పరమపిత పరమాత్మ-
ఆయన యొక్క దివ్య కర్తవ్యం
అంతిమ సమయంలో మొత్తం
ఆత్మలందరూ సృష్టిపైకి ఎప్పుడు దిగుతారో అప్పుడు పరమాత్మ శివుడు ఈ సృష్టిపైకి
వస్తారు. ఈ సృష్టిరూపి నాటకరంగానికి హీరో హీరోయిన్లు తప్పక ఉంటారు. మంచి చెడు
పాత్రధారులు ఉంటారు. ఈ సృష్టి నాటకంలో అందరికన్నా ఎక్కువ శ్రేష్టమైన పాత్ర
అభినయించే వారుంటారు. హిందువులలో వారినే త్వమాదిదేవః
పురుషః పురాణః త్వమస్య విశ్వస్య పరమం నిధానం....శంకర్, పార్వతి అంటారు. ఈ చిత్రంలో
వాస్తవానికి శివుడు శంకరుడు వేరు వేరు పొరపాటుగా మనం ఇద్దరినీ ఒకటి చేశాం. అది మన
తెలివి తక్కువ తనం అనుకున్నాం, కాని అది పొరపాటు కాదు. అర్ధం చేసుకోని కారణంగా బ్రహ్మకుమారీ
కుమార్ లు అందులో చిక్కుకు పోయారు. సుప్రీంసోల్. నిరాకార జ్యోతిర్బిందువు ఈ
సృష్టిపైకి వచ్చి ఎవరో ఒకరిని తప్పక తన సమానంగా మారుస్తారు. చదువు చదివించినప్పుడు
(ఒక విద్యార్ధి) 100 % టీచరు చదివించిన చదువునంతా ధారణచేయగల్గిన విద్యార్ధి ఒకరు ఉండవచ్చు.
నిరాకార జ్యోతి శివుడు వచ్చి శంకరుని ద్వారా ప్రపంచంలో ప్రత్యక్షమైనప్పుడు ఇద్దరి
యొక్క తాదాత్మ్యం జరుగును. ఎవరూ శివుడు బ్రహ్మ ఒకడనరు, శవబ్రహ్మ అని జోడించరు...శివునుతో
విష్ణువు పేరు కూడా జోడించరు. శివునితో శంకరుని పేరే జోడిస్తారు. ఎందుకనగా శంకరుడు
శివుని స్మృతిలో అంతగా లీనమై శివుడ్ని తనలో ఇమిడ్చేసుకుంటారు. ఆ ఇముడ్చుకునే
స్థతినే శివశంకరులు ఒకటే అన్నారు. ఈ స్ధితి ప్రపంచం లో ప్రసిద్ధి చెందినది.
వాస్తవానికి ఈ ఇద్దరు ఆత్మలు వేరు వేరు. సుప్రీం సోల్. జనన మరణాలలోకి రారు. శివ
లింగమని చెప్పారు. శంకర లింగమనరు. శివరాత్రి అంటారు శంకర రాత్రి అనరు. శివుడు పాప
పుణ్యాలకు అతీతుడు. ఈ దేహధారి పాపపుణ్యాలలో చిక్కుకుంటారు. చుడండి శంకరుడు
ధ్యానమగ్నమై ఉన్నారు. స్వయం పరమాత్మ రూపమే ఐతే ఎవరి ధ్యానం చేస్తున్నారు. ప్రాచీన
మందిరాలలో మధ్యలో ముఖ్యస్థానంలో శివలింగం ఉంటుంది. చుట్టూ దేవతలు ఉంటారు. వారితో
శంకరుని విగ్రహం కూడా ఉంటుంది. దీని వల్ల ఏమి రుజువు అవుతుందంటే 33 కోట్ల దేవతలలో
అతడు దేవ దేవ మహాదేవుడే....కాని అతడు పరమాత్మ కాడు. అతడు కూడా శివలింగం ఎదుట ఉపాసన
చేస్తూ కుర్చున్నాడు. కాబట్టి శివ జ్యోతిర్బిందువు సుప్రీంసోల్. శంకరుడు ఈ సృష్టి
రూపి నాటకరంగానికి హీరో పాత్రధారి.
No comments:
Post a Comment
బ్లాగ్ సందర్శించినందుకు ధన్యవాదాలు. త్వరలో మా స్పందన తెలుపగలము.