Wednesday, September 5, 2018

మూడు లోకాలు

Related image
మూడు లోకములు ----
 ఆత్మ ఈ సృష్టి పైకి ఎచట నుండి వచ్చింది? కీటకములు, పశువులు పక్షులు అన్నీ ఆత్మలే అన్నిటిలో ఆత్మ ఉన్నది. ఈ చిత్రంలో పృధ్వి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఆకాశ తత్త్వము చూపించారు. గీతా శ్లోకంలో అర్జునుడికి భగవంతుడు ఈ విధంగా చెప్పాడు –న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః , యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ... అనగా ఎచటకు సూర్య చంద్ర నక్షత్ర ప్రకాశము చేరలేదో, ఎచటికి అగ్ని యొక్క వేడి చేరలేదో, ఎచటికి చంద్రుని శీతలత చేరలేదో నాయొక్క దూరంగా సుదూరంగా అతీతంగా ఉన్న పరంధామంలో నేను ఉంటాను. గీత యొక్క ఒక పూర్తి శ్లోకంలో పరమాత్మ ఎక్కడ నివసిస్తారో చెప్పబడింది. దీనివల్ల మనకు ఏమని ఋజువౌతుందంటే ఈ పంచతత్వాలకూ అతీతంగా ఈ ప్రపంచానికి అతీతంగా ఒక 6 వ తురీయా తత్వమున్నది. బ్రహ్మలోకం దానిని ఇంగ్లీషులో సుప్రీం ఎబోడ్, ముస్లింలు అర్ష్, అని అంటారు. ఖుదా అర్ష్ లో ఉంటాడు ఫర్ష్(భూమి లో) లో కాదు (అంటారు) కానీ ఈ నాడు వారు కూడా భగవంతుడ్ని సర్వవ్యాపి అంటున్నారు. జైనులు తురీయాధామం అంటారు. అనగా ప్రతీ ధర్మంలో ఆ ధామానికి మాన్యత ఉన్నది. మనం ఆత్మలందరం అక్కడే ఉండేవారం. అక్కడే సుప్రీం సోల్ ఉంటారు. హిందువులు శివ అంటారు.శివుడు జనన మరణాల చక్రానికి అతీతుడు. కాని మిగిలిన ఆత్మలందరూ జనన మరణ చక్రంలోకి వస్తారు. దీని క్రమమేమనగా –ఎంతెంత శ్రేష్టకర్మ చేసే ఆత్మ ఐతే అంతంత పైకి(ఎత్తులో) పరే తే పరే శివునికి దగ్గరగా ఉంటుంది. అదేవిధంగా ఈ సృష్టిపై నీచాతి నీచ కర్మ చేసిన ఆత్మ శివునికి దూరంగా నీచ స్థితి లో ఉంటుంది. అటువంటి కర్మ చేసిన ఆత్మల సంఖ్య ఎక్కువ. అనగా దుష్ట కర్మలు చేసే వారి సంఖ్య ఎక్కువ, శ్రేష్టకర్మలు చేసే దేవాత్మలు 33 కోట్లు అని చెప్పబడేవారు చాలా తక్కువ, వీరి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది.
సత్య(కృత)యుగము నుండి సృష్టి చక్రం తిరుగుట మొదలవగానే త్రేతా వచ్చేసరికి సృష్టి కొంచం పాతది యగును. ప్రపంచంలోని ప్రతి వస్తువు నాలుగు స్థితులలో తిరుగును. పసితనం సతో ప్రధాన స్థితి, బాల్యం సతో సామాన్యం, యువావస్థ రజో ప్రధానం, వృద్ధాప్యం తమో ప్రధానత సృష్టికి కూడా ఇదే నియమం వర్తిస్తుంది. సతో ప్రధాన సృష్టి సత్యయుగం, సతో సామాన్యం త్రేతా యుగం, రజో ప్రధానత ద్వాపర యుగంలో సృష్టి, తమో ప్రధానత కలియుగ సృష్టి. కాబట్టి బ్రహ్మలోకం నుండి ఆత్మలు సృష్టిపైకి దిగే క్రమం ఏదనగా ఎంత శ్రేష్టాత్మలైతే అంత శ్రేష్టయుగంలో వస్తారు. 16 కళల సంపూర్ణ ఆత్మలు సత్యయుగంలో- 14 కళల ఆత్మలు త్రేతా యుగంలో, 8 కళల ఆత్మలు ద్వాపరంలో, కలియుగంలో కళావిహీనులైన వారు జన్మ తీసుకుంటారు. కళావిహీనులు ఇతరులకు దుఃఖమే ఇస్తారు. వారిని గూర్చి గీతలో ఇలా చెప్పారు. మూఢా జన్మని జన్మని నరక ప్రపంచంలో జన్మిస్తారు. పరంధామం నుండి క్రిందకు వచ్చిన ఆత్మలు వెనకకు తిరిగి పరంధామం వెళ్ళే మార్గం కనిపించదు. ఈ ఆత్మలు జనన మరణాల చక్రంలోకి వస్తూ శరీర సుఖాలు అనుభవిస్తూ తామసులుగా మారిపోతారు. ఏ దైనా బీజాన్ని మళ్ళీ మళ్ళీ నాటుతూ ఉంటే దాని శక్తి క్షీణం అవుతుంది. వృక్షం ఆకులు పిందెలు ఫలాలు చిన్నవిగా అవుతూ చివరికి ఫలాలను ఇవ్వటమే మానేస్తుంది. అదే విధంగా ఆత్మల యొక్క లెక్క ఏమనగా ఒకసారి పైనుండి ఈ సృష్టిపైకి కిందకు దిగిన ఆత్మ క్రిందకు పడిపోతూనే(స్థితి) ఉంటుంది. మీరు ఈ సృష్టియొక్క 2500 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే ప్రపంచంలో సుఖ శాంతులు తగ్గి అశాంతి పెరిగిందా, లేక దుఃఖ అశాంతులు తగ్గాయా... చరిత్ర ఏమి చెబుతుందనగా జనసంఖ్య పెరుగుతున్న కొద్దీ పై నుండి ఆత్మలు క్రిందకు వస్తున్న కొద్దీ అశాంతి పెరుగుతూనే ఉంటుంది. ప్రపంచపు జనాభా రోజు రోజుకూ పెరుగుతోంది. దేశ విదేశాలలో కీటక నాశక మందులు ఎన్నో జల్లుతున్నా రోజు రోజుకూ వాటి సంఖ్య పెరుగుతూనే ఉంది. దోమల కీటకాల సంఖ్య నిరంతరం పెరుగుతుంది. చివరకీఆత్మలు ఎక్కడ నుండి వస్తున్నాయి వాటికి సమాధానం గీతలో ఉంది గాని క్లియర్ గా లేదు. చిట్ట చివరికి ఈ విషయం క్లియర్ అయ్యింది. ఈ ఆత్మలన్నీ ఆ లోకం నుండి వస్తాయి. ఇచట జనన మరణ చక్రంలో వస్తాయి.



No comments:

Post a Comment

బ్లాగ్ సందర్శించినందుకు ధన్యవాదాలు. త్వరలో మా స్పందన తెలుపగలము.

Featured Post

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్.

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్. ఒక సంక్షిప్త పరిచయం ఇక్కడ కింద తేదీలు పుట సంఖ్యలు ఇచ్చినవి గురువు గారి ప్రవచనా...