Sunday, July 24, 2016

సంస్కృతం వదతు - 9

పాఠకులకు సూచన .... ఇంకా ఇంకా తెలుసుకోగోరిన వారు పత్రాలయ ద్వారా సంస్కృతం అని సంస్కృత పాఠాలు నేర్పబడతాయి. సులభంగా రోజువారీ సంభాషణలు నేర్చుకోవచ్చు ప్రతులకు
23-23-30                                        లేదా                     4-2-72,
శివరావు వీధి                                                                బడీచౌడీ,
సత్యనారాయణపురం                                                    సుల్తాన్ బజార్
విజయవాడ 520 011                                                   హైదరాబాద్---500 195
ఫో. 0866 2534345                                                     ఫో. 040 24750111
కానీ సంప్రదించవచ్చు........
సంస్కృతభారతి వారి సౌజన్యం......

ఆర్యా మహాదేవి - పార్వతీ దేవి.
బంధు వర్గం  --- ఇంతకు మునుపు కొన్ని సంబంధాలు చూచాము అవి + మరి కొన్ని
అగ్రజః -- అన్న
అగ్రజా -- అక్క
అపత్యం -- సంతానం
అవరజః -- తమ్ముడు
అవరజా -- చెల్లెలు
జామాతా -- అల్లుడు
తనయః -- కుమారుడు
దుహితా -- కుమార్తె
దేవరః -- మరిది
దౌహిత్రః -- కూతురు కొడుకు
దౌహిత్రీ -- కూతురు కూతురు
ననాన్దా -- ఆడబిడ్డ
పితా -- తండ్రి
పితామహః -- తండ్రి తండ్రి తాతా
పితామహీ -- తండ్రి తల్లి నాయనమ్మ, బామ్మ
పితృవ్యః -- పిన(పెద) తండ్రి
పితృవ్యా -- పిన(పెద) తల్లి
పైతృష్వసేయః -- మేనత్త కొడుకు
పైతృష్వసేయా -- మేనత్తకూతురు
ప్రజావతీ -- వదిన
ప్రపౌత్రః -- కొడుకు కొడుకు మనుమడు
ప్రపౌత్రీ -- కొడుకు కూతురు
భగినీ -- తోడబుట్టినది
భర్తా -- భర్త
భాగినేయః -- మేనల్లుడు
భావః -- తోడబుట్టినామె మగడు
భ్రాతా -- తోడబుట్టిన వాడు.
కొన్ని వర్తమానకాల ధాతువులు(క్రియలు... వాక్యములు)
బాలః పఠతి -- బాలుడు చదువుచున్నాడు
శిష్యః నమతి -- శిష్యుడు నమస్కరించుచున్నాడు
అగ్రజః వదతి -- అన్న మాట్లాడుతున్నాడు
జనకః పశ్యతి -- తండ్రి చూచు చున్నాడు
పితృవ్యః పృచ్ఛతి-- చిన్నాన్న అడుగుచున్నాడు
పుత్రః గచ్ఛతి -- కొడుకు వెళుతున్నాడు
అశ్వః ధావతి -- గుఱ్ఱము పరుగెత్తుచున్నది
వృక్షః ఫలతి -- చెట్టు పండుచున్నది.
సేవకః తిష్ఠతి -- సేవకుడు నిలుచున్నాడు.
భిక్షుకః అటతి -- భిక్షుకుడు తిరుగు చున్నాడు
సః నిన్దతి -- అతడు నిన్దిస్తున్నాడు
అయం హసతి -- ఇతడు నవ్వుచున్నాడు
అమ్బా పచతి -- అమ్మ వండుతున్నది.
అనుజా క్రీడతి -- చెల్లెలు ఆడుచున్నది.
అగ్రజా ఖాదతి -- అక్క తింటున్నది.

No comments:

Post a Comment

బ్లాగ్ సందర్శించినందుకు ధన్యవాదాలు. త్వరలో మా స్పందన తెలుపగలము.

Featured Post

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్.

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్. ఒక సంక్షిప్త పరిచయం ఇక్కడ కింద తేదీలు పుట సంఖ్యలు ఇచ్చినవి గురువు గారి ప్రవచనా...