Thursday, March 31, 2016

అడుక్కోవడం కంటే ఛావడం మేలు

శివబాబా మహావాక్యం
మాంగ్ నే సే మరనా భలా అంటే అడుక్కోవడం కంటే ఛావడం మేలు అని అర్ధం
భగవంతుడు ఎప్పుడూ అడుక్కోమని చేప్పలేదు. ఉంఛ వృత్తి అని పేరు కూడా పెట్టేశారు. కాని స్వాభిమానం ఉన్నవారు ఎన్నటికీ అడుక్కోరు. మరి అమ్మ కూడా అడగందే పెట్టదు కదా. అమ్మను నాన్నను అడగడం అడుక్కోవడం ఒకటే ఎలా అవుతుంది. కానీ ఈ రోజుల్లో ప్రతీ వారూ ఊరికే వస్తే కిరసనాయిలు కూడా తాగేస్తారు. వాళ్ళకు అడుక్కోవడంలో తన పర భేదం లేదు. ఓ వొందుంటే కొట్టండి మళ్ళీ సాయత్రం నాకు మనిఆర్డర్ వస్తుంది ఇచ్చేస్తాను అంటారు. అరే సాయంత్రం దాకా ఆగవోయి నీకే వచ్చేస్తాయి కదా మరి ఇంకోర్ని అడగడం ఎందుకు
వృత్తిగా అడుక్కునే వాడికి అసలు పెట్టకూడదని బాబా చెప్పేరు. ఎందుకంటే వాళ్ళు శ్రమ పడడానికి అస్సలు ఇష్టపడరు. ఎంతోమంది వృద్ధులయ్యాక కూడా ఇతరులపై ఆధార పడకుండా ఏదో ఒక పని తమ జానెడు పొట్ట నింపుకోవడానికి చేస్తారు. నేను అలాంటి ఎంతోమందిని చూశాను రిటైర్ అయ్యాక కూడా ఉద్యోగం చేసేవారిని లేకపోతే ఏదో ఒక సమాజసేవ చేసేవారిని. అన్నింటికన్నా మిన్న దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం, అంటే ఓపిక ఒంట్లో శక్తి ఉండగానే నాలుగు రాళ్ళు వృద్ధాప్యంలో గడవడం కోసం దాచుకునేవారు .  అలా సంపాదించుకుని రిటైరయ్యాక కూడా సమయాన్ని సద్వనియోగం చేసే వారు కూడా ఉన్నారు. అలాంటి వారితో పోలిస్తే ఈ అడుక్కునే వారు ఏ విధంగా భూమికి భారమో తెలుస్తుంది.
అలాగే తల్లి తండ్రులు కూడా జీవితాంతం సంపాదించినది ఉట్టిపుణ్యానికి పిల్లలకి ధారపోయకూడదు. తమ ఉనికికే ఎసరుపెట్టే పిల్లలు ఎంతమంది తల్లి తండ్రుల ఆస్తులు కాజేసి కాజేసే అనాలి మరి, దురుద్దేశంతో వాళ్ళ ఆస్తులను తమ పేర చేసుకోవడాన్ని ఏమనాలి మరి, తరవాత వాళ్ళను గాలికి వదిలేయడమో లేక ఏ వృద్ధాశ్రమంలో జేర్చడమో లేక రోడ్డున పారేయడమో చేస్తున్నారు కదా...
మనవాళ్ళకి మహా పిచ్చి దానం ధర్మం అంటుంటారు. అపాత్ర దానాలు పాపం పెంచుతాయి కాని పుణ్యంకాదు. మనం ఇచ్చిన డబ్భు వాడు ఏ తాగుడుకో జూదానికో మరోటికో ఉపయోగిస్తే ఆ పాపంలో మనకి కూడా భాగం వస్తుంది. అందుకే పుణ్యానికి పోతే పాపం ఎదురైంది అనేది.
దానం చేస్తే అది మరింత ధర్మం అభివృద్ది చెందే చోట చేయాలి, అడుక్కునేవాళ్ళను ప్రోత్సహించకూడదు. మనం మనచేత్తోనే ఆ సహాయమేదో చేయాలి కాని ఏదో సంస్థ ఉంది అది చేస్తుంది అనుకోవడం అంత మంచిది కాదు కదా....

6 comments:

  1. మరింకెం. దేవుణ్ణికూడా అడుక్కోవడం మానేద్దామా? దేవుళ్ళుకూడా తమకు మొక్కమని మనల్ని దేబిరించడం లేదా బెదిరించడం మానేస్తారా?

