Wednesday, September 30, 2015

ఓం నమః శివాయ

పై సంఖ్య నొక్కితే మా వీడియో యు ట్యూబ్ లో చూడ వచ్చు ఓం నమః శివాయ
యు ట్యూబ్ లో వీడియో చూడండి
course

Tuesday, September 29, 2015

మురళి విని గోకులం లో అంతా ముగ్ధులయ్యారు

http://www.a1spiritual.info/Streaming/150/VCD926.wmv

పై లింకు అందరి కోసం 

Monday, September 28, 2015

కథ 1

ఒకానొక పంచవన్నెల చిలక దానికో కోరిక పుట్టింది దేశాలు తిరగాలని వెంటనే బట్టలు సద్దుకుని బయల్దేరింది ముందు తిరుపతి వెళ్ళింది ఏడుకొండలు ఎక్కింది ఎందుకంటె కొండెక్కుతానని  మొక్కుకుంది కనుక. అబ్బ యెంత మంది జనం మా చిన్నప్పుడు ఇలా లేదు బాబు అనుకుంది ఇలా వెళ్తే అలా దర్శనం అయ్యేది పొండి పొండి అని తోసేసే వాళ్ళే ఉండేవాళ్ళు కాదు. ఎలాగోలా దర్శనం చేసుకుని తరవాత కాస్త దారి పక్కన నించుంది ఇంతలో  ఎవరోనక్క  పొడుగు తెల్ల చొక్కా వేసుకుని ఓ బ్రీఫ్ కేసు పట్టుకుని అటే వచ్చాడు చూడు చిలకా ఈ దేవుడిని నమ్మకు , చిన్నప్పటి నుంచీ పూజ చేస్తున్నావు కదా నీకేమి ఒరిగింది నీ పిల్లలు నిన్ను వదిలి వెళ్లి పోయారు పెళ్ళాం పోయింది ఒంటి గాడివి నిన్ను వాడుకుని నీ సంపాదన అంతా తిని ఇప్పుడు నిన్ను చూసే వాళ్ళు లేక ఉన్నావు ఇకనైనా మా కొత్త దేవుడిని నమ్ము నీకు మంచి జరుగుతుంది అన్నాడు 
మన చిలక బాబాయ్ నాకేం పిల్లల పెళ్ళిళ్ళు చేసాను పెళ్ళాం ఉన్నన్నాళ్ళు ఉంది ఇప్పుడు నేను స్వేచ్చగా ఉన్నాను దొరికింది తింటాను చూడాలను కున్నవి చూస్తాను తృప్తిని మించింది లేదు నువ్వు నక్కవి నాకున్న వయసులో అనుభవం లో సగం లేదు నీకు నువ్వు నాకు కొత్త దేవుడిని చూపడం కాదు నేనే నీకు సలహా ఇస్తాను పాటిస్తే బాగు పడతావ్ చూడబోతే నువ్వు కూడా ఒకప్పుడు తిరుపతి వెంకన్ననే నమ్ముకున్న వాళ్లకు పుట్టినవాడివి మీలో  ఎవరికో పైత్యం చేసి కొత్త దేవుణ్ణి వెతుక్కున్నట్లున్నారు ఏదో కొత్త దేవుడికే పుట్టి నట్లు మాట్లాడుతున్నావ్ ముందు నీ గురించి తెలుసుకో తరవాత రా అంతే కానీ వేరే వాళ్ళను ధర్మ భ్రష్టం చేసి నీ పబ్బం గడు పుకుందామని చూసావో  మా ఏడుకొండల వాడు కాదు అయన బంటు తోకతో కొడితే ఎక్కడో పోయి పడతావ్ అని సుద్ది చెప్పాడు అంతే నక్క గాడు అక్కడ నుంచి జారు కున్నాదు. 

రాజయోగం నేర్చుకోవచ్చు

http://www.pbks.info/ లింhttp://www.pbks.info/ క్ ద్వారా రాజయోగం నేర్చుకోవచ్చు అందరు సత్ ఫలితం పొందుతారని ఆశిస్తున్నాం 

ఓ కథ

సంస్కృతం లో శంకరాచార్యుల భాజగోవిన్డానికి తెలుగు అర్ధాలు
 
1)భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢ మతే సంప్రాప్తే కాలే నహి నహి రక్షతి డు క్రుఇ కరణె  అనగా ఓ మంద బుద్ధీ డు కృ ఇ కర ణే అని నీవు వల్లించు వ్యాకరణ సూత్రము నిన్ను రక్షించ లేదు మరణ కాలమున యముడు సమీపింసునప్పుడు ఈ వ్యాకరణ సూత్రము వలన ప్రయోజనము కలుగదు, కావున నీ ముఢత్వము వీడి, గోవిందుని భజింపుము.
2)మూఢ జహీహి ధనాగమ తృష్ణాం , కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ మ్ యల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం
ముఢుడా! ధనాశ చే ఎల్లప్పుడూ ధనము ధనమని దానియందే వర్తిల్లకుము . ధన తృష్ణ తో నుండక సద్బుద్ధి కల్గి సంచరిమ్పుము. నీ యొక్క పూర్వ పుణ్యం కొద్దీ లభించిన దానితోనే తృప్తి చెందు చుండు ము.
3) నారీ స్తన భర నాభీ దేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏత న్మాంస వసాది వికారం మనసి విచిన్తయ వారం వారం
స్త్రీ యొక్క స్తనములు నాభీ చూచి మొహావేశుడవు కాకుము మాసము కొవ్వు ఆదిగా గలవు వికారమగువానిని గాంచి నీ మనమున పదే పదే ఆలోచించి చూడుము, విరక్తి నొన్దగలవు.
4) నళినీ దళ గత జల మతి తరళం తద్వజ్జీవిత మతిశయ చలపమ్ విద్ధి వ్యాధ్యభిమాన గ్రస్తం లోకం శోక హతంచ సమస్తం
తామరాకు నందలి నీటి రీతిని జీవితమూ స్థిరము లేనిది లోకమండలి సమస్త మైనటువంటి వారు రోగిష్టులై దేహము నందలి అభిమానము వీడ లేనటువంటి వారై దుఃೱఇంచుచున్నారు
ఆలోచించి చూడ సుఖమన్నది లేనే లేదు
5) యావద్ విత్తో పార్జన సక్తః తావన్నిజ పరివారో రక్తః పశ్చాజ్జీవతి జర్ఝర దేహే వార్తాం కోపి న పృచ్ఛ తి గేహే
ధనార్జన చేస్తున్నంత వరకే నిజ పరివారం అనగా ఇంట్లో వాళ్ళు భార్యా పిల్లలు ప్రేమ కలిగి ఉందురు, అంతే కానీ ముసలితనము లో ఏ ఒక్కడూ అడిగే వాడు ఉండడు


