Thursday, August 25, 2016

ఆషిక్ మాషుక్

తెలుగులో ఆషిక్ మాషుక్ లనే పదాలకు సరైన పదాలు లేవు అనిపిస్తుంది. ఆషిక్ అంటే ఒకరిపైన ఫిదా ఐపోవడం. లైలా మజ్నులలా. ఒకరులేక మరొకరు లేరు. బ్రతికినా చనిపోయినా వారితోనే. ఇక్కడ భగవంతుడు ఎవరిపైన ఫిదా అవుతున్నారో చెబుతున్నారు. మిగతా అందరూ ఆయనపై మోహితులైతే ఆయన ఒక్కరిపైనే మోహితులయ్యారు. అర్జునుడు. అర్జునుడి రధంలోనే అందుకు ఆయన ప్రవేశించారు. 



Wednesday, August 24, 2016

Photo from vouhiniRamana

శివుడు లక్ష్మికీ, కుబేరుడికీ (జ్ఞాన) ధనం ఇస్తున్నాడు.

దేవతలు హింసచేయరు, మరి ఈ అసురులను చంపడం ఏమిటి ?

దేవతలు హింసచేయరు, మరి ఈ అసురులను చంపడం ఏమిటి ?
Image result for mahakali photo
ప్రతీ విషయమూ సూక్ష్మము స్థూలమూ అని రెండు అర్ధాలు ఉంటాయి. కనిపించే అర్ధం, ఇంకా గూడార్ధం అని.
దుర్గ, కాళీ జగదంబ అని మాతకు పేర్లు. కాళి రాక్షసుల కంఠాలు తెగగోసింది అంటారు అలా చంపడం వల్ల వాడిలో రాక్షసత్వం పోదు. మళ్ళీ జన్మలో మళ్ళీ రాక్షసుడౌతాడు. ప్రతీవాళ్ళూ పుట్టగానే దుష్టులుగా ఉండరు. అందరూ హీరోలే అవుదామనుకుంటారు, విలన్ అవుదామని ఎవరూ అనుకోరు. దేహ అభిమానం అని అసురత్వానికి గుర్తు. దేవతలు ఆత్మాభిమానులు. దేహాభిమానం కనుకనే రాక్షసులను పేద్ద పేద్ద దేహాలతో చుబించారు ఇది లాక్షణికం.
వారిలోని ఆ దేహాభిమానాన్ని కాళి ఖండిస్తుంది. ఆ గర్వం పోయిననాడు వాడు దేవుడు అవుతాడు. అప్పుడు ఆమె
వారి శిరస్సులను మెడలో వేసుకుంటుంది అంటే వాళ్ళ మహిమను పొగుడుతుంది. నా పిల్లలు అంటుంది. వాళ్ళు అమె భక్తులు ఐపోతారు. ఎందుకంటే ఆమె వారికి మనశ్శాంతినిచ్చింది. ఎప్పుడైతే మనలో అహంకారం పోయిందో అప్పుడు మనం శాంతస్వరూపులం ఐపోతాము. అలా మనకు ఉపకారం చేసిన ఆమెను మనం మహిమ చేస్తాము.
ఇదే క్రిష్ణుడు చక్రంతో శిశుపాలుడి శిరసుఖండించాడు అతని ఆత్మ ఆయనలో కలిసి పోయింది అంటారు . వాస్తవానికి ఆ ఆత్మ ఆయనలో కలవడం కాదు ఆయనకు భిన్నంగా ఆ ఆత్మ ఇంక నడచుకోదు. ఆయన మార్గంలోనే ఆ ఆత్మ తుచా తప్పకుండా నడుస్తుందని భావం. ఇది నాటకీయంగా అలా చూబించారు.
కనుక దేవతలు హింసచేయరు. ఇది అహింసా యుద్ధం. దీని వల్ల లోకంలో స్వర్గం వస్తుంది.



Tuesday, August 23, 2016

మహా నసం వంట ఇల్లు


వంటింట్లో ఏమేమి ఉంటాయి
మమ నామ గోవిందః  ఏతత్ మమ గృహం 
ఏషః మమ తాతః 
ఏషా అమ్బా
ఏషః మహానసః  ఇది వంటిల్లు(పుం.లిం.)
ఏతౌ ఘటౌ     ఇవ్విరెండు కుండలు(ఫు.లి.)
ఏతే చషకాః  ఇవ్విరెండు గ్లాసులు(పు.లి.)
ఏషా స్థాలికా  ఇది పళ్ళెం(స్త్రీ.లి.)
ఏతే అగ్నిపేటికే  ఇవ్వి అగ్గిపెట్టెలు((స్త్రీ.లి.)
ఏతాః ఛురికాః  ఇవ్వి కత్తులు)(స్త్రీ.లి.)
ఏషః కః ? ఏషః హారః  ఇతడు హారము (హారము పుం.లిం.)
ఏతౌ కౌ ? ఏతౌ హస్తౌ (హస్తః పు.లి.)
ఏతే కే ? ఏతే నఖాః (నఖః పు.లి.) 

ఏతత్ ఉద్యానం  (నపు.లి)
ఏతే ఫలే (నపు.లి)
ఏతాని పుష్పాణి (నపు.లి)
ఏషా లతా (స్త్రీ)
ఏతే మల్లికా లతే (ఇవి రెండు. స్త్రీ.లి.)
ఏతాః కుల్యాః (ఇవి అన్నీకాలువలు. స్త్రీ.లి.) 





