రేష్ఠ గీత ద్వారా కృతయుగం లేదా సత్య యుగం రావాలి కాని కలియుగం రాదు. కనుక అయన వచ్చే సమయం కూడా కలియుగం అంతం సత్య యుగం ఆరంభం మధ్య కాలం సంగమం , సంగమ యుగంలో ఆయన వచ్చి పాత నరకాన్ని కలియుగాన్ని కొత్త సత్యయుగం స్వర్గం గ పరివర్తన చేస్తారు.
మరి ఆయన శ్రీమతం ఎలా ఇస్తారు? దానికి సమాధానం కూడా గీతలోనే ఉంది....అవజానాంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం.... అంటే నేను ఒక వృద్ధమానవ శరీరం లో వస్తాను జ్ఞానులు నన్ను గుర్తుపడతారు, మూఢులు నన్ను గుర్తు పట్టరు అని.
పరమాత్మ మనకు తండ్రి. అత్మలందరికీ తండ్రి. ఆత్మ ఎలాగ ఒక చుక్క రూపం లో ఉందొ అలాగే పరమాత్మ కూడా ఓకే చుక్క లాగే ఉన్నారు. ఇద్దరి రూపం ఒకటే. ఉదాహరణకు, ఏనుగు తండ్రి ఏనుగు లాగే ఉంటాడో, చీమ తండ్రి చీమ లాగే ఉంటాడో, అలాగే ఆత్మలకు తండ్రి ఆత్మ లాగే ఉంటారు. మరి ఆత్మలకు పరమాత్మ కూ తేడా ఏమిటంటే, ఆత్మలు జనన మరణ చక్రం లో వస్తారు, పరమాత్మ రారు. అనగా మనిషి కి పుట్టడం చనిపోవడం ఉంది కాని పరమాత్మ కు లేవు. ఆయనను ఆజన్మ అభోక్త అకర్త అంటారు. ఆత్మ శరీరం లేకుండా ఏ కర్మా చేయలేదు. ఆత్మకు కర్మలు చేయడానికి 5 తత్వాలతో తయారైన శరీరం కావలి. అలాగే పరమాత్మ కూడా శరీరం లేకుండా జ్ఞానం ఇవ్వలేరు. అయన శ్రీమతం ఇవ్వాలంటే ఆయనకు కూడా శరీరం ఆధారం కావలి. ఇంతకు ముందు తెలిపినట్లు అయన ఒక వృద్ధ మనవ శరీరం ఆధారం చేసుకుని అతని ముఖం ఉపయోగించి మనకు శ్రీమతం ఇస్తారు. అయన మనలాగా గర్భం తో జన్మ తీసుకోరు. ఎందుకంటే అయనకు జనన మరణాలు లేవు. మరి ఎలా మనకు జ్ఞానం ఇవ్వాలి. ఆయనది దివ్య జన్మ అనగా దివ్య ప్రవేశం చేస్తారు. శ్రిమద్భగవత్ గీత లో ప్రవేష్టుం చ పరంతప అనే పదం చెప్పారు, జన్మ కర్మ చ మే దివ్యం అనే శ్లోకం లో కూడా చెప్పారు..... పై శ్లోకాల ద్వారా మనకు రుజువు అవుతుంది అయన ప్రవేశించే యోగ్యుడు, మరియు అయన జన్మ దివ్యము అని. దివ్యం అంటే తప్పకుండ మనలాంటి జన్మ కాదు అని తెలుస్తుంది. ప్రవేష్టుం అనే పదం ద్వారా ప్రవేశించి తీసుకునే జన్మ అని కూడా తెలుస్తుంది.
ఇప్పుడు మన కర్తవ్యమ్ ఆయనను తెలుసుకోవడం, ఎవరి ఆధారం తీసుకున్నారు? ఎవరి ద్వారా శ్రిమతం ఇస్తున్నారు?
అయన సర్వ వ్యాపకుడు కాదు. ఒక వేళ అందరిలో ఉన్నాడు అని అంటే మరి భగవంతుడి కోసం ఎందుకు వెతుకుతున్నారు, గీతలో సంభవామి అంటే వస్తాను అని ఎందుకు అన్నారు, వస్తాను అంటే ఇక్కడ లేను అనే కదా అర్థం. అలాగే, అసహాయులై ఎక్కడ ఉన్నావు భగవంతుడా అని వెతికే భక్తుడిలో ఉంటె మరి వెతకడం ఎందుకు. అలాగే దుష్కర్మలు ఇతరులను స్వార్ధం కోసం చంపడం, స్త్రీలను మానభంగం చేసే వారిలో అయన ఎలా ఉంటారు? అలాగే రాయి రాప్పలో కూడా ఉండరు అవి జడం అయన పరమ చైతన్యం. కనుక అయన సర్వ వ్యాపకుడు కాదు. మరి కాదు అంటే ఒకరి లో వస్తాను అంటే ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి కదా. అయన అతి సుక్ష్మ మైన వారు, ఒక సినిమాకు డైరెక్టర్ లాగా తేర వెనుక ఉండి నాటకం నడిపించేవారు. గుప్తం గ ఉన్నారు. ఈ జగన్నాటకం లో హీరో పాత్ర ధారి ఇతనినే ఆడమ్ ఆదాము ఆది దేవుడు, ఆది నాధుడు అని అన్ని ధర్మాల వారు తమ తండ్రిగా ఒప్పుకున్నారు, ఇతనిలో ఆ పరమ పిత ప్రవేశించి ఆధారం చేసుకుని ఈయన ముఖం ద్వారా శ్రిమతం ఇస్తున్నారు. ఇందరు మనుషులలో ఈ హీరో ఎవరు ఎలా తెలుస్తుంది? అనేక జన్మలు తీసుకుని ఆ మొదటి వ్యక్తి తన జన్మలు మరిచి పోయాడు. అతనే కాదు మనమందరం కూడా మన గత జన్మలు మరిచి పోయాము. ఉదాహరణకు నెహ్రు విగ్రహం పెడతాము. ఆ నెహ్రు చనిపోయి ఇప్పుడు వేరొక జన్మ లో ఉన్నాడు. అతను ఇప్పుడు తన గత జన్మను తనే గురుతు పట్టలేడు. తన విగ్రహాన్ని తనే తెలుసుకోలేడు. ఇది నేనే అని. అలాగే ఒకప్పుడు మనం దేవతలం కానీ ఇప్పుడు అనేక జన్మల అనంతరం మనం మన ముందు జన్మలను మరిచి పోయాము. కాని భగవంతుడు జనన మరణ రహితుడు ఆయనకు మరుపు లేదు, జ్ఞాన సాగరుడు. కనుక ఆయనకు మనం ఎవరమో తెలుసు. మన జన్మ రహస్యాలు కూడా తెలుసు. దీనినే శ్రీమత్ భగవత్ గీత లో కూడా హే అర్జున నీకు నీ జన్మల రహస్యం తెలియదు నాకు తెలుసు అని భగవానువాచ. కనుక ఆ హిరో పాత్ర దారి ఎవరో భగవంతుడికి తెల్సు. అతనిలో ప్రవేశించి ధరప్రవాహకం గ జ్ఞానం వినిపిస్తున్నారు. ఆ జ్ఞానం విన్నప్పుడు మనకు ఎటువంటి జ్ఞానం భగవంతుడు తప్ప వేరే ఎవరు తెలుప లేరు అని తెలుస్తుంది.
భగవంతుడు వేరు దేవతలు వేరు. భగవంతుడు దేవతలకు తండ్రి. యో యధా మాం ప్రపద్యన్తే తాం తధైవ భజామ్యహం ,..... దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి.....అనే శ్లోకాల ద్వారా దేవతలను తలచేవారు దేవతలను, నన్ను తలచేవారు నన్ను పొందుతారు అని భూతాని యాన్తి భూతేజ్యా యాన్తి.... అంటూ భూత ప్రేతాలను పూజ చేసేవారు భూతాలను, పిత్రూన్ యాన్తి పిత్రున్ అని పెద్దలను తలచేవారు పెద్దలను చేరుకుంటారని భగవానువాచ.  దీనిని బట్టి భగవంతుడు ఒక్కరే, దేవతలు ౩౩ కోట్ల మంది అని శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. భగవంతుని పేరు సదా శివుడు, మిగత బ్రహ్మ, విష్ణు, శంకర్, సరస్వతి, లక్ష్మి, పార్వతి, అష్ట దేవతలు, ఇంద్రాది దేవతలు అయన పిల్లలు. సదా శివుడు జ్యోతి స్వరూపుడు. క్షీణే పుణ్యే మర్త్య లోకం విశన్తి... అనే శ్లోకం ద్వారా పుణ్య కర్మల ద్వారా దేవతలు అయ్యి తరవాత ఆ పుణ్యం అనుభవించి కరిగి పోగా తిరిగి మర్త్య లోకానికి వచ్చేస్తారు అనే శ్లోకం ద్వారా తెలుస్తుంది. అంటే ఒకప్పటి దేవతలే తమ పుణ్యం ఖర్చై పోగా మనుష్యులుగా ఐపోతారు అని భగవానువాచ.

