Thursday, September 6, 2018

పరమ పిత పరమాత్మ మరియు శివ శంకర్

Image result for shiv shankar brahma kumari posters

పరమపిత పరమాత్మ- ఆయన యొక్క దివ్య కర్తవ్యం
అంతిమ సమయంలో మొత్తం ఆత్మలందరూ సృష్టిపైకి ఎప్పుడు దిగుతారో అప్పుడు పరమాత్మ శివుడు ఈ సృష్టిపైకి వస్తారు. ఈ సృష్టిరూపి నాటకరంగానికి హీరో హీరోయిన్లు తప్పక ఉంటారు. మంచి చెడు పాత్రధారులు ఉంటారు. ఈ సృష్టి నాటకంలో అందరికన్నా ఎక్కువ శ్రేష్టమైన పాత్ర అభినయించే వారుంటారు. హిందువులలో  వారినే త్వమాదిదేవః పురుషః పురాణః త్వమస్య విశ్వస్య పరమం నిధానం....శంకర్, పార్వతి అంటారు. ఈ చిత్రంలో వాస్తవానికి శివుడు శంకరుడు వేరు వేరు పొరపాటుగా మనం ఇద్దరినీ ఒకటి చేశాం. అది మన తెలివి తక్కువ తనం అనుకున్నాం, కాని అది పొరపాటు కాదు. అర్ధం చేసుకోని కారణంగా బ్రహ్మకుమారీ కుమార్ లు అందులో చిక్కుకు పోయారు. సుప్రీంసోల్. నిరాకార జ్యోతిర్బిందువు ఈ సృష్టిపైకి వచ్చి ఎవరో ఒకరిని తప్పక తన సమానంగా మారుస్తారు. చదువు చదివించినప్పుడు (ఒక విద్యార్ధి) 100 % టీచరు చదివించిన చదువునంతా ధారణచేయగల్గిన విద్యార్ధి ఒకరు ఉండవచ్చు. నిరాకార జ్యోతి శివుడు వచ్చి శంకరుని ద్వారా ప్రపంచంలో ప్రత్యక్షమైనప్పుడు ఇద్దరి యొక్క తాదాత్మ్యం జరుగును. ఎవరూ శివుడు బ్రహ్మ ఒకడనరు, శవబ్రహ్మ అని జోడించరు...శివునుతో విష్ణువు పేరు కూడా జోడించరు. శివునితో శంకరుని పేరే జోడిస్తారు. ఎందుకనగా శంకరుడు శివుని స్మృతిలో అంతగా లీనమై శివుడ్ని తనలో ఇమిడ్చేసుకుంటారు. ఆ ఇముడ్చుకునే స్థతినే శివశంకరులు ఒకటే అన్నారు. ఈ స్ధితి ప్రపంచం లో ప్రసిద్ధి చెందినది. వాస్తవానికి ఈ ఇద్దరు ఆత్మలు వేరు వేరు. సుప్రీం సోల్. జనన మరణాలలోకి రారు. శివ లింగమని చెప్పారు. శంకర లింగమనరు. శివరాత్రి అంటారు శంకర రాత్రి అనరు. శివుడు పాప పుణ్యాలకు అతీతుడు. ఈ దేహధారి పాపపుణ్యాలలో చిక్కుకుంటారు. చుడండి శంకరుడు ధ్యానమగ్నమై ఉన్నారు. స్వయం పరమాత్మ రూపమే ఐతే ఎవరి ధ్యానం చేస్తున్నారు. ప్రాచీన మందిరాలలో మధ్యలో ముఖ్యస్థానంలో శివలింగం ఉంటుంది. చుట్టూ దేవతలు ఉంటారు. వారితో శంకరుని విగ్రహం కూడా ఉంటుంది. దీని వల్ల ఏమి రుజువు అవుతుందంటే 33 కోట్ల దేవతలలో అతడు దేవ దేవ మహాదేవుడే....కాని అతడు పరమాత్మ కాడు. అతడు కూడా శివలింగం ఎదుట ఉపాసన చేస్తూ కుర్చున్నాడు. కాబట్టి శివ జ్యోతిర్బిందువు సుప్రీంసోల్. శంకరుడు ఈ సృష్టి రూపి నాటకరంగానికి హీరో పాత్రధారి. 