Sunday, August 21, 2016

కుత్ర కిమర్ధం పాఠం-23

కుతః  ఎక్కడ నుంచి
గంగా కుతః ప్రవహతి  గంగ ఎక్కడ నుంచి ప్రవహిస్తున్నది
రామః కుతః ఆగచ్ఛతి  రాముడు ఎక్కడ నుంచి వస్తున్నాడు
గీతా కుతః గఛ్ఛతి  గీత ఎక్కడకు వెళ్తున్నది
సీతా కుతః ఆగచ్ఛతి  సీత ఎక్కడ నుంచి వస్తున్నది
ఫలం కుతః పతతి   పండు ఎక్కడ నుంచి పడుతున్నది
రామః కుతః నయతి  రాముడు ఎక్కడకు తీసుకు వెళుతున్నాడు
బాబూలాలః కుతః ఆగచ్ఛతి
బాబూలాలః విత్తకోశతః (బాంకునుండి) ఆగచ్ఛతి
వాహనం కుతః పతతి
వాహనం మార్గతః పతతి (దారినుండి, రోడ్డునుండి)
ఒకే పెద్ద వాక్యం వ్రాయవచ్చును
అహం గచ్ఛామి,
అహం ఆపణం(దుకాణం) గచ్ఛామి, ఆపణతః మందిరం(గుడి) గచ్ఛామి, మందిరతః విత్తకోశం(బాంక్) గచ్ఛామి,
విత్తకోశతః విపణీం(మార్కెట్) గచ్ఛామి, విపణీతః రైల్.స్థానకం(రైల్వేస్టేషన్) గచ్ఛామి, రైల్.స్థానకతః గృహం ఆగచ్ఛామి.  ఎక్కడకు అనే ప్రదేశం ద్వితీయా విభక్తిలో ఉంటుంది అం అనే ప్రత్యయం చేరుతుంది ఉదా...ఆపణం, మందిరం, విత్తకోశం, విపణీం మొ.
ఇలా ఎంతెంత పెద్ద వాక్యాలైనా వ్రాయవచ్చును.
రామానందః ప్రవాసం కరోతి --రామానంద్ ఊరూరు తిరుగుతున్నాడు
సః కుత్ర కుత్ర గచ్ఛతి ఇతి అభ్యాసం కుర్మః
అతడు ఎక్కడెక్కడకు వెళ్తున్నాడో అని అభ్యాసం చేద్దాము
రామానందః లక్నౌనగరం గచ్ఛతి, కుత్ర గచ్ఛతి? లక్నౌ నగరం గచ్ఛతి
లక్నౌతః కుత్ర గచ్ఛతి --- లక్నో నుండి ఎక్కడకు వెళుతున్నాడు ?
సః లక్నౌతః నాగపురం గచ్ఛతి, నాగపురతః బెంగుళూరు నగరం గచ్ఛతి, బెంగుళూరుతః చెన్నైం గచ్ఛతి, చెన్నైతః రామేశ్వరం గచ్ఛతి, రామేశ్వరతః అహమదాబాద్ నగరం గచ్ఛతి, అహమదాబాద్.తః పునః (మళ్ళీ) లక్నౌ గచ్ఛతి.
కిమర్ధం--- ఎందుకు
మమ పిపాసా అస్తి .... నాకు దాహంగా ఉంది
అహం పిపాసా నివారణార్దం జలం పిబామి
నేను దాహ నివృతికోసం నీళ్ళు తాగుతున్నాను
అహం ఆనందార్ధం నృత్యం కరోమి  నేను ఆనందం కోసం నృత్యం చేస్తున్నాను
అహం జ్ఞానార్ధం శాస్త్రం పఠామి  నేను జ్ఞానం కోసం శాస్త్రం చదువుతున్నాను (చదువుదును అని కూడాభావం)
అహం జనప్రియార్ధం గీతం గాయామి. నేను జనప్రియంకోసం పాటపాడుతున్నాను
భవాన్ కిమర్ధం కిం కిం కరోతి  మీరు ఎందుకు ఏమేమి చేస్తారు ?
పఠనార్ధం గ్రంధాలయం గచ్ఛామి
పఠనార్దం శాలాం(స్కూల్. కళాశాలాం, విద్యాలయం) గచ్ఛామి
ఔషదార్దం ఔషధాలయం(ఆసుపత్రి) గచ్ఛామి అథవా లేక చికిత్సాలయం
కిమర్ధం గచ్ఛతి ? ఔషదార్ధం
ధ్యానార్ధం మందిరం గచ్ఛతి  ధ్యానం చేయడం కోసం వెళతాడు
ఆనందార్ధం దూరదర్శనం పశ్యతి
ఫలార్ధం ఉద్యానం --- పండు కోసం తోట
భోజనార్ధం ఉపాహార శాల  --- భోజనార్ధం  హోటల్.





పాఠం - 22 , ఆగతవాన్, ఆగతవతీ, ఆగతం

ప్రజంట్ టెన్స్ లో క్రియలు అన్ని లింగాలకూ ఒకటే ప్రత్యయాలు ఉంటాయి,
గచ్ఛతి, గచ్ఛతః , గచ్ఛంతి     ఒకరు వెళ్తున్నారు    ఇద్దరు వెళ్తున్నారు   అందరూ వెళ్తున్నారు
అదే పాస్ట్ టెన్స్ లో సింపుల్ గా ఉండడం కోసం పుంలింగం, స్త్రీ లింగం, నపుంసకలింగాలలో ఎలా ఉంటాయో చూద్దాం
గతవాన్     వెళ్ళాడు      గతవతీ   వెళ్ళినది            గతం   నపుం. వెళ్ళినది    ఉదా----
రామః గతవాన్   రాముడు వెళ్ళాడు  
సీతా గతవతీ      సీత వెళ్ళినది
పుస్తకం గతం     పుస్తకం గతం      
 వాడుకలో వినే ఉంటారు  పుస్తకం పరహస్త గతం గతః అని  ఇంకా గతం గతః  అని
 ఏషః - ఇతడు,      సః - అతడు,      ఏషా-  ఈమె,      సా- ఆమె,    ఏతత్- ఇది,   తత్-  అది
ఏషః  బాలకః        సః బాలకః          ఏషా బాలికా       సా బాలికా     ఏతత్ ఫలం   తత్ ఫలం
ఏషః సింహః         సః సింహః          ఏషా రాధా          సా రాధా        ఏతత్ పుస్తకం తత్ పుస్తకం
ఏషః వానరః        సః వానరః          ఏషా గోపికా         సా గోపికా      ఏతత్ వనం     తత్ వనం
ఏషః గజః            సః గజః              ఏషా గౌరీ            సా గౌరీ          ఏతత్ మధు   తత్ మధు(తేనె)

ఏషః కః   ఇతడు ఎవరు ఏషః స్వర్ణకారః  ఇతడు కంసాలి
ఏషః కః    ఇతడు ఎవరు ఏషః మాలాకారః  ఇతడు మాలలు కట్టేవాడు
ఏషః కః    ఇతడు ఎవరు ఏషః హస్తిపకః    ఇతడు మావటీవాడు
ఏషః కః    ఇతడు ఎవరు  ఏషః లోహకారః  ఇతడు కమ్మరి
ఏషః కః   ఇతడు ఎవరు   ఏషః కుమ్భకారః  ఇతడు కుమ్మరి
ఏషః కః  ఇతడు ఎవరు   ఏషః గోపాలకః  ఇతడు గోవుల కాపరి
అలాగే రజకః - చాకలి, తక్షకః - వడ్రంగి, ఆరక్షకః -  పోలీసు,  సైనికః - సైనికుడు
విదుషకః, ఉద్యానపాలకః - తోటమాలి, న్యాయాధీశః, అర్చకః, నర్తకః(నర్తకీ) గాయకః (గాయికా), సౌచికః (దర్జీ)
ధీవరః - జాలరివాడు
స్త్రీ----
భృత్యా - పనిమనిషి, శిక్షికా- టీచర్, వైద్యా- డాక్టర్, లేఖికా - రచయిత్రి (లేదా- క్లర్క్) మక్షికా-- ఈగ,
పిపీలికా- చీమ, స్థాలికా- పళ్ళెం, ద్విచక్రికా- సైకిల్ (స్కూటర్) గృహిణీ - ఇల్లాలు ,సన్యాసినీ పుత్రీ, జననీ



ఏషా కా --- ఈమె ఎవరు  ఏషా భృత్యా   ఈమె పనిమనిషి
ఏషా కా  --- ఈమె ఎవరు   ఏషా వైద్యా  ఈమె డాక్టర్
ఏషా కా -- ఈమె ఎవరు   ఏషా లేఖికా  ఈమె రచయిత్రి
ఏషా కా --- ఈమె ఎవరు   ఏషా పిపీలికా  ఈమె చీమ :)

నోటు......పాఠకులు ప్రశ్నలు వేయ వచ్చును.



Thursday, August 18, 2016

పాఠం - 21 కుతః, కిమర్ధం, కుత్ర, కః.....