శివ పరమపిత మిగతా దేవతలందరినీ మనుష్యుల నుంచి దేవతలుగా మారుస్తారు అని తెలిపారు. సిఖ్ ధర్మం లో అందుకనే ఓక నానుడి ఉంది మానుస్ సే దేవతా కియే కరత న లాగి వార్ అని. వార్ అంటే సమయం భగవంతుడు శివునికి మనుష్యుల నుంచి దేవతలుగా మార్చడానికి సమయం పట్ట లేదట.  .......ఇంకా ఉంది...

Monday, December 17, 2018

అన్నీ నీవే

అన్నీ నీవే నాకు, ఓ ప్రభు నీవు వస్తే అన్ని నీవే నా దంటూ ఏమీ లేదు. కలలలో నీవే. లోకం లో అందరికన్నా ఎక్కువ ప్రేమించేది నీవే. కనుక నిన్నెలా మరువను. లోకంలో అందరూ వెక్కిరించారు నన్ను. నీ నీడలో ముఖం దాచుకున్నాను నేను. లోకం లో అందరూ మోసం చేసారు నన్ను. దరిచేరుచుకుని ఆదరించావు నీవు. అపనింద వేశారు అంతా నన్ను. ఆసరా నిచ్చావు నీవు. మెతుకు వెతుకుతున్న నాకు పెన్నిధి వైనావు నీవు.
నిద్ర సర్పమై కబళించే నన్ను వెలుగువై చైతన్య పరిచావు నీవు. అందరిలో ఏకాకినైన నాకు ఏకాంత తత్వ సారమై కమ్ము కున్నావు నీవు. అనంత శాంతి వి నీవు, అమృత భాండము నీవు. నిన్ను చూచాను, అనుభవం చేశాను, అతీంద్రియ సుఖం ఏమని వర్ణించను, మూగవానికి తిన్న మధుర ఆస్వాదన తెలుప మాటలు కరువైన  రీతి, సర్వ శక్తి , ప్రేమ సాగరుడవైన నీ కరుణ వర్ణించ జాలను నేను.  

Friday, October 12, 2018

నిత్యమూ అవిరళమూ

అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పలేదు?
అంటే మొత్తం సృష్టా, లేకపోతే జడ, జంగమ సృష్టా, దేవతల సృష్టా, రాక్షసుల సృష్టా......అసలేంటి.....అని
ఏ సృష్టో తెలిస్తే జవాబు స్పష్టం గా ఉంటుందని.....
చరాచర జగత్తు
జగత్తు....విడి విడి గా నా లేక మొత్తంగా నా
టైము తో సంబంధం ఉందా లేదా అని
కలియుగ సృష్టా లేక సత్య యుగ సృష్టా అని
మొత్తం మీద
బిందువు బిందువు కలిస్తే సాగరం అయినట్లు ఒక్కొరి సృష్టి కలిపి మొత్తం సృష్టి అవుతుంది
అలాగే సమిష్టి సృష్టి ప్రభావం ఒక్కరి మీద కూడా పడుతుంది
అనగా స్రృష్టి కారకుడు ఒక్కడే
ఎవరికి వారు ఒక్కరే మరి అలాగే అందరికి కలిపి కూడా ఒకరే. ఏ ఒకరు అందరి మీదా ప్రభావం చూపిస్తారో ఆయనే భగవంతుడు
నా ద్రృష్టి కారకుడు ఒక్కడే
నే చెప్పేదీ అదే
అవును అనకుండా ఏదేదో అడిగావు.
ఎందుకు అని అనలేము అది నిత్యము అవిరళం అని