Friday, September 25, 2015

కనుక ఓ నిజమైన భారతీయుడు ప్రధమం గా చేయవలసిన కర్తవ్యమ్ ఆ యుగపురుషుడు స్థాపించే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం లో తమ వంతు కర్తవ్యమ్ చేయాలి మొదట ఆ యుగపురుషుడి గురించి తెలిస్తే కదా ఆయనకు సహాయం చేయగలిగేది? ఎలాగంటే ఆర్జునుడిని భగవానుడు ధర్మ స్థాపనకు కారకుడిగా తీసుకుని తను సారథి అయ్యి నడిపాడో అలాగా మనమందరం ఆ భగవానుడి దివ్య కర్తవ్యం లో సహాయకులం అవ్వాలి ఆ అర్జనుడు యుగపురుషుడు ప్రస్తుతం తన సేన తాయారు చేస్తున్నారు పాండవులు గుప్త వాసం అజ్ఞాత వాసం చేశారు అంటారు కదా ఇప్పుడు బ్రహ్మ కుమారీ సంస్థ ను గురించి అందరికి తెలుసు కాని ఆధ్యాత్మ విశ్వ విద్యాలయం గురించి ఎవరికి తెలియదు వారు వంద మంది మేము కేవలం పంచ పాడవులు అంటే కొద్దిమందిమి మాత్రమె కాని పాండవుల పక్షాన స్వయం భగవంతుడే ఉన్నారు అజ్ఞాత వాసం ముగిసే నాటికి పాండవులు సర్వ శక్తి సమన్వి తులు "ఛు పా రుస్తుం బాద్ మే ఖులే" అని అంటారు రుస్తుం అంటే సమర్ధుడు మొనగాడు  అతడు చివరలో ప్రత్యక్షం అవుతాడు
మీ దగ్గరికి మేము ఇదే అపేక్షతో వచ్చాము మాకు మీ సహాయం కావాలి సత్య ధర్మ స్థాపన చేస్తే చేసేందుకు సహకరిస్తే కలిగే ఆత్మిక సుఖం ఎలాంటిదంటే ఒక రసగుల్లా తిన్న వాడికే మళ్ళీ మళ్ళీ దాని పేరు చెబితె చాలు నోట్లో నీళ్ళు ఊరినట్లు ధర్మ స్థాపన చేసేవారికి  కలిగే సుఖం మునుపు చేసిన వారికే తెలుస్తుంది . ధార్మికత అంటే మీకు ఇష్టమని విని మీ దగ్గరికి వచ్చాము అవసరానికి ఉపయోగ పడేదే  అసలైన స్నేహం భగవత్ కార్యంలో ఉపయోగ పడితే మనని మనం ఉద్ధరించు కున్నట్లే కద.

