Tuesday, July 26, 2016

సంస్కృత పాఠం -10


మహానదీ ప్రతరణం, మహాపురుష నిగ్రహం,
మహాజన విరోధం చ, దూరతః పరివర్జయేత్.
మహా ప్రవాహములను నిరాధారుడై దాట ప్రయత్నించ రాదు, మహాపురుషులను అదుపు చేయరాదు
మహాత్ములతో విరోధము పూనరాదు. ఇవి వినాశకరములు సుమా.

ఏక వచనం                                                            
సుతా హసతి - కుమార్తె నవ్వుచున్నది.                          
రమా గాయతి - రమ పాడుచున్నది.                        
బాలా లిఖతి - బాలిక వ్రాయుచున్నది.
గంగా వహతి - గంగ ప్రవహించుచున్నది.
సీతా పిబతి - సీత త్రాగుచున్నది.
అజా చరతి - ఆడమేక మేస్తున్నది.
సన్ధ్యా భవతి - సంధ్యవేళ అవుతున్నది.
సా నయతి - ఆమె తీసుకు పోతున్నది.
ఇయమ్ ఇచ్ఛతి - ఈమె కోరుచున్నది.
పుష్పం వికసతి - పుష్పం వికసిస్తున్నది.
ఫలం పతతి - పండు పడుచున్నది.
నయనం స్ఫురతి - కన్ను అదురుచున్నది.
మిత్రం యచ్ఛతి - మిత్రుడు ఇస్తున్నాడు.
జలం స్రవతి - నీరు కారుతున్నది.
తత్ పతతి - అది పడుతున్నది.
 బహువచనంః------------------------
చిత్రకారాః లిఖంతి --- చిత్రకారులు చిత్రిస్తున్నారు
భారవాహాః వహంతి ---- కూలీలు మోస్తున్నారు
చోరాః ధావన్తి --- దొంగలు పరుగెత్తు తున్నారు.
మూర్ఖాః నిన్దన్తి -- మూర్ఖులు నిన్దిస్తున్నారు.
రజకాః క్షాళయన్తి -- చాకలివారు ఉతుకుతున్నారు.
తక్షకాః తక్షన్తి -- వడ్రంగులు చెక్కుతున్నారు.
గాయకాః గాయన్తి -- గాయకులు పాడుతున్నారు.
నటాః నృత్యన్తి -- నటులు నృత్యం చేస్తున్నారు.
పాచకాః పచన్తి -- వంటవారు వండుతున్నారు.    ..........................ఇంకా ఉంది.........

No comments:

Post a Comment

బ్లాగ్ సందర్శించినందుకు ధన్యవాదాలు. త్వరలో మా స్పందన తెలుపగలము.

Featured Post

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్.

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్. ఒక సంక్షిప్త పరిచయం ఇక్కడ కింద తేదీలు పుట సంఖ్యలు ఇచ్చినవి గురువు గారి ప్రవచనా...