Wednesday, September 5, 2018

మూడు లోకాలు

Related image
మూడు లోకములు ----
 ఆత్మ ఈ సృష్టి పైకి ఎచట నుండి వచ్చింది? కీటకములు, పశువులు పక్షులు అన్నీ ఆత్మలే అన్నిటిలో ఆత్మ ఉన్నది. ఈ చిత్రంలో పృధ్వి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఆకాశ తత్త్వము చూపించారు. గీతా శ్లోకంలో అర్జునుడికి భగవంతుడు ఈ విధంగా చెప్పాడు –న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః , యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ... అనగా ఎచటకు సూర్య చంద్ర నక్షత్ర ప్రకాశము చేరలేదో, ఎచటికి అగ్ని యొక్క వేడి చేరలేదో, ఎచటికి చంద్రుని శీతలత చేరలేదో నాయొక్క దూరంగా సుదూరంగా అతీతంగా ఉన్న పరంధామంలో నేను ఉంటాను. గీత యొక్క ఒక పూర్తి శ్లోకంలో పరమాత్మ ఎక్కడ నివసిస్తారో చెప్పబడింది. దీనివల్ల మనకు ఏమని ఋజువౌతుందంటే ఈ పంచతత్వాలకూ అతీతంగా ఈ ప్రపంచానికి అతీతంగా ఒక 6 వ తురీయా తత్వమున్నది. బ్రహ్మలోకం దానిని ఇంగ్లీషులో సుప్రీం ఎబోడ్, ముస్లింలు అర్ష్, అని అంటారు. ఖుదా అర్ష్ లో ఉంటాడు ఫర్ష్(భూమి లో) లో కాదు (అంటారు) కానీ ఈ నాడు వారు కూడా భగవంతుడ్ని సర్వవ్యాపి అంటున్నారు. జైనులు తురీయాధామం అంటారు. అనగా ప్రతీ ధర్మంలో ఆ ధామానికి మాన్యత ఉన్నది. మనం ఆత్మలందరం అక్కడే ఉండేవారం. అక్కడే సుప్రీం సోల్ ఉంటారు. హిందువులు శివ అంటారు.శివుడు జనన మరణాల చక్రానికి అతీతుడు. కాని మిగిలిన ఆత్మలందరూ జనన మరణ చక్రంలోకి వస్తారు. దీని క్రమమేమనగా –ఎంతెంత శ్రేష్టకర్మ చేసే ఆత్మ ఐతే అంతంత పైకి(ఎత్తులో) పరే తే పరే శివునికి దగ్గరగా ఉంటుంది. అదేవిధంగా ఈ సృష్టిపై నీచాతి నీచ కర్మ చేసిన ఆత్మ శివునికి దూరంగా నీచ స్థితి లో ఉంటుంది. అటువంటి కర్మ చేసిన ఆత్మల సంఖ్య ఎక్కువ. అనగా దుష్ట కర్మలు చేసే వారి సంఖ్య ఎక్కువ, శ్రేష్టకర్మలు చేసే దేవాత్మలు 33 కోట్లు అని చెప్పబడేవారు చాలా తక్కువ, వీరి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది.
సత్య(కృత)యుగము నుండి సృష్టి చక్రం తిరుగుట మొదలవగానే త్రేతా వచ్చేసరికి సృష్టి కొంచం పాతది యగును. ప్రపంచంలోని ప్రతి వస్తువు నాలుగు స్థితులలో తిరుగును. పసితనం సతో ప్రధాన స్థితి, బాల్యం సతో సామాన్యం, యువావస్థ రజో ప్రధానం, వృద్ధాప్యం తమో ప్రధానత సృష్టికి కూడా ఇదే నియమం వర్తిస్తుంది. సతో ప్రధాన సృష్టి సత్యయుగం, సతో సామాన్యం త్రేతా యుగం, రజో ప్రధానత ద్వాపర యుగంలో సృష్టి, తమో ప్రధానత కలియుగ సృష్టి. కాబట్టి బ్రహ్మలోకం నుండి ఆత్మలు సృష్టిపైకి దిగే క్రమం ఏదనగా ఎంత శ్రేష్టాత్మలైతే అంత శ్రేష్టయుగంలో వస్తారు. 16 కళల సంపూర్ణ ఆత్మలు సత్యయుగంలో- 14 కళల ఆత్మలు త్రేతా యుగంలో, 8 కళల ఆత్మలు ద్వాపరంలో, కలియుగంలో కళావిహీనులైన వారు జన్మ తీసుకుంటారు. కళావిహీనులు ఇతరులకు దుఃఖమే ఇస్తారు. వారిని గూర్చి గీతలో ఇలా చెప్పారు. మూఢా జన్మని జన్మని నరక ప్రపంచంలో జన్మిస్తారు. పరంధామం నుండి క్రిందకు వచ్చిన ఆత్మలు వెనకకు తిరిగి పరంధామం వెళ్ళే మార్గం కనిపించదు. ఈ ఆత్మలు జనన మరణాల చక్రంలోకి వస్తూ శరీర సుఖాలు అనుభవిస్తూ తామసులుగా మారిపోతారు. ఏ దైనా బీజాన్ని మళ్ళీ మళ్ళీ నాటుతూ ఉంటే దాని శక్తి క్షీణం అవుతుంది. వృక్షం ఆకులు పిందెలు ఫలాలు చిన్నవిగా అవుతూ చివరికి ఫలాలను ఇవ్వటమే మానేస్తుంది. అదే విధంగా ఆత్మల యొక్క లెక్క ఏమనగా ఒకసారి పైనుండి ఈ సృష్టిపైకి కిందకు దిగిన ఆత్మ క్రిందకు పడిపోతూనే(స్థితి) ఉంటుంది. మీరు ఈ సృష్టియొక్క 2500 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే ప్రపంచంలో సుఖ శాంతులు తగ్గి అశాంతి పెరిగిందా, లేక దుఃఖ అశాంతులు తగ్గాయా... చరిత్ర ఏమి చెబుతుందనగా జనసంఖ్య పెరుగుతున్న కొద్దీ పై నుండి ఆత్మలు క్రిందకు వస్తున్న కొద్దీ అశాంతి పెరుగుతూనే ఉంటుంది. ప్రపంచపు జనాభా రోజు రోజుకూ పెరుగుతోంది. దేశ విదేశాలలో కీటక నాశక మందులు ఎన్నో జల్లుతున్నా రోజు రోజుకూ వాటి సంఖ్య పెరుగుతూనే ఉంది. దోమల కీటకాల సంఖ్య నిరంతరం పెరుగుతుంది. చివరకీఆత్మలు ఎక్కడ నుండి వస్తున్నాయి వాటికి సమాధానం గీతలో ఉంది గాని క్లియర్ గా లేదు. చిట్ట చివరికి ఈ విషయం క్లియర్ అయ్యింది. ఈ ఆత్మలన్నీ ఆ లోకం నుండి వస్తాయి. ఇచట జనన మరణ చక్రంలో వస్తాయి.