మధ్యరాత్రే మార్గేణ ఆగచ్ఛంతం కంచిత్ ఆరక్షకః పృచ్ఛన్ అస్తి....
మధ్యరాత్రి మార్గంలో వస్తూవున్న ఒకానొక పోలీసు అడుగుతూ ఉన్నాడు.... ప్రశ్నలు
భీతస్య తస్య సజ్జనస్య ఉత్తరాణి అధః సన్తి.....
భయపడిన ఆ సజ్జనుని జవాబులు కింద ఉన్నాయి
పోలీస్   కుతః ఆగచ్ఛతి....... ఎక్కడ నుండి వస్తున్నావు
సజ్జనుడు  శంకరపురాత్ ఆగచ్ఛన్ అస్మి...... శంకర పురం నుంచి వస్తున్నాను
పో--- కిమర్ధం గతవాన్...... ఎందుకు వెళ్ళావు
స---- అహం చలనచిత్రం ద్రష్టుం గతవాన్...... నేను సినిమా చుడడానికి వెళ్ళిఉంటిని
పో--- కుత్ర ప్రదర్శయన్ అస్తి, చిత్రమందిరస్య నామ కిం----- సినిమా హాలు పేరేమి
స--- ఉమాచిత్రమందిరం---- ఉమా టాకీస్
పో--- కః సమయః--- సమయం ఎంత
స--- ఇదానీం ఏకవాదనమ్---- ఇప్పుడు ఒంటి గంట
పో--- విలమ్బః కిమర్ధం జాతః---- ఆలస్యం ఎందుకు అయ్యింది
స--- మిత్రం గృహం ప్రాప్య గృహం గచ్ఛన్ అస్మి--- మిత్రుడిని ఇంటిదగ్గర వదిలి ఇంటికి పోతున్నాను
పో--- కుత్ర అస్తి మిత్రస్య గృహం --- మిత్రుని ఇల్లు ఎక్కడ ఉంది
స--- మిత్రగృహం రామకృష్ణ ఆశ్రమ సమీపే అస్తి--- మిత్రుని ఇల్లు రామక్రిష్ణ ఆశ్రమం దగ్గర ఉంది
పో--- చిత్ర ప్రదర్శనం కదా సమాప్తం---- సినిమా ఎప్పుడు సమాప్తం అయ్యింది
స--- చిత్ర ప్రదర్శనం 12.30 వాదనే సమాప్తం--- సినిమా 12.30 (గంటలకు) కు సమాప్తి అయ్యింది
పో--- మిత్రగృహం కథం గతవాన్--- మిత్రుని ఇంటికి ఎలా వెళ్ళావు
స--- మిత్రగృహం అపి పాదాభ్యాం ఏవ గతం--- మితృని ఇంటికి కడా నడిచే వెళ్ళాను
పో---సమీపే కియత్ ధనం అస్తి---- దగ్గర ఎంత డబ్బుంది
స--- కోశే ఏకం రూప్యకం అస్తి, తావదేవ---- పర్సులో ఒకే రూపాయి ఉంది... అంతే.

Wednesday, August 17, 2016

పాఠం-20

ఇంకొన్ని ఉదాహరణలు
కొన్ని పుస్తకాలు దొంతరగా పెట్టి ఉన్నాయి అవ్వి దేనిపై ఏది ఉంది అని ఇలా చెప్పవచ్చు
రఘువంశః కుత్ర అస్తి ---- రఘువంశం ఎక్కడ ఉంది
రఘువంశః రామాయణస్య ఉపరి అస్తి  --- రఘువంశం రామాయణం పైన ఉంది
బ్రహ్మసూత్రం కుత్ర అస్తి --- బ్రహ్మ సూత్రం ఎక్కడ ఉంది
బ్రహ్మసూత్రం మహాభారతస్య ఉపరి అస్తి --- బ్రహ్మసూత్రం మహాభారతం పైన ఉంది
రఘువంశం కుత్ర అస్తి---- రఘువంశం ఎక్కడ ఉంది
రఘువంశం మహాభారతస్య అధః అస్తి--- రఘువంశం మహాభారతం కింద ఉంది
రామాయణం కుత్ర అస్తి --- రామాయణం ఎక్కడ ఉంది
రామాయణం బ్రహ్మసుత్రస్య అధః అస్తి-- రామాయణం బ్రహ్మసూత్రం కింద ఉంది

కుక్కురః కధం భషతి----- కుక్క ఎలా మొరుగుతుంది
కుక్కురః ఉచ్చైః భషతి ---- కుక్క గట్టిగా మొరుగుతుంది
కధం అని ప్రశ్న అడుగుతారు
సింహః కధం గర్జయతి--- సింహం ఎలా గర్జిస్తుంది
సింహః ఉచ్చైః గర్జయతి --- సింహం గట్టిగా గర్జిస్తుంది
భవాన్ కిం ఖాదతి --- నీవు ఏమి తింటావు
అహం భోజనం ఖాదామి --- నేను భోజనం తింటాను
భవాన్ భోజనే కిం ఖాదతి --- నీవు భోజనంలో ఏమి తింటావు
అహం భోజనే రోటికాం ఖాదామి --- నేను భోజనంలో రొట్టెను తింటాను
అహం భోజనే లడ్డుకం ఖాదామి --- నేను భోజనంలో లడ్డూ తింటాను.
భవాన్ భోజనానంతరం కిం ఖాదతి --- నీవు భోజనానంతరం ఏమి తింటావు
అహం భోజనానంతరం ఆమ్రఫలం ఖాదామి --- నేను భోజనానంతరం మామిడి పండు తింటాను
అహం భోజనానంతరం కదళీ ఫలం ఖాదామి --- నేను భోజనానంతరం అరటిపండు తింటాను.
సప్త కకారాః   ---- ఏడు కకారాలు అనగా ప్రశ్నవాచకాలు
కింది ప్రశ్నల అనుసారం ఒక సంగఠన తెలియవచ్చు.......
కధం ---- ఏవిధంగా
భవాన్ కధం రక్షితః ---- నీవు ఏవిధంగా రక్షించబడ్డావు
అదృష్టబలాత్ ---- అదృష్టం వల్ల
విమానే కతి జనాః ఆసన్...... విమానంలో ఎంత మంది జనాలు ఉండి ఉన్నారు
విమానే వయం త్రయః ఆస్మ---- విమానంలో మేము ముగ్గురము ఉన్నాము
కుత్ర పతితం --- ఎక్కడ పడింది
ఇతః సుదూరే అరణ్యే పతితం --- ఇక్కడ నుంచి సుదూరంగా అరణ్యంలో పడింది
భవాన్ కః --- మీరెవరు
అహం తస్య విమానస్య చాలకేషు అన్యతమః --- నేను ఆ విమానం (యొక్క) నడిపేవాళ్ళల్లో ఒకడిని
(స్య అంటే యొక్క రామస్య రామునియొక్క, కృష్ణస్య-- కృష్ణుని యొక్క) (ఏ అంటే అందు ఉదా.....విమానే-- విమానమందు, జలే-- జలమందు, ఆకాశే-- ఆకాశమందు)
అన్యాః కః కః --- (మిగతా) అన్యులు ఎవరెవరు
ప్రాయః తే సర్వే మృతాః స్యుః. అహం సమ్యక్ న జానామి --- బహుశా వారు అంతా మరణించి ఉండవచ్చు నాకు సరిగా తెలియదు.
కుతస్తాత్ ఏతత్ విమానం ఆగచ్ఛతి --- ఎక్కడనుండి ఈ విమానం వస్తున్నది
ఏతత్ విమానం హిమాలయ పర్వతాత్ ప్రత్యాగచ్ఛత్ ఆసీత్--- ఈ విమానం హిమాలయ పర్వతం నుంచి తిరిగి వస్తూఉన్నది.
ఏషా దుర్ఘటనా కదా జాతః --- ఈ దుర్ఘటన ఎప్పుడు జరిగినది
పరహ్యః తన్నామ 21 తమే దినాంకే ఆపఘాతః జాతః -- మొన్న అంటే 21 వ తారీఖున ఏక్సిడెంట్ అయ్యింది
కిం కారణతః (కిమర్ధం)  ఎందుకు జరిగింది
యంత్ర దోషస్య కారణతః ప్రాయః ఆపఘాతః జాతః --- యంత్ర దోషం వల్ల బహుశా దుర్ఘటన జరిగింది
భవాన్ కధం ఆగతవాన్ --- మీరు ఎలా వచ్చారు
కష్టేన చలన్ అహం అరణ్యం అతిక్రమ్య అత్ర ఆగతః --- కష్టంగా నడుస్తూ నేను అరణ్యం దాటి ఇక్కడకు వచ్చాను.





