యదా యదా హి ధర్మస్య గ్లానిర్ భవతి భారత అనే గీతా శ్లోకం తెలియని హిందువులు ఉండరు
ఇప్పుడు భారత దేశం లో ధర్మ గ్లాని జరగట్లేదు అనేవారు అసలే ఉండరు ఎందుకంటె ధర్మ గ్లాని జరిగితే కలిగే పరిణామాలు అందరూ చూస్తూనే ఉన్నారు ఇప్పుడు ఆ పరమాత్మ రావలసిన సమయం అయ్యింది కదా కాదని ఎవ్వరూ అనలేని పరిస్థితులు చూస్తున్నాము కదా.
ఒక్క స్త్రీల మాన భంగాల విషయం చూస్తూనే అవగాహనకు వచ్చే విషయం కదా ఒకనాడు స్త్రీలను ఈ గడ్డ మీదే దేవతలా పూజించారు ఇప్పుడు పసి పిల్లలని కూడా చెరపకుండా వదలడం లేదు మనుషులా రాక్షసులా తెలుస్తూనే ఉంది కనుకనే భగవంతుడికి రావలసి వస్తున్ది.
హిందూ ముస్లిం సిఖ్ ఈసాయి ఆపస్ మే భాయీ భాయీ అంటారు కాని నిజంగా భాయీ భాయీ ల లా ఉంటున్నారా ఉండలేరు ఎందుకంటె అవ్వి దేహానికి సంబంధించిన ధర్మాలు కనుకనే ఫలానా వాళ్లకి పుడితే ఫలానా ధర్మం అని గురుతులు పెట్టేసుకుంటున్నారు నిజానికి ఆత్మ ధర్మం శాంతి సుఖం ఆనందం జ్ఞానం పవిత్రత ప్రేమ మరి ఈ అనేక ధర్మాలు వాళ్ళ వాళ్ళ గురువులను బట్టి వచ్చినవి ఆ గురువులను ధర్మం పితలు అంటారు ఇబ్రహీం నించి ఇస్లాం ధర్మం బుద్ధుడి నించి బుద్ధ ధర్మం క్రీస్తు నించి క్రిస్టియన్ ధర్మం మొహమ్మద్ నుంచి ముస్లిం ధర్మం ఇలా ఇలా ఎవరికీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ రీతులు వ్యవహారాలూ పట్టి పట్టి చేస్తున్నంత కాలం లోకం లో శాంతి రాదు. ఒకే ధర్మం ఒకే ధర్మ పిత అనగా తండ్రి ఉంటేనే శాంతి ఉంటుంది అనగా అందరికి ఒకే తండ్రి శాసన కర్త ఈశ్వరుడు అయన ఎవరో కాదు యుగ పురుషుడు ఆయనను అన్ని ధర్మాల వాళ్ళు ఆడం, ఆదమ్, ఆది దేవుడు, ఆది నాథుడు అని పిలిచాయి పేరులో కూడా ఆది అనే శబ్దం కలుస్తోంది
ధర్మ గ్లాని జరిగినప్పుడు అదిగో ఆ ఆడం, ఆదాము, అదిదేవుడు, ఆదినాథుదు ఐన అయన వస్తారు ఇప్పుడు వచ్చారు.
బ్రహ్మ కుమారీ సంస్థ 1936 నుంచి అప్రతిహతంగా సాగిపోతోంది ఇది పరమాత్మ ఈ సృష్టి పైకి వచ్చారు అనడానికి సాక్ష్యం ఇంతమంది దేశ వేదేశాలలో బ్రహ్మ పిల్లలు కుమార్ కుమారీలు గా అవుతున్నారంటే ఇది పరమాత్మ దివ్య కర్తవ్యమ్ కాక మరేమిటి ఐతే ప్రతి సంస్థ ప్రతి ధర్మం రెండుగా విడిపోవడం మనం చరిత్రలొ చూశాం ఒక సిద్ధాంతం వచ్చినప్పుడు ఒక ఆవిష్కరణ జరిగి నపుడు అది అంతతో ఆగిపోదు ఒక రేడియో తో ఆగిపోతే అది మేధస్సు కాదు ఇప్పుడు టీవీ డిజిటల్ టీవీ ఇంకా ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలు జరిగి నట్లు పరమాత్మ, యొక్క ఆధ్యాత్మ జ్ఞానం కూడా కేవలం ఆత్మ బిందువు, పరమాత్మ బిందువు భ్రుకుటిలొ ఉంటుంది అనడం తో సరిపోలేదు అధి + ఆత్మ అంటేనే అధి అనగా లోపల అంటే ఆత్మ లోపల జ్ఞానం అంటే ఒక ఆత్మ ఎన్ని జన్మలు తెసుకుంది ఎక్కడ ఎక్కడ తీసుకుంది మొదలైన విషయాలు తెలిపే అసలు జ్ఞానం
అది తెలుపడానికే 1976 బ్రహ్మ కుమారీ సంస్థకు సమాంతరం గా ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం వెలిసింది ప్రజాపిత బ్రహ్మ కుమారి సంస్థ దాదా లేఖరాజ్ గారి ద్వారా నడుప బడగా 1947 నుంచి అయన ద్వారా శివ పరమాత్మ మురళీలు అని పిలువబడే జ్ఞానం అందించారు అదే బేసిక్ జ్ఞానం అంటాం ఐతే దాదా గారి ద్వారా ఎన్నో ముఖ్య విషయాలు వివరించ బడలేదు ఆ వివరణలన్నీ 1976 నుంచి బాబా వీరేంద్ర దీక్షిత్ గారి ద్వారా తెలుప బడు తున్నాయి దీనినే అడ్వాన్స్ నాలెడ్జ్ అంటారు
ఐతే ఏ ప్రయోగం కానీ ఆవిష్కరణ కానీ అప్పోజిషన్ లేకుండా నిరూపించ బడలేదు అంటే ఒకప్పుడు భూమి గుండ్రంగా ఉంది అన్నందుకు గెలిలియో ను ఖండించారు అలాగే ఏ ధర్మ స్థాపన కైనా పాత సంఘం తో పోరాటం తప్పలేదు కాని సత్యం ఎప్పటికైనా గెలుస్తుందనే నమ్మకం మాకు ఉన్ది.
ఇప్పుడు బ్రహ్మ కుమారి సంస్థ ద్వారా మేము అటువంటి వైరుధ్యాలే యెదుర్కుంటున్నాము సశేషం ....
No comments:
Post a Comment
బ్లాగ్ సందర్శించినందుకు ధన్యవాదాలు. త్వరలో మా స్పందన తెలుపగలము.