యదా యదా హి ధర్మస్య గ్లానిర్ భవతి భారత

యదా యదా హి ధర్మస్య గ్లానిర్ భవతి భారత అనే గీతా శ్లోకం తెలియని హిందువులు ఉండరు
ఇప్పుడు భారత దేశం లో ధర్మ గ్లాని జరగట్లేదు అనేవారు అసలే ఉండరు ఎందుకంటె ధర్మ గ్లాని జరిగితే కలిగే పరిణామాలు అందరూ చూస్తూనే ఉన్నారు ఇప్పుడు ఆ పరమాత్మ రావలసిన సమయం అయ్యింది కదా కాదని ఎవ్వరూ అనలేని పరిస్థితులు చూస్తున్నాము కదా.
ఒక్క స్త్రీల మాన  భంగాల విషయం చూస్తూనే అవగాహనకు వచ్చే విషయం కదా ఒకనాడు స్త్రీలను ఈ గడ్డ మీదే దేవతలా పూజించారు ఇప్పుడు పసి పిల్లలని కూడా చెరపకుండా వదలడం లేదు మనుషులా రాక్షసులా తెలుస్తూనే ఉంది కనుకనే భగవంతుడికి రావలసి వస్తున్ది.
హిందూ ముస్లిం సిఖ్ ఈసాయి ఆపస్ మే భాయీ భాయీ అంటారు కాని నిజంగా భాయీ భాయీ ల లా ఉంటున్నారా ఉండలేరు ఎందుకంటె అవ్వి దేహానికి సంబంధించిన ధర్మాలు కనుకనే ఫలానా వాళ్లకి పుడితే ఫలానా ధర్మం అని గురుతులు పెట్టేసుకుంటున్నారు నిజానికి ఆత్మ ధర్మం శాంతి సుఖం ఆనందం జ్ఞానం పవిత్రత ప్రేమ మరి ఈ అనేక ధర్మాలు వాళ్ళ వాళ్ళ గురువులను బట్టి వచ్చినవి  ఆ గురువులను ధర్మం పితలు అంటారు ఇబ్రహీం నించి ఇస్లాం ధర్మం బుద్ధుడి నించి బుద్ధ ధర్మం క్రీస్తు నించి క్రిస్టియన్ ధర్మం మొహమ్మద్ నుంచి ముస్లిం ధర్మం ఇలా ఇలా ఎవరికీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ రీతులు వ్యవహారాలూ పట్టి పట్టి చేస్తున్నంత కాలం లోకం లో శాంతి రాదు. ఒకే ధర్మం ఒకే ధర్మ పిత అనగా తండ్రి ఉంటేనే శాంతి ఉంటుంది అనగా అందరికి ఒకే తండ్రి శాసన కర్త ఈశ్వరుడు అయన ఎవరో కాదు యుగ పురుషుడు ఆయనను అన్ని ధర్మాల వాళ్ళు ఆడం, ఆదమ్, ఆది దేవుడు, ఆది నాథుడు అని పిలిచాయి పేరులో కూడా ఆది అనే శబ్దం కలుస్తోంది
ధర్మ గ్లాని జరిగినప్పుడు అదిగో ఆ ఆడం, ఆదాము, అదిదేవుడు, ఆదినాథుదు ఐన అయన వస్తారు ఇప్పుడు వచ్చారు.
బ్రహ్మ కుమారీ సంస్థ 1936 నుంచి అప్రతిహతంగా  సాగిపోతోంది ఇది పరమాత్మ ఈ సృష్టి పైకి వచ్చారు అనడానికి సాక్ష్యం ఇంతమంది దేశ వేదేశాలలో బ్రహ్మ పిల్లలు కుమార్ కుమారీలు గా అవుతున్నారంటే ఇది పరమాత్మ దివ్య కర్తవ్యమ్ కాక మరేమిటి ఐతే ప్రతి సంస్థ ప్రతి ధర్మం రెండుగా విడిపోవడం మనం చరిత్రలొ చూశాం ఒక సిద్ధాంతం వచ్చినప్పుడు ఒక ఆవిష్కరణ జరిగి నపుడు అది అంతతో ఆగిపోదు ఒక రేడియో తో ఆగిపోతే అది మేధస్సు కాదు ఇప్పుడు టీవీ డిజిటల్ టీవీ ఇంకా ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలు జరిగి నట్లు పరమాత్మ, యొక్క ఆధ్యాత్మ జ్ఞానం కూడా కేవలం ఆత్మ బిందువు, పరమాత్మ బిందువు భ్రుకుటిలొ ఉంటుంది అనడం తో సరిపోలేదు అధి + ఆత్మ  అంటేనే అధి అనగా లోపల అంటే ఆత్మ లోపల జ్ఞానం అంటే ఒక ఆత్మ ఎన్ని జన్మలు తెసుకుంది ఎక్కడ ఎక్కడ తీసుకుంది మొదలైన విషయాలు తెలిపే అసలు జ్ఞానం
అది తెలుపడానికే 1976 బ్రహ్మ కుమారీ సంస్థకు సమాంతరం గా ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం వెలిసింది ప్రజాపిత బ్రహ్మ కుమారి సంస్థ దాదా లేఖరాజ్ గారి ద్వారా నడుప బడగా 1947 నుంచి అయన ద్వారా శివ పరమాత్మ మురళీలు అని పిలువబడే జ్ఞానం అందించారు అదే బేసిక్ జ్ఞానం అంటాం ఐతే దాదా గారి ద్వారా ఎన్నో ముఖ్య విషయాలు వివరించ బడలేదు ఆ వివరణలన్నీ  1976 నుంచి బాబా వీరేంద్ర దీక్షిత్ గారి  ద్వారా తెలుప బడు తున్నాయి దీనినే అడ్వాన్స్ నాలెడ్జ్ అంటారు
ఐతే ఏ ప్రయోగం కానీ ఆవిష్కరణ కానీ అప్పోజిషన్ లేకుండా నిరూపించ బడలేదు అంటే ఒకప్పుడు భూమి గుండ్రంగా ఉంది అన్నందుకు గెలిలియో ను ఖండించారు అలాగే ఏ ధర్మ స్థాపన కైనా పాత సంఘం తో పోరాటం తప్పలేదు కాని సత్యం ఎప్పటికైనా గెలుస్తుందనే నమ్మకం మాకు ఉన్ది.
ఇప్పుడు బ్రహ్మ కుమారి సంస్థ ద్వారా మేము అటువంటి వైరుధ్యాలే యెదుర్కుంటున్నాము సశేషం ....