    ReplyDelete
  2. స్పందిచి నందుకు ధన్యవాదాలు. అడుక్కోవద్దనే కదా చెప్పేది. మళ్ళీ దేవుళ్ళని అడుక్కోమని ఎవరు చెప్పారు అడుక్కునే వాళ్ళు అడుక్కుంటూనే ఉంటారు ఎవ్వరూ వాళ్ళని ఆపలేరు. ఎవళ్ళు కనపడితే వాళ్ళనే అడుక్కుంటూ పోతారు. నిజానికి ప్రకృతిలో అందరికీ సరిపడానే ఉంది కానీ పాడుచేసి ఈ గతికి మనమే కదా తెచ్చుకున్నాము. మీకు దేవుళ్ళమీద చాలా గౌరవం ఉందనుకుంటాను ఎవరినీ కించ పరచి మాట్లాడరాదు. ఒక సాధన చేసి స్థితిని పొందిన వారినే దేవతలు అంటారు. మనిషి మహోన్నత కర్తవ్యాలు చేసినఫ్పుడు దేవత అనే ఉపాధి పోందుతాడు. నరుడే నారాయణుడు అనే నుడి వినేఉంటారు కాబట్టి దేవతా గుణాలు ఉన్న మానవులు వారు దేవతలు ఆసురీ గుణాలు ఉన్నవారు రాక్షసులు. ఇప్పుడు అంతా అసురులే ఉన్నారు దేవతలు లేరు. కాని వాళ్ళు లేనేలేరని అనుకోకూడదు. ఎందుకంటే గాంధీ నెహృ ఇప్పుడు లేరు కానీ వాళ్ళ గుర్తులు అంటే విగ్రహాలు ఉన్నాయి కదా అలాగే దేవతా విగ్రహాలు ఆ దేవతలు ఒకప్పుడు ఈ భూమ్మీద నడయాడారని ఋజువు చెస్తాయి. ఓం శాంతి.

    ReplyDelete
  3. నేనదిగిందేమిటి? మీరు చెప్పినదేమిటి?

    ఇంతకీ దేవుళ్ళని అదివ్వంది, ఇదివ్వండి అని అడుక్కోవడం తప్పాకాదా? "ఒక సాధన చేసి స్థితిని పొందిన" వారైన దేవతలు కూడా ఫలానా పూజ చేస్తేనే నీకు ఫలానా ఫలం దక్కుతుంది లేదా రోజుకిన్నిసార్లు నాకు సాగిలపడితేనే నీకు మోక్షం లభిస్తుంది అని హుంకరించడం అడుక్కోవడం కాదా?

    ReplyDelete
    Replies
    1. ఫలానా పూజ చేస్తేనే నీకు ఫలానా ఫలం దక్కుతుంది లేదా రోజుకిన్నిసార్లు నాకు సాగిలపడితేనే నీకు మోక్షం లభిస్తుంది అని హుంకరించడం అడుక్కోవడం కాదా?
      @haribabu
      ఆఫీసుల్లో ఫైల్ వర్క్ ఎందుకు?అది లేకుండా పని చెయ్యలేరా?వర్క్ రిపొర్టులు ఖచ్చితంగా ఎందుకు పంపాలి?వర్క్ తిన్నగ అచెయ్యకపోతే మెమోలు ఎందుకు?లీవ్ లెటర్లు ఎందుకు?నెలవారీ మదింపులు ఎందుకు?ఇంక్రిమెంట్లు కట్ చెయ్యటం దేనికి?

      Delete
  4. యాచక వృత్తిలో ఆరితేరిరి విప్రు
    లది యిది యన నేల యన్ని యడిగి ,
    పన్నుల మిషజేసి పాలకుల్ రాజస
    మ్మొలుక యాచించిరి తలలు వంచి ,
    పలు కళారూపాల వలన యాచించిరి
    గణికలాదిగ కళాకారు లరయ ,
    సంగీత సాహిత్య సరస యాచించిరి
    కవులును గాయకుల్ ఘనత గాంచి ,

    అందరును యాచకులె , కాని , యరసి చూడ
    చేతి వృత్తుల వారు , కృషీవలులును
    కోరి యాచనకు దిగరు , వారి వారి
    కష్టమును నమ్మినోళ్ళకీ కర్మ రాదు .

    ReplyDelete
  5. రాజారావు గారు పద్యరూపంలో స్పందించినందుకు ధన్యవాదాలు. పద్యం చాలా చాలా బాగుంది. రైతే రాజు కదా.

    ReplyDelete

బ్లాగ్ సందర్శించినందుకు ధన్యవాదాలు. త్వరలో మా స్పందన తెలుపగలము.

Featured Post

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్.

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్. ఒక సంక్షిప్త పరిచయం ఇక్కడ కింద తేదీలు పుట సంఖ్యలు ఇచ్చినవి గురువు గారి ప్రవచనా...