Saturday, September 15, 2018


Image result for bhagavad gita photos images

గీతా భగవంతుడు కళలలో బంధించబడే కృష్ణ = చంద్ర = మాత కాదు,
కళాతీతుడైన జ్ఞాన సూర్యుడు సాకార నిరాకారుల కలయిక శివబాబా లింగరూపుడు.
గీతాభగవంతుడు సాకారంలో నిరాకారుడు.
గీతా భగవంతుడు కళలలో బంధింపబడిన కృష్ణ+చంద్ర+మాతకాదు. కళాతీతుడైన  జ్ఞాన సూర్యుడు సాకార నిరాకారుల కలయిక శివబాబా లింగరూపుడు.
సత్యము యొక్క స్వభావము అది ఎంత తటస్ధంగా ఉంటుందో అంతే మృదుల స్వభావంగా కూడా ఉంటుంది. అదేవిధంగా మా వినయపూర్వక నివేదన ఏమంటే శబ్దాల కాఠిన్యంలో సత్యం యొక్క గుహ్యతనూ మర్మాన్నీ దాని భావాన్ని, విషయ గంభీరతను గ్రహించడానికి అధిక ప్రయాస చేయమని.
శ్రీమద్భగవద్గీత మానవ జీవనానికి ఒక అమూల్యమైన శాస్త్రము. శ్రీమద్భగవద్గీత  ఒక్కదానికే భగవానువాచ అనే గౌరవం ఇవ్వబడింది. వేదవ్యాసునిచే సంకలితమైన ఈ రచనకు గతంలో కూడా ఎంతో లోక ప్రియమైనది. కేవలం భారతీయులనే కాదు, అంతర్రాష్ట్రీయంస్ధాయిలో కూడా అనే పండితులనూ, విద్వాంసులనూ తత్వవాదులనూ ఆకర్షించడంలో శ్రీమద్భగవద్గీత సర్వశ్రేష్ఠ స్థానoలోఉంది. ఈనాడు గీతపై ఎన్ని వ్యాఖ్య లు (అర్ధాలు) వ్రాయబడినవో అన్ని బహుశా మరి ఏ శాస్త్రం పై వ్రాయలేదేమో. ఇంకా అన్నిటికన్నా ఆశ్చర్యకర విషయమేమంటే ఒక  మరొక (అర్ధం, తాత్పర్యం)ను ఖండిస్తున్నది.
అయినా కూడా గీత యొక్క లోకప్రియత్వం తగ్గలేదు. మనిషిని ఈశ్వరునితో కలపడానికి సామర్ధ్యం వహించే గీత ఈనాడు మనిషిని మానవత్వంతో కలపగలిగిందా? వర్తమాన తరాన్ని పురాతన సంస్కృతితో సంపన్నం చేయడంలో యదార్ధమైన ధార్మిక స్పందన, మరియు ఆలోచనల పోషించడం  లో  శ్రీమద్భగవద్గీత సఫలం అయినదా. అనేక ధర్మాలు ధర్మశాస్త్రాల ఆడంబరంలో  నడుస్తున్న మనుషుల సహితo మరి ఇతర అన్యజీవుల రక్తపాతానికి మూల కారణం సమస్త ధర్మశాస్త్రాలకూ తల్లీ- తండ్రీ అయినా  శ్రీమద్భగవద్గీత  కాదా? ఇటువంటి అనేక కారణాలు శ్రీమద్భగవద్గీత  సామర్ధ్యంయోగ్యత పై ప్రశ్న చిహ్నం పెట్టేస్తున్నవి. విషాదయోగం నుంచి మోక్ష , సన్యాస యోగాల వరకూ కల మానవ జీవన యాత్ర ఏ గీత అధ్యాయాల్లో అయితే ఇమిడి ఉందో ఆ గీతే ఈనాడు ప్రపంచాన్ని విషాద సముద్రంలోకి తీసుకు వచ్చి .
గీత ప్రేమికులు మరియు అనుయాయిలకూ ఇది స్వీకరించడం కఠినం కావచ్చు. ఒకవేళ వారిని అడిగితే పాశ్చాత్య సంస్కృతి మరియు విజ్ఞానాలు కారణం అనవచ్చు కానీ మన సనాతన సంస్కృతి మన స్వ ఉన్నతి స్వాధ్యాయం అంటే స్వ చింతనకు మాత్రమే అనుమతిని ఇస్తుంది, అంతేకానీ పరచింతన పతనానికి కారణం (కదా). దానికి అనుమతి లేదు. కనుక ఇతర ధర్మాలూ లేదా పాశ్చాత్య సంస్కృతి మరియూ విజ్ఞానాలను దోషులుగా నిర్ణయించే ముందు మనము మన సంస్కృతి లోని సామర్ధ్యాన్ని విశ్లేషించవలసి ఉంటుంది. మనం ప్రస్తుతం శ్రీమద్భగవద్గీతకు ఉన్న మానవీయ టీకాలూ వాటిలో దోషాలను వెతక వలసి ఉంటుంది. ఎందుకంటే పతనానికి మూల కారణం ఈ మనుషులు వ్రాసిన తాత్పర్యాల్లో దాగి ఉంది. గీత నిష్ఫలతకు కారణం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం....