Tuesday, September 4, 2018

who am I నేను ఎవరు.

ఓం శాంతి 
విశ్వ నవ నిర్మాణమునకు శ్రేష్ఠమైన ఈశ్వరీయ ప్రణాళిక.
నేను ఎవరు.
Image result for brahma kumari posters
శరీరం వేరు ఆత్మ వేరు రెండూ కలిసి జీవాత్మ అనబడును. జీవిత ఆత్మ జీవించు ఆత్మ అనగా శరీరం లో పని చేయునది. ఆత్మ శరీరంలో లేనట్లయితే ఆత్మ కూడా ఏమీ చేయలేదు. శరీరం కూడా ఆత్మ లేకుండా పనికి రాదు ఉదాహరణకు కారును డ్రైవరును చెప్పవచ్చును. కారుఉండి దానిలో డ్రైవరు లేనిచో నడవదు. అలాగే కారు నడుపుతున్నట్లయితేనే ఒక వ్యక్తిని కార్ డ్రైవర్ అంటాము. ఆత్మ గాలి కాదు. పృథ్వి జలం వాయువు అగ్ని ఆకాశం అనే పంచ తత్వాలతో శరీరం తయారు అవుతాయి. ఆత్మ బయటికి వెళ్ళిపోయినా శరీరంలో 5 తత్వాలు ఉంటాయి. ఆ శరీరాన్ని కాల్చివేస్తారు, లేదా పూడ్చి వేస్తారు. అవి జడతత్వాలు. కాని ఆత్మ వాటికి వేరుగా విలక్షణమైనది. అది మనసు బుద్ధిలతో కూడిన ఒక అతి సూక్ష్మజ్యోతిర్బిందువు. దీనిని గురించి గీతలో అణోరణీయంసమనుస్మరేత్యః.... అనగా అణువు కంటే అణుస్వరూపం. అణువే జ్యోతిర్మయము. ఆ జ్యోతిర్మయ అణువులో అనేక జన్మల సంస్కారము నిండివున్నది. మనసు బుద్ధిలలో మనసు+ బుద్ధి కలిపి ఆత్మ అంటారు. మానవుడు శరీరం వదిలినప్పుడు మనసు బుద్ధి ఉండిపోయాయి, ఆత్మ వెళ్ళిపోయింది అని ఎవరూ అనరు. అన్నీ ఉన్నా మనసు బుద్ధి వెళ్లి పోయాయి. ఆత్మ వెళ్లి పోయింది కాబట్టి వాస్తవానికి మనసు బుద్ధి ఏ శక్తి ఉందో దాని పేరే ఆత్మ. మనసు బుద్ధిలో ఈ జన్మ మరియు పూర్వజన్మల సంస్కారము నిండి ఉంది. సంస్కారమనగా మంచిగానీ చెడుగానీ కర్మలు చేస్తామో ఆ కర్మలయొక్క ప్రభావము మిగిలిపోతుందో దానినే సంస్కారము అంటారు. ఒక కసాయివాని కుటుంబములో పిల్లవాడు పుట్టిపెరిగితే వానికి ఆవును చంపిన మహాపాపము అని చెప్పిననూ బుద్ధిలో నాటదు. వానికి అటువంటి సంస్కారము పక్కా అయినది. ఈ విధముగా సంస్కారము అనునది ఆత్మ 3 వ శక్తి. కాబట్టి మనసు బుద్ధి సంస్కారము ఈ 3 శక్తులు కలిసి ఆత్మ అనబడును.  


