ఓం శాంతి
విశ్వ నవ
నిర్మాణమునకు శ్రేష్ఠమైన ఈశ్వరీయ ప్రణాళిక.
నేను ఎవరు.
శరీరం వేరు ఆత్మ
వేరు రెండూ కలిసి జీవాత్మ అనబడును. జీవిత ఆత్మ జీవించు ఆత్మ అనగా శరీరం లో పని
చేయునది. ఆత్మ శరీరంలో లేనట్లయితే ఆత్మ కూడా ఏమీ చేయలేదు. శరీరం కూడా ఆత్మ లేకుండా
పనికి రాదు ఉదాహరణకు కారును డ్రైవరును చెప్పవచ్చును. కారుఉండి దానిలో డ్రైవరు
లేనిచో నడవదు. అలాగే కారు నడుపుతున్నట్లయితేనే ఒక వ్యక్తిని కార్ డ్రైవర్ అంటాము.
ఆత్మ గాలి కాదు. పృథ్వి జలం వాయువు అగ్ని ఆకాశం అనే పంచ తత్వాలతో శరీరం తయారు
అవుతాయి. ఆత్మ బయటికి వెళ్ళిపోయినా శరీరంలో 5 తత్వాలు ఉంటాయి. ఆ శరీరాన్ని కాల్చివేస్తారు,
లేదా పూడ్చి వేస్తారు. అవి జడతత్వాలు. కాని ఆత్మ వాటికి వేరుగా విలక్షణమైనది. అది
మనసు బుద్ధిలతో కూడిన ఒక అతి సూక్ష్మజ్యోతిర్బిందువు. దీనిని గురించి గీతలో
అణోరణీయంసమనుస్మరేత్యః.... అనగా అణువు కంటే అణుస్వరూపం. అణువే జ్యోతిర్మయము. ఆ
జ్యోతిర్మయ అణువులో అనేక జన్మల సంస్కారము నిండివున్నది. మనసు బుద్ధిలలో మనసు+
బుద్ధి కలిపి ఆత్మ అంటారు. మానవుడు శరీరం వదిలినప్పుడు మనసు బుద్ధి ఉండిపోయాయి,
ఆత్మ వెళ్ళిపోయింది అని ఎవరూ అనరు.
అన్నీ ఉన్నా మనసు బుద్ధి వెళ్లి పోయాయి. ఆత్మ వెళ్లి పోయింది కాబట్టి వాస్తవానికి
మనసు బుద్ధి ఏ శక్తి ఉందో దాని పేరే ఆత్మ. మనసు బుద్ధిలో ఈ జన్మ మరియు పూర్వజన్మల
సంస్కారము నిండి ఉంది. సంస్కారమనగా మంచిగానీ చెడుగానీ కర్మలు చేస్తామో ఆ
కర్మలయొక్క ప్రభావము మిగిలిపోతుందో దానినే సంస్కారము అంటారు. ఒక కసాయివాని కుటుంబములో
పిల్లవాడు పుట్టిపెరిగితే వానికి ఆవును చంపిన మహాపాపము అని చెప్పిననూ బుద్ధిలో
నాటదు. వానికి అటువంటి సంస్కారము పక్కా అయినది. ఈ విధముగా సంస్కారము అనునది ఆత్మ 3
వ శక్తి. కాబట్టి మనసు బుద్ధి సంస్కారము ఈ 3 శక్తులు కలిసి ఆత్మ అనబడును.
No comments:
Post a Comment
బ్లాగ్ సందర్శించినందుకు ధన్యవాదాలు. త్వరలో మా స్పందన తెలుపగలము.