అభిషేకం స్నానం శివ పరమాత్మ నిరాకారుడు సదా పవిత్రుడు పవిత్రతా సాగరుడు. ఆయనకు అభిషేకం ఎందుకు చేస్తాము. ఇది ఒక గుహ్య రహస్యం. జ్యోతిర్బిందువుకు పూజ చేయలేము. అతి సుక్ష్మం కనుక ఆయనకు ఇంద్రియాలు లేవు లేని వాటికి పూజ ఎలా చేయగలం పూజ సాకార దేవతలకు చేయగలం బిందువుకు ఎలా పూజ చేయగలం. కనుకనే శివలింగం ఏర్పాటు చేసాము భక్తి మార్గం లో. పరమాత్మ అంటున్నారు నాకు కాళ్ళే లేవు పాదాలకు నమస్కారం ఎలా చేస్తారు. పూజ మీ కు (పిల్లలకు) జరుగుతుంది. మీరు నా స్మృతిలో నా తో సమానంగా తాయారు అయినప్పుడు దేవతల రూపం లో ద్వాపర యుగం నుంచి మీకు పూజ జరుగుతుంది అని. ఆ పూజ కూడా శివబాబా కు మొదట అవ్యభిచారి భక్తి చేస్తాము. తరవాత తరవాత మిగత దేవతలా పూజ జరుగుతుంది. ఇక్కడ శివ బాబా అంటే ఇద్దరు తండ్రుల కలయిక. ఒకరు నిరాకర జ్యోతిర్బిందువు, రెండవ ఆత్మ శంకరుడు శంకరుడు ఈ సృష్టి రూపి నాటక రంగం లో హీరో పాత్ర దారి. ఈ శంకరుడే ఆది పురుషుడు. ఇతనినే అన్ని ధర్మాల వారు తమ తమ ధర్మాలలో వివిధ నామలతో గుర్తించారు. ముసల్మానులు ఆదం అని కిరస్తానియులు ఆడం అని జైనియులు ఆది నాథుడు అని హిందువులు ఆది దేవుడు అని అన్నాము. లింగం ఈయనకే గురుతు. ఈయన శరీరం శివ పరమాత్మ గ్రహించి ఈశ్వరీయ జ్ఞానం చెబుతున్నారు. పతితులను పావనులగా చేస్తున్నారు. నరకమును స్వర్గం చేస్తున్నారు.
అభిషేకం అనగా స్నానం శరీరానికి స్నానం నీళ్ళతో చేస్తాం గంగ లో మునిగినా శరీరం మాత్రమే పవిత్రం అవుతుంది కాని ఆత్మ పవిత్రం కావాలంటే జ్ఞాన స్నానం చేయాలి. జ్ఞానం అంటే తెలియడం ఎవరిని తెలియడం శివ పరమాత్మ ఎవరిలో వచ్చి పతితులను పావనం చేస్తున్నారో ఆయనను తెలియడం. అలా తెలియడమే జ్ఞానం . స్నానానంతరం భోజనం శరీరానికి భోజనం ఆహారం శరీరానికి పోషణ మరి ఆత్మకు భోజనం ఏ సాకారునిలో ఆ నిరాకార శివుడు వచ్చి తన సాంగత్యం తో పావనం చేస్తున్నారో ఆయనను స్మ్రుతి చేయడం. స్మృతి ఆత్మకు భోజనం. ఆహరం నీరు శరీరానికి ఆరోగ్యం ఆత్మకు ఆరోగ్యం స్మృతి, మరియు జ్ఞానం. ఈ శంకరునే సాకార తండ్రి అంటాము. ఆ శివ పరమపిత నే నిరాకార తండ్రి అంటాం. శంకరుడు తపస్సులో ఉన్నట్లు చుపించుతారు. అయన శివుని స్మృతి లో ఉన్నారు. శంకరుడు శివుని తో సమానం గ అయినప్పుడు ఇద్దరినీ కలిపి శివ శంకరులు అన్నాము. శివ బ్రహ్మ శివ విష్ణు శివ రాధ శివ సీత శివ మరి వేరే ఎవరితోనూ కలిపి చెప్పం. కారణం కేవలం శంకరుడు మాత్రమే శివ సమానం గ తాయారు అయ్యే పురుషార్ధం చేస్తున్నారు. శంకరుడు మొదట జ్ఞానం బ్రహ్మ కుమారిల ద్వారా విన్నారు. దానినే అభిషేకం రూపం లో ఇప్పటికి భక్తిలో స్మృతిచిహ్నం ఉంది. అందుకే లోటా లో మూడు వంతుల నీరు ఎదో కొంచం పాలు ఉంటాయి వాటితో అభిషేకం చేస్తారు. ఇక్క డ దీని గుహ్య అర్ధం బ్రహ్మ కుమారి బుద్ధి అనే లోటా లో ఎంత జ్ఞానం అనే పాలు ఉన్నాయో మరి మిగత అంతా వట్టి నీరే. ఆమె ద్వారా శంకర్ ఆత్మ జ్ఞాన స్నానం (అభిషేకం) చేస్తారు. తరవాత జ్ఞాన మననం అంతా అయన స్వ శక్తి తోనే చిలికి బయటకు తీసిన జ్ఞానం. అందుకే ఆయనను జ్ఞాన గంగ నెత్తి మీద పెట్టుకున్నట్లు చుపించుతారు. నీళ్ళ గంగ కాదు. జ్ఞానం . అది బుద్ధిలో ఉంటుంది. శివభిషేకం అంటే గుహ్య అర్ధం పురుషార్ధ (తపస్సు) సమయం లో సాకార తండ్రి ఏ బ్రహ్మ కుమారి జ్ఞాన స్నానం చేసారో దానికి గుర్తు.
ఓం శాంతి.
No comments:
Post a Comment
బ్లాగ్ సందర్శించినందుకు ధన్యవాదాలు. త్వరలో మా స్పందన తెలుపగలము.