Wednesday, July 20, 2016

సంస్కృతం వదామః - 6

భవాన్(పు.లిం)  కధం అస్తి -- మీరు ఎలా ఉన్నారు ?
ఆం, అహం 1.కుశలః, అస్మి -- ఆ నేను బాగున్నాను.
భవతీ(స్త్రీ.లిం)కధం అస్తి  -- మీరు ఎలా ఉన్నారు ?
ఆం, అహం 2. కుశలినీ   అస్మి -- అవును, నేను బాగున్నాను.
గృహే సర్వం కుశలం కిమ్ -- ఇంట్లో అంతా కుశలమేనా ?
ఆం, సర్వం 3. కుశలం -- అవును, (ఆ) ఇంట్లో అంతా కుశలమే.
భవతః భగినీ కుశలినీ అస్తి కిం ? -- మీ చెల్లెలు బాగున్నదా ?
ఆం, మమ భగినీ అపి కుశలినీ అస్తి -- ఆ మా చెల్లెలు కూడా బాగున్నది.
భవతః భ్రాతా కుశలః కిం ? -- మీ సోదరుడు బాగున్నాడా ?
ఆం, సః కుశలః ఏవ -- ఆ అతడు కుశలమే.
ఇక్కడ కుశలం అనే పదం విశేషణంగా వాడబడింది. విశేషణం విశేష్యము  యొక్క లింగ వచనములతో ఏకీభవించ వలెను.
ఉదాహరణకు సర్వం అనే పదం నపుంసక లింగం ఏక వచనం కనుక కుశలం అనే పదం కూడా నపుంసక లింగం ఏకవచనం లో వచ్చినది.
అలాగే భగినీ స్త్రీ లింగం ఏకవచనం కనుక కుశలినీ స్త్రీ లింగం ఏకవచనం వచ్చినది.
అలాగే భ్రాత పుం. లింగం ఏకవచనం కనుక కుశలః అని వచ్చినది.


No comments:

Post a Comment

బ్లాగ్ సందర్శించినందుకు ధన్యవాదాలు. త్వరలో మా స్పందన తెలుపగలము.

Featured Post

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్.

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్. ఒక సంక్షిప్త పరిచయం ఇక్కడ కింద తేదీలు పుట సంఖ్యలు ఇచ్చినవి గురువు గారి ప్రవచనా...