శివబాబా మహావాక్యం
మాంగ్ నే సే మరనా భలా అంటే అడుక్కోవడం కంటే ఛావడం మేలు అని అర్ధం
భగవంతుడు ఎప్పుడూ అడుక్కోమని చేప్పలేదు. ఉంఛ వృత్తి అని పేరు కూడా పెట్టేశారు. కాని స్వాభిమానం ఉన్నవారు ఎన్నటికీ అడుక్కోరు. మరి అమ్మ కూడా అడగందే పెట్టదు కదా. అమ్మను నాన్నను అడగడం అడుక్కోవడం ఒకటే ఎలా అవుతుంది. కానీ ఈ రోజుల్లో ప్రతీ వారూ ఊరికే వస్తే కిరసనాయిలు కూడా తాగేస్తారు. వాళ్ళకు అడుక్కోవడంలో తన పర భేదం లేదు. ఓ వొందుంటే కొట్టండి మళ్ళీ సాయత్రం నాకు మనిఆర్డర్ వస్తుంది ఇచ్చేస్తాను అంటారు. అరే సాయంత్రం దాకా ఆగవోయి నీకే వచ్చేస్తాయి కదా మరి ఇంకోర్ని అడగడం ఎందుకు
వృత్తిగా అడుక్కునే వాడికి అసలు పెట్టకూడదని బాబా చెప్పేరు. ఎందుకంటే వాళ్ళు శ్రమ పడడానికి అస్సలు ఇష్టపడరు. ఎంతోమంది వృద్ధులయ్యాక కూడా ఇతరులపై ఆధార పడకుండా ఏదో ఒక పని తమ జానెడు పొట్ట నింపుకోవడానికి చేస్తారు. నేను అలాంటి ఎంతోమందిని చూశాను రిటైర్ అయ్యాక కూడా ఉద్యోగం చేసేవారిని లేకపోతే ఏదో ఒక సమాజసేవ చేసేవారిని. అన్నింటికన్నా మిన్న దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం, అంటే ఓపిక ఒంట్లో శక్తి ఉండగానే నాలుగు రాళ్ళు వృద్ధాప్యంలో గడవడం కోసం దాచుకునేవారు . అలా సంపాదించుకుని రిటైరయ్యాక కూడా సమయాన్ని సద్వనియోగం చేసే వారు కూడా ఉన్నారు. అలాంటి వారితో పోలిస్తే ఈ అడుక్కునే వారు ఏ విధంగా భూమికి భారమో తెలుస్తుంది.
అలాగే తల్లి తండ్రులు కూడా జీవితాంతం సంపాదించినది ఉట్టిపుణ్యానికి పిల్లలకి ధారపోయకూడదు. తమ ఉనికికే ఎసరుపెట్టే పిల్లలు ఎంతమంది తల్లి తండ్రుల ఆస్తులు కాజేసి కాజేసే అనాలి మరి, దురుద్దేశంతో వాళ్ళ ఆస్తులను తమ పేర చేసుకోవడాన్ని ఏమనాలి మరి, తరవాత వాళ్ళను గాలికి వదిలేయడమో లేక ఏ వృద్ధాశ్రమంలో జేర్చడమో లేక రోడ్డున పారేయడమో చేస్తున్నారు కదా...
మనవాళ్ళకి మహా పిచ్చి దానం ధర్మం అంటుంటారు. అపాత్ర దానాలు పాపం పెంచుతాయి కాని పుణ్యంకాదు. మనం ఇచ్చిన డబ్భు వాడు ఏ తాగుడుకో జూదానికో మరోటికో ఉపయోగిస్తే ఆ పాపంలో మనకి కూడా భాగం వస్తుంది. అందుకే పుణ్యానికి పోతే పాపం ఎదురైంది అనేది.
దానం చేస్తే అది మరింత ధర్మం అభివృద్ది చెందే చోట చేయాలి, అడుక్కునేవాళ్ళను ప్రోత్సహించకూడదు. మనం మనచేత్తోనే ఆ సహాయమేదో చేయాలి కాని ఏదో సంస్థ ఉంది అది చేస్తుంది అనుకోవడం అంత మంచిది కాదు కదా....