Tuesday, August 16, 2016

సంస్కృత పాఠం - 19

అహం ఫలం ఖాదామి  ----- నేను పండు తింటున్నాను.
అహం పాయసం ఖాదామి --- నేను పాయసం తింటున్నాను.
అహం మోదకం ఖాదామి --- నేను కుడుములు తింటున్నాను.
అహం చాకలేహం ఖాదామి --- నేను చాక్లేట్ తింటున్నాను.
అహం పయోహిమం ఖాదామి --- నేను ఐస్ క్రీం తింటున్నాను.
 మయురః పఠతి ----- మయూర్ చదువుతున్నాడు
మయూరః కిం కిం పఠతి ? మయూర్ ఏమేమి చదువుచున్నాడు ?       కిం ద్వితీయా విభక్తి
మయూరః పత్రికాం పఠతి -- మయూర్ పత్రిక చదువుతున్నాడు.        పత్రికాం ద్వితీయా విభక్తి
  మయూరః  సమాచార పత్రికాం పఠతి         సమాచార పత్రిక చదువుతున్నాడు   సమాచార పత్రిక ద్వితీయా విభక్తి
మయూరః భగవద్గీతాం పఠతి  ,  మయూరః  వేదం పఠతి,   మయూరః పద్య పుస్తకం పఠతి
పైవి ద్వితీయా విభక్తి లో ఉన్నాయి.

పురతః    పృష్ఠతః                                                     దక్షిణతః                    వామతః
పురతః --- ముందు             పృష్ఠతః ---- వెనుక      దక్షిణతః -- కుడివైపు          వామతః --- ఎడంవైపు
ఉపరి--- పైన         అధః -- క్రింద          

మమ -- నాయొక్క  మమ పురతః పుస్తకం అస్తి  --- నా ముందు పుస్తకం ఉంది
                           మమ పురతః మందిరం అస్తి --- నా ముందు గుడి ఉంది
                     శివస్య పురతః నంది అస్తి ---- శివుని ముందు నంది ఉన్నాడు
రామస్య పురతః హనుమంతః అస్తి --- రాముని ముందు హనుమంతుడు ఉన్నాడు
కృష్ణస్య పురతః రాధా అస్తి -- కృష్ణుని ముందు రాధ ఉంది.
సీతాయాః పురతః రామః అస్తి--- సీత ముందు రాముడు ఉన్నాడు
రాధాయాః పురతః కృష్ణః అస్తి---- రాధ ముందు కృష్ణుడు ఉన్నాడు.
ఇక్కడ పుంలింగంలో రామస్య, కృష్ణస్య అని షష్ఠీ విభక్తి వచ్చింది గమనించ వలెను.
అలాగే సీతాయాః రాధాయాః అని స్త్ర్రీ లింగం లో షష్ఠీ విభక్తి రూపాలు వచ్చినవి
సురేశస్య దక్షిణతః గోపాలః అస్తి --- సురేష్ కుడివైపు గోపాల్ ఉన్నాడు
మహేశస్య వామతః గౌరీ అస్తి -- మహేశ్ ఎడం వైపు గౌరి ఉంది
ఉపరి ఆకాశః అస్తి--- పైన ఆకాశం ఉంది
ఉపరి  విద్యుత్ వ్యజనం అస్తి -- పైన ఎలక్ట్రిక్ ఫాన్ ఉంది
ఉపరి నక్షత్రాః సన్తి--- పైన నక్షత్రాలు ఉన్నవి
అధః పృథివీ అస్తి --- క్రింద భుమి ఉంది.
అధః పాద సమ్మార్జనీ అస్తి --- కింద కాళ్ళు తుడుచుకునే బట్ట ఉంది.
అధః పాదరక్షాః సన్తి -- కింద చెప్పులు ఉన్నవి
అస్తి ఏక వచనం ...... సన్తి బహు వచనం
                              
              

Monday, August 15, 2016

అస్తి, దద, దదాతు

అత్ర బహూని వస్తూని సన్తి  --ఇక్కడ చాలా వస్తువులు ఉన్నాయి
మమ సమీపే -- నా దగ్గర              దంతకూర్చం అస్తి -- బ్రష్ ఉన్నది
మమ సమీపే                               చమసః అస్తి--- చెమిచా ఉన్నది
మమ సమీపే                               కంకతం అస్తి---- దువ్వెన ఉన్నది.
                                                  సంగణకం అస్తి--- కంప్యూటర్ ఉంది
                                                  ధ్వని ముద్రికా--- సి.డి, టేప్
                                                  సాంద్ర ముద్రికా-- సిడి రామ్
                                                  కర్తరీ----కత్తెర
                                                  ప్రత్రికా--- పేపర్
                                                  లేఖినీ--- పెన్              అంకనీ------పెన్సిల్
                                                 
ఇవ్వు అనడానికి వస్తువుకు ద్వితీయా విభక్తి వస్తుంది
చమసః---- చమసం       అహం చమసం దదామి--- నేను చెమిచా ఇస్తున్నాను
దంతకూర్చః--- దంతకూర్చం--- త్వం దంతకూర్చం దద (దదాతు)--- నీవు బ్రష్ ఇవ్వు
కంకతం---కంకతం                    త్వం కంకతం దద---నీవు దువ్వెన్న ఇవ్వు
భవాన్, భవతీ మీరు అనే గౌరవ వాచకాలు పుం. స్త్రీ. లింగాలు.... వీటితో తు ఏడ్ అవుతుంది
భవాన్ పత్రికాం దదాతు, భవతీ కర్తరీం దదాతు, భవాన్ లేఖినీం దదాతు, భవతీ అకనీం దదాతు.
పత్రికా--పత్రికాం   కర్తరీ--కర్తరీం  లేఖినీ-- లేఖినీం

                                                



          

కథ బుద్ధిమాన్ శిష్యః

బుద్ధిమాన్ శిష్యః
కాశీనగరే ఏకః పండితః వసతి.---- కాశీ లో ఒక పండితుడు ఉంటున్నాడు.
సః వైద్యః అస్తి--- ఆయన వైద్యుడు.
 పండితసమీపే ఏకః శిష్యః ఆగచ్ఛతి. -----అతని దగ్గరకు ఒక శిష్యుడు వచ్చాడు.
సః తస్య సమీపే శిష్యః భవితుం ఇచ్ఛతి.-----అతడు ఆయన వద్ద శిష్యుడు అవ్వాలని కోరుతున్నాడు.
కింతు గురుః తం పరీక్షితుం ఇచ్ఛతి---- కానీ గురువు అతనిని పరీక్షించాలనుకున్నాడు.
సః తం వదతి యత్ త్వం వనే నిరీక్షణం కురు, పశ్చాత్ ఏకం శాకం ఆనయతు తత్ వైద్యోపయోగీ నాస్తీతి.
ఆయన అతనిని వనంలో పరిశీలించి వైద్యానికి ఉపయోగించని శాకం పట్టుకు రమ్మని చెప్పాడు.
శిష్యః అస్తు ఇతి వదన్ నిష్క్రమతి--- శిష్యుడు మంచిది అని వెళ్ళును.
ఏక సంవత్సరానంతరం పునరాగమనే గురుం వదతి --ఆర్య ఏతన్మాత్రం కోపి శాకం, వా, అన్య వృక్ష భాగం అస్తి తద్ ఔషధోపయోగీ నాస్తి.--
ఒక సంవత్సరం పిదప పునరాగమనంలో గురువుకు అయ్యా, ఏ మొక్క లేక వృక్ష భాగమూ కూడా ఔషధోపయోగం కానిది లేదు అని చెప్పాడు.
తఛృత్వా గురుః ప్రసన్నచిత్తః అభవత్. పశ్చాత్ తం శిష్య రూపేణ స్వీకృతవాన్.
అదివిని గురువు ప్రసన్నచిత్తుడై అతనిని శిష్యునిగా స్వీకరించెను.