--
in godly service
  
Wednesday, October 10, 2018

దసరా

https://www.youtube.com/watch?v=kpiG85UBtHs

దసరా శరన్నవ రాత్రులు అప్పుడు రావణ దహనం చేస్తారు. రాముడి వేషం కట్టిన వ్యక్తి ఒక అగ్ని బాణం వేసి రావణాసురుడి బొమ్మను కాలుస్తారు. ఈ ఆనవాయితీ ఎప్పటి నుంచి వస్తున్నది. బహుశ త్రేతా యుగం తరవాత నుంచి అనవచ్చు. మరి దసరా అమ్మవారికి ఎందుకు పూజలు చేస్తారు. అమ్మవారు రాక్షసులను చంపింది మరియు రాముడు రావణుని చంపింది ఒకే సమయమా??? కాని ఇక్కడ కొంచం అర్ధం చేసుకోవలసిన విషయం ఒకటి ఉంది. ఒక సారి రావణాసురుడిని తగల బెట్టేశాక మళ్ళి మళ్ళి పై ఏటికి ఇంకా పెద్ద రావణ బొమ్మలు  ఎందుకు చేస్తున్నారో ఆలోచించాలి.  అంటే రావణాసురుడు చావలేదు. ఏ ఏటికి ఆ ఏడు పెరుగుతూ నే ఉన్నాడు. ఇందులో గుహ్య రహస్యం ఒకటి ఉంది. అదేమిటంటే పదితలల రావణుడు ఎవరు? తల అంటే మతం. పది తలలు అంటే పది మతాలు. ఒకే ఒక మతం పై నడిస్తే రామ రాజ్యం . రాముడికి ఒకే ముఖం. ఒకే మతం ఒకే మాట ఒకే భార్య. అందుకే రామ రాజ్యం అంటే సుఖానికి మారు పేరు. రావణ రాజ్యం అంటే అనేక మతాలు అనేక రాజ్యాలు అనేక భాషలు అనేకం లో సుఖం లేదు. ఇప్పుడు లోకమంతా దుఖమే ఉంది. ఇది దుఃఖ ప్రపంచం.రావణాసురుడి పది ముఖాలు అంటే మానవులలో పది వికారాలు. పురుషులలో 5, స్త్రీలలో 5 కలిసి 10. కామం క్రోధం, లోభం, మొహం, అహంకారం. ఈ పది వికారాలు లేని మనుషులు ఇప్పుడు లేరు. అందరూ రావణులే. పెర్సేంటేజ్ లో అందరిలోనూ ఈ వికారాలు ఉన్నాయి. ఇప్పుడు రావణ రాజ్యం ఉంది,  కాదు అని ఎవరూ అనలేరు.
నిరాకార రాముడు మరియు సాకార రాముడు.:- పరమపిత పరమాత్మ నిరాకార రాముడు(ఈయన పేరే శివుడు ఆత్మా రాముడు అని అంటారు, ఈయన జనన మరణ చక్రం లో రారు.). ఈ సృష్టి ఒక నాటకం అంటారు. ఈ నాటకం లో హీరో సాకార రాముడు. ఈ  మనుషులలో హీరో పాత్ర ధారి అయిన సాకార రాముడి లో ఆ శివుడు ప్రవేశించి మనచే మాయ రావణాసురుడితో యుద్ధం చేయిస్తున్నారు. (ఈ సాకార రాముడికి జన్మ మరణం చుబించారు). ఎవరో వేరే వారితో యుద్ధం కాదు. మనలోనే ఉన్న కామాది వికారాలతో యుద్ధం. దీనిని ఒక రూపకం లో కధలాగా చెప్పుకుంటున్నాము. నిజానికి కధ చెప్పుకుని ఆనందించి అది సినిమా ఐపోయాక ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్లి పోయినట్లు ఎదో ఒక రోజు దసరా చేసేసుకుని మళ్ళి మన మన వ్యవహారాల్లో మునిగి పోవడం కాదు. అందుకే దాని వల్ల ఏమి లాభం లేకుండా పోతున్నది. కేవలం ఖర్చు తప్పితే ఒరిగేది ఏమీ లేదు. చేయ వలసినది మనలోని రావణ సంహారం.