గీత ఒక సరళమైన సులభమైన కవిత్వం. అంతేకాక రహస్యాలతో కూడిన పొడుపు కధ కూడా. గీత ప్రతీ అధ్యాయంలో యోగం అనే మాట వస్తుంది. భక్తి యోగం, సాంఖ్య యోగం, జ్ఞన యోగం, కర్మ యోగం ఇలా ఇలా. యోగం అంటేనే కలవడం. కానీ ఎవరితో కలవడం? గీతలోనే(గీ.9-34,18-65) ఒక మాట వచ్చింది మన్మనాభవఅని, అంటే నా మనసులో ఇమిడిపో అని అర్ధం. దీనికి సరళ మైన అర్ధం ఈశ్వరునితో యోగయుక్తులై మాత్రమే ప్రతి ఒక అధ్యాయం అధ్యయనం చేయడం అనివార్యం అని. అప్పుడే సరైన రూపంలో గీతపై విశ్లేషణ సంభవం. కనుకనే ప్రతి ఒక అధ్యాయం పేరులో యోగం అనే మాట కలిపి ఉంది. కానీ మన్మనాభవ కు అర్ధం అంతటితోనే ఆగిపోదు. గీతలోనే(3-42) ఇంద్రియాలలో ప్రబలమైనది మనసు, మనసు కన్నా ప్రబలమైనది బుద్ధి, బుద్ధికన్నా ప్రబలమైనవారు బుద్ధిమంతులకే బుద్ధిమంతుడైన ఈశ్వరుడుఅని ఉంది.
ఈశ్వరుడు ఇంద్రియాలకు అతీతుడు, మనస్సు బుద్ధి కంటే అతీతుడు ఇంకా శ్రేష్ఠుడు అన్నప్పుడు, ఈశ్వరుని మనసులో ఇమిడిపోవడం అనే విషయం అర్ధం ఏమిటి? ఎప్పటి వరకూ ఈ విషయంపై స్పష్టత రాదో అప్పటివరకూ మన గీతా అధ్యయనం ఎలా చేయగలం?
ఈశ్వరునితో యోగం చేయడానికి అన్నిటికన్నా ముఖ్యవిషయం ఈశ్వరుణ్ణి తెలుసుకోవడం. పరిచయం లేకుండా ఎవరితోనైనా మనం ఎలా కలవగలం.  మనం ఎంతెంత ఈశ్వరుణ్ణి తెలుసుకుంటామో అంతంత యోగం పెరుగుతూ ఉంటుంది.  గీతలో యోగాన్నీ జ్ఞానాన్ని బాలా బుద్ధి కలవారు వేరువేరుగా అను కుంటారు, పండితులైనవారు అనుకోరుఅనే శ్లోకం(5-4) (సాంఖ్యయోగౌ పృధక్. బాలా ప్రవదంతి న పండితాః) ఉంది. మరి మనం ఈశ్వరుణ్ణి యదార్ధంగా తెలుసుకోగలిగామా? ఈ విషయమై గీతలోనే (10-14)ఎమన్నారంటే ఈశ్వరుని గురించి దేవగణాలకు కానీ, దానవులకు గానీ తెలియదు, ఈశ్వరుని పరిచయం ఈశ్వరుడు తప్ప అన్యులు ఎవరూ ఇవ్వలేరుఅని. అంటే మనుషులు ఇచ్చే ఏ వ్యాఖ్యలు  తాత్పర్యాలూ ఈశ్వరుని సత్యస్వరూప పరిచయం ఇవ్వలేవు. ఏ వ్యాఖ్యలు  తాత్పర్యాలు ఈశ్వరుని పరిచయం ఇవ్వలేవో అవి సత్య గీతా అర్థాలు ఏమాత్రం కావు కదా. అవి ఖండిత గీతా అర్ధాలు అనబడతాయి. అప్పుడు గీతకు ఇంతమంది మనుషులద్వారా అర్ధతాత్పర్యాలు వ్రాయబడుతున్న వాటిని ఆధారం చేసుకుని ప్రజలు అనుసరిస్తున్న దానికి  అర్ధం ఏమిటి? ఈ వ్యాఖ్యలు  మనను ఏవైపుకు తీసుకుని పోతున్నాయి. అబద్ద పు ప్రపంచం వైపుకు నడిపిస్తున్నాయి.

ఈశ్వరుని పరిచయం స్వయం ఈశ్వరుడే(గీ.10-15) ఇవ్వవలసినప్పుడు ఆయనే ఈ సృష్టిలో అవతరించ వలసి ఉంటుంది. అవతరించి తన పరిచయం ఇవ్వవలసి ఉంటుంది. అటువంటి స్వయం ఈశ్వరుని పరిచయమే  సత్యమైన గీత అని పిలవబడుతుంది. అందువలననే గీత స్వయం భగవానువాచ అని చెప్పబడింది. కానీ సమస్య ఏమిటంటే గీత భావార్ధాలను ఏ వ్యాఖ్యల ద్వారా తెలుసుకుని ఒప్పుకున్నారో అవన్నీ మనుషుల వ్యాఖ్యలు.............సశేషం .........

No comments:

Post a Comment

బ్లాగ్ సందర్శించినందుకు ధన్యవాదాలు. త్వరలో మా స్పందన తెలుపగలము.

Featured Post

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్.

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్. ఒక సంక్షిప్త పరిచయం ఇక్కడ కింద తేదీలు పుట సంఖ్యలు ఇచ్చినవి గురువు గారి ప్రవచనా...