Friday, August 12, 2016

ఫోనులో సంస్కృతంలో మాట్లాడడం

ఫోనులో సంస్కృతంలో మాట్లాడడం
గిరీశః--- హరిః ఓం ... నమస్కారం
అనంతః--- హరిఓం....నమస్కారం
గిరీశః-- అహం గిరీశః వదామి----- నేను గిరీశ్ ను మాట్లాడుతున్నాను... గృహే కోపి నాస్తి కిం ?
                                                      ఇంట్లో ఎవరూ లేరా ?
అనంతః--- సర్వే సంతి.....అందరూ ఉన్నారు, అంబా పూజయతి--- అమ్మ పూజచేసుకుంటోంది,
                                  పితా జపతి-- నాన్న జపం చేసుకుంటున్నారు.
                               అనుజః ఖాదతి-- తమ్ముడు తింటున్నాడు.
                            అగ్రజా మాలాం కరోతి----అక్క మాల కడుతోంది.
                          పితామహః దూరదర్శనం పశ్యతి-- తాతగారు టి.వి చూస్తున్నారు
                        పితామహీ అపి దూరదర్శనం పశ్యతి-- బామ్మ కూడా టి.వి. చూస్తున్నది.
గిరీశః -- త్వం కిం కరోషి---- నీవేమి చేస్తున్నావు ?
అనంతః ---- అహం పఠామి....... నేను చదువుకుంటున్నాను, ఉత్తరం లిఖామి--- జవాబులు రాస్తున్నాను.
                                           తవ అనుజౌ కిం కురుతః----- మీ ఇద్దరు తమ్ముళ్ళూ ఏమి చేస్తున్నారు ?
గిరీశః -- మమ అనుజౌ శాలాం గచ్ఛతః --- మా తమ్ముళ్ళిద్దరూ పాఠశాలకు వెళ్తున్నారు. అహం పితా చ
           విద్యాలయం గచ్ఛావః --- నేనూ నాన్నా విద్యాలయం వెళ్తున్నాము........(ద్వి వచన కర్తలు క్రియా ప్రయోగాలు గమనించ వలసినది.......అనుజౌ, గచ్ఛతః---- అనుజౌ, కురుతః-----  అహం,పితా చ   గచ్ఛావః మొ.)
                --- త్వం శాలాం కిం న గచ్ఛసి ? నీవు పాఠశాలకు ఎందుకు వెళ్ళడంలేదు?
అనంతః --- అద్య మమ గృహే బాంధవాః మైసూర్ నగరాత్ ఆగచ్ఛంతి అతః అహం న ఆగచ్ఛామి.
               ఈ రోజు మా ఇంటికి బంధువులు మైసూర్ నగరం నుండి వస్తున్నారు అందుకని నేను రావట్లేదు.

పంచమీ విభక్తి ప్రయోగాలు గమనించండి....
నగరాత్.... నగరం నుండి
అహం హైదరాబాద్ నగరాత్ దిల్లీం గచ్ఛామి----- నేను హైదరాబాద్ నగరం నుండి దిల్లీకి వెళుతున్నాను.
అహం గృహతః శాలాం గచ్ఛామి------ నేను ఇంటినుండి శాలకు వెళతాను
రవిః శాలాత్ క్రీడాంగణం గచ్ఛతి---- రవి స్కూలు నుండి ఆటస్థలానికి వెళ్ళుచున్నాడు
రమా ప్రకోష్ఠతః మహానసం గచ్ఛతి--- రమ గది నుంచి వంటింటికి వెళ్ళుచున్నాడు
దీపా గృహతః ఆపణం గచ్ఛతి---- దీప ఇంటినుండి దుకాణమునకు వెళ్ళుచున్నది.
వృక్షాత్ ఫలం పతతి---- వృక్షము నుండి ఫలం పడుచున్నది.
భీమః అశ్వాత్ పతతి--- భీముడు అశ్వమునుండి పడుచున్నాడు.








Canadian smocking/capitone round cushion by Debbie Shore. Matrix design.

Monday, August 8, 2016

DIY Ribbon flower with beads/ grosgrain flowers with beads tutorial

సంస్కృత పాఠం - 17

వహతి-- వీచుచున్నది
తపతి-- ప్రకాశించుచున్నది, వేడినిచ్చుచున్నాడు
సోమః న ఖాదతి సోముడు తినుటలేదు
వాయుః కిం న వహతి -- గాలి ఎందుకు వీచుటలేదు
సూర్యః ఇదానీం న తపతి-- సూర్యుడు ఇప్పుడు ప్రకాశించుటలేదు, (వేడిగాలేడు).
కృష్ణః న గచ్ఛతి-- కృష్ణుడు వెళ్ళుటలేదు,
వాయుః సదా వహతి--- వాయువు ఎల్లప్పుడూ వీచును
హరిశ్చంద్రః కిం న పశ్యతి--- హరిశ్చంద్రుడు ఎందుకు చూడడు
యదా సోమః తత్ర పఠతి, తదా సూర్యః న తపతి--- సోముడు అక్కడ చదువుచున్నప్పుడు సూర్యుడు వేడిగా లేడు
-----------
కిమపి--- ఏమియును
అద్య-- నేడు
అధునా-- ఇప్పుడు
కధమ్-- ఎట్లు
సః కిమపి న వదతి--- అతడు ఏమియూ చెప్పుట లేదు
అధునా అహం పఠామి--- ఇప్పుడు నేను చదువుచున్నాను.
అద్య కృష్ణః తత్ర పఠతి-- ఈరోజు కృష్ణుడు అక్కడ చదువుచున్నాడు
కధం సః కిమపి న పఠతి-- అతడేమియూ చదువుట లేదేమి
రామః ఇదానీం తత్ర గచ్ఛతి-- రాముడు ఇప్పుడు అచటకు వెళుతున్నాడు
శ్రీకృష్ణః అధునా అత్ర పఠతి--- శ్రీకృష్ణుడు ఇప్పుడు ఇక్కడ చదువుచున్నాడు
గోవిందః ఇదానీం నైవ గచ్ఛతి-- గోవిందుడు ఇప్పుడు అసలే వెళ్ళడు
త్వం కిమపి కిం న ఖాదసి-- నీవు ఏమీ తినుటలేదేమి
విశ్వామిత్రః అద్య తత్ర పఠతి-- విశ్వామిత్రుడు ఈరోజు అక్కడ చదువుచున్నాడు
యదా సః పఠతి తదా త్వం కుత్ర గచ్ఛసి-- అతను చదువుచున్నప్పుడు నీవు ఎక్కడకు వెళ్ళుచున్నావు



Sunday, August 7, 2016

పాఠం 16 జవాబులు

పాఠం - 16  జవాబులు----
క్రింది వాక్యాలు సంస్కృతంలో వ్రాయ ప్రయత్నించగలరా....
నేను చదువు చున్నాను ------------------------------------------
అహం పఠామి
వాడు చదువుట లేదు-----------------
సః న పఠతి
వాడు ఎప్పుడు తినును---------------
సః కదా ఖాదతి
వాడు చదువుతున్నప్పుడు నీవు ఏమి చదువుతున్నావు ?-----------
యదా సః పఠతి తదా త్వం కిం పఠసి  ?
నేను వెళ్ళునప్పుడు నీవు వెళ్ళుదువు.------------------
యదా అహం గచ్ఛామి దతా త్వం గచ్ఛసి.

