Thursday, August 18, 2016

పాఠం - 21 కుతః, కిమర్ధం, కుత్ర, కః.....

మధ్యరాత్రే మార్గేణ ఆగచ్ఛంతం కంచిత్ ఆరక్షకః పృచ్ఛన్ అస్తి....
మధ్యరాత్రి మార్గంలో వస్తూవున్న ఒకానొక పోలీసు అడుగుతూ ఉన్నాడు.... ప్రశ్నలు
భీతస్య తస్య సజ్జనస్య ఉత్తరాణి అధః సన్తి.....
భయపడిన ఆ సజ్జనుని జవాబులు కింద ఉన్నాయి
పోలీస్   కుతః ఆగచ్ఛతి....... ఎక్కడ నుండి వస్తున్నావు
సజ్జనుడు  శంకరపురాత్ ఆగచ్ఛన్ అస్మి...... శంకర పురం నుంచి వస్తున్నాను
పో--- కిమర్ధం గతవాన్...... ఎందుకు వెళ్ళావు
స---- అహం చలనచిత్రం ద్రష్టుం గతవాన్...... నేను సినిమా చుడడానికి వెళ్ళిఉంటిని
పో--- కుత్ర ప్రదర్శయన్ అస్తి, చిత్రమందిరస్య నామ కిం----- సినిమా హాలు పేరేమి
స--- ఉమాచిత్రమందిరం---- ఉమా టాకీస్
పో--- కః సమయః--- సమయం ఎంత
స--- ఇదానీం ఏకవాదనమ్---- ఇప్పుడు ఒంటి గంట
పో--- విలమ్బః కిమర్ధం జాతః---- ఆలస్యం ఎందుకు అయ్యింది
స--- మిత్రం గృహం ప్రాప్య గృహం గచ్ఛన్ అస్మి--- మిత్రుడిని ఇంటిదగ్గర వదిలి ఇంటికి పోతున్నాను
పో--- కుత్ర అస్తి మిత్రస్య గృహం --- మిత్రుని ఇల్లు ఎక్కడ ఉంది
స--- మిత్రగృహం రామకృష్ణ ఆశ్రమ సమీపే అస్తి--- మిత్రుని ఇల్లు రామక్రిష్ణ ఆశ్రమం దగ్గర ఉంది
పో--- చిత్ర ప్రదర్శనం కదా సమాప్తం---- సినిమా ఎప్పుడు సమాప్తం అయ్యింది
స--- చిత్ర ప్రదర్శనం 12.30 వాదనే సమాప్తం--- సినిమా 12.30 (గంటలకు) కు సమాప్తి అయ్యింది
పో--- మిత్రగృహం కథం గతవాన్--- మిత్రుని ఇంటికి ఎలా వెళ్ళావు
స--- మిత్రగృహం అపి పాదాభ్యాం ఏవ గతం--- మితృని ఇంటికి కడా నడిచే వెళ్ళాను
పో---సమీపే కియత్ ధనం అస్తి---- దగ్గర ఎంత డబ్బుంది
స--- కోశే ఏకం రూప్యకం అస్తి, తావదేవ---- పర్సులో ఒకే రూపాయి ఉంది... అంతే.

2 comments:

  1. మమ పురత: సంగణకం అస్తి . అహం సంస్కృత పాఠం పఠామి:)

    ReplyDelete
  2. అహం గత దినే గ్రామం గచ్ఛన్ అస్మి, నేను నిన్న ఊరికి వెళ్ళి ఉంటిని
    అతః హ్యఃహః పాఠం న దత్తవతీ అందుకని నిన్నటి పాఠం ఇవ్వలేదు.
    సహనం వహతు ఇతి ప్రార్ధయామి సహించవహించమని ప్రార్ధన
    భవత్యాః వాక్యౌ శద్ధౌ స్థ---- మీ రెండు వాక్యాలూ కరెక్టే

    ReplyDelete

బ్లాగ్ సందర్శించినందుకు ధన్యవాదాలు. త్వరలో మా స్పందన తెలుపగలము.

Featured Post

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్.

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్. ఒక సంక్షిప్త పరిచయం ఇక్కడ కింద తేదీలు పుట సంఖ్యలు ఇచ్చినవి గురువు గారి ప్రవచనా...