సాకార రాముడే హనుమంతుడు:- కోతులను సేనగా చెప్పారు. కోతులు అంటే కోతి బుధి ఇప్పుడు ప్రతివారి బుద్ధీ కోతి బుద్దే అయి ఉంది. కోతులకు రాజు మహా కోతి -హనుమంతుడు. ఎవరైతే తమ మాన్ అనగా  దురభిమానాన్ని హననం చేసారో వారే హనుమంతుడు. ప్రస్తుతం మన హీరో సామాన్యుని వలె మనలాగే ఉన్నారు, కోతి బుద్ధి తో కాని ఆయన స్వభావంతో ఎవరికీ చిక్కరు. అడవిలో /వనం లో పెద్ద కోతి ఎవరికీ సులభంగా పట్టు బడదు. అలాగే ప్రస్తుతం ఈ లోకం ఒక పెద్ద అడివి అందులో మనం అంతా కోతులలా ఉన్నాం. మన కోతులలో పెద్ద కోతి ఈయనను కూడా ఎవరూ కంట్రోల్ చేయలేరు. అయన అందరి అహంకారం తొలగించి పిదప తన అహంకారం వదిలిపెడతారు. ఈ హనుమంతుడు రామ భక్తుడు, ఏ రామ భక్తుడు . ఆ నిరాకార రాముని భక్తుడు. ఆ నిరాకార రాముడు (శివుడు) ఈయన ఎప్పుడు ఈ లో కం లో వస్తారంటే కలియుగ అంతం లో అనగా ప్రస్తుత సమయం లో వస్తారు. ఎందుకు వస్తారు ప్రతివారి లోని రావణాసురుడిని సంహరించడానికి. ప్రతివారిలో రావణుడు చనిపోతే మిగిలేది ఎవరు వారిలోని దైవత్వం. కోతులలో పెద్ద కోతి హనుమంతుడు ఎవరి భక్తుడు? ఈ నిరాకార రాముని భక్తుడు. మొదటి నంబర్ లో ఈయన తన రాముడిని ధ్యానిస్తూ తనలోని రావణుని సంహరిస్తాడు. కనుక ఇక్కడ ధర్మ సుక్ష్మం ఏమిటంటే నిరాకార రాముడికి తనకంటూ శరీరం లేదు. జనన మరణ చక్రం లో రారు. కనుక దేహం లేదు. విదేహి.
కానీ విదేహి ఎలా మనతో మాట్లాడాలి. ఆయనకు ముఖం కావాలి మాట్లాడడానికి కనుక మనుషులకు హీరో సాకార రాముని శరీరం లో ప్రవేశించి ఇతని ముఖం ద్వారా మనకు డైరెక్షన్ ఇస్తారు. డైరెక్టర్ తెర వెనక ఉన్నట్లు ఈ యన హీరో శరీరం లో ఉండి మనకు డైరెక్షన్ ఇస్తారు. హీరో ను మొదట మారుస్తారు. హీరో తనలోని వికారాలను హననం చేసి పిదప మిగతా అందరికి గురువై అందరికి రావణుని హననం చేయడంలో సహకరిస్తారు. అందుకే అయన మనందరికీ రాజు.

శివ శక్తులు.:- ఒకరే రాముడు. సాకార్+ నిరాకార్ మిగతా అన్దరూ సీతలే. సీత అనండి శివ శక్తి అనండి. వీరు తమలోని కామ క్రోధ లోభ మోహ అహంకారాలు అనే అసురులను సంహరిస్తారు దీని గుర్తుగానే దసరాల్లో శక్తి పూజ జరుగుతుంది. 

dasara

శివ శక్తులు.:- ఒకరే రాముడు. సాకార్+ నిరాకార్ మిగతా అన్దరూ సీతలే. సీత అనండి శివ శక్తి అనండి. వీరు తమలోని కామ క్రోధ లోభ మోహ అహంకారాలు అనే అసురులను సంహరిస్తారు దీని గుర్తుగానే దసరాల్లో శక్తి పూజ జరుగుతుంది.https://www.youtube.com/watch?v=kpiG85UBtHs 

--
in godly service
ramana mata  

Featured Post

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్.

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్. ఒక సంక్షిప్త పరిచయం ఇక్కడ కింద తేదీలు పుట సంఖ్యలు ఇచ్చినవి గురువు గారి ప్రవచనా...