Monday, September 28, 2015

ఓ కథ

సంస్కృతం లో శంకరాచార్యుల భాజగోవిన్డానికి తెలుగు అర్ధాలు
 
1)భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢ మతే సంప్రాప్తే కాలే నహి నహి రక్షతి డు క్రుఇ కరణె  అనగా ఓ మంద బుద్ధీ డు కృ ఇ కర ణే అని నీవు వల్లించు వ్యాకరణ సూత్రము నిన్ను రక్షించ లేదు మరణ కాలమున యముడు సమీపింసునప్పుడు ఈ వ్యాకరణ సూత్రము వలన ప్రయోజనము కలుగదు, కావున నీ ముఢత్వము వీడి, గోవిందుని భజింపుము.
2)మూఢ జహీహి ధనాగమ తృష్ణాం , కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ మ్ యల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం
ముఢుడా! ధనాశ చే ఎల్లప్పుడూ ధనము ధనమని దానియందే వర్తిల్లకుము . ధన తృష్ణ తో నుండక సద్బుద్ధి కల్గి సంచరిమ్పుము. నీ యొక్క పూర్వ పుణ్యం కొద్దీ లభించిన దానితోనే తృప్తి చెందు చుండు ము.
3) నారీ స్తన భర నాభీ దేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏత న్మాంస వసాది వికారం మనసి విచిన్తయ వారం వారం
స్త్రీ యొక్క స్తనములు నాభీ చూచి మొహావేశుడవు కాకుము మాసము కొవ్వు ఆదిగా గలవు వికారమగువానిని గాంచి నీ మనమున పదే పదే ఆలోచించి చూడుము, విరక్తి నొన్దగలవు.
4) నళినీ దళ గత జల మతి తరళం తద్వజ్జీవిత మతిశయ చలపమ్ విద్ధి వ్యాధ్యభిమాన గ్రస్తం లోకం శోక హతంచ సమస్తం
తామరాకు నందలి నీటి రీతిని జీవితమూ స్థిరము లేనిది లోకమండలి సమస్త మైనటువంటి వారు రోగిష్టులై దేహము నందలి అభిమానము వీడ లేనటువంటి వారై దుఃೱఇంచుచున్నారు
ఆలోచించి చూడ సుఖమన్నది లేనే లేదు
5) యావద్ విత్తో పార్జన సక్తః తావన్నిజ పరివారో రక్తః పశ్చాజ్జీవతి జర్ఝర దేహే వార్తాం కోపి న పృచ్ఛ తి గేహే
ధనార్జన చేస్తున్నంత వరకే నిజ పరివారం అనగా ఇంట్లో వాళ్ళు భార్యా పిల్లలు ప్రేమ కలిగి ఉందురు, అంతే కానీ ముసలితనము లో ఏ ఒక్కడూ అడిగే వాడు ఉండడు


No comments:

Post a Comment

బ్లాగ్ సందర్శించినందుకు ధన్యవాదాలు. త్వరలో మా స్పందన తెలుపగలము.

Featured Post

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్.

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్. ఒక సంక్షిప్త పరిచయం ఇక్కడ కింద తేదీలు పుట సంఖ్యలు ఇచ్చినవి గురువు గారి ప్రవచనా...