Monday, March 28, 2016

పనియే పూజ అంటారు

పనియే పూజ అంటారు
ఎవరు చేయ వలసిన పని వారు నిష్ఠతో చేస్తే అది పూజ తో సమానం అని కొందరి అభిప్రాయం. ఈ రోజుల్లో అనేక రకాల పనులు ఎందరి ద్వారా నో నిర్వహింప బడుతున్నాయి. ప్రతీవారూ కొద్దో గొప్పో తమ పని సక్రమంగా నిర్వహిస్తున్నామనే అనుకుంటున్నారు. ఎవరినైనా సరే అడిగితే తాము సరిగానే చేస్తున్నామని, తాము చేసే పనికి ఋజువులతో సహా సమర్ధించు కుంటారు. మేము తప్పు చేస్తున్నామని ఎవరైనా అంటారా , అనరు ససేమిరా అనరు.
ఇతరులకు తమకు శుభం కలగ చేసేదే పని అనుకుంటే ఒక పని ఒకరికి శుభం వేరొకరికి అశుభం అవ్వ వచ్చునే.
అదంతా ఎందుకు ఈశ్వరుడు గీతలో కర్మ అకర్మ వికర్మ లను గురించి కర్మ యోగంలో చెప్పనే చెప్పారు. అంత లోతుగా అధ్యయనం చేసే ఓపిక ఎవరీకీ లేదిప్పుడు.
ఓ గుమాస్తా ఒంచిన తల ఎత్తకుండా పని చేసుకు పోతే అది పూజా కాదా,
ఓ గాడిద కూడా ఎంతో పని చేసుకు పోతోంది అది పాపం ఎంత పని చేస్తుందో ...అంటే మరి బాగోదు కదా..
ఏ ఆఫీసరేనా కానీ ఒకరికి తల వంచి పని చేయవలసినదే కదా.... పోనీ ఓ సుప్రీమ్ జడ్జి ని తీసుకుందాం ఓ ఉరి శిక్ష పడ్డ వ్యక్తికి ప్రెసిడెంటు క్షమాభిక్ష పెట్టేస్తే ఆ జడ్జి విలువ ఏమి మిగిలింది... ఆ మాత్రానికి ప్రెసిడెంటు మాత్రం  సుప్రీమ్ అథారిటీ యా అంటే అదీ కాదు... ఆయన నిర్ణయాలకు ఎంత విలువో రబ్బర్ స్టాంప్ అనే ఆయన ఉపాధికి తెలుసు.
అందుకే వర్క ఈజ్ వర్షిప్ అనే మాటకు అర్ధం ఏమిటో కొంచెం తెలియాలి.


2 comments:

బ్లాగ్ సందర్శించినందుకు ధన్యవాదాలు. త్వరలో మా స్పందన తెలుపగలము.

Featured Post

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్.

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్. ఒక సంక్షిప్త పరిచయం ఇక్కడ కింద తేదీలు పుట సంఖ్యలు ఇచ్చినవి గురువు గారి ప్రవచనా...