సంస్కృత పాఠం - 15
అహం వదామి -- నేను చెప్పుచున్నాను
త్వం వదసి -- నీవు చెప్పుచున్నావు
సః వదతి -- వాడు, అతడు చెప్పుచున్నాడు
ఈ వాక్యములనే తారుమారు చేసి సంస్కృతంలో వ్రాయవచ్చును...
వదామి అహం, వదసి త్వం, వదతి సః....... సంస్కృతంలో వాక్యంలోని పదాలు ముందు వెనుకలు చేసినా వ్యాకరణ దోషము లేదు. సంస్కృత భాష యందలి సౌలభ్యం ఇదే.
ధాతువు అంటే క్రియ శబ్దము అంటే క్రీయేతర పదాలు..... పదాలు క్రియలైనా, శబ్దాలైనా ముఖ్యంగా మూల పదం + ప్రత్యయం ఉంటాయి ఉదాహరణకు పఠ అనే ధాతువు తీసుకుంటే మి, సి, తి అనే ప్రత్యయాలు చేరి ఉపయోగం ఈ క్రింది విధంగా ఉంటుంది.....
పఠ + మి -- పఠామి--- చదువుతున్నాను ఉత్తమ పురుష అంటే మనకోసం చెప్పేది ఫర్స్ట్ పర్సన్,
పఠ + సి --- పఠసి --- చదువుతున్నావు మధ్యమ పురుష అంటే ఎదుటు వ్యక్తికోసం చెప్పేది సెకెండ్ పర్సన్
పఠ + తి --- పఠతి -- చదువుతున్నాడు ప్రధమ పురుష అంటే మూడవ వ్యక్తి కోసం చెప్పేది థర్డ్ పర్సన్
అన్ని ధాతువులకు మి, సి, తి వర్తిస్తుంది వర్తమాన కాలంలో ప్రత్యయాలు ఇవి...
పశ్యామి --- చూస్తున్నాను, ఖాదామి -- తింటున్నాను, అహం --- నేను
పశ్యసి--- చూస్తున్నావు, ఖాదసి--- తింటున్నావు త్వం --- నీవు
పశ్యతి--- చూస్తున్నాడు ఖాదతి---- తింటున్నాడు సః--- అతడు
అహం పశ్యామి -- నేను చూస్తున్నాను అహం ఖాదామి -- నేను తింటున్నాను
త్వం పశ్యసి --- నీవు చూస్తున్నావు త్వం ఖాదసి -- నీవు తింటున్నావు
సః పశ్యతి -- అతడు చూస్తున్నాడు సః ఖాదతి --- అతడు తింటుంన్నాడు.
2) తత్ర -- అక్కడ, అటు యత్ర -- ఎక్కడ, (ఎక్కడైతే) కుత్ర-- ఎక్కడ, ఎటు, అత్ర -- ఇక్కడ, ఇటు
త్వం కుత్ర పఠసి-- నీవు ఎక్కడ చదువుతున్నావు
సః అత్ర పఠతి -- అతడు ఇక్కడ చదువుతున్నాడు
సః యత్ర పఠతి -- అతడు ఎక్కడ చదువుతున్నాడో... తత్ర అహం పఠామి... అక్కడ నేను చదువుతున్నాను.
కిమ్... ఏమి ?
న, నహి-- లేదు, కాదు
కః -- ఎవడు ?
కః వదతి ? ఎవడు చెబుతున్నాడు
సః కిం వదతి ? అతడు ఏమి చెపుతున్నాడు
సః తత్ర న వదతి కిం ? అతడు అక్కడ చెప్పటం లేదా ?
త్వం అత్ర ఖాదసి కిం ? నీవు ఇక్కడ తింటున్నావా ?
నహి, అహం తత్ర న ఖాదామి. లేదు, నేను అక్కడ తినుట లేదు.
ఇప్పుడు క్రింది వాని అర్ధాలు చెప్పగలరేమో ప్రయత్నించండి...
అహం తత్ర న పశ్యామి. త్వం తత్ర కిం పశ్యసి ? సః తత్ర న గచ్ఛతి. త్వం కుత్ర గచ్ఛసి ? యత్ర సః గచ్ఛతి తత్ర త్వం కిం న గచ్ఛసి ? యత్ర యత్ర సః పశ్యతి తత్ర తత్ర సః గచ్ఛతి.

అహం తత్ర న పశ్యామి - నేను అటు చూడట్లేదు
ReplyDeleteత్వం తత్ర కిం పశ్యసి ? - నీవు అటు ఏమి చూస్తున్నావు?
సః తత్ర న గచ్ఛతి. - అతడు అక్కడికి వెళ్లుటలేదు
త్వం కుత్ర గచ్ఛసి ? - నీవు ఎక్కడికి వెళ్తున్నావు?
యత్ర సః గచ్ఛతి తత్ర త్వం కిం న గచ్ఛసి ? - అతను ఎక్కడికి వెళ్తున్నాడో అక్కడికి నీవు ఎందుకు వెళ్లటం లేదు?
యత్ర యత్ర సః పశ్యతి తత్ర తత్ర సః గచ్ఛతి. - ఎటు ఎటు అతను చూస్తున్నాడో అటు అటు అతను వెళ్తున్నాడు
సరిగా చెప్పగలిగానాండీ?
~ లలిత
లలిత గారూ ధన్యవాదాలు..... 100 శాతం కరెక్ట్ అండీ
ReplyDelete