Wednesday, August 29, 2018

కృష్ణుడు వస్తున్నాడు.

సంస్కృతం లో లింగం అంటే ఒక గుర్తు. చిహ్నం. భగవంతుడి చిహ్నం శివ లింగం.
బ్రహ్మ కుమారిలు గతం లో శ్రీ కృష్ణుడు వస్తున్నారు అనే చిత్రం ఉంచేవారు. ఇప్పుడు తీసేశారు. కారణం తెలియదు.


ఐతే చిత్రం లో చాల గూఢ మైన అర్ధాలు ఉన్నాయి.
Related image
కృష్ణుడు కుడి చేతిలో స్వర్గాన్ని పట్టుకుని ఉన్నాడు. కాలితో నరకాన్ని తన్నుతున్నాడు. ప్రస్తుత సమయం నరకం. ఎవరూ సుఖంగా లేరు. శాంతి కోసం దేశ నాయకులందరూ ప్రయత్నిస్తున్నారు అంటే లోకమంతా అశాంతి గా ఉంది అనే కదా అర్ధం. కనుక ఇది నరకం అని ప్రతివారూ ఒప్పుకునే విషయం. ఇది పాత ప్రపంచం నరకం మరి భగవంతుడు వచ్చి స్వర్గం స్థాపన చేస్తున్నారు.అది శాంతి, సుఖమయ ప్రపంచం...హెవెన్లీ గాడ్ ఫాదర్. అంటారు. కనుక ఆయన హెవెన్ స్థాపన చేసి మనకు వారసత్వంగా ఇవ్వడానికి ఇప్పుడు వచ్చి ఉన్నారు. కృష్ణుడు స్వర్గానికి రాజకుమారుడు. బుద్ధిని చేతితో పోలుస్తారు. అలాగే కాలును కూడా బుద్ధితో పోలుస్తారు. అంటే చేతిలో స్వర్గం(అరచేతిలో వైకుంఠం) అనగా అతని బుద్ధిరూపి చేతిలో స్వర్గపు ప్లాన్ ఉంది. ఏమిచేస్తే ఈ భువిపై స్వర్గం రాగలదో అదంతా అతని బుద్ధిలో ఉంది. ఆయా ప్రకారంగా మనను ఆయా కర్మలు చేయించి స్వర్గ వారసులుగా చేస్తారు. అలాగే కాలితో ఈ నరక ప్రపంచాన్ని అతడు తన్నేస్తున్నాడు. అనగా మనకు ఏమి సూచిస్తున్నాడంటే మన బుద్ధిలో ఏమి ఉండాలంటే ఇంక ఈ నరక ప్రపంచం వినాశనం కాక తప్పదు(బాంబులు ముందే తయారైఉన్నాయి షో కేసులో పెట్టేందుకు కాదు. ఎలాగైనా పాత ప్రపంచం వినాశనం కాక తప్పదు. మహా వినాశనం ఐతే కానీ స్వర్గ ద్వారాలు తెరుచుకోవు. ) అలాగే స్వర్గం కొత్త ప్రపంచం కూడా వచ్చే సమయం ఆసన్న మయ్యింది. తెలుసుకుని ఆ స్వర్గంలో వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఎవరు చేస్తారు. స్వర్గంలో కొంతమందే దేవతలు ఉంటారు. దేవతలే ప్రయత్నం చేస్తారు. అజ్ఙానులు అసురులు తెలుసుకునే ప్రయత్నంకూడా చేయరు. వారికి ఈ నరక ప్రపంచమే బాగుంటుంది. వారికి ఈ విషయాలపై నమ్మకం ఉండదు.
కాని కృష్ణుడు మహావినాశనం తరవాత వెంటనే అతి త్వరలో రానున్నాడు. ఇంకా తెలియాలంటే ఈ కింది వెబ్ సైట్ ను చూడగలరు.........http://www.adhyatmik-vidyalaya.com/



Featured Post

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్.

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్. ఒక సంక్షిప్త పరిచయం ఇక్కడ కింద తేదీలు పుట సంఖ్యలు ఇచ్చినవి గురువు గారి ప్రవచనా...