Wednesday, September 23, 2015

poem

మా వారి కవితలు

A Soul in exile

God did not make us all the same way

Because each of us preferred a unique role to play

He reminds us through all the Nine months every day

In a place where you alone can hear him say

A place which is the consequence of your bygone play

A place to reap and acquire a new branded body to play

You regret over and over again for your departed play.

You beg GOD to forgive and to throw you out of the dungeon,

Promising and pledging thousand times for another fair play.

You know not where you are until a person beats you up till you cry,

You really wonder in your concealed outfit, when all people around you

Jovially laugh at your cry.

You come out crying with no idea of your place, no knowledge of your past

Alas, you forget everything once you come out

Of the nine months of your self -imprisonment 

You slowly become familiar with the tender touch of your new mother

 Who in turn introduce your father and put you in his tough and rough hands

You know not why they are so happy, every now and then you too laugh,

 when you are wide awake or fast asleep.

You thank GOD a number of times, who made them unaware of your past.

God arranged them as your most obedient servants until the last breathe of their distinct play.

God alone knows what is in store for them you create in your new play.  

How you repay for their unstinted, untried and unconditional services rendered to you in their life's play

You have been brought up acceptably, admirably and marvelously in the society with their infallible and ever growing love for you, day in and day

out in the parental  role they play

As embedded roles as parents they involved, continually so deeply so thoroughly so painstakingly to fulfill all your aspirations, desires, fantasies and finally they justify for their assigned role play.

And, on one fine day you make them realize by your unexpected, unwarranted acts that they are just repaying you in this life for their own past deeds.

 

K.Rama Rao

                                                                                         HOD, M & H, CBIT

 

A show of Attitude

"I me and myself" and nothing beyond

Singing your own melody,

Strumming your own song,

Stringing tunes of self adulation

Humming along,

A medley of you glorification,

Where you for you belong.

You blow your own trumpet

Loud and clear through a mile

Assuming other than that,

Nothing, no one will hear..

Drowning other songs,

That surround you,

To you, no music, but yours is true.

With expectant authority, you wait for applause,

Un willing to accept or admit any flaws.

What you compose, you call symphony

What I hear, I call cacophony,

Listening to your music with my ears,

You will be surprised at what you hear.

It's such a pity that you are so off-key

A pity that you can't hear or see

                                                                                      K.Rama Rao

                                                                                       HOD, M & H

 

 

 

 

 

 

 

 

 

 

 


Tuesday, September 22, 2015

ప్రతి మనిషికి నలుగురు తండ్రులు ?

