Monday, September 28, 2015

కథ 1

ఒకానొక పంచవన్నెల చిలక దానికో కోరిక పుట్టింది దేశాలు తిరగాలని వెంటనే బట్టలు సద్దుకుని బయల్దేరింది ముందు తిరుపతి వెళ్ళింది ఏడుకొండలు ఎక్కింది ఎందుకంటె కొండెక్కుతానని  మొక్కుకుంది కనుక. అబ్బ యెంత మంది జనం మా చిన్నప్పుడు ఇలా లేదు బాబు అనుకుంది ఇలా వెళ్తే అలా దర్శనం అయ్యేది పొండి పొండి అని తోసేసే వాళ్ళే ఉండేవాళ్ళు కాదు. ఎలాగోలా దర్శనం చేసుకుని తరవాత కాస్త దారి పక్కన నించుంది ఇంతలో  ఎవరోనక్క  పొడుగు తెల్ల చొక్కా వేసుకుని ఓ బ్రీఫ్ కేసు పట్టుకుని అటే వచ్చాడు చూడు చిలకా ఈ దేవుడిని నమ్మకు , చిన్నప్పటి నుంచీ పూజ చేస్తున్నావు కదా నీకేమి ఒరిగింది నీ పిల్లలు నిన్ను వదిలి వెళ్లి పోయారు పెళ్ళాం పోయింది ఒంటి గాడివి నిన్ను వాడుకుని నీ సంపాదన అంతా తిని ఇప్పుడు నిన్ను చూసే వాళ్ళు లేక ఉన్నావు ఇకనైనా మా కొత్త దేవుడిని నమ్ము నీకు మంచి జరుగుతుంది అన్నాడు 
మన చిలక బాబాయ్ నాకేం పిల్లల పెళ్ళిళ్ళు చేసాను పెళ్ళాం ఉన్నన్నాళ్ళు ఉంది ఇప్పుడు నేను స్వేచ్చగా ఉన్నాను దొరికింది తింటాను చూడాలను కున్నవి చూస్తాను తృప్తిని మించింది లేదు నువ్వు నక్కవి నాకున్న వయసులో అనుభవం లో సగం లేదు నీకు నువ్వు నాకు కొత్త దేవుడిని చూపడం కాదు నేనే నీకు సలహా ఇస్తాను పాటిస్తే బాగు పడతావ్ చూడబోతే నువ్వు కూడా ఒకప్పుడు తిరుపతి వెంకన్ననే నమ్ముకున్న వాళ్లకు పుట్టినవాడివి మీలో  ఎవరికో పైత్యం చేసి కొత్త దేవుణ్ణి వెతుక్కున్నట్లున్నారు ఏదో కొత్త దేవుడికే పుట్టి నట్లు మాట్లాడుతున్నావ్ ముందు నీ గురించి తెలుసుకో తరవాత రా అంతే కానీ వేరే వాళ్ళను ధర్మ భ్రష్టం చేసి నీ పబ్బం గడు పుకుందామని చూసావో  మా ఏడుకొండల వాడు కాదు అయన బంటు తోకతో కొడితే ఎక్కడో పోయి పడతావ్ అని సుద్ది చెప్పాడు అంతే నక్క గాడు అక్కడ నుంచి జారు కున్నాదు. 

No comments:

Post a Comment

బ్లాగ్ సందర్శించినందుకు ధన్యవాదాలు. త్వరలో మా స్పందన తెలుపగలము.

Featured Post

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్.

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్. ఒక సంక్షిప్త పరిచయం ఇక్కడ కింద తేదీలు పుట సంఖ్యలు ఇచ్చినవి గురువు గారి ప్రవచనా...