సంస్కృత పాఠం - 16

సంస్కృత పాఠం - 16
నైవ - బొత్తిగా లేదు                                     కదా -- ఎప్పుడు ?
సదా -- ఎల్లప్పుడూ                                    యదా-- ఎప్పుడు, ఎప్పుడైతే
అపి -- ను, యును, కూడా                         చ -- మరియు, ఇంకనూ
తదా -- అప్పుడు                                     ఇదానీమ్ -- ఇప్పుడు
ఈ పదములతో ఎన్నో వాక్యాలు వ్రాయవచ్చును
సః సదా పఠతి -- అతడు ఎల్లప్పుడూ చదువును
యదా సః పఠతి, తదా త్వం కిం న పఠసి ? (ఎప్పుడైతే) వాడు చదువుతున్నాడో అప్పుడు నీవెందుకు చదువవు ? మామూలుగా మనం వ్యవహారంలో ...వాడు చదువుకుంటున్నాడు, నువు మాత్రం చదవవేం అంటాం అలాగన్నమాట. పశ్య సః పఠతి , త్వం కిం న పఠసి ? పశ్య-- చూడు.
ఇదానీం తత్ర అహం న పశ్యామి. ఇప్పుడు నేనటు చూడను.
కదా సః తత్ర గచ్ఛతి ? అతడు అక్కడకు ఎప్పుడు వెళతాడు ?
త్వం తత్ర పశ్యసి వదసి చ..... (నీవు అటు చూస్తున్నావు, మాట్లాడుతున్నావు కూడా.) నీవటుచూస్తూ మాట్లాడుతున్నావు.
త్వం అపి వదసి -- నీవు కూడా చెబుతున్నావు.
యదా త్వం తత్ర ఖాదసి ----నీవు అక్కడ తింటున్నప్పుడు...
తదా అహం తత్ర నైవ ఖాదామి...... అప్పుడు నేను అక్కడ తిననే తినను.

క్రింది వాక్యాలు సంస్కృతంలో వ్రాయ ప్రయత్నించగలరా....
నేను చదువు చున్నాను
వాడు చదువుట లేదు
వాడు ఎప్పుడు తినును
వాడు చదువుతున్నప్పుడు నీవు ఏమి చదువుతున్నావు ?
నేను వెళ్ళునప్పుడు నీవు వెళ్ళుదువు.





Saturday, August 6, 2016

ఎర్ర పూలు

హనీ బర్డ్స్ ని ఆహ్వానం చేస్తున్న మా పెరటి ఎర్ర పూల చెట్టు

పూలు

హాని బర్డ్స్ ని ఆహ్వానం చేస్తున్న మా పెరటి పూలు

పూలు

పూసింది పొన్న మా పెరట్లో

మా పొన్న చెట్టు

విరగ పూచిన మా పొ న్న చెట్టు

సంస్కృత పాఠం - 15

సంస్కృత పాఠం - 15
అహం వదామి -- నేను చెప్పుచున్నాను
త్వం వదసి -- నీవు చెప్పుచున్నావు
సః వదతి -- వాడు, అతడు చెప్పుచున్నాడు
ఈ వాక్యములనే తారుమారు చేసి సంస్కృతంలో వ్రాయవచ్చును...
వదామి అహం, వదసి త్వం, వదతి సః....... సంస్కృతంలో వాక్యంలోని పదాలు ముందు వెనుకలు చేసినా వ్యాకరణ దోషము లేదు. సంస్కృత భాష యందలి సౌలభ్యం ఇదే.
ధాతువు అంటే క్రియ శబ్దము అంటే క్రీయేతర పదాలు..... పదాలు క్రియలైనా, శబ్దాలైనా ముఖ్యంగా మూల పదం + ప్రత్యయం ఉంటాయి ఉదాహరణకు పఠ అనే ధాతువు తీసుకుంటే మి, సి, తి అనే ప్రత్యయాలు చేరి ఉపయోగం ఈ క్రింది విధంగా ఉంటుంది.....
పఠ + మి -- పఠామి--- చదువుతున్నాను ఉత్తమ పురుష  అంటే మనకోసం చెప్పేది ఫర్స్ట్ పర్సన్,
పఠ + సి --- పఠసి --- చదువుతున్నావు మధ్యమ పురుష అంటే ఎదుటు వ్యక్తికోసం చెప్పేది సెకెండ్ పర్సన్
పఠ + తి --- పఠతి -- చదువుతున్నాడు ప్రధమ పురుష అంటే మూడవ వ్యక్తి కోసం చెప్పేది థర్డ్ పర్సన్
అన్ని ధాతువులకు మి, సి, తి వర్తిస్తుంది వర్తమాన కాలంలో ప్రత్యయాలు ఇవి...
పశ్యామి --- చూస్తున్నాను,                     ఖాదామి -- తింటున్నాను,          అహం --- నేను
పశ్యసి--- చూస్తున్నావు,                         ఖాదసి--- తింటున్నావు               త్వం --- నీవు
 పశ్యతి--- చూస్తున్నాడు                         ఖాదతి---- తింటున్నాడు            సః--- అతడు
అహం పశ్యామి -- నేను చూస్తున్నాను    అహం ఖాదామి -- నేను తింటున్నాను
త్వం పశ్యసి --- నీవు చూస్తున్నావు            త్వం ఖాదసి -- నీవు తింటున్నావు
సః పశ్యతి -- అతడు చూస్తున్నాడు              సః ఖాదతి --- అతడు తింటుంన్నాడు.
2) తత్ర -- అక్కడ, అటు                   యత్ర -- ఎక్కడ, (ఎక్కడైతే) కుత్ర-- ఎక్కడ, ఎటు, అత్ర -- ఇక్కడ, ఇటు
త్వం కుత్ర పఠసి-- నీవు ఎక్కడ చదువుతున్నావు
సః అత్ర పఠతి -- అతడు ఇక్కడ చదువుతున్నాడు
సః యత్ర పఠతి -- అతడు ఎక్కడ చదువుతున్నాడో... తత్ర అహం పఠామి... అక్కడ నేను చదువుతున్నాను.
కిమ్... ఏమి ?
న, నహి-- లేదు, కాదు
కః -- ఎవడు ?
కః వదతి ?  ఎవడు చెబుతున్నాడు
సః కిం వదతి ? అతడు ఏమి చెపుతున్నాడు
సః తత్ర న వదతి కిం ? అతడు అక్కడ చెప్పటం లేదా ?
త్వం అత్ర ఖాదసి కిం ? నీవు ఇక్కడ తింటున్నావా ?
నహి, అహం తత్ర న ఖాదామి. లేదు, నేను అక్కడ తినుట లేదు.
ఇప్పుడు క్రింది వాని అర్ధాలు చెప్పగలరేమో ప్రయత్నించండి...
అహం తత్ర న పశ్యామి. త్వం తత్ర కిం పశ్యసి ? సః తత్ర న గచ్ఛతి. త్వం కుత్ర గచ్ఛసి ? యత్ర సః గచ్ఛతి తత్ర త్వం కిం న గచ్ఛసి ? యత్ర యత్ర సః పశ్యతి తత్ర తత్ర సః గచ్ఛతి.