https://youtu.be/AAbWfJsHcdA

పై లింకు క్లిక్ చేయండి

ప్రతి మనిషికి నలుగురు తండ్రులు ? ఎలా ?
1,2)ఎలాగంటే లౌకిక అలౌకిక పారలౌకిక తండ్రులని వారికి పెరు. లౌకిక తండ్రి మనకు ఈ శరీరానికి జన్మ నిచ్చిన వాడు,  లేదా దత్తత తీసుకున్న వారు అప్పుడు ఇద్దరు అయ్యారు,
3)పారలౌకిక తండ్రి పరలోకం లో ఉండే వారు... గీతలో ఒక శ్లోకం ఉంది
"న తత్ భాసయతే సూర్యో న పావకః, యద గత్వా న నివర్తన్తే తత్ ధామ పరమం మమ"
అనగా సూర్య చంద్రులు, నక్షత్రాలు అగ్ని వీటన్నిటికీ పరమైనది అనగా వాటి కాంతి కి అందనిది పైన పరంధామం నా లోకం అని అయన స్వయం గా తన నివాస స్థానం వర్ణిం చారు అక్కడే మనం కూడా నిరాకార సుక్ష్మ బిందువు రూపంలో ఉంటాము అదే ముక్తి ధామం ఆత్మల లోకం బంగారు ఎరుపు కలగలిసిన్ కాంతి లోకం శాంతి ధామం అక్కడ నుండి ఈ లోకం లోకి భూమి పైకి వచ్చి మనం ఆత్మలం శరీరం తీసుకుని మన మన పాత్రలు చేస్తాం జనన మరణ చక్రం లో తిరుగుతూ ఉంటాం పరమ పిత జనన మరణాలకు అతీతుడు ఆత్మలకు తండ్రి మనలాగే సుక్ష్మ జ్యోతి బిందు రూపుడు వెలిగే చుక్క
4)ఇక అలౌకిక తండ్రి అతి ముఖ్య మైన వాడు ఈయన కూడా మనలాగే మనిషి ఆత్మ మనుష్యాత్మలకు తండ్రి అలౌకికం అని ఎందుకు అన్నాము అంటే ఈ లోకం వాడైనా పరలోకంలో ఉండే శివ పరమాత్మ పారలౌకిక తండ్రి పై నిత్యం యోగ సాధన లో ఉంటారు పరమాత్మ ఈయనలో ప్రవేశించి మొదట ఈయనను తన సమానం గా నిరాకారి, నిర్వికారి నిరహంకారి వలె తయారు చేసి ఈయన ద్వారా మిగతా మనందరినీ కూడా నిరాకారి నిర్వికారీ నిరహన్కారిగా చేస్తారు, అలాగ చేసి పరమదామానికి తీసుకు వెళతారు మనంతట మనం వెళ్ళలేము పతిత ఆత్మలం పావన ధామం ముక్తి ధామానికి వెళ్ళలేము కనుకనే పావనం చేయడానికి శివ పరమాత్మకు ఈ అలౌకిక తండ్రి శరీరం ఆధారం తీసుకోవలసి వస్తున్ది. ఎందుకంటె శరీర సాంగత్యం తోనే పతితులంయ్యాము అనేకుల సాంగత్యం తో కనుక ఒకరి సాంగత్యం ద్వారా పావనం గా అవ్వాల్సి ఉన్ది. పతితులను పావనం గా చేసేది పారలౌకిక తండ్రి మాత్రమె.
5000 సంవత్సరాల కొక సారి మనం ముక్తి దామానిని వెళతాము అలా మనను పరంధామం తీసుకు వెళ్ళడానికి స్వయం పరమ పిత పరమాత్మ ఈ అలౌకిక తండ్రిలో ప్రవేశించి ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడే ఎందుకంటె ఇప్పుడే 5000 సంవత్సరాల అవధి పూర్తీ అయ్యింది కనుక.

నమస్కారం మిమ్మల్ని సంతోష పరచడమే మాకు ఆనందం
పనిలోపని మాఉద్దే శం మీకు మన సంబంధం తెలుపడం
మనందరం ఒకే తండ్రి పిల్లలం మనమందరం భారతీయులం
హిందూ ముస్లిం సిఖ్ ఈసాయి ఆపస్ మే భాయీ భాయీ మువ్వన్నెల జండా
మన మనసుల నిండా ఒక్కో రోజు ఒక్కో కొత్త స్ఫూర్తి తెచ్చేనోయి

Featured Post

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్.

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్. ఒక సంక్షిప్త పరిచయం ఇక్కడ కింద తేదీలు పుట సంఖ్యలు ఇచ్చినవి గురువు గారి ప్రవచనా...