Friday, August 5, 2016

సంస్కృత పాఠం

సంస్కృత పాఠం - 14                          ఏషః --ఇతడు  ఏతౌ--వీ రిద్దరు    ఏతే--వీరందరూ
                                                        సః -- అతడు      తౌ-- వారిద్దరు     తే-- వారందరూ
                                                       త్వం -- నీవు     యువాం-మీరిద్దరు యూయం-- మీరందరూ
                                                    అహం -- నేను      ఆవాం - మేమిద్దరం  వయం -- మేమందరమూ
 ఆచార్యః (గురువు)   ఏషః కః  ? -- ఇతడు ఎవరు ?
శిష్యః  (శిష్యుడు)     ఏషః కుంభకారః  -- ఇతడు కుమ్మరి.
ఆచా-- ఏషః కిం కరోతి ?  ఇతడు ఏమిచేయును ?
శి----  సః ఘటం కరోతి.... అతడు కుండను చేయును.
ఆచా--- సః కీదృశం ఘటం కరోతి ? అతడు ఏవిధమైన కుండను చేయును ?
శి--- సః స్థూలం ఘటం కరోతి... అతడు (లావు, మోట) పెద్ద కుండను చేయును.
ఆచా-- సః కయా ఘటం కరోతి ? అతడు దేనితో కుండను చేయును ?
శి-- సః మృత్తికయా ఘటం కరోతి..... అతడు మట్టితో కుండను చేయును.
ఆచా-- ఏతౌ కౌ ? వీరిద్దరూ ఎవరు ?
శి-- ఏతౌ తంతువాయౌ ..... వీరిద్దరూ నేతవారు.
ఆచా-- ఏతౌ కిం కురుతః ? వీరిద్దరూ ఏం చేస్తారు ?
శి--- ఏతౌ వస్త్ర్రాణి వయతః --- వీరిద్దరూ వస్త్రములను నేయుదురు.
ఆచా-- తౌ కీదృశాని వస్త్రాణి వయతః ? వారు ఇద్దరూ ఎటువంటి వస్త్రములను నేయుదురు ?
శి-- తౌ అమూల్యాని వస్త్రాణి వయతః ..... వారిరువురు అమూల్యమైన వస్త్రములను నేయుదురు.
ఆచా-- తవ కాని వస్త్రాణి ప్రియాణి ? నీకు ఎటువంటి వస్త్రాలు ఇష్టము ?
శి--- కార్పస్యాని వస్త్రాణి మమ ప్రియాణి.... కాటన్ వస్త్రాలు నాకు ఇష్టం.
       మమ మిత్రస్య ఔర్ణ్యం వస్త్రం ప్రియం...... నా మితృనకు ఉన్ని వస్త్రాలు ఇష్టం. (ఊర్ణం అంటే ఉన్ని ఉన్ని నించి             చేసిన అనే అర్ధంలో ఔర్ణ్యం అనే ప్రయోగం వస్తుంది.)
ఆచా-- ఏతే కే ? వీరు ఎవరు ?
శి--- ఏతే చిత్రకారాః -- వీరు చిత్రకారులు.
ఆచా--- ఏతే కిం కుర్వంతి ? వీరు ఏమి చేస్తున్నారు ?
శి--- ఏతే సుందరాణి చిత్రాణి లిఖంతి...... వీరు అందమైన చిత్రాలు గీస్తున్నారు.
ఆచా--- తే కే ? వారు ఎవరు ?
శి-- తే హరిణాః... అవ్వి లేళ్ళు.. (ఇక్కడ హరిణః లేడి పుంలింగం అందుకే  పుంలింగం బహువచనం తే అని వచ్చింది.
ఆచా-- తే కిం కుర్వంతి ? అవ్వి ఏమి చేస్తున్నాయి ?
శి-- తే హరితాని తృణాని ఖాదంతి. .... అవ్వి పచ్చని గడ్డి తింటున్నవి.
ఆచా-- త్వం కిం కరోషి ? నీవు ఏమి చేస్తున్నావు ?
శి-- అహం సాహిత్యం పఠామి.... నేను సాహిత్యం చదువుతున్నాను.
ఆచా-- యువాం కిం కురుథ.... మీరిద్దరూ ఏమి చేస్తున్నారు.
శి-- ఆవాం గీతం గాయావః... మేమిద్దరం పాట పాడుతున్నాము.
ఆచా-- యూయం అద్య పఠితాన్ శబ్దాన్ స్మరత... మీరు (అందరూ) ఈ రోజు చదివిన శబ్దాలు వల్లె వేయండి, బట్టీ పట్టండి.
శి-- తథైవ శ్రీమన్.... అలాగేనండి.






Thursday, August 4, 2016

ఒక పొరపాటు

సంస్కృతం - 13 లో ఒక తప్పు సవరించుకోవలసినదని మనవి.....
గుంజనకం వెల్లుల్లి అని తెలుపడమైనది....అది గృంజనకం అని సరిదిద్దుకోవలసినది.... క్షమించవలెను.

संस्कृत - 13



శాకాపణః - కూరల దుకాణం----
ఆపణికః (దుకాణం వాడు) ఆగచ్ఛతు, కిం ఆవశ్యకం – రండి, ఏమి కావాలి
మహిలా (మహిళ) ఏతస్య కూష్మాండస్య ఏక కిలో పరిమితస్య కతి రూప్యకాణి
మహిళ               ఈ      గుమ్మడికాయ ఒక కిలో (పరిమితి)ఎన్ని రూపాయలు ?
ఆపణికః             తస్య     కిలో    పరిమితస్య      అష్ట           రూప్యకాణి.
కొట్టువాడు          అది      కిలో   (పరిమతి)       ఎనిమిది       రూపాయలు.
మహిళ             అర్ధకిలో    పరిమితం      ఆలుకం       దదాతు.
స్త్రీ                   అరకిలో    (పరిమితి)      ఆలుగడ్డలు   ఇవ్వు.
కొ------------కూష్మాండం     మాస్తు       వా?
కొ------------గుమ్మడికాయ  వద్దా ?
స్త్రీ-----------కిలో    ద్వయమితం           కూష్మాండం,   ఏక కిలో    పరిమితం    గుంజనకం,
-------------కిలో (లు)రెండు (పరిమితి)   గుమ్మడికాయ, ఒక కిలో  (పరిమితి) 
పలాండు నీరుల్లి , గుంజనకం వెల్లుల్లి, లశునం అంటే కూడా వెల్లుల్లి,
అర్ధకిలో మహామరీచికాం చ దదాతు......అరకిలో పెద్ద మిరపకాయలు కూడా ఇవ్వు.
వృంతాకం అపి ఏక కిలో పరిమితం.... వంకాయలు కూడా ఒక కిలో (పరిమితి)
విండీనకాని నష్టాని ఖలు ? బెండకాయలు పాడయ్యాయి కదా....
ఉత్తమాని న ఆనీతవాన్ కిం  ?  మంచివి తేలేదా ఏమి  ?
ఆపణికః కొట్టువాడు--- ఉత్తమాని విండీనకాని స్యూతే ఏవ సంతి ----మంచి బెండకాయలు సంచీ లోనే ఉన్నాయి.
ఆవశ్యకం కిం ?  కావాలా  ?
స్త్రీ--- కిలోమాత్ర పరిమితం దదాతు.... ఒక కిలో మాత్రమే ఇవ్వు.
ఆహత్య కతి రూప్యకాణి ఇతి వదతు......మొత్తం ఎన్ని రూపాయలు అని చెప్పు
శీఘ్రం గంతవ్యం........ తొందరగా వెళ్ళాలి
ఆపణికః – కొట్టువాడు----- ఆహత్య పంచ రూప్యకాణి..... మొత్తం ఐదు రూపాయలు.
కారవేల్లం మాస్తు వా  ?  కాకర కాయలు వద్దా  ?
స్త్రీ---- తిక్తమ్ ఇత్యతః కార్రవేల్లం మమ గృహే న ఖాదంతి........చేదు అని కాకరకాయ మా ఇంట్లో తినరు.
పర్యాప్తం.....చాలు, అస్మిన్ స్యూతే సర్వాణి స్ధాపయతు.......ఈ సంచీలో అన్నీ వేయి.
ధనం స్వీకరోతు.....డబ్బులు తీసుకో...
ఆపణికః—కొట్టువాడు.... పరివర్తః నాస్తి కిం ? చిల్లర లేదా.... అస్తు స్వీకరోతు....సరే తీసుకోండి.  





Wednesday, August 3, 2016

సంస్కృత పాఠం -12

సంస్కృత పాఠం -12
ప్రశ్నలు                                                                జవాబులు
కః పఠతి ?    పుం.    ఎవరు(డు) చదువుతున్నాడు    వినోదః పఠతి
కః గచ్ఛతి  ?  పుం.              వెళుతున్నాడు              గోపాలః గచ్ఛతి
కః అటతి  ?                         తిరుగుతున్నాడు          అజః  అటతి ఇక్కడ మేక పుంలింగం అజా అంటే స్త్రీ లింగం
కః పశ్యతి  ?                       చుస్తున్నాడు                 రామః పశ్యతి
కః రుదతి  ?                      ఏడుస్తున్నాడు                బాలః రుదతి  

కా ధావతి  ?   స్త్రీ.                 పరుగెడుతున్నది          రాధా ధావతి
కా పిబతి  ?    స్త్రీ                  త్రాగుచున్నది                భగినీ పిబతి (సోదరి)
కా పచతి  ?                        వండుచున్నది                మాతా పచతి
కా సించతి  ?                     తడుపుతున్నది              శకుంతలా సించతి
కా సీవతి  ?                       కుట్టుతున్నది                 మేనా సీవతి

కిం వికసతి  ?  నపుం.        వికసిస్తున్నది                 పుష్పం వికసతి
కిం స్ఫురతి  ?  నపుం.        వణుకుతున్నది లేక       నయనం స్ఫురతి
                                         అదురుతున్నది  
కిం వదతి  ?                       చెప్పుచున్నాడు             మిత్రం వదతి  మిత్రం అంటే స్నేహితుడు నపుంసక లింగం,                                                              మిత్రః పుం. అర్ధంలో సూర్యుడు విసర్గలు వస్తే పుంలింగం.      

కిం పతతి  ?                        పడుచున్నది                  ఫలం పతతి
కిం స్రవతి  ?                        కారుచున్నది                 జలం స్రవతి  
        









  

Monday, August 1, 2016

సంస్కృత పాఠం - 11

సంస్కృత పాఠం - 11                                                              ఏక వచనం                      బహు వచనం
ఏతే నమంతి - వీరు నమస్కరిస్తున్నారు                                     నమతి                             నమంతి
తే జిఘ్రంతి - వారు వాసన చూస్తున్నారు.                                  జిఘ్రతి                             జిఘ్రంతి    
ఇమే స్మరంతి - వీరు స్మరిస్తున్నారు.                                         స్మరతి                             స్మరంతి
ఏతే వదంతి - వీరు మాట్లాడు తున్నారు                                    వదతి                              వదంతి  
అంధాః గచ్ఛంతి - గుడ్డివాళ్ళు వెళ్తున్నారు                                 గచ్ఛతి                             గచ్ఛంతి  
బధిరాః అటంతి - చెవిటివారు తిరుగుతున్నారు.                          అటతి                               అటంతి
కుబ్జాః ధావన్తి - పొట్టివారు పరిగెడుతున్నారు.                             ధావతి                               ధావంతి
మూకాః తిష్టంతి - మూగవారు నిల్చుంటున్నారు                         తిష్ఠతి                              తిష్ఠంతి      
తంతువాయాః వయంతి - నేతపని వారు నేయుచున్నారు            వయతి                            వయంతి
అజాః చరంతి - మేకలు మేస్తున్నవి                                            చరతి                               చరంతి
అమ్బాః యచ్ఛంతి - అమ్మలు ఇస్తున్నారు.                                యచ్ఛతి                          యచ్ఛంతి
తాః వసంతి - వారు నివసిస్తున్నారు.                                          వసతి                              వసంతి
ఇమాః పశ్యంతి - వీరు చూస్తున్నారు.                                          పశ్యతి                             పశ్యంతి  
ఏతాః హసంతి - వీరు నవ్వుతున్నారు                                        హసతి                             హసంతి  
పుష్పాణి వికసంతి - పువ్వులు వికసిస్తున్నవి                            వికసతి                            వికసంతి
వాహనాని గచ్ఛంతి - వాహనాలు వెళ్తున్నాయి                           గచ్ఛతి                             గచ్ఛంతి
ఫలాని పతంతి - పండ్లు పడుతున్నాయి                                     పతతి                              పతంతి
తాని పతంతి - అవి పడుతున్నాయి                                           పతతి                              పతంతి
ఇమాని స్ఫురంతి - ఇవి అదురుతున్నాయి                                స్ఫురతి                           స్ఫురంతి  
ఏతాని పతంతి - ఇవి పడుతున్నాయి
సంస్కృతంలో నామ వాచకాలు (పేర్లు) పుం, స్త్రీ, నపుంసక లింగాలు....
సంస్కృతం లో అర్ధాన్ని బట్టి ఉండవు...... ఉదా-- వృక్షః పుంలింగము, లతా-- స్త్రీ లింగము.
ఇంకొక ప్రత్యేకత ద్వివచనం..... ఒక రాముడు ఇద్దరు రాములు మరియు బహు, అనేక రాములు
ఒక బాలుడు ఇద్దరు బాలురు అనేక బాలురు.....బాలః ఒక బాలుడు , బాలౌ- ఇద్దరు బాలురు,
బాలాః - బహు బాలురు
బాలః క్రీడతి (ఒక ) బాలుడు ఆడుతున్నాడు
బాలౌ క్రీడతః (ఇద్ధరు)  బాలురు ఆడుచున్నారు
బాలాః క్రీడంతి (బహు) బాలురు ఆడుచున్నారు.
పుంలింగ శబ్దాలు స్త్రీలింగ శబ్దాలు నపుంసక శబ్దాలలో తేడాలు గమనించి కంఠస్తం చేయవలసినవి
                                                     ఏక వచనం                         ద్వి వచనం               బహు వచనం
అకారాంత పుంలింగ -బాల-శబ్దం--        బాలః                                     బాలౌ                          బాలాః
                                                 (బాలుడు)                           (ఇద్దరు బాలురు)       ( 3 కన్న ఎక్కువ బాలురు)
ఆకారాంత స్త్రీ లింగం -శాలా-శబ్దం---      శాలా                                     శాలే                            శాలాః
                                                 (పాఠశాల)                            (2 పాఠశాలలు)  (3 కన్న ఎక్కువ పాఠశాలలు)  
అకారాంత నపుంసక లింగ- ఫల- శబ్దం  ఫలమ్.                                  ఫలే                             ఫలాని
                                                   (పండు)                              (2 పళ్ళు)         (3 కన్న ఎక్కువ పళ్ళు)

అలాగే క్రియ కర్తను అనుసరించి ఉంటుంది...  వర్తమాన కాలం అస్తి ఉండుట అనే (ధాతువు అనగా క్రియ) ధాతు రూపాలు చూడండి
                                               అస్తి        స్తః           సన్తి
 బాలః అస్తి    బాలుడు ఉన్నాడు       బాలౌ స్తః ఇద్దరు బాలురు ఉన్నారు  బాలాః సన్తి  (బహు)బాలురు ఉన్నారు
శాలా అస్తి    స్కూలు ఉంది              శాలే స్తః   2 స్కూళ్ళు ఉన్నాయి       శాలాః సన్తి  (బహు) స్కూళ్ళు ఉన్నాయి
ఫలం అస్తి    పండు ఉంది                 ఫలే స్తః    2 పళ్ళు ఉన్నాయి          ఫలాని సన్తి (బహు) పళ్ళు ఉన్నాయి
   

Featured Post

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్.

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్. ఒక సంక్షిప్త పరిచయం ఇక్కడ కింద తేదీలు పుట సంఖ్యలు ఇచ్చినవి గురువు గారి